
సాక్షి, అమరావతి: ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.
ఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఆక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ. హోం స్పెషల్ సెక్రటరీ జి.విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీజిపీ ఆఫీస్ డీఐజీ మోహనరావు.. సెంట్రల్ డిప్యూటేషన్‌లో ఉన్న ఆకే రవికృష్ణ, జయలక్ష్మి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment