dig
-
డీఐజీ వికృత చేష్టలు.. వీడియో వైరల్!
సాక్షి, గుంటూరు: తాను సమాజంలో బాధత్య గల స్థాయిలో ఉన్నాననే విషయం ఆయన మరిచిపోయారు. భార్యను శారీరంగా హింసించారు. అంతేకాదు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని కట్టుకున్న ఇల్లాలినే మానసికంగా వేధించారు. విసిగిపోయిన ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ వికృత చేష్టలు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరు పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లూరి అనుసూయా రాణి, భారత్ పేటకు చెందిన వీర్నపు కిరణ్ ఇద్దరు గతంలో పాలకొల్లు ఎల్ఐసీ శాఖలో అసిస్టెంట్లుగా పని చేశారు. 1998 డిసెంబర్లో గుంటూరు శారదాకాలనీ చర్చిలో వీళ్ల వివాహం జరిగింది. అయితే ఈ జంటకు సంతానం కలగకపోవడంతో.. 2002లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఈలోపు.. 2009లో కిరణ్‌కుమార్‌కు విజయనగరంలోని రిజిస్ట్రార్‌గా ఉద్యోగం వచ్చింది. ఆపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 2018లో డీఐజీగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి భర్త కిరణ్‌కుమార్ వికృత చేష్టలను ఆమె చూడసాగింది. ప్రస్తుతం అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసి భర్త కిరణ్ కుమార్ బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసి ఇచ్చారు. అయితే అనసూయ శనివారం విజయవాడలోని ఓ శుభకార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆమెను చూసి కిరణ్ రగిలిపోయారు. బాబు సంరక్షణ విషయంలో గొడవ జరిగి ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. ఆస్పత్రి నుంచి తన పుట్టింటికి వెళ్తున్న ఆమెపై మళ్లీ దాడికి యత్నించాడు. దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు. -
నాడు సస్పెండ్.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్ కృష్ణ?
ఉత్తరప్రదేశ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఈ మేళాకు లక్షలాదిమంది తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో పటిష్టమైన భద్రత అవవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న యూపీ సర్కారు మహాకుంభమేళా భద్రతా బాధ్యతలను ఓ ఐపీఎస్ అధికారికి అప్పగించింది. ఈయన గతంలోనూ పలుమార్లు వార్తల ప్రధానాంశాల్లో కనిపించారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకే ఈ కీలక భాధ్యతలు ఎందుకు అప్పగించారు?ఐపీఎస్ వైభవ్ కృష్ణ(IPS Vaibhav Krishna).. ఈయన అజంగఢ్ డీఐజీ. ఇప్పుడు ఇతనిని ప్రభుత్వం మహాకుంభ్ డీఐజీగా నియమించింది. uppolice.gov.in వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వైభవ్ కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ నివాసి. ఆయన 1983 డిసెంబర్ 12న జన్మించారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వైభవ్‌కృష్ణ 2021, డిసెంబర్ 20న పోలీసుశాఖలో ప్రవేశించారు.వైభవ్ కృష్ణ మొదటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవారు. 12వ తరగతి తర్వాత ఐఐటీలో అడ్మిషన్ దక్కించుకున్నారు. ఐఐటీ రూర్కీ(IIT Roorkee)లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2009లో తొలిసారిగా యూపీఎస్సీ పరీక్షకు హాజరై 86వ ర్యాంక్ సాధించారు. ఈ నేపధ్యంలోనే వైభవ్‌కృష్ణ యూపీ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.ఐపీఎస్ వైభవ్ కృష్ణ తన ఉద్యోగ జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. 2020 జనవరి 9న నోయిడాలో ఎస్ఎస్పీగా ఉన్నప్పుడు వైభవ్ కృష్ణ ఒక కేసులో సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత 2021, మార్చి 5న తిరిగి ఉద్యోగంలో నియమితులయ్యారు. మూడు నెలల తరువాత ఆయనకు లక్నోలోని పోలీస్ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ(Police Training and Security) సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.అనంతరం 2012 జూన్‌లో ఐపీఎస్ వైభవ్ కృష్ణ అజంగఢ్ జోన్ డీఐజీగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన బల్లియాలో రైడ్ నిర్వహించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్నతాధికారులు 18 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇటీవల యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఐపీఎస్ వైభవ్ కృష్ణకు మహాకుంభమేళా బాధ్యతలు అప్పగించారు.ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే.. -
Uttar Pradesh: మట్టిలో కూరుకుని నలుగురు మహిళలు దుర్మరణం
కాస్గంజ్: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్లోని కస్బా మోహన్పురా గ్రామంలోని కొందరు మహిళలు మట్టిని తవ్వేందుకు వెళ్లారు. ఆ సమయంలో మట్టిలో కూరుకుపోయి ముగ్గురు మహిళలు, ఒక బాలిక మృతిచెందారు.ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మహిళలు మట్టిలో కూరుకుపోయారని స్థానికులు అంటున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.ఘటనా స్థలంలో కాస్గంజ్ జిల్లా అధికారి మేధా రూపమ్, ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ ఉన్నారు. వీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మట్టిని తవ్వేందుకు వెళ్లిన ప్రత్యక్ష సాక్షి, గాయపడిన మహిళ హేమలత మీడియాతో మాట్లాడుతూ దేవతాన్ పండుగ సందర్భంగా కాటోర్ రాంపూర్‌లోని మహిళలు తమ ఇంటిలోని పొయ్యిలకు రంగులు వేయడానికి పసుపు మట్టిని తవ్వడానికి వెళ్లారన్నారు.ఈ సమయంలో ఒక్కసారిగా పైనుంచి భారీగా మట్టి పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన, ఘటనాస్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..! -
ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఆక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ. హోం స్పెషల్ సెక్రటరీ జి.విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీజిపీ ఆఫీస్ డీఐజీ మోహనరావు.. సెంట్రల్ డిప్యూటేషన్‌లో ఉన్న ఆకే రవికృష్ణ, జయలక్ష్మి ఉన్నారు. -
"పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!
క్రికెట్ ప్రంచకప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మాదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోదీ రావడం వల్లే భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్నట్లుగా మాట్లాడారు. ఈ మేరకు రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లో జరిగిన ప్రచార ర్యాలీ మోదీని 'దురదృష్టం'తో పోలుస్తే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అంటే "పనౌటీ మోదీ" అని అన్నారంటూ దూమారం రేగింది. అంతేగాదు ఆ బహిరంగ ర్యాలీలో మోదీని అదాని పారశ్రామికవేత్తగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పనౌటి అనే పదం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌గా అవుతోంది. ఐతే ఈ పనైటి పదానిక అర్థం.. ఏవ్యక్తి మన వద్దకు వస్తే అవ్వాల్సిన పనులు ఆగిపోవడం లేదా జరగకపోవడం వంటివి జరిగినప్పుడూ ప్రయోగిస్తారు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిపై "పనౌటి" అనే పదాన్ని ప్రయోగించడంతో రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది బీజేపి. పైగా రాహుల్ ఆ ప్రచార ర్యాలీలో మోదీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి హిందూ-ముస్లీం అని జపిస్తుంటారు. ఆయన మిలినియర్ల రుణాలను మాఫీ చేసి మంచి ప్రయోజనాలు అందిస్తుంటారని విమర్శలు గుప్పించారు. पनौती 😉 pic.twitter.com/kVTgt0ZCTs — Congress (@INCIndia) November 21, 2023 దీంతో ఒక్కసారిగా రాహుల్‌పై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తి చేసింది. ఈ మేరకు బీజేపీ లోక్‌సభ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ..రాహుల్‌గాంధీ ప్రధానిని ఉద్దేశించి ఇలాంటి పదాన్ని ఎలా ప్రయోగించగలిగారంటూ నిలదీశారు. తక్షణమే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మీనాకాశి లేఖి కూడా రియాక్ట్ అయ్యారు. ఒక ప్రధానిపై అలాంటి పదాన్ని ఉపయోగించగలిగారంటే.. రాహుల్ ఎలాంటి వ్యక్తి అనేది స్పష్టంగా తెలుస్తోందన్నారు. VIDEO | "If Rahul Gandhi has used a word like 'panauti', then it reflects what kind of person he is. Using such words for PM, who is working continuously for the country, is not acceptable and the entire country is watching this," says Union MoS @M_Lekhi on Rahul Gandhi's remark… pic.twitter.com/SfI8ASwtrt — Press Trust of India (@PTI_News) November 21, 2023 ఇలాంటి పదాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యమైనవి కావు. యావత్తు దేశం మిమ్మల్ని చూస్తోంది. నిరంతరం దేశం కోసం పనిచేసే ఓ వ్యక్తిపై ఇలా నిందలు వేయడం సబబు కాదని హితవు పలికారు. అలాగే లోక్‌సభ ఎంపీ రవి శకంర్ ప్రసాద్ కూడా రాహుల్ మీకు ఏమైంది? ఆ రోజు క్రీడాకారులను కలిసి వారిలో స్థైర్యాన్ని పెంచే యత్నం చేసిన అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదాన్ని ప్రయోగిస్తారా? అంటూ తిట్టిపోశారు. మీరు చరిత్ర నుంచి నేర్చుకోవాల్సి చాలా ఉందని రాహుల్‌కి చురకలంటించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆరోపణల స్ట్రాటజీ వర్సెస్ గ్యారంటీల గేమ్? రాష్ట్ర ఎన్నికల చరిత్ర చెబుతోంది ఇదే! -
ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.. జైళ్ల శాఖ డీఐజీ
నల్లగొండ క్రైం: సమాజానికి తోడ్పాటునిచ్చేలా జైళ్లలో ఉన్న ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన నల్లగొండలోని జిల్లా జైల్‌ను సందర్శిం చారు. ఈ సందర్భంగా జైల్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ జైలు నుంచి విడుదలైన తర్వాత మంచి పౌరులుగా మారి సమాజంలో గౌరంగా జీవనం సాగించాలని కోరారు. కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ దేవ్లానాయక్, జైలర్ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ శోభన్‌బాబు, రామలింగం పాల్గొన్నారు. -
ముడుపులు అందజేసి నచ్చిన చోట పోస్టింగ్..
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 స్థాయిలో బది‘లీలలు’ జరిగాయి. పదేండ్లకు పైబడి ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం కల్పించేందుకు చేపట్టిన బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో నచ్చిన దగ్గర పోస్టింగ్ పొందినట్లు రిజిస్ట్రేషన్ శాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులను బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ నవీన్ మిత్తల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీఐజీగా – ఎం.సుభాషిణి మహబూబాబాద్–తస్లీమా మహమ్మద్ జనగామ–టి.సంపత్‌కుమార్ వరంగల్ రూరల్–మసీయుద్దీన్ వరంగల్ ఫోర్ట్– ఏ.కార్తీక్ వరంగల్ ఆర్వో–ఎండీ.అమ్జద్ అలీ నర్సంపేట– రామ కిశోర్ రెడ్డి డీఐజీ కార్యాలయం–డి.సుజాత ఎట్టకేలకు కదిలారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏండ్లుగా లాంగ్ స్టాండింగ్‌లో విధులు కొనసాగిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు ఎట్టకేలకు బుధవారం వెలువడిన బదిలీలతో కదిలారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దాటని సబ్రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాంగ్‌స్టాండింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులు మల్టీ జోన్–1లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారుల అండతో ఉమ్మడి వరంగల్ జిల్లా దాటకుండా తాము ఎంచుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోస్టింగ్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గ్రేడ్–1,గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు మ్యూచువల్‌ను తలపించాయి. వరంగల్ ఆర్వోలో విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్ జనగామ, జనగామలో విధులు నిర్వహిస్తున్న అమ్జద్అలీ వరంగల్ ఆర్వో, ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహబూబాబాద్, వరంగల్ ఫోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న మసీయుద్దీన్ వరంగల్ రూరల్, వరంగల్ రూరల్‌లో విధులు నిర్వహిస్తున్న సుజాత డీఐజీ కార్యాలయానికి , నర్సంపేటలో విధులు నిర్వహిస్తున్న కార్తీక్ వరంగల్ రూరల్‌కు కేటాయించారు. ఈ విధంగా ఏ అధికారి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా దాటలేదు. చక్రం తిప్పిన ఉద్యోగ సంఘాల నాయకులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు చక్రం తిప్పి ఉమ్మడి వరంగల్ దాటకుండా అడ్డుపడ్డారని తెలుస్తోందని పలువురు పేర్కొన్నారు. భారీగా బదీలీలు జరుగుతాయనే సమచారంతో లాంగ్ స్టాండింగ్ గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు లాంగ్ లీవ్ పెట్టి హైదరాబాద్‌కు మకాం మార్చి ఉన్నతాధికారుల అధికారుల ఆశీర్వాదం కోసం ఉద్యోగ సంఘాల నేతలతో జతకట్టారు. -
'మా సార్‌కు అమ్మాయిలు తక్కువా..?' రాహుల్ ఫ్లయింగ్ కిస్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే..
ఢిల్లీ: పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ ఈ అంశంపై మాట్లాడటం రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే రాహుల్‌కు అమ్మాయిల కొరత ఏం లేదు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ మాట్లాడటంపై బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో సభ నుంచి వాకౌట్ చేస్తున్న క్రమంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో పార్లమెంట్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. అయితే.. రాహుల్ చర్యను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. తమను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో బీజేపీ వర్గాలు మండిపడ్డాయి. మహిళా ఎంపీలను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ చర్య మహిళలపై కాంగ్రెస్ ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలపై బిహార్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు నీతు సింగ్ తాజాగా స్పందించారు. If Rahul Gandhi wants to give flying kiss he has many women available He won’t give it to a 50 year old budhiya Congress MLA from Bihar : Neetu Singh Anti women Congress can even defend Rahul’s misdemeanours inside the House pic.twitter.com/oXRz67ZqlX — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 10, 2023 నీతు సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే.. యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలకు ఇస్తాడు.. కానీ ఆ 50 ఏళ్ల మహిళకు ఎందుకు ఇస్తాడని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి మాట్లాడారు. రాహుల్‌పై ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి అన్ని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. యాంటీ మహిళా కాంగ్రెస్ రాహల్ చర్యను సమర్థిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: బ్రిటీష్ కాలం చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు -
డీఐజీ మృతి కేసులో 8 మందికి సమన్లు
సాక్షి, చైన్నె: తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడిన కోయంబత్తూరు రేంజ్ డీఐజీ విజయకుమార్(45) మృతిపై 8 మందిని విచారించేందుకు పోలీసులు నిర్ణయించారు. కోయంబత్తూరు రామనాథపురం స్టేషన్లో జరిగే ఈ విచారణకు హాజరుకావాలని వీరికి ఆదివారం సమన్లు అందాయ. వివరాలు.. కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా ఈ ఏడాది జనవరిలో ఐపీఎస్ అధికారి విజయకుమార్(45) పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన రేస్ కోర్సులోని క్యాంప్ కార్యాలయంలో ఆయన తన భద్రతా సిబ్బంది రవి వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ఆరోపణలు బయలు దేరాయి. అయితే ఆయన తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా బలన్మరణానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. అయితే, సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు, ప్రత్యక్షంగా మరికొందరు ఈ వ్యవహారంపై అనుమానాలు, ఆరోపణలు గుప్పించారు. ఈ పరిస్థితులలో కేసును విచారిస్తున్న కోయంబత్తూరు రామనాథపురం పోలీసులు అనుమానాలు, ఆరోపణలు గుప్పించిన వారిని విచారించేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతగా ఎనిమిది మందికి సమన్లు జారీ చేశారు. వీరు మంగళవారం తగిన ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. -
డీఐజీ ఆత్మహత్య : ఆ మానసిక ఒత్తిడి కారణాలు ఏమిటో అంతుచిక్కడం లేదు..
తీవ్ర మానసికఒత్తిడికి లోనైన కోయంబత్తూరు రేంజ్ డీఐజీ విజయకుమార్(45) శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ తీసుకుని తనకు తాను కాల్చుకుని మృత్యుఒడిలోకి చేరారు. ఈ సమాచారం పోలీసు యంత్రాంగాన్ని షాక్‌కు గురిచేసింది. డీజీపీ శంకర్ జివ్వాల్, ఏడీజీపీ అరుణ్ హుటాహుటిన కోయంబత్తూరుకు చేరుకున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సీఎం స్టాలిన్ తన సానుభూతి తెలియజేశారు. అధికార లాంఛనాలతో స్వస్థలం తేనిలో విజయకుమార్ భౌతికకాయానికి సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. సాక్షి, చైన్నె: కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా ఈ ఏడాది జనవరిలో ఐపీఎస్ అధికారి విజయకుమార్(45) పదోన్నతి పొందారు. ఆయనకు భార్య గీతావాణి, కుమార్తె నందిత ఉన్నారు. రేస్‌కోర్సు రోడ్డులోని క్యాంప్ కార్యాలయం క్వార్టర్స్‌లో నివాసం ఉన్నారు. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి వచ్చిన ఆయన సరిగ్గా 6.45 గంటల సమయంలో తన భద్రతా సిబ్బంది రవి వద్ద ఉన్న తుపాకీ తీసుకున్నారు. తన కణత కుడివైపుగా భాగంలో తుపాకీతో కాల్చుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది కలవరం చెందారు. క్యాంప్ కార్యాలయంలో ఉన్న వాళ్లంతా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కోయంబత్తూరు కమిషనర్ బాలకృష్ణన్, ఎస్పీ బద్రినారాయణన్, ఐజీ సుధాకర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మానసిక ఒత్తిడికి కారణం ఏమిటో... తుపాకీతో కాల్చుకుని డీఐజీ మరణించిన సమాచారంతో డీజీపీ శంకర్జివ్వాల్తోపాటు పోలీసు యంత్రాంగమే షాక్‌కు గురైంది. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ అరుణ్ నేతృత్వంలోని విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం కోయంబత్తూరుకు చేరుకుని విచారణ చేపట్టింది. గత కొంతకాలంగా విజయకుమార్ తీవ్ర మానసికఒత్తిడితో ఉన్నట్టు, ఆయన కౌన్సెలింగ్ తీసుకున్నట్టు తేలింది. రాత్రుల్లో నిద్రలేమి కారణంగా మాత్రలను వాడుతూ వచ్చినట్టు గుర్తించారు. గురువారం ఐజీ సుధాకర్, ఎస్పీ బద్రినారాయణన్తో కూడా విజయకుమార్ మాట్లాడినట్టు, ఓ సిబ్బంది కుమార్తె బర్త్‌డే వేడుకకు వెళ్లి వచ్చినట్టు తెలిసింది. ఈ బర్త్‌డేలో ఆయన మౌనంగా కనిపించినట్టు సహచర సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే, ఈ మానసికఒత్తిడి పనిభారంతో మాత్రం కాదన్నది విచారణలో వెలుగు చూసింది. ఇక, తన సామాజిక మాధ్యమంలో చివరగా ఓ వీడియోను పోస్టు చేసి ఉండడం వెలుగు చూసింది. ఇందులో ఈ ప్రపంచం ఓ మాయ.. కోల్పోయేందుకు ఏమీ లేదన్న ఆధ్యాత్మిక వచనాలు చేసి ఉండడం గమనార్హం. అలాగే, విజయకుమార్ సతీమణి గీతావాణిని కమిషనర్ బాలకృష్ణన్ విచారించి, వివరాలను సేకరించారు. రెండేళ్లుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, వైద్యుల వద్ద చికిత్స కూడా తీసుకుంటూ, కౌన్సెలింగ్‌కు వెళ్తున్నారని ఆయన భద్రతా సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే, విజయకుమార్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి దారితీసిన ఆ మానసిక ఒత్తిడి కారణాలు ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇదే అంశాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పలు పార్టీల నేతలు ప్రస్తావిస్తూ సమగ్ర విచారణ జరగాలని పట్టుబట్టారు. ఏడీజీపీ అరుణ్ మీడియాతో మాట్లాడుతూ విజయకుమార్ పనిభారంతో బలన్మరణానికి పాల్పడ లేదని, మానసిక ఒత్తిడికి లోనయ్యారని, దీనిని రాజకీయం చేయొద్దని అని విజ్ఞప్తి చేశారు. అంత్యక్రియలు.. విజయకుమార్ బలన్మరణ సమాచారంతో రాష్ట్ర గవర్నరన్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఆయన భౌతికకాయాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలం తేని జిల్లా బోడినాయకనూరు సమీపంలోని అనైకారపట్టి గ్రామానికి తీసుకెళ్లారు. మంత్రి ఐ పెరియస్వామి, డీజీపీ శంకర్ జివ్వాల్‌తో పాటు పోలీసు బాసులు, అధికారులు నివాళులర్పించారు. విజయకుమార్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన భౌతికకాయాన్ని డీజీపీతో సహా పోలీసు అధికారులు మోశారు. విజయకుమార్ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. టీఎన్పీఎస్సీ టూ యూపీఎస్సీ.. తేని జిల్లా బోడి నాయకనూరు సమీపంలోని అనైకారపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ వీఏఓ చెల్లయ్య, రిటైర్డ్ టీచర్ రాజాత్తిల కుమారుడు విజయకుమార్. 2003లో టీఎన్పీఎస్సీ ద్వారా గ్రూప్–1 ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పదవి దక్కించుకున్నారు. ఆ సమయంలోనే ఆయనకు వివాహం జరిగింది. ఐపీఎస్ కావాలన్న లక్ష్యంతో యూపీఎస్సీ పరీక్ష రాసి కలను సాకారం చేసుకున్నారు. 2009 ఐపీఎస్ బ్యాచ్ అధికారిగా తమిళనాడులోని కడలూరు, కాంచీపురం, తిరువారూర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. విధి నిర్వహణలో నిజాయితీతో పాటు సహచర, కింది స్థాయి సిబ్బందితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చైన్నె అన్నానగర్ డీసీపీగా కూడా పనిచేశారు. ఇటీవలనే డీఐజీగా పదోన్నతి పొందిన ఆయన కోయంబత్తూరుకు వెళ్లారు. తన కుమార్తెను కూడా ఐపీఎస్ చేయాలన్న కాంక్షతో ఉన్న విజయకుమార్‌ను మానసికఒత్తిడి బలి కొనడం సహచరులు జీర్ణించుకోలేకున్నారు. -
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని కోయంబత్తూరుకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫోలీస్ (డీఐజీ) విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూరులోని డీఐజీ అధికారిక నివాసంలో శుక్రవారం ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గల కారణలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా 45 ఏళ్ల విజయ్ కుమార్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్‌లోని క్వార్టర్స్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పేలిన శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది.. వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయకుమార్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతన్ని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. చదవండి: గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు కాగా విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా(ఎస్పీ) అన్నానగర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. డీఐజీ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రిత్వ శాఖ అధిపతి అయిన సీఎం.. ట్విటర్లో స్పందిస్తూ ‘ పోలీస్ అధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యాను. ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించింది. జిల్లా ఎస్పీతోపాటు హా వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టం. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’అని పేర్కొన్నారు. ఉన్నది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..
తల్లి కష్టం చూసి చలించిపోయి 14 ఏళ్ల బాలుడు భగీరథుడిలా శ్రమించి.. నీటిని రప్పించాడు. ఆ ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఎండాకాలం వచ్చేటప్పటికీ నీటి సంక్షోభంతో అల్లాడుతుంటుంది. అలాంటి చోట తన తల్లి పడుతున్న నీటి కష్టాన్ని దూరం చేయాలని ఓ బాలుడు సంకల్పించాడు. అనుకున్నది సాధించి ఆ ప్రాంతంలో సెలబ్రెటీగా మారిపోయాడు. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని కెల్వె గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణవ్ అనే బాలుడు తన తల్లి కోసం వయసుకు మించిన సాహసం చేశాడు. అతను చేసిన పనితో ఒక్కసారిగా తన ఊరిలో హీరోగా మారిపోయాడు. ప్రణవ్ తల్లి దర్శన నీటి కోసం రోజు ఎంతో ప్రయాస పడి నది వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఈ కష్టాన్ని ఎలాగైనా తీర్చాలని నిర్ణయిచుకున్నాడు. అనుకున్నదే తడువుగా బావి ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అందుకోసం భూమిని తవ్వడం ప్రారంభించాడు. రోజుకి కేవలం 15 నిమిషాలు మాత్రమే భోజనానికి బ్రేక్ తీసుకునేవాడని ప్రణవ్ తండ్రి వినాయక్ చెబుతున్నాడు. తాను ఒక్కడినే తన కొడుకు సాయం చేసేవాడినని, ప్రణవ్ తవ్వుతుంటే రాళ్లను తొలగించడం వంటివి చేసేవాడినని చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు ప్రణవ్ ప్రయత్నం చూసి గంగమ్మ రకలేసుకుంటూ భూమి నుంచి ఉబికి వచ్చింది. ఇక ప్రణవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తం ఐదు రోజుల్లో పని పూర్తి చేశాడు ప్రణవ్. ఇక మా అమ్మ రోజు ఉదయం నీళ్ల కోసం బకెట్లు, బిందెలతో అంతదూరం నుంచి నీళ్లు తీసుకురావాల్సిన కష్టం తప్పిందని ప్రణవ్ సంబరంగా చెప్పాడు. తల్లి కోసం ఓ బాలుడు బావిని తవ్వాడన్న విషయం గ్రామమంతా దావానంలా వ్యాపించడంతో.. ఆ ఊరి ప్రజలు, ప్రణవ్ స్నేహితులు ఆ బావిని చూసేందుకు తండోపతండాలు తరలి వచ్చారు. బావిని చూసేందుకు తన టీచర్ స్వయంగా తన ఇల్లుని వెతుక్కుంటూ వచ్చినట్లు ఆనందంగా చెబుతున్నాడు ప్రణవ్. అంతేగాదు ప్రణవ్ పడిన కష్టాన్ని వివరించేలా బావి వద్ద బోర్డుని కూడా ఏర్పాటు చేశారు అతని స్నేహితులు. వాస్తవానికి మహారాష్ట్రాలోని ఓ మారుమూల ప్రాంతమైన కెల్వె గ్రామం సరైన నీటి వసుతులు లేవు. ఆ గ్రామంలోని ప్రజలందరికీ సమీపంలో ఉన్న నదే ఆధారం. మిగతా మహిళల తోపాటు తన తల్లి పడుతున్న కష్టమే ప్రణవ్‌ని ఈ సాహసానికి పురిగొల్పింది. కాగా, అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #WATCH | Palghar, Maharashtra: Distressed upon seeing his mother walk every day in the sun to fetch water for the house, 14-year-old Pranav Salkar dug a well in his front yard with the help of his father. The family lives in Dhavange Pada near Kelve. Pranav's parents, Darshana… pic.twitter.com/H5WzkbzGIs — ANI (@ANI) May 23, 2023 (చదవండి: 'మా స్టాండ్‌ని వదిలిపెట్టం'! అందుకు మూల్యం చెల్లించేందుకు రెడీ: శరద్ పవార్) -
భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారం జరుగుతున్న దాడి!: ధన్‌ఖడ్
భారతదేశ సమగ్రతపై పక్కా ప్లాన్ ప్రకారమే తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోందని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హెచ్చరించారు. గ్లోబెల్స్ ప్రచారం కూడా చిన్నబోయేలా ఈ దాడి జరుగుతోందన్నారు. ఈమేరకు ఆయన ఓ వార్త సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రైజింగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుధ్దాన్ని పక్షపాత ధోరణితో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డుకోవాలని చూడటం దురదృష్టకరం అన్నారు. అవినీతి అంశాన్ని ఎలా రాజకీయ కోణంలో చూడగలమని ప్రశ్నించారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తమను టార్గెట్ చేస్తుందంటూ.. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలోనే ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ న్యాయవ్యవస్థ పట్ల గర్విస్తోందని అన్నారు. ఎవరికైనా పరువు నష్టం వాటిల్లందంటే తక్షణమే ఉపశమనం పొంది, న్యాయం చేకూరేలా చేసే సుప్రీం కోర్టులాంటి న్యాయవస్వయస్థ ఎక్కడ లభిస్తోందన్నారు. అయినా ఈ అంశంపై మాకు పాఠాలు చెప్పడానికి ప్రపంచంలో ఎవరికీ చట్టబద్ధత గానీ అందుకు సంబంధించి సాక్ష్యాధారాలు గానీ వారి వద్ద లేవని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీపై విధించిన అనర్హత వేటును గమనిస్తున్నాం అని జర్మని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ధన్ఖర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతేగాదు తన ప్రసంగంలో భారతదేశ సమగ్రతపై పథకం ప్రకారమే దాడి జరుగుతోందని, అందుకోసం దేశం లోపల, వెలుపల కొన్ని దుష్ట శక్తుల పనిచేస్తున్నాయన్నారు. అంతేగాదు భారతదేశ వృద్ధిని కుంటిపరిచే ఒక వ్యవస్థ మొత్తం పనిచేస్తోందని ఆరోపించారు. ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఇతర దేశాల్లో తన సొంత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారా అని విరుచుకుపడ్డారు. ఇలాంటి వాటికి ప్రజలు కచ్చితం అడ్డుకట్ట వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ధన్‌ఖడ్. (చదవండి: పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని) -
మోదీజీ ఆ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్ పంచ్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ఆస్కార వేడుకల్లో భారత్ సాధించిన కీర్తిని గురించి కొనియాడారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ.. ఈ గెలుపు భారతదేశానికి గర్వకారణమని అన్నారు. అలాగే విజేతలు దక్షిణ బారతదేశానికి చెందిన వారంటూ హెలెట్ చేస్తూ చెప్పారు. ఐతే ఆర్ఆర్ఆర్ నుంచి నాటునాటు పాట, చిన్న డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖర్గే మాట్లాడుతూ... దీనికి మేము చాలా గర్వపడుతున్నాం కానీ నాదోక అభ్యర్థన అంటూ ఒక సైటిరికల్ పంచ్ విసిరారు. మోదీజీ దయచేసి ఈ ఆస్కార్ క్రెడిట్‌ని తీసుకోకండి అలా చేయకూడదు అన్నారు. మోదీ తన గెలుపు కోసం.. మేమే దర్శకత్వం వహించాం, మేము రాశాం, అని చెప్పకూడదు ఇదే నా అభ్యర్థన అని ఖర్గే అన్నారు. అంతే ఒక్కసారిగా రాజ్యసభలో నవ్వులు విరబూశాయి. ఖర్గే వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యుల నుంచే కాకుండా ట్రెజరీ బెంచ్ నుంచి కూడా నవ్వులు విరిశాయి. ఈ మేరకు రాజసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, సభా నాయకుడు పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవియా, కార్మిక మంత్రి భూపేందర్ యదవ్ తదితరులందరూ నవ్వుతూ కనిపించారు. ఇదిలా ఉండగా, పియూష్ గోయల్ రాజసభ నామినేషన్ల గురించి ఆస్కార్ ఫర్ ప్రధానమంత్రి కార్యాలయం అనే పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అదికాస్తా ప్రధాన మంత్రి ఎంపిక ద్వారా రాజ్యసభ్యకు నామినేట్ అయిన వ్యక్తులకే ఆస్కార్ అవార్డు వచ్చిందన్నట్లు ఉండటంతో ఖర్గే ఇలా సైటరికల్‌గా వ్యాఖ్యానించారు. గోయల్ ఆ పోస్ట్‌లో విభిన్న రంగాల్లో విశేషమైన కృషి చేసిన వ్యక్తులను ఎంపిక చేసి మరీ రాజ్యసభకు నామినేట్ చేయడంలో మోదీ తనదైన ముద్ర వేశారని అన్నారు. అంతేగాదు 2022లో ఎగువ సభకు నామినేట్ అయిన వారిలో ఆర్ఆర్ స్క్రిప్ట్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారని ఆయన్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. Oscar winning 'RRR' and The Elephant Whisperes' are India's contributions to the world. We request Modi ji not to take the credit for their win. :Congress President and LoP in Rajya Sabha Shri @kharge pic.twitter.com/43loVpofCF — Congress (@INCIndia) March 14, 2023 (చదవండి: క్షమాపణ చెప్పేదే లే! మరోసారి వాయిదాపడ్డా ఉబయ సభలు) -
దేవుడిలా రక్షించిన వాచ్...భర్త చేతిలో సజీవ సమాధి కాకుండా...
ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఒక మహిళను భర్త చేతిలో హతం కాకుండా కాపాడింది. సరికొత్త ఫ్యూచర్లతో మంచి ఎలక్ట్రానిక్ గాడ్జ్ట్లు ఆకర్షణీయంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రజలు కూడా అంతే క్రేజ్‌గా కొంటున్నారు. ఈ కొంగొత్త టెక్నాలజీలు మనుషులను కొన్ని విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అచ్చం అలానే ఇక్కడొక మహిళను ఒక యాపిల్ వాచ్ విపత్కర సమయంలో దేవుడిలా రక్షించింది. వివరాల్లోకెళ్తే..వాషింగ్టన్‌కి చెందిన యంగ్ సూక్ ఆన్ అనే 42 ఏళ్ల మహిళ తన భర్త చాయ్ క్యోంగ్‌తో గత కొంతకాలంగా గొడవపడుతోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఐతే విడిపోతే ఆమెకు భరణంగా తన రిటైర్మెంట్ డబ్బు ఇవ్వాల్సి వస్తుందని ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా చాంగ్ క్యోంగ్ ఆమె ఇంటికి వచ్చి గొడవపడటేమే గాక తన కుట్రలో భాగంగా ఆమెను తీవ్రంగా హింసించాడు. తదనంతరం ఆమెను టేప్‌తో చుట్టి గ్యారెజ్ వద్దకు ఈడ్చుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను కార్‌వ్యాన్‌లో ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవ సమాధి చేశాడు. ఆమె ఎంత ప్రాధేయపడుతున్న వినలేదు. దీంతో ఆమె తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ సాయంతో అత్యవసర నెంబర్ 911కి కాల్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి....వాషింగ్టన్‌లోని సీటెల్‌కు 60 మైళ్ల దూరంలో ఆమెను గుర్తించి రక్షించారు. ఐతే ఆమె అప్పటికే తీవ్ర అశ్వస్థకు గురై కొన ప్రాణాలతో కొట్టుకుంటోంది. ఆమె ఆ సమయంలో తన 20 ఏళ్లు కూతురుకి కూడా తాను ప్రమాదంలో ఉన్నట్లు వాచ్ ద్వారా తెలియజేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అందరూ సమయానికి అప్రమత్తమవ్వడంతోనే ఆమెను సురక్షితంగా రక్షించగలిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రక్షించే సమయంలో ఆమె మొత్తం టేప్‌తో సీల్ చేసి తీవ్ర గాయలపాలై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతక మునుపు కూడా ఈ యాపిల్ వాచ్ ఎంతమందినో పలురకాలుగా వారి ప్రాణాలను కాపాడింది. (చదవండి: వైద్యుడే వాచ్ రూపంలో వచ్చినట్టు.. చిన్నారి ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!) -
అమలాపురం అల్లర్ల కేసు: మరో 25 మంది అరెస్ట్
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు వెల్లడించారు. 20 వాట్సాప్ గ్రూప్‌లను పరిశీలిస్తున్నామని, 350కి పైగా సీసీ ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నామని డీఐజీ తెలిపారు. మరిన్ని అరెస్టులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. -
అమలాపురం ఘటన కేసులో టీడీపీ,జనసేన నేతల అరెస్ట్
-
నారాయణ ‘లీక్స్’.. వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు..
అనంతపురం క్రైం/చిత్తూరు అర్బన్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం, సేకరించిన ఆధారాలతోనే నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారని డీఐజీ ఎం.రవిప్రకాష్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేసును పకడ్బందీగా, క్షుణ్నంగా విచారించడంతో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా, ప్రతిభావంతులైన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేలా నారాయణ యాజమాన్యం వ్యవహరించిందన్నారు. నారాయణ ఆదేశాల మేరకు డీన్, వైస్ ప్రిన్సిపాళ్లు, ప్రిన్సిపాళ్లు కలసి కొందరు స్వార్థపరులైన ఉపాధ్యాయులను, సిబ్బందిని డబ్బులతో లోబర్చుకున్నట్లు వెల్లడైందన్నారు. ఈ విషయాన్ని వారే పోలీసు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తెప్పించుకుని నారాయణ విద్యా సంస్థల హెడ్ ఆఫీస్‌కు పంపారని చెప్పారు. దర్యాప్తులో ఇవన్నీ నిర్ధారణ కావడంతో నారాయణతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సాక్ష్యాధారాలతో కోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పారు. కాగా, చిత్తూరు మేజిస్ట్రేట్ న్యాయస్థానం మాజీ మంత్రి నారాయణకు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ ఘటనలో నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని పేర్కొన్నారు. -
Andhra Pradesh: రెండు జిల్లాలకు ఒక డీఐజీ
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్వ్యవస్థీకరణతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రెండు జిల్లాలకు కలిపి ఒక డీఐజీని నియమించారు. పునర్వ్యవస్థీకరణకు ముందు 13 జిల్లాలకు 13 మంది డీఐజీలు ఉండేవారు. గతంలో ఒక జిల్లా బాధ్యతలు చూసిన డీఐజీలు ఇప్పుడు రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. జిల్లా రిజిస్ట్రార్ పోస్టులను మాత్రం 26 జిల్లాలకు సర్దుబాటు చేశారు. వాస్తవానికి జిల్లాల విభజనకు చాలాకాలం ముందు నుంచే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రిజిస్ట్రేషన్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా రిజిస్ట్రార్‌ను (డీఆర్) నియమించారు. కొత్త జిల్లా కేంద్రాల ప్రకారం ఇప్పుడు వారిని సర్దుబాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా రిజిస్ట్రార్‌గా ప్రకాశం జిల్లా మార్కాపురం డీఆర్‌ను నియమించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డీఆర్‌గా గూడూరు డీఆర్‌ను, బాపట్ల డీఆర్‌గా తెనాలి డీఆర్‌ను, ప్రొద్దుటూరు డీఆర్‌ను అన్నమయ్య జిల్లా డీఆర్‌గా, హిందూపురం డీఆర్‌ను సత్యసాయి జిల్లా డీఆర్‌గా నియమించారు. మిగిలిన పాత జిల్లా కేంద్రాలు, రిజిస్ట్రేషన్ జిల్లాల కేంద్రాల్లో అక్కడి వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
Birbhum Violence: బీర్భూమ్ హత్యాకాండ.. 21 మందిపై ఎఫ్ఐఆర్
రామ్పుర్హత్: బీర్భూమ్ హత్యాకాండపై విచారణకు 30 మంది సభ్యుల సీబీఐ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. సజీవదహనాలపై విచారణ ఆరంభించింది. విచారణ అనంతరం ఎఫ్ఐఆర్లో 21 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేసింది. స్థానిక నేత హత్యకు ప్రతీకారంగా సజీవదహన ఘటన జరిగిఉండవచ్చని అంచనా వేసిది. మరో 70– 80 మంది గుంపునకు ఈ సంఘటనతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. డెడ్‌లైన్ లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక అందించాల్సిఉన్నందున సమయం వృథా చేయమని సీబీఐ అధికారులు చెప్పారు. డీఐజీ అఖిలేశ్ సింగ్ ఆధ్వర్యంలో వచ్చిన సీబీఐ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. బోగ్తాయ్ గ్రామంలో అధికారులు దాదాపు ఐదుగంటలు గడిపారు. ఘటనా స్థలాన్ని నిశితంగా పరిశీలించి ఆధారాల కోసం అన్వేషించారు. తాము జరిపే విచారణను వీడియో తీయడంతో పాటు తమతో ఒక ఫోరెన్సిక్ నిపుణుడిని కూడా సీబీఐ అధికారులు వెంటపెట్టుకుతిరుగుతున్నారు. మరికొందరు అధికారులు పోలీసుస్టేషన్లో కేసు డైరీని అధ్యయనం చేశారు. బోగ్తాయ్‌లో శ్మశాన నిశబ్దం బోగ్తాయ్: సజీవదహనం జరిగిన బెంగాల్‌లోని బోగ్తాయ్ గ్రామంలో శ్మశాన నిశబ్దం తాండవిస్తోంది. గ్రామస్తులు చాలామంది ఊరువిడిచి పొరుగు గ్రామాలకు పారిపోయారు. స్థానిక టీఎంసీ నేత భాదు షేక్ హత్య, అనంతర హింసాకాండతో గ్రామస్తులు భీతిల్లిపోతున్నారు. ఈ ఘటనలు కొనసాగవచ్చని భయపడుతున్నారు. దీంతో చాలామంది పెళ్లాంబిడ్డలతో కలిసి బంధువుల ఊర్లకు పారిపోయారు. గ్రామాన్ని సందర్శించిన జర్నలిస్టులకు తాళం వేసిన గృహాలు స్వాగతమిచ్చాయి. కొందరు వృద్ధ మహిళలు, పెద్దవారు మాత్రమే ఊర్లో కనిపించారు. యువకులంతా భయంతో గ్రామం విడిచిపోయారన్నారు. సీబీఐ విచారణ పూర్తయితే నిజానిజాలు బయటపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ
-
కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ
సాక్షి, గుంటూరు: కరకట్ట గొడవపై కొన్ని మీడియా సంస్థలు అసత్య కథనాలు రాశాయని డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరకట్టపై గొడవ జరిగితే, మాజీ సీఎం ఇంటిపై దాడి జరిగిందని తప్పుడు కథనాలు రాయడం ఎంత వరకు సమంజసం అని డీఐజీ ప్రశ్నించారు. మీడియాలో కథనాలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని డీఐజీ హితవు పలికారు. అబద్ధాలు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కరకట్టపై ఎవరు దాడి చేశారో... ఎక్కడ దాడి చేశారో వీడియోలను మీడియాకు డీఐజీ చూపించారు. చదవండి: ‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’ ఆన్లైన్ టికెట్ విధానం మేమే అడిగాం: నిర్మాత కళ్యాణ్ -
ముఖ్యమంత్రి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేశారు: డిఐజి పాల్‌రాజ్
-
ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకం: పాల్‌రాజ్
సాక్షి, విజయవాడ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి కీలక విషయాలను డీఐజీ పాల్‌రాజ్ వెల్లడించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బదిలీ అయ్యే వరకు వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును ఏబీ వెంకటేశ్వరావునే పర్యవేక్షించారని తెలిపారు. దర్యాప్తు వివరాలు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో ఏబీవీనే చెప్పాలని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు వెలికితీయకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై బురద జల్లే యత్నం చేశారని తెలిపారు. సిట్ దర్యాప్తుపై ఏబీవీ సందేహాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని తెలిపారు. ఏబీవీ దగ్గర ఆధారాలు ఉంటే సీబీఐకి సీల్డ్కవర్లో లేఖ పంపొచ్చని చెప్పారు. ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్ ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన విషయమని అన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు ఇవి వ్యతిరేకమని గుర్తుచేశారు. ఏబీవీకి అనుమానాలుంటే పద్ధతి ప్రకారం సమాచారం ఇవ్వాలని డీఐజీ పాల్‌రాజ్ అన్నారు. చదవండి: కరోనా బారిన పడి డీఎస్పీ మృతి -
పోలీసులను టార్గెట్ చేయొద్దు: డీఐజీ
సాక్షి, మంగళగిరి: ఆలయాల్లో దాడులంటూ సోషల్ మీడియాలో సాగిన దుష్ప్రచారాలపై నిజాలు తెలియజేశామని డీఐజీ పాల్రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులకు నిబద్ధత ఉండదని.. సామాజిక మధ్యమాల్లో దుష్ప్రచారంపై విచారణ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ‘‘2020- 2021లో జరిగిన ఆలయాలపై దాడుల వివరాలు డీజీపీ ఇచ్చారు. 44 కేసుల్లో జరిగిన దాడుల్లో అసలేం జరిగిందో కూడా చెప్పాం. అబద్ధపు ప్రచారాలు కూడా ఎలా జరిగాయో తెలిపాం. కొన్ని కేసులలో ముద్దాయిలు రాజకీయ నేపథ్యం కూడా వెల్లడించాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాసిన వార్తకు ఒక నిబద్ధత ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్తలకు నిబద్ధత ఉండదు. (చదవండి: స్థానిక ఎన్నికలు: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్) 2014లో ఏలూరులో జరిగిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, శిక్ష వేశారు. అదే ఘటనను మరల జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తమిళనాడు, కర్నాటకలో జరిగిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్టు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ప్రచారం పట్ల విచారణ చేస్తున్నాం. పోలీసు వ్యవస్థను దిగజార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో స్పెషన్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశాం. పోలీసులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని’’ డీఐజీ పాల్రాజు హెచ్చరించారు.(చదవండి: సీఎం జగన్‌ను కలిసిన బీవోబీ ఈడీ) -
బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్‌గా డీఐజీ సుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బెస్ట్ కోవిడ్ వారియర్ విమెన్ ఆఫీసర్‌గా డీఐజీ బడుగుల సుమతిని డీజీపీ ఎంపిక చేశారు. కోవిడ్ విజృంభించిన వేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకుపైగా పోలీసులు వైరస్ బారిన పడగా.. దాదాపు 70 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసు అధికారుల వివరాలు అందజేయాలని నేషనల్ విమెన్ కమిషన్ (ఎన్సీ డబ్ల్యూ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతో తెలంగాణ నుంచి డీఐజీ బడుగుల సుమతి పేరుని సోమవారం డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి ఖరారు చేశారు. (చదవండి: ఆన్లైన్ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి) డీఐజీ సుమతి లాక్డౌన్ కాలంలో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సేవలందించారు. లాక్డౌన్ కాలంలో పేదలు, వలస కూలీలు, అన్నార్థులకు ఎక్కడికక్కడ ఆహారం, మందులు, బియ్యం, దుస్తులు చేరేలా నిరంతరం పర్యవేక్షించారు. అదే విధంగా అత్య వసర సేవలు, రాష్ట్రంలోనికి రావాల్సిన దిగు మతులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. -
చాయ్‌వాలా ఫీట్లు : పోలీసు ఉన్నతాధికారి ఫిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి మహిళలు, చిన్నారుల భద్రతపైన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై ఎంత చురుగ్గా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. తమ శాఖ అందిస్తున్న సేవలపై నిరంతరం ట్విటర్లో అప్డేట్ చేస్తూ, అనేక సలహాలను ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఆమె తాజాగా ఒక ఫన్నీ వీడియోను ట్విటర్లో షేర్ చేయడం విశేషం. ఛాయ్ వాలా నైపుణ్యాన్ని చూసి ముచ్చటపడుతూ నవ్వుకుంటున్న సుమతి వీడియో ప్రస్తుతం పలువురిని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఇరానీ చాయ్అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే డీఐజీ సుమతి కూడా ఒక షాపులో ఇరానీ టీ తాగేందుకు ఆగారు. ఆమె టీ కప్ తీసుకోవటానికి యత్నిస్తున్నపుడే అసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ చాయ్ వాలా ఆ కప్పును ఆమెకు దొరక్కుండా చేస్తూ..ఫన్నీ ఫీట్లతో అలరించారు. సాక్షాత్తూ పోలీసు ఉన్నతాధికారినే ఫిదా చేసిన ఈ ఫీట్లు చూస్తే మీరు కూడా వావ్ అంటారు. -
హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. హథ్రాస్ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్ డీజీపీ భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు దర్యాప్తుకు గాను యూపీ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ చంద్ర ప్రకాష్ సిట్ సభ్యుల్లో ఒకరు. ఆయన భార్య పుష్ప ప్రకాష్(36) శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో లక్నోలోని వారి నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను లోహియా ఆస్పత్రికి తరలించారు. పుష్ప ప్రకాష్‌ని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: హథ్రాస్ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి) ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఈస్ట్ జోన్ డీసీపీ చారు నిగమ్ తెలిపారు. 2005 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన చంద్ర ప్రకాష్ ప్రస్తుతం హథ్రాస్ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్‌లో సభ్యుడిగా ఉన్నారు. -
మాస్క్ లేదా.. సమాధి తవ్వాల్సిందే
జకర్తా: కరోనా వైరస్ నియంత్రణ కోసం మాస్క్ తప్పక ధరించాలి అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నప్పటికి నేటికి కూడా కొందరు మాస్క్ ధరించడం లేదు. ఈ క్రమంలో ఇండోనేషియా ప్రభుత్వం మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించడానికి బదులుగా వినూత్న శిక్ష విధిస్తుంది. ఎవరైతే మాస్క్ ధరించరో వారు కరోనాతో చనిపోయిన వారిని పూడ్చడానికి గాను సమాధులు తవ్వాలని ఆదేశించింది. ది జకార్తా పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం తూర్పు జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో ఎనిమిది మంది బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించకుండా తిరిగారు. వారికి శిక్షగా కరోనాతో చనిపోయిన వారికి సమాధులు తవ్వాలని అధికారులు ఆదేశించారని తెలిపింది. ‘ప్రస్తుతం స్మశాన వాటికలో ముగ్గురు మాత్రమే సమాధులు తవ్వడానికి అందుబాటులో ఉన్నారు. కనుక మాస్క్ ధరించని వారికి శిక్షగా ఈ పని అప్పగిస్తే బాగుంటుందని భావించాను’ అని సెర్మ్ జిల్లా అధిపతి సుయోనో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను ఒక సమాధి తవ్వడానికి నియమించారు. వీరిలో ఒకరు సమాధి తవ్వితే.. మరోకరు శవపేటికలో చెక్క బోర్డులను అమర్చుతారు అని తెలిపారు.(చదవండి: మాస్క్.. లైట్ తీసుకుంటే రిస్కే!) ఈ వినూత్న పనిష్మెంట్ మంచి ప్రభావం చూపించగలదని ఇండోనేషియా అధికారులు భావిస్తున్నారు. రీజెంట్ లా నెంబర్ 22/2020 ప్రకారం, ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా లేదా సమాజ సేవ చేయాలని శిక్ష విధించవచ్చని నివేదిక పేర్కొంది. ఇకపోతే ఇండోనేషియాలో ఆదివారం వరుసగా ఆరవ రోజు 3,000 కి పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో రాజధానిలో సామాజిక దూర పరిమితులను తిరిగి విధించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం కొత్తగా 3,636 కేసులు నమోదు కాగా.. 73 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 2,18,382 కు, మరణాలు 8,723 కు చేరుకున్నాయి. -
అంతర్వేదిలో 30 పోలీస్ యాక్ట్
సాక్షి, తూర్పుగోదావరి: అంతర్వేది అగ్ని ప్రమాద సంఘటన స్థలం వద్ద డీఐజీ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్‌రావు తెలిపారు. పరిసరప్రాంతాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది అని వెల్లడించారు. ఫోరెన్సిక్ శాఖకు చెందిన నిపుణులు సంఘటన స్థలంలో అనువనువునా నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. కొంత మంది శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా ప్రయత్నించారన్నారు. అంతర్వేది పరిసరప్రాంతాలలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఇతరులు ఎవ్వరు ఈ ప్రాంతానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఉండాలని ప్రజలను కోరారు. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథాన్ని కొంతమంది దుండగలు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: అవసరమైతే సీబీఐ విచారణ -
కరోనాపై పోలీస్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. అన్ని జిల్లాల కమిషనర్లు,ఎస్పీలతో గురువారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఒక్కరోజే 8 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టాలని.. సభలు, సమావేశాలు, వివాహాలకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. నేడు సాయంత్రం ముఖ్యమంత్రి భేటీలో పోలీస్‌శాఖ తీసుకున్న నిర్ణయాలను చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’) -
ధర్మాడి సత్యంకు డీఐజీ ప్రశంసలు
సాక్షి, కాకినాడ లీగల్: గోదావరిలో దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును సవాలుగా తీసుకొని వెలికి తీసి ధర్మాడి సత్యం బృందం రాష్ట్రానికి, జిల్లాకు, ప్రభుత్వానికి కీర్తి తెచ్చిందని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్‌ఖాన్ అన్నారు. ధర్మాడి సత్యం బృందాన్ని కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం డీఐజీ ఏఎస్ ఖాన్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అభినందించి, సత్కరించారు. డీఐజీ మాట్లాడుతూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సుడులు తిరుగుతున్నాయి. ఇక్కడ బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారని కొనియాడారు. తమవారి మృతదేహాలను కడసారిగా చూడలేమని బంధువులు భావిస్తున్న తరుణం లో బోటును వెలికితీసి మృతదేహాలను అప్పగించారన్నారు. ధర్మాడి చేసిన కృషి మరువలేమని డీఐజీ ఖాన్ పేర్కొన్నారు. ఆ గిరిజనులనూ అభినందిస్తాం రాయల్ వశిష్ట బోటు ప్రమాదం జరిగిన వెంటనే కచ్చులూరు గ్రామస్తులు వెంటనే స్పందించి 26 మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడారని రేంజి డీఐజీ ఖ>న్ అన్నారు. తాము కచ్చులూరు గ్రామం వెళ్లి వారిని ప్రత్యేకంగా అభినందిస్తామన్నారు. ధర్మాడి సత్యం బృందానికి రూ. 50 వేల రివార్డు, సభ్యులందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. బోటు వెలికి తీసిన సమయంలో శవాలను బయటకు తీసిన ఐదుగురు తోటీలకు ప్రత్యేకంగా రూ. 10 వేలు ధర్మాడి సత్యానికి ఇచ్చి వాటిని ఆ తోటీలకు అందజేయాలని కోరారు. అడిషినల్ ఎస్పీ ఎస్వీ శ్రీధర్‌రావు, ఓఎస్డీ ఆరిఫ్ హఫీజ్, ఏఆర్ అడిíÙనల్ ఎస్పీ వీఎస్ ప్రభాకర్‌రావు, ఎస్పీ డీఎస్పీలు ఎస్.మురళీమోహన్, ఎం.అంబికా ప్రసాద్, కాకినాడ సబ్ డివిజన్ డీఎస్పీ కరణం కుమార్, కాకినాడ క్రైం డీఎస్పీ వి.భీమరావు, ఏఆర్ డీఎస్పీ ఎస్.వెంకట అప్పారావు, ఎస్పీ సీఐ ఎస్.రాంబాబు, డీసీఆర్బీ సీఐ వైఆర్కే శ్రీనివాస్, జిల్లా పోలీసు అధికారుల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.బలరామమూర్తి, అధ్యక్షుడు పి.సత్యమూర్తి , సంఘ ప్రతినిధులు, సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కశ్మీర్ అంశం, చిదంబరం అరెస్ట్ రహస్యమిదే!
సాక్షి, చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. దేశ జీడీపీ 5శాతానికి పడిపోవడంపై ఎన్డీఏ సర్కార్‌ను డీఎంకే తీవ్రంగా దుయ్యబట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5 శాతానికి పడిపోవడం చాలా ఆందోళనకరమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బుధవారం విమర్శించారు. గత 27 ఏళ్లలో ఇంత బలహీనమైన జీడీపీ వృద్ధి గణాంకాలను చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భయంకరమైన' ఆర్థిక మందగమనాన్ని దాచిపెట్టడానికే కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్ట్‌లాంటి అంశాలను కేంద్రం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక మందగమనాన్ని కప్పిపుచ్చే ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. అయితే దీనికి సంబంధించి మీడియాలో వార్తలు రాకుండా నిరోధించినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో విరివిగా వార్తలొచ్చాయని స్టాలిన్ పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రుల మూడు దేశాల పర్యటనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇది టూరింగ్ కేబినెట్ అనివ్యాఖ్యానించారు. 2015, 2019 సంవత్సరాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను ఏఐడీఎంకే ప్రభుత్వం నిర్వహించిందని గుర్తుచేసిన ఆయన పెట్టుబడులు, ఉద్యోగాలపై పళని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పళని స్వామి బృందం ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు అమెరికా, బ్రిటన్ సహా మూడుదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. -
జనసేన ఎమ్మెల్యేపై డీఐజీ ధ్వజం
సాక్షి, రాజోలు : జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యలు సమాజంలో యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయొచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్ళతాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడిన వీడియో ఆధారంగా, పీఎస్ ముట్టడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఒక మండల స్థాయి అధికారి అయిన ఎస్ఐను బాధ్యత గల ప్రజాప్రతినిధి దూషిస్తూ.. దాడికి పాల్పడటం సమంజసం కాదన్నారు. ఎస్ఐ తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపారు. (చదవండి: పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే) -
రైల్వే ఉద్యోగాలా? ఇది మరో జుమ్లా - చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న రెండేళ్లలో నాలుగు లక్షల రైల్వే ఉద్యోగాలు కల్పిస్తామన్న రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రకటనపై మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. ఇదొక నెరవేరని హామీగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైన రైల్వే శాఖ హఠాత్తుగా నిద్రలేచిందంటూ విమర్శించారు. గత ఐదేళ్లుగా రైల్వేలో దాదాపు 2,82,976 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇపుడు అకస్మాత్తుగా ఈ మూడు నెలల్లోనే ఆ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పుడు మోదీ సర్కారు ప్రకటస్తుందంటూ ఎద్దేవా చేశారు. ఇది మరో జుమ్లా అని ట్వీట్ చేశారు. అనే ప్రభుత్వ విభాగాల్లో ఇదే ధోరణి ఉంది. ఒక వైపు ఖాళీగా ఉన్న పోస్టులు, మరొకవైపు నిరుద్యోగ యువత అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా 2020 నాటికి రైల్వేలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రానున్న రెండేళ్లలో ప్రస్తుతం ఖాళీ ఉన్న పోస్టుల భర్తీ చేస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. Railways leave 2,82,976 posts vacant for nearly 5 years and suddenly wake up to say we will fill them in 3 months! Another jumla! The story is the same across many departments of the government. Vacant posts on one side, unemployed youth on the other. — P. Chidambaram (@PChidambaram_IN) January 24, 2019 -
డీఐజీగా కాంతిరాణా టాటా
అనంతపురం సెంట్రల్: అనంతపురం రేంజ్ నూతన డీఐజీగా కాంతిరాణా టాటాను నియమించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఇన్నాళ్లూ ఇక్కడ డీఐజీగా పనిచేసిన జె. ప్రభాకర్‌రావును సీఐడీ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిఅనిల్చంద్రపునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే 12న అనంతపురం రేంజ్ డీఐజీగా ప్రభాకర్‌రావు బాధ్యతలు చేపట్టారు. దాదాపు రెండు సంవత్సరాల నాలుగునెలల పాటు ఆయన పనిచేశారు. జిల్లాపై డీఐజీ ప్రభాకర్‌రావు ముద్ర ఉండేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అవినీతి, అరోపణలు ఎదుర్కొన్న వారిపై చర్యల్లో తనదైన మార్క్ చూపించారు. -
నాన్న కోసం కూతుళ్ల త్యాగం
పట్టుదల ఉంటే సాధ్యంకానిదేదీ ఉండదని రుజువు చేశారు మధ్యప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. పంట సాగుకోసం తమ తండ్రి పడుతున్న బాధలను చూసిన వారు కదిలిపోయారు. తండ్రి బాధను తమ బాధగా భావించి తమ విలువైన కాలాన్ని వెచ్చించి ఆయన కలను సాకారం చేశారు. ఆ తరువాత తండ్రి కళ్లల్లో ఆనందం చూసి మురిసిపోయారు. ఇంతకీ ఆ పిల్లలేం చేశారో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో రైతులు వ్యవసాయ బావులు లేదా చెక్‌డ్యామ్‌లపై ఆధారపడి పంటలు సాగుచేస్తారు. ఈ జిల్లాలోని భీకన్‌గావ్ గ్రామానికి చెందిన రైతు బాబు భాస్కర్ పొలంలో బావి నిర్మాణం చేపట్టాలనుకున్నాడు. అయితే పేద రైతు కావడంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్జీఈజీఏ) కింద బావి పనులు చేపడితే తనకు భారం తగ్గుతుందని ఆలోచించాడు. ఈ నేపథ్యంలో 2011లో సంబంధిత అధికారులను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాకుండా ఓ వినతిపత్రం కూడా అందజేశాడు. ఈ విన్నపాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీఇచ్చారు. పక్షం రోజుల తర్వాత తమను కలవాలని సూచించారు. సరిగ్గా 16వ బాబు భాస్కర్ తాను వినతిపత్రం సమర్పించిన కార్యాలయానికి వెళ్లాడు. మరో వారం తర్వాత మళ్లీ కలవాల్సిందిగా వారు తెలిపారు. సరేనంటూ తలూపిన భాస్కర్ ఆ కార్యాలయం చుట్టూ తిరగడం ప్రారంభించాడు. రెండు నెలల తర్వాత ఈ వినతిపత్రానికి సంబంధిత అధికారులు ఆమోదముద్ర వేశారు. నిధులు మంజూరు చేశారు. దీంతో బావి తవ్వకపు పనులు మొదలయ్యాయి. భాస్కర్ సంబరపడ్డాడు. తన పొలం పచ్చని పంటలతో కళకళలాడుతుందని భావించాడు. పది అడుగుల మేర బావి తవ్వకం పూర్తయింది. ఆ తర్వాత అధికారులు నిధులు మంజూరు చేయలేదు. దీంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. భాస్కర్ మరలా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఎంతకాలం తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన డీలాపడిపోయాడు. ఇది గమనించిన భాస్కర్ కుమార్తెలు జ్యోతి, కవిత తండ్రి పరిస్థితిని చూసి చలించిపోయారు. ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. చివరికి ఆ పనిని తామే పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇతర కుటుంబసభ్యులను కలుపుకొని బావి నిర్మాణ పనులను పునఃప్రారంభించారు. అక్కడి నుంచి నాలుగు నెలలపాటు వీలైనంత సమయం కేటాయించి తవ్వకపు పనులు చేపట్టారు. ఈ ఏడాది జులై చివరి నాటికి మరో 17 అడుగుల లోతు మేర బావిని తవ్వారు. అలా బావి నిర్మాణాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి, కవిత మీడియాతో మాట్లాడుతూ ‘బావి పనుల కోసం మేము కూడా సంబంధిత అధికారుల చుట్టూ మూడేళ్లపాటు ప్రదక్షిణలు చేశాం, అయినా ఎటువంటి స్పందనా కనిపించలేదు. దీంతో మిగిలిన కుటుంబసభ్యులను కూడా కలుపుకుని పనులు మొదలుపెట్టాం. ఎండాకాలంలో కూడా ఆపలేదు. మా నాన్న కలను నిజం చేసి చూపాం. ఈ రకంగానైనా తండ్రి రుణం తీర్చుకునే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ‘మాకు ఎద్దులు కూడా లేవు. మా అమ్మాయిలు రోజూ బావి నిర్మాణ పనుల్లో పాల్గొనేవారు. మట్టి, రాళ్లను తట్టల్లోకి ఎత్తేవారు. చదువుకునే వయసులో ఉన్న పిల్లలు ఇలా చాకిరి చేస్తుండడం బాధ కలిగించింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. ఆడపిల్లలైనా మగపిల్లల మాదిరిగా పనిచేశారు’ అంటూ పొగడ్తల జల్లు కురిపించారు. -
పోలీస్ ఇమేజ్ పెంచుతా
ఏలూరు టౌన్ : ఏలూరు రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాననీ ఏలూరు రేంజ్ డీఐజీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన టి.రవికుమార్ మూర్తి చెప్పారు. ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ పోలీసుల్లో జవాబు దారీ తనాన్ని పెంచేందుకు కృషి చేస్తానని, పోలీస్ ఇమేజ్ పెంచుతానని అన్నారు. శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. పోలీస్ శాఖలో మీ ఎంట్రీ ? డీఐజీ : 1992లో గ్రూప్–1 సర్వీసుకు ఎంపికై డీఎస్పీగా మొదట పోలీసు శాఖలో చేరాను. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, నర్సీపట్నం, కాశీబుగ్గ ప్రాంతాల్లోనూ, రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి ప్రాంతాల్లోనూ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించా. అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశాను. 2002వ సంవత్సరంలో ఎస్పీగా తిరుపతి, విజయవాడల్లో పనిచేయటంతోపాటు, గుంటూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా, ఏపీ ట్రాన్స్‌కో ఎస్పీగా, రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీగా పనిచేశాను. అనంతరం విశాఖపట్నం క్రైమ్, లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేస్తూ 2017 నవంబర్‌లో డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నంలోనే జాయింట్ సీపీగా పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏలూరు రేంజ్ డీఐజీగా పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తూ పోస్టింగ్ ఇచ్చింది. మీ ప్రాధాన్యతలు ఏమిటీ? డీఐజీ : ఏలూరు రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట వేస్తా. ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా, ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల భయాన్ని పోగొట్టి వారితో మమేకం అయ్యేలా చేయటమే ప్రాధాన్యతాంశం. పోలీసుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు కృషి చేస్తాను. పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. జిల్లాలో పరిస్థితులను సమీక్షించి ప్రతీ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. గోదావరిలో పడవ ప్రమాదాలపై మీ చర్యలు? డీఐజీ : జిల్లాలోనూ, రేంజ్ పరిధిలోనూ పడవ ప్రమాదాల కారణంగా అనేకమంది ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవటం బాధాకరం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనుమతుల్లేని బోట్లు విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇష్టారాజ్యంగా పడవలు నడిపితే ఆయా యాజమాన్యాలపై కేసులు నమోదు చేసేందుకు వెనుకాడేదిలేదు. ఇక పడవల్లో విధిగా లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం. ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి ఏఏ ప్రాంతాల్లో తరచూ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయో ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో బోట్లలో భద్రతా ప్రమాణాలపై సమీక్షిస్తాం. జిల్లాలో మావోల కదలికలు గురించి..? డీఐజీ : ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతుంది. జిల్లాలో ఎప్పటికప్పుడు మావోల కదలికలు గుర్తిస్తూ దానికి అనుగుణంగా జల్లెడ పట్టే కార్యక్రమాన్ని చేపడతాం. ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తూ వారి కార్యకలాపాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తప్పకుండా ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ (ఏవోబీ)లో కొద్దిపాటి కదలికలు ఉన్నాయి..జిల్లాలో మావోల కార్యకలాపాలు లేవనే చెప్పాలి. సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా ఉంటుందా? డీఐజీ : సంఘ వ్యతిరేక శక్తులను ఉపేక్షించేదిలేదు. ఏలూరు రేంజ్ పరిధిలో సమాచారాన్ని సేకరించి చట్టవ్యతిరేక, సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగించే వ్యక్తులు, ముఠాలను అణచివేసేందుకు చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని తనకు నేరుగా అందించవచ్చు. గంజాయి రవాణా, మహిళలు, యువతుల అక్రమ రవాణా వంటివాటిపై నిఘా పెంచి, అటువంటి ముఠాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఇక జిల్లాలో అనధికార క్లబ్బులు, పేకాట, జూదం వంటివి లేకుండా చేసేందుకు చట్టం మేరకు చర్యలు తప్పవు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక కార్యాచరణ ఏమిటి? డీఐజీ : రేంజ్లో 890 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 2800 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంతో పోల్చితే జిల్లాలో ప్రమాదాల నివారణకు ఆయా జిల్లాల ఎస్పీలు చేపట్టిన భద్రతా చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయి. నిరంతరం ప్రత్యేకంగా రోడ్డు భద్రతపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం. -
ఏలూరు రేంజ్ డీఐజీగా రవికుమార్ మూర్తి
ఏలూరు టౌన్ : ఏలూరు రేంజ్ డీఐజీగా టి.రవికుమార్ మూర్తిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు రేంజ్ డీఐజీ పోస్టు గత కొంతకాలంగా ఇన్ఛార్జ్ పాలనలో కొనసాగుతుండగా తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ డీఐజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కమిషనర్ –2గా పనిచేస్తూ బదిలీపై ఏలూరు రేంజ్ డీఐజీగా వస్తున్నారు. రవికుమార్ మూర్తి రెండురోజుల్లో ఏలూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. -
ఖైదీల్లో మార్పునకు కృషిచేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఖైదీల్లో సత్ప్రవర్తన కోసం అధికారులు కృషిచేయాలని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. సోమవారం జిల్లా జైలును సందర్శించిన ఆయనకు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జైలు రిజిస్ట్రర్లను పరిశీలించిన ఆయన ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ ఖైదీలతో మృదువుగా వ్యవహరించాలని సూచించారు. తాము చేసిన తప్పును తెలుసుకుని çపశ్చతాప పడేవిధంగా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించే నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. ఖైదీల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీసే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జిల్లా జైలులో ఖైదీలకు అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీల జీవన ప్రయోజనం కోసం మరో నూతన బారక్ను నిర్మించనున్నట్లు అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. యాచకులు, ఆయుర్వేదిక విలేజీ పబ్లిక్ కోసం ఆనంద్ ఆశ్రమాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత తమ కాళ్లపై తాము నిలబడి జీవించే విధంగా తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్, జైలర్లు శ్రీనునాయక్, వెంకటేశ్వరస్వామి, డిప్యూటీ జైలర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
డీఐజీపై సీఎం ఆగ్రహం
కడప అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు శుక్రవారం సాయంత్రం విచ్చేశా రు. ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు సతీమణి భువనేశ్వరితోపాటు చేరుకున్నారు. ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు.ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోకి అంతకుముందుగానే చేరుకున్న టీడీపీ నేతలు గోవర్దన్‌రెడ్డి, హరిప్రసాద్ సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డితోపాటు కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ తన అల్లుడు నవీన్‌తో కలిసి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. సీఎం చంద్రబాబు ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకోగానే తమకు జరిగిన అవమానం గురించి ఏకరువు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అక్కడే ఉన్న కడప, కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటన దృష్ట్యా కడప నగరంలో దుకాణాలన్నీ మూసి వేయించి కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించినట్లుగా ఉందని, ఈ చర్య వల్ల తనకు మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వటపత్రశాయి.. కరుణించవోయి..
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం వటపత్రశాయి అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భక్తజనబృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈవో రామరాజు, సూపరింటెండెంట్లు లక్ష్మినాగరాజు, సుబ్రమణ్యం ఇతర అధికారులు, పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ జి. శ్రీనివాస్ పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ, ఓఎస్డీ నయిం అస్మి, టీటీడీ డీఈ రాఘవయ్య ఉన్నారు. అనంతరం కోదండ రామస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్ ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ సీసీ కెమెరాల కనుసన్నల్లో బ్రహ్మోత్సవాలు ఉంటాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. -
సింగర్‌గా మారిన ఫైర్‌బ్రాండ్ డీఐజీ
సాక్షి, బెంగళూరు : ఫైర్‌బ్రాండ్ పోలీసు అధికారిణిగా పేరొందిన కర్ణాటక డీఐజీ (జైళ్ల శాఖ) రూపా ముగ్దిల్ తనలో దాగున్న మరో ప్రతిభను బయటపెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. 1965లో విడుదలైన మీనా కుమారి - ధర్మేంద్రల ‘కాజల్’ సినిమాలోని ‘తోరా మన్ దర్పణ్ కెహలాయె’ అంటూ సాగే పాటను ఆమె స్వయంగా ఆలపించారు. ‘ఈ పాట ఆడియో రికార్డింగ్ కోసం కేవలం అరగంట సమయం మాత్రమే పట్టింది. వీడియో చిత్రీకరణ కూడా నాలుగు గంటల్లో ముగించేశాం’ అని రూపా చెప్పారు. తమలో దాగున్న శక్తిని గుర్తించాలంటూ సాగే ఈ పాట తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని, అందుకే ఈ వీడియో రూపొందించినట్లు తెలిపారు. మనసే అందరిలోని సంతోషం, దుఃఖానికి, సాధించే విజయాలు, అపజయాలకు కారణమని.. బలంగా అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీలేదని అందరూ గుర్తించాలన్నారు. ఈ వీడియో మ్యూజిక్ కంపోజర్‌గా కన్నడ సినీ దర్శకుడు అలెన్ వ్యవహరించారు. ఆర్జే శృతీరావు కోరిక మేరకు వీడియోను రూపొందించానని రూపా తెలిపారు. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న అన్నాడీఎంకే నేత శశికళకు ప్రత్యేకంగా రాజభోగాలు కల్పిస్తున్నారంటూ నివేదికనిచ్చి ఒక్కసారిగా సంచలనంగా రూపా నిలిచారు. గతంలో కూడా ధార్వాడ్(మధ్యప్రదేశ్) ఎస్పీగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమా భారతిని అరెస్ట్ చేసి ఆమె సంచలనం సృష్టించిన విషయం విదితమే. -
క్రీడలతో మానసికోల్లాసం
డెంకాడ: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని బెటాలియన్స్ కాకినాడ రేంజ్ డీఐజీ కె.సూర్యచంద్ అన్నారు. చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ఏఆర్ కానిస్టేబుళ్లకు సోమవారం స్పోర్ట్స్‌మీట్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను డీఐజీ సూర్యచంద్, విజయనగరం పీటీసీ ప్రిన్సిపాల్ రాజశిఖామణి, 16వ బెటాలియన్ అదనపు కమాండెంట్ పి.మోహన్‌ప్రసాద్ పావురాలు, బెలూన్స్ ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం డీఐజీ సూర్యచంద్ మాట్లాడుతూ, క్రీడల వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారన్నారు. ఇలాంటి స్పోర్ట్స్‌మీట్ వల్ల దాగిఉన్న క్రీడానైపుణ్యాలు బయటకు వస్తాయన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ అడిషినల్ కమాండెంట్ ఎంబీవీ సత్యనారాయణ, బెటాలియన్ పోలీస్ అధికారులు జీవీ ప్రభాకరరావు, కె.తిరుమలరావు, జి.రవీంద్రకుమార్, వీవీ రమణ, ట్రైనింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఏం జరుగుతోందిక్కడ?
కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖలో గతంలో డిఐజీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ జాయింట్ ఐజీ జి.సుబ్బారాయుడు జిల్లాకు వచ్చినట్టు ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఈయన రెండు రోజులుగా రాజమహేంద్రవరం, కాకినాడలలో సబ్రిజిస్ట్రార్లతో గోప్యంగా విచారణ జరిపుతున్నట్టు తెలిసింది. గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ విశ్రాంత డీఐజీ లక్ష్మీకుమారి అక్రమాలకు పాల్పడుతున్నారని, నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో ‘స్టాంప్ డ్యూటీకి రూ.5.50 కోట్లుకు గండి’ అంటూ ‘సాక్షి’లో 2017 మే మూడో తేదీన కథనం కూడా ప్రచురితమైంది. గతంలో అందిన ఫిర్యాదు, సాక్షిలో వచ్చిన కథనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలపై జాయింట్ ఐజీ జి. సుబ్బారాయుడు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈయన మంగళవారం రాజమహేంద్రవరం జిల్లా పరి«ధిలో ఉన్న 18 మంది సబ్ రిజిస్ట్రార్లను విచారణ చేపట్టారు. అనంతరం బుధవారం కాకినాడ డీఐజీ కార్యాలయానికి చేరుకుని కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న 14 మంది సబ్‌రిజిస్ట్రార్లతోపాటు, డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆరా తీసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులపై డీఐజీ వేధింపులకు పాల్పడడం, అకారణంగా తిట్టడం వంటివి చేస్తుండడంతో అప్పట్లో చాలా మంది ఉద్యోగులు మూడునుంచి ఆరు నెలల వరకు సెలవుల్లోకి వెళ్లినట్టు ఉద్యోగులు విచారణలో చెప్పారు. అలాగే జిల్లాలో ఒక మెట్ట ప్రాంతానికి చెందిన సబ్‌రిజిస్ట్రార్ ఆర్థిక లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు డీఐజీకి అండగా ఉంటూ అక్రమ లావాదేవీలు జరిపేవారని చెప్పినట్టు తెలిసింది. -
ఐజీగా రమణకుమార్.. డీఐజీగా కాంతిరాణా
సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ కమిషరేట్ పరిధిలోని ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జాయింట్ పోలీస్ కమిషనర్ బీవీ రమణకుమార్‌కు ఐజీ హోదా లభించింది. డీసీపీ కాంతిరాణా టాటాకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. సూపర్‌టైమ్ స్కేల్ ఐపీఎస్ అధికారులుగా వారికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఐజీ హోదాతో రమణకుమార్ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన గతంలో నెల్లూరు ఎస్పీగా, సీఐడీ ఎస్పీగా, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆయన్ను ఐజీ హోదా కల్పించింది. ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. విజయవాడ డీసీపీ కాంతిరాణా టాటాకు డీఐజీగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన కాంతిరాణా 2004 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో వరంగల్, ఖమ్మంలో ఓఎస్డీగా, హైదరాబాద్‌లోని మాదాపూర్ డీసీపీగా చేశారు. అనంతరం కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ పోలీస్ కమిషరేట్‌ను అదనపు డీజీ స్థాయికి పెంచిన ఎస్పీ స్థాయి అధికారులను డీసీపీలుగా కేటాయించారు. దీంతో కాంతిరాణా టాటా విజయవాడ డీసీపీగా నియమితులయ్యారు. ఆయనకు ప్రభుత్వం ప్రస్తుతం డీఐజీగా పదోన్నతి కల్పించింది. -
కొండను తవ్వేసిన ఒకే ఒక్క మనిషి
-
చక్కదిద్దాలి బాస్..!
⇔ జిల్లాలో శ్రుతిమించుతున్న కొందరు పోలీసుల ఆగడాలు ⇔ అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న వైనం ⇔ మూడు గంటలపాటు మృతదేహాన్ని కనిపించకుండా చేసిన ఓ ఎస్సై ⇔ టీడీపీ నేత తన టోపీ పెట్టుకున్నా పట్టించుకోని మరో ఎస్సై ⇔ కొత్తగా వచ్చిన డీఐజీ, ఎస్పీలైనా వీరి ఆగడాలను అరికట్టాలని కోరుతున్న ప్రజలు గతంలో పోలీస్ అంటే గౌరవం ఉండేది. ప్రస్తుతం జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరుతో అమ్మో పోలీస్..అని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నేతల అండదండలతో పోలీసులు అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు. ఖాకీ చొక్కాలు తొడుక్కున్న పచ్చ నేతల్లా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం వెళ్లిన బాధితులపైనే కేసులు పెట్టి చుక్కలు చూపిస్తున్నారు. మొత్తంగా పోలీసు శాఖ పరువును బజారు కీడుస్తున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో రెండేళ్ల కాలంలో కొందరు పోలీసు అధికారులు అనుసరిస్తున్న తీరు పోలీసు శాఖకు చెడ్డపేరు తెచ్చి పెట్టింది. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులకు అండగా నిలవాల్సిందిపోయి అధికార పార్టీ నేతల ఒత్తిడితో బాధితులకు అన్యాయం చేస్తున్నారు. అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు పోలీసు శాఖపై పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ తాము చెప్పిందే శాసనంగా నడవాలనే విపరీత ధోరణిలో వ్యవహరించిన విషయం తెలిసిందే. కొందరు పోలీసు అధికారులు సైతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పని చేస్తూ వారికి తొత్తులుగా మారిపోయారు. బాధితులపై అక్రమ కేసులు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతల మెప్పు కోసం బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరిపేట వంటి ప్రాంతాల్లో అధికార పార్టీ నేతల ఆగడాలను అడ్డుకొనే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. వీరు మరో అడుగు ముందుకేసి టీడీపీలో చేరకపోతే కేసుల్లో ఇరికిస్తామంటూ ఖాకీ తొడుక్కున్న పచ్చ చొక్కాలుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ చెప్పిందే వేదం.. రెండు నెలల క్రితం కాకుమాను మండలంలో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ ఘటనలో భర్త తరపు వారు అధికార పార్టీ నేతలకు అనుయాయులు కావడంతో అప్పట్లో అక్కడ పని చేస్తున్న ఎస్సై పోస్టుమార్టం అనంతరం గుంటూరు తీసుకెళుతున్న మృతదేహాన్ని అడ్డగించి దౌర్జన్యంగా తీసుకెళ్లాడు. దీంతో అప్పట్లో పోలీసు శాఖ పరువు బజారున పడింది. అధికారుల ఆదేశాల మేరకే అలా చేశానంటూ ఎస్సై చెప్పడంతో ఆయనను బదిలీ చేసి పోలీసు ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారు. పది రోజుల క్రితం కారంపూడి పోలీసుస్టేషన్లో అధికార పార్టీ నేత ఎస్సై గదిలోనే ఎస్సై టోపీ పెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో పోలీసు ప్రతిష్ట దిగజారిపోయింది. దీనిపై కొత్తగా వచ్చిన రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు విచారణకు ఆదేశించారు. సత్తెనపల్లిలో ముఖ్యనేత తనయుడు భూ ఆక్రమణలకు స్థానిక పోలీసులే కాపలా ఉండి బాధితులను అటు వైపు రాకుండా నిలువరించి కబ్జాకు సహకరించిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. రాజుపాలెం మండలంలో నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే పనులు నిర్వహిస్తున్న కూలీలు, అధికారులు, ఇంజినీర్లపై ముఖ్యనేత తనయుని వర్గీయులు దాడులు చేసి గాయపరచడమే కాకుండా అక్కడ ఉన్న షెడ్లు కూల్చివేశారు. దీనిపై ఇంజినీర్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఓ మహిళతో టీడీపీ నేతలు ఎదురు కేసు పెట్టించడం, దాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగిపోయాయి. అయితే ఇల్లు ఇస్తామంటూ తన వద్ద సంతకం తీసుకున్నారని, తాను ఎవరిపై కేసులు పెట్టలేదని ఆ మహిళ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినప్పటికీ అప్పట్లో పోలీసు అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. పోలీస్ శాఖలో ఆగడాలను కొత్త బాస్‌లే అరికట్టాలి ఇలా చెప్పకుంటూ పోతే జిల్లాలో కొందరు పోలీసు అధికారులు చేస్తున్న దాష్టికాలు, దౌరజ్జన్యాలతో పోలీసు శాఖ ప్రతిష్టదిగజారిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గుంటూరు రేంజ్ డీఐజీ, అర్బన్, రూరల్ ఎస్పీలు దృష్టి సారించి పోలీసు శాఖకు చెడ్డ పేరు తెస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఫ్యాక్షన్ నిర్మూలన మొదటి ప్రాధాన్యత
- కర్నూలు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఘట్టమనేని శ్రీనివాస్ కర్నూలు : ఫ్యాక్షన్ నిర్మూలనే నా మొదటి ప్రాధాన్యత... ఎర్ర చందనం స్మగ్లింగ్, మట్కాపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ అన్నారు. కర్నూలు బి.క్యాంప్‌లోని కార్యాలయంలో బుధవారం ఆయన డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కర్నూలు సిల్వర్‌జుబ్లీ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నాని, జిల్లాపై పూర్తి అవగాహన ఉందని చెప్పారు. పాలనాపరమైన విషయాల్లో ఎస్పీలకు అండగా ఉంటానన్నారు. అనంతరం ఎస్పీ గోపీనాథ్ జట్టి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అడిషనల్ ఎస్పీలు షేక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు, ఇతర అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఘట్టమనేని ఉద్యోగ ప్రస్థానం... ఘట్టమనేని శ్రీనివాస్ స్వస్థలం అనంతపురం జిల్లా గుంతకల్లు. 1986లో కర్నూలు జిల్లా లొద్దిపల్లెలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1990లో ఏపీపీఎస్సీ గ్రూప్1 పరీక్షలో మంచి ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో డీఎస్పీగా నియమితులయ్యారు. అనంతరం ప్రొద్దుటూరు, కడప డీఎస్పీగా, హైదరబాదులో ఏసీపీగా, అడిషనల్ డీసీపీగా, మెదక్‌లో అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించారు. శాంతిభద్రతలు, ఆపరేషన్లలో భాగంగా ఆఫ్రికా, యూఎస్ఏ, స్వీడన్ దేశాలకు వెళ్లారు. తూర్పుగోదావరి, విశాఖపట్నం రూరల్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ పదోన్నతిపై డీఐజీగా కర్నూలుకు వచ్చారు. -
ముగ్గురు సీఐలకు స్థానచలనం
కర్నూలు : జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం డీఐజీ రమణకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదోని పీసీఆర్‌లో పనిచేస్తూ సెలవుల్లో ఉన్న శ్రీనివాసమూర్తి శ్రీశైలానికి బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న విజయకృష్ణ గత నెల 30న పదవీ విరమణ చేయడంతో శ్రీనివాసమూర్తిని నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్న రాముకు పదోన్నతి కల్పించి మంత్రాలయానికి బదిలీ చేశారు. కర్నూలు నేర పరిశోధన విభాగంలో అటాచ్ విధుల కింద ఉంటూ డీఐజీ కార్యాలయంలో లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మధుసూదన్‌రావును సీసీఎస్‌లోనే నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: గుంటూరు డీఐజీ
ఏలూరు అర్బన్: ఏలూరు మండలం మాదేపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గుంటూరు రేంజ్ డీఐజీ ఎన్.సంజయ్ శుక్రవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నరసాపురంలో జరిగిన క్రిస్టియన్ సమావేశాల్లో మృతుడు జుజ్జవరపు ఉదయరాజు వీడియో చిత్రీకరణ చేశారని, రోజుపాటు తనతో సన్నిహితంగా మెలిగాడన్నారు. అలాంటి వ్యక్తి మృత్యువాత పడటం బాధ కలిగించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించి గుంటూరు తిరిగి వెళ్తూ మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు నగరానికి వచ్చానని చెప్పారు. ప్రమాదానికి రోడ్డు మరమ్మతులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోందన్నారు. మరమ్మతులు చేసే చోట ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవని, వెలుగు లేకపోవడం కూడా కారణమన్నారు. అనంతరం సత్రంపాడులో ఉన్న మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పి.భాస్కరరావు, సీఐలు అడపా నాగమురళి, జి.మధుబాబు ఆయన వెంట ఉన్నారు. -
ఉదాసీనతే అక్రమాలకు ఊతం!
- కట్టుకథలతో కమిషనర్ కళ్లకు గంతలు - సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫీల్‌గుడ్ కలరింగ్ - ఆయన ఆదేశాల కంటే తామే మెరుగ్గా ఆడిట్ చేయించామన్న డీఐజీలు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో రోజురోజుకూ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమాయలో పలువురు సబ్రిజిస్ట్రార్ల లీలలు బట్టబయలైన విషయం తెలిసిందే. తాజాగా ఆ శాఖ ఉన్నతాధికారి ఉదాసీనతే అనేక అక్రమాలకు ఊతమిచ్చిందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్(సీఐజీ)కళ్లకు కొంతమంది అధికారులు గంతలు కట్టారు. కమిషనర్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, 12 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీ వ్యవహారాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయంటూ కొందరు డీఐజీలు, మరికొందరు జిల్లా రిజిస్ట్రార్లు రెండేళ్లుగా కప్పిపుచ్చారు. పరిపాలన పరంగా కమిషనర్ అడపాదడపా ఇస్తున్న ఆదేశాల కంటే మెరుగైన ఆదేశాలిచ్చి క్షేత్రస్థాయి సిబ్బందిని తమ అదుపాజ్ఞల్లోనే ఉంచుకుంటున్నామంటూ కమిషనర్‌కు కట్టుకథలు చెప్పి మభ్యపెట్టారు. దీంతో రెండేళ్లుగా కమిషనర్ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ప్రతిఏటా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగడంతో వచ్చిన క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటున్న కమిషనర్ ఆ శాఖలో అక్రమాలను పసిగట్టడంలో పూర్తిగా విఫలమయ్యా రనే వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చినా, తన చేతికి మకిలి అంటకూడద న్నట్లుగా ప్రభుత్వానికి ఒక నివేదిక పంపి చేతులు దులిపేసుకున్నారు. 10 రోజులుగా ప్రభు త్వ భూముల కుంభ కోణం, సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో అక్రమ రిజిస్ట్రేష న్లు, పలువురు సబ్ రిజి స్ట్రార్లు అరెస్ట్ వంటి సంఘ టనలు చోటు చేసుకుంటు న్నా కమిషనర్ ఒక్కరోజు కూడా కార్యాలయానికి రాకపోవడం గమనార్హం. మెరుగు పర్చారా.. బలహీన పర్చారా! హైదరాబాద్‌లోని కూకట్పల్లి, బాలా నగర్, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా మీడియాలో వార్తలు రావడంతో అక్రమాలను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) ఆరు నెలల కిందటే హుకూం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముగ్గురు జిల్లా(ఆడిట్)రిజిస్ట్రార్లతో ప్రత్యేక ఆడిట్ టీమ్‌ను ఏర్పాటు చేస్తూ గత ఫిబ్రవరిలో కమిషనర్ ఆదేశాలిచ్చారు. జూన్ 2లోగా నివేదిక సమర్పించాలని ఆ టీమ్‌కు దిశానిర్దేశం కూడా చేశారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు సరిగా లేవని, ఆయన చెప్పిన దానికంటే మెరుగ్గా ఆడిట్ చేయించేందుకు తాము రెండు బృందాలను ఏర్పాటు చేశామని రంగారెడ్డి జిల్లాకు చెందిన డీఐజీ ఒకరు చెబుతున్నారు. కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను మీరెలా రద్దు చేస్తారని ఆయనను ప్రశ్నిస్తే, కమిషనర్ ఆదేశాలు రద్దు చేయలేదని, ఆడిట్ ప్రక్రియను మెరుగుపరచామని బుకాయించారు. వాస్తవానికి కమిషనర్ ఏర్పాటు చేసిన ఆడిట్ టీమ్‌ను తనిఖీలకు పంపితే తమ బండారాలు బయటపడతాయనే కొందరు సబ్ రిజిస్ట్రార్లు, డీఐజీపై ఒత్తిడి తెచ్చి బలహీనమైన తనిఖీ బృందాలను వేయించుకున్నారని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది అంటున్నారు. -
రేటింగ్ ఏజెన్సీలపై అరవింద్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రపంచ రేటింగ్ ఏజెన్సీలపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేటింగ్ ఏజెన్సీల పేరుతో ఆడుకుంటున్నాయనీ మండిపడ్డారు. వాటివి పూర్ స్టాండర్డ్స్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలలో భారత్‌లో బలమైన ఆర్థిక పనితీరు ఉన్నప్పటికీ భారత ర్యాంకింగ్‌ను మెరుగుపర్చడం లేదని ఆయన విమర్శించారు. వికెఆర్వి మెమోరియల్ లెక్చర్ సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సంవత్సరాల్లో ఆర్ధిక ఫండమెంటల్స్ (ద్రవ్యోల్బణం, పెరుగుదల, ప్రస్తుత ఖాతా పనితీరు)లో స్పష్టమైన మెరుగుదలలు ఉన్నప్పటికీ, రేటింగ్ ఏజెన్సీలు భారత్‌కు బీబీబీ రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు చైనా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనప్పటికీ, దానికి రేటింగ్‌ను ఏఏగా అప్ గ్రేడ్ చేస్తున్నారని ఆరోపించారు. మరో మాటలో చెప్పాలంటే రేటింగ్ ఏజెన్సీలు చైనా, భారత్ రేటింగ్ విషయంలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఇలాంటి రేటింగ్లను విశ్లేషకులందరినీ మనం సీరియస్‌గా ఎందుకు తీసుకోవాలని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. దేశీయంగా నిపుణుల విశ్లేషణలకు, అధికారిక నిర్ణయాలకు సారూప్యం ఉంటోందన్నారు. విధాన నిర్ణయాల ముందు, నిపుణ విశ్లేషణ తరచుగా భిన్నంగా ఉన్నా, నిర్ణయాలు తీసుకున్నతర్వాత విశ్లేషణ ధ్వని మరియు స్వరం మారుతోందన్నారు. అధికారిక నిర్ణయాన్ని హేతుబద్ధంగా విశ్లేషిస్తున్నారని సుబ్రహ్మణ్యన్ చెప్పారు. అనేక ఆర్థిక సంక్షోభ సమయాల్లో ముందస్తు హెచ్చరికలు జారీచేయడంలో రేటింగ్ ఏజెన్సీలు వరుసగా విఫలమవుతూ వచ్చాయంటూ దాడి చేశారు. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన తనఖా-రుణాల సెక్యూరిటీలకు ఏఏఏ రేటింగ్ ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడులను బాగా ఆకర్షిస్తోందన్నారు. అధికారంలోకివచ్చిన 2014నుంచి విధానాలను క్రమబద్దీకరించడానికి , ద్రవ్యోల్బణ అదుపునకు చర్యలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
మూడో బెటాలియన్ రేంజ్ డీఐజీగా విజయ్‌కుమార్
– ముగ్గురు సీఎంల దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహణ – బెటాలియన్స్ ఐజీ నుంచి బాధ్యతలు స్వీకరణ కర్నూలు: ఏపీఎస్పీ మూడో బెటాలియన్ రేంజ్ డీఐజీగా (కర్నూలు, కడప, అనంతపురం) గోగినేని విజయ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో డీఐజీగా ఉన్న ప్రసాదబాబు పదవీవిరమణ పొందారు. ఆ స్థానంలో ఇప్పటి వరకు కర్నూలు రెండో పటాలం కమాండెంట్‌గా విధులు నిర్వహించిన విజయ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఈనెల మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లో బెటాలియన్స్ ఐజీ ఆర్పీ మీనా నుంచి విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 2013 అక్టోబరు 29 నుంచి మూడు సంవత్సరాల ఐదు నెలల పాటు ఈయన రెండవ పటాలం కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం, గూడవల్లికి చెందిన వెంకటసుబ్బయ్య, చిన్నామణి దంపతులకు ఐదుగురు సంతానం కాగా, చిన్న కుమారుడైన విజయ్‌కుమార్.. బీ.కాం వరకు చదువుకున్నారు. 1982లో ఆర్ఎస్ఐ హోదాలో ఏపీఎస్పీ విభాగంలో విధుల్లో చేరి హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. తర్వాత వరంగల్ 4వ బెటాలియన్‌లో పని చేశారు. 1985 నుంచి 1998 వరకు సుమారు 13 సంవత్సరాల పాటు అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. 1988లో ఆర్ఐగా పదోన్నతి పొందినప్పటికీ, సీఎం సెక్యూరిటీలోనే విధులు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు నల్గొండ బెటాలియన్‌లో ఆర్ఐగా విధులు నిర్వహించారు. 2001 నుంచి 2012 వరకు స్పెషల్ ఇంటలిజెన్సీ బ్రాంచి (నక్సల్స్ వింగ్)లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. 2012లో కాకినాడ, సత్తిపల్లి బెటాలియన్స్‌లో పని చేశారు. 2013 అక్టోబరు 29 నుంచి ఇప్పటి వరకు కర్నూలు రెండో పటాలం కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈయన ఇద్దరు కూతుళ్లు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. ఇండియన్ పోలీస్ మెడల్, ఉత్తమ సేవా పతకంతో పాటు సుమారు 50 నగదు రివార్డులను ఈయన విధి నిర్వహణలో అందుకున్నారు. నెల రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన ఈయన శుక్రవారం హైదరాబాద్ చేరుకొని బెటాలియన్స్ ఐజీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. రెండో పటాలంకు చెందిన పలువురు అధికారులు ఈ సందర్బంగా విజయ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదు
= పోలీసు అధికారులకు డీఐజీ ప్రభాకర్‌రావు = జిల్లా పోలీసు కార్యాలయం, డీసీఆర్‌బీల తనిఖీ అనంతపురం సెంట్రల్ : ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగదని అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం, డిస్టిక్ క్రైం రికార్డు బ్యూరో(డీసీఆర్బీ)లను డీఐజీ తనిఖీ చేశారు. ముందుగా పోలీసు కాన్ఫరె¯Œ్స హాలులో సమావేశం నిర్వహించారు. రోజువారి విధులు, పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పనితీరు, గణాంకాలకు సంబంధించి జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు పవర్‌పాయింట్ ప్రెజెంటేష¯ŒS ద్వారా వివరించారు. జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ‘సన్నిహితం’ పేరుతో మరో కొత్తయాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. కొత్త యాప్ విధివిధానాలను వివరించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది బాగా పని చేస్తే క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కానిస్టేబుళ్లు, అధికారులు సంతృప్తి చెందుతారన్నారు. ప్రజల పిటిషన్లకు కూడా వేగంగా పరిష్కారం చూపించాలన్నారు. అలాగే ప్రతి అంశాన్నీ లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం, డీసీఆర్బీలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మాల్యాద్రి, శ్రీనివాసరావు, డీఎస్పీలు మల్లికార్జున, మల్లికార్జునవర్మ, చిన్నికృష్ణ, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సూర్యనారాయణ, డీఐజీ మేనేజర్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పటిష్టంగా సీపీవో వ్యవస్థ : డీఐజీ రామకృష్ణ
కొవ్వూరు : జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ అ«ధికారుల (సీపీవో) వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఐజీ పీఎస్వీ రామకృష్ణ తెలిపారు. పట్టణంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఆయన రికార్డులు పరిశీలించారు. పట్టణం, రూరల్ సర్కిళ్ల పరిధిలో కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం డీఐజీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ నిస్వార్థంగా పోలీసు సేవలందించాలనుకునే వారు సీపీవోలుగా చేరవచ్చని సూచించారు. క్షుణ్ణం జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు జిల్లాకు అదనంగా 13 పెట్రోలింగ్ వాహనాలు కేటాయించారని, నెల రోజుల్లో జిల్లాకు వస్తాయని తెలిపారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న 13 స్టేషన్లకు పె ట్రోలింగ్ వాహనాలు కేటాయిస్తామన్నారు. ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను జోన్లుగా విభజించి ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సై, సీఐ, డీఎస్పీలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐలు ఎం.సుబ్బారావు, పి.ప్రసాదరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే చర్యలు
– వివాహాల నమోదు తప్పని సరి – ఈసీ నకలుకు మీసేవ.. నగదు చెల్లింపులకు ఈ– చలానా – జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు కర్నూలు (టౌన్): రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనవసర జాప్యాన్ని సహించమని.. అలాగే డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులపై శాఖ పరమైన చర్యలు తప్పవని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు హెచ్చరించారు. డబుల్ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చట్టం 22 (బి) ని అమలో్లకి తీసుకువచ్చిందని ఆయన వెల్లడించారు. శనివారం స్థానిక ఆ శాఖ కార్యాలయంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆస్తులు కొనేటప్పుడు జాగ్రత్తలు తప్పని సరి: ఆస్తులు కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ ధరకు వస్తుంది కదా అని తొందరపడి కొనుగోలు చేసి మోసపోవద్దు. ముందుగా ఈసీ నకలు తీసుకొని చూడాలి. ఏవైన సందేహాలు ఉంటే సంబంధిత సబ్ రిజిస్ట్రార్లను సంప్రదించాలి. ఉమ్మడి కుటుంబాలు తగాదాలు పడకుండా ఆస్తిని భాగపరిష్కారాలు చేసుకోవడం మంచిది. వివాదాస్పద, నిషేధిత ఆస్తులతో అన్ని ఇబ్బందులే వివాదాస్పద, నిషేధిత ( దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, క్రైస్తవ సంస్థలు) ఆస్తులు కొనుగోలు చేయరాదు. తీసుకుంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వీలునామాతో ఆస్తులను తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోకి తీసుకురావాలి. అలాగే డబ్బును రిజిస్ట్రార్ అయిన చిట్ ఫండ్ కంపెనీల్లో మాత్రమే పొదుపు చేసుకోవాలి. వివాహాల రిజిస్ట్రేషన్ తప్పని సరి ప్రేమ పెళ్లిలు చేసుకున్న వారే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇది సరి కాదు. నిర్బంధ వివాహా చట్టం ద్వారా ప్రతి పెళ్లిని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 40 నుంచి 50 సంవత్సరాల క్రితం జరిగిన వివాహాల విషయంలో కూడా తగు ఆధారాలు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాకాలు అందాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పని సరి. మీ –సేవ, ఈ– చలానాలను సద్వినియోగం చేసుకోండి దస్తావేజుల కోసం చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను ్చp.ట్ఛజజీట్టట్చ్టజీౌn.జౌఠి.జీn లో చలానాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అనుబంధంగా ఉన్న బ్యాంకులో్ల ఆ మొత్తాన్ని చెల్లిస్తే వారికి ఆన్లైన్ ద్వారా సమాచారం చేరుతుంది. నకలు, ఈసీ, మ్యారేజ్ సర్టిఫికెట్ల కోరకు చెల్లించాల్సిన రుసుమును ఈ– పోస్ మిషన్, ఏటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. పనుల్లో జాప్యం జరిగితే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు కల్లూరు, కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనుల్లో జాప్యం జరిగినా.. ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నా మాకు ఫిర్యాదు చేసే్త సంబందిత ఉద్యోగులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటాం. కంప్యూటర్ సిబ్బంది, మధ్యవర్తులు, అనధికార వ్యక్తుల జోక్యంపై ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. -
డీఐజీ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : కర్నూలు శివారులోని బీ.క్యాంపులో ఆధునికీకరించిన డీఐజీ కార్యాలయాన్ని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు పునఃప్రారంభించారు. ఆదివారం స్థానిక కార్యాలయానికి వచ్చిన ఐజీ శ్రీధర్‌రావుకు డీఐజీ రమణకుమార్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఐజీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆధునికీకరించిన డీఐజీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారుల తనిఖీ పుస్తకంలో విజిట్ వివరాలు రాశారు. కార్యాలయ సిబ్బంది పనితీరును పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు, కడప ఎస్పీలు ఆకే రవికృష్ణ, రామకృష్ణ, ఏఆర్ ఏఎస్పీ వెంకటేష్, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీధర్, సీఐలు శ్రీనివాసరావు, బీవీ మధుసూదన్‌రావు, త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు, డీఈ కృష్ణారెడ్డి, డీఐజీ సీసీ కనక నారాయణ, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, డీఐజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ముద్రగడ యాత్రకు అనుమతులు లేవు
ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ రావులపాలెం (కొత్తపేట) : ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ స్పష్టం చేశారు. రావులపాలెంలో చేపడుతున్న ముందస్తు చర్యలు పర్యవేక్షించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అనుమతులు కోరుతూ పోలీస్ అధికారులకు ఎవ్వరూ దరఖాస్తు చేయలేదన్నారు. అనుమతులు లేనందునా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు పోలీస్‌స్టేçÙ¯ŒSలో బందోబస్తు చర్యల్లో భాగంగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. బందోబస్తుపై సమీక్ష అమలాపురం టౌ¯ŒS : కాపుల పాదయాత్రకు సంబంధించి అమలాపురం పట్టణ పోలీసు స్టేష¯ŒSలో ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ పోలీసు అధికారులతో సోమవారం రాత్రి సమీక్షించారు. యాత్ర అనివార్యమైతే అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించారు. కోనసీమలో జిల్లాల వారీగా నియమింపబడ్డ బందోబస్తుల జాబితాలకు అనుగుణంగా ప్రతి మండలంలో పోలీసు బలగాలపై ఆరా తీశారు. వంతెనలపై ఏర్పాటు చేసే చెక్ పోస్టులు, డ్రో¯ŒS కెమెరాలు, రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్సు తదితర అంశాలపై ఆయన లోతుగా సమీక్షించారు. డీఎస్పీ లంక అంకయ్య, సీఐలు వైఆర్కే శ్రీనివాస్, జి.దేవకుమార్, ఇతర సీఐల నుంచి కూడా డీఐజీ బందోబస్తుకు సంబంధించి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. కోనసీమ దిగ్బంధనానికి రూపొం దించిన ప్రణాళికపై ఆయన చర్చించారు. -
ఏలూరు రేంజ్లో 13 మంది సీఐల బదిలీ
ఏలూరు అర్బ న్ : ఏలూరు రేంజ్లో 13 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో పని చేస్తున్న వీరికి రేంజ్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. సీఐ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం పి.మురళీకృష్ణారెడ్డి కాకినాడ వ న్‌టౌ న్ రాజమండ్రి సీసీఎస్ జె.జోగేశ్వరరావు పశ్చిమ గోదావరి (అటాచ్) తూర్పు గోదావరి (వీఆర్) ఎస్ఎస్వీ నాగరాజు ఏలూరు (సీఐడీ) భీమవరం రూరల్ ఆర్జీ జయసూర్య భీమవరం రూరల్ డీసీఆర్బీ ఏలూరు కె.వెంకటేశ్వరరావు రాజమండ్రి (వీఆర్) విజయవాడ సిటీ ఎ.శ్రీనివాసరావు తూర్పు గోదావరి (వీఆర్) ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) జి.సత్యనారాయణ ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) వీఆర్ (పశ్చిమ గోదావరి) ఎల్.రవితేజ వీఆర్ (పశ్చిమ గోదావరి) వీఆర్ (కృష్ణా) బి.పెద్దిరాజు వీఆర్ (కృష్ణా) రావులపాలెం పి.వెంకటరమణ రావులపాలెం డీఎస్బీ, కాకినాడ వి.శ్రీనివాస్ డీఎస్బీ, కాకినాడ తుని బి.అప్పారావు తుని టౌ న్ పిఠాపురం మహ్మద్ ఉమర్ పిఠాపురం కాకినాడ టూటౌ న్ -
రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాధ్యత స్వీకరణ
కర్నూలు (టౌన్): స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీగా శ్రీనివాసరావు శనివారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించి డీఐజీగా ఇక్కడ నియమించింది. ఇక్కడ డీఐజీగా పనిచేస్తున్న సాయిప్రసాద్ పదవీ విరమణ పొందారు. -
రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి
జంగారెడ్డిగూడెం : రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించామని ఏలూరు రేంజ్ డీఐజీ పి.వి.రామకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వెల్లడించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఓ ప్రణాళిక రూపొందించనున్నట్టు వివరించారు. దీనికోసం ఆర్అండ్బీ, హైవే అథారిటీ, ఇంజనీరింగ్ అధికారుల సహకారం కూడా తీసుకోనున్నట్టు చెప్పారు. వాహన చోదకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. జిల్లాలోని పోలీస్స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఐజీ వెల్లడించారు. ఏలూరు రేంజ్ పరిధిలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని డీఐజీ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు వైపు అక్కడక్కడ మావోయిస్టులు ఉన్నారని, చత్తీస్‌గఢ్ నుంచి వీరు వచ్చినట్లు సమాచారం ఉందని వివరించారు. ఇటీవల ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో వారు ప్రతీకార చర్యలకు పూనుకునే అవకాశం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. మావోయిస్టుల కదలికపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కమ్యునిటీ పోలీసు వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్ మాట్లాడుతూ కోడిపందేలపై త్వరలో ప్రత్యేక వివరణ ఇస్తామన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. కోర్టు ఉత్తర్వులు అందిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎం.కేశవరావు, ట్రాఫిక్ ఎస్సై ఆనందరెడ్డి పాల్గొన్నారు. -
నేరాల సంఖ్య తగ్గుముఖం
పెదవేగి రూరల్ : ఏలూరు రేంజ్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని డీఐజీ పి.వి.ఎస్.రామకృష్ణ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా సోమవారం పెదవేగి పోలీస్ స్టేష¯ŒSను ఆయన తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, స్టేష¯ŒS పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు.అనంతరం నేరాల నమోదు, రికార్డులను పరిశీలించిన డీఐజీ పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావకు సూచనలిచ్చారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలను నియంత్రించాల్సి ఉందని తెలిపారు. దీనికోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో సంప్రదాయాలకు గౌరవం ఇస్తూనే వాటి ముసుగులో చేసే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. పోలీసుల పని తీరుపై ర్యాంకుల విధానం ప్రవేశపెట్టి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులతోపాటు రివార్డులను ఇస్తున్నట్టు వివరించారు. జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో రెండు రివార్డులు అందుకున్నారని చెప్పారు. నేరాలను అదుపు చేయడంతోపాటు నేరాల సంఖ్యను తగ్గించడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. తొలుత డీఐజీకి ఎస్పీ భాస్కర భూషణ్ పుష్పగుచ్ఛం అందించి, స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించిన ఆయన పోలీస్ క్వార్టర్స్, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ భాస్కర భూషణ్, ఏలూరు డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ అడపా నాగమురళి, పెదవేగి ఎస్సై రామకోటేశ్వరరావు, ఎస్సై చిరంజీవి సిబ్బంది ఉన్నారు. -
గంజాయి అక్రమ రవాణా నిరోధానికి చర్యలు
ఒడిషా, తెలంగాణ సహకారం తీసుకుంటాం ∙ ఏలూరు రేంజ్ డీఐజీ రామకృష్ణ రాజమహేంద్రవరం క్రైం : ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సమన్వయంతో గంజాయిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం కేంద్రంగా గంజాయి రవాణా జరుగుతోందన్నారు. గంజాయి సాగు ఎక్కువగా విశాఖ జిల్లాలోని మన్యంలోను, ఒడిషా అటవీ ప్రాంతంలోను సాగవుతోందన్నారు. గంజాయి తరలింపును ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల సహకారంతో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లోనూ, వ్యాపార కూడళ్లలో, షాపింగ్ మాల్స్, పెద్ద ఆపార్ట్మెంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్ట వచ్చునని తెలిపారు. కేసులు సత్వర దర్యాప్తునకు చర్యలు చేపడతామన్నారు. ఎస్పీ పనితీరు భేష్ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి పని తీరు బాగుందని డీఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. మహిళలపై దాడులు, వేధింపులు అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీమ్ ఏర్పాటు చేశారని, అలాగే నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ డీఎస్పీ కుల శేఖర్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులకు పదేళ్ల జైలు ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా రాజమహేంద్రవరం క్రైం : గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ప్రాషిక్యూషన్ కథనం ప్రకారం నక్కపల్లి మండలానికి చెందిన పసగుడుగుల వెంకట రమణ, చింతపల్లి మండలానికి చెందిన వందలం కృష్ణ 2013 అక్టోబర్ 6 వ తేదీన నర్సీపట్నం వైపు నుంచి కె.ఇ. చిన్నాయి పాలెం వైపు 250 కేజీల గంజాయిని మహింద్ర వ్యాన్‌లో తలిస్తుండగా కోటనందూరు పోలీసులకు పట్టుబడ్డారు. రాజమహేంద్రవరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ జరిపారు. జడ్జి ఎ. రవీంద్రబాబు నిందితులపై నేరం రుజువు కావడంతో ఒకొక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.1 లక్షల రూపాయలు జరిమానా విధిస్తు కోర్టు శుక్రవారం తీర్పు నిచ్చింది. -
అధికార లాంఛనాలతో కానిసే్టబుల్ అంత్యక్రియలు
నందికొట్కూరు: విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ చెరకు శాంతకుమార్(42)కు అధికార లాంఛనాలతో ఆదివారం నందికొట్కూరులో అంత్యక్రియలు నిర్వహించారు. జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ శనివారం కడప జిల్లా సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం ఉదయం కానిస్టేబుల్ మృతదేహానికి డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, ఎమ్మెల్యే ఐజయ్య పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతక్రియల ఖర్చుల కింద మృతుడి భార్యకు ఎస్పీ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం డీఐజీ రమణకుమార్ మాట్లాడుతూ కడప జిల్లాలో సీఎం బందోబస్తులో విధులు నిర్వర్తిస్తుండగా తన కళ్ల ఎదుటనే ఈ సంఘటన చోటు చేసుకోవడం తనను మానసికంగా చాలా బాధించిందని కన్నీరు పెట్టుకున్నారు. సీఎంతో వెంటనే చర్చించి రూ, 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా ఒప్పించినట్లు తెలిపారు. కాగా మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా సీఎంకు లేఖ రాస్తానని, మీరు కూడా సీఎం చర్చించి న్యాయం జరిగేలా చూడాలని డీఐజీకి విన్నవించారు. అంత్యక్రియలకు సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్ఐలు జాన్, లక్ష్మీనారాయణ, సుబ్రమాణ్యం, అశోక్, రాజ్‌కుమార్, నరసింహులు, పోలీసులు హాజరయ్యారు. -
ర్యాగింగ్‌పై ఉక్కుపాదం
- డీఐజీ రమణకుమార్ మద్దికెర: విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని డీఐజీ బీవీ రమణకుమార్ అన్నారు. ర్యాగింగ్ చేస్తున్నట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌తో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. జీవితం ఎంతో విలువైనదని, ‡ క్షణికావేశానికి లోనై ప్రాణాలు తీసుకోవడం తగదన్నారు. సమస్య వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొని అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలపై ఆయా పోలీస్స్టేషన్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. డీఐజీ వెంట డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ విక్రమసింహ, ఎస్ఐ అబ్దుల్ జహీర్ ఉన్నారు. -
ఎర్రగుంట్ల ఎస్ఐ సస్పెన్షన్
ఎర్రగుంట్ల/కడప అర్బన్ : ఎర్రగుంట్ల ఎస్ఐ సి.లక్ష్మినారాయణను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కృష్ణా పుష్కరాల సందర్భంగా ఉన్నతాధికారులంతా బందోబస్తు విధుల్లో నిమగ్నమైన సమయంలో.. మట్కా నిర్వాహకుడు జిలానీ వద్ద ఆయన రూ. 2 లక్షలు తీసుకుని విచ్చలవిడిగా మట్కా నిర్వహించుకునేందుకు సహకరించినట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. కొంత కాలంగా మట్కా నిర్వహణ ఆపిన జిలానీని తిరిగి నిర్వహించుకోవాలని ఎస్ఐ సూచించినట్లు సమాచారం. అందుకు గాను రూ. 2 లక్షలు వసూలు చేసినట్లు పక్కా ఆధారాలు లభించడంతో లక్ష్మినారాయణను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. అంతేగాక ప్రతి నెల రూ. 1.20 లక్షలు ఇచ్చేలా జిలానీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదంతోపాటు ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే.. పక్కా ఆధారాలు ఉంటే పోలీసు, సిబ్బంది ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి కేసులోనూ కక్కుర్తి: కడప సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల ఎస్ఐగా పని చేసిన లక్ష్మినారాయణ ప్రతి కేసులోనూ కాసుల కోసం కక్కుర్తి పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుస్టేషన్లో వాహనాలకు డీజిల్ పట్టించాలని పెట్రోలు బంకుల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఏదైనా కేసు వస్తే ఎటువైపు వారి నుంచైనా డబ్బులు తీసుకుని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరినైనా సరే తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తారు. హనుమనగుత్తిలో టీడీపీ వారికి అనుకూలంగా వ్యవహరించి సివిల్ పంచాయితీలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. ఓ మైనింగ్ కేంద్రంలో ట్రాక్టర్ కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఆ కేసును తారుమారు చేసేందుకు మైన్స్ యజమానులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఎర్రగుంట్ల ఎస్ఐ సస్పెన్షన్
ఎర్రగుంట్ల/కడప అర్బన్ : ఎర్రగుంట్ల ఎస్ఐ సి.లక్ష్మినారాయణను సస్పెండ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ బీవీ రమణకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కృష్ణా పుష్కరాల సందర్భంగా ఉన్నతాధికారులంతా బందోబస్తు విధుల్లో నిమగ్నమైన సమయంలో.. మట్కా నిర్వాహకుడు జిలానీ వద్ద ఆయన రూ. 2 లక్షలు తీసుకుని విచ్చలవిడిగా మట్కా నిర్వహించుకునేందుకు సహకరించినట్లు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. కొంత కాలంగా మట్కా నిర్వహణ ఆపిన జిలానీని తిరిగి నిర్వహించుకోవాలని ఎస్ఐ సూచించినట్లు సమాచారం. అందుకు గాను రూ. 2 లక్షలు వసూలు చేసినట్లు పక్కా ఆధారాలు లభించడంతో లక్ష్మినారాయణను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ తెలిపారు. అంతేగాక ప్రతి నెల రూ. 1.20 లక్షలు ఇచ్చేలా జిలానీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదంతోపాటు ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే.. పక్కా ఆధారాలు ఉంటే పోలీసు, సిబ్బంది ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి కేసులోనూ కక్కుర్తి: కడప సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల ఎస్ఐగా పని చేసిన లక్ష్మినారాయణ ప్రతి కేసులోనూ కాసుల కోసం కక్కుర్తి పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుస్టేషన్లో వాహనాలకు డీజిల్ పట్టించాలని పెట్రోలు బంకుల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఏదైనా కేసు వస్తే ఎటువైపు వారి నుంచైనా డబ్బులు తీసుకుని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరినైనా సరే తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తారు. హనుమనగుత్తిలో టీడీపీ వారికి అనుకూలంగా వ్యవహరించి సివిల్ పంచాయితీలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినట్లు బాధితులు వాపోతున్నారు. ఓ మైనింగ్ కేంద్రంలో ట్రాక్టర్ కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఆ కేసును తారుమారు చేసేందుకు మైన్స్ యజమానులతో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
నేరాలు మరింత తగ్గాలి
ఏలూరు అర్బన్ : జిల్లాలో నేరాల సంఖ్య మరింతగా తగ్గాలని, దీనికోసం పోలీసులు తీవ్రంగా శ్రమించాలని ఏలూరు రేంజి డీఐజీ పి.వి.ఎస్.రామకృష్ణ, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి నేర సమీక్ష నిర్వíß ంచారు. డివిజన్ల వారీగా ప్రస్తుత నెలలో జరిగిన వివిధ నేరాలపై వారు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే అన్ని రకాల నేరాలనూ తగ్గించగలిగామని, రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే అగ్రగాములుగా ఉన్నామని పేర్కొన్నారు. ఇళ్ల చోరీలనూ గత రెండేళ్లతో పోలిస్తే గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. అదే సమయంలో జిల్లాలో హత్యలు, కొట్లాటలు, ఆర్థికనేరాలు ఆశించిన మేర తగ్గలేదని, ఈ అంశంపై జిల్లా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా పెంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నేరాలను అదుపులో ఉంచాలని సూచించారు. నేరాలపై ముందస్తు సమాచారం సేకరించేందుకు ప్రత్యేకంగా ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇటీవల జిల్లాలో ప్రత్యేకించి ఏలూరులో జరిగిన నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డీఎస్పీలు గోగుల వెంకటేశ్వరరావు, నర్రా. వెంకటేశ్వరరావు, జి.పూర్ణచంద్రరావు, కె. వెంకట్రావు, ఎస్బీ డీఎస్పీ పి.భాస్కరరావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. -
పద్ధతులు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో పని చేస్తున్న కొందరు అధికారులు, సిబ్బంది తమ పద్ధతులను మార్చుకోకపోతే వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని కడప–కర్నూలు రేంజి డీఐజీ రవికుమార్ హెచ్చరించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని డీఎస్పీలు, కడపలోని సీఐలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు ఇప్పటికైనా క్రమశిక్షణగా విధులు నిర్వర్తించాలన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రతి స్టేషన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. ఏవైనా మరమ్మతు పనులకు నిధులు అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు క్వార్టర్స్ నిర్మాణానికి సంబంధించి నిధులను మంజూరు చేయాలని జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ డీఐజీని కోరారు. కార్యక్రమంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు అశోక్‌కుమార్, రాజేంద్ర, పూజిత నీలం, లోసారి సుధాకర్, బి.శ్రీనివాసులు, వాసుదేవన్, రామకృష్ణయ్య, సర్కార్, నాగేశ్వరరెడ్డి, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు పాల్గొన్నారు. -
పట్టుబడిన వాహనాల వేలం
- డీఐజీ రమణకుమార్ జూపాడుబంగ్లా/నందికొట్కూరు: పట్టుబడిన వాహనాలను వేలం వేస్తామని డీఐజీ బీవీ రమణకుమార్ తెలిపారు. నందికొట్కూరు పట్టణంలోని సీఐ కార్యాలయం, బ్రాహ్మణ కొట్కూరు, జూపాడుబంగ్లాలోని పోలీస్స్టేషన్లను శనివారం ఆయన తనిఖీ చేశారు. కేసుల కింద స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టు అనుమతి తీసుకొని త్వరలోనే తహసీల్దార్ల సమక్షంలో వేలం వేస్తామన్నారు. స్టేషన్ పరిధిలో పట్టుబడిన వాహనాలకు క్రైం నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి అందులో పోలీసులను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో కేసులను త్వరగా ఛేదించే అవకాశం ఉందన్నారు. సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్ఐ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది, తదితరులు ఉన్నారు. -
వైద్య విద్యార్థికి ప్రణాళిక ముఖ్యం
–లక్ష్యాలను నిర్దేశించుకోవాలి - గ్లోబల్ డాక్టర్లుగా ఎదగాలి - ఫ్రెషర్స్ డే వేడుకల్లో డీఐజీ రమణకుమార్ కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యార్థులకు ప్రణాళిక ఎంతో ముఖ్యమని కర్నూలు రేంజ్ డీఐజి బీవీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజిలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ కంటే డాక్టర్ కావడమే కష్టమని, అది సాధించిన వైద్యవిద్యార్థులందరూ అభినందనీయులన్నారు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించిన తర్వాత రిలాక్స్ అవుతున్నారని, అంతటితో ఆగకుండా నిత్యం లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని సా«ధించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ధర్మరక్షక్ వంటి గొప్ప వైద్యులను ఆదర్శంగా తీసుకుని చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చిన్న డాక్టర్‌గా మిగిలిపోకుండా గ్లోబల్ డాక్టర్‌గా అయ్యేందుకు కృషి చేయాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజిలో చదివిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విషయం మరువకూడదన్నారు. నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ధర్మరక్షక్ మాట్లాడుతూ తాను 44 ఏళ్ల క్రితం ఇదే కళాశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన క్రమశిక్షణను అలవరచుకోవాలని సూచించారు. సీనియర్లను గౌరవించాలని, వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే పేదలకు సేవ చేయాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ..వైద్యవృత్తిని ప్రేమించాలన్నారు. నిరంతరం జ్ఞానసముపార్జన చేసుకుంటూ ఉంటేనే వైద్యునిగా సమాజంలో రాణిస్తారని చెప్పారు. కళాశాలలోని అత్యాధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వై. భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మెడిసిన్ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను రక్షించేందుకు సిద్ధం..
వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ ఏటూరునాగారం : ఏజెన్సీలో ఆపదలో ఉన్న ప్రజలను రక్షించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని డీఐజీ రవివర్మ అన్నారు. మండలంలోని ముల్లకట్ట హైవే బ్రిడ్జి, పుష్కరఘాట్, రామన్నగూడెం గోదావరి నది ప్రవాహాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. రామన్నగూడెం పంచాయతీ కారోబార్ వెంకటేశ్వర్లను వదర ఉధృతి పెరిగే వచ్చే నష్టాలు, ప్రజల ఇబ్బందులను డీఐజీ అడిగి తెలుసుకున్నారు. 1986 వరద ఉధృతితో మండలం అతాలకుతలం అయ్యిందని సీఐ రఘుచందర్ డీఐజీకి వివరించారు. కరకట్ట నిర్మాణం లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండేదని ఏఎస్పీ విశ్వజిత్ కాంపాటి వెల్లడించారు. అలాగే కరకట్ట పటిష్టత, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పరవళ్లు ఏటూరునాగారం : ఎగువ ప్రాంతాల్లోని బ్యారేజీల ద్వారా నీటిని విడుదల చేయడంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రం 6 గంటల వరకు 7.66 మీటర్లకు చేరింది. ఉదయం 6 గంటలకు 8 మీటర్లకు చేరగా, క్రమంగా తగ్గింది. అయితే మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. తహశీల్దార్ నరేందర్ రామన్నగూడెం ఘాట్‌ను సందర్శించి మొదటి, రెండు, మూడో ప్రమాద హెచ్చరిక మీటర్లను ఏర్పాటు చేయించారు. తహశీల్దార్ వెంట ఆర్ఐ సర్వర్‌పాషా, వీఆర్వో నర్సయ్య ఉన్నారు. కాగా, వరదలతో ఇబ్బంది పడే ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అవసరమైన వారు 08717–231365 నెంబర్‌కు ఫో¯ŒS చేసి సమాచారం ఇవ్వాలని రెవెన్యూ అధికారులు కోరారు. -
డీఐజీగా రవివర్మ బాధ్యతల స్వీకరణ
వరంగల్ : వరంగల్ రేంజ్ డిఐజీగా, కరీంనగర్ రేంజ్ ఇన్చార్జి డీఐజీగా సి.రవివర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సభర్వాల్ నుంచి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రవి వర్మ మాట్లాడుతూ వరంగల్, కరీంనగర్ రేంజ్ పరిధిలో నేరాల అదుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయం లో రాజీపడే ప్రసక్తి లేదని, రెండు రేంజ్‌ల పరిధిలోని పోలీసులు ఒకే టీంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. జిల్లాకు సుపరిచితులే... డీఐజీ రవివర్మ జిల్లాకు సుపరిచుతులే. ములు గు డీఎస్పీగా 1990–92 మధ్య కాలంలో పనిచేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా, ఎల్బీనగర్ డీసీపీగా, హైదరాబాద్ క్రైం, వెస్ట్‌జోన్ డీసీపీగా, సీఐడీ డీఐజీగా పనిచేశారు. వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన రవివర్మకు వరంగల్ రూరల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఎస్పీలు అంబర్ కిషోర్‌ఝూ, షానవాజ్ ఖాసీం, విక్రమ్‌జిత్ దుగ్గల్, జోయల్ డేవిడ్‌లు అభినందనలు తెలిపారు. -
బాధితులకు భరోసా కల్పించండి
– ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన డీఐజీ – పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సందర్శన – జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్ పరిశీలన జూపాడుబంగ్లా: పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం అందుతుందనే భరోసా కల్పించేలా సిబ్బంది వ్యహరించాలని డీఐజీ రమణకుమార్ అన్నారు. పారుమంచాల గ్రామానికి చెందిన ఇండియన్ డిఫెన్స్ సర్వీసు అధికారి ధర్మారెడ్డి తండ్రి ఆర్లపాటి సుబ్బారెడ్డి గత నెల 24న మతి చెందారు. ఈ సందర్భంగా డీఐజీ రమణకుమార్ శనివారం పారుమంచాల గ్రామానికి చేరుకొని «ధర్మారెడ్డి, అతని తల్లి వెంకటలక్ష్మమ్మను పరామర్శించారు. అనంతరం ధర్మారెడ్డితో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం డీఐజీ పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించి పాత, కొత్త గేట్లను పరిశీలించారు. నీటి విడుదల వివరాలను ఎన్సీఎల్ సిబ్బంది రమణ వివరించారు. అనంతరం ఆయన జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు చేరుకొని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది వివరాలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులపట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించటంతోపాటు వారిచ్చే ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలన్నారు. న్యాయ, అన్యాయాలను విచారించి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ, న ందికొట్కూరు సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్ఐలు సుబ్రమణ్యం, శివాంజల్, లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
శ్రీశైలం: కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను డీఐజీ రమణకుమార్ ఆదేశించారు. గురువారం ఉదయం పుష్కరనగర్ 1 ప్రాంగణంలో ఓఎస్డి రవిప్రకాశ్, ట్రాఫిక్ డీఎస్పీలు రామచంద్ర, వినోద్‌కుమార్‌లతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఏ సెక్టార్, బీ సెక్టార్లుగా ట్రాఫిక్‌ను విభజించామని, ఆయా సెక్టార్లలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు, అదనపు ఎస్పీ ట్రాఫిక్ ఇన్చార్జి, ఓఎస్డి రవిప్రకాశ్‌కు సమాచారం అందజేయాలన్నారు. సమావేశానంతరం ఆయన ట్రాఫిక్ పోలీసులకు అత్యవసర మైన మందులు ఉచితంగా అందజేశారు. -
కృష్ణా పుష్కరాలకు ట్రాఫిక్ మళ్లింపు
ఏలూరు (మెట్రో): కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో డీఐజీ మాట్లాడారు. చెన్నై నుంచి విశాఖ వెళ్లే వాహనాలు, విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల దారి మళ్లించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. త్వరలోనే ట్రైల్ రన్ వేసి మార్గాలను ప్రకటిస్తామని చెప్పారు. ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. పుష్కర యాత్రికుల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాల వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఘాట్ ప్రాంతంలో ప్రత్యేకంగా లోపలికి, బయటకు వేర్వేరు మార్గాలకు ఏర్పాట్లుచేశామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. -
పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3300 మంది
విజయవాడ : పుష్కరాల ట్రాఫిక్ నియంత్రణకు 3,300 మంది సిబ్బందిని నియమించినట్లు డీఐజీ శ్రీకాంత్ వెల్లడించారు. శనివారం విజయవాడలో డీఐజీ శ్రీకాంత్ మాట్లాడుతూ... విజయవాడ నగరాన్ని 19 జోన్లు, 70 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. 276 ఎకరాల్లో 122 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అటు నెహ్రు బస్టాండ్ నుంచి కుమ్మరపాలెం వరకు.... ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి వన్‌టౌన్‌లోని అప్పారావు కూల్ డ్రింక్ షాప్ వరకు నో వెహికిల్ జోన్‌గా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రకాశం బ్యారేజీపైనా వాహనాలతోపాటు భక్తులకు కూడా అనుమతి లేదని డీఐజీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. -
ఈరన్న సన్నిధిలో డీఐజీ
మంత్రాలయం : డీఐజీ రమణకుమార్ మంగళవారం సతీసమేతంగా ఉరుకుంద క్షేత్రానికి వెళ్లి ఈరన్నస్వామిని దర్శించుకున్నారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు నేతత్వంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ దంపతులు స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట డీఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐలు నాగేశ్వరావు, దైవప్రసాద్, ఎస్ఐ నల్లప్ప, సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఉన్నారు. -
బాధ్యతాయుతంగా పనిచేయండి
– పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలుండొద్దు – డీఐజీ అకున్‌సబర్వాల్ మహబూబ్‌నగర్ క్రైం : పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీసుశాఖ పాత్ర కీలకంగా ఉంటుందని, శాంతిభద్రతలకు, పార్కింగ్, ట్రాఫిక్సమస్య రాకుండా సమయస్ఫూర్తిగా పనిచేయాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకూన్ సబర్వాల్ ఆదేశించారు. పుష్కర బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించటానికి సోమవారం ఉదయం డీఐజీ జిల్లా పోలీసు కార్యాలయంలో శాఖ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయటంలో విజ్ఞత కనపర్చాలన్నారు. పోలీసు బందోబస్తుపైనే పుష్కరాల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని అందరు గుర్తుంచుకొని ప్రతిక్షణం జాగ్రత్తతో మసలుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పుష్కరఘాట్ల వద్ద బందోబస్తు నిర్వాహణ ప్రణాళికను కంప్యూటర్ చిత్రపటాల ద్వారా వీక్షించిన డీఐజీ సంతృప్తిని వ్యక్తపరిచారు. బందోబస్తు నిర్వాహణతో పాటు, గత అనుభవాలు, ప్రాంత చరిత్రను బట్టి తీసుకుంటున్న జాగ్రత్తలను ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి వివరించారు. సిబ్బందికి విధి నిర్వాహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాత్రికులకు సూచనలందిస్తూ ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలు, తయారుచేస్తున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ డివి.శ్రీనివాస్‌రావు, ఏఎస్పీ కల్మేశ్వర్ సింగేనవర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ లావణ్య, డీఎస్పీలు చెన్నయ్య, బాలకోటి, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.