
రథ సప్తమికి భారీ బందోబస్తు
ఈనెల 26న రథసప్తమి సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు డీఐజీ ఎ.రవి చంద్రన్ తెలిపారు.
అరసవల్లి: ఈనెల 26న రథసప్తమి సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు డీఐజీ ఎ.రవి చంద్రన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు వేలాదిగా తరలిరానుండటంతో తగిన ఏర్పట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని డీఐజీ తెలిపారు.