* ప్రభుత్వంపై మండలిలో ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు
* అల్లాఉద్దీన్ దీపం ఉంటే తప్ప హామీల అమలు సాధ్యం కాదు: సీఆర్
* కేంద్రం నిధులివ్వడానికి రాజ్యాంగ పరంగా అభ్యంతరాలు
* భూములున్న ప్రాంతమైతే నిధులు మిగిలేవి: వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కొత్త రాజధానిపై ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాక దానిపై చట్టసభలో చర్చించాలనడం సహేతుకంగా లేదని శాసనమండలిలో ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వ తీరును తూర్పారబట్టా యి. రాజధాని ప్రకటన సమయంలో రాష్ట్ర ప్రజ లకు సీఎం కలల ప్రపంచం చూపించారని పలువురు సభ్యులు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి కావాల్సిన వనరులను కేంద్రం అందజేయాలని కోరడంతో పాటు 8 అంశాలకు సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి పి. నారాయణ శాసనమండలిలో శుక్రవారం ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన చర్చలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సి.రామచంద్రయ్య (సీఆర్) మాట్లాడుతూ.. రాజధాని ప్రకటన సమయంలో చెప్పిన వాటిని పూర్తి చేయాలంటే అల్లాఉద్దీన్ అద్భుతదీపం చంద్రబాబు చేతిలో ఉంటే తప్ప సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం చేయగలిగేవి చెబితేనే బాగుంటుందని సలహా ఇచ్చారు.
రైతులకు ఎకరాకు 24 సెంట్లే వస్తాయి..
తమకు అనుకూలురకు ప్రయోజనం కలిగించేందుకే విజయవాడ రాజధాని అంటూ ప్రకటించారనే విషయం ప్రభుత్వ తాజా నిర్ణయంతో తేటతెల్లమైందని వైఎస్సార్ శాసనమండలి పక్ష నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు విమర్శించారు. విజయవాడలో రాజధాని ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాకపోయినప్పటికీ, ప్రభుత్వ భూములున్న చోట రాజధాని ఏర్పాటు చేయ డం వల్ల భూ సేకరణకు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఖర్చు చేయకుండా మిగుల్చుకోవచ్చన్నారు. ఆ నిధులతో రాజధానిలో ఇతర మౌలిక వసతులను సమకూర్చుకునే వీలుండేదని మండలి దృష్టికి తీసుకొచ్చారు.
ప్రకటన చేశాక రాజధానిపై చర్చా?
Published Sat, Sep 6 2014 2:26 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM
Advertisement
Advertisement