c.ramachandraiah
-
India's G20 Presidency: భారత్‌కు అందివచ్చిన గొప్ప అవకాశం
ఈ డిసెంబర్ 1 నుంచి జీ20 దేశాల కూటమికి నాయకత్వం వహించే బాధ్యత భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ భుజ స్కంధాలపై పడింది. ప్రపంచం లోని 20 అగ్రదేశాల కూటమికి భారత్ నేతృత్వం వహించే అవకాశం లభించడం గౌరవమే కాదు.. ఓ గొప్ప అవకాశం కూడా! 1999లో జీ20 దేశాల కూటమి ఏర్పాటయింది. బలమైన ఆర్థిక వ్యవస్థల్ని అనుసంధానించి పరస్పర సహకారం, ప్రోత్సాహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది కూటమి ప్రధాన లక్ష్యం. జీ20 కూటమిలో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ భాగ స్వామిగా ఉంది. కూటమి ఏర్పడింది 1999లో అయినా తొలి శిఖరాగ్ర సదస్సు జరిగింది మాత్రం 2008లో వాషింగ్టన్ డీసీలో. ఆ సమయంలోనే చోటుచేసుకొన్న ‘ఆసియా ఆర్థిక సంక్షోభం’ నుంచి బయటపడడానికి జీ20 దేశాల కూటమి కృషి చేసింది. అప్పటి నుంచి అంత ర్జాతీయ స్థాయిలో శక్తిమంతమైన సంస్థలలో ఒకటిగా జీ20 అవతరించింది. 2016లో చైనాలో జరిగిన జీ20 కూటమి శిఖరాగ్ర సభలలో ‘సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ కోసం కృషి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జీ20 కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో కూడా వర్తక, వాణిజ్య సంబంధాలు ముమ్మరం అయ్యాయి. గత ఏడెనిమిది సంవత్సరాలలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ డంలో జీ20 కూటమి దేశాలతో భారత్ నెరపిన దౌత్య, వర్తక, వాణిజ్య సంబంధాలు కీలకంగా దోహదం చేశాయి. ఇటీవల, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడంలో అగ్రరాజ్యాలు విఫలం అయ్యాయి. రష్యాపై పలు ఆంక్షలు విధించినా భారత్ తన చమురు అవసరాల కోసం ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతూ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిణా మాల దృష్ట్యా జీ20 కూటమికి భారత్ నేతృత్వం వహిం చడంవల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్నలు అనివార్యంగా ఎదురవుతున్నాయి. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన 2022 జీ20 శిఖరాగ్ర సదస్సులో, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా వైదొలగాలన్న పిలుపును కొన్ని దేశాలు గట్టిగానే విన్పించాయి. అంతకుముందే రష్యా అధినేత పుతిన్‌కు ‘నేటి యుగం యుద్ధాలది కాదు’ అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి శషబిషలు లేకుండా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడంతో భారత్ తన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రష్యాతో సంబంధాలు నెరపుతున్నదే తప్ప, ఆ దేశం ప్రదర్శిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఏమాత్రం ఉపేక్షించడం లేదన్న సంకేతం బలంగానే వెళ్లింది. అంతేకాదు... అంతర్జాతీయ సదస్సులలో చేసిన తీర్మానాలకు కట్టుబడటంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవ హరిస్తోందన్న వాస్తవం కూడా తేటతెల్లం అయింది. ఉదాహరణకు క్యోటో ప్రోటోకాల్, పారిస్ కాప్ 21, అంతకుముందు రియో, కోపెన్ హెగన్ సదస్సులలో చేసిన తీర్మానాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంతో పర్యావరణ పరిరక్షణ, భూతాప నియంత్రణలలో 63 దేశాల పనితీరుపై వెలువడ్డ నివేదికలో భారత్‌కు 8వ స్థానం లభించగా... చైనాకు 51, అమెరికాకు 52వ స్థానాలు లభించాయి. భారతదేశం తను అనాదిగా నమ్మే ‘వసుధైక కుటుంబం’ (ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం) అనే భావనను ముందుకు తెచ్చి పరస్పర సహకారం, భాగస్వామ్యం అత్యంత అవశ్యం అని చాటి చెబుతోంది. కలిసికట్టుగా సమస్య లను ఎదుర్కోనట్లయితే... కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతుందనేది భారత్ చెప్పే మాట. కానీ, చైనా వంటి కొన్ని దేశాలు ‘నేను నా దేశం’ (గ్రూప్ జీరో) ముఖ్యం అనే ధోరణిలోనే సొంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే విధం గానూ, అంతిమంగా ప్రపంచ మానవాళికి ముప్పు కలి గించే విధంగానూ ముందుకు సాగుతున్నాయి. జీ20 కూటమికి నేతృత్వం వహించడం వల్ల భారత్‌కు సమీప భవిష్యత్తులో కొన్ని సానుకూలతలు అందివస్తాయి. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయించగలగడం లేదా తగ్గించగలగడం. అలాగే దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా నుంచి అక్రమ చొరబాట్లు, ఆక్రమణలను నివారించడం; హిందూ మహా సముద్రంలో చైనా సైనిక పాటవ వ్యాప్తిని తగ్గించగలగడం, ముడిచమురు చౌకగా లభించే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం. డిజిటల్ రంగంలో తను సాధించిన ప్రగతినీ, సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఇతర దేశాలకు అందించడం; ఆహార భద్రత, పోషకాహార పంపిణీలకు సంబంధించి పేద దేశాలకు బాసటగా నిలవడం... తదితర రంగాలలో భారత్ కీలకమైన పాత్ర పోషించబోతోంది. కోవిడ్ టీకాతో సహా వివిధ రకాల టీకాలను విస్తృతంగా అభివృద్ధి పరుస్తున్న భారత్ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్న దేశాల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో తాను సాధించిన ప్రగతిని ఆసియాలోని ఇతర దేశాలతోపాటు ఆఫ్రికా దేశా లతో పంచుకోవడంతో అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రతిష్ఠలు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ నివారణలో భారత్ పోషించిన పాత్ర, ఆ దేశానికి అందించిన ఆర్థిక సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలకు నోచుకొంది. సాధిస్తున్న అభివృద్ధికి సమాంతరంగా పాత, కొత్త సవాళ్లు ఉమ్మడిగా భారత్‌కు ఎదురవుతున్నాయి. ‘ఇది యుద్ధాల శకం’ కాదని నరేంద్ర మోదీ రష్యా–ఉక్రెయిన్ ల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని వాఖ్యానించినప్పటికీ... యుద్ధం అన్నది అనేక రూపాలలో భారత్‌ను అస్థిరపరుస్తూనే ఉంది. తూర్పున అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులలో చైనా దురాక్రమణ నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. కశ్మీర్ బోర్డర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం చేస్తున్న యుద్ధం ఆగలేదు. ఇంకా, కంటికి కనిపించని సైబర్‌వార్, ఇన్ఫ ర్మేషన్ వార్ వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి. వీటికితోడు వాతా వరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తులు, మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్న కొత్తకొత్త వైరస్ల విజృంభణ తదితర సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన మార్గదర్శనం చేయా ల్సిన అవసరం భారత్‌పై ఉంది. నూతన పదబంధాలను సృష్టించడంలో మన ప్రధాని నరేంద్ర మోదీని మించిన వారెవరున్నారు? ఆయన సృష్టిం చిన పదబంధమే ‘ఎకానమీ విజన్’. జీ20 కూటమి దేశాల మధ్య పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్య విధానమే ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఎకానమీ విజన్ విధానం. ‘నేను నా దేశం’ (గ్రౌండ్ జీరో) అనే విధానానికి పూర్తిగా విరుద్ధమైనదే ఇది. ప్రపంచం అంతా ఒకే భూమి. ప్రపంచ జనాభా అంతా ఒకటే కుటుంబం. ఒకప్పుడు దీనిని ‘యుటోపియన్ థియరీ’గా అభివర్ణించేవారు. ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే భారత ప్రాచీన ధర్మం ఇమిడి ఉన్న విధానాలతో నరేంద్ర మోదీ జీ20 దేశాల కూటమికి దిశానిర్దేశం చేయనున్నారు. శిలా జాల ఇంధనాల వాడకాన్ని నిరోధించి హరిత ఇంధనాలను పెద్దఎత్తున వినియోగంలోకి తీసుకురావడం, సూర్య రశ్మి (సోలార్ ఎనర్జీ)ని విరివిగా ఉపయోగించుకోవడం; పవన విద్యుత్ వినియోగం పెంచడం వంటి చర్యల ద్వారా పటిష్ట కార్యాచరణకు ప్రధాని సమాయత్తం అవుతున్నారు. నరేంద్ర మోదీ తన నాయకత్వ పటిమను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ఓ మహత్తర అవకాశం నేడు లభించింది. గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు ఏవిధంగానైతే వారి విశిష్ట నాయ కత్వానికి వివిధ సందర్భాలలో అంతర్జాతీయ ఖ్యాతి లభించిందో... అలాగే నేడు ప్రధాని నరేంద్ర మోదీకి మరింత ఖ్యాతి దక్కడానికి జీ20 దేశాల నాయకత్వం అందివచ్చిన ఓ చక్కటి అవకాశం. దానిని ఆయన ఫల ప్రదం చేసి దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తారని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఏపీ -
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్‌కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్‌కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్‌లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
చంద్రబాబుకు బోయీలుగా...
ఆంధ్రప్రదేశ్‌లోని మెజారిటీ ప్రజలు తిరస్కరించిన ‘అమరావతియే ఏకైక రాజధాని’ అనే నినాదాన్ని అడ్డుగా పెట్టుకొని మరోసారి సీపీఐ, కాంగ్రెస్, జనసేన పార్టీలు తెలుగుదేశంకు తోకగా మారడానికి తహతహలాడు తున్నాయి. ఆశ్చర్యమేమంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మళ్లీ తెలుగుదేశం వైపు చూడటం. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలు, విశ్వాసాలకు పాతర వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చేతులు కలపడం కంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదని తెలిసినప్పటికీ... చంద్రబాబు ఆడే రాజకీయ జూదంలో పావులవడానికి ఈ పార్టీల నేతలు సిద్ధపడటమే విశేషం! చంద్రబాబు చెప్పిన మాటలు, చూపించిన గ్రాఫిక్స్ నమ్మి భూములిచ్చి మోసపోయిన అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికీ చంద్రబాబును పల్లెత్తు మాట అనకపోవడం ఆశ్చర్యం. పైగా, గత రెండేళ్లుగా ఆయన డైరెక్షన్లోనే నడుస్తూ అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని పంతం పట్టి దీక్షలు చేశారు. అందులో భాగంగా టీడీపీ ‘అన్నీతానై నడిపించిన అమరావతి రైతుల ఐక్యవేదిక’ తిరుపతిలో నిర్వహించిన సభలో చంద్రబాబుకు కుడిఎడమలలో ఘనత వహించిన కామ్రేడ్లు, కాషాయధారులు, కాంగీయులు ఆసీనులై భవిష్యత్తులో తాము వేయబోయే రాజకీయపు అడుగులేమిటో చెప్పకనే చెప్పారు. (చదవండి: వితండవాదం ఆపండి... ప్లీజ్!) బీజేపీ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో అంతుపట్టదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్ణయంతో తమకు సంబంధం లేదని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే కోర్టులో ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతిని రాజధానిగా గుర్తించమని కూడా పార్లమెంటులో స్పష్టంగా చెప్పింది. ఇదంతా రికార్డుల్లో పదిలంగా ఉంది. పైగా, ఎన్డీఏ ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉండి రాజకీయ కారణాల వల్ల బయటకొచ్చాక ఆనాడు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ‘విలన్’గా చిత్రీకరించి లబ్ధి పొందడానికి ఎంతగా దిగజారాడో బీజేపీ నేతలకు తెలియనిది కాదు. వంద మంది నరేంద్ర మోదీలు కలిసి వచ్చినా తాను ఎదుర్కోగలనని సవాల్ విసిరారు. పాపం రాష్ట్ర బీజేపీ నేతలకు మతిమరుపు కాబోలు, ఆ అవమానాలను మరచిపోయి చంద్రబాబు పల్లకీకి బోయీలుగా ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాల్లో సీపీఐ పోషిస్తున్న పాత్ర దారితప్పిన బాటసారి వ్యవహారాన్ని తలపిస్తుంది. కమ్యూనిజం పనైపోయింది... టూరిజం ఒక్కటే మిగిలిందన్న చంద్రబాబు వద్దకు కమ్యూనిస్టులు నిజంగానే టూరిస్టుల్లా ‘క్యూ’ కట్టారు. అలాగే కాంగ్రెస్ వ్యవహార శైలి కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండటం గమనించదగింది. ఒకవైపు బీజేపీతో చెలిమికట్టాలని ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు గేలం వేయడం చంద్రబాబు చాణక్య నీతిలో మరో కోణం. (చదవండి: ‘రియల్’ ప్రయోజనాలకే అమరావతి) తెలుగు సినిమాల్లో హీరో పాత్రలు పోషించే పవన్ కళ్యాణ్... రాజకీయాల్లో మాత్రం గొప్ప కామెడీ పండిస్తున్నారు. ‘‘నష్టాల్లో ఉందని విశాఖ ఉక్కును అమ్మేయదలుచుకొంటే... 5 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని ఎవరికి అమ్మాలి జగన్ రెడ్డి గారు?’’ అంటూ ఆవేశంగా ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ కరిస్తున్నది బీజేపీ ప్రభుత్వమేనన్న స్పృహ లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజమేనని గత ఏడేళ్ల నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం 126 లక్షల కోట్లకు పెరిగిన విషయం ఆయనకు ఎవరు చెప్పాలి? ఒకప్పుడు తను ఆదర్శంగా తీసుకొన్న (ఇప్పుడు కాదనుకొంటా) తరిమెల నాగిరెడ్డి ఏనాడో ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి రాశారని పవన్‌కు ఎవరైనా చెబితే బాగుంటుంది. ఆయనతో వచ్చిన సమస్య ఏమిటంటే తను నిద్రలేచినప్పుడే సూర్యుడు ఉదయించాడని అనుకొంటారు. అమరావతి అంశాన్ని సెంటిమెంట్‌గా మార్చి ప్రయోజనం పొందడానికి చంద్రబాబు గత ఎన్నికలలోనే పాచికలు విసిరారు. కానీ, అమరావతి చుట్టు పక్కల నియోజకవర్గాల ప్రజలు తెలుగుదేశంను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు లోకేశ్‌ను మట్టికరిపించారు. ‘‘ఈ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అమరావతిని రాసిచ్చేసినట్లే’’ అంటూ గుంటూరు, విజయవాడలలో ప్రజలను రెచ్చ గొట్టారు చంద్రబాబు. కానీ, ఆయనకు లభించిన ఫలితం శూన్యం. (చదవండి: ‘త్రికేంద్రీకరణ’ మనకు కొత్త కాదు!) అమరావతి ఉద్యమం పేరుతో ప్రవాసాంధ్రుల నుంచి టీడీపీకి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి ఏకైక రాజధాని అయితే... అక్కడి రియల్ ఎస్టేట్‌కు రెక్కలొస్తాయన్న ఆశ కలిగినవారు ఎటూ ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతిని ప్రజల రాజధాని చేయకుండా... ఆ ప్రాంతంలో బడుగుబలహీన వర్గాల వారు కాలు మోపకుండా ఇన్సైడర్ ట్రేడింగ్‌తో... సంపన్న వర్గాలకు పరిమితం చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ గ్రహించినందునే రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు తెలుగుదేశంకు బుద్ధి చెప్పారు. (చదవండి: ఈ వెనుకడుగు వ్యూహాత్మక ముందడుగు) ప్రజా తీర్పుకు అనుగుణంగా, అమరావతి కుంభకోణాన్ని అడ్డుకోవడానికే ముఖ్యమంత్రి జగన్ అధికార వికేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు ‘రియల్ ఎస్టేట్ అభివృద్ధి నమూనా’ను పేదలు హర్షించలేదు. మధ్యతరగతి వారు సమ్మతించలేదు. సామాన్యుల కోసం వైఎస్ జగన్... సంపన్నుల వైపు బాబు ఉన్నారని ప్రజలు గ్రహించారు. ఆ మేరకు పదేపదే ఎన్నికలలో విస్పష్టమైన తీర్పునిచ్చారు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నప్పటికీ... జగన్‌కు ప్రజలలో లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలవారు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పేరుతో అందరూ జతకట్టి పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు పల్లకీకి బోయీలుగా మారుతున్నారు. ఇంతకంటే రాజకీయ దివాళాకోరుతనం మరొకటి ఉంటుందా! (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
పనిచేయని ‘బాబు’ కుల పాచిక
కులాల్ని అడ్డుపెట్టుకొని కుల రాజకీయాలు చేయడంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మహాదిట్ట. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టులో చంద్రబాబు విసిరిన కులపాచిక మాత్రం పారలేదు.. సరికదా బెడిసికొట్టింది. ఈఎస్ఐ స్కాంలో చిక్కుకొన్న అచ్చెన్నాయుణ్ణి ఏదోఒక విధంగా కాపాడుకోకపోతే, తీగలాగితే డొంక కదిలినట్లు అనేక చీకటి విషయాలు వెలుగు చూస్తాయనే భయం చంద్రబాబును వెంటాడుతోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద బాధితుల్ని పరామర్శించబోతున్నట్లు ప్రచారం చేసుకుని కూడా మొహం చాటేసిన చంద్రబాబు.. అచ్చెన్నాయుడి ఉదంతంలో మాత్రం హుటాహుటిన గుంటూరు వెళ్లారు. ఈ అంశానికి ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా నిజాలు వెళ్లగక్కవద్దన్న సంకేతాల్ని అచ్చెన్నాయుడికి పంపారు. ఈ స్కాంలో లోకేశ్ ప్రమేయం ఉందన్న వార్తలు బయటకొస్తున్నాయి. చంద్రబాబు హైరానా పడుతున్న కారణం అదే. అచ్చెన్నాయుడు వెనుకబడిన తరగతుల కులానికి చెందినవారు కనుక.. బీసీలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పడదని, అందుకే కక్షతో అరెస్ట్ చేయించారన్నది చంద్రబాబు చేసిన అభియోగం. విశ్వసనీయతలేని ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబుకు కొమ్ముకాసే మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నానాహంగామా సృష్టిం చాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ జరగగానే ఆయనను కిడ్నాప్ చేశారంటూ చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు. దానిని పలు చానళ్లు కొన్ని గంటలపాటు హోరెత్తించాయి. తీరా, అచ్చెన్నాయుడు ఇంట్లోకి పోలీసులు చట్టబద్ధంగానే ప్రవేశించి.. ఆయనతో మర్యాదగానే వ్యవహరించిన తీరును గమనించాక.. చంద్రబాబు అల్లిన కిడ్నాప్ కథ ఎంత అసత్యమో; చంద్రబాబు నిజాలను ఏవిధంగా వక్రీకరిస్తారో ప్రజలకు అర్థం అయ్యింది. అసలు అచ్చెన్నాయుడిని ఓ కుల ప్రతినిధిగా పరిగణించడంలోనే చంద్రబాబు వక్రబుద్ధి బయటపడింది. అచ్చెన్నాయుడి అరెస్ట్ వ్యవహారంలో తాము ఆశించినట్లుగా కులం కార్డు పనిచేయలేదని గ్రహించగానే, వెనువెంటనే.. ప్లేటు మార్చారు. మరో కొత్త కథనాన్ని తెరపైకి తెచ్చారు. అచ్చెన్నాయుడి సోదరుడైన ఎర్రన్నాయుడు గతంలో తనకు వ్యతిరేకంగా ఓ కేసులో ఇంప్లీడ్ అయ్యారు కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వారి కుటుంబంపై ద్వేషం ఉందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. నిజానికి, 1999లో ఆనాడు ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కావడానికి టీడీపీకి అవకాశం వచ్చినా.. ఎర్రన్నాయుడుకు అవకాశం కల్పించాల్సి ఉంటుందనే ఏకైక కారణంతోనే చంద్రబాబు వాజ్‌పేయి ప్రతిపాదనను తిరస్కరించారన్న వాస్తవం ఎర్రన్నాయుడి కుటుంబసభ్యులకు తెలుసు. అనేక సందర్భాలలో ఎర్రన్నాయుడు తనకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోయేవారు. కానీ, 2014లో అవకాశం రాగానే ఎన్డీఏలో చేరడానికి బాబు ఉత్సాహపడిపోయారు. సీనియర్ నేత అయిన కొనకళ్ల నారాయణకు అవకాశం ఇవ్వాల్సి ఉండికూడా ఆయనకు అన్యాయం చేసి.. ఆర్థిక నేరాల ఆరోపణలు ఉన్న సుజనాచౌదరికి మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ రెండు సందర్భాలలో బీసీ నేతలు కేంద్ర మంత్రులు కాకుండా అడ్డుకొన్నది ఎవరు? అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 33% పార్టీ టికెట్లు కేటాయిస్తానని 2007లో చంద్రబాబు నిర్వహించిన వరంగల్ బీసీ గర్జన సభలో ఓ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ, 2009లో, 2014లో, 2019లో బీసీలకు 25% కూడా టికెట్లు కేటాయించలేకపోయారు. 2000లో తన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కృష్ణాయాదవ్పై నకిలీ స్టాంపుల కుంభకోణం ఆరోపణలు రాగానే.. క్షణాల మీద ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. అప్పుడు కృష్ణాయాదవ్‌ను చంద్రబాబు బీసీ నేతగా గుర్తించలేదా? కృష్ణాయాదవ్‌కు పార్టీ పరంగా కనీసం న్యాయ సహాయం కూడా అందించలేదు. చంద్రబాబు మస్తిష్కం నిండా కుట్రలు, కుతంత్రాలు మాయోపాయాలే ఉంటాయి. ప్రజలు అధికారం ఇచ్చినపుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ ప్రజల ప్రయోజనాలు ఆయనకు ప్రాధాన్యతాంశాలుగా కనబడలేదు. 2014లో అధికారంలోకి వచ్చాక ఏకపక్షంగా బలహీన వర్గాల ప్రయోజనాల్ని కాలరాశారు. కొన్ని కులాలు, వర్గాల ప్రజలు తమకు చారిత్రకంగా జరిగిన సామాజిక అన్యాయాన్ని సరిదిద్దాలనే డిమాండ్లతో ఉద్యమబాట పడితే.. వారి న్యాయమైన డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించే బదులు వారి ఉద్యమాలను అణచివేశారు. ఆయా వర్గాలు తమ బాధలు చెప్పుకోవడానికి సచివాలయానికి వస్తే అవహేళన చేశారు. ఫలితంగానే.. ఆ వర్గాలన్నీ బాబుకు దూరమయ్యాయి. చంద్రబాబుకు ప్రజల బలీయమైన ఆకాంక్షలపట్ల అవగాహనలేదు. అధికారంలో ఉన్నపుడు చేసిన అన్యాయాలన్నీ చేసేసి ఇప్పుడు వైఎస్ జగన్‌ని బీసీలకు, ఎస్సీలకు, కాపులకు లేదా మరో వర్గానికో వ్యతిరేకం అని చంద్రబాబు చిత్రీకరించినంత మాత్రాన ఆ వర్గాల ప్రజలు నమ్ముతారా? గత యేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బడుగుబలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారులవుతున్నారు.. ఇది ఎవరో చెప్పడం కాదు.. వారికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా వాడుకోగల సిద్ధహస్తులని ఆ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు తెలియని విషయమేమీ కాదు. మోత్కుపల్లి నర్సింహులు, జె.ఆర్. పుష్పరాజ్, వర్ల రామయ్య వంటి పార్టీ సీనియర్ నేతలకు ఇవ్వాల్సిన రాజ్యసభ పదవుల్ని బహిరంగ మార్కెట్లో వేలం వేసినట్లు పాట పాడుకొన్నారని ఆ పార్టీ నేతలకు తెలియనిది కాదు. ఎస్టీలకు, మైనార్టీలకు చంద్రబాబు ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లపాటు ప్రాతినిధ్యం లేకపోవడం ఆ వర్గాలకు తెలియదా? తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బీసీ హోదా కోసం పోరాడిన కాపు నేతలకు జరిగిన అవమానాల్ని వారు సులభంగా మర్చిపోగలరా? ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం చంద్రబాబుకు లేవు. కనుకనే.. బీజేపీకి దాసోహమై.. బీజేపీలోకి పంపిన తన మనుషుల ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించడానికి హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ కేంద్రంగా కుట్రలు చేయిస్తున్నారు. పలు కీలక వ్యవస్థలలో చంద్రబాబు పెంచిపోషిస్తున్న వ్యక్తులు రాజకీయ ముసుగులు తగిలించుకొన్న శక్తులు వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి పనిచేస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో.. గండిపేట మేధావులుగా పిలవబడిన కొందరు పార్టీ సిద్ధాంతకర్తలు.. ఎన్టీఆర్ పొరపాటు నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో ఆయనను సవ్యదిశలో నడిపించేవారు. కానీ అదే పార్టీ నేడు లాబీయిస్టుల చేతుల్లోకి జారిపోవడమే విషాదం! వ్యాసకర్త: సి. రామచంద్రయ్య, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
పచ్చ మీడియా విష ప్రచారం
-
‘చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : చంద్రబాబు నాయుడు చైతన్య యాత్ర చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాయితీగా లేని కారణంగానే గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన అవినీతి సొమ్మంతా గడిచిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు బదలాయించారన్నారు. ఐటీ దాడుల్లో ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు వాటిపై మాట్లాడలేకపోతున్నారని ఆరోపించారు. గతంలో మోదీపై విరుచుకుపడిన చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీతో జతకట్టేందుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక రంగం కుదేలైనా, ఎన్నో సమస్యలు వచ్చినా బీజేపీపై విమర్శలు చేయకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై జైలుకు వెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. బాబు అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. పచ్చ మీడియా విష ప్రచారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందిన రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గంటన్నరపాటు రాష్ట్ర సమస్యలపై సీఎం జగన్‌తో మోదీ చర్చిస్తే... ఎల్లో మీడియా మాత్రం వేరే విధంగా వార్తలు రాసిందని మండిపడ్డారు. కియాపై ప్రధాని మందలించాడని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఎల్లో మీడియా, చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. -
ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు: సీఆర్
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుచరులు జర్నలిజం ముసుగు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సీ రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. నాలుగు నెలల ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని సీ రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. రామచంద్రయ్య శుక్రవారమిక్కడ మీడియా మాట్లాడుతూ... ‘ జర్నలిజం ముసుగు వేసుకుని ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 18మంది ఎర్ర చందనం కూలీలను చంపేస్తే ఆ సెక్షన్ మీడియా మాట్లాడిందా?. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి అంతమంది చనిపోతే దానికి కారణం చంద్రబాబు అని ఆ మీడియాకు కనపడలేదా?. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వార్తలు రాశారా?. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పు ఎత్తి చూపారా?. రాష్ట్రం అప్పుల్లో ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ప్రయివేట్ విమానాల్లో తిరుగుతూ కోట్లు ఖర్చు పెట్టారు. కాల్ మనీ కేసుల్లో ప్రాణాలు పోతుంటే ఎల్లో మీడియా స్పందించిందా?. రాజధాని భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అప్పుడు ఆ మీడియా రాసిందా?. వారు కోరుకునే వ్యక్తి సీఎం అవడం కోసం ఎల్లో మీడియా జర్నలిజం హక్కులు మరిచిపోయింది. చంద్రబాబు రాజ్యం కోసం ఎల్లో మీడియా కృషి చేసింది. ఒక పత్రికాధిపతి వల్లే తెలుగుదేశం పార్టీ నాశనం అయింది. ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు. చంద్రబాబు ఓ మాఫియాను సృష్టించుకున్నారు. ఆ మాఫియా క్రియేషన్ కోసం ఎల్లో మీడియా ఉపయోగపడింది. హుజూర్ నగర్లో తెలంగాణ సీఎం కేసీఆర్ సభ రద్దు మీద చండాలమైన వార్తలు ఎల్లో మీడియా రాసింది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబ విలువలు తెలియదంటూ నీచంగా రాశారు. పేపరు ఉందికదా అని ఇష్టమొచ్చిన రాతలు రాస్తారు. చంద్రబాబు కోసం, చంద్రబాబు యొక్క, చంద్రబాబు కొరకు ఆ మీడియా ఉంది’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ఏపీలోనూ టీడీపీ ఖాళీ కాబోతుంది
-
కొనుగోలు శక్తి పెంపే కీలకం
కీలకరంగాల్లో వృద్ధిరేటు వేగంగా పడిపోవడం, బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోవడం, రూపాయి విలువ పతనం, నిరుద్యోగిత తారస్థాయికి చేరడం, వస్తుసేవల వినియోగం తగ్గుముఖం పట్టడం, దేశంలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతుండటం.. ఇవన్నీ దేశ ఆర్థిక జవజీవాలు ప్రమాదంలో పడుతున్నాయని సంకేతిస్తున్నాయి. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లడం అనే ఒకే ఒక కారణంవల్లే దేశ స్థూల ఉత్పత్తికి ఊపిరినిచ్చే కీలకరంగాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా బలహీనతకు లోనవుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఎంత బలంగా ఉంటే అంతగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం అన్నది ఏ ప్రభుత్వానికైనా అతిపెద్ద సవాలు. అదే లక్ష్యం కూడా. దీన్ని పక్కనబెట్టి ఆర్థిక మాంద్యానికి అరకొర మందులు ఎన్ని వేసినా ఫలితం శూన్యమే. తుపాను ముందు ఏర్పడే ప్రశాంతత మాదిరిగా.. తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభానికి ప్రతీకగా దేశ ఆర్థికరంగం నిస్తేజంగా తయారైంది. ఆర్థికరంగం మందగమనం దుష్ఫలితాలు పలు రంగాలలో అనేక రూపాల్లో కనపడుతున్నాయి. కీలకరంగాల్లో వృద్ధిరేటు వేగంగా పడిపోతున్నది. బంగారం ధర అనూహ్యంగా పెరుగుతున్నది. రూపాయి విలువ పతనం చెందుతున్నది. 4 దశాబ్దాల కనిష్టానికి నిరుద్యోగిత చేరింది. అదేవిధంగా, దేశంలో వస్తుసేవల వినియోగం తగ్గింది. విదేశీ ఎగుమతులు మందగించాయి. మౌలిక సదుపాయాల రంగంలో జరిగే ప్రభుత్వ వ్యయంలో క్షీణత నమోదవుతున్నది. ప్రైవేటు పెట్టుబడులు నిరుత్సాహంగా ఉన్నాయి. నిజానికి, దేశంలో ఇప్పటికే మాంద్యం ఏర్పడిందన్న వాదన కూడా విన్పిస్తున్నది. కొత్త ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తున్న దీనావస్థ అందుకు ప్రధాన సంకేతం. ఇవన్నీ తీవ్రమైన ఆర్థిక మందగమనానికి సాక్ష్యాలు. ఆర్థిక మందగమనానికి, మాంద్యానికి తేడా ఉందని.. ప్రస్తుతం దేశంలో ఏర్పడింది ఆర్థిక మందగమనమే తప్ప.. మాంద్యం కాదన్న వాదన కూడా విని పిస్తున్నది. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో వరుసగా రెండు త్రైమాసికాలలో వృద్ధిరేటు క్షీణించినపుడు.. ముఖ్యంగా, దేశంలో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నప్పుడు.. దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. మందగమనమైతే ఆర్థిక రంగం త్వరితగతిన కోలుకొనే అవకాశం ఉంది. అదే మాంద్యం అయితే.. కోలుకోవడానికి దీర్ఘకాలం పడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోను కావడానికి ప్రధాన కారణం.. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి సన్నగిల్లడమే. ఈ ఒక్క కారణంగానే దేశ స్థూల ఉత్పత్తికి ఊపిరినిచ్చే కీలకరంగాలు ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా బలహీనతకు లోనవుతున్నాయి. దేశంలో వాహనరంగం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. కొన్ని కంపెనీలైతే తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేశాయి. డీలర్ల వద్ద కార్ల నిల్వ పెరిగిపోయింది. కార్ల తయారీ కంపెనీలు కొన్ని వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా అధిక వేతనాలు అందుకొనే ఉద్యోగులను తొలగించడానికి సిద్ధపడుతున్నాయి. వాహన విక్రయాలు తగ్గడంతో పరికరాల తయారీ పరిశ్రమపైన ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితి మెరుగుపడనట్లయితే.. దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న దేశీయ ఆటో మొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల మేర ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందని ‘ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎమ్ఏ)’ స్పష్టం చేసింది. స్థిరాస్తి రంగంలోనూ ఇదే పరిస్థితి. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరల్లో పెరుగుదల లేకపోగా క్రయవిక్రయాల లావాదేవీలు మందగించాయి. 250 అనుబంధ పరిశ్రమలకు మూలాధారంగా ఉన్న నిర్మాణ రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా అనేక దుష్ఫ లితాలు కన్పిస్తున్నాయి. ఇటుకలు, సిమెంట్, ఉక్కు, ఫర్నిచర్, ఎలక్ట్రికల్, తదితర రంగాలు అమ్మకాలు లేక వెలవెలపోతున్నాయి. జీఎస్టీ భారాన్ని తగ్గించాలని, ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, రుణ లభ్యత పెంచాలని నిర్మాణ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకొంటున్నాయి. ఐదు రూపాయలకు లభించే బిస్కెట్ ప్యాకెట్లు సైతం ఇంతకుముందులా వేగంగా అమ్ముడు కావడం లేదని తయారీ సంస్థలు పేర్కొంటున్నాయంటే.. ప్రజల కొనుగోలు శక్తి ఏవిధంగా తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. రూపాయి క్షీణత, పెద్దనోట్ల రద్దు పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో రెండేళ్లుగా ఒడిదుడుకులకు లోనవుతున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మరింత సంక్షోభంలో కూరుకొనిపోయింది. ముఖ్యంగా.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే మార్గాల్లో ఒకటైన ఎగుమతులు పడకేశాయి. 2013–14లో 31,488 కోట్ల డాలర్ల మేర జరిగిన ఎగుమతులు 2017–18 నాటికి 30,331 కోట్ల డాలర్లకు పడిపోయాయి. అయితే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఎగుమతులపై ఆధారపడకపోవడం కొంత మేలైంది. అయితే, ఆర్థికరంగానికి వెన్నెముకగా నిలిచే ప్రైవేటు పెట్టుబడులను పరిశీలిస్తే 2011 వరకూ సగటున రూ. 25 లక్షల కోట్లుగా నమోదు కాగా, ఆ మొత్తం 2018– 19 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.5 లక్షల కోట్లకు పడిపోయింది. దేశంలో పెట్టే మొత్తం పెట్టుబడుల్లో.. దాదాపు 66%గా ఉండే ప్రైవేటు పెట్టుబడులు 2018–19 ఆర్థిక సంవత్సరంలో 47%నికి క్షీణించాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గడిచిన పదేళ్లలో ఏడేళ్లుగా క్షీణిస్తున్నది. రూపాయి క్షీణత వల్ల దేశీయ కార్పొరేట్ సంస్థల్లో విదేశీ మదుపరుల వాటాలు, ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులు పడిపోతున్నాయి. మరోవైపు ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఈ అంశాలు దేశంలో నగదు నిల్వల తగ్గుదలకు కారణం అవుతున్నాయి. వేధిస్తున్న నగదు లభ్యత మొండి బకాయిలు (ఎన్పిఏ) కారణంగా బ్యాంకులు రుణాల మంజూరును కఠినతరం చేయడంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎన్నడూ లేనివిధంగా నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రజల కొనుగోళ్లు, వినియోగం తగ్గాయి. వివిధ పరిశ్రమల టర్నోవర్‌లో క్షీణత నమోదవుతున్నది. ఫలితంగా.. ప్రభుత్వానికి పన్నులు, ఇతరత్రా రూపేణా సమకూరే ఆదాయం తగ్గింది. దీంతో ఆయా రంగాల్లో ప్రభుత్వ వ్యయం పడిపోయింది. రెండు, మూడేళ్ల ముందు వరకూ ప్రభుత్వ వ్యయంలో వృద్ధి ఏడాదికి సగటున 19% ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది దాదాపుగా 10%కి పరి మితం అయింది. దీంతో దేశ వృద్ధిరేటు ఐదేళ్ల కనిష్ఠస్థాయికి చేరుకొని 6.3% వద్ద నిలబడింది. కేంద్రం దిద్దుబాటు చర్యలు ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం లక్షణాలపై కేంద్రం అప్రమత్తం అయింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘంగా చర్చించి కొన్ని చర్యలు చేపట్టారు. సంపద సృష్టించే వారికి తమ ప్రభుత్వం మద్దతు ఉంటుందని ప్రకటించడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. కేంద్రం తీసుకున్న చర్యలను పరిశీలించినట్లయితే.. ద్రవ్య లభ్యత పెంచడానికి బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తున్నారు. రెపో రేట్ల కోత బదిలీలకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్బీఐ బోర్డ్ ఆమోదముద్ర వేయడం గొప్ప ఊరట. ఈ నిధుల లభ్యతతో ఆర్థిక వృద్ధిరేటును మెరుగుపర్చడం సాధ్యపడుతుంది. ఇదికాక మొత్తంగా రూ. 5 లక్షల కోట్ల నగదు చలామణిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాలు చౌకగా అందిస్తున్నట్లు ప్రకటించారు. వాహనాల పన్నుల్లో కోత విధించడం, ప్రభుత్వమే భారీగా కార్లు కొనడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. ఏంజెల్ పన్ను వల్ల ఇబ్బందుల పాలవుతున్న స్టార్టప్‌లకు (అంకుర కంపెనీలకు) ఆ పన్నును తొలగించారు. అధిక సంపన్నవర్గాలపై సర్‌చార్జి ఉపసంహరణ, ఎమ్ఎస్ఎమ్ఈలకు 60 రోజుల్లోనే జీఎస్టీ రిఫండ్లు మొదలైన పలు రాయితీలను ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్యాకేజీలూ (ఉద్దీపనలు) ప్రకటించబోమని స్పష్టం చేసినప్పటికీ.. ఆర్థిక మందగమనం రీత్యా కేంద్రం దిగిరాక తప్పలేదు. కేంద్రం కొన్ని నెలల క్రితమే సమర్పించిన బడ్జెట్లోని నిర్ణయాలపై ‘యు టర్న్’ తీసుకున్నదని కొందరు విమర్శిస్తున్నప్పటికీ.. ఈ చర్యలను సానుకూల దృష్టితోనే చూడాలి. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి కేంద్రం ఏ చర్య తీసుకున్నా స్వాగతించాల్సిందే. ముఖ్యంగా.. నగదు లభ్యత పెరగాలి. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత గరిష్ఠస్థాయికి చేరగలగాలి. కొత్త ఉద్యోగాల సృష్టి జరగాలి. ఇవన్నీ సాకారం కావాలంటే.. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. తాజాగా, కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యలు ఆర్థిక మాంద్యం రుగ్మతకు మందుగా పని చేయగలవా? ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి ఉరుకులు పెట్టించగలవా? ప్రతిపక్షాలు విమర్శిం చినట్లు ఇవి అరకొర చర్యలేనా? ఈ ప్రశ్నలకు జవాబులు భవిష్యత్తు పరిణామాలే స్పష్టం చేయగలవు. వ్యాసకర్త: సి. రామచంద్రయ్య మాజీ ఎంపీ, అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
రైతులను దగా చేసిన చంద్రబాబు
సాక్షి, కడప: టీడీపీ ట్రాప్‌లో పడకుండా రాష్ట్ర్రానికి బీజేపీకి సహకరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దివాళా తీసిన రాష్ట్రాన్నిముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నారని తెలిపారు. ఇసుక పాలసీ విధి విధానాలకు కొంత సమయం అవసరం అవుతుందని.. ప్రభుత్వం ఎలా నడుచుకోవాలో చెప్పే అర్హత చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. జమ్మూ కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుకు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోనే మద్దతు నిచ్చామన్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోదీనే హోదాపై స్పష్టత నివ్వాలన్నారు. ఎకనామిక్ టెర్రరిస్టులను పార్టీలో చేర్చుకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవన్నారు. నాడు బాబును తప్పుపట్టి ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలను బీజేపీలో చేర్చుకోవడం పద్దతి కాదన్నారు. రాజధాని విషయంలో కూడా చంద్రబాబు దళారులను పెంచి పోషించారని మండిపడ్డారు. అరాచక పనులను అరికట్టడం కోసమే అధికారంలోకి వచ్చామన్నారు. రాష్ట్రాభివృద్ది ఆగలేదని.. చంద్రబాబు దోపిడి మాత్రమే ఆగిందన్నారు. బాబు అనుమతి లేకుండానే.. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరారా అని ప్రశ్నించారు. తెలంగాణలో తెలుగు దేశం పార్టీని చంద్రబాబు.. రూపు లేకుండా చేశారన్నారు. రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు దగా చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ వ్యవస్థను రూపుమాపామని తెలిపారు -
‘చంద్రబాబు మానసిక స్థితి సరిగా ఉన్నట్టు లేదు’
సాక్షి, అమరావతి: ప్రజాతీర్పును కించపర్చే విధంగా మాట్లాడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబు మానసిక స్థితి సరిగా ఉన్నట్టు లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య పరీక్షల కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన చంద్రబాబు మానసిక స్థితిని పరీక్ష చేయించుకోవడం మర్చిపోయినట్టున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మతిలేని విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు భర్తీకి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్‌షా తదితరులను కోరారన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారని చెప్పారు. అయితే ఢిల్లీ వెళ్లి మోదీకి తనపై ఫిర్యాదు చేస్తారా అని చంద్రబాబు అనడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. -
‘బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ ఆయనే’
సాక్షి, అమరావతి: సొంత ప్రయోజనాలు కోసం పాకులాడే సుజనా చౌదరి.. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం విస్మయం కలిగిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య(సీఆర్) అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సుజానా చౌదరి బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్ట్ అని ఆరోపించారు. సుజనా లాంటి వారు పక్కన చేరి చంద్రబాబును ముంచేశారన్నారు. ప్రభుత్వం చేస్తోన్న ప్రతి పనిని మేనిఫెస్టోలో చెప్పే చేశామని తెలిపారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులు రాలేదని.. వచ్చుంటే ప్రజలపై మరింత భారం పడేదన్నారు. పీపీఏలను సమీక్ష చేస్తే తప్పేంటన్నారు. చంద్రబాబు ప్రజల గురించి ఆలోచిస్తారా, కార్పొరేట్ల గురించి ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. పీపీఏల సమీక్ష జరిగితే కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని చంద్రబాబుకు భయమా అని ఎద్దేవా చేశారు. డెవిల్స్ అడ్వకేటుగా ఉండొద్దు పీపుల్స్ అడ్వకేటుగా ఉండాలి కానీ.. డెవిల్స్ అడ్వకేటుగా ఉండకూడదని చంద్రబాబుకు హితవు పలికారు. అన్నక్యాంటీన్లు మేడిపండులాగా ఉన్నాయని.. తవ్వేకొద్దీ దోపిడీ బయటపడుతుండటంతో ప్రక్షాళన చేస్తున్నామన్నారు. దోపిడీని అరికడుతుంటే హర్షించాల్సిన బీజేపీ.. విమర్శలు చేయడం సరికాదన్నారు. నిన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన బీజేపీ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతుందో అర్ధం కావడం లేదన్నారు. టీడీపీ కాళ్లు చేతులు విరిగాయి కాబట్టి ఆ గ్యాపులో దూరేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ ఎదగాలని ప్రయత్నించడంలో తప్పు లేదని.. కాని ఎకనమిక్ టెర్రరిస్టులను, ఫ్యాక్షన్ లీడర్లను బీజేపీ చేర్చుకుంటోందని రామచంద్రయ్య ఆక్షేపించారు. -
అదే బాబు.. అదే బాట.. అవే తప్పులు!
ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసినా.. టీడీపీ అధినేత చంద్రబాబులో రాజకీయంగా కనీస పరివర్తన, గుణాత్మక మార్పు కనపడటం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఏ పార్టీ ఓటమి చెందినా సహజంగా ఓటమికి అధినాయకుడే బాధ్యత స్వీకరిస్తారు. ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో విశ్లేషణ చేసుకొంటామని, తిరిగి ప్రజలకు చేరువ కావడానికి కృషి చేస్తామని ఓటమి చెందిన నాయకులు వినమ్రంగా చెబుతారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబులో మాత్రం తాను తప్పు చేశాననిగానీ, పరిపాలనలో తప్పులు జరిగాయని గానీ ఒప్పుకొనే నిజాయితీ కొరవడింది. ‘‘ఏం తప్పులు చేశామని ప్రజలు ఇంత ఘోరంగా ఓడించారు?’’ అంటూ నెపాన్ని ప్రజల మీదకు నెట్టేశారు. ఆయనలో ఓటమికి సంబంధించిన అపరాధ భావన ఏ కోశాన ఉన్నట్లు కనపడలేదు. తప్పులు జరిగాయని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. చంద్రబాబులో ఈ లక్షణం భూతద్దం పెట్టి వెతికినా కనపడదు. టీడీపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు రాజకీయాల్ని ఏ తీరుగా నడుపుతున్నారో.. తిరిగి అదే బాటలో అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో జరిగిన తప్పులు, వైఫల్యాలను పక్కన పెడితే.. ప్రతిపక్ష పాత్రలోకి మారిన ఈ 50 రోజుల వ్యవధిలోనే ఆయన చేసిన తప్పుల జాబితా ఆంజనేయుడి తోకలా అంతకంతకూ పెరిగిపోతోంది. బడ్జెట్‌పై అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో తెలుగుదేశం ప్రభుత్వం.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను రూ. 2,26,117 కోట్లతో ప్రవేశపెట్టింది. కేవలం 3 నెలల ప్రభుత్వ ఖర్చుల ఆమోదం కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉండగా.. తెలుగుదేశం ప్రభుత్వం 2019–20 సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. అయితే, ఎన్నికల్లో ఘనవిజయం సాధించి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సా ర్సీపీ 2019–20 బడ్జెట్‌ను రూ. 2,27,975 కోట్లతో ప్రవేశపెట్టింది. ఈ రెండు బడ్జెట్లకు వ్యత్యాసం చాలా స్వల్పం. అయితే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంకెలను సమర్థించుకున్న టీడీపీ నేతలు.. ప్రస్తుత బడ్జెట్‌ను అంకెల గారడీ అంటూ ఎద్దేవా చేయడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనపడుతుంది. రాష్ట్ర సొంత ఆదాయం, ఆర్థిక సంఘం అందించే నిధులు, కేంద్ర గ్రాంట్లు, ఇతర ఆదాయాలను కలుపుకొని వాస్తవిక అంచనాలతో రూపొందించిన బడ్జెట్లో.. నవరత్నాలకు, ఇతర కీలక రంగాలకు జరిగిన కేటాయింపులను చూసి టీడీపీ ఓర్వలేని తనాన్ని బహిర్గతపర్చుకుని అభాసుపాలైంది. స్పీకర్ వ్యవస్థకు అగౌరవం శాసనసభ స్పీకర్‌గా సీనియర్ నేత తమ్మినేని సీతారాంను నిలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన తర్వాత ప్రొటెమ్ స్పీకర్ నేతృత్వంలో ఆయన ఎంపిక ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది. ఎన్నిక తర్వాత స్పీకర్ ‘చెయిర్’ వద్దకు నూతన శాసన సభాపతి తమ్మినేని సీతారాంను తోడ్కొని రావాల్సిందిగా ప్రొటెమ్ స్పీకర్ అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే, తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు ఒక ఉన్నత సంప్రదాయాన్ని కాలరాశారు. ఫ్లోర్ లీడర్‌గా ఉండి స్పీకర్‌ను చెయిర్ వద్దకు తీసుకువెళ్లే గౌరవాన్ని నిలుపుకోలేకపోయారు. తనకు బదులుగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న అచ్చెన్నాయుడికి ఆ బాధ్యతను పురమాయించడాన్ని అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించిన ప్రతి ఒక్కరూ నిర్ఘాంత పోయారు. తొలిరోజు నుంచే చంద్రబాబు తన వికృత రాజకీయ క్రీడను తిరిగి ప్రారంభించారన్నది అర్థం అయ్యింది. ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా చంద్రబాబు సభలో తాను చెప్పిందే జరగాలన్నట్లు ప్రవర్తించిన తీరు ఆయనలోని నియంతృత్వానికి పరాకాష్టగా కనిపించింది. శాసనసభలో సభానాయకుడైన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని, మంత్రులను.. చివరకు స్పీకర్‌ను కూడా నియంత్రించాలని ప్రయత్నించి పలు సందర్భాలలో చంద్రబాబు అభాసుపాలయ్యారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నదని పదేపదే చెప్పుకొనే చంద్రబాబు.. సభాసంప్రదాయాలను గౌరవించకుండా పాలకపక్షం మీద, స్పీకర్ మీద తన అక్కసును, అప్రజాస్వామిక నైజాన్ని బయట పెట్టుకొన్నారు. అతని కంటే ఘనుడు.. చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేశ్ కౌన్సిల్లో, ట్వీట్ల ద్వారా చేస్తున్న ప్రకటనల్లో హేతుబద్ధత, వాస్తవాలు లేకపోవడాన్ని అందరూ గమనిస్తున్నారు. లోకేశ్ తన అజ్ఞానాన్ని నిజాలుగా నమ్మించడానికి చేసే యత్నాన్ని మాత్రం ఎవరైనా ఖండించాల్సిందే! విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏలు) విషయంలో కూడా నారా లోకేశ్ వాదన పప్పులో కాలేసిన చందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ శాసనసభలో పీపీఏలపై సభ్యులందరికీ అర్థమయ్యేటట్లు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ అథారిటీ (ఈఆర్ఏ) అందించిన వివరాలు, విద్యుత్ లభ్యతకు సంబంధించిన వాస్తవాలను సభలోనే స్లయిడ్స్ ద్వారా ప్రదర్శించారు. తక్కువ ధరకు థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని కంపెనీలకు అనుచిత లాభం అందించడం కోసం ఏవిధంగా అధిక ధరలు చెల్లించి సౌర, పవన విద్యుత్‌ను కొనుగోలు చేశారో ముఖ్యమంత్రి తేటతెల్లం చేశారు. అయితే, టీడీపీ నాయకులు, ముఖ్యంగా.. నారా లోకేశ్ డొల్ల వాదనలను తెరపైకి తెచ్చిన తీరు వారి అజ్ఞానానికి పరాకాష్టగా నిలుస్తుంది. థర్మల్ విద్యుత్ తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ.. పర్యావరణ హితం కోసమే అధికరేటుతో పవన, సౌర విద్యుత్‌ను తాము కొనుగోలు చేసినట్లు.. ఇంత గొప్ప పని తాము చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తారా? అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర బొక్క పెట్టడాన్ని స్వాగతించాలంటున్న లోకేశ్‌ను ఏమనాలి? అదేవిధంగా.. అమరావతి నగరం కట్టడానికి అవసరమైన అప్పు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు నిరాకరించిన ఉదంతాన్ని తమకు అనుకూలంగాను, వైఎస్సార్సీపీ మీద బురద జల్లడానికి లోకేశ్ ఎంత తాపత్రయపడినా చివరకు అది సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది. అమరావతిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. కేంద్రం సూచన మేరకే తాము రుణాన్ని మంజూరు చేయడం లేదని.. కొత్త ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రపంచ బ్యాంకు చేసిన ప్రకటనతో లోకేశ్ తన పరువు పోగొట్టుకున్నారు. సెల్ఫ్ గోల్స్ అసెంబ్లీ సమావేశాలలో అధికార వైఎస్సార్సీపీని ఇరుకున పెట్టడానికి టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. ‘‘కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 5% రిజర్వేషన్లపై మీ వైఖరి ఏమిటి?’’ అంటూ టీడీపీ సభలో లేవనెత్తింది. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. కాపులను బీసీలుగా గుర్తించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిన చంద్రబాబు.. అగ్రకులాల్లోని పేదలకు కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్లలో తనకులేని అధికారాన్ని ఆపాదించుకొని, న్యాయస్థానం ముందు నిలబడదని తెలిసి కూడా 5% రిజర్వేషన్లు కల్పించడంలో అర్థం ఏమిటి? కాపులు బీసీల కోటాలోకి వస్తారా? అగ్ర కుల పేదల కోటాలోకి వస్తారా? అని సీఎం జగన్ నిండు సభలో నిలదీస్తే.. చంద్రబాబుకు మాటలు కరువయ్యాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించిన తెలుగుదేశం తనకుతానే సెల్ఫ్ గోల్ కొట్టుకొంది. తెరపైకి మళ్లీ ఎస్సీ వర్గీకరణ అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం ఒకసారి తీర్మానం చేసి, ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన చంద్రబాబు 2014–19 కాలంలో.. ఆ అంశాన్ని అటకెక్కించారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మంగళగిరిలో సభ నిర్వహణకు అనుమతి కోరితే నిరాకరించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎన్డీఏతో కలిసి ఉన్న నాలుగేళ్లూ టీడీపీ కేంద్రానికి కనీసం విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షంలోకి రాగానే మళ్లీ చంద్రబాబుకు ఎస్సీ వర్గీకరణ అంశం గుర్తొచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై తన వైఖరి స్పష్టం చేయాలంటూ.. టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పరోక్ష యుద్ధం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ప్రత్యర్థులతో నేరుగా తలపడే ధైర్యం ఎన్నడూ లేదు. రాజకీయ ప్రత్యర్థులను దొంగ దెబ్బలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ ప్రత్యర్థుల మీద, పార్టీల మీద ప్రజల్లో అపోహలు సృష్టించడానికి తన అనుకూల మీడియా ద్వారా, తన సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు అనేక నీలి వార్తలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ మీద బురదజల్లే కార్యక్రమాన్ని చాప కింద నీరులా విస్తరింపజేస్తున్నారు. ఇప్పటికే.. బీజేపీలోకి పంపిన తన బినామీల ద్వారా.. బీజేపీ మీద పరోక్షంగా పట్టు సాధించి.. ఆ పార్టీని వైఎ స్సార్సీపీ మీద ఎగదోయాలని కుట్రలు పన్నుతున్నారు. చంద్రబాబులో ఏమాత్రం మార్పు లేకపోవడాన్ని గ్రహించిన చాలా మంది నాయకులు ఇప్పటికే తమదారి తాము చూసుకుంటున్నారు. బాబును, ప్రత్యేకించి ఆయన పుత్రరత్నం నాయకత్వాన్ని భరించే స్థితిలో పార్టీ శ్రేణులు లేవు. ఉనికిని, అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు ఎంతకైనా తెగి స్తారు. ఈ పరిణామాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ -
నలుగురిని బీజేపీలోకి పంపడానికి బాబు ప్లాన్
-
కడప.. మంత్రుల గడప
సాక్షి, కడప : జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కడప అసెంబ్లీ సెగ్మెంట్లో గెలిచిన వారికే ఎక్కువసార్లు మంత్రి పదవులు లభించాయి. 1952లో ఇక్కడ గెలిచిన కడప కోటిరెడ్డి రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన ఎస్.రామమునిరెడ్డికి వెద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించింది. 1985లో టీడీపీఅభ్యర్థిగా గెలుపొందిన సి.రామచంద్రయ్యకు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ అమలు మంత్రిగా అవకాశం వచ్చింది. 1999లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషాను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా నియమించారు. 2009లో రెండవ పర్యాయం కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మదుల్లా గెలుపొందారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు మైనార్టీ సంక్షేమశాఖను అప్పగించారు. ఇలా ఐదుసార్లు కడప ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. అసలే దక్కని నియోజకవర్గాలు రైల్వేకోడూరులో సరస్వతమ్మ, రాజంపేటలో బండారు రత్నసభాపతి, పసుపులేటి బ్రహ్మయ్య, బద్వేలులో బిజివేముల వీరారెడ్డి, మైదుకూరులో డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు నుంచి పి.శివారెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కమలాపురంలో డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, పులివెందుల నుంచి పి.బసిరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలు మంత్రులుగా పనిచేశారు. రాయచోటి, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు ఇంతవరకు మంత్రి పదవులు దక్కలేదు. -
మీడియాకు చంద్రగ్రహణం
‘‘వెయ్యి తుపాకులక్కూడా భయపడనుగానీ.. కలానికి మాత్రం భయపడతాను’’ అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పారు అమెరికా తొలి అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉదార ఆర్థిక విధానాలు మొదలైనాక, పాలక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రజలలో ప్రభుత్వం పట్ల అనుకూలత పెంచడానికి ‘మేన్యుఫాక్చర్డ్ కన్సెంట్’ విధానాన్ని అనుసరిస్తూ పాలక వర్గాలు అత్యధిక శాతం మీడియాను తమ చెప్పుచేతల్లోకి తీసుకొని ప్రజలను ప్రభావితం చేసే దుర్మార్గపు దశ మొదలైందని ప్రముఖ ప్రజాస్వామ్యవాది, రచయిత ‘నోమ్ చామ్స్కీ’ 90 దశకం ప్రారంభంలోనే చెప్పారు. ప్రపంచం మాట ఎలా ఉన్నా.. తెలుగునాట మాత్రం ‘చామ్స్కీ’ చెప్పిన ప్రోపగాండ మోడల్.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కిన తర్వాత ఉధృతరూపం దాల్చింది. 1984లో అప్పటి రాష్ట్ర సీఎం ఎన్టీఆర్‌పై సహచర మంత్రి నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేసిన ఉదంతంలో ప్రజల్ని చైతన్యపర్చిన వైనాన్ని మీడియాలోని ఒక వర్గం ప్రజాసామ్య పరిరక్షణోద్యమంగా అభివర్ణిస్తుంది. వర్తమాన చరిత్రను పరిశీలిస్తే.. సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో ఫిరాయింపజేసుకొని, అందులో నలుగురిని ఏకంగా మంత్రుల్ని చేశారు. ఈ ఉదంతంపై ఒక వర్గం మీడియా చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. తహసీల్దార్ శ్రీమతి వనజాక్షిపై అధికారపార్టీ ఎమ్మెల్యే పాల్పడిన అమానుషదాడి అంశాన్ని సాధారణ అంశంగానే పరిగణించింది. కేవలం ముడుపుల కోసం చేపట్టిన పట్టిసీమ వల్ల ఒనగూడే నిజమైన ప్రయోజనాలేమిటో నిష్పక్షపాతంగా మీడియా వెల్లడించ లేదు. ఇక, పోలవరం ప్రాజెక్టులో జరిగిన విచ్ఛలవిడి అవినీతికి సంబంధించిన వార్తలు ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టింది. కొన్ని మీడియా సంస్థలు గొడుగు పట్టిన కారణంగానే.. ఓటుకు నోటు వంటి సంచలనకేసులో చంద్రబాబు పాత్ర హైలైట్ కాలేకపోయింది. బాహ్యప్రపంచం యావత్తూ ఓటుకునోటు కేసులో చంద్రబాబునాయుడి ప్రమేయాన్ని అర్థం చేసుకోగలిగింది. కానీ.. కొన్ని మీడియా సంస్థలకు ఈ కేసులో ఎటువంటి తప్పు కన్పించినట్లు లేదు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల సందర్భంగా మహాకూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. తెలుగుదేశం శాసనసభ్యులు టీఆర్ఎస్కు అమ్ముడు పోయారని, వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ విమర్శించారు. చంద్రబాబు సొంత రాష్ట్రంలో ఏం చేశారో ఆయనకు ఎందుకు గుర్తుకు రావడం లేదని.. మీడియా ప్రశ్నించలేకపోయింది. సీఎం అధికారిక నివాసంలో ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న టెలికాన్ఫరెన్స్ సౌకర్యాన్ని పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదని, ప్రతిరోజూ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని చంద్రబాబు పార్టీ కోసం వాడుకొంటున్నారన్న వాస్తవాన్ని మాత్రం మీడియా ప్రజలకు తెలియపర్చదు. ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ మెరుగు అంటూ చేసిన వాదనలు, చంద్రబాబు లెక్కలేనన్ని ’యు’టర్న్‌లపై అనుకూల మీడియా ఒక్క చర్చ కూడా ఏనాడు తమ ఛానల్స్‌లో పెట్టలేదు. కానీ, అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ అమలు చేస్తామన్న నవరత్నాలుపైన, ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలా సాధ్యం? అంటూ గంటల తరబడి డిబేట్లు పెట్టడం, జగన్ అధికారం కోసం అలవికాని హామీ ఇస్తున్నారంటూ అందరితో విమర్శలు చేయించడం ఆంధ్రప్రదేశ్‌లో ఒక వర్గం మీడియాకు నిత్యకృత్యమై పోయింది. జగన్ మీద ఉన్న కేసులపై అనేక అసత్య కథనాల్ని ప్రముఖంగా ప్రచురించడం; జగన్‌ను దూషిస్తూ తెలుగు దేశం మంత్రులు, శాసనసభ్యులు చేసిన విమర్శల్ని పతాక శీర్షికలుగా చేసుకోవడం వంటి నీతిబాహ్యమైన చర్యల్ని అనుకూల మీడియా అనేకం చేశాయి, చేస్తూనే ఉన్నాయి. చంద్రబాబు చేసే విన్యాసాలను ఒక వర్గం మీడియా గొడుగు పడుతున్న తీరు వెనుక ఆర్థిక, వర్గ, కుల ప్రయోజనాలు తప్ప వేరొకటి కనపడదు. చంద్రబాబు వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎంతగా వెనకేసుకొస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ మీడియా, ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా ప్రజలు చైతన్యం అయ్యారు. వాస్తవాలు తాత్కాలికంగా మరుగున పడవచ్చునేమోగానీ శాశ్వతంగా గొంతు నొక్కడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యాసకర్త: సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి -
ప్రజల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల్లో సెంటిమెంట్‌ను రేకెత్తించి, తెలంగాణ–ఆంధ్రా ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేసి, ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సయోధ్యను చెడగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. రామచంద్రయ్య గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీలోని కులవివక్షను భరించలేక ఆ పార్టీని వీడినట్లు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు చెబుతుండగా, కేసీఆర్ బెదిరింపులకే వారు అలా చేశారని చంద్రబాబు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. అసలు ఆస్తులకు, కేసీఆర్‌కు సంబంధం ఏమిటని నిలదీశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కు మనకుండగా, ఒక్క ఏడాదికే చంద్రబాబు ఎందుకు పారిపోయారు? కేసీఆర్ బెదిరించినందుకే పారిపోయారా? అని ఎద్దేవా చేశారు. ఏ భయంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరుతున్నారు? కిశోర్‌చంద్రదేవ్‌ను ఎవరు బెదిరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చిట్టా చాలా ఉంది ‘‘వైఎస్ జగన్‌ను సినీ నటుడు నాగార్జున కలిస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం ఏమిటి? చంద్రబాబు ఎన్ని కేసుల్లో నేరస్థుడు? ఎన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకోలేదో చెప్పాలి. చంద్రబాబు చిట్టా విప్పితే చాలా ఉంది. దళితులను దూషించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్సీపీ టికెట్లు ఇస్తున్నారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. దాసరి జైరమేష్ టీడీపీకి ఎంత సాయం చేశారనే విషయం చంద్రబాబు మర్చిపోయారా? సుజనాచౌదరి, రాయపాటి సాంబశివరావు, కేశినేని నాని, గల్లా జయదేవ్, మురళీమోహన్ వీళ్లంతా పారిశ్రామికవేత్తలు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తన అధికార నివాసం నుంచి టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పనులు నిర్వహించుకోవడానికి పార్టీ కార్యాలయం లేదా? ప్రభుత్వ సొమ్ముతో పార్టీ వాళ్లతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి’’ అని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా సి.రామచంద్రయ్య
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బలిజ సామాజిక వర్గానికి చెందిన సి.రామచంద్రయ్య విద్యావంతుడే కాక మంచి అధ్యయనశీలి, వక్త అనే పేరుంది. -
సభాపతులు అమ్ముడుపోయారు!
- శాసన మండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య అమరావతి: సభాపతులు అమ్ముడు పోయారని శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌పై ఉందని, ప్రతి ఒక్కరూ ఏదోఒక పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి గెలిచిన వారేనని, కానీ సభాపతి స్థానంలో కూర్చున్న తరువాత నిష్పాక్షికంగా విధి నిర్వహణ చేయాలన్నారు. కానీ సభాపతులు అలా కాకుండా అమ్ముడుపోయిన విధానాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆహ్వానిస్తున్నారని, కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. యాంటి డిఫెక్షన్ బిల్లును నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే చట్టసభల్లో ఇద్దరు ప్రిసైడింగ్ అధికారులు వినీవిననట్లు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పని తాను ప్రతిపక్ష నాయకునిగా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిల్లో చాలా ఘోరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీపై గెలిచిన వారు వేరే పార్టీకి పోతే కంప్లైంట్ ఇచ్చినా యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నాడంటే ఇందులో మతలబు ఉందన్నారు. పార్టీ నుంచి ఎక్స్టెన్షన్లు వస్తాయనో... ఇంకా ఏవైనా లాభాలు వస్తాయో... నాకు తెలియదు కాని ఇటువంటి దిగజారుడు తనం ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుందన్నారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాలు ఎన్నికల కమిషన్ కానీ, పార్లమెంటరీ కమిటీ కానీ రివ్యూ చేసే అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్‌కు, రాష్ట్రపతికి లేఖ రాశానన్నారు. గవర్నర్ ప్రసంగంపైన మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ప్రారంభమైంది. నేను మాట్లాడుతున్నాను. ఉన్న ఫ్యాక్ట్స్ చెబుతున్నా. సునిశితమైన వ్యాఖ్యలు ఉంటాయి. ప్రభుత్వం అనేది ప్రజల ఆస్థికి కస్టోడియన్. వారు ప్రభుత్వ సంక్షేమానికి డబ్బును ఉపయోగపెట్టకుంటే దానిని గుర్తుచేసే బాధ్యత రాజ్యాంగ పరంగా మాకుందన్నారు. కాబట్టి దాని గురించి చెప్పేందుకు అనుమతించకుంటే ప్రిసైడింగ్ అధికారి చట్టసభలో కూర్చునేందుకు అనర్హుడని అన్నారు. తాను మాట్లాడుతుంటే ఒక మంత్రి ఏదో చెప్పబోయారు, వారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పమని కోరాను, అయినా నిబంధనలకు విరుద్ధంగా అనుమతించారు. సభాపతి ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్నించారు. రూలింగ్ పార్టీ వారి కోసం ఇంత దిగజారుడు తనంగా లొంగిపోయే వారు ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ఎలా పనికొస్తారని ప్రశ్నించారు. చట్టసభల్లో కార్యాక్రమాలు నిష్పక్షపాతంగా జరగాలన్నారు. రూలింగ్ పార్టీ నుంచి లాభం కోసం ఫేవర్‌గా ఉండి రాజకీయాలు చేసే వాతావరణం పోవాలన్నారు. లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధించలేదన్నారు. హౌస్‌లో ఉండే సాంప్రదాయానికి భిన్నంగా వాళ్ళను ఆకర్షించే దానికి, రూల్స్‌కు భిన్నంగా పోతే ఏరకమైన ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుకోవాలి. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్రిసైడింగ్ అధికారుల నిర్వాకంపై పార్లమెంట్ స్పీకర్‌కు, రాష్ట్రపతికి లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు పార్టీ మారిన వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకోబడిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి కేటాయించిన కుర్చీల్లో కూర్చొని మాట్లాడితే పాయింట్ అవుట్ చేసినా సభాపతి తల తిప్పి చూడటం లేదన్నారు. ఈ అమ్ముడుపోయే విధానాలు ఎందుకు? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇటువంటి పరిణామాలు చాలా బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
'బాబును ఎడ్యుకేట్ చేయడానికి సిద్ధం'
కడప: ప్రత్యేక హోదా విషయంపై పూర్తిగా వివరించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎడ్యుకేట్ చేయడానికి తాము సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాల విషయమే ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని, హోదా వల్ల కలిగే లాభాల గురించి తాము ముఖ్యమంత్రికి వివరించి ఆయనను ఎడ్యుకేట్ చేయడానికి సిద్ధమని రామచంద్రయ్య చెప్పారు. ముఖ్యమంత్రి అందుకు సిద్ధం కావాలని సూచించారు. వ్యక్తిత్వం లేనివారు ఇతరుల వ్యక్తిత్వం గురించి మాట్లాడడం సరికాదన్నారు. -
నోట్ల రద్దుపై నోరు మెదపరేం బాబు?
-
నోట్ల రద్దుపై నోరు మెదపరేం బాబు?
అమరావతి : పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగాను, రాష్ట్రంలోను ఓ అసాధారణ పరిస్థితి నెలకొందని, అయినా రాష్ట్రంలో ప్రజల ఇబ్బందులు, నష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడంలేదని శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు, దినసరి కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం బ్యాంకుల, ఏటీఎంల వద్ద క్యూ లైన్లో గంటల తరబడి నిలుచుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నా.... సీఎం చంద్రబాబు స్పందించడంలేదని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన చంద్రబాబు బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అద్భుతమని పొగడటం దారుణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రవర్తన అత్యంత బాధ్యతారాహిత్యంగాను, దుర్మార్గంగాను ఉందని ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దు కోసం ప్రధానికి లేఖ రాసిన సీఎం అందువల్ల ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి సూచనలు చేయలేదా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు మందగించడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు. నోట్ల రద్దుతో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఢిల్లీ వెళ్లి ప్రధానికి స్వయంగా కలిసి పరిస్థితులు వివరిస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై సవివరణమైన ప్రకటన విడుదల చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
రామచంద్రయ్యతో మనసులో మాట
-
ఓటుకు నోటు కేసులో బాబే దోషి
కడప వైఎస్సార్ సర్కిల్ : ఓటుకునోటు కేసులో చంద్రబాబే అసలు దోషి అని శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య పేర్కొన్నారు.శుక్రవారం ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో అవినీతికి పాల్పడి రాష్ట్ర ప్రజల పరువు తీశారని, చంద్రబాబు అవినీతికి పాల్పడకుంటే కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య బీజేపీ ఢిల్లీ పెద్దలు రాజీ కుదిర్చి చంద్రబాబును కేసు నుంచి తప్పించి హైదరాబాదు విడిచి విజయవాడకు వెళ్లే విధంగా ఒప్పంద చే శారని ఆరోపించారు. దీంతో పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఉండాల్సిన ఉద్యోగులను బలవంతంగా విజయవాడకు తరలించారన్నారు. రాజ్‌భవన్‌ను రాజీల భవన్‌గా మార్చి పంచాయితీలు చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల పేరుతో ఉన్న నీటిని వదిలేసి రైతులు పంటలు వేసుకోకుండా చేశారన్నారు. పుష్కరాల పేరుతో18వందల కోట్లు దుబారా ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపై ఏసీబీ విచారణ జరుగుతుంటే నిలిపివేయడం ఇద్దరి సీఎంల మధ్య సయోధ్య కుదరడమేనన్నారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రజలకు రోజుకో మాట చెబుతు కాలం గడుపుతున్నారు తప్ప ఏం చేయలేదన్నారు ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్యాకేజీలపేరుతో ఏపి ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. సుజనాచౌదరి ప్రత్యేకహోదాకు చట్టంలో అడ్డంకులు ఉన్నాయని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఈసమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తార్ పాల్గొన్నారు -
మ్యాచ్ ఫిక్స్డ్ చాలెంజ్
విశ్లేషణ సింగపూర్ కంపెనీలను మాస్టర్ డెవలపర్స్‌గా నియమించాల్సిన బాధ్యతను అమలుచేసే క్రమానికి కొనసాగింపుగా లేదా ముగింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్విస్ చాలెంజ్‌ను ముందుకు తెచ్చిందని భావించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమ రావతి ప్రాంతంలోని 6.84 చ.కి.మీ.ల (1,691 ఎకరాలు) ప్రాంతాన్ని ‘స్టార్ట్-అప్’ ఏరియా పేరిట పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేయడానికి సింగ పూర్ కంపెనీలు ఇచ్చిన ప్రతి పాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మాస్టర్ డెవలపర్‌ను నియమించేం దుకు సింగపూర్ కంపెనీల ఈ ప్రతిపాదనలను ఎవరైనా స్విస్ చాలెంజ్ పద్ధతిలో సవాలు చేయవచ్చునని, అంత కంటే మంచి ప్రతిపాదనలొస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు ఇచ్చిన 45 రోజుల గడువు సెప్టెంబర్ 1తో ముగుస్తుంది. సింగపూర్ కంపెనీల స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలోని అనేక నిబంధనలు రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా హానికరమైనవో తెలుపుతూ పలు విషయాలు మీడియాలో చర్చకొచ్చాయి. కాబట్టి అసలు ఈ స్విస్ చాలెంజ్ ద్వారా నిజంగానే పోటీని ఆహ్వా నిస్తున్నారా? లేక ముందే పరస్పర అంగీకారాలు, హామీలు కుదిరాక దీన్ని ఒక తంతుగా నిర్వహి స్తున్నారా? అనేదాన్నే ఇక్కడ చూద్దాం. బూటకపు ఛాలెంజ్ ఏపీ ప్రభుత్వానికి చెందిన ఇంకాప్ (Infrastructure Corporation of Andhra Pradesh) సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఎంటర్ ప్రైజ్ (International Enter prise)లు 2014 డిసెంబర్ 8న అవగాహనా పత్రాన్ని (MoU) కుదుర్చుకున్నారుు. రాజధాని నగరానికి, రాజ ధాని ప్రాంతానికి మాస్టర్ ప్లాన్‌ను తయారుచేయుటకే అది ఉద్దేశించినది. అప్పటికి సీఆర్డీఏ (Capital Region Development Authority) ఏర్పడలేదు. రాజధాని ఎక్కడని కాని, రాజధాని పేరు కాని అధికారి కంగా నిర్ణయించలేదు. (ఇదే ఒప్పందాన్ని ఇఖఈఅ ఏర్ప డ్డాక 2015 జనవరి 15న దానికి, సింగపూర్ సంస్థలకు మధ్య కుదిరినట్టుగా మరల రాసుకున్నట్టు తెలుస్తు న్నది). ప్రభుత్వ వెబ్సైట్లలో ఎక్కడా ఏడాది కాలపరి మితి గల ఆ ఒప్పందం దొరకదు. దాని ముసాయిదా మాత్రం అందుబాటులో ఉన్నది. 2015 జనవరి 15 ఒప్పందాన్ని బట్టి చూస్తే ఆ గడువు 2016 జనవరి 14 వరకు. ఒప్పందంలోని ఆర్టికల్ 3.2(v) ప్రకారం ‘సీడ్ ఏరియా అభివృద్ధి కొరకు సింగపూర్‌కు చెందిన ఒకటి లేదా ఎక్కువ ప్రైవేటు కంపెనీలు మాస్టర్ డెవలపర్స్‌గా ఉండాలి. అవి స్వతహాగా కాని లేదా ఏపీసీఆర్డీఏతో సంయుక్తంగా కాని ఉండవచ్చు. ఒప్పందంలోని 3.2(v) ఆర్టికల్‌ను, అంటే సింగపూర్ కంపెనీలను మాస్టర్ డెవలపర్స్‌గా నియమించాల్సిన బాధ్యతను అమలుచేసే క్రమానికి కొనసాగింపుగా లేదా ముగింపుగా ఏపీ ప్రభుత్వం ఈ స్విస్ చాలెంజ్‌ను ముందుకు తెచ్చిందని భావించాలి. ఈ ఒప్పందం తర్వాత.. మాస్టర్ ప్లాను నివేదికలు, భూమి పూజలు, భూములు గుంజుకోవ డాలు, శంకుస్థాపనలు వగైరా జరిగాయి. అనేకసార్లు ఏపీ ప్రభుత్వం తరఫున పలువురు నేతలు, అధికారులు సింగపూర్‌లో పర్యటించడం, ఉత్తర ప్రత్యుత్తరాలు నడ పడం వీటన్నిటికన్న ముఖ్యమైనవి. ఏపీఐడీఈ యాక్ట్ 2001 సెక్షన్ 2 (ss, tt) ప్రకారం స్విస్ చాలెంజ్ విధానం అంటే ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీ తనకు తానుగా (Suo-Motu) లేదా అడగ కుండా ఒక ప్రతిపాదనను, కాంట్రాక్టు నియమాలను పంపిస్తే ప్రభుత్వం వాటిని పరిశీలించి బాగున్నాయనిపిస్తే పోటీదారులను ఆహ్వానించడం. అలాంటి ప్రాజెక్టు లను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు అప్పటికే మొదలుపెట్టి ఉండకూడదు. పైగా అవి ఈ చట్టంలోని రెండవ కేటగిరి ప్రాజెక్టులకే పరిమితం. ఆ ప్రాజెక్టులకు 1. ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు వన రులు సమకూర్చాలి, 2. వివిధ రూపాలలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలి, 3. డెవలపర్‌కు పూర్తి హక్కులు కల్పించాలి, 4. నీరులాంటి అనేక సహాయ సదుపాయా లను విస్తృతంగా కల్పించాలి. అంటే ప్రభుత్వం అనేక వనరులు, ప్రోత్సాహకాలు, హామీలు, హక్కులు కల్పించే ప్రాజెక్టులైతేనే ప్రైవేటు కంపెనీలు స్విస్ చాలెంజ్ పద్ధతిలో చేపట్టడానికి ముందుకు వస్తారుు. కేల్కర్ వద్దన్నా ఎందుకీ స్విస్ ఛాలెంజ్? ఏపీ ప్రభుత్వ ఆమోదం పొందిన సింగపూర్ కంపెనీల ప్రతిపాదన.. ఈ పద్ధతిపై సుప్రీంకోర్టు ఆదేశాలను, కేల్కర్ కమిటీ అభిప్రాయాన్ని ఉల్లంఘిస్తున్నది. మహా రాష్ట్రకు చెందిన ఒక స్విస్ చాలెంజ్ వివాదంలో సుప్రీం కోర్టు 2009 మే 11 తీర్పు.. ఇలాంటి కొత్త పద్ధతులను పాటించేటప్పుడు స్పష్టమైన విధి విధానాలను రూపొం దించాలని, ప్రాజెక్టు రకాలు, ప్రాజెక్టు ప్రతిపాదనలను గురించి ఎవరిని సంప్రదించాలి, అనుమతులు, కాలపరి మితులు వంటి వాటిని విధిగా ప్రకటించాలని, పాల్గొ నాలనుకొనే అన్ని ప్రైవేటు కంపెనీలకు సమాన అవ కాశాలు ఉండాలని లేకపోతే ఏకపక్ష, అన్యాయ ధోర ణులు చొరబడతాయని పేర్కొన్నది. ఇలాంటి కారణాల వల్లనే కేల్కర్ కమిటీ 2015లో స్విస్ చాలెంజ్ పద్ధతిని వ్యతిరేకించింది. పోటీలో పారదర్శకత లోపిస్తుందని, పోటీదారులకు సమాచార కొరత ఉంటుందని, ఈ పద్ధ తిని ప్రోత్సహించవద్దని సిఫారసు చేసింది. ముందుగానే గుర్తించిన ప్రాజెక్టులను ‘డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్‘ పద్ధతికి బదులు స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఇచ్చే అలవాటుని నియంత్రించాల్సి ఉందని, ఇవి రెండూ వేరు పద్ధతులని కేల్కర్ కమిటీ స్పష్టం చేసింది. ఏపీ, సింగపూర్ అధికారుల మధ్య సాగిన ఈ లేఖలను చూస్తే ఏపీ ప్రభుత్వం సుప్రీం, కేల్కర్ కమిటీల సూచనలకు పూర్తి విరుద్ధమైన వైఖరిని అవలంబిం చిందని స్పష్టమౌతుంది. సింగపూర్ వాణిజ్యం, పరి శ్రమల శాఖకు చెందిన ఫ్రాన్సిస్ చోంగ్ 2016 మార్చి 16న సెంబ్ కోర్బ్ కంపెనీ సీఈఓ టాంగ్కిన్ఫైకు రాసిన లేఖలో 2015 జనవరి 15 ఒప్పందాన్ని, అందులోని ఆర్టికల్ 3.2(v)ను (పైన నేను ఉదహరించినది) ప్రస్తా వించారు. అసెండాస్-సింగ్ బ్రిడ్జితో కలసి సెంబ్ కోర్బ్ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటుచేసి అమరావతి స్టార్టప్ ఏరియా అభివృద్ధికి స్విస్ చాలెంజ్ పద్ధతిలో ప్రతిపాదనను సమర్పిస్తుందన్నారు. ఈ కంపెనీలను అమరావతి అభివృద్ధి భాగస్వామిగా నియమిస్తే ప్రత్యేక ప్రాజెక్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరమనె గిరిధర్ 2015 ఏప్రిల్ 22న ఫ్రాన్సిస్ చోంగ్‌కు రాసిన లేఖలో స్విస్ చాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు, అవగాహనా పత్రం అమ లుకు తీసుకోవలసిన చర్యలపై సింగపూర్‌లో జరిగిన మార్చి 30-31 ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి ఇది కొనసాగింపని పేర్కొన్నారు. దీనికి సింగపూర్ ఇంట ర్నేషనల్ ఎంటర్ప్రైజ్ సీఈఓ 2015 ఏప్రిల్ 30న గిరి ధర్‌కు జవాబిస్తూ అవగాహనా పత్రం ప్రకారం సెంబ్ కోర్బ్-అసెండాస్-సింగ్ బ్రిడ్జ కంపెనీలను తమ తర ఫున మాస్టర్ డెవలపర్‌గా నామినేట్ చేస్తున్నట్లు తెలి పారు. ఆ తర్వాతనే మే 2న ప్రభుత్వం రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ కంపెనీ (CCDMC)ని స్థాపిస్తూ 109, 110 జీఓలను విడుదల చేసింది. మే 4న స్విస్ చాలెంజ్ పద్ధతిని ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. వీట న్నిటిని పొందుపరుస్తూ 2015 మే 7న పట్టణాభి వృద్ధి శాఖ జీ.ఓ 331ను విడుదల చేసింది. అన్ని నిర్ణయాలూ తీసుకున్నాకే... అంటే సింగపూర్ వాళ్లకు అవసరమైన నిర్ణయాలన్నిటినీ ఏపీ ప్రభుత్వం అధికారికంగా తీసుకొన్న తర్వాతనే.. సింగపూర్ వాళ్లు 2015 మే, జూలై నెలల్లో మాస్టర్ ప్లాన్ నివేదికలు ఇచ్చారంటున్న వారి వాదన నిరాధారమైనది, నిర్హేతుకమైనది కాదు. రాజధాని మాస్టర్ ప్లాన్‌పై రైతులు అనేక అభ్యంతరాలను తెలపడం, కొన్ని చోట్ల సీఆర్డీఏ అధికారుల అవగాహనా సమావేశాలను అడ్డుకొనడం తెలిసిందే. ఆ ఫిర్యాదులను మంత్రి నారాయణ, కమిష్ నర్ శ్రీకాంత్‌లు సింగపూర్ కంపెనీలకు నివేదించడమూ తెలిసిందే. 2014 డిసెంబర్ 8న అవగాహనా పత్రంపై సంతకాలు జరిగిన నాటి నుండి నేటి వరకు అమరావతి ప్రాంతంపైన సింగపూర్ కంపెనీలకు పూర్తి సమా చారం, అవగాహన ఉండటమే కాదు, ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు, సహకారం కొనసాగుతూనే ఉన్నాయి. మరే ఇతర విదేశీ లేదా స్వదేశీ కంపెనీలకు ఈ సానుకూలతలు లేవు. ఈ నేపథ్యం నుంచి చూస్తే సింగ పూర్ కంపెనీల స్విస్ చాలెంజ్ ప్రతిపాదన ఏవిధం గానూ స్వతహాగా లేదా అడగకుండా ఇచ్చినది కాదని స్పష్టమవుతుంది. ఈ ప్రాజెక్టు తమకే దక్కాలనే స్పష్ట మైన అవగాహనతోనే, ఒప్పందంతోనే వాళ్లు ఈ పద్ధతిని ముందుకు తీసుకొచ్చారు. అసలు ఏ చాలెంజూ లేని దీన్ని మ్యాచ్-ఫిక్స్డ్ చాలెంజ్ అని కాక ఇంకేమనాలి? - డాక్టర్ సి. రామచంద్రయ్య వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త Email: crchandraiah@gmail.com -
ఇంట్లో ఫంక్షన్‌లా చంద్రబాబు హడావుడి
-
ఇంట్లో ఫంక్షన్‌లా చంద్రబాబు హడావుడి: సీఆర్
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుట్ర పన్ని కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును లోక్‌సభకు పంపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ఆరోపించారు. తన ఇంట్లో శుభకార్యంలా చంద్రబాబు పుష్కరాలకు హడావుడి చేస్తున్నారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. నాలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు జరుగుతున్నా ఎవరూ అలా చేయడం లేదని అన్నారు. ఓవైపు దేవాలయాలు కూలగొట్టి మరోవైపు పుష్కరాల పేరుతో చంద్రబాబు షో చేస్తున్నారని సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. -
ప్రశ్నిస్తే మీదపడి కరుస్తున్నారు...: సీఆర్
హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆయన శనివారం ఇందిరాభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి ప్రజా అమరావతి కాదని రైతుల దగ్గర చంద్రబాబు భూములు లాక్కున్నారు. తనకు నచ్చినవారికి భూములు కట్టబెడుతున్నారు. రాజధాని సెంటిమెంట్‌ను దోపిడీకి అనుకూలంగా మలచుకుంటున్నారు.స్విస్ ఛాలెంజ్ పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలను ఏమాత్రం సంప్రదించడం లేదన్నారు.రాజరికంలో కూడా ఇలా జరిగి ఉండదన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన చంద్రబాబు... ప్రశ్నిస్తే వారిపై పడి కరవడం చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదన్నారు. మీడియాను నియంత్రించాలని చంద్రబాబు చూస్తున్నారని, అలా ఎన్నింటిపై నిషేధం విధిస్తారని ప్రశ్నించారు. ఏదో ఒకరోజు ప్రజలు నిన్ను, నీ పార్టీని బ్యాన్ చేస్తారంటూ చంద్రబాబుపై రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. అధికారపక్షానికి, ప్రధాన ప్రతిపక్షానికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజధాని నిర్మాణంలో ఉల్లంఘనలు లేవని సర్టిఫికెట్ ఆయనకు ఆయనే ఇచ్చుకుంటున్నారన్నారు. ప్రపంచంలోనే అభ్యంతరకరమైన పద్ధతిని భారతదేశంలో అమలు చేస్తామనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన రహస్య ఎజెండాను పక్కనపెట్టాలని సీఆర్ సూచించారు. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్న ప్రాజెక్ట్ అని, వెంటనే గ్లోబల్ టెండర్లు పిలవాలన్నారు. ఎవరూ అర్హులు అయితే వాళ్లకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలన్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు 45 రోజుల సమయం ఇస్తున్నామని అన్నారు. ప్రపంచంలో తానే తెలివైనవాడిననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని, దాంతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని సీఆర్ వ్యాఖ్యానించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే అమ్మేశారని ఆయన మండిపడ్డారు. -
'చంద్రబాబు దేవుడి భూములనూ వదలట్లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవుడి భూములను కూడా వదలడం లేదని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. సోమవారమిక్కడ ఆయన మాట్లాడుతూ...సదావర్తి సత్రం భూముల్లో నూ.5 వేల కోట్ల స్కాం జరిగిందన్నారు. ఈ భూముల వేలం వ్యవహారంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధాన లబ్ధిదారుడు కాగా, భూముల విక్రయంలో టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హస్తముందన్నారు. ప్రభుత్వం వెంటనే సదావర్తి భూముల విక్రయాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై దేవాదాయ శాఖమంత్రి మాణిక్యాలరావు జోక్యం చేసుకోవాలని రామచంద్రయ్య కోరారు. -
చిరంజీవితో సి.రామచంద్రయ్య భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య శనివారం రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో సమావేశం అయ్యారు. కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్ట్ అయినవారిని తక్షణమే విడుదల చేయాలంటూ కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్షపై ఈ భేటీలో చర్చ జరిపినట్లు సమాచారం. ముద్రగడ దీక్ష నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా ముద్రగడ కొద్దిరోజుల క్రితం పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణలను కలిసి కాపు ఉద్యమానికి సంఘీభావం తెలపాలని కోరిన విషయం తెలిసిందే. -
అప్పట్లో 'పోచారం'తో రాజీనామా కోరినట్లే...
-రాజధానిలో భూముల కుంభకోణంపై వార్తలొస్తే మంత్రుల రాజీనామాలేవీ? -సీఎం చంద్రబాబును ప్రశ్నించిన సి.రామచంద్రయ్య హైదరాబాద్ : కేవలం రూ.75 లక్షల కుంభకోణంపై పత్రికలో వచ్చిన వార్తకు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో రాజీనామా కోరినట్లే.. ప్రస్తుతం రాజధానిలో వేల కోట్ల భూ కుంభకోణాలపై పత్రికలో వార్తలొస్తే వాటికి సంబంధం ఉన్న మంత్రులతో రాజీనామా కోరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిజాయితీ నిరూపించుకోవాలని మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. గురువారం శాసన మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిజాయితీగా లేనందున రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. విచ్చలవిడి అవినీతి వల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. అవినీతిపై సభలో ప్రశ్నిస్తే ఆధారాలు ఇవ్వండి అంటూ ప్రతిపక్ష సభ్యులపై ఎదురు దాడి చేయడం సమంజసం కాదన్నారు. ఆధారాలు నిరూపించేది ప్రజాప్రతినిధులు కాదని, ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తే వాటికి సంబంధించిన ఆధారాలు అధికారులు సేకరిస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీని నిరూపించుకునేందుకు విచారణ చేయించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు విరుద్ధంగా ఏమాత్రం సిగ్గులేకుండా విచారణకు ఆదేశించేది లేదని తేల్చి చెప్పడం సమంజసం కాదన్నారు. నూతన రాజధాని నిర్మాణానికి ఒక ఇటుక కూడా పెట్టకముందే అవినీతి రాజధాని అయ్యిందని సి.రామచంద్రయ్య ఆరోపించారు. భూముల కుంభకోణంలో కేంద్రం జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక అక్రమార్కులను వెనకేసుకొస్తున్న ప్రభుత్వం ఇసుకను అక్రమంగా రవాణా చేసుకొని సొమ్ము చేసుకున్నవారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం రక్షిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, డి.చిన్న గోవిందరెడ్డిలు ఆరోపించారు. శాసన మండలి మీడియా పాయింట్లో వారు మాట్లాడుతూ.. రాజమండ్రి బ్రిడ్జిలంక సొసైటీలో అక్రమాలు జరిగినట్లు గుర్తించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అధికారికంగా 10 ట్రిప్పుల ఇసుక చూపి అనధికారికంగా 100 ట్రిప్పులను రవాణా చేసి కోట్లాది రూపాయలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. నది నుంచి ఇసుకను తీసుకొస్తున్న బోట్ మెన్‌కు ఇవ్వాల్సిన డబ్బులు కూడా బ్రిడ్జిలంక సొసైటీ సభ్యులు ఇవ్వడంలేదని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేసి మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ వెంటనే అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి : పంచాయితీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్‌పై రాష్ట్ర విద్యాశాఖ పంపిన ప్రతిపాదనను కేంద్రం ఆమోదించి వెంటనే ఉత్తర్వులు తెప్పించేలా తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు పీఆర్టీయూ ఎమ్మెల్సీలు బచ్చల పుల్లయ్య, గాదె శ్రీనివాసులు నాయుడు, ఎ.ఎస్.రామకృష్ణలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రూల్స్‌కు సంబంధించిన ఫైల్ కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఉపాధ్యాయుల పదోన్నతులు ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 2014 సెప్టెంబర్ నుంచి ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానం కాకుండా పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలని కోరినట్లు వారు తెలిపారు. -
'ప్రజలకైతే అర్థం కాలేదు'
హైదరాబాద్: ఏపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యతని సి.రామచంద్రయ్య అన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ చంద్రబాబు ప్రధానితో ఏం మాట్లాడారో ప్రజలకైతే అర్ధంకాలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చంద్రబాబు ప్రతిపక్షాలను ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడంలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ గతంలో మన్మోహన్ కేబినేట్ నిర్ణయం తీసుకుందన్నారు. మోదీకి ధైర్యముంటే ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మన్మోహన్ కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయలన్నారు. లేదంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టి ప్రత్యేక హోదా అంశానికి చట్టబద్దత కల్పించాలన్నారు. నీతి అయోగ్ కేవలం అమలు చేసే కార్యనిర్వాహక సంస్థ మాత్రమేనన్నారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా సాధించటం చేతకాకపోతే తప్పుకోవాలని సూచించారు. -
'బాబు తన చేతగానితనాన్ని ఒప్పుకోవాలి'
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం చంద్రబాబు నాయుడు చేతగానితనాన్ని ఒప్పుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. విధానపత్రంతో చంద్రబాబు దివాళాకోరుతనం బయటపడిందని ఆయన అన్నారు. శుక్రవారం సి.రామచంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఒక సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందని, పదవులన్నీ ఓ సామాజిక వర్గానికే ఇస్తున్నారని, అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రులే ఫ్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సి.రామచంద్రయ్య అన్నారు. మోదీ పార్లమెంట్‌కు రాకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవని, మోదీ తీరు చూస్తుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆఖరి రోజు అనిపిస్తుందన్నారు. -
'సీఎంకు పౌరుషం ఉంటే మంత్రులతో రాజీనామా.. '
వైఎస్సార్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని కేంద్రప్రభుత్వం స్పష్టంగా తేల్చిందని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గులేకుండా కేంద్రంలో తన మంత్రులను కొనసాగిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిజంగా సీఎంకు పౌరుషం ఉంటే మంత్రులను వెంటనే రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సహాయం కోసం ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని చంద్రబాబుపై సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉత్తమ విఫలనేత బాబు
రాజధాని నిర్మాణానికి హుండీలు, జోలెలు పడుతున్న బాబే ప్రచారార్భాటానికి కోట్లు గుమ్మరించడం ఒక విచిత్ర వైరుధ్యం. నైతికతపై, విలువలపై ఉచితోపన్యాసాలు దంచే నారా వారు రేవంత్‌రెడ్డి ఎపిసోడ్లో అడ్డంగా బుక్కయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేర్చ లేని వైఫల్యం, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, పన్ను రాయి తీలు సాధించలేని అసమర్థతా కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి నారా చంద్రబాబు నాయు డును ఈ ఏడాది ఉత్తమ విఫల నేతను చేశాయి. తన ఏడాది పాలన సందర్భంగా ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా తన వైఫల్యాలను, అసమర్థతను చర్చకు తేవడం తథ్యమని కుటిల రాజనీతి దురంధరు డైన చంద్రబాబు ముందే పసిగట్టారు. అందుకే ప్రజల దృష్టిని ఎన్నికల హామీలపై నుంచి మరల్చి, ఏమార్చడం కోసం ‘నవనిర్మాణ దీక్ష’ ప్రహసనానికి తెరదీశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని పదే పదే చెప్పే చంద్రబాబు దీన్ని వారం పాటూ ఊరూరా సాగే ప్రభు త్వ కార్యక్రమాన్ని చేసి, కోట్ల రూపాయల ప్రజాధనంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం మొదలు కార్యాలయం మరమ్మతులు, ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, మహానాడు వరకు ఆర్భాటాల కోసం కోట్లకు కోట్లు నీళ్లలా ఖర్చు చేసిన సంగతి తెలి సిం దే. రాజధాని నిర్మాణానికి హుండీలు, జోలెలు పడుతు న్న బాబే ప్రచారార్భాటం కోసం కోట్లు గుమ్మరించడం ఒక విచిత్ర వైరుధ్యం, ఆయన రాజకీయ మనస్తత్వం. ప్రజాధనం దుబారా సంగతి అలా ఉంటే, జూన్ 2 పత్రికా ప్రకటనల్లో (ప్రతిజ్ఞలో) ‘‘అవినీతి, కుట్ర రాజకీ యాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని’’ పేర్కొన్నారు. ఈ ప్రకటన చూస్తే ప్రభుత్వానికి, పార్టీకి మధ్య విభజన రేఖను బాబు స్వార్థ రాజకీయ వ్యూహంతో పూర్తిగా చెరి పేశారనిపిస్తోంది. రాజకీయ పార్టీలు వారివారి విధానాల ప్రాతిప దికన పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసు కుంటాయి, కుట్రలు ఆపాదించుకుంటాయి. కానీ ప్రభు త్వం అందరిదీ. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రకటనలు ఎలా, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో బాబుకు తెలి యనిది కాదు. అయినా ప్రభుత్వాన్ని పార్టీ సొంత వ్యవహారంలా మార్చేశారు. కుట్ర రాజకీయాల వలన నష్టపోయిన రాష్ట్రం అంటూ పరోక్షంగా బాబు రాష్ట్ర విభజనను కుట్రగా చిత్రించారు. తెలంగా ణ ఏర్పాటు లేదా రాష్ట్ర విభజన కుట్ర అనే ఇదే మాటను ఆయన తెలంగాణలో చెప్పగలడా? మొన్న మహబూబ్‌నగర్ సభలో విభజనకు మొట్టమొదటి లేఖ ఇచ్చింది టీడీపీయేనని, తన లేఖ వల్లే తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కాబట్టి ఏపీలో కూడా తాను మొదట లేఖ ఇవ్వ డం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని, ఈ కుట్రకు తానే బాధ్యుడినని చెప్పే ధైర్యం బాబుకుందా? పోనీ విభజన కుట్రని భావించడానికి ఆయన సమైక్యవాదా? అదీ కాదు. మరి ఆయన చెప్తున్న ‘కుట్ర’... కాంగ్రెస్‌పై ఎదు రుదాడికి, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే తన పైశాచిక, నెగటివ్ రాజకీయ విధానా లకు సంబంధించినది కాక మరేమిటి? తన వైఫల్యా లను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు బాబు పన్నిన రాజకీయ కుయుక్తే అసలు కుట్ర. అసలాయన రాజకీయ జీవితమే కుట్ర. ఇక అదే జూన్ 2 ప్రకటనలో మరొక ముఖ్య అంశం ‘అవినీతి’. నిజమే అవినీతి ఏ రూపంలో ఉన్నా దాన్ని నిలువరించేందుకు, అంతం చేసేందుకు అన్నివిధాలా, అంతా ప్రయత్నించాల్సిందే, ప్రతిజ్ఞ పూనాల్సిందే. కానీ మొన్నటి మహానాడులో తన ఎమ్మెల్యే లను పశువుల్లా కొంటున్నారంటూ బాబు ఉపన్యాసం దంచుతున్న సమయానికే... ఆయన ప్రతినిధిగా రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో బేరసారాలు సాగి స్తున్నారని బట్టబయలైంది. అంటే బాబు సమాజానికి ఏమి ప్రబోధిస్తారో దానికి విరుద్ధమైనదాన్నే ఆచరిస్తారనే కదా! అందుకే, చెప్పేది చేయరు, చేసేది చెప్ప రు అని ఆయనకు అంత పేరు! నైతిక తపై, విలువలపై నిత్యం ఉచితోపన్యా సాలు దంచే నారా వారు రేవంత్ ఎపిసోడ్లో అడ్డంగా బుక్కయ్యారు. బాబు పంపితేనే డీల్‌కు వచ్చానని రేవంత్ చెప్పటం లోకమంతా చూసింది. దేశమంతా ఈ ‘ఐదు కోట్ల డీల్’ పెద్ద చర్చనీయాంశం అయింది. బాబే దానికి సూత్రధారి కాబట్టి ఆయనే ప్రధాన నిందితుడవుతాడని పలువురు భావిస్తున్నారు. కాబట్టి కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి వీలుగా బాబు తన పదవికి రాజీనామా చేయడం సముచితం. నిర్దోషిగా బయటపడితే ఆయన తిరిగి సీఎం కావచ్చు. అంతవరకు టీడీపీలోనే వేరొకర్ని సీఎంను చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఇక అవినీతి వ్యతిరేక క్రూసేడర్లమని చెప్పుకునే నరేంద్రమోదీగానీ, బీజేపీ గానీ, వెంకయ్యనాయుడుగానీ బాబు ‘ఐదు కోట్ల డీల్’ లో అడ్డంగా బుక్కయినా నోరుమెదపడం లేదు. అస్మ దీయుల అవినీతి పట్టకపోవడమే వారి విధానమా? ప్రజలకు స్పష్టం చేయాలి. ఇక నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న బాబు ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ తీరిపోవన్నాడు. రాష్ట్ర ప్రజ లంతా ప్రత్యేక హోదా, పన్ను రాయితీల కోసం ఎదురు చూస్తుంటే, ఉద్యమిస్తుంటే బాబు ఇలా మాట్లాడటం, వారి పోరాట స్ఫూర్తిని దెబ్బతీయడానికి కాక మరెందు కు? ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీల కోసం కాం గ్రెస్ పార్టీ, వామపక్షాలు, పలు ప్రజాసంఘాలు ఉద్య మిస్తున్నాయి. అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేద్దాం, మీరే నాయకత్వం వహించం డని పిలుపునిస్తున్నాయి. కాగా బాబు ప్రకటన ప్రత్య క్షంగా ఏపీకి ద్రోహం చేసేది. నాయకుడంటే ప్రజల్లో స్ఫూర్తి నింపాలి. నిర్వీర్యం చేయకూడదు. జపాన్, కొరి యా లాంటి దేశాలు అనేక యుద్ధాల్లో నష్టపోయినా అక్క డి నాయకత్వం ప్రజల్ని పునర్నిర్మాణంలో భాగస్వాము లను చేసేలా స్ఫూర్తిని నింపి అభివృద్ధిపథంలో నిలి పారు. బాబులా నెగటివ్ మైండ్‌తో వ్యవహరిస్తే అది సాధ్యమయ్యేది కాదు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ల వీడి యో కాన్ఫరెన్స్‌లో సైతం విభజన గాయాలను గుర్తు చేయాలని పిలుపునివ్వడం బాబు నెగెటివ్ ఆలోచనా విధానానికి నిదర్శనం. ఇది ప్రజల చైతన్యాన్ని నిర్వీర్యం చేయడమే కాదు, విద్వేషాన్ని రగుల్చుతుంది. జూన్ 2ను రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకో డానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరని, ప్రజల మనోభావాలను గుర్తించి నవంబర్ ఒకటినే రాష్ట్ర అవత రణ దినోత్సవంగా నిర్ణయించాలని కాంగ్రెస్ చాలా కాలం క్రితమే ప్రభుత్వాన్ని కోరింది. ఇంతవరకు ప్రభు త్వం నుంచి స్పందన లేదు. జూన్ 2 నుంచి వారం రోజు లపాటు చేపట్టిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో భాగంగానే జరుగుతున్నా యా? లేదా? అనేదీ స్పష్టం చేయకపోవడం బాబు పాల న తీరుకు నిదర్శనం. (వ్యాసకర్త సీ రామచంద్రయ్య, ఏపీ శాసన మండలి విపక్షనేత) మొబైల్: 8106315555 -
'బాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి'
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కుట్రదారనడానికి సాక్షాధారాలున్నాయని కాంగ్రెస్ నేత, మండలిలో విపక్ష నాయకుడు సి రామచంద్రయ్య అన్నారు. ఈ కేసు విచారణ నిష్పక్షిపాతంగా జరగాలంటే చంద్రబాబు సీఎం, టీడీపీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాలని సి రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకమని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు అవినీతి ప్రభుత్వాన్నికి మద్దతు కొనసాగిస్తారో లేదో చెప్పాలని సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు మౌనంగా ఉండటమే ఆయన తప్పు చేశారనడానికి నిదర్శమని చెప్పారు. చంద్రబాబు చేపట్టింది నవనిర్మాణ దీక్ష కాదు నయవంచన దీక్షని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు కారణం ఏంటో చెప్పాలని అన్నారు. అవినీతి, రాజకీయ కుట్రతో రాష్ట్ర విభజన చేయించడం చంద్రబాబు దివాలాకోరు రాజకీయమని సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు. -
'బాబు రాజీనామా చేయాలి'
-
'చంద్రబాబునూ నిందితుడిగా చేర్చాలి'
-
'చంద్రబాబునూ నిందితుడిగా చేర్చాలి'
హైదరాబాద్ : ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో రూ.5 కోట్ల డీల్ వ్యవహారంలో టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా నిందితుడిగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరపాలని ఆయన సోమవారమిక్కడ అన్నారు. రేవంత్ రెడ్డి కేవలం పావు మాత్రమే అని...అసలు సూత్రధారి చంద్రబాబు నాయుడేనని సి.రామచంద్రయ్య ఆరోపించారు. రాజకీయ చరిత్రలో ఇది అత్యంత హేయమైన చర్య అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగినా ఇది అత్యంత దారుణమైన చర్య అని, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. -
ప్రజా రాజధానా? ప్రైవేటు రాజధానా?
- ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రఘువీరా, రామచంద్రయ్య హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాజధాని.. ప్రజా రాజధానా? లేక ప్రైవేటు రాజధానా? అనే సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రకరకాల జీవోలు తెచ్చి రైతుల పొట్టకొడుతోందని దుయ్యబట్టింది. సోమవారం ఇందిరాభవన్‌లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. రైతులనుంచి దౌర్జన్యంగా భూములు లాక్కొని ప్రైవేటువారికి లీజుకు ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. పారదర్శకంగా సాగాల్సిన రాజధాని నిర్మాణాన్ని సొంత కార్యక్రమంగా రహస్యంగా ఎందుకు చేస్తున్నారో చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. జీవోలను రహస్యంగా ఉంచడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 21 నుంచి జూన్ 8 వరకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో నిరసన కార్యక్రమాలు, సదస్సులు, రౌండ్ టేబుల్ కార్యక్రమాలు నిర్వహించనున్నామని రఘువీరారెడ్డి తెలిపారు. -
'ఇది ప్రజా రాజధానా? ప్రైవేట్ కేపిటాలా?'
-
ప్రత్యేక హోదా తిరుగులేని హక్కు!
సందర్భం మోదీ నుంచి వెంకయ్యనాయుడు వరకు బీజేపీ నేతలంతా ఎన్నికల ముందు ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదా అంటూ ప్రజలపై కపట ప్రేమను ఒలకబోశారు. ఏరు దాటాక... అన్నట్టు నేడు ప్రత్యేక హోదాకు కుంటిసాకులతో ద్రోహం చేస్తున్నారు. పరిశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానిచ్చే అంశంపై కేంద్రంలోని బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదానిస్తే ఇతర రాష్ట్రాలు కూడా అదే డిమాండ్ చేస్తాయనే వాదన సైతం విన వస్తోంది. ఏడు ఈశాన్య రాష్ట్రా లు, సిక్కిం, జమ్మూకాశ్మీర్లే గాక హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు.. మొత్తం 11 రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేక హోదా ఉంది. అలాంటి రాష్ట్రాలకు 90% నిధులు కేంద్ర గ్రాంటుగా వస్తాయి, 10% మాత్రమే రుణాలుగా ఉంటాయి. అంతేగాక రాష్ట్రం తెచ్చుకునే విదేశీ రుణాలకు సైతం కేంద్రం చెల్లిం పులు చేస్తుంది. ఎక్సైజ్, ఆదాయ పన్నులలో రాయితీలు కూడా లభిస్తాయి. ఫలితంగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున పెట్టు బడులు రావడానికి ఆస్కారం కలుగుతుంది. ప్రత్యేక హోదా లేకపోతే కేంద్ర నిధులలో 70% రుణంగా, 30% గ్రాంటుగా లభిస్తాయి. ఇతర మేళ్లేవీ కలుగవు. కేంద్రం తన వార్షిక ఆదాయంలో 30% ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కోసం ఖర్చు చేస్తోంది. వెనుకబడిన రాష్ట్రాలు దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదగడం కోసం కేంద్రం ప్రత్యేక హోదాను ఇస్తూ వస్తోంది. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఏమి టి? అనే అంశమే ఏపీ హోదాపై చర్చలో కీలకాంశం అవు తుంది. రాష్ట్రవిభజన నిర్ణయాన్ని తీసుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం విభజనానం తర ఏపీ ఆర్థిక పరిస్థితిని వాస్తవిక దృష్టితో అంచనా వేసింది. అభివృద్ధి అంతా కేంద్రీకృతమైన హైదరాబాద్ ను కోల్పోవడం ద్వారా ఏటా సుమారు రూ. 15 వేల కోట్ల చొప్పున కనీసం ఐదేళ్ల పాటూ ఆర్థిక లోటు ఉం టుందని సరిగ్గానే లెక్కగట్టింది. అంతేగాక, ఏపీ ప్రధా నంగా వ్యవసాయక రాష్ట్రం కాబట్టి పారిశ్రామికాభి వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇంకా ఏర్ప డలేదనీ, ప్రత్యేకించి రాష్ట్రంలో సగానికిపైగా జిల్లాలున్న ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయనీ గుర్తి ంచింది. ఏపీ భవిష్యత్తు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సాగిన విద్యార్థి, ప్రజా ఉద్యమాలు కూడా ఈ వాస్తవిక అంచనాకు తోడ్పడ్డాయి. నాటి మన్మోహన్సింగ్ కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఏపీ ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే వివిధ అంశాలను ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చింది. పోలవరానికి జాతీయ హోదా, పోర్టులు, అం తర్జాతీయ విమానాశ్రయాలు, కేంద్ర విద్యాసంస్థలు, రైల్వేజోన్, మెట్రోజోన్లు తదితరాలు ఆ దృష్టితో చేర్చి నవే. ఏపీ ఆర్థిక లోటు పూడటానికి, పారిశ్రామికాభి వృద్ధికి, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి, అన్నిటికి మించి ఆర్థికంగా ఏపీ ఇతర రాష్ట్రాలకు సమంగా ఎదగడానికి దానికి ప్రత్యేక హోదా అవసరమని ప్రధానిగా మన్మో హన్ రాజ్యసభలో ప్రకటించారు. ఏదిఏమైనా రాష్ట్ర విభ జన జరగాల్సిందేనని పట్టుబట్టిన అరుణ్‌జైట్లీ, వెంక య్యనాయుడు, సుష్మా స్వరాజ్లతో ముందుగా చర్చిం చి మరీ ఆయన మార్చి 1 కేంద్ర మంత్రివర్గ సమావే శంలో ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదాను నిర్ణయించి, ప్రణా ళికా సంఘానికి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రజల భావోద్వేగాలు మిన్నంటివున్న ఆనాడు వెంకయ్యనాయుడు ఐదేళ్ల ప్రత్యేక హోదా చాలదని పదేళ్ల హోదా కోరారు. ఆయన చిత్తశుద్ధిని విశ్వసించి ఆనాడు నేను ఆయనను బహిరంగంగానే అభినందిం చాను. ప్రజల చేత నాడు శభాష్ అనిపించుకొని, ఊరూ రా సన్మానాలు చేయించుకున్నారు కూడా. అదే పెద్ద మనిషి, అదే నోటితో నేడు ఏపీ ప్రత్యేక హోదాకు చట్ట బద్ధత లేదని పచ్చి అసత్య ప్రచారం సాగిస్తున్నారు. నాడు ప్రధానిగా మన్మోహన్ చేసిన ప్రకటనంటేనే, కేబి నెట్ నిర్ణయమంటేనే చట్టబద్ధమైనదని అర్థం. వాటికి విలువ, చట్టబద్ధత లేకపోతే... మరి హుద్‌హుద్ తుపా ను బాధితులకు సహాయంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో చేసిన రూ.1,000 కోట్ల సహాయం వాగ్దానానికి విలువ ఉంటుందా? ప్రభుత్వాలు నడిపే పార్టీలుంటా యి, పోతాయి. ప్రభుత్వం మాత్రం శాశ్వతంగా ఉం టుంది. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, ఆదేశాలు మరో పార్టీ ప్రభుత్వ హయాంలో అమలవు తాయనే నమ్మకం లేకపోతే ప్రజలు ప్రభుత్వాలను, పాలకులను విశ్వసిస్తారా? వారికి విలువ, గౌరవం ఉం టాయా? అలాంటి ప్రభుత్వాలపైనే కాదు ప్రజాస్వా మ్యంపైనే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదముం దని వెంకయ్యనాయుడు గుర్తించకపోవడం శోచనీయం. బీజేపీ ఎన్నికల ప్రణాళిక ఏపీకి పదేళ్ల ప్రత్యేక హోదాను కల్పిస్తామని పేర్కొంది. పైగా ప్రధాని అభ్యర్థిగా మోదీ సైతం కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందనీ, అది చేసిన దానికంటే మెరుగైన చట్టంతో, మరిన్ని ప్రయోజనాలను కల్పించి న్యాయం చేస్తామనీ వాగ్దానం చేశారు. మోదీ నుంచి వంకరటింకర వెటకారాల వెంకయ్య వరకు బీజేపీ నేతలంతా నాడు పదేళ్ల ప్రత్యేక హోదా అంటూ ప్రజలపై కపట ప్రేమను ఒలకబోశారు. ఏరు దాటాక.... అన్నట్టు నేడు ప్రత్యేక హోదాకు చట్టబద్ధతే లేదనీ, ఇం కేవేవో కుంటిసాకులతో ప్రజలను వంచించాలని చూస్తు న్నారు. ఇంతకుమించిన ద్రోహం మరొకటి ఉంటుం దా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ద్రోహంలో భాగ స్వామిగా మారడమే కాదు, ప్రజల ఆగ్రహం నుంచి మోదీని కాపాడటానికి నానాపాట్లు పడుతున్నారు. ఏదిఏమైనా దేశ ప్రధానిగా నాడు మన్మోహన్, మంత్రి వర్గం చేసిన నిర్ణయాలకు విలువ, చట్టబద్ధత ఉన్నాయ నేది తిరుగులేని సత్యం. దాన్ని నిరాకరించి బీజేపీ, టీడీపీలు ప్రధాని పదవినే పరిహాసం చేస్తూ తమ గోతిని తామే తవ్వుకుంటున్నాయి. ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధమని నమ్మి, కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు!’ నినాదంతో చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రజలందరి సంఘీభావాన్ని కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా అందుకోసం ప్రజాపోరాటాన్ని నిర్మించడమే మన తక్షణ కార్యక్రమం. (వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్షనేత ఫోన్: 81069 15555) -
'ఇప్పుడు సాధ్యం కాదనటం అన్యాయం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం వెనుకడుగు వేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ మండిపడ్డారు. చంద్రబాబు నిర్ణయాలు, ప్రాధాన్యతలు రాష్ట్రాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. కార్పొరేట్ శక్తుల కోసం చంద్రబాబు పని చేస్తున్నారని సి.రామచంద్రయ్య విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష నేతలను చంద్రబాబు ఢిల్లీకి తీసుకు వెళ్లాలని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న వెంకయ్య నాయుడు..ఇప్పుడు సాధ్యం కాదనటం అన్యాయమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సహకరించాలని సి.రామచంద్రయ్య విజ్ఞప్తి చేశారు. వెంకయ్య నాయుడు కూడా ఆ మేరకు బీజేపీని, కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన కోరారు. -
మా పార్టీ ఏమీ నష్టపోదు: రామచంద్రయ్య
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మాత్రమే అధికారికంగా నిర్వహించి ఇందిరాగాంధీ వర్థంతిని విస్మరించటం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ మోదీ సర్కార్ సెక్యులర్ విధానాలను శంకించే పరిస్థితితో ఉందన్నారు. మోదీ అవలంభించే విధానాల వల్ల మైనార్టీలు అభద్రతా భావానికి గురవుతున్నారని రామచంద్రయ్య విమర్శించారు. వాజ్‌పేయ్, అద్వానీ, మోదీ సారథ్యంలోని బీజేపీకి విలువల పరంగా చాలా తేడా ఉందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి చేర్చుకోవటం వల్ల తమ పార్టీ ఏమీ నష్టపోదని ఆయన అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర మాజీమంత్రులు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా త్వరలో కమలం గూటికి చేరుతున్నారు. -
'జన్మభూమి'ని టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్
హైదరాబాద్: ఏపిలో ప్రభుత్వం చేపట్టే జన్మభూమి కార్యక్రమాలలో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందిరా భవన్లో ఏపిసిసి కార్యవర్గం సమావేశం జరిగింది. అనంతరం మాజీ మంత్రి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ రుణాల మాఫీ, చేనేత కార్మికుల సమస్యలు, పెన్షన్లు, స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. అక్టోబరు మొదటి వారంలో పిసిసి కార్యవర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. జిల్లాలవారీగా అధ్యక్షులను నియమిస్తారని చెప్పారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలలో పోటీచేస్తామని చెప్పారు. భద్రత గురించి కాంగ్రెస్ నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా తగ్గించడంపై డిజిపికి ఫిర్యాదు చేస్తామని రామచంద్రయ్య చెప్పారు. ** -
కడప జిల్లాపై చంద్రబాబు వివక్ష: రామచంద్రయ్య
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. కడప జిల్లాలో రాజకీయంగా బలంగా లేదనే కారణంతో ఈ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదన్న నెపంతో వారిపై కక్ష కట్టడం సబబు కాదని ఆయన అన్నారు. సీఎం పథకాలు మంత్రులకే అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులకే అర్ధంకాని పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరుతాయని రామచంద్రయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు. -
ప్రకటన చేశాక రాజధానిపై చర్చా?
* ప్రభుత్వంపై మండలిలో ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు * అల్లాఉద్దీన్ దీపం ఉంటే తప్ప హామీల అమలు సాధ్యం కాదు: సీఆర్ * కేంద్రం నిధులివ్వడానికి రాజ్యాంగ పరంగా అభ్యంతరాలు * భూములున్న ప్రాంతమైతే నిధులు మిగిలేవి: వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి సాక్షి, హైదరాబాద్ : కొత్త రాజధానిపై ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాక దానిపై చట్టసభలో చర్చించాలనడం సహేతుకంగా లేదని శాసనమండలిలో ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వ తీరును తూర్పారబట్టా యి. రాజధాని ప్రకటన సమయంలో రాష్ట్ర ప్రజ లకు సీఎం కలల ప్రపంచం చూపించారని పలువురు సభ్యులు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన వనరులను కేంద్రం అందజేయాలని కోరడంతో పాటు 8 అంశాలకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి పి. నారాయణ శాసనమండలిలో శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య (సీఆర్) మాట్లాడుతూ.. రాజధాని ప్రకటన సమయంలో చెప్పిన వాటిని పూర్తి చేయాలంటే అల్లాఉద్దీన్ అద్భుతదీపం చంద్రబాబు చేతిలో ఉంటే తప్ప సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం చేయగలిగేవి చెబితేనే బాగుంటుందని సలహా ఇచ్చారు. రైతులకు ఎకరాకు 24 సెంట్లే వస్తాయి.. తమకు అనుకూలురకు ప్రయోజనం కలిగించేందుకే విజయవాడ రాజధాని అంటూ ప్రకటించారనే విషయం ప్రభుత్వ తాజా నిర్ణయంతో తేటతెల్లమైందని వైఎస్సార్ శాసనమండలి పక్ష నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు విమర్శించారు. విజయవాడలో రాజధాని ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాకపోయినప్పటికీ, ప్రభుత్వ భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయ డం వల్ల భూ సేకరణకు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు చేయకుండా మిగుల్చుకోవచ్చన్నారు. ఆ నిధులతో రాజధానిలో ఇతర మౌలిక వసతులను సమకూర్చుకునే వీలుండేదని మండలి దృష్టికి తీసుకొచ్చారు. -
యనమల వర్సెస్ సి.రామచంద్రయ్య
-
యనమల వర్సెస్ సి.రామచంద్రయ్య
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై శాసనమండలిలో రగడ జరిగింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి, కౌన్సిల్ ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య మధ్య మంగళవారం స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. రాజధాని అంశంపై కేబినెట్లో చర్చించామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉంటుందని, సభలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారని యనమల కౌన్సిల్లో అన్నారు. దీనిపై సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాజధాని అంశంపై కౌన్సిల్లో చర్చిద్దామని ప్రభుత్వం మాటిచ్చిందని, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాగానే చర్చ చేపడదామని మంత్రి నారాయణ...కౌన్సిల్ ఛైర్మన్‌కు మాటిచ్చారని గుర్తు చేశారు. కౌన్సిల్‌కు విలువే లేదా అని ఆయన ప్రశ్నించారు. దాంతో ఈ అంశాన్ని రాద్దాంతం చేయటమేమిటని యనమల వ్యాఖ్యానించారు. దీంతో రామచంద్రయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాట మేరకు చర్చ జరపమంటే రాద్దాంతం అనడమేంటని మండిపడ్డారు. -
ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలా?
హైదరాబాద్ : రైతు రుణమాఫీ గురించి ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటన చేస్తే సరిపోదని.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ప్రభుత్వానికి సూచించారు. రైతులకు బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని.. అన్నదాతల ఆత్మహత్యలు మొదలయాయ్యని ఆయన శుక్రవారం శాసనమండలిలో ప్రస్తావించారు. తాను ప్రభుత్వంపై నిందలు వేయడానికి చెప్పడం లేదని.. వాస్తవ పరిస్థితి సభ దృష్టికి తెస్తున్నానని తెలిపారు. దేవుడి కంటే రైతే ఎక్కువ అన్న వ్యవసాయ మంత్రి పుల్లారావు వ్యాఖ్యలను రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ఎద్దు వెనుక కాదు.. శవాల వెనుక ఈ ప్రభుత్వం వస్తుందని ఆయన అన్నారు. -
'ఏం మాట్లాడారో చంద్రబాబు బయటపెట్టాలి'
కడప: రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో బయటపెట్టాలని శాసనమండలి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. అందువల్ల ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకోవడం చంద్రబాబుకు ఎంతవరకూ సమంజసం? అని రామచంద్రయ్య ప్రశ్నించారు. -
రోల్‌బ్యాక్ చంద్రబాబు హాల్‌మార్క్
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు సుష్కవాగ్దానాలని ప్రజలకు తెలుసని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. ఏపి శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయంలో ఆర్బీఐ నియమాలు హామీ ఇచ్చే ముందు తెలియాదా? అని ఆయన ప్రశ్నించారు. 94-95లో టీడీపీ ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోని విషయం ప్రజలకు తెలుసన్నారు. వాగ్దానాల్లో రోల్‌బ్యాక్ చంద్రబాబు హాల్‌మార్క్‌గా ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమను దూరం చేస్తే మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాయలసీమ ప్రజలు ఉద్యమం చేస్తే ఆపడం ఎవరి తరం కాదని కూడా ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇచ్చారని టీడీపీ సభ్యులు మర్చిపోవద్దని సి.రామచంద్రయ్య అన్న సమయంలో ఏపీ శాసనస మండలిలో టీడీపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర విభజనపై ఇరు పార్టీ సభ్యుల మద్య వాడివేడి చర్చ జరిగింది. -
'చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు'
హైదరాబాద్ : రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్‌తో చంద్రబాబు నాయుడు చెప్పించినట్లుగా ఆంధ్రప్రదేశ్ దివాలా తీయలేదని ఆయన అన్నారు. రాతియుగం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలన్నట్లుగా చూపారని రామచంద్రయ్య విమర్శించారు. గవర్నర్ ప్రసంగం దిశానిర్దేశం లేకుండా ఉందని, రుణమాపీ వంటి హామీలపై ఎలాంటి స్పష్టత లేదని రామచంద్రయ్య అన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటే వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. శాసన మండలిలో ఇతర పార్టీల ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. ప్రమాణ స్వీకారం చేయకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని టీడీపీలో చేర్చుకుని ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్ద తీసిన ఘనుడు చంద్రబాబు అని ఆయన మండిపడ్డారు. మరోవైపు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు....టీడీపీలోకి వలస వెళ్లనున్నట్లు సమాచారం. -
రాజధానిపై ముందే నిర్ణయమెందుకు?
చంద్రబాబు తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ నేత రామచంద్రయ్య హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నుంచి నివేదిక రాక ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రాజధాని ఎక్కడనే విషయంలో ఒక నిర్ణయానికి రావడమేమిటని శాసనమండలిలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సి.రామచంద్రయ్య తప్పుపట్టారు. ‘‘కేంద్రం కమిటీ వేసింది. దాని అభిప్రాయసేకరణ పూర్తికాక ముందే ఫలానా ప్రాంతంలో రాజధాని అంటూ మీ పేరుతో ప్రచారం జరగడం సరైంది కాదు’’ అని చంద్రబాబునుద్దేశించి అన్నారు. దీనివల్ల ఇప్పటికే రాజధాని అవుతుందని చెబుతున్న ప్రాంతంలో రియల్టర్లు భూముల ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచడం వల్ల సామాన్యుల ఇళ్లకు అందుబాటులో లేకుండా పోయాయని తప్పుబట్టారు. -
ఆంధ్రా ‘మండలి’ విపక్ష నేతగా సీఆర్
కాంగ్రెస్ ఎమ్మెల్సీల అభిప్రాయం మేరకే: దిగ్విజయ్ 11 మంది ఎమ్మెల్సీలతో ఢిల్లీ పెద్దల భేటీ సీఆర్ ఎంపికలో తెర వెనక చిరంజీవి ఒత్తిళ్లు! హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి (కౌన్సిల్) ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఏపీసీసీ కార్యాలయం ఇందిరాభవన్‌లో జరిగిన మండలి ప్రతిపక్ష నేత ఎంపిక కార్యక్రమం ఆద్యంతం హైడ్రామా నడిచింది. ఢిల్లీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, కుంతియా, తిరునావక్కరుసు తదితరులు సాయంత్రం 4 గంటలకు.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉమ్మడి రాష్ట్ర కౌన్సిల్లో మొత్తం 90 మంది ఎమ్మెల్సీలుండేవారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు 40 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 50 మందిగా ఎమ్మెల్సీల విభజన జరిగింది. ఈ 50 మందిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు 14 మంది ఉండగా.. వారిలో సింగం బసవపున్నయ్య, ఎ.లక్ష్మీ శివకుమారి, బాలసాలి ఇందిరలు మంగళవారం నాటి సమావేశానికి గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన 11 మంది పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరితో ఏకాంతంగా సమావేశమైన దిగ్విజయ్, వయలార్ తదితర నేతలు వారి అభిప్రాయాలు అడిగారు. ఓటింగ్ నిర్వహించాలా, సీక్రెట్ ఓటింగ్ పెట్టాలా, అందరి అభిప్రాయాలు, తీర్మానం మేరకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకు అంగీక రిస్తారా? అని కోరారు. అయితే తెలంగాణ శాసనసమండలిలో పార్టీ ఎమ్మెల్సీల అభిప్రాయల మేరకు తీర్మానం చేసి నేతను నిర్ణయించడంతో ఇక్కడా అలాగే చేయాలని మెజారిటీ సభ్యులు చెప్పటంతో.. సోనియా నిర్ణయానికి తామంతా కట్టుబడే ఉంటామని ఎమ్మెల్సీలు చేసిన తీర్మానం ప్రతిని ఢిల్లీ పెద్దలు తీసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీకి సమాచారం అందించారు. దీనిపై సోనియా నిర్ణయం కోసం అంతా దాదాపు గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. దిగ్విజయ్ ఐదు నిమిషాలకో మారు ఢిల్లీకి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సోనియా అందుబాటులోకి రాలేదు. చాలా సేపటి తరువాత ఆమె అందుబాటులోకి రావడంతో సీఆర్‌ను ఎంపిక చేసిన విషయాన్ని ఆమెకు తెలియజేసి ఆమోదం తీసుకున్నారు. అనంతరం ఏపీ శాసన మండలి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా సి.రామచంద్రయ్యను ఎంపిక చేసినట్టు దిగ్విజయ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎమ్మెల్సీల అభిప్రాయాల మేరకే సి.రామచంద్రయ్యను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఆయన ఇప్పటికే శాసనమండలి నాయకుడిగా వ్యవహరిస్తున్నందున ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకే ఆయనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశామని తెలిపారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం: సీఆర్ కాంగ్రెస్ ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఎమ్మెల్సీలంతా సహకరిస్తే కౌన్సిల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించి తమ వాణిని వినిపిస్తామని మండలి ప్రతిపక్ష నేతగా ఎంపికైన సీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను సక్రమంగా అమలుచేసేలా కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాగా, మండలిలో ప్రతిపక్ష నేతగా రుద్రరాజు పద్మరాజుకే అవకాశం ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుండగా అనూహ్యంగా రామచంద్రయ్యను ఎంపిక చేయడం వెనుక మాజీ కేంద్రమంత్రి చిరంజీవి ఒత్తిళ్లు పనిచేసినట్టు పార్టీలో బలంగా వినిపిస్తోంది. -
టీడీపీ పునాదులు బాబు పెకిలించేస్తున్నారు
మాజీ మంత్రి సి. రామచంద్రయ్య హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని చంద్రబాబునాయుడు పునాదులతో సహా పెకలించేస్తున్నారని మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. దీనిపై ఆపార్టీ శ్రేణులు అప్రమత్తం కావాలని సూచించారు. టీడీపీ శ్రేణుల్ని చంపారని, ఖూనీకోరులని విమర్శించిన వారినే ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడంపై చంద్రబాబు నుంచి వివరణ కోరాలన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో రామచంద్రయ్య మీడియాతో మాట్లాడారు. బాబు విజన్ ధనవంతులకే మేలు చేస్తుందని, ఈ విషయాన్ని గమనించే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని అన్నారు. -
కాంగ్రెస్ నేతల ఇళ్లకు టిడిపి నేతలు
హైదరాబాద్: బీజేపీతో దోస్తీ కట్టేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి ఆరాటపడుతున్నారని మంత్రులు సి.రామచంద్రయ్య, బాలరాజు విమర్శించారు. బీజేపీ సహకరిండం వల్లే విభజన జరిగిందని వారన్నారు. చంద్రబాబు సీట్ల అయోమయంలో ఉన్నారన్నారు. పదవులిస్తాం పార్టీలో చేరాలంటూ చంద్రబాబు తన పార్టీ నేతలను కాంగ్రెస్ నేతల ఇళ్లకు పంపుతున్నారని చెప్పారు. టిడిపిలో చేరాలంటూ చంద్రబాబు తన వద్దకు కూడా రాయబారం పంపారని రామచంద్రయ్య చెప్పారు. -
టిడిపిలో చేరడాన్ని ఎలా సమర్ధించుకుంటారు?
హైదరాబాద్: పార్టీ వీడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అని మంత్రి సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీ టిడిపి అని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి విభజనకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పారు.విభజన విషయంలో అతనికి పెద్దగా అభ్యంతరాలు లేవన్నారు. -
'ఢిల్లీలో కిరణ్ దీక్షపై నిర్ణయం తీసుకోలేదు'
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేపట్టే అంశంపై ఇంకా నిర్ణయానికి రాలేదని, పరిశీలనలో ఉందని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ ముగిసింది. భేటీ అనంతరం రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును తిరస్కరించాలన్న తీర్మానం నెగ్గిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఈనెల 4,5వ తేదీల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన చెప్పారు. తమకు మద్దతుగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను కూడా ఢిల్లీకి ఆహ్వానిస్తామని రామచంద్రయ్య తెలిపారు. -
శాసనమండలిలో హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో గురువారం హైడ్రామా చోటు చేసుకుంది. సభ్యులు ఎవరేమంటున్నారో తెలియని గందరగోళ వాతావరణంలోనే.. రాష్ట్రపతి పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2013పై చర్చ ముగిసిందని, సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి నివేదిస్తామని చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. ఈ బిల్లును తిరస్కరించాలంటూ సభా నాయకుడు సి.రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు తెలిపారు. కీలకమైన ఈ రెండు అంశాలకు సంబంధించిన ప్రకటన రెండే నిమిషాల్లో పూర్తికావడం గమనార్హం. ఉదయం సభ ప్రారంభం కాగానే ఇరుప్రాంతాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో వారుుదాల పర్వం కొనసాగింది. రెండుసార్లు వాయిదా అనంతరం 12.40కి మరోమారు సభ ఆరంభం కాగానే ‘రాష్ట్రపతి పంపిన బిల్లుపై గడువు నేటితో ముగుస్తుంది. అందువల్ల చర్చకు ముగింపు పలకాల్సిన అవసరముంది. చర్చలో 54 మంది సభ్యులు పాల్గొన్నారు. 33.19 గంటలు చర్చ సాగింది. సభ్యులంతా వారి అభిప్రాయాలను రాతపూర్వకంగా అందజేశారు. అవన్నీ అధికారిక రికార్డుల్లో భాగమే. బిల్లులోని క్లాజులపై సభ్యులిచ్చిన 1,157 సవరణలను కూడా అధికారిక రికార్డుల్లో భాగంగా చేర్చాం. వీటిని సభ అభిప్రాయాలుగా రాష్ట్రపతికి నివేదిస్తాం’ అని చైర్మన్ చక్రపాణి ప్రకటించారు. ‘సభా నాయకుడు సి.రామచంద్రయ్య ఇచ్చిన ప్రభుత్వ తీర్మానంతోపాటు మరో అనధికారిక తీర్మానం అందింది. వాటి ప్రతులను సభ్యులకు అందజేశాం. రామచంద్రయ్య ఇచ్చిన తీర్మానం ప్రస్తుతం సభ ముందు ఉంది..’ అంటూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత సభ్యుల అరుపులు, కేకల మధ్య ప్రభుత్వ తీర్మానం మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందినట్లు చక్రపాణి ప్రకటిస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శాసనమండలి నివాళులర్పించింది. -
అసెంబ్లీలో రాయలతెలంగాణపై కూడా చర్చ
హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) చర్చకు రానున్న నేపధ్యంలో రాయల తెలంగాణ అంశం కూడా చర్చించే అవకాశం ఉంది. హొటల్ సెంట్రల్ కోర్టులో ఈ సాయంత్రం రాయలసీమ కాంగ్రెస్ శాసనసభ్యులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని మంత్రి సి.రామచంద్రయ్య రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరారు. ఈ సమావేశంలో రాయలతెలంగాణపై చర్చిస్తారు.