Arasavalli Suryanarayana Temple
-
Singer Mangli: పాట పాడలేదని ఇంత పగనా?
అమరావతి: ప్రముఖ గాయని మంగ్లీపై టీడీపీ & కో సోషల్ మీడియా వేదికగా మామూలు విషం చిమ్మడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆమె చంద్రబాబుపై పాట పాడమని టీడీపీ కోరింది. అయితే అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో వైఎస్ జగన్ మీద అభిమానంతో ఓ పాట పాడారు. ఈ క్రమంలో ఆ కోపాన్ని ఇప్పుడు సందర్భం రావడంతో ప్రదర్శిస్తోంది యెల్లో బ్యాచ్. శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల నాలుగో తేదీన గాయని మంగ్లీ(Singer Mangli) బృందం పాటల కార్యక్రమం ఏర్పాటు నిర్వహించింది. ఆ టైంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళుతూ.. సింగర్ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన దృశ్యాలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఇప్పుడు పోస్ట్ చేస్తోంది. చంద్రబాబు పేరును పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ ఎలా లోపలికి తీసుకెళ్తారంటూ రామ్మోహన్నాయుడును టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో.. అసలు ఆమెకు గుడిలోకి వెళ్లే అర్హతే లేదన్నట్లు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. అదే టైంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంగ్లీ టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారుగా పని చేశారని గుర్తు చేస్తూ ఆ విమర్శలను ఇంకా తీవ్ర తరం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అనుకూల మీడియా సైతం ఈ విమర్శలను ప్రముఖంగా ప్రచురిస్తుండడం గమనార్హం. మరోవైైపు.. ఒక కళాకారిణిగా ఆమెకు రాజకీయాలను ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని కొందరు ఆమెకు మద్ధతుగా నిలుస్తుండడం విశేషం.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అరసవిల్లి ఎల్లొద్దాం పదర్రా !!
ఓరి సూర్నారాయనా... ఓసి ఉషా..పదర్రా బేగి బయలుదేరితే అరసవిల్లి ఎల్లి ఎలిపొద్దుము.. ఈరోజు అసలే రథ సప్తమి. అలాగ వెళ్లి... దేముడికి దండం పెట్టిసి వచ్చిద్దుము... గాబరా పెడుతున్నాడు సురేసు... ఓరి గుంటడా ఒట్టి నీళ్ళు కాదురా బుర్రమీద రేగిపళ్ళు... జిల్లేడు ఆకు పెట్టుకుని పోసుకోరా పెరట్లొంచి మనవడు ఆదిత్య మీద కేకేసింది నానమ్మ సూరమ్మ.. ఏటే నాయినమ్మా పొద్దుట నుంచి గొల్లు గొల్లు పెడతన్నావు.. చిరాకు పడ్డాడు ఆదిత్య . గొల్లు కాదురా పిక్కిరోడా మన ఊరి దేముడు లోకానికే నాయకుడు ..ప్రపంచానికి దారి చూపే నాయకుడు.. యేటనుకున్నావు చెబుతోంది నానమ్మ పొయ్యిమీంచి నీళ్ళు దించుతూ... ఒసే.. పల్లకోయే నువ్వాన్నీ ఇలాగే సెప్తవు. సిరాకు పడ్డాడు బుడ్డోడు ఆదిత్య.. అవునురా నీకేకాదు..మీ నాన్నకు కూడా ఇలాగే నీళ్ళు పోసేదాన్ని.. మన ఊళ్లో ఆన్న సూర్యనారాయణ స్వామి మన శిక్కోలుకు ఆస్తి. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు మన ఊళ్లో ఉండడం అంటే గొప్ప కాదేట్రా అంది.. పిల్లాడి నెత్తిన జిల్లేడు ఆకులు పెడుతూ అవునే నానమ్మ.. ఈ జిల్లేడు ఆకుల ఎందుకే.. చిన్నప్పటి నుంచి నెత్తి మీద పెట్టి నీళ్ళు పోస్తావు అన్నాడు ఆదిత్య.. ఒరేయ్ ఇవి వట్టి ఆకులు కాదురాజిల్లేడు ఆకుల స్నానానికి ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా విశిష్టత ఉంది. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని నెత్తిమీద పెట్టుకుని స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న చెడును సైతం తొలగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా చేస్తాయి. గాయాలని పోగొట్టే గుణాలు కూడా ఉందిరా.. ఏదైనా చోట దెబ్బ తగిలి వాపు, నొప్పి వచ్చినా ఈ ఆకులు నయం చేస్తాయిరా అంది నానమ్మ. ఓహో అన్నాడు బుడ్డోడు. ఒరేయ్ నీకు ఇంకో విషయం చెప్పాలిరా అంది నానమ్మ.. పొద్దున్నుంచి నోరు ఆపకుండా వాగుతూనే ఉన్నావు మళ్లీ ఇంకేం చెప్తావె అన్నాడు ఆదిత్య. ఒరేయ్ అప్పట్లో ఎవరికైనా కొడుకు పుట్టాలి అంటే మన సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని మొక్కుకొని.. సూర్య నమస్కారాలు చేస్తే కొడుకు పుట్టేవాడ్రా.. మీ నాన్న కూడా నాకు అలాగే పుట్టాడు.. అందుకే వాడికి సురేష్ అని పేరు పెట్టాం అంది నానమ్మ.. ఓహో అందుకేనా మా నాన్న తరచు అరసవిల్లి గుడికి వెళుతుంటాడు అన్నాడు పిల్లాడు.. అవున్రా సూర్యనారాయణ స్వామి మన శ్రీకాకుళానికి ఆస్తి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి ఒక వెలుగు.. అందుకే మనం అందరం గుడికి పోదాం.. ముందు పిడకల మీద పరమాన్నం చేసి స్వామికి నైవేద్యం పెట్టి రిక్షాల వెళ్లిపోదాం సరేనా అంది నానమ్మ.. మన ఊళ్లో కాకుండా ఇంకెక్కడా సూర్యుడికి గుళ్ళు లేవా నానమ్మా అడిగాడు ఆదిత్య.. ఉన్నాయిరా కాశ్మీర్లో మార్తాండ ఆలయం ఉండేది.. కానీ అందులో పూజల్లేవు.. శిథిలమైంది.. ఒరిస్సా కోణార్క్ లో ఉన్నదీ సూర్యుని ఆలయమే కానీ అక్కడా పూజలు ఉండవు.. ఈ దక్షిణ దేశంలో పూజలందుకుంటున్న సూర్య ఆలయం మన ఊళ్లోనే ఉందిరా చిన్నా అని. చదవండి: పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదుసూర్యుణ్ణి ఆరాధించడం ద్వారా ధన.. గుణ సంపన్నులు అవుతారు బుజ్జి..నువ్వు రోజూ ఆయన్ను నమస్కరించి వీలైతే సూర్యనమస్కారాలు చేసుకో.. ఆరోగ్యం ఐశ్వర్యం దక్కుతాయి.. చెప్పింది నానమ్మ.. అదెలాగే అన్నాడు ఆదిత్య... అవునురా సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి పూజించడం ద్వారానే శమంతక మణిని పొందాడు.. అది రోజుకు ఎంత బంగారం ఇస్తుందో తెలీదు.. అంతెందుకు రోజూ ఎండలో కాసేపు నిలబడితే ఒంటికి కూడా మంచిదిరా.... విటమిన్లు వస్తాయి చెప్పింది నానమ్మ.. నానమ్మ విటమిన్లు ఎండలో వస్తాయి కదాని నన్ను ఎండలో నడిపిస్తే కుదరదు. రిక్షాలో వెళ్దాం . నాకు అక్కడ సెనగలు ఖజ్జూరం కొనాలి మరి అన్నాడు..పిల్లాడు.. సరే పదండి..గమ్మున వెళ్ళి లైన్లో నిలబడదాం.. ఆదిత్యుణ్ణి దర్శిద్దాం అంటూ అందరూ బయల్దేరారు..- సిమ్మాదిరప్పన్న -
రథసప్తమి వేడుకలకు ముస్తాబైన అరసవల్లి సూర్య దేవాలయం
-
భక్తులతో కిటకిటలాడుతున్న అరసవల్లి సూర్య దేవాలయం
-
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
ధర్మ ప్రచార కేంద్రంగా ‘అరసవల్లి’
అరసవల్లి: హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అటు విశాఖ నుంచి ఇటు ఒడిశా వరకు అరసవల్లి సూర్య క్షేత్రం ధర్మ ప్రచార కేంద్రంగా విరాజిల్లే అవకాశముందని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. ఆయన ఆదివారం పీఠాధిపతి హోదాలో తొలిసారి శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు. అనంతరం గర్భాలయంలో ఆదిత్యుడికి శంకర విజయేంద్ర సరస్వతి పూజలు నిర్వహించారు. తర్వాత అనివెట్టి మండపంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. శనివారం నారాయణుడిని (శ్రీకూర్మం), ఆదివారం సప్తమి నాడు సూర్యనారాయణుడిని దర్శించుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించారు. నేపాల్ యాత్రలో భాగంగా 1985లో నాటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో కలిసి అరసవల్లికి తొలిసారిగా వచ్చానని, అయితే అప్పటికీ ఇప్పటికీ ఆలయంలో అద్భుత మార్పులు వచ్చాయని చెప్పారు. ఈ కళింగ ప్రాంతంలో ధర్మ ప్రచారం దీక్షగా చేయాలని, ఇలాంటి క్షేత్రాన్ని ధర్మ ప్రచార కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి నగేష్ కాశ్యప శర్మ, రంజిత్ శర్మ, ఫణీంద్ర శర్మ, షణ్ముఖ శర్మ తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, ఎన్.కోటేశ్వర చౌదరి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
అరసవల్లి: సప్తమి దర్శనం.. ఇలా సులభతరం
అరసవల్లి(శ్రీకాకుళం): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ నెల 28న జరగనున్న రథసప్తమి మహోత్సవానికి సూర్యదేవాలయ ప్రాంగణ, పరిసరాలు ముస్తాబవుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల (తెల్లవారితే శనివారం) నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభించనున్నారు. జిల్లా ఉన్నతాధికారుల సూచనల అనంతరం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక రూట్ మ్యాప్‌ను బుధవారం విడుదల చేశారు. భక్తులకు వివిధ దర్శన మార్గాల వివరాలు స్పష్టంగా తెలియజేసేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో క్లాత్ బ్యానర్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. దాతల పాసులు ఆలయ అభివృద్ధికి, వివిధ రకాలుగా విరాళాలు ఇచ్చిన వారికిచ్చే డోనర్ (దాతల) పాసులున్న వారు ప్రధాన రోడ్డులో బొంపాడ వీధి కూడలి నుంచి ప్రత్యేక క్యూలైన్లో వస్తారు. ఉత్తర ద్వారం పక్కనున్న ప్రత్యేక క్యూలైన్లో ఆలయం లోపలికి వెళ్లనున్నారు. ఈ పాసుతో నలుగురికి అనుమతించనున్నారు. ఈ పాసులకు 27వ తేది అర్ధరాత్రి 12 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఉచిత దర్శనాలు అరసవల్లి మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నుంచి సాధారణ (ఉచిత) దర్శనాల క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఆలయానికి ఏ వైపు నుంచి వచ్చిన భక్తులైనా ఉచిత దర్శనానికి రావాలంటే ఇదొక్కటే మార్గం. ఇంద్రపుష్కరిణికి ఆగ్నేయంగా ఉన్న మార్గం ద్వారా పుష్కరిణి చుట్టూ ఉన్న కంపార్ట్మెంట్ల నుంచి ఆలయంలోకి దర్శనాలకు వెళ్తారు. రూ.100 ప్రత్యేక టికెట్ దర్శనాలు ఈ టికెట్‌తో దర్శనాలు కూడా అరసవల్లి హైస్కూల్ నుంచే క్యూలైన్లు ప్రారంభం కానున్నాయి. వీరు మాత్రం ఇంద్ర పుష్కరిణి ఈశాన్య గేటు, కేశఖండన శాల పక్క నుంచి ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయానికి ఏ వైపు నుంచి వచ్చిన భక్తులైనా రూ.100 దర్శనానికి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. ఉచిత దర్శన భక్తులు, రూ.100 దర్శన టికెట్లు తీసుకున్న భక్తులు వేర్వేరుగా క్యూలైన్లలో వచ్చినప్పటికీ ఆలయ ప్రధాన గోపురం ముందు ఉన్న ఒకే క్యూలైన్లో కలిసిపోయి ఒకే లైన్ ద్వారా ఆలయంలోనికి దర్శనానికి వెళ్లనున్నారు. క్షీరాభిషేక సేవ (ఇద్దరికి అనుమతి) అరసవల్లి ప్రధాన రోడ్డులో బొంపాడ వీధి కూడలి వద్ద నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా వెళ్లనున్నారు. క్యూలైన్లోనే ఈ టికెట్టును రూ.500తో కొనుగోలు చేసుకున్న భక్తులు(ఇద్దరికి అనుమతి) ఆలయ ప్రధాన ఆర్చిగేట్ మీదుగా ప్రత్యేక లైన్లో దర్శనానికి వెళ్లనున్నారు. ఈ సేవ సప్తమి రోజున అర్ధరాత్రి 12.15 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. రూ.500 విశిష్ట దర్శనం (ఇద్దరికి అనుమతి) బొంపాడ వీధి నుంచి ప్రారంభమైన క్షీరాభిషేక సేవ మార్గంలోనే వీరు కూడా వెళ్తారు. క్షీరాభిషేక సేవ అనంతరం అంటే ఉదయం 6 తర్వాత నుంచి రాత్రి 8 గంటల వరకు ఇదే లైన్లో విశిష్ట దర్శనం పేరిట (రూ.500) టికెట్టుదారులు దర్శనానికి వెళ్లనున్నారు. వి.ఐ.పి టికెట్ (ఇద్దరికి అనుమతి) ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన విఐపి టికెట్ (రూ.500)లను శ్రీకాకుళం ఆర్డీవో అనుమతితో అరసవల్లి యూనియన్ బ్యాంకులో కొనుగోలు చేసిన భక్తులు నేరుగా ఆలయ ప్రధాన ఆర్చిగేట్ నుంచి ప్రత్యేక క్యూలైన్లలో దర్శనాలకు వెళ్లనున్నారు. వీరు సుదర్శన మండపం వద్ద రూ.500 విశిష్ట దర్శనదారులతో కలిసిపోయి ఒకేలైన్లో స్వామి వారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ భక్తులు రాష్ట్రానికి చెందిన వీవీఐపీ స్థాయి గల ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు ఆలయ ప్రధాన ఆర్చిగేటు నుంచి నేరుగా అనివెట్టి మండపం నుంచి వెళ్లి మళ్లీ అదే మార్గంలో వెనుదిరిగేలా ఏర్పాట్లు చేశారు. వీరి వాహనాలు కూడా ప్రధాన ఆర్చిగేటు వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిట్ మార్గం ఇక సాధారణ భక్తులు, దాతలు, రూ.100, రూ.500 దర్శన టికెట్లు, రూ.500 వీఐపీ టికెట్లు భక్తులంతా స్వామి దర్శనానంతరం ఆలయ ఎగ్జిట్ ద్వారం నుంచే నేరుగా బ్రాహ్మణవీధి మీదుగా బొంపాడ వీధి కూడలి ప్రధాన రోడ్డుకు చేరుకునేలా ఈ మ్యాప్ సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్: అరసవల్లి మిల్లు కూడలి వైపు నుంచి వచ్చిన వాహనాలన్నీ 80 ఫీట్ రోడ్డు వద్ద వాహనాల పార్కింగ్‌కు, స్థానిక పెద్దతోట వద్ద చెప్పుల స్టాండ్లకు ఏర్పాట్లు చేశారు. కళింగపట్నం రోడ్డు నుంచి అరసవల్లి వచ్చే భక్తుల వాహనాలను అసిరితల్లి ఆలయం వద్ద పార్కింగ్, చెప్పుల స్టాండ్ కోసం సిద్ధం చేశారు. ఇక మిల్లు కూడలి, డీసీఎంఎస్ కార్యాలయం, ప్రధాన ఆర్చిగేటు, అసిరితల్లి అమ్మవారి ఆలయం కూడలి, నగర పాలక ఉన్నత పాఠశాలల వద్ద పోలీస్ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు. -
శ్రీకాకుళం.. ఆకట్టుకునేలా పర్యాటక రంగం
ఆర్థిక చోదక శక్తుల్లో పర్యాటక రంగం ఒకటి. ప్రపంచంలో చాలా దేశాలు కేవలం టూరిజం పరిశ్రమపైనే ఆధారపడి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. మన దేశం, రాష్ట్రంలో పర్యాటక రంగం కొంత పురోగతి సాధిస్తున్నా.. ప్రకృతి అందాలకు నెలవైన చాలా ప్రాంతాలు ఇప్పటికీ గుర్తింపునకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. అతి పొడవైన సముద్ర తీరం, కోనసీమ లాంటి ఉద్దానం, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు తదితర ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా.. పర్యాటకంగా వాటిని తీర్చిదిద్దే కృషి ఇప్పుడిప్పుడే మొదలైంది. టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం పేరుతో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఓవైపు సాగర తీరం.. మరోవైపు మన్యం.. మధ్యలో కొండలు తదితర ఆహ్లాదకర అందాలతో జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. ఏటా ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రభుత్వం జిల్లా లోని టూరిస్ట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కొత్త పర్యాటక ప్రదేశాలను గుర్తించడమే కాకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు అడుగులు వేస్తోంది. ఆధ్మాత్మిక ప్రదేశాలను సైతం అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఉన్న చారిత్రక ప్రదేశాలకు కొత్త హంగులద్ది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అభివృద్ధి పథంలో... ► ఇప్పటికే శాలిహుండాన్ని పర్యాటక సౌకర్యాల కేంద్రంగా రూ.2.27 కోట్లతో అభివృద్ధి చేశారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ► పాతపట్నం నీలమణి అమ్మవారి ఆలయాన్ని రూ. 50లక్షలతో అభివృద్ధి చేశారు. ► తాజాగా శ్రీముఖలింగం క్షేత్రాన్ని ప్రసాదం స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.56 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ► శ్రీకూర్మం క్షేత్రాన్ని రూ.20 కోట్లతో, అరసవిల్లి క్షేత్రాన్ని రూ.30కోట్లతో ప్రసాదం స్కీమ్‌లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. అరసవిల్లిలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సమాచారం కేంద్రం, పర్యాటకుల సౌకర్యాల కేంద్రం ఏర్పాటుకు ఏడు సెంట్లు భూమిని దేవదాయ శాఖ ఇప్పటికే కేటాయించింది. దీనిలో 32 గదులు కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. రోప్‌వే ద్వారా అందాలు.. రోప్ వేలతో జిల్లా అందాలను తిలకించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో తొమ్మిది రోప్‌వే మార్గాలను ప్రాథమికంగా గుర్తించారు. వీటిలో నాలుగింటి కోసం రూ.119.34 కోట్లతో అంచనా నివేదిక ఇప్పటికే కేంద్రానికి వెళ్లింది. రెండో విడతలో మిగతా ఐదింటికి ప్రతిపాదనలు పంపించనుంది. ► శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా నుంచి పొన్నాడ కొండ వరకు రూ. 32.40 కోట్లతో, శాలిహుండం బుద్ధు ని కొండ నుంచి వేణుగోపాలస్వామి ఆలయం వరకు రూ.25.56 కోట్లతో, పలాసలో నెమలికొండ వద్ద రూ. 22.68 కోట్లతో, ఇచ్ఛాపురంలో రూ.17.64 కోట్లతో రోప్‌వే వేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇవన్నీ మంజూరైతే జిల్లా పర్యాటకంగా మరింత ప్రగతి సాధించనుంది. పర్యాటక ప్రదేశాలెన్నో... ► జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదు. అరసవల్లి, శ్రీకూర్మం, శాలిహుండం, శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జునస్వామి తదితర ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. ► తేలుకుంచి, బారువ, తేలినీలాపురం, దంతపురి, పొందూరు, కొరసవాడ, మందస, గొట్టా బ్యారేజీ, శాలిహుండం, పొన్నాడ కొండ తదితర చారిత్రక ప్రదేశాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ► తేలినీలాపురం, తేలుకుంచి గ్రామాలు విదేశీ పక్షుల విడిది కేంద్రంగా ఆకట్టుకుంటున్నాయి. ► రాష్ట్రంలో అత్యంత పొడవైన తీరరేఖ జిల్లాలోనే ఉంది. 193 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో పర్యాటకులు విహరించడానికి అనువైన ప్రదేశాలెన్నో. కళింగపట్నం, బారువ, శివసాగర్, గనగళ్లవానిపేట, మొగదలపాడు వంటి బీచ్‌లు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో కొన్ని ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిమగ్నమైంది. శాలిహుండం, బారువ బీచ్‌ను పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది. శివసాగరం, గనగలవానిపేట, కళింగపట్నం బీచ్‌లను కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు అడుగులు వేస్తోంది. -
అరసవల్లి క్షేత్రం: కొత్త ట్రస్ట్ బోర్డుకు సన్నద్ధం
అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ధర్మకర్తల సభ్యుల (ట్రస్ట్ బోర్డు) నియామకానికి రాష్ట్ర దేవదాయ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గత నెల 26న దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. సహాయ కమిషనర్ హోదా కలిగిన ఈ ఆలయానికి రెండు నెలల కిందటి వరకు ట్ర స్ట్ బోర్డు కొనసాగింది. ఆ బోర్డు పదవీ కాలం ముగియడంతో కొత్త ట్రస్ట్ బోర్డు నియామకానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరా వు చొరవ చూపించారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు అరసవల్లి సూర్యక్షేత్రానికి పాలక మండలి నియామకానికి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. 15 లోగా దరఖాస్తు.. తాజా ఉత్తర్వుల ప్రకారం ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి 20 రోజుల్లోగా దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. ఈ ప్రకారం ఈనెల 15వ తేదీలోగానే ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువుగా నిర్ణయించారు. సభ్యులు తమ అర్హత ధ్రువీకరణలతో కూడిన ప్రొఫార్మా–2ను నింపి ఆలయ సహాయ కమిషనర్‌కు స్వయంగా గానీ పోస్టు ద్వారా గానీ అందజేయాల్సి ఉంటుంది. 50 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవదాయ శాఖ పాలకమండలి నియామ కాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రక్రియను ప క్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టింది. ఆలయాల ట్రస్ట్ బోర్డుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారికి 50 శాతం వరకు రిజర్వేషన్లు క ల్పిస్తూ తాజాగా చట్ట సవరణలు చేసిన సంగతి విదితమే. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ ప్రకారమే 2020లో అరసవల్లి ట్రస్ట్ బో ర్డులో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పక్కాగా అమలు చేశారు. ఈ ప్రకారం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడంతో పాటు మొత్తంగా అన్ని కేటగిరీల్లో సగం పదవుల్లో మహిళలనే నియమించాల్సి ఉంది. అరసవల్లి ఆల య స్థాయిని బట్టి 9+1 గా (ఒక చైర్మన్, 8 మంది సభ్యులు, ఒక ఎక్స్అఫీషియో మెంబర్) బోర్డును నియమించనున్నారు. ఈ ప్రకారం మొత్తం ఐదుగు రు వరకు మహిళలే మళ్లీ సభ్యులయ్యే అవకాశం ఉంది. ఆలయానికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్‌గా ఉన్న ఇప్పిలి జోగిసన్యాసిరావే ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గానూ, ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న ఇప్పిలి శంకరశర్మ ఎక్స్అఫీషియో మెంబర్‌గా మళ్లీ నియమితులు కానున్నారు. దీంతో మిగిలిన 8 మంది సభ్యుల స్థానాలకు మాత్రమే ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలు ఇవే.. ఆలయాల్లో పాలకమండలి సభ్యులుగా పనిచేయాలంటే కేవలం ఆసక్తి ఉంటే చాలదు. అందుకు తగిన అర్హతలను కూడా కలిగి ఉండాలనేలా దేవదాయ శాఖ చట్టంలో పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కచ్చితంగా హిందువై ఉండాలి. 30 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతుడై ఉండాలి. మంచి స్వభావం కలిగి, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారే అర్హులు. మానసిక దివ్యాంగులు ఈ సభ్యత్వానికి అనర్హులు. మద్యం, జూదం వంటి దురలవాట్లు లేని వారికి మాత్రమే అవకాశం. ప్రభుత్వ శాఖలతో లావాదేవీలు ఉన్న వారికి, క్రిమినల్/ నేర చరిత్రలున్న వారికి పోలీసు కేసులున్న వారు అనర్హులు. అరసవల్లి ఆలయానికి చెందిన భూముల లావాదేవీలు, ఎలాంటి లీజులు పొందిన వారు కూడా దరఖాస్తునకు అనర్హులు. అరసవల్లి ఆలయ వ్యవహారాల్లో ప్రతివాదిగా ఉండకూడదు. రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు సూర్యదేవాలయానికి మరో సారి ట్రస్ట్ బోర్డు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ల విధానంతోనే నియామకాలను చేపడతాం. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15లోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించి ప్రభుత్వానికి, దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక పంపిస్తాం. తదుపరి నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి. – వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈఓ -
సామాన్యులకు అంతరాలయ దర్శనం
అరసవల్లి(శ్రీకాకుళం): అరసవల్లి ఆదిత్యుని క్షేత్రంలో కొత్త ఆర్జిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతవరకు దాతలు, ప్రముఖులకే దక్కిన అంతరాలయ దర్శ నం ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా అందుబాటులో ఉండేలా ఆలయ అధికారులు చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమోదాన్ని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి శనివారం వరకు ప్రత్యేక సమయాల్లో అంతరాలయ ద ర్శనానికి ప్రత్యేకంగా టిక్కెట్లను ప్రవేశపెడుతూ దే వదాయ శాఖ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ప్ర త్యేక సూర్యనమస్కారాల పూజలకు కూడా ప్రత్యేక టిక్కెట్లను నిర్ణయిస్తూనే.. అష్టోత్తర, సహస్ర నామార్చనలు, భోగ సమర్పణ టిక్కెట్ల ధరలను సైతం స్వ ల్పంగా పెంచుతూ నిర్ణయించింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచే ఈ కొత్త ధరల విధానాలను అమలు చేయనున్నట్లు ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ప్రకటించారు. అయితే ముఖ్యంగా అన్ని ఆదివారాలు, రథసప్తమి, క్షీరాబ్ధి ద్వాదశి, వార్షిక కల్యాణం, వైకుంఠ ఏ కాదశి తదితర పర్వదినాల్లో మాత్రం అంతరాలయ దర్శనం, అష్టోత్తర, సహస్ర నామార్చనలు వంటి ఆర్జిత సేవలకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్నవరంలో సత్యన్నారాయణ స్వామి వ్రతాల మాదిరిగా సూర్యనమస్కార పూజలను, సింహాచలంలో అప్పన్న స్వామి అంతరాలయ దర్శనాలు లాగానే అరసవల్లిలో కూడా కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. సూర్యనమస్కారాల పూజలకు.. సంపూర్ణ ఆరోగ్యం కోసం జరిపించుకునే సూర్యనమస్కారాల పూజలను రెండు స్థాయిల్లో జరగనున్నా యి. ఆలయ అనివెట్టి మండపానికి ఇరువైపులా ఉన్న మండపాల్లో సూర్యనమస్కార పూజలు నిర్వహిస్తే ఒక్కొక్కరికి రూ.300 చొప్పున టిక్కెట్టు ధర ను, అలాగే ఇంద్ర పుష్కరిణి మార్గంలో ఉన్న సూర్యనమస్కార మండపంలో చేయించుకుంటేæ ఒక్కొక్కరికి రూ.100 చొప్పున టిక్కెట్టు ధరగా నిర్ణయించా రు. ఈ పూజలు ఆదివారంతో సహా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్ర మే అనుమతి ఉంటుంది. ఒక్కో బ్యాచ్‌కు సుమారు 35 నిమిషాల వరకు పూజాసమయం ఉంటుంది. ఇంతవరకు ఈ సూర్య నమస్కార పూజల టిక్కెట్టు ధర రూ.50 ఉండేది. నామార్చనల పూజలు.. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అంతరాలయంలో అష్టోత్తర శతనామార్చనకు రూ.50 (పాత ధర రూ.20), సహస్రనామార్చనకు ఒక్కొక్కరికి రూ.100 (పాత ధర రూ.30)గా నిర్ణయించారు. క్షీరాన్న భోగం సమర్పణకు రూ.100 ఆదిత్యుని ఎంతో ఇష్టమైన క్షీరాన్న భోగ సమర్పణ పూజ ధరను రూ.50 నుంచి రూ.100కి పెంచుతూ నిర్ణయించారు. అయితే కేవలం ఆదివారం రోజునే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మాత్రమే ఈ భోగ సేవకు అనుమతి ఉంటుంది. అంతరాలయ దర్శన టిక్కెట్టు రూ.100 ఆదిత్యుని అంతరాలయ దర్శనానికి ఒక్కో భక్తునికి రూ.100 టిక్కెట్టుగా నిర్ణయించారు. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు అలాగే సా యంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఈ అంతరాలయ దర్శనం ఉంటుంది. ఇక ఆదివారాల్లో యథావిధిగా విశిష్ట దర్శనం (రూ.500) టిక్కెట్టుకు ఇద్దరు చొప్పున, ప్రత్యేక దర్శన టిక్కెట్టు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున దర్శనాలకు అవకాశాలు ఉంటాయి. ఆదివారాల్లో ఈ దర్శనాల టిక్కెట్టు భక్తులకు అంతరాలయ దర్శనం ఉండదు. -
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి మొక్కులు చెల్లించుకున్న నటి
సాక్షి, అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని వర్థమాన సినీ నటి సంధ్యారాణి రావిపల్లి మంగళవారం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీధి బాలలం, అమ్మవారి మహత్యం, 1997 (ఇది జరిగిన కథ), ‘పద్మశ్రీ’ తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించినట్లు తెలిపారు. హీరో నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’లో కీలక పాత్ర చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 16 సినిమాలు, రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘కడప’ అనే వెబ్‌సిరీస్‌లో నటించినట్లు తెలిపారు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ఓ చిత్రం, రావురమేష్‌తో ‘వెల్లువ’ అనే సినిమాలో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీధర్ సీపాన దర్శకత్వంలో చిరంజీవి అల్లుడు కళ్యాణ్ తేజ్ హీరోగా చేస్తున్న మూవీలో కీలక పాత్ర చేస్తున్నట్లు చెప్పారు. చదవండి: దారుణ కామెంట్లు, అషూ, అజయ్‌లను తిట్టిపోస్తున్న నెటిజన్లు హిందీ సినిమాలు సౌత్‌లో ఎందుకు ఆడవో! అన్న సల్మాన్ కామెంట్లపై యశ్ స్పందన -
అరసవల్లిలో వైభవంగా రథసప్తమి
అరసవల్లి/తిరుమల: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 60 వేల మంది వరకు భక్తులు ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆదిత్యుడిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అరసవల్లి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అమలుకు త్వరలోనే చర్యలు చేపడతానని మంత్రి వెలంపల్లి చెప్పారు. ఆలయ వివరాలను ఆర్జేసీ సురేష్‌బాబు, ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సప్తవాహనాలపై శ్రీనివాసుడి కటాక్షం.. తిరుమల శ్రీవారు సప్తవాహనాలను అధిరోహించి మంగళవారం భక్తులను కటాక్షించారు. తిరుమల ఆలయంలో రథసప్తమి మహోత్సవం వైభవంగా సాగింది. కోవిడ్ నేపథ్యంలో దీన్ని ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉషోదయాన సూర్యప్రభ వాహనంతో సప్తవాహన సేవోత్సవం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీమలయప్పస్వామి చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరారు. మధ్యాహ్నం శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు పరిసమాప్తమయ్యాయి. సింహగిరిపై విశేషంగా రథసప్తమి సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రథసప్తమి పూజలను మంగళవారం విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ప్రాంగణంలో హంసమూలన ఉన్న పురాతన రాతిరథంపై వేంజేపచేసి ఉదయం పంచామృతాభిషేకం, అరుణపారాయణ పఠనం నిర్వహించారు. అనంతరం రాతిరథంపైనే స్వామికి నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై వేంజేపచేసి తిరువీధిని నిర్వహించారు. -
రథసప్తమి వేడుకలకు ముస్తాబైన అరసవల్లి ఆలయం
-
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకాయి. దాదాపు 7 నిమిషాల పాటు భానుడి లేలేత కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి ఏడాది మార్చి 9,10 అలాగే అక్టోబరు 1,2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకడం ఆనవాయితీగా వస్తుందని పురోహితులు తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు. చదవండి: TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు -
అరసవల్లిలో అద్బుత దృశ్యం
-
సూర్యనారాయణునికి స్వర్ణ మకర తోరణం
సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య మూలవిరాట్టుకు 112 మంది భక్తులు సంయుక్త విరాళాలుగా అందించిన రూ.1.56 కోట్లతో బంగారు మకరతోరణాన్ని తయారు చేయించారు. 3 కేజీల 361 గ్రాముల బరువు గల ఈ బంగారు మకర తోరణాన్ని ఆలయ అనివెట్టి మండపంలో ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ పుణ్యక్షేత్రంలో అత్యధిక విరాళంగా మకరతోరణాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, మండవల్లి రవి (ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు), పెద్దిన కాళిదాస్, పొట్నూరు శ్రీనివాస్ తదితరుల బృందం కమిటీగా ఏర్పడి ఈ విరాళాలను భక్తుల నుంచి సేకరించారు. ఆగస్టు 1న ప్రత్యేక పూజల అనంతరం ఆదిత్యుని మూలవిరాట్టుకు ఈ మకరతోరణాన్ని అలంకరించనున్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో సినీ నటుడు సుమన్
సాక్షి, అరసవల్లి: ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ బుధవారం అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయంలో దర్శనం చేయించారు. అనంతరం అనివేటి మండపంలో తీర్థప్రసాదాలను ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ అందించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ విశాఖలో ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సందర్భంగా అరసవల్లి వచ్చానన్నారు. అన్నమయ్యలో వేంకటేశ్వరుడు, శ్రీరామదాసులో శ్రీరాముడు వంటి దేవుళ్ల పాత్రల్లో నటించడంతో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వివరించారు. శ్రీకూర్మనాథుని సన్నిధిలో.. గార: ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని సినీ నటుడు సుమన్ బుధవారం దర్శించుకున్నారు. మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మీదేవిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకు లు చామర్తి సీతారామ నృసింహాచార్యులు క్షేత్ర మహత్యాన్ని వివరించారు. ఆలయ ఈవో ఎస్.విజయకుమార్‌స్వామి ప్రసాదాన్ని అందజేశారు. చదవండి: తలైవి చిత్రం ఓటీటీలో విడుదలవుతుందా? -
ఇక్కడి యాస గొప్పతనాన్ని చూపిస్తున్నా: టీవీ నటుడు
సాక్షి, అరసవల్లి: ‘‘శ్రీకాకుళమే నా సొంతూరు..హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉంటూ పదో తరగతి వరకు టీపీఎం ఉన్నత పాఠశాలలోనే చదివాను’’అని సినీ, బుల్లితెర ఆర్టిస్ట్ ఎం.రవికిరణ్ చెప్పారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని భార్య సుష్మ, కుమారుడు ప్రభంజన్లతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడి వాడినే కాబట్టి.. సినిమాల్లో శ్రీకాకుళం యాస గొప్పతనాన్ని చూపిస్తున్నానన్నారు. భార్య సుష్మ కూడా ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో నటించి.. తర్వాత కథలో రాజకుమారి, గుండమ్మ కథ తదితర బుల్లితెర సీరియళ్లలో నటిస్తోందన్నారు. తాను కూడా స్నేహితుడా సినిమాలో, సుమారు 35 సీరియళ్లలో నటించానని వివరించారు. ప్రస్తుతం చిన్నకోడలు, అభిషేకం సీరియళ్లలో సీరియల్స్‌లో నటిస్తున్నట్టు పేర్కొన్నారు. సుష్మాకిరణ్ పేరుతో వెబ్ సిరీస్‌ను త్వరలోనే ప్రారంభించనున్నామని, ఇందులో ముందుగా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని చూపించాలని నిర్ణయించుకున్నామన్నారు. తొలుత వీరికి ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, యామిజాల గాయత్రి, మండల మన్మథరావు తదితరులు ప్రత్యేక దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు. చదవండి: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’ -
అరసవల్లిలో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం
అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుని దేవస్థానంలో కనిపించే అరుదైన దృశ్యానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఆదిత్యుని మూలవిరాట్టును తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సూర్యోదయ సమయాన సాక్షాత్కరించనున్న ఈ కిరణ స్పర్శ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు అరసవల్లి క్షేత్రానికి రానున్నారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ప్రత్యక్ష దైవమైన శ్రీసూర్యనారాయణ స్వామి పాదాలపై నేరు గా తొలిసూర్యకిరణాలు తాకనున్నాయి. రానున్న సోమ, మంగళ వారాల్లో కన్పించనున్న ఈ అద్భుత దర్శనానికి ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకా‹Ù, ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ‘సాక్షి’ తో మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే కిర ణ దర్శన ప్రాప్తి ఉంటుందన్నారు. ఈ నెల 9,10 తేదీల్లోనే బాగా కిరణాలు పడే అవకాశముందని అన్నారు. -
ఆదిత్యా... నీకు దిక్కెవరు?
ఆయన అందరికంటే ఎత్తులో ఉంటూ అందరికీ వెలుగులు ప్రసాదిస్తాడు.. అయితే ఆయన కొలువుకు చెందిన భూములను మాత్రం కాపాడుకోలేకపోతున్నాడు.. సర్వదిక్కులను శాసిస్తున్న భానుడే దిక్కులేక మిన్నకుండిపోతున్నాడు.. కోట్లాది రూపాయల విలువైన భూములను అన్యాకాంత్రం చేసుకుని ఏళ్ల తరబడి ఫలసాయం పొందుతున్నప్పటికీ అధికారులు సైతం కిమ్మనకపోవడం చర్చనీయాంశమైంది. అరసవల్లి: శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయ భూముల్లో అత్యధిక శాతం ఇనాం కింద ఆలయ అర్చకుల వద్దనే ఉండగా, మిగిలినవి ఆక్రమణలకు గురవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చాలాచోట్ల జరిగిన భూ ఆక్రమణల్లాగే.. అరసవల్లి ఆలయానికి చెందిన భూములను కూడా స్థానిక నేతల అండదండలతో అక్రమార్కులు కాజేశారు. గత ఐదేళ్లలోనే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న కొన్ని ఎకరాల భూములను ఇష్టానుసారంగా రెవన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసేసి టీడీపీ నేతలు అనుకూలురకు అప్పగించారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆలయానికి చెందిన భూములు అపార్ట్‌మెంట్లుగానూ, భవనాల సముదాయాలు, దుకాణాల సముదాయాలుగా మారిపోయాయి. ఆదిత్యుని భూముల లెక్కలివే.....! అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి సుమారు 120 ఎకరాలకు పైగానే భూమి ఉంది. 1932 నాటి మద్రాస్ హైకోర్టు ఇచ్చిన డిక్రీ ఆధారంగా మొత్తం 53.24 ఎకరాల భూమిని ఆలయ వంశపారంపర్య అర్చకులకు జీతాలకు బదులుగా సరీ్వస్ ఇనాంగా అప్పగించారు. ఇందులో భాగంగా ఉన్న 2.48 ఎకరాల భూమిలో కొంత భాగం టూరిజం బడ్జెట్ హోటల్‌కు, మరికొంత భాగం టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇవి కాకుండా మరో 27.91 ఎకరాల భూమి ప్రస్తుతానికి లీజుల కింద కేటాయించారు. వీటి నుంచి వార్షిక ఆదాయం 1.71 లక్షల వరకు వస్తోంది. ఇవన్నీ కాకుండా మరో 41.30 ఎకరాల వరకు భూమిని దశాబ్దాల కాలం క్రితమే ఆలయంలో పనిచేస్తున్న బోయిలు, దివిటీలు, చాకళ్లు, భజన కర్తలు, వేదపారాయణదారులకు, నాయీ బ్రాహ్మణులకు వాయిద్యాల కర్తలకు, స్వామి ఆలంకరణకు గాను పూల తోటల పెంచడానికి గానూ అప్పట్లో సరీ్వస్ ఇనాం కింద కేటాయించారు. అయితే దాదాపుగా ఈ మొత్తం ఇనాం భూమి చేతులు మారిపోయాయి. దీంతో ఆలయ భూముల లెక్కల్లోనే ఈ వివరాలు లేకుండా పోయాయి. అయితే పాత రికార్డుల్లో ఉన్న వాస్తవ లెక్కలను ప్రస్తుతం కని్పంచకుండా గతంలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శించారు. దీంతో ప్రస్తుతానికి ఆలయానికి తాజా రికార్డుల ద్వారా 83.99 ఎకరాల భూములున్నట్లుగా చూపిస్తున్నారు. అయితే ప్రాపర్టీ రిజిస్టర్లో మాత్రం ఇప్పటికీ ఇనాం భూములుగా ఎకరాల కొద్దీ భూములు కన్పిస్తున్నాయి. ఇనాం భూములన్నీ హాంఫట్...! అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి వివిధ రకాలుగా సేవలందించే సేవకులకు గాను అప్పట్లో సరీ్వస్ ఇనాం కింద సుమారు 41.30 ఎకరాల భూములను ఇచ్చినట్లుగా పాత రికార్డులు చూపిస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఎన్నో చేతులు మారిపోవడంతో ఆలయ గత ఆస్తులుగానే రికార్డుల్లో ఉండిపోయాయి. అరసవల్లి మిల్లు కూడలి సమీపంలో సాగునీటి కాలువకు ఆనుకుని ఇరువైపులా సర్వే నెంబర్ 12తోపాటు పలు సర్వే నెంబర్లలో ఆలయానికి భూములున్నాయి. ఇందులో భాగంగా 12/3, 12/4 సర్వే నెంబర్లులో మొత్తం 0.95 ఎకరాల భూమి కూడా తాజాగా ఆక్రమణలకు గురయ్యింది. అయితే ఈ భూములతో పాటు పక్కనే 2.68 ఎకరాల భూమిలోనే రాష్ట్ర పర్యాటక శాఖ బడ్జెట్ హోటల్ నిర్మాణం, టీటీడీ కళ్యాణమండపాలను నిర్మించేందుకు కేటాయించారు. ఇదిలావుంటే 12/3, 12/4 సర్వే నెంబర్లలో రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే సూర్యనారాయణ స్వామి వారికి చెందినట్లుగానే ఉన్నాయి. అయినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌ను కూడా నిర్మించారు. ఇదే ప్రాంతంలో సుమారు ఐదారు ఎకరాల్లో పెద్ద పెద్ద భవనాలు కూడా వెలిసిపోయాయి. అలాగే ఆక్రమణ స్థలాల్లో రోడ్డుకు ఆనుకుని షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా నిర్మించారు. ఇదంతా ఓ స్థానికుడు స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుతోనే వెలుగులోకి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇనాం భూములన్నీ ఇలాగే అన్యాక్రాంతమయ్యాయనే వాదనకు ఇదే పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఆక్రమణ భూములపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తున్నాం అరసవల్లి ఆలయానికి చెందిన కొన్ని భూములు ఆక్రమణకు గురైన విషయం దృష్టికి వచ్చింది.. ఇటీవల ‘స్పందన’ ద్వారా పలు భూముల అన్యాక్రాంతానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో.. ఆలయ భూములను సర్వే చేయించి ఆక్రమణలను గుర్తించాం. దీనిపై ఆలయ భూములను అనుభవంలోకి తీసుకున్న వారిపై ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనున్నాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు.. – వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈవో -
ఆర్భాటం చేశారు.. ఆదిలోనే వదిలేశారు!
సాక్షి, అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ ఖ్యాతిని మరింత పెంచేందుకు.. తద్వారా చిరస్థాయిగా అభివృద్ధి సాధించేలా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో నిత్యపూజలందుకుంటున్న సూర్యదేవాలయంగా అరసవల్లి క్షేత్రానికి గుర్తింపు ఉంది. అయితే ఆ స్థాయిలో ఇక్కడ అభివృద్ధి కనిపించదు. భక్తులకు సరైన సౌకర్యాలు అందని దుస్థితి. ఈ నేపథ్యంలో ఆదిత్యాలయానికి రూ.30 కోట్లతో మాస్టర్ ప్లాన్ అంటూ బాకా ఊదిన అప్పటి చంద్రబాబు సర్కార్.. పనుల విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా వేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన గుండ లక్ష్మీదేవి కూడా తన స్వగ్రామ సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టేయడంతో దేవాలయ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. నాటి మాస్టర్ ప్లాన్ ఇదే దీంతో ఇక్కడి ప్రజలు ఆమెకు గుణపాఠం చెప్పి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ధర్మాన ప్రసాదరావుకు మరో అవకాశమిచ్చారు. ఆయన తన నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఆదిత్యాలయానికి సరికొత్త మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకోసం ఇప్పటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ అధికారులతో చర్చించి తుది నిర్ణయాన్ని సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో దేవదాయ శాఖ పరిధిలోని ప్రఖ్యాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో అరసవల్లి ఆలయంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. కొండెక్కిన పాత మాస్టర్ ప్లాన్.. గత ప్రభుత్వంలో ప్రతిపాదించిన అరసవల్లి మాస్టర్‌ప్లాన్ అమలు కొండెక్కిపోయింది. మాస్టర్ ప్లాన్ అంటూ మ్యాప్‌లు సిద్ధం చేసి.. నాటి కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారిణి శోభను ప్రత్యేకాధికారిగా నియమించారు. అయితే నిధుల రూపంలో ఒక్క రూపాయి కూడా విదల్చక పోవడంతో మాస్టర్ ప్లాన్ అమలు ప్రశ్నార్థకమయ్యింది. ఐదేళ్లు మాటలకే పరిమితమై.. కేవలం తొలిదశ పనులంటూ ఆలయం ఎదురుగా ఉన్న 11 ఇళ్లను తొలగించి చేతులు దులుపుకున్న నాటి ప్రభుత్వ చర్యలపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు స్వయంగా ఆలయంలో కూర్చుని ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయిందంటూ తీవ్రంగా విమర్శలు వినిపించాయి. కేవలం ప్రకటనలకే పరిమితమైన ఆనాటి మాస్టర్ ప్లాన్‌కు మంగళం పలికి సరికొత్త మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ముందుగా ఆలయానికి ట్రస్ట్‌బోర్డు నియామకాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే పలువురు దరకాస్తులు చేసుకున్నారు. త్వరలోనే బోర్డు మెంబర్ల ఖరారుతోనే సరికొత్త అభివృద్ధికి అడుగులు పడనున్నట్లు సమాచారం. మార్పులు చేర్పులతో కొత్త ప్లాన్! గత మాస్టర్ ప్లాన్‌లో కీలక మార్పులు చేసి, కొత్త డిజైన్‌తో, భక్తులకు మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి జరిగేలా, నవ్యాంధ్రలో అద్భుత ఆలయాల సరసన అరసవల్లిని చేర్చేందుకు తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం ప్రత్యేక నిపుణులతో కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలంటూ.. అందునా విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఉండాలంటూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ ఊపందుకోవడంతో.. ఈ ప్రభావం అరసవల్లిపై ఉంటుందనే అంచనాలున్నాయి. నవ్యాంధ్రలో అరసవల్లి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా విశాఖపట్నంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో కూడా సూర్యదేవాలయ అభివృద్ధిపై చర్చలు జరిగాయి. మాస్టర్ ప్లాన్ అడుగులను వడివడిగా వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు స్వయంగా రంగంలోకి దిగి తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఈక్రమంలో అరసవల్లి భవిష్యత్‌లో అద్భుత పుణ్యక్షేత్రంతో పాటు ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారే అవకాశముంది. నాటి మాస్టర్ ప్లాన్ ఇలా.. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో సమూల మార్పులు చేపడుతూ పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు 2016లోనే మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ప్లాన్ అమలుకు మొత్తం 79 అసెస్మెంట్లు తొలిగించాలని నిర్ణయించారు. తొలి దశలో ఆలయం తూర్పు భాగాన ఉన్న 11 ఇళ్లను తొలిగించి తర్వాత పనులకు ఫుల్స్టాప్ పెట్టారు. వాస్తవానికి రెండో దశలో తూర్పు భాగాన 12 షాపులు, సూర్యనమస్కార మండపం, సుమారు 20 ఇళ్లును కూడా తొలిగించాల్సి ఉంది. ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా పలు ఇళ్లు తొలిగించాల్సి ఉంటుంది. బ్రాహ్మణవీధి, ఆలయ ఉత్తర ద్వార వీధి, కాపు వీధి తదితర ప్రాంతాల్లో ఇళ్లను తొలిగించాలని నిర్ణయించారు. మూడో దశ పనుల్లో భాగంగా అరసవల్లి ఆలయానికి ప్రధాన మార్గంగా అసిరితల్లి అమ్మవారి ఆలయానికి పక్కనున్న మార్గంగా గుర్తించి, ముఖద్వారం నిర్మించాలని నిర్ణయించారు. భక్తులంతా అదే మార్గం నుంచి వచ్చేలా నిర్ణయించారు. అయితే ఇదంతా గత ప్రభుత్వ ప్రతిపాదన కావడంతో ప్రస్తుత సర్కారు ఈ మాస్టర్‌ప్లాన్‌ను మార్చి, సరికొత్త డిజైన్లతో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ అమలుకు ఒక్కరూపాయి కూడా విదల్చకపోగా, తాజా ప్రభుత్వంలో ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కూడా మంజూరు చేయించి, ప్రతిష్టాత్మకంగా చేయించేలా ఎమ్మెల్యే ధర్మాన కృతనిశ్చయంతో ఉన్నారు. ఆరోగ్య ప్రదాత అరసవల్లి ఆదిత్యుని ఆలయాన్ని చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం పనులు చేపట్టకుండానే అర్ధంతరంగా వదిలేసింది. మాస్టర్ ప్లాన్ అంటూ హడావుడి చేసి పదకొండు ఇళ్లు పడగొట్టేసి అక్కడితో చేతులు దులిపేసింది. ఈ పరిస్థితిలో సూర్యదేవుని ఆలయాన్ని చరిత్రలో చరిస్థాయిగా నిలిచేలా సరికొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రివైజ్డ్ మాస్టర్ ప్లాన్‌కు చర్యలు.. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ అమలు నిలిచిపోయింది. ప్రస్తుతం రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు దీనిపై పలు సూచనలు చేశారు. భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న క్రమంలో వారికి అవసరమైన మెరుగైన సౌకర్యాలను కలి్పంచే దిశగా అడుగులు వేస్తున్నాం. – వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈవో -
రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తన కిరణాలతో లోకాలను తట్టిలేపే ప్రత్యక్ష దైవానికి పుట్టిన రోజు ఉత్సవం ఘనంగా మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి సప్తమి ఘడియల్లో కర్మసాక్షి అయిన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు వేదమంత్రాల నడుమ అర్చక బృందం ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేక స్నానాలు చేయించారు. ముల్లోకాలను వెలుగులతో నింపిన ఆదిత్యుడు నిశిరాత్రి వేళ తెల్లని పాలపొంగుల్లో దర్శనమిచ్చాడు. నల్లటి అరుణశిల కాస్తా.. శ్వేతవర్ణంలో మారిపోయి భక్తులకు కనువిందు చేశాడు. సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం అరసవిల్లి సూర్యదేవాలయం భక్తులు తో కిటకిటలాడుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులు సూర్యజయంతి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని తరిస్తున్నారు. ఇంద్రపుష్కరణి వద్ద పాయసం వండి నైవేద్యాలు పెట్టి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికార్లు పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. అరసవల్లి సూర్యక్షేత్రం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. సూర్యజయంతి (రథసప్తమి) సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి వారి జయంత్యుత్సవం... ఒకరోజు బ్రహ్మోత్సవంగా బ్రహ్మండమైన రీతిలో జరిగింది. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణమంతా ఆదిత్యుని నామస్మరణతో మార్మోగింది. శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటలకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆర్అండ్బి మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉత్సవ అధికారి ఎన్.సుజాత, జిల్లా సహాయ కమిషనర్ వై.భద్రాజీ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తదితరులు స్వామి వారికి సంప్రదాయం ప్రకారం పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం స్థానిక అనివేటి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వ ర్యంలో మహా సంకల్పం జరిగింది. అనంతరం 12.30 గంటలకు తొలి అభిషేకాన్ని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వా త్మానందేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా జరిపించారు. గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుపై పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 12.45 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. అభిషేక సేవ శనివారం ఉదయం 8 గంటల వరకు జరిగింది. అనంతరం స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతా రాం సతీసమేతంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్ జె.నివాస్ స్వామిని దర్శించుకున్నారు. పోటెత్తిన భక్తజనం రథసప్తమిని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శుక్రవారం రాత్రి సరికే అరసవల్లి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్డుపైన భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు వచ్చి స్వామి క్షీరాభిõÙకం, నిజరూపాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు క్షీరాభిషేకం ప్రారంభమై.. శనివారం ఉదయం 8 గంటలకు ముగిసింది. తర్వాత నిజరూపంలో స్వామి దర్శనమిచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు, జిల్లా ఉన్నతాధికారులు, దాతల కుటుంబాలతోపాటు క్షీరాభిõÙక దర్శనం (రూ.500), ప్రత్యేక దర్శనం (రూ.100) క్యూలైన్లవారికి కూడా ఆలయ సింహద్వా రం (ఆర్చిగేట్) నుంచి ప్రవేశం కలి్పంచారు. అర్ధరాత్రి నుంచి పోలీసులు పూర్తి స్థాయి భద్రతావ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే స్థానిక డీసీఎంఎస్ గొడౌన్ నుంచి రూ.500, రూ.100 దర్శనాల క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. అలాగే సా ధారణ దర్శనాల మార్గం కూడా ఇలాగే ప్రారంభమయ్యింది. అయితే ఈ లైన్ అసిరితల్లి అమ్మవారి ఆలయం పక్క నుంచి సాగింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి నాటికే ఆలయ పరిసరాలకు చేరుకున్న గ్రామీణ ప్రాంత భక్తులు క్యూలైన్లలోనే ఉండి పోయారు. తొలి దర్శనాలకు వీలు కోసం అక్కడే అర్ధరాత్రి వరకు కాలం గడిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి సామాన్యుల దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ జిల్లా కలెక్ట ర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించా రు. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సంయుక్త పర్యవేక్షణ లో వీఐపీల దర్శనాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ప్రకా రం శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ పోలీసుల వలయంగా సింహద్వారం కని్పంచింది. దాతల కుటుంబసభ్యుల వాహనాలను అటు 80 ఫీట్ రోడ్డులోనే (అనుమతి పాస్ లేనివి) నిలిపివేయడంతో సుమారు కిలోమీటరు దూరం నుంచి నడిచి రావలసివచ్చింది. అలాగే సాధారణ దర్శనాలకు వెళ్లే వారు కూడా ఎక్కువ దూరమే నడిచేలాఏర్పాట్లున్నాయని జిల్లాకలెక్టర్ నివా స్ ఆదేశాల మేరకు ఆల య మండపాల్లో జిగ్‌జాగ్ లైన్లు కాకుండా నేరుగా ఒకే లైన్లో దర్శనాలకు అనుమతిచ్చారు. మినీ బ్రహ్మోత్సవం.. చూతము రారండి తిరుమల : వేంకటాదివాసుడు ఏడాది పొడవు నా 450కి పైగా ఉత్సవాలు, సేవల్లో పూజలందుకుంటూ భక్తులను కటాక్షిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆయా మాసాల్లో నిరి్ధష్టంగా ఆచరిస్తున్న సేవలు, ఉత్సవాలూ నిర్విఘ్నంగా కొ నసాగుతున్నాయి. అర్ధంతరంగా ఆగిపోయిన కొన్ని సేవల్ని పునరుద్ధరించడం, మరికొన్నింటిని మార్పులు, చేర్పులు చేసి, టీటీడీ తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతోంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కొక్క ఉత్సవంలో దివ్యతేజోమూర్తి వైభవం ఒక్కోలా గోచరిస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ కటాక్షిస్తూ భక్తుల మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. విశేషమైన సేవలు, ఉత్సవాల్లో వేంకటేశుని దర్శిస్తూ భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. ఇందులో రథసప్తమి కూడా అతిముఖ్యమైన ఉత్సవంగా చెప్పవచ్చు. దీన్నే మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. శనివారం ఉదయం 5.30 గంటలకు వాహన సేవలు ప్రారంభమై రాత్రి 9 వరకు సేవలు జరుగుతాయి. ఏడువాహనాలపై మలయప్పస్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమివ్వనున్నారు. ఈ ఉత్సవానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. -
సూర్యగ్రహణంతో ఆలయాలన్నీ మూసివేత..
సాక్షి, హైదరాబాద్ : డిసెంబర్ 26న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్ని మూసివేయనున్నారు. అనంతరం మరుసటి రోజు భక్తుల దర్శనం కోసం ఆలయ తలుపులు తెరవనున్నారు. తిరుమల : రేపు సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారుల మూసివేయనున్నారు. దాదాపు 13 గంటల పాటుగా తలుపులు మూసివేయనున్నారు. ఈ రోజు రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా మూత పడి.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ది అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనం కోసం అనుమతిస్తారు.. రేపు ఉదయం విఐపి బ్రేక్ దర్శనాలు,(ప్రోటోకాల్ దర్శనాలు) టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. సూర్యగ్రహణం సందర్భంగా రేపు తిరుప్పావడ, కళ్యాణోత్సవం,ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత సేవలను రద్దు చేశారు. శ్రీకాకుళం : మంగళవారం రాత్రి పూజల అనంతరం అరసవల్లి సూర్యదేవాలయాన్ని మూయనున్నారు. తిరిగి రేపు సాయంత్రం 4 గంటలకు సంప్రోక్షణ అనంతరం ఆలయ ద్వారాలు తెరుస్తారు. రాజన్న సిరిసిల్ల : గురువారం సూర్యగ్రహణం సందర్భంగా ఈ రోజు రాత్రి 8.11 గంటలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూయనున్నారు. సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 11.20 నిమిషాలకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరుస్తారు. నిర్మల్ : ఈనెల 26న సంపూర్ణ సూర్య గ్రహణం సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 6 గంటల 15 నిమిషాల నుంచి 26వ తేదీ ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ద్వారాలను అర్చకులుమూసివేయనున్నారు. తిరిగి 26వ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు ఆలయం శుద్ధి, సంప్రోక్షణ , సరస్వతి అమ్మవారి కి అభిషేకం ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనం సేవలను కల్పించనున్నట్టు ఆలయ అధికారులు. ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు : సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దేవాలయాలు ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 11.30 గంటల వరకు వరకు ఆలయ ధ్వారాలు మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంట తరువాత ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. నెల్లూరు : రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సేవలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మనందేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
ఆదిత్యాయ.. అద్భుత కాంతి తేజాయ
దసరా దేవి నవరాత్రుల్లో ఆదిత్యుడు అద్భుత దర్శన భాగ్యాన్ని కలిగించాడు. దశాబ్దాల కాలం తర్వాత ఇంతటి కాంతితో, తేజోవంతుడిగా మూలవిరాట్టు మెరిసిపోయింది. – శంకరశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు అరసవల్లి (శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో కొలువైన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామిని తొలి సూర్యకిరణాలు తాకిన అద్భుత దృశ్యం బుధవారం భక్తులకు కనువిందు చేసింది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయన కాలమార్పుల్లో భాగంగా సూర్యకిరణాల కాంతిలో ఆదిత్యుడు బంగారు ఛాయలో మెరిసిపోయాడు. సూర్య కిరణాలు రాజాగోపురం నుంచి అనివెట్టి మండపం దాటుతూ ధ్వజస్తంభాన్ని తాకుతూ అంతరాలయం దాటుకుంటూ నేరుగా గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. కాంతితేజంలా కన్పించిన ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ ఈవో వి.హరిప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించగా.. ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కిరణాలు తాకాయిలా... - బుధవారం ఉదయం సరిగ్గా 6.04 నిమిషాల సమయంలో దివ్య తేజస్సుతో తొలి లేలేత బంగారు వర్ణ కిరణాలు ఆదిత్యుని మూలవిరాట్టు పాదాలను తాకాయి. - అదే నిమిషం నుంచి అలా అలా.. పైపైకి కిరణ కాంతులు స్వామి ఉదరం, వక్ష భాగాలను స్పృశిస్తూ.. ముఖ భాగం, కిరీట భాగాన్ని తాకాయి. - ఒక్కసారిగా గర్భాలయమంతా కాంతివంతమైంది. - ఏడు గుర్రాలతో నిత్యం స్వారీ చేస్తున్న వెలుగుల రేడును అదే ఏడు నిమిషాలపాటు కిరణాలు అంటిపెట్టుకుని ఉండిపోయాయి. - గత కొన్ని దశాబ్దాల కాలంలో ఇలాంటి కిరణ దర్శనం కలుగలేదని సాక్షాత్తు అర్చకులు చెబుతున్నారు. ఆలయ చరిత్ర గంగా వంశరాజు గుణశర్మ వారసుడైన కళింగరాజు దేవేంద్రవర్మ క్రీ.శ.663లో ఈ దేవాలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. క్రీ.శ. 16వ శతాబ్దంలో హర్షవల్లి ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్‌గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్, తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు.. మహమ్మద్ ఖాన్, హర్షవల్లిపై దండెత్తుతాడని తెలుసుకుని మూలవిరాట్టును తీసుకుని సమీపంలోని ఒక బావిలో దాచారట. క్రీ.శ 1778లో ఎలమంచిలి పుల్లాజీ పంతులు ఆ బావిలో మూలవిరాట్టును కనుగొని, తర్వాత ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేశారు. నాడు హర్షవల్లి.. నేడు అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారు కొలువైన ఏకైక దివ్యక్షేత్రంగా, దేశంలోనే నిత్య పూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా అరసవల్లి విరాజిల్లుతోంది. ఇక్కడి సూర్యదేవుణ్ని దర్శించుకుని అభిషేకాలు, సూర్యనమస్కారాలు చేసిన వారు, తమ కోర్కెలు ఫలించగా,ఎంతో హర్షితులై తిరిగి వెళ్లేవారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది అరసవల్లిగా మారింది. ఏడాదికి రెండు సార్లు మూలవిరాట్టు ఉన్న స్థానబలం వల్ల ప్రతి ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన కాలమార్పుల్లో నేరుగా తొలి లేత కిరణాలు నేరుగా స్వామి వారి మూలవిరాట్టును ప్రతి భాగమూ స్పృశించడం ఇక్కడి క్షేత్ర మహత్మ్యం. ప్రతి ఏటా మార్చి 9,10,11,12 తేదీల్లోనూ, అలాగే అక్టోబర్ 1,2,3,4 తేదిల్లోనూ స్వామి వారిని సూర్య కిరణాలు తాకుతుంటాయి. అక్కడ తిరుమలలో.. ఇక్కడ అరసవల్లిలో తిరుమలలో వెంకన్న స్వామికి, ఇక్కడ అరసవల్లి ఆదిత్యునికి కూడా నడుముకు చురిక (చిన్న కత్తి)ను ఆయుధంగా ధరించినట్లుగా కొలువుతీరడం ప్రత్యేకం. ఈ సూర్యక్షేత్రంలో శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవి అనే ముగ్గురు భార్యలతో సూర్యభగవానుడు శాలిగ్రామ ఏక శిలతో విగ్రహరూపుడై ఉంటారు. స్వామి సింహలగ్న జాతకుడైనందున ఆయన విరాట్టుపై సింహతలాటం ఉంటుంది. ఆయనకు రెండు హస్తాలుంటాయి. -
అరసవల్లి ఆలయ ‘ట్రస్ట్’ బోర్డుకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి మంచి రోజులు రానున్నాయి. వార్షికాదాయం రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకున్న ఆలయాల ధర్మకర్తల సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2011లో అరసవల్లి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. నాటి రెవెన్యూ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చొరవతో ట్రస్ట్ బోర్డు దిగ్విజయంగా పనిచేసింది. స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హయాంలోనే మళ్లీ ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు వచ్చాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 20 తేదీలోగా ఆసక్తి గల సభ్యులు ధృవీకరణలతో కూడిన ఫారం–2ను నింపి ఆలయ సహాయ కమిషనర్‌కు అందజేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం మాత్రమే ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారమే నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 25 ఆలయాలకు ట్రస్ట్ బోర్డులను నియామకాలు చేపట్టేలా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అరసవల్లి కూడా ఉంది. ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు, తొమ్మిది మంది ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ధర్మకర్త వ్యవహరించనున్నారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారికి 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పించనున్నాం. దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి, దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిస్తాం. – వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈవో -
అరసవల్లి ఆలయంపై విజి‘లెన్స్’
సాక్షి, అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి వారి ఆలయ కార్యాలయంలో ఆదివారం విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రీజనల్ విజిలెన్స్ అధికారి పనసారెడ్డి ఆదేశాల మేరకు సీఐలు చంద్ర, ప్రకాష్, స్వామినాయుడులతోపాటు ఎస్సై కిరణ్‌కుమార్ తదితర బృందాలు ఆలయంలో పలు విభాగాల్లో ఉదయం 6.30 గంటల నుంచి తనిఖీలను మొదలు పెట్టారు. బృందాలుగా విడిపోయి కేశఖండనశాల, ప్రసాదాల విభాగంతోపాటు ముఖ్య కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీకి టెండర్‌దారుడి నుంచి వచ్చిన పచారి సరుకుల నాణ్యతను పరిశీలించారు. జీడిపప్పు, కిస్మిస్ తదితర వస్తువుల నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే గత రథసప్తమి టెండర్లు, వివిధ ఆర్జిత సేవల టిక్కెట్లు, దర్శన మార్గ టిక్కెట్లు, విరాళాలు, బ్యాంకు లావాదేవీలు, ఆలయ భూముల వివరాలతోపాటు తలనీలాలు, కొబ్బరికాయల టెండర్ ప్రక్రియలు ఖరారైన తీరుతెన్నులను ప్రధానంగా పరిశీలించి, అనుమానమున్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ అన్ని విభాగాల్లోనూ తనిఖీలు చేశామని, పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. ప్రస్తుతం ఆలయ రికార్డుల ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోందని, దీంతో తాజాగా విజిలెన్స్ అధికారులకు కావాల్సిన రికార్డులను, సమాచారాన్ని వెంటనే ఇచ్చే వీలు కలిగిందన్నారు. తమ ఆలయ సిబ్బంది విజిలెన్స్ అధికారులకు పూర్తిగా సహకరించారని వివరించారు. -
కిరణ స్పర్శ కాసింతే..
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం పాక్షికంగా కిరణ దర్శనమైంది. ఉత్తరాయణ, దక్షిణాయన కాలమార్పుల్లో భాగంగా గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తొలిసూర్యకిరణాలు స్పృశించే అరుదైన దృశ్యం కోసం ఎదురుచూసిన భక్తులకు కొంతమేరకు నిరాశే మిగిలింది. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు మంచు కమ్మేయడంతో సూర్యోదయం కాస్తా ఆలస్యమైంది. దీంతో శనివారం ఉదయం 6.28 నిమిషాలకు సూర్యోదయ తొలికిరణాలు ఆలయ ధ్వజస్తంభాన్ని తాకి అంతరాలయంలోకి చేరుకున్నాయి. అయితే కిరణాల దిశ మారిపోవడంతో కిరణాలు పూర్తి స్థాయిలో మూలవిరాట్టును తాకలేదు. దీంతో పాక్షికంగా తాకిన కిరణాల దర్శనాలతో భక్తులు వెనుదిరిగారు. పలువురు ఉన్నతాధికారుల కుటుంబసభ్యులు ఆదిత్యుని కిరణ దర్శనాన్ని తిలకించేందుకు వచ్చి, స్వామిని దర్శించుకున్నారు. పెద్ద సం ఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ఈవో ఆర్.పుష్పనాథం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభం నుంచి అంతరాలయం వరకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశా రు. కలెక్టర్ సతీమణి పబితా నివాస్, ఎస్పీ సతీమణి రామలక్ష్మి, డీఎస్పీ ఎ.చక్రవర్తి తదితరులు కిరణ స్పర్శను చూసేందుకు వచ్చారు. నేడు కూడా కిరణ దర్శనానికి అవకాశం తొలి సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం కూడా కన్పించేందుకు అవకాశముంద ని ఆలయ ఈవో తెలియజేసారు. ఈమేరకు భక్తు ల దర్శనాలకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కిరణాల దర్శనం తర్వాత సాధారణ దర్శనాలకు అవకాశమిస్తామని తెలియజేసారు. ఆనందంగా ఉంది.. తొలిసారి ఆదిత్యుని కిరణాలను తాకే దృశ్యం చూసేందుకు వచ్చాను. కొద్దిపాటి సమయం అంతరాలయంలో స్వామి వారి విగ్రహంపై కిరణాలు పడటం కన్పించింది. చాలా ఆనందంగా ఉంది. మళ్లీ ఆదివారం కూడా అవకాశముందని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోసారి చూసేందుకు ప్రయత్నిస్తా. –పబితా నివాస్, జిల్లా కలెక్టర్ సతీమణి -
ఆదిత్యా మన్నించు!
నిత్యం కనిపిస్తున్న సూర్యదేవుని వెలుగుని ఆపడం సృష్టిలో ఎవ్వరికీ సాధ్యం కాని పని. అయితే ఆ సూర్యదేవుడే కొలువైన క్షేత్రానికి రావాల్సిన ఆదాయ వెలుగులను ఆపడం మాత్రం సాధ్యమే అని రుజువైంది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అరసవల్లిలో రథసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవమైన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి మరీ ఆయనపై పైచేయి సాధించినంత పని చేశారు కొంతమంది. లక్షలాది రూపాయల ఆదాయానికి గండి పడడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం, అరసవల్లి: అరసవల్లిలో సోమవారం అర్ధరాత్రి తరువాత నుంచి మంగళవారం సాయంత్రం వరకూ రథసప్తమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేలాది మంది స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే ఆ స్థాయిలో ఆలయానికి ఆదాయం మాత్రం సమకూరలేదు. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్సవంలో ప్రధానంగా పోలీసు శాఖతో పాటు పలు శాఖలకు చెందిన కొందరు అధికారులు నిర్వహించిన ప్రధాన పాత్ర ఓ వైపు ఆలయ ఆదాయాన్ని ముంచేస్తే...మరో వైపు సామాన్య భక్తుల మనోభావాలను తీసినట్లు కన్పించింది. ఏటా సప్తమి రోజున లక్షల్లో భక్తులు అరసవల్లితరలిరావడంతో ఆదాయం కూడా రూ. లక్షల్లోనే సమకూరేది. అయితే గతేడాది నుంచి రథసప్తమి ఉత్సవాల్లో పోలీసు శాఖతో పాటు పలు కీలక శాఖాధికారుల బంధుప్రీతి ఫలితంగా ఆలయ ఆదాయం తగ్గడం ప్రారంభమైందనే విమర్శలు వస్తున్నాయి. తగ్గుతున్న ఆదాయం– పెరుగుతున్న ఖర్చు రథసప్తమి పర్వదినాన వేలాది మంది భక్తులు అరసవల్లి ఆలయంలో పలు ఆర్జిత సేవలతో పాటు దర్శనాల టిక్కెట్లు కొనుగోలు చేయడంతో ఆలయానికి ఆదాయం సమకూరుతుంది. ఈ మహోత్సవానికి నెల రోజుల ముందు నుంచే జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలయ అధికారులు వివిధ ఏర్పాట్లను చేయిస్తుంటారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. బారికేడ్లు, క్యూలైన్లు, విద్యుత్ కాంతుల డెకరేషన్, పుష్పాల అలంకరణ, క్లాత్ డెకరేషన్, పారిశుద్ద్య పనులు, రంగులు, సిబ్బంది భోజనాలు, వివిధ రకాల ప్రచారాలు ఇతరత్రా ఏర్పాట్లు చేసేందుకు ఆలయ నిధులను మాత్రమే ఖర్చు చేస్తారు. గతేడాది సప్తమికి సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి, ఏర్పాట్లు భారీగా చేపట్టినప్పటికీ, భక్తులు అంతస్థాయిలో రాకపోవడంతో ఆదాయం రూ. 32.74 లక్షల వరకు వచ్చింది. ఇందులో అర్చకులు, క్షురకుల షేర్లు మినహాయిస్తే, ఆ ఆదాయం సుమారు రూ.28 లక్షలకు తగ్గింది. దీంతో గతేడాది కూడా ఖర్చుకు తగ్గ ఆదాయం రాలేదని వివరాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా పరిస్థితులను చూస్తే...ఆదాయం మాత్రం రూ.32.86 లక్షలని అధికారులు ప్రకటించినప్పటికీ, ఎవరి వాటాలు వారికి మినహాయిస్తే ఆదాయం రూ.29.99 లక్షలకు పడింది. ఈ ఏడాది సప్తమి ఏర్పాట్ల కోసమే సూమారు రూ.40 లక్ష ఖర్చు చేసినట్లు సమాచారం. దీంతో ఆదాయానికి తగిన ఆదాయం ఈసారి కూడా రాని పరిస్థితి. వాస్తవానికి ఆలయాలు వాణిజ్య, వ్యాపార కేంద్రాలు కాకపోయినప్పటికీ భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ, దర్శన టిక్కెట్లు, వివిధ రకాల సేవల టిక్కెట్లు ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టడం తప్పేమీ కాదు. కానీ అరసవల్లి ఆలయానికి రథసప్తమి రోజున గత రెండుమూడేళ్లుగా ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం మాత్రం రావడం లేదు. ఆదాయం సమకూరింది ఇలా.. ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా అరసవల్లి ఆలయానికి వివిధ దర్శనాల టిక్కెట్లు, సేవలు, ప్రసాదాల రూపంలో మొత్తం రూ. 32,86,968 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ఆర్.పుష్పనాథం బుధవారం ప్రకటించారు. వంద రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 10,43,500, 5 వందల రూపాయల క్షీరాభిషేకం (1205 టిక్కెట్లు) విక్రయం ద్వారా రూ. 6,02,500, 5 వందల రూపాయల విశిష్ట దర్శనం టిక్కెట్లు 535 విక్రయం ద్వారా రూ. 2,67,500 ఆదాయం సమకూరింది. అలాగే శాశ్వత ఉభయాలు ద్వారా రూ.43,796, కేశఖండన శాల టిక్కెట్లు ద్వారా రూ.46,250, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 12,56,115, విరాళాలుగా రూ.27,307 చొప్పున ఆదాయం లభించినట్లు లెక్కలు వివరించారు. అయితే ఇందులో క్షీరాభిషేకం టిక్కెట్లలో అర్చకుల షేర్ ఉంది. ఒక్కో టిక్కెట్టు ధర రూ.500 కాగా, ఇందులో రూ.200 అర్చకులకు పూజాద్రవ్యాల కొనుగోలు నిమిత్తం షేర్‌గా ఆలయ అధికారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు రథసప్తమికి మొత్తం 1205 టిక్కెట్లు విక్రయించగా, ఇందులో అర్చకులకు రూ. 2.41 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, ఆలయానికి రూ. 3.61,500 ఆదాయంగా మిగులనుంది. అలాగే కేశఖండన శాల టిక్కెట్లతో రూ. 46,250 ఆదాయం రాగా, ఈమొత్తం కూడా తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అధికారికంగా పనిచేసే 12 మంది క్షురకులకే చెల్లించాల్సి ఉంది. దీంతో తాజాగా ప్రకటించిన ఆదాయంలో అర్చకులు, క్షురకులకు చెల్లింపులను మినహాయించాల్సి ఉంది. దీంతో మిగిలిన ఆదాయంగా రూ.29,99,718 వచ్చినట్లైంది. ఇదిలావుంటే గతేడాది సప్తమికి మొత్తం రూ.32,74293 ఆదాయం లభించగా, నాటి పరిస్థితుల్లో క్షీరాభిషేకం టిక్కెట్టు ధర రూ.216 కాగా, ఇప్పుడు రూ.500కి పెరిగింది. అలాగే కేశఖండన శాల టిక్కెట్టు రూ.10లో సగం ధర ఆలయానికి చెందేది. ఇప్పుడు ధర రూ.25 కాగా, మొత్తం క్షురకులకే చెందుతుంది. దీంతో గతేడాదితో పోల్చితే ఆదాయం తగ్గినట్లైంది. దీనికితోడు హుండీల ద్వారా కూడా ఈసారి ఆదాయం పెద్దగా రాకపోవచ్చుననే అంచనాలున్నాయి. సిఫారసుల ఫలితమే! గత రెండేళ్ల నుంచి రథసప్తమికి భక్తుల తాకిడి రికార్డుల్లోకి నమోదు కావడం లేదు. భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ..అధిక సంఖ్యలో భక్తులు వివిధ రూపాల్లో సిఫారసులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండడం కన్పిస్తోంది. గతేడాది కూడా పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు తలెత్తాయి. తాజా రథసప్తమి ఉత్సవానికి కూడా పోలీసు శాఖతో పాటు మరో రెండు కీలక శాఖల హడావుడి, బంధుప్రీతిపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. సాధారణ భక్తుల్లో అసంతృప్తి, అసహనం వ్యక్తమయ్యింది. భారీ సంఖ్యలో తమ వారిని దర్శనాలకు వీవీఐపీ, దాతల పాసుల లైన్లో నుంచి పంపించడంతో ఆలయ ఆదాయానికి రూ. లక్షల్లో గండిపడింది. దీంతో క్షీరాభిషేకం, విశిష్ట దర్శనాలతో పాటు ప్రత్యేక దర్శనాలు కూడా దారుణంగా తగ్గిపోయాయి. టిక్కెట్లు ధర పెరగడంతో కాస్తా అంకెల్లో బాగా కన్పిస్తున్నా...ఖర్చులతో పోల్చితే భారీగా ఆదాయం తగ్గినట్లైంది. ఇదిలాఉండే ఆలయ ఈవో ఆర్.పుష్పనాథం, అధికార సిబ్బందితో ఖరారు చేయించుకుని ఆదాయ వివరాలను ప్రకటించారు. ఆదాయం తగ్గడానికి పూర్తిగా పోలీసు శాఖ నిర్వాకమే అని, అందులో కొందరి వైఖరిపై తీవ్రంగా చర్చించుకున్నట్లు తెలిసింది. మరో రెండు కీలక శాఖల అధికారుల్లో కొందరు వల్ల కూడా నకిలీ వీవీఐపీలు పెరిగిపోవడంతో ఆదాయం తగ్గినట్లు గుర్తించినట్లు సమాచారం. ఇలాంటి వ్యవహారాలు ఇకముందు జరగకుండా చేయాల్సిన విధివిధానాలపై కూడా ఆయన సమాలోచనలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
అద్భుతం.. అద్వితీయం
శ్రీకాకుళం, అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుడు వరుసగా రెండో రోజు కూడా తొలి కిరణాల వెలుగులో భక్తులకు కనువిందు చేశాడు. దక్షిణాయన కాల మార్పుల్లో భాగంగా బుధవారం అరసవల్లి సూర్యక్షేత్రంలో సూర్యోదయ తొలి కిరణాలు నేరుగా గర్భాలయంలో ఆదిత్యుని ధ్రువమూర్తిని తాకాయి. సరిగ్గా ఉదయం 6.05 గంటల నుంచి 8 నిమి షాల పాటు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ స్వర్ణ వర్ణ కిరణాలు స్వామి విగ్రహాన్ని అభిషేకించాయి. రాజగోపురం నుంచి ఆలయ మండపాల గుండా ధ్వజస్తంభాన్ని తాకుతూ నేరుగా గర్భాలయంలోని స్వామి వారి పాదాలపై స్పృశించి, తర్వాత ఉదరం, వక్ష భాగం, ముఖభాగంలో కిరణాలు తాకడంతో బంగారు వర్ణంలో స్వామి దర్శనమిచ్చారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. అంతరాలయంలో కిటకిట మంగళవారం కంటే బుధవారం గర్భాలయంలో కిరణాల ప్రసరణ అత్యద్భుతంగా పడటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో అంతరాలయం కిటకిటలాడింది. పోలీసులు బందోబస్తు నిర్వహించినప్పటికీ కొద్దిపాటి తోపులాటలు సంభవించాయి. అయితే రాష్ట్ర స్థాయి ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా బుధవారం ఆలయానికి రావడంతో మరింత ఇబ్బందులు నెలకొన్నాయి. వీవీఐపీల కంటే వారి బలగమే అధిక సంఖ్యలో రావడంతో అర్చకులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతరాల యం వద్ద ఒక దశలో బారికేడ్లు కూడా ఒరిగిపోయాయి. అయితే ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు ప్రత్యేకంగా సిబ్బందితో చర్యలు చేపట్టడంతో కిరణ దర్శనం తర్వాత సాఫీగా సాగింది. సుమారు 8 నిమిషాల ఈ అద్భుతం తర్వాత ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆ«ధ్వర్యంలో ప్రత్యేక పూజలు, నిత్యార్చనలు చేశారు. అనంతరం మహా హారతిని స్వామికి నివేదించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, జిల్లా ఎస్పీ త్రివిక్రమ్‌వర్మ, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, బొడ్డేపల్లి సత్యవతి, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ డోల జగన్, శ్రీకాకుళం, టెక్కలి కాంగ్రెస్ ఇన్చార్జిలు చౌదరి సతీష్, కిల్లి రామ్మోహనరావు తదితరులు దర్శనానికి హాజరయ్యారు. కిరణ దర్శనం అనంతరం వీరికి అంతరాలయంలో ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెప్పలేనంత ఆనందంగా ఉంది అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కిరణాల వెలుగులో చూడటం ఇదే తొలిసారి. ఎంతో అద్భుతంగా అనిపించింది. అంతకుముందు పలుమార్లు చూసేందుకు వచ్చినా వాతావరణం అనుకూలించకపోవడంతో కిరణ దర్శణం కలు గలేదు. కానీ ఈసారి బాగా దర్శనం అయ్యింది. మళ్లీ మార్చిలో దర్శనానికి వస్తాను.– నిర్మలాగీతాంబ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి. -
అరసవల్లి ఆలయంలోకి సూర్యకిరణాలు
-
ప్రిన్స్ మహేష్‌తో కలిసి సినిమా చేస్తా..
అరసవల్లి శ్రీకాకుళం : ‘మా బావ ప్రిన్స్ మహేష్‌బాబుతో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం కోసం ఎప్పటి నుంచో వేచిచూస్తున్నాను. త్వరలోనే మంచి కథతో ఆయనతో కలిసి సినిమా చేస్తా..’’ అని వర్ధమాన సినీ హీరో పోసాని సుధీర్‌బాబు అన్నారు. ‘నన్ను దోచుకుందువటే..’ చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఆయన ఆదివారం ఉదయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి : ఆదిత్యుని దర్శనంపై మీ అనుభూతి...! సుధీర్‌బాబు: దేశంలోనే ఖ్యాతి గల అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాను.. ఇప్పటికి స్వామి దయ కలిగింది. సాక్షి : ఇంతవరకు సినీ ప్రస్థానం ఎలా ఉంది? సుధీర్‌బాబు: ప్రస్థానం అంటే పెద్ద మాట. ఇప్పటి వరకు నేను కేవలం 8 సినిమాలే చేశాను. కానీ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, ప్రిన్స్ మహేష్‌బాబు బావగా ప్రత్యేకత ఉండడం కూడా ప్రస్తుత ఇమేజ్‌కు కారణమని భావిస్తున్నాను. నాకంటూ గుర్తింపు తెచ్చుకునేలా మంచి కథలనే ఎంచుకుని సినిమాలను చేయడానికి కృషి చేస్తున్నాను. చిన్న సినిమాలైనా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సాక్షి : డ్రీమ్ రోల్ ఏదైనా..! సుధీర్‌బాబు : డ్రీం అని ఏమీ లేదు. కానీ నాకు ఎంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌గా సినిమా చేయాలని అనుకున్నాను. ఊహించని విధంగా జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చింది. సాక్షి : మీరు కూడా చాంపియన్ కదా... సుధీర్‌బాబు : నిజమే..బ్యాడ్మింటన్ జూనిర్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌కు ప్రోపబుల్స్‌లో చోటుదక్కింది. పూర్వపు చాంపియన్ ప్రకాష్ పదుకొనే వద్ద శిక్షణ తీసుకున్నాను. ఇదే తరుణంలో ఒక గేమ్‌లో డబుల్స్‌లో పార్టనర్‌గా గోపిచంద్‌తో కలిసి ఆడాను కూడా.. సినిమాల్లో బిజీ అయ్యాక రూటు మారింది. నా కుమారుడు ఛరిత్‌ను మాత్రం బ్యాడ్మింటన్‌లో మంచి క్రీడాకారునిగా తయారుచేయాలనేది నా కోరిక. సాక్షి : ఛరిత్ బాలనటుడిగా అరంగ్రేటంపై ఎలా ఫీలవుతున్నారు..? సుధీర్‌బాబు : నిజంగా సంతోషంగా ఉంది. భలేభలే మగాడివోయ్‌లో చిన్నతనంలో నాని, విన్నర్లో చిన్నప్పుడు సాయిధరమ్‌తేజ్ పాత్రలో నటించాడు. మహేష్‌బాబు కూడా బాల నటుడిగా ఎదిగి ఈ రోజు స్టార్ అయ్యాడు. ఆయన కుమారుడు గౌతమ్ కూడా బాల నటుడిగా ఆరంగ్రేటం చేసేశాడు. సాక్షి : ఇక మీ సినిమాల సంగతేంటి..? సుధీర్‌బాబు: ‘శివ మనసులో శృతి’ (ఎస్ఎంఎస్) చిత్రంతో హీరోగా పరిచయమయ్యాను.‘ ప్రేమ కథా చిత్రమ్’ చిత్రంతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల సమ్మోహనం భారీ హిట్ అయ్యింది. మంచి కథలతో, చిన్న బడ్జెట్‌తో మంచి విజయాలు సాధించవచ్చునని నిరూపించిన చిత్రాలివి. త్వరలోనే ‘నన్ను దోచుకుందువటే..’ సినిమా రిలీజ్ కానుంది. విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. సాక్షి : శ్రీకాకుళంలో ఘట్టమనేని ఫ్యాన్స్ మీ పేరిట సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిపై మీ స్పందన? సుధీర్‌బాబు: నిజంగా మంచి ఫ్యాన్స్ నాకు ఉండటం నా అదృష్టం. సేవా కార్యక్రమాలే సామాజికంగా మనకు స్థానం కల్పిస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలోనే నా సినిమాలు బాగా ఆడుతాయి. ఇక్కడి ప్రేక్షకులకు నిజంగా రుణపడిఉన్నాం. అభిమానం పేరుతో డబ్బులు వృథా చేయవద్దు, ఫ్యాన్స్‌తో సుధీర్‌బాబు అభిమానం పేరుతో డబ్బులు వృథాగా ఖర్చు పెట్టవద్దని సినీ నటుడు సుధీర్‌బాబు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరానికి వచ్చిన ఆయన స్థానిక హోటల్లో ఫ్యాన్స్‌తో మాట్లాడారు. తన పుట్టినరోజు నాడు ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం నగరానికి వచ్చినట్లు తెలిపారు.శ్రీకాకుళం ప్రేక్షకులు కథతో కూడిన చిత్రాలను ఆదరించడం అభినందనీయమన్నారు. త్వరలో రానున్న తన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం మహేష్‌బాబు సేవాసమితి అధ్యక్షుడు ఉంకిలి శ్రీనువాసరావు కుమార్తె ఉంకిలి ప్రవళికా సుధీర్‌బాబుకు రాఖీ కట్టింది. కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. -
ఆదిత్యున్ని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీకాకుళం : అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదివారం దర్శించుకున్నారు. అలాగే సీఐఎస్ఎఫ్ కమాండెంట్ జయప్రకాష్‌ఆజాద్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైకోర్టు జడ్జి బాలయోగి తోపాటు, జిల్లా జడ్జి నిర్మలా గీతాం బ, తహసీల్దార్ మురళీకృష్ణ కూడా ఉన్నారు. ఆలయ ఈఓ డీవీవీ ప్రసాదరావు, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ చరిత్ర, విశిష్టతలను వివరించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు, ఆశీర్వాదం అందించారు. ముఖలింగేశ్వరుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని ఉమ్మడి రాష్టాల హైకోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి.. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న దేవతా విగ్రహాలకు పూజలు, వారాహి అమ్మవారి దర్శనం చేయించారు. ఆలయ శిఖరం దర్శనం చేయించి స్వామివారి చరిత్రతో పాటు ఆలయ విశేషాలు వివరించారు. అలాగే స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, అడిషనల్ సబ్ జడ్జి వివేకానంద, కోటబొమ్మాళి జడ్జి కె.ప్రకాశ్‌బాబు, పర్యవేక్షకులు టి.శ్రీనివాసరావు, తహసీల్దార్ కె.ప్రవళ్లికప్రియ, ఈఓ వీవీఎస్ నారాయణ, ఎస్ఐ ఎం.గోవింద, అర్చక సంఘం అధ్యక్షుడు టీ.పెద్దలింగన్న, అర్ఐ చిన్నారావు ఉన్నారు. -
ఈ సిట్టిబాబు సెవిలోకి మాటెల్లడం కష్టం గానీ...
అరసవల్లి : ‘ఈ సిట్టిబాబు సెవిలోకి మాటెల్లడం కష్టం గానీ...’ అంటూ చరణ్ పలికిన డైలాగులు ఇంకా ఎవరి చెవినీ దాటిపోలేదు. ఇలాంటి డైలాగుల వెనుక ఉన్న జట్టులో రొంగలి శ్రీనివాస్ కూడా ఒకరు. యాభై రోజుల కిందట విడుదలై సూపర్ హిట్ కొట్టిన రంగస్థలం సినిమాకు ఆయన రచయితగా పనిచేశారు. సహాయ స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. ఆయన శుక్రవారం కుటుంబ సమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇలా ముచ్చటించారు. సాక్షి: రంగస్థలం రచయితగా అవకాశం ఎలా వచ్చింది..? రొంగళి: సినిమాల్లో రచయితగా అరంగ్రేటం చేసి సుమారు పదేళ్లు అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ వద్ద చాలా కాలంగా పనిచేస్తూ ఉండడంతో రంగస్థలంకూ పనిచేశాను. ఈ సినిమాకు సహాయ స్క్రీన్‌ప్లే కూడా అందించాను. ఇప్పటి వరకు ఏడు సినిమాలకు రచయితగా పనిచేశాను. దాదాపుగా అన్నీ సూపర్ హిట్లే కావడంతో అవకాశాలు వస్తూ ఉన్నాయి. సాక్షి: రంగస్థలంలో డైలాగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. దాని గురించి.. రొంగళి: థాంక్యూ.. నిజంగా డైలాగులు నాకు కూడా పేరుతెచ్చాయి. ఈ డైలాగ్స్‌ను 80ల్లో వా డుక భాషకు తగ్గట్టుగా రాసి ప్రేక్షకులకు మెప్పించడంలో సఫలమయ్యాననే ఆనందంగా ఉంది. అత్త అనసూయతో హాస్యం, ప్రేయసి సమంతతో ప్రే మ, అన్న ఆది పినిశెట్టితో ఆప్యాయత, ప్రకాష్ రాజ్‌పై కసి ఇలా అన్ని రంగాల్లో డైలాగ్స్ అద్భుతంగా రావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందులో వినిపించని వ్యక్తిగా చరణ్ నటనకు తగ్గట్టుగా డైలాగ్స్ రాశాను. సాక్షి: మీరు ఉపాధ్యాయుడిగా పనిచేశారని తెలిసింది. నిజమేనా? రొంగళి: అవును. విశాఖ జిల్లా చోడవరం నా సొంత ఊరు. కృష్ణా జిల్లాలో డైట్ చేసి తొలి ప్రయత్నంలోనే డీఎస్సీలో ఎంపికై చోడవరంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశాను. అయితే చిన్నప్పటి నుం చి సినిమాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగాన్ని వది లిపెట్టి సినీరంగంలోకి అడుగుపెట్టాను. ప్రేక్షకుల ఆదరణతో ఈరోజు ఈ స్థాయికి చేరాను. సాక్షి: ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మీకు నచ్చినవి ఏంటి? రొంగళి: నాకు ఈ రంగంలో లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. ఆయన దర్శకత్వ టీమ్‌లో నేను కూ డా కీలక సభ్యుడినే. నేను రచయితగా కుమారి 21ఎఫ్, నాన్నకు ప్రేమతో, వన్ తదితర చిత్రాల్లో పనిచేశాను. ఇప్పుడు రంగస్థలం వీటిలో బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టింది. నాన్నకు ప్రేమతో సినిమాలో నాన్నపై సెంటిమెంట్ డైలాగ్స్ కూడా మంచి పేరు తెచ్చాయి. సాక్షి: శ్రీకాకుళం జిల్లాకు రావడం వెనుకఏమైనా ప్రత్యేకత ఉందా? రొంగళి: ఉంది. రంగస్థలం సినిమా హిట్ అవ్వాలని, మా అక్క సుధ ఈ జిల్లాలోని శ్రీముఖలింగం ఆలయానికి వచ్చి అక్కడ పవిత్ర గోలెంలో కోరిక చెప్పిందట. అందుకే ఇలా వచ్చి మొక్కు తీర్చుకున్నాను. అలాగే ఎప్పటి నుంచో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని కూడా దర్శించుకోవాలనే కోరిక తీరింది. అరసవల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కోడూరు సురేష్‌కుమార్ సహాయంతో ఆదిత్యున్ని దర్శించుకున్నాను. అలాగే శుక్రవారంతో రంగస్థలం సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అందుకే నా స్నేహితుడు సురేష్ కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకున్నాను. సాక్షి: భవిష్యత్ ప్రణాళికలేమైనా..! రొంగళి: రచయితగా సక్సెస్ అయిన వారంతా దర్శకులుగా మారినట్లే.. నేను కూడా వచ్చే ఏడాది దర్శకత్వం చేసేందుకు సిద్ధమయ్యాను. కథను సిద్ధం చేసుకున్నాను. అయితే ప్రస్తుతం మహేష్‌బాబుతో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు సహాయ దర్శకత్వం, రచయితగా పనిచేస్తున్నాను. ఇది పూర్తయితే పూర్తి స్థాయిలో మెగా ఫోన్ పడతాను. -
భక్తులకు నిరాశను మిగిల్చిన కిరణ దర్శనం
-
నాన్న స్థాయికి ఎదగడమంటే సాహసమే!
శ్రీకాకుళం, అరసవల్లి: ‘తెలుగు సినీ చరిత్రలో నాన్న రావు గోపాలరావు అంటే ఓ చరిత్ర... ఓ నిఘంటువు. ఏదో కొన్ని సినిమాల్లో బాగా నటించి ఆడేస్తే...గొప్పోళ్లం కాదు..’అంటూ ప్రముఖ విలక్షణ నటుడు రావు రమేష్ కుమార్ తనదైన శైలిలో చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. నాన్న రావు గోపాలరావు పేరు సినిమాతెర ఉన్నంత కాలం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొత్త సినిమాలన్నీ ఏప్రిల్‌లో ఖరారు అవుతాయని, కళామతల్లి సేవలో తనకు పాత్ర దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇటీవలే 100 సినిమాలు దాటాయని, అయినా నిత్య విద్యార్థిగానే ఇండస్ట్రీలో ఉంటానని తెలిపారు. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదని, విభిన్న పాత్రలేవైనా చేస్తానని చెప్పారు. ఇటీవల దువ్వాడ జగన్నాధం (డిజె) సినిమాలో రొయ్యిల నాయుడు పాత్రను, గతంలో నాన్న రావు గోపాలరావు ‘ఆ ఒక్కటీ అడక్కు..’అనే సినిమాలో పోషించిన పాత్రను పోలినట్టు నటించే ప్రయత్నం చేశానని, ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. శ్రీకాకుళంలోనే పుట్టానని, తన తల్లి కుటుంబీకులంతా అరసవల్లిలోనే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకే శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు. అనంతరం బ్రాహ్మణ వీధిలో ఉన్న మేనమామ కుమారుడు మండా శుకుడు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన్ను పరామర్శించారు. నీలమణిదుర్గ సేవలో.. పాతపట్నం: పాతపట్నంలో కొలువైన శ్రీనీలమణిదుర్గ అమ్మవారిని నటుడు రావు రమేష్ గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో పూజలు నిర్వహించి ఆశీర్వాదాలను అందజేశారు. -
‘పాల’ భానుడు
జన్మదినం నాడు బాల భానుడు పాల భానుడిగా మారాడు. అరుణ శిలపై క్షీరధారలు అమృత ధారలుగా కురిసిన వేళ ప్రచండ మార్తాండుడు ప్రశాంత క్షీరాదిత్యుడై అగుపించాడు. పాపాలు నాశనం కావాలని, లోపాలు మాయం కావాలని కోరుతూ భక్తులు పాలు కురిపిస్తుంటే అంతటి దేవదేవుడు నవ్వుతూ స్నానించాడు. ప్రఖ్యాత అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రంలో రథ సప్తమి సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి క్షీరాభిషేక సేవ ప్రారంభమైంది. స్వయానా దేవశిల్పి విశ్వకర్మ మలిచిన భానుడి వాస్తవ రూపం ఇక భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ నిజరూప దర్శనం కోసం వేలాది మంది ఇప్పటికే అరసవల్లి వీధుల్లో బారులు తీరారు. అరసవల్లి: భానుడు పాలపొంగుల్లో మునిగిపోయాడు. నల్లటి అరుణశిల శ్వేతవర్ణంలో మారిపోయేంతలా క్షీరధారల్లో అభిషేకమాడాడు. సూర్యజయంతి (రథసప్తమి) సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లిలో కొలువైన సూర్యనారాయణ స్వామి వారి జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ప్రత్యేక క్షీరాభిషేక సేవ ప్రారంభమైంది. తొలి అభిషేకాన్ని శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహిం చారు. ఆయన స్వహస్తాలతో గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుపై పంచామృతాలు, క్షీరధారలు కురిపించా రు. దీంతో ఆలయ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఆదిత్యుని నామస్మరణతో మారుమోగింది. స్వరూపానందేంద్ర స్వామికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఉత్సవ అధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఆలయ ఈఓ శ్యామలాదేవి, ఆలయ పునర్నిర్మాత వరుదు బాబ్జీ, ఆలయ వ్యవస్థాపక« ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్ శర్మ తదితరులు గౌరవ స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా గర్భాలయంలోకి వెళ్లిన స్వరూపానంద ఆదిత్యునికి ప్రత్యేక విశేష పూజలు చేశారు. క్షీరాభిషేకం చేసిన అనంతరం స్వామి విశిష్టతను భక్తులకు వివరించారు. పట్టువస్త్రాల సమర్పణ ఆలయ నియమాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆది త్యునికి పట్టువస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తీసుకునివచ్చారు. ఆమె వెంట దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి, ఆలయ ఈఓ శ్యామలాదేవి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగిసన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం తరఫున అందజేసిన పట్టువస్త్రాలను స్వామికి విని యోగించేందుకు చర్యలు చేపట్టారు. పోటెత్తిన భక్తజనం రథసప్తమిని పురష్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు అరసవల్లికి తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్డుపైన భక్తుల కోసం ఏర్పాటు చేసి న క్యూలైన్లలో భక్తులు వచ్చి స్వామి క్షీరాభిషేకం, నిజరూపాన్ని దర్శించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12.30 నుం చి క్షీరాభిషేకం ప్రారంభమైంది. ఇది బుధవారం వేకువజామున 6 గంటలకు ముగిసిపోతుంది. అక్కడ నుంచి నిజరూపంలో స్వామి దర్శనమిస్తారు. వీవీఐపీలు, వీఐపీలు, జిల్లా ఉన్నతాధికారులు, దాతల కుటుంబాలకు ఆలయ ప్రధాన ముఖ ద్వారం (ఆర్చిగేట్) నుంచి ప్రవేశం కల్పించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి పోలీసులు పూర్తి స్థాయి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఎల్ఈడీ స్క్రీన్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా ఎస్పీ నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. స్థానిక డీసీఎంఎస్ గోడౌన్ నుంచి రూ.500 దర్శన టిక్కెట్లు, అలాగే ఇక్కడ నుంచే క్షీరాభిషేక సేవ (రూ.216) టిక్కెట్లు దర్శనాల క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. అలాగే అసిరితల్లి అమ్మవారి ఆలయం పక్క నుంచి ఉచిత, సాధారణ దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దాతలకు తప్పని పాట్లు ఈ సారి రథసప్తమికి ఇబ్బందులు లేని దర్శనాలకు ప్రాధాన్యమిస్తున్నామంటూ కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, ఎస్పీ త్రివి క్రమవర్మలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించారు. దేవా దాయ అధికారుల లెక్కలను సైతం పట్టించుకోకుండా భద్రతకే ప్రాధాన్యమిచ్చారు. ముఖ్యంగా వీవీఐపీల వాహనాలు, పోలీసుల వాహనాలను మాత్రమే ఆర్చిగేట్ వరకు అనుమతిచ్చారు. దాతల కుటుంబసభ్యులకు అటు 80 ఫీట్ రోడ్డులోనే వాహనాలను నిలిపివేయడంతో అక్కడ నుంచి అంటే సుమారు కిలోమీటరు దూరం నుంచి నడిచి రావడంతో దాతలు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులతో పాటు ఆ పార్టీ నాయకురాలు వరుదు కల్యాణి, కేంద్ర మాజీ మంత్రి కృపారాణి దంపతులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరి
అరసవల్లి: రథసప్తమి ఉత్సవం సందర్భంగా అరసవల్లి పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో కూడా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని, ఈ నిబంధనలను అందరూ పాటించి సహకరించాలని ట్రాఫిక్ డీ ఎస్పీ సీహెచ్ పెంటారావు కోరారు. శనివారం ఉదయం ఆయన అరసవల్లి ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ ఆదేశాల మేరకు ఈనెల 23 రాత్రి నుంచి 24 వ తేది రాత్రి వరకు (రథసప్తమి ఉత్సవం ముగిసినంత వరకు) ట్రాఫిక్ సంబంధించి పలు నిబంధనలను విధించామన్నారు. ముఖ్యంగా అరసవల్లికి వచ్చే వాహనా లన్నీ దాదాపుగా 80 ఫీట్ రోడ్డులోనే నిలిపివేస్తామని, కేవలం వీవీఐపీలు, జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వాహనాలు మాత్రమే అరసవల్లి జంక్షన్‌ను దాటి అనుమతిస్తామని, మళ్లీ ఇందులో కూడా మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలు మాత్రమే ఆలయ ప్రధాన ముఖ ద్వారం (ఆర్చిగేటు) వరకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే మొత్తం పార్కింగ్ కోసమే 12 స్థలాలను ఏర్పాటు చేశామని వివరించారు. ► శ్రీకాకుళం నగరం నుంచి అరసవల్లి వైపుగా వచ్చిన వారి వాహనాలకు 80 ఫీట్ రోడ్డులోనే బైకులు, కార్లు, బస్సులకు వేర్వేరుగా 7 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ► అలాగే గార నుంచి వచ్చే వాహనాల కోసం వాడాడ కూడలి లోనూ, అరసవల్లి అసిరితల్లి ఆలయం వద్ద వేర్వేరుగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. ► గార నుంచి నగరానికి వచ్చే బస్సులు, ఇతర వాహనాలన్నీ వాడాడ మీదుగా కలెక్టరేట్, ఓబీఎస్ మీదుగా వెళ్లాలని సూచించారు. ► నగరం నుంచి గార, శ్రీకూర్మం వైపు వెళ్లే వాహనాలు కూడా జాతీయ రహదారి మీదుగా వెళ్లి, అంపోలు (జిల్లా జైలు రోడ్డు) మీదుగా ఓ మార్గంలో వెళ్లాలని, అలాగే సింగుపురం (బూరవల్లి రోడ్డు) మీదుగా కొన్ని వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ► శ్రీకాకుళం నగరంలో కూడా రథసప్తమి రోజున పూర్తిగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నామని, అరసవల్లి రావాల్సిన అన్ని వాహనాను కాంప్లెక్స్, రామలక్ష్మణ కూడలి, సూర్యామహల్ మీదుగా అరసవల్లి జంక్షన్ (80 ఫీట్ రోడ్డు)కు చేరుకుంటాయని, తిరిగి వెళ్లే వాహనాలన్నీ మిల్లు జంక్షన్ నుంచి ఓబీఎస్ మీదుగా నగరంలోకి వెళ్లాలని, అలాగే జీటీ రోడ్డును కూడా వెళ్లే మార్గంగానే గుర్తించామని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు కచ్చితంగా పౌరులంతా పాటించాలని లేదంటే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట సిఐ బి.ప్రసాదరావు, వన్‌టౌన్ ఎస్సై చిన్నంనాయుడు తదితరులున్నారు. -
నిబంధనలు పాటించాల్సిందే
అరసవల్లి: ‘మేము ఇంతవరకు జాతీయ రహదారులపైనే దృష్టి పెట్టాం. నగరంలో ఆటోలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ దృష్టి సారిస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు.. జాగ్రత్త.. కచ్చితంగా నిబంధనల ప్రకారం ఆటోలు నడపాల్సిందే..’’ అంటూ జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం సాయంత్రం జెడ్పీ సమావేశ మందిరంలో రవాణా శాఖ, పోలీసు శాఖల సంయుక్తంగా నిర్వహించిన రహదారి భద్రతపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడా ది జనవరి నుంచి మార్చి వరకు మన జిల్లాయే ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉందని, ఇప్పుడు పలు భద్రతా చర్యల కారణంగా ఆ స్థానం మారిందని గుర్తుచేశారు. ప్రమాదాల నివారణలో పోలీసులదే బాధ్యత కాదని, డ్రైవర్లు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. అవగాహన లోపంతోనే జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్నాయ ని చెప్పారు. నిబంధనలను పాటించే క్రమంలో నగరంలో మొదట ఆదర్శంగా ఐదుగురు సీనియర్ ఆటో డ్రైవర్లు పరి మితి ప్రకారం ఆటోలు నడపాలని, వారి ని చూసి మరికొందరు మారే అవకాశముందని ఉదాహరణలతో వివరించా రు. ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి వాహనానికి బీమా, డ్రైవర్‌కు లైసెన్స్ తప్పనిస రి అని, అవసరమైతే ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తామని ప్రకటించారు. మారనున్న చట్టాలు.. వాహన ప్రమాదాలకు కారకులపై త్వరలో రానున్న చట్టాలు మరింత కఠినంగా ఉండబోతున్నాయని జిల్లా అదనపు న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.సుధామణి అన్నారు. డ్రైవర్లు చేతిలో ప్రయాణికుల విలువైన ప్రాణాలుంటాయని, అది దృష్టిలోపెట్టుకుని వాహనాలను నడపాలని, మద్యం సేవించకుండా, సెల్‌ఫోన్ వినియోగించకుండా డ్రైవింగ్ చేస్తే దాదాపుగా ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు. ప్రతి ఆటోలో వాహనం ఫిట్నెస్, డ్రైవర్ వివరాలన్నీ ఉండేలా ఏర్పాటు చేయాలని డీటీసీ శ్రీదేవికి సూచించారు. ముఖ్య ప్రాంతాల్లో ప్రమాద సూచికలు పెట్టించాలన్నారు. విద్యార్హత లేకున్నా లైసెన్స్.. ఆటో డ్రైవర్ల సమస్యలేంటో తమకు తెలుసునని, అందుకు తగ్గట్టుగానే రవాణా శాఖ చర్యలు చేపడుతుందని డీటీసీ శ్రీదేవి తెలిపారు. అందులో భాగంగా ఎనిమిదో తరగతి, పదో తరగతి విద్యార్హతలు లేకపోయినప్పటికీ, లైసెన్స్‌లు ఇస్తున్నామని, రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి డ్రైవర్లు లైసెన్స్‌లు పొందవచ్చునని చెప్పారు. సదస్సులో ఓ ఆటో యూనియన్ నేత వరాహ నర్సింహం అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించి ప్రతి సెంటర్లో ఫిక్స్డ్ రేట్లు పెట్టబోతున్నామని చెప్పారు. దీనిపై ఆటో డ్రైవర్లంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా ఇకపై ఆటోలో కనీస విద్యార్థులు ఐదుగురు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓవర్లోడ్లతో ఆటోలు కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతకుముందు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పలువురు ఆటో డ్రైవర్లు, పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రభాకరరావు, డీఎస్పీలు వి.భీమారావు, పెంటారావు, ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు, వైద్యులు కె.చిన్నబాబు, శ్రీకాంత్, చైతన్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూలవిరాట్‌ను తకని సూర్య కిరణాలు
-
ఆలయాల భూములివ్వం
అరసవిల్లి (శ్రీకాకుళం) : ఆలయాల నిర్వహణ, అభివృధ్ది కోసం భక్తులు ఎంతో ఉదారంగా ఎకరాల కొలది విలువైన భూములను అప్పట్లో దానం చేసారని, ఆ ఆలయ భూములను రాష్ట్రంలో అల్పాదాయ పేదలకు ఇవ్వడం కుదరదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు స్పష్టం చేసారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల దేవాలయాల భూములు దాతలిచ్చినవని, ఇవి ప్రభుత్వ భూములు కావని తేల్చిచెప్పారు. ఆలయ భూములను భూమి లేని, ఇళ్లు లేని పేదలకు ఇచ్చేందుకు వీలు లేదని, దీనికి అనుగుణంగానే ఆ భూమలు అన్యాక్రాంతం,ఆక్రమణలు జరగకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కన్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో ఈ ఏడాది దివ్య దర్శనం పేరిట 1.30 లక్షల మందికి ఉచితంగా తిరుపతి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను సందర్శించేలా యాత్రలు నిర్వహించామని, దీనికి అనూహ్య స్పందన లభించిందన్నారు. వచ్చే ఏడాది ఈయాత్ర భక్తుల సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో టిటిడి, దేవాదాయ శాఖ సంయుక్తంగా 500 దేవాలయాల నిర్మాణాలకు సంకల్పించామని త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రంలో అన్నవరం, సింహాచలం, విజయవాడ, ద్వారకాతిరుమల తదితర దేవాలయాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసామని, వీటిలో మిగులు విద్యుత్‌ను చిన్న దేవాలయాలకు సరఫరా చేస్తామని వివరించారు. దేవాలయాల్లో రోజు వారీ ఆదాయం, లెక్కలు, పూజలు ఆర్జిత పేవలు అన్నదానం తదితర వివరాలన్నీ వచ్చే నెల (జూలై) నుంచి ఆన్లైన్లో భక్తులందరికి కన్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయాల్లో ప్రతి విషయం భక్తులకు తెలిసేలా పారదర్శకంగా ఉండాలని ఈ మేరకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని తెలియజేసారు. అంతకుముందు ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తర్వాత ఆలయ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేసి అభివృద్ది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మపై పత్రికల్లో వచ్చిన పలు కథనాలపై ఆయన స్పందిస్తూ, పూర్తి విచారణ చేయించి తగు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇవో వి.శ్యామలాదేవి, ఆలయ అర్చకుడు ఇప్పిలి నగేష్ శర్మ తదితరులున్నారు. -
ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు
అరసవల్లి : ఈ నెల 9న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికార సిబ్బంది పనిచేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్–2 రజనీకాంతారావు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఎన్నికల సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. ఇందుకోసం 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మూడు జిల్లాల్లో 1,55,933 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు. ఓటర్ల జాబితాలను పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు. జోనల్ అధికారులకు మెజిస్ట్రీరియల్ అధికారాలు ఉంటాయని, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించారు. జిల్లాలోని మూడు డివిజన్లలో పోలింగ్ ప్రక్రియలో ఎక్కడా అవాంతరాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నకిలీ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైలెట్ రంగు స్కెచ్పెన్తోనే ప్రాధాన్యతా ఓటును వేయించాలని, ఓటు వేసిన బ్యాలట్ పత్రాన్ని నిబంధనల ప్రకారం మడత పెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేయించాలని సూచించారు. అంధ ఓటర్లు మూడు రోజుల ముందుగానే రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. బ్యాలట్ బాక్సులను సీల్ చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తేవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిషోర్ కుమార్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు శ్రీసూర్యనారాయణ స్వామి కల్యాణం
అరసవల్లి : ప్రత్యక్షదైవం శ్రీసూర్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం మార్చి 8న అనివెట్టి మండపంలో జరగనుంది. ఫాల్గుణ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉషాపద్మినీ, ఛాయాదేవేరులతో స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించనున్నారు. ఈ మేరకు ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. రూ.216 చెల్లించి కల్యాణం టికెట్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్యామలాదేవి తెలిపారు. ఈ నెల 8, 9, 10, 11వ తేదీల్లో స్వామి వారి విగ్రహాన్ని సూర్యుని లేలేత కిరణాలు స్పృశించే అవకాశముందని పేర్కొన్నారు. కిరణ ఆదిత్యున్ని భక్తులు తిలకించేలా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. -
‘నాన్న ఆశయాలే నడిపిస్తున్నాయి’
అరసవల్లి: దేశంలో నిత్యపూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా శ్రీకాకుళంలోని అరసవల్లి ప్రఖ్యాతి గాంచిందని, ఇక్కడ వాతావరణం అద్భుతమని దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు సునీల్ శాస్త్రి అన్నారు. భార్య మీనాతో కలిసి అరసవల్లి సూర్యదేవాలయాన్ని తొలిసారిగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘జై జవాన్ జై కిసాన్’ నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి అనుసరించిన సిద్ధాంతాలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ధైర్యమైన చర్య అని, దేశాభివృద్ధికి ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. వారికి సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు గౌరవ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. -
త్వరలో రానాతో సినిమా
అరసవల్లి : సినీ హీరో దగ్గుబాటి రామానాయుడు(రానా) త్వరలో ఓ క్లాసిక్ సినిమా తీస్తానని ప్రముఖ నిర్మాత, నటుడు కె.అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం తన భార్య ఉషారాణితో కలిసి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విక్టరీ వెంకటేష్ తర్వాత అంత స్థాయి నటుడిగా రానా రాణిస్తాడని, అందుకు అతడి విలక్షణ నటనే నిదర్శనమని చెప్పారు. తాను ఇంతవరకు 70 సినిమాలకు పైగా నటించానని, ఇప్పుడు సొంతంగా ప్రొడక్షన్ ప్రారంభించానని, ప్రస్తుతం మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు హీరోగా సినిమా చేస్తున్నానని, ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయ్యిందని వివరించారు. పదేళ్ల క్రితం చిన్న అనారోగ్య కారణాలతో ఇక్కడి అరసవల్లి సూర్యక్షేత్రానికి వచ్చానని, ఇక్కడే బస చేసి సూర్యనమస్కారాలు చేయించుకున్నానని, తర్వాత ఆరోగ్యం పొందానని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శన భాగ్యం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో నటులకు కొదవలేదని, త్వరలో తెలుగు సిని ఇండస్ట్రీ దృష్టి ఈ ప్రాంతాల్లోని ప్రకృతి దృశ్యాలపై తప్పనిసరిగా పడుతుందన్నారు. కూర్మనాథునికి పూజలు శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని సినీనటుడు అశోక్ సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా మూలవిరాట్‌ను దర్శించుకున్న అనంతరం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కిషోర్‌శర్మ ఆలయ చరిత్రతో పాటు రెండు ధ్వజస్తంభాలు, అష్టదళాపద్మాకారం, వైష్ణోదేవి ఆలయం, ఆకుపసర చిత్రాల విశేషాలు వివరించారు. ఆయనతో పాటు సర్పంచ్ బరాటం రామశేషు ఉన్నారు. -
నిజరూపంలో అరసవెల్లి ఆదిత్యుడు
శ్రీకాకుళం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లిలో సూర్యభగవానుడి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్థరాత్రి ఆదిత్యుని నిజరూప మూర్తికి శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ క్షీరాభిషేకం, ప్రథమ అర్చనలు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు పుష్పాలంకరణ సేవ జరగనుంది. రాత్రి 11 గంటలకు పవళింపు సేవ, మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్షీరాభిషేక దర్శనం టిక్కెట్ల ధరను రూ.500కు పెంచడంతో భక్తులు నిరాశకు లోనయ్యారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉత్తరంలో ఉన్న గోడను పోలీసులు కూల్చివేశారు. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులను ఆ మార్గంగుండా అనుమతిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, టీడీపీ నాయకుడు కరణం బలరాం తదితరులు ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. -
అరసవల్లిలో అర్ధరాత్రి నుంచే సూర్యజయంతి ఉత్సవం
అరసవల్లి: రథసప్తమి (సూర్యజయంతి) ఉత్సవం గురువారం అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానుంది. వెలుగుల రేడు అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా గురువారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి స్వామి వారికి క్షీరాభిషేక సేవ ప్రారంభమవుతుంది. ఇందుకోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో కంటే ఈసారి సాంకేతికతను అధికంగా వినియోగిస్తూ పూర్తిస్థాయి ఆధునీకరణతో బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు చేశారు. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సూర్యదేవాలయ గర్భాలయంలోకి వెళ్లి తొలి దర్శనం, తొలి పూజలతో పాటు క్షీరాభిషేకం చేయనున్నారు. అంతకుముందు ఆదిత్యునికి 12.15 గంటలకే మేల్కొలుపు సేవ, సుప్రభాత సేవను నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రధాన అర్చకుడు శంకరశర్మ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంచామృతాలతో అభిషేకాలకు రంగం సిద్ధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ అభిషేకసేవ శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వామి నిజరూప దర్శనం కల్పిస్తారు. డీసీఎంఎస్ కార్యాలయం నుంచి దర్శనానికి క్యూలైన్లు సిద్ధం చేశారు. 216, 100, 500 రూపాయల దర్శన టిక్కెట్లు క్యూలైన్లో ఇవ్వనున్నారు. స్వామి వారి దర్శనానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనాల్లో ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్రీ దర్శనం (సాధారణ దర్శనం) క్యూలైన్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మధ్యలో విశ్రాంతి కోసం కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు సౌకర్యంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు, ఉచిత ప్రసాదాల పంపిణీ, బస్సు సౌకర్యం, మంచినీరు, మజ్జిగ పంపిణీలను చేపట్టనున్నారు. భక్తులు చక్కగా దర్శనాలు చేసుకుని క్షేమంగా స్వప్రాంతాలకు తిరిగి వెళ్లాలని ఆలయ ఇవో శ్యామలాదేవి ఆకాంక్షించారు. -
ఆదిత్యుని దర్శించుకున్న ఐజీ
శ్రీకాకుళం సిటీ : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని శుక్రవారం కోస్తా రీజనల్ ఐజీ కుమార్ విశ్వజిత్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను వివరించి ప్రసాదం, స్వామి చిత్రపటం అందించారు. అనంతరం ఐజీ వార్షిక తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయాన్ని, ఎచ్చెర్ల పోలీస్‌క్వార్టర్స్‌ను, పైడి భీమవరంలో ఔట్‌పోస్టు పోలీస్స్టేషన్లను పరిశీలించారు. శ్రీకాకుళం సబ్ డివిజన్లో నమోదవుతున్న కేసులపై ఆరా తీశారు. ఆదిత్యుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో పాలీస్ శాఖను పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవుల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లాలో మాఓల ప్రభావం లేదని అన్నారు. అయినా ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో జాయింట్ ఆపరేషన్లు చేపడుతున్నామన్నారు. కొద్ది రోజుల క్రితం స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించగా, అందులో ముగ్గురు మావోలను అదుపులోనికి తీసుకున్నామని, వారిలో ఇద్దరికి గాయాలవ్వగా ఆస్పత్రిలో చికిత్సను అందించామని వివరించారు. అనంతరం శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయంలో ఐజీ మొక్కలను నాటారు. ఆయన వెంట ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డీఎస్పీలు కె. భార్గవరావునాయుడు, పి.శ్రీనివాసరావు, టి మోహనరావు, సీఐలు నవీన్‌కుమార్, ఆర్ అప్పలనాయుడు, ఎస్ఐలు చిన్నంనాయుడు, రామకృష్ణలు పాల్గొన్నారు. -
మూడో రోజూ భక్తులకు నిరాశ
శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామి భక్తుల కోరిక మూడో రోజు కూడా నెరవేరలేదు. ఆకాశం మేఘా వృతమై ఉండటంతో సూర్యభగవానుని కిరణాలు ఆలయంలోని మూలవిరాట్టుపై ప్రసరించలేదు. దీంతో ఆ మహద్ఘట్టాన్ని తిలకించే అవకాశం లేక భక్తులు నిరాశ చెందారు. -
రెండో రోజు ఆదిత్యుని తాకని కిరణాలు...
-
రెండో రోజు ఆదిత్యుని తాకని కిరణాలు...
శ్రీకాకుళం : ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీసూర్యనారాయణస్వామిని లేలేత కిరణాలు తాకే దృశ్యాలను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఆదివారం కూడా నిరాశే ఎదురైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో మూలవిరాట్ స్వామివారిని కిరణాలు తాకలేదు. దీంతో భక్తులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. శనివారం కూడా మూలవిరాట్ స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయని భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కానీ ఆకాశం మేఘావృతం కావడంతో సూర్యకిరణాలు తాకలేదు. దాంతో భక్తులు వెనుదిరిగారు. -
స్వామి పాదాలను తాకని సూర్య కిరణాలు
-
ఆదిత్యుని హుండీ ఆదాయం రూ.24.73 లక్షలు
శ్రీకాకుళం : ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. అనివెట్టి మండపంలో జరిగిన ఈ లెక్కింపులో రూ.24,73,292ల ఆదాయం దేవస్థానానికి సమకూరింది. నోట్ల రూపంలో రూ.23,61,904, చిల్లర రూపంలో రూ.01,11,388, వెండి 1.100 కిలోలు, బంగారం 40 గ్రాములు, 9 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్యామలాదేవి, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, రామతీర్థాల ఈఓ పి.బాబూరావు, ఈవోలు వీఆర్ఆర్బి ప్రసాద్‌పట్నాయిక్, కేవీ రమణమూర్తి, ఎన్వీ రమణమూర్తి, టి.వాసుదేవరావు, వి.గురునాదరావులతో పాటు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏడాది జూలై 5 తేదీన జరిగిన హుండీ లెక్కింపు ద్వారా దేవాలయానికి సుమారు రూ.28 లక్షల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. -
అరసవిల్లికి పోటెత్తిన భక్త జనం
శ్రీకాకుళం: ప్రసిద్ద పుణ్యక్షేత్రం అరసవల్లిలో వైశాఖమాసం సందర్భంగా భక్తులు రద్దీ కొనసాగుతోంది. ఉచిత, రూ. 25 క్యూలైన్లు అన్నీ కిటకిటలాడాయి. కేశఖండనశాల, ఇంద్రపుష్కరిణి వద్ద భక్తు లు బారులు తీరారు. అక్కడే మొక్కుబ డులు చెల్లించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులు అధికంగా రావడంతో గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడంతో కొందరు భక్తులు బారికేడ్లు దాటుకొని వెళ్లడం కనిపించింది. పుష్కరిణి వద్ద సెక్యూరిటీ పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు భక్తులు ఇనుప గ్రిల్స్ దాటి పుష్కరిణి మధ్యలోకి వెళ్లారు. ఇదే అదనుగా కేశఖండనశాలలో కొందరు భక్తులు క్షురకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక దశలో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో ఎదురుచూసిన భక్తులను అదుపు చేయడం ఆలయ సిబ్బంది, అక్కడ విధులు నిర్వహిస్తు న్న పోలీసులకు కష్టతరంగా మారింది. -
ఆదిత్యుని కళ్యాణోత్సవాలు
శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్యక్షేత్రంలో బుధవారం సాయంత్రం కల్యాణాంగ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీసూర్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాలు శాస్త్రోక్తంగా ఆలయప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్ కాశ్యల నేతత్వంలో ప్రారంభమయ్యాయి. 16న సుగంధద్రవ్య మర్థన (కొట్నం దంపు), ఈనెల 17వ తేదీన ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 22వ తేదీ వరకు జరగనున్న కల్యాణవేడుకల్లో భక్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అర్చకులు పేర్కొన్నారు. -
అరసవల్లిలో అద్భుతం
శ్రీకాకుళం : అరసవల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను గురువారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా విచ్చేశారు. ఉత్తరాయన పుణ్యకాలంలో స్వామివారిని సూర్యకిరణాల స్పర్శ తాకింది. ఉదయం 6.24 గంటలకు మొదలై 6.30 గంటల వరకు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్‌పై పడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు. -
విద్యార్థులతో ముచ్చటించిన గవర్నర్ నరసింహన్
రాజాం: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆదివారం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో పర్యటిస్తున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాల, జీఎంఆర్ కేర్ ఆస్పత్రిను సందర్శించారు. జీఎంఆర్ ఐటీ కళాశాలలో విద్యార్థులతో నరసింహన్ కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన వెంట జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో పాటు అధికారులు ఉన్నారు. -
అరసవెల్లి తొలి కిరణం తాకే క్షేత్రం
ప్రత్యక్ష దైవం, గ్రహరాజు అయిన శ్రీ సూర్యనారాయణుడు కొలువైన అరుదైన క్షేత్రం అరసవల్లి. దర్శన మాత్రానే భక్తులకు హర్షాతిరేకాలు కలిగించే ఈ దివ్యక్షేత్రం హర్షవల్లిగా ఖ్యాతి పొందింది. కాలక్రమేణా ఇది అరసవల్లిగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంపట్టణంలో అంతర్భాగంగా ఉంది. ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా శ్రీ సూర్యనారాయణమూర్తిని ఇక్కడ సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కళింగ ప్రాంతాన్ని ఏలిన గంగ వంశపు రాజు దేవేంద్ర వర్మ అరసవల్లిలో సూర్యనారాయణుడి ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తుశకం 676 నుంచి 688 వరకు రాజ్యం చేసిన దేవేంద్ర వర్మ తన రాజ్యాన్ని చిలికా సరస్సు నుంచి గోదావరి తీర ప్రాంతం వరకు విస్తరించాడు. క్రీస్తుశకం 747లో ఆయన మనవడు అధికారానికి వచ్చాడు. ఆయన పేరు కూడా దేవేంద్ర వర్మే. తాత బాటలోనే పలు ఆలయ నిర్మాణాలు చేశాడు. ఆలయాల పరిరక్షణ కోసం శాసనాలు రాయించాడు. ఆయన రాయించిన మూడు శిలా శాసనాలు నేటికీ అరసవల్లి ఆలయ ప్రాంగణంలో పదిలంగా ఉన్నాయి. ఆలయ ప్రత్యేకత అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయానికి ఐదు ద్వారాలు ఉన్నాయి. ఆలయం వద్ద పురాతనమైన పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిని దేవేంద్రుడే తన వజ్రాయుధంతో తవ్వినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇందులోనే శ్రీ సూర్యనారాయణస్వామి మూలవిరాట్టు విగ్రహం లభించిందని, దానినే దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని స్కంద పురాణం చెబుతోంది. ఇక్కడి పుష్కరిణీ జలాలలో ఔషధగుణాలు గల అరుదైన ఖనిజ లవణాలు ఉన్నాయని, ఈ పుష్కరిణి జలాల్లో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ పుష్కరిణి జలాలకు పలు రోగాలను హరించే శక్తి కూడా ఉందని చెబుతారు. ఏటా రథసప్తమి రోజున ఇక్కడ జరిగే వేడుకలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారు. పాదాలను తాకే కిరణాలు అరసవల్లి ఆలయానికి అరుదైన ప్రత్యేకత ఉంది. ఏటా రెండు ఆయనాలలో మూడేసి రోజులు ఆలయానికి గల ఐదు ద్వారాల నుంచి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. ఉత్తరాయనంలో మార్చి 9, 10, 11 తేదీలలోను; దక్షిణాయనంలో అక్టోబర్ 1, 2, 3 తేదీలలో ప్రాతఃకాలంలో సంభవించే ఈ అరుదైన నయనానందకర విశేషాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. శిల్ప వైవిధ్యానికి నెలవు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కళింగ శిల్ప వైవిధ్యానికి నెలవుగా సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఆలయ ప్రాకారానికి ముందే ప్రాచీన శిల్పకళా సౌందర్యంతో అలరారే ఎత్తై గోపురం కనిపిస్తుంది. సువిశాలమైన ఆవరణలో గరుడ స్తంభాన్ని దాటిన వెంటనే ముఖమండపం వస్తుంది. ప్రధాన ఆలయాన్ని కళింగ శిల్పశైలిలో నూతనంగా నిర్మించారు. మూలవిరాట్టు వద్ద సౌరయంత్రం ప్రతిష్ఠితమై ఉంది. దీనినే సౌరమండలం అంటారు. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో ఈ యంత్రాన్ని రచించి, మూలవిరాట్టు వద్ద ప్రతిష్ఠించినట్లు చెబుతారు. అనివెట్టి మండపం, రెండు ముఖద్వారాలు తదితర నిర్మాణాలను దాతల సహకారంతో చేపట్టారు. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణుడు శివ స్వరూపుడిగా జ్ఞానాన్ని, కేశవ స్వరూపుడిగా మోక్షాన్ని, తేజో స్వరూపుడిగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు అనే పన్నెండూ సృష్టికి కారణమవుతున్నాయని, ద్వాదశ మాసాత్ముడైన సూర్యుడు వీటి ద్వారా లోకపాలన చేస్తున్నాడని పెద్దలు చెబుతారు. సూర్య భగవానుడు త్రిదోషాలను, సమస్త రోగాలను హరిస్తాడని పలు స్తోత్రాలు చెబుతున్నాయి. అరసవల్లిలోని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, అభిషేక జలమైన సోమసూత్ర జలాన్ని తలపై చల్లుకుంటే సర్వరోగాలు నశిస్తాయని సూర్యమండలాష్టకం చెబుతోంది. సూర్య భగవానుడినే ప్రధాన దైవంగా ఆరాధించే సౌరోపాసకులు ఎర్రని దుస్తులు ధరించి, ఎర్రమందారాలతో సూర్యుని పూజిస్తారు. మూలవిరాట్టుకు బంగారు పాదుకలు, నేత్రాలు, వజ్రకవచం ధరింపజేసి, ఆరాధిస్తారు. సూర్యనమస్కార సేవ ఈ ఆలయంలో సూర్యనమస్కార సేవ భక్తులకు అందుబాటులో ఉంది. దీనికి దేవాదాయ శాఖ రూ.50 టికెట్టు ధరగా నిర్ణయించింది. టికెట్టు తీసుకున్న భక్తుల కోసం ఆలయ అర్చకులు అనివెట్టి మండపంలో సూర్యనమస్కారాలు నిర్వహిస్తారు. సూర్యనమస్కారాల వల్ల ఆరోగ్యం చక్కబడుతుందనే విశ్వాసంతో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఈ సేవ కోసం ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. - దువ్వూరి గోపాలరావు, శ్రీకాకుళం కల్చరల్ ఫొటోలు: కళ్లేపల్లి జయశంకర్ మూలవిరాట్టుకు అన్నీ విశేషాలే! ఇక్కడి మూలవిరాట్టు విగ్రహం అరుదైన అరుణ సాలగ్రామ శిలతో రూపొందింది. ఐదున్నర అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ విగ్రహం అష్టధాతు సమ్మేళనం. విశ్వకర్మ చేతిలో రూపొందిన స్వామివారి మూలవిరాట్టు వద్ద సౌర, త్రిచ, అరుణ యంత్రాలను ప్రతిష్ఠించడం వల్ల ఆధ్యాత్మికంగా మరింత శక్తి సంతరించుకుంది. సింహలగ్న జాతకుడు కావడం వల్ల తలపై సింహతలాటం, పద్మాలతో కూడిన రెండు అభయహస్తాలు, ఇరువైపులా పింగళుడు, మరలుడు, నడుమ చురిక, రథసారథి అనూరుడితో సప్తాశ్వ రథారూఢుడిగా ఉషా, ఛాయా, పద్మినీ సమేతుడిగా భక్తులకు దర్శనమిచ్చే సూర్యభగవానుడి నిజరూపాన్ని రథసప్తమి రోజున భక్తులు కనులారా చూసి తరలించాల్సిందే. - ఇప్పిలి శంకరశర్మ, ప్రధాన అర్చకుడు ఇలా చేరుకోవచ్చు అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చే భక్తులకు నేరుగా శ్రీకాకుళం రోడ్ వరకు రైల్వే సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి బస్సు లేదా ఆటో లేదా ట్యాక్సీలలో అరసవల్లి చేరుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడల నుంచి శ్రీకాకుళం వరకు నేరుగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బస్సుల ద్వారా వచ్చే భక్తులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవల్లికి సిటీబస్సులు లేదా ఆటో ద్వారా చేరుకోవచ్చు. విమానాల్లో వచ్చే భక్తులు విశాఖ విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి అక్కడి నుంచి అరసవల్లికి చేరుకోవాల్సి ఉంటుంది. -
పోలీస్ అయినా... పబ్లిక్ అయినా...
శ్రీకాకుళం సిటీ : పబ్లిక్ అయినా.. పోలీస్ అయినా ఒక్కటే..అని నిరూపించారు శ్రీకాకుళం ట్రాఫిక్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డీఎస్పీ తూచ తప్పకుండ అమలు చేశారు. పట్టణ పరిధిలో రామలక్ష్మణ జంక్షన్, బలగ, అరసవల్లి మిల్లు జంక్షన్, డేఅండ్‌నైట్ జంక్షన్దరి దత్తాత్రేయ ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శనివారం రాత్రి 8.30 నిమిషాలకు మొత్తం 425 కేసులు నమోదు చేసి, రూ. 49,200 అపరాధ రుసుం వసూలు చేసినట్లు డీఎస్పీ సాక్షికి తెలిపారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ముగ్గురు పోలీసులమీద కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. -
నేడు సూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారిని ఊరేగించనున్నారు. మంగళవారం రాత్రి 9 గంటలకు సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవం జరగనుంది. -
అరసవల్లికి మహర్దశ
శ్రీకాకుళం కల్చరల్:ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ పరిసరాలను విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం పది కోట్ల రూపాయలతో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. పనుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా విశాఖకు చెందిన దేవాదాయశాఖ ఏఈ సైదా, ప్రైవేటు కన్సల్టెంట్ భాస్కర్, ఆలయ ఈవో పుష్పనాథం, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు ఆలయ పరిసరాలను, కట్టడాలను ఆదివారం క్షుణ్ణంగా పరిశీంచారు. ఆలయ ముందుభాగంలో రోడ్డును 60 అడుగుల మేర విస్తరించాల్సి ఉందని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అలాగే స్వామి వారి ఇంద్రపుష్కరిణి ఆలయం నుంచి కనపడే విధంగా దారిని వెడల్పు చేయాల్సి ఉందని భావించారు. క్యూలైన్ల ఏర్పాటు కోసం ఇంద్రపుష్కరిణి పరిసరాలను, ఆలయానికి చెందిన తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పుష్పనాథం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా చేసిన సూచనలు, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆలయ పరిసరాలను అభివృద్ధి పరచాల్సి ఉందన్నారు. ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. ఇందులో భాగంగా దేవాదాయశాఖ ఏఈ, కన్సల్టెంట్‌ను ఆలయ పరిసరాల పరిశీలన కోసం ఉన్నతాధికారులు పంపించారన్నారు. ఇంద్రపుష్కరిణి నుంచి మూడు అంచెలుగా క్యూలైన్ల నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు. అలాగే ఉచిత, శాశ్వత క్యూలైన్లు, భక్తులు వేచి ఉండేందుకు 120 గదులు నిర్మించాల్సి ఉందని చెప్పారు. ఇంద్రపుష్కరిణి ఎడమ వైపు మార్గంలో కేశఖండశాలకు దగ్గరగా కూడా భక్తులు పుష్కరిణిలో దిగి స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కుడివైపు క్యూలైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. మధ్యలో ఉన్న రోడ్డు పైనుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. దీనికోసం ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ఉంటే వాటిని కొనుగోలు చేస్తామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చెప్పుల స్టాండ్లు, టాయిలెట్లు నిర్మిస్తామని, వాహనాల పార్కింగ్‌ను గ్యాస్ గొడౌన్ వద్ద, శ్రీకాకుళం రోడ్డు వైపు ఉన్న స్వామి వారి తోటలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వివిధ నిర్మాణాలు, ప్రైవేటు ఆస్తుల కొనుగోలు కోసం సుమారు పది కోట్ల రూపాయలు అవసరం అవుతోందన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల ఆలయ పరిసరాల్లో నిర్మించిన వైజయంతి మండపాన్ని తొలగించేందుకు వెనుకాడమన్నారు. అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్ రూపొందించి దేవాదాయశాఖ కమిషనర్‌కు పంపిస్తామని, అక్కడ నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కన్సల్టెంట్ భాస్కర్, ఏఈ సైదాలు మాట్లాడుతూ ఉన్న స్థలం లభ్యత మేరకు ఏవిధంగా నిర్మాణాలు చేయాలో చూసి అవసరమైన చోట ప్రైవేటు స్థలం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తామన్నారు. -
మెరిసిన మూలవిరాట్
వరుసగా రెండోరోజూ సూర్య కిరణాలు ఆదిత్యుని మూలవిరాట్‌ను స్పృశించి భక్తులను పరవశింపజేశాయి. తొలిరోజు సోమవారం మంచుతెరలు అడ్డుకున్నా... మంగళ, బుధవారాల్లో కిరణ స్పర్శను పెద్ద సంఖ్యలో భక్తులు కనులారా వీక్షించారు. శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలోని మూలవిరాట్‌ను రెండో రోజూ కూడా సూర్యకిరణాలు తాకడంతో భక్తులు భక్తి పరవశ్యాన్ని పొందారు. బుధవారం ఉదయం 6.20 గంటల సమయంలో ప్రారంభమైన కిరణాల ప్రసారం ఐదు నిమిషాల పాటు జరిగింది. తొలిరోజైన సోమవారం మేఘాల కారణంగా కిరణస్పర్శ జరగలేదు. బుధవారం ధ్వజస్తంభం కుడి పక్కనుంచి వచ్చిన కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకడంతో బంగారు ఛాయలో మెరిసిపోయారు. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. డీఆర్వో హేమసుందరరావు, ఏసీబీ డీఎస్పీ రంగరాజు, విజయనగరం ఏపీఏస్పీ ఐదో బెటాలియన్ లెఫ్ట్‌నెంట్ కమాండర్ సుధాకర్, సింహాచలం దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు కృష్ణమాచార్యులు కిరణ స్పర్శను చూసేందుకు ఆసక్తి చూపారు. భక్తులు అధికంగా తరలిరావడం..స్వల్ప తోపులాట చోటుచేసుకోవడంతో బారికేడ్లు పడిపోయాయి. -
రథ సప్తమికి భారీ బందోబస్తు
అరసవల్లి: ఈనెల 26న రథసప్తమి సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు డీఐజీ ఎ.రవి చంద్రన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు వేలాదిగా తరలిరానుండటంతో తగిన ఏర్పట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని డీఐజీ తెలిపారు. -
ఆదిత్యుని సన్నిధిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజా శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ అంతరాలయూనికి ఆమెను తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేసి స్వామి విశిష్టతను వివరించారు. అనెవెట్టి మండపంలో ఆశీర్వదించారు. ఈమె వెంట వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, పాలకొండ శాసనసభ్యురాలు విశ్వాసరారుు కళావతి, నాయకులు మండవిల్లి రవి, శిమ్మ వెంకటరావు, విజయలక్ష్మి ఉన్నారు. -
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
-
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: కార్తీకమాసం సందర్భం ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్తీకమాసం పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. -
అరసవిల్లి ఆదిత్యుని సేవలు ఆన్లైన్ చేయిస్తాం
అరసవల్లి : దేశంలోనే ఏకైక నిత్య పూజలందుకుంటున్న అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన సేవలను ఆన్లైన్ చేయిస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం అరసవల్లి ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 68 దేవాలయాలకు త్వరలో ట్రస్ట్‌బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది కొరత తీరుస్తామన్నారు. హుద్‌హుద్ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆలయాలు ధ్వంసం అయ్యాయని, రూ.5 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఆలయంలో గతంలో జరిగిన కేశాల మాయం విషయంపై దర్యాప్తు ముమ్మరం అయ్యేలా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఆలయంలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఈవోను ఆదేశించారు. ఏటా సౌరయాగం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ముఖలింగేశ్వరుని దర్శించుకున్న మంత్రి సారవకోట రూరల్ (జలుమూరు): మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామిని శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి పక్కనున్న చక్రతీర్థంలో స్నానాలు ఆచరించేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని, కేశఖండన శాల, స్వామి వారి వాహనాలు భద్ర పర్చేందుకు గది నిర్మించాలని సిబ్బంది కోరగా సంబందిత శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఆదేశించారు. శ్రీకూర్మనాథాలయంలో అన్నదాన సత్రం నిర్మిస్తాం శ్రీకూర్మం (గార) : స్థానిక శ్రీకూర్మనాథాలయంలో భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకుగానూ అన్నదాన సత్రం నిర్మిస్తామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన శ్రీకూర్మనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. సర్పంచ్ రామశేషు టీటీడీ సత్రం పరిస్థితిని మంత్రికి వివరించారు. ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి, ఈవో శ్యామలాదేవి పాల్గొన్నారు. -
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
శ్రీశైలం: కార్తీకమాసం అందునా ఆదివారం సెలవు దినం కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 5 గంటలు సమయం పడుతుంది. పుణ్య స్నానాలు చేయటానికి పాతాళగంగ వద్ద భక్తులు వేచి ఉండే పరిస్థితి ఏర్పాడింది. అలాగే శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్యూ లైన్లు ఆలయం వెలుపుల కూడా బారులు తీరారు. -
పులిహోర ప్రసాదం మరింత ప్రియం
అరసవల్లి : ఆదిత్యుని పులిహోర ప్రసాదం మరింత ప్రియం కానుంది. పేరుకు ధర పెంచకపోయినా పరిమాణం తగ్గించడం ద్వారా అధికారులు పరోక్షంగా భక్తులపై భారం మోపారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయంలో విక్రయిస్తున్న ప్రసాదాల్లో పులిహోర ముఖ్యమైనది. భక్తులు ఎక్కువగా దీన్నే కొనుగోలు చేసి ప్రీతిపాత్రంగా స్వీకరిస్తుంటారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పులిహోర ప్యాకెట్ పరిమాణం కాస్త తగ్గించినట్లు ఆ శాఖ సహాయ కమిషనర్, ఆలయ ఇన్చార్జి ఈవో ఆర్.పుష్పనాథం ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు 200 గ్రాముల ప్యాకెట్‌ను రూ.5కు విక్రయిస్తున్నారు. ఇక నుంచి అదే ధరకు 150 గ్రాముల పులిహోర మాత్రమే ఇస్తారు. సోమవారం నుంచే ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఆయన చెప్పారు. ప్రసాదాల తయారీ, విక్రయాల్లో నష్టం వస్తుండటంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని పుష్పనాథం పేర్కొన్నారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
అరసవల్లి: వరద బాధితులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. నాగావళి వరద కారణంగా ముంపునకు గురైన శ్రీకాకుళంలోని తురాయిచెట్టు వీధిలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరూ అధైర్య పడవద్దని..అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కె.అమ్మన్న అనే మహిళ మాట్లాడుతూ వరద వచ్చినప్పుడే పాలకులు, అధికారులు వచ్చి తమను ఖాళీ చేయిస్తారని..ఆ తరువాత పట్టించుకోవడం లేదని జగన్‌కు ఫిర్యాదు చేసింది. దీనికి ఆయన స్పందిస్తూ దిగులు పడవద్దని, అందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఓదార్చారు. డి.దిలక్ష్మి అనే మహిళ మాట్లడుతూ బియ్యం గింజలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందన్నారు. దీనికి జగన్ స్పందిస్తూ ఈ ప్రభుత్వం మాటలతోనే మాయచేస్తోందన్నారు. అంతాకలిసి ప్రభుత్వాన్ని నిలదీసి మరింత వరద సాయూని తెప్పుంచుకుందమన్నారు. కాగా ఉదయం నుంచే జగన్ రాక కోసం జనం ఎదురు చూశారు. కాలనీలోని ప్రతీ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మూడు గంటల సమయంలో పక్కనే వరద ముంపునకు గురైన మరో రెండు ప్రాంతాలైన మహిళామండలి వీధి, వైష్ణపువీధుల్లో పర్యటించి ప్రతీ ఇంటి వారిని ఆప్యాయంగా పలకరించారు. -
దేవుడికీ రాజకీయ సెగ
ప్రభుత్వం వరమిచ్చింది. అర్చకులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ పరపతిని పెట్టుబడిగా పెట్టి అసలుకే ఎసరు పెడుతున్నారు. దైవారాధనే నిత్యకృత్యమైన అర్చకులకు జీవన భృతి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారికిస్తున్న దేవాలయ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమవుతున్నాయి. లక్షలకు లక్షలు ఆర్జించి పెడుతున్నాయి. అరసవల్లి ఆదిత్యునికి చెందిన భూములూ దీనికి మినహాయింపు కాదు. అధికారులు సైతం చూసీచూడనట్లు పోతుండటం.. రాజకీయ ఒత్తిళ్లు తోడుకావడంతో దేవస్థానానికి చెందిన విలువైన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. అరసవల్లి:దేవుడి భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని అరసవల్లి రోడ్డులో సర్వే నెంబర్ 503/2లో ఉన్న 16 సెంట్ల అరసవల్లి దేవస్థానం భూమిని బయటి వ్యక్తులు ఆక్రమించి వ్యాపారం చేసుకుంటున్నారు. మెయిన్ రోడ్డును ఆనుకొనే ఈ భూమి ఉంది. ఆలయ ఈవో, సిబ్బంది, దేవాదాయశాఖ అధికారులు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నా.తమకు సంబంధం లేనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు వెంటనే సిబ్బందిపై విరుచుకుపడి మెమోలు, సస్పెన్షన్లు వంటి చర్యలు చేపడుతున్న అధికారులు దేవుడి భూమిలో ప్రైవేట్ వ్యాపారం విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారు. వాస్తవానికి ఈ భూమిని జీవన భృతి కోసం దేవస్థానం అర్చకులకు ఇచ్చారు. వారు దీన్ని అన్యాక్రాంతం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ.80 లక్షల విలువైన ఈ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేసిన విషయం దేవస్థానం ఇన్చార్జి ఈవో ఆర్.పుష్పనాథానికి గతంలో తెలిసింది. అయితే ఆయన పెద్దగా పట్టించుకోకుండా ప్రధాన అర్చకుడికి మెమో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మిగిలిన సిబ్బంది దీన్ని తప్పు పడుతున్నారు. అదే ఇతరులెవరైనా దేవుడి మాన్యాన్ని ఆక్రమించి సొంత వ్యాపారాలు పెట్టుకుంటే కఠిన చర్యలకు దిగుతారని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. చట్టం చట్టుబండలే..అర్చకులకు ఇచ్చే మాన్యాల్లో పండించే ఫలసాయాన్ని అనుభవించడమే తప్ప భూములను ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లోనూ లీజుకు ఇవ్వరాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. లీజుకు ఇచ్చినా, భూములను ఎవరైనా ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా కల్పించాయి. అయితే ఈ 16 సెంట్ల భూమి విషయంలో రాజకీయ ఒత్తిళ్లు బాగా పనిచేస్తున్నట్లు తెలిసింది. అందువల్లే ఈవో సహా ఇతర అధికారులు దాని జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కేశవరెడ్డి స్కూల్ ఎదురుగా ఉన్న స్థలంలో మావాడే ఉంటున్నాడు.. చూసి చూడనట్లు వదిలేయండి’ అంటూ దేవస్థానం ఇన్చార్జి ఈవోకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులే ఇలా ఆక్రమణదారులను వెనకేసుకొస్తూ.. ఆక్రమణలను ప్రోత్సహిస్తుంటే ఇక దేవుడి మాన్యాలకు దిక్కెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. చేతులు మారిన లక్షలు మొయిన్ రోడ్డును ఆనుకొని ఉన్న ఈ స్థలంలో అక్రమ లీజు విషయంలో లక్షలాది రుపాయలు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ అధికారులకు కూడా ముడుపులు అందడం వల్లే వారు నోరు మెదపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొట్ట కూటికి రోడ్డు పక్కన చిన్న బడ్డీ పెట్టుకుంటేనే నానా యాగీ చేసే అధికారులు రూ.లక్షల విలువైన దేవస్థానం భూమిలో పాగా వేసి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నా తమకు సంబంధం లేనట్లు మిన్నకుండటం విడ్డూరమే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం శ్రీసూర్యనారాయణస్వామి దేవస్థానానికి చెందిన సర్వే నెంబరు 503/2లోని 16 సెంట్ల భూమిలో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై ఈ ఏడాది జూన్ 19న ఆర్సీ నెంబర్42/4 మెమో జారీ చేశాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటాం. - ఆర్.పుష్ఫనాథం, ఇన్చార్జి ఈవో -
అటవీ స్టేషన్లు అటకెక్కినట్లే!
అరసవల్లి: అటవీ సంపద రక్షణ, అటవీ గ్రామాల ప్రజల భద్రతకు వీలుగా జిల్లాల్లో అటవీ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేస్తాం.. సిబ్బందికి ఆయుధాలు ఇస్తాం.. నాలుగు నెలల క్రితం ప్రభుత్వం ఆర్భాటంగా చేసిన ప్రకటన ఇది.ఇప్పుడదే ప్రభుత్వం స్వరం మార్చింది. స్టేషన్లు లేవు.. సిబ్బందీ లేరు. అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోండి అనే సలహాతో సరిపెట్టేసింది.చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల దాడులు, కాల్పుల నేపథ్యంలో అటవీ ప్రాంతాలు ఉన్న అన్ని జిల్లాల్లో అటవీ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హడావుడి చేసిన తీరు చూసి విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలోనూ అటవీ స్టేషన్లు ఏర్పాటవుతాయని, తమ పని కొంత సులువు అవుతుందని అటవీ, పోలీస్ శాఖల అధికారులు భావించారు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలోని సీతంపేట, కొత్తూరు, భామిని, పాలకొండ, వీరఘట్టం, పాతపట్నం, మందస తదితర మండలాలకు ఆనుకుని అడవులు ఉన్నాయి. ఈ మండలాల్లో పోలీస్ స్టేషన్ల మాదిరిగానే అటవీ స్టేషన్లు ఏర్పాటవుతాయని ఆశించారు. అయితే ఇంతవరకు రాష్ట్రస్థాయి అధికారులు వీటి వివరాలైనా కోరలేదు. ఆ ప్రతిపాదన అటకెక్కినట్లేనని కొందరు అటవీ అధికారులు కూడా భావిస్తున్నారు. పోలీసు బలగాల సాయం తీసుకోండి ప్రభుత్వ తీరు ఎలా ఉన్నా.. జిల్లా పరిస్థితిని బట్టి అటవీ స్టేషన్లు ఏర్పాటు చేయడం అవసరమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లా అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అదే సమయంలో సీతంపేట ఏజెన్సీలో ఏళ్ల తరబడి ఏనుగులు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. కలప అక్రమ రవాణా వంటివి జోరుగానే సాగుతున్నాయి. వీటిన్నింటినీ నియంత్రించడం తక్కువ సిబ్బంది ఉన్న అటవీ శాఖకు కష్టసాధ్యంగా మారింది. ఇప్పుడున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ఆయుధాలు అందజేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితుల్లో అది కూడా కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు. అంతగా అవసరమైతే పోలీసు బలగాల సాయం తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించడంతో జిల్లా అటవీ అధికారులు ఎస్పీతో సంప్రదించి ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అటవీ సిబ్బంది సమన్వయంతో పని చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జిల్లా అటవీశాఖ అధికారి విజయకుమార్ వద్ద ప్రస్తావించగా అటవీ స్టేషన్లు ఏర్పాటయ్యే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. సిబ్బందికి ఆయుధాలు సమకూర్చడంపైనా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేవని, అవసరమైతే పోలీసు సహాయం తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారని వివరించారు. -
ఆపదలో ఆదుకునే లెసైన్స్
‘సమయం రాత్రి ఒంటి గంట అయ్యింది.. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు. హైవే సిబ్బంది వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.. అయినా ఫలితం లేదు.. అప్పటికే ఆ వ్యక్తికి శరీరంలోని చాలా రక్తం పోయింది.. వెంటనే రక్తం ఎక్కించాలి... పోలీసులు డ్రైవింగ్ లెసైన్స్ తీసి చూశారు. అందులో బ్లడ్ గ్రూప్ నమోదు చేయించిలేదు. ఆ వ్యక్తి రక్తం ఏ గ్రూపో తెలుసుకోవడానికి 30 నిముషాల సమయం పట్టింది. అప్పటికే విలువైన సమయం ఖర్చుయింది.. కేవలం రక్తం అందక ఆ వ్యక్తి మృతిచెందాడు. లెసైన్స్‌లో బ్లడ్ గ్రూపు నమోదు చేయించకపోతే జరిగే నష్టానికి ఇదొక ఉదాహరణ మాత్రమే... ప్రతి రోజు మన కళ్లముందు ఇలాంటివి ఎన్నో...’ అరసవల్లి/నరసన్నపేట రూరల్ : ప్రస్తుత రోజుల్లో 18 సంవత్సరాలు దాటిన వారందరూ లెసైన్‌సలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిలో అభ్యర్థి పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, ఏ వాహనం అయితే నడపగలరో ఆ సమాచారం, లెసైన్స్ కాలపరిమి ఉంటుంది. ఇంత వరకు అందరికీ తెలుసు.. అయితే, లెసైన్స్‌లో తెలియని మరో ఆప్షన్ ఉంటుంది. అదే లెసైన్స్ హోల్డ్ర్(అభ్యర్థి) బ్లడ్(రక్తం) గ్రూప్‌ను తెలిపే ఆప్షన్. దీనిని నూటికి 99 శాతం మంది ఉపయోగించుకోవడం లేదని అధికారక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఆప్షన్లో తమ రక్తం గ్రూప్‌ను లెసైన్స్ దారుడు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో వాహనం నడిపే వారు తప్పని సరిగా తమ లెసైన్స్‌ను తీసుకునుని వెళతారు. అనుకోని సంఘటలను ఎదురైనప్పుడు, లేదా ప్రమాదాలు జరిగినప్పుడు.. అసుపత్రిలో వైద్యులకు గాయపడిన వ్యక్తి రక్తం గ్రూపు కోసం సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుంది. ప్రమాదానికి గురైన వ్యక్తి ప్రాణాలు కాపాడే విలువైన సమయం వారికి ఇచ్చేందుకు లెసై న్స్ ఉపయోగపడుతుంది. లారీ, బస్సు, ట్యాక్సీ, ఆటో ఇలా పలు రకాల వాణిజ్య, ప్రయాణికులను తీసుకుపోవు డ్రైవర్లకు ఇది అత్యవసర సమయాల్లో ఉపయోగ పడుతుంది. సమూల మార్పులు పాన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్ కార్డు.. ఇవి ఎంత ముఖ్యమైనవో డ్రైవిం గ్ లెసైన్స్కార్డు కూడా అంతే ముఖ్యమైనది. వాహనం నడిపినప్పుడే కాకుండా స్థానికతను కూడా తెలియజేస్తుంది. అందుకే లెసైన్‌స మంజూరును రవాణా శాఖ కఠినతరం చేసింది. అన్ని వివరాలు సక్రమంగా ఉంటే అభ్యర్థి ఎల్ఎల్ఆర్ పరీక్షకు అర్హుడుగా అనుమతిస్తున్నారు. లేని సమయంలో ముందుగానే అనర్హుడిగా వేటు వేసేస్తున్నారు. విద్యార్హత, స్థానికత, ఆధార్‌కార్డు ఉంటేనే లెసైన్స్ జారీ చేస్తున్నారు. రెండు దశల్లో అభ్యర్థి వివరాల సేకరణ మొదటి దశ ఎల్ఎల్ఆర్ ఇచ్చే సమయంలో అభ్యర్థి పూర్తి అడ్రస్, అభ్యర్థి పుట్టు మచ్చలు, సెల్‌ఫోన్ నంబర్ నమోదు చేస్తున్నారు. రెండోసారి డ్రైవింగ్ టెస్టుకు వచ్చే సమయంలో బ్లడ్ గ్రూప్, విద్యార్హత, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలా రెండు సార్లు వివరాలు సేకరించడం వల్ల తప్పులు ఉన్నా.. వివరాలు సరిగ్గా నమోదు కాకపోయినా.. అభ్యర్థులు సరిచూసుకునే వీలుంటుంది. అధికారులు కూడా అభ్యర్థి పత్రాలు కూడా ధ్రువీకరిస్తారు. డ్రైవింగ్ లెసైన్‌స పొందడం ఇలా.. పాత రోజులు పోయాయి. ఇష్టాను సారంగా వాహనాలు నడుపుతామంటే కుదరదు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాల్సిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకొనే కంటే ముందుగానే మేల్కొని ప్రతి వాహనదారు లెసైన్సు పొందడం ఎంతో అవసరం. లెసైన్సు లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరం. డ్రైవింగ్ లెసైన్‌స ఎలా పొందాలో మీ కోసం.... ఎల్ఎల్ఆర్ పొందే విధానం... మీ సేవ, రవాణా శాఖ కార్యాలయాల్లో వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు-2తో పాటు ద్విచక్ర వాహనం నడిపేందుకు రూ.60లు, నాలుగు చక్రాల వాహనం నడిపేందుకు రూ.90లు చెల్లించి స్లాట్ బుక్ చేయాలి. వయసు ధ్రువీకరణకు పదోతరగతి మార్కుల జాబితా, పాఠశాల బదిలీ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, జీవిత బీమాసంస్థ బాండ్, సివిల్ డాక్టర్ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం... ఇందులో ఏ ఒక్కటి ఇచ్చినా సరిపోతుంది. అ నివాస ధ్రువీకరణకు రేషన్ కార్డు, ఓటరు కార్డు, ఫోను బిల్లు, విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు తదితర వాటిల్లో ఏదో ఒకటి ఉండాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఇచ్చే తేదీన మాత్రమే రవాణా కార్యాలయానికి వెళ్లాలి. రవాణా కార్యాలయంలో ఫారం-1, ఫారం-2 దరఖాస్తులతో పాటు వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలు, మీసేవలో నగదు రసీదు జిరాక్సు పత్రాలు జతచేయాలి. రవాణా శాఖ కార్యాలయంలో ఫొటో తీసి వేలి ముద్రలను డిజిటల్ ద్వారా తీసుకుంటారు. అనంతరం లెర్నర్ లెసైన్సుకు సంబంధించిన ఆన్లైన్ పరీక్షకు కార్యాలయంలోనే హాజరుకావాల్సి ఉంటుంది. ట్రాఫిక్ గుర్తులు, రహదారుల నిబంధనలపై ఆబ్జెక్టివ్ తరహాలో కంప్యూటర్ పరీక్ష ఉంటుంది. ఇందులో 20 ప్రశ్నలకు 12 ప్రశ్నలకు సమాధానాలు కరెక్టుగా చెప్పాలి. కంప్యూటర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత లెర్నర్ లెసైన్సు మంజూరు చేస్తారు. ఒక వేల ఆన్లైన్ పరీక్షలో తప్పిన వారు మళ్లీ మీ సేవలో రూ. 30లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. లెర్నర్ లెసైన్సు 6 నెలలు వరకూ చెల్లుబాటులో ఉంటుంది. శాశ్వత లెసైన్‌స కోసం.. అ లెర్నర్ లెసైన్‌స పొందిన నెల నుంచి ఆరు నెలల లోపు శాశ్వత లెసైన్‌స పొందాల్సి ఉంటుంది. మీ సేవకు గానీ, రవాణా కార్యాలయానికి గానీ వెళ్లి ద్విచక్ర వాహనానికి రూ.475, నాలుగు చక్రాల వాహనానికి రూ.525లు చెల్లించాలి. అ మీ సేవలో ఇచ్చిన స్లాట్ ప్రకారం రవాణా వాఖ కార్యాలయానికి వెళ్లి ఫారం-1, ఫారం -4లు పూర్తి చేసి ఎల్ఎల్ఆర్, మీ సేవ రశీదు జతపర్చి మోటారు వాహనాల అధికారి నిర్వహించే వాహన పరీక్షకు హజరై ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పాసైతే శాశ్వత లెసైన్‌సను పోస్టల్ ద్వారా ఇంటి అడ్రస్‌కు పంపిస్తారు. ఫొటో, ఎడమచేతి వేలి ముద్ర తప్పనిసరి ఇప్పటి వరకు లెసైన్స్ కావాల్సిన అభ్యర్థి మొదటిగా ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజయ్యేవాడు. ఆ సమయంలో రవాణ శాఖ కార్యాలయంలో ఫొటో విభాగంలో ఫొటోతో పాటు ఎడమ చేతి బొటనవేలిముద్ర సేకరించేవారు. తరువాత ఫొటో, వే లిముద్ర అవసరం ఉండేది కాదు. 30 రోజుల తరువాత ఏఎంవీఐ సమక్షంలో జరిగే వాహన టెస్ట్‌కు సమయంలో డమ్మీ అభ్యర్థులు హాజరవుతున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వెంటనే ఎల్ఎల్ఆర్తో పాటు వాహన పరీక్షకు వెళ్లేసమయంలో ఫొటో, ఎడమ చేతి బొటనవేలిముద్ర తీసుకుంటున్నారు. మొదట ఎల్ఎల్ఆర్ తీసుకునే సమయంలో ఉన్న వ్యక్తి అవునాకాదా, వేలిముద్రలు సరిపోలితేనే వాహన పరీక్షలకు అర్హత కల్పిస్తున్నారు. దీంతో అభ్యర్థుల విషయంలో గందరగోళానికి, అక్రమాలకు చెక్ పడుతోందని అధికారులు భావిస్తున్నారు. లెసైన్స్‌లో బ్లడ్ గ్రూప్ ఆప్షన్ ఉంది రవాణాశాఖ ఇచ్చే లెసైన్స్‌లో అభ్యర్థి రక్తం గ్రూప్‌ను తెలిపే ఆప్షన్ ఉంది. లెసైన్స్దారుడు డీఎల్ తీసుకునే సమయంలో ల్యాబ్ నుంచి తీసుకువచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. లెసైన్స్లోని బ్లడ్ గ్రూప్ ఆప్షన్ వద్ద అభ్యర్థి గ్రూపు లెసైన్స్‌లో వస్తుంది. ఇది వాహనదారుడుకి చాలా ఉపయోగపడుతుంది. - ఎస్.వెంకటేశ్వరావు, రవాణాశాఖ ఉప కమిషనర్ అత్యవసర సమయంలో.. ప్రమాదం జరిగిన సమయంలో వ్యక్తికి లెసైన్స్‌లో బ్లడ్ గ్రూప్ ఉంటే చాలా ఉపయోగ పడుతుంది. ప్రాణాలు కాపాడుకునే ఆ కొద్ది సమయంలో వాహన దారుడి లెసైన్స్ పై బ్లడ్‌గ్రూప్ ఉంటే సమయం వృథాకాదు. ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. - డి. సంజీవరావు, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ బ్లడ్ గ్రూపు ఎలా నమోదు చేసుకోవాలి..అభ్యర్థి ముందుగా ఎల్.ఎల్.ఆర్(లెర్నింగ్ లై సెన్స్) తీసుకున్న తరువాత, పర్మినెంట్ లెసైన్స్(డీఎల్) తీసుకునే సమయంలో బ్లడ్ గ్రూప్‌ను నమోదు చేసుకోవాలి. ఎల్ఎల్ఆర్, ఆధార్ కార్డు, వివిధ ధ్రువపత్రాలతో పాటు గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి అభ్యర్థి బ్లడ్ గ్రూప్ తెలిపే పత్రాన్ని కూడా జతచేయాలి. రవాణాశాఖ కార్యాలయంలో పేరు, అడ్రస్ వివరాలు నమోదు చేసే సమయంలో బ్లడ్ గ్రూప్ ఆప్షన్లో తన గ్రూపును అభ్యర్థి నమోదు చేసుకోవాలి. డ్రైవింగ్లెసైన్స్లోని బ్లడ్ గ్రూప్ ఆప్షన్ -
స్కూల్ బస్సుల్లో భద్రత ఎంత?
అరసవల్లి: మెదక్ జిల్లాలో స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదం గురించి..తెలిసి చిక్కోలు ఉలిక్కిపడింది. తమ పిల్లలను బస్సుల్లో స్కూళ్లకు పంపిస్తున్నామని, మరి వాటిలో భద్రత ఎంత అన్న సందేహం తల్లిదండ్రులకు కలుగుతోంది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు చెందిన బస్సుల నిర్వహణ తీరు విస్మయానికి గురి చేస్తోం ది. గత రెండు నెలల వ్యవధిలో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయంటూ..98 బస్సులపై కేసులు నమోదు చేసి, 24 బస్సులను సీజ్ చేశారంటే..పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు చెందిన 470 బస్సులు విద్యార్థులను తీసుకెళుతున్నాయి. రవాణాశాఖ అధికారులు తరచూ కొరడా ఝలిపిస్తున్నా.. కొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుభ వం, నైపుణ్యం కొరవడిన డ్రైవర్లను పెట్టుకోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా బస్సుల నిర్వహణలో అప్రమత్తత పాటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ముమ్మరంగా తనిఖీలు జిల్లా వ్యాప్తంగా స్కూల్, కాలేజీ బస్సులను రెండు నెలల నుంచి తనిఖీలు చేస్తున్నాం. ఎటువంటి లోపం ఉన్నా.. వెంటనే కేసు నమోదు చేస్తున్నాం. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే సీజ్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులున్నా..తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయాలి. - ఎస్.వెంకటేశ్వరావు, రవాణాశాఖ ఉప కమిషనర్ -
రవాణాశాఖ దూకుడు
అరసవల్లి: రాష్ట్ర రవాణాశాఖ వంద రోజుల ప్రణాళికతో ఓ కొత్త కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రమాదాలు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం, వాహన వేగాన్ని నియంత్రించడం, వన్‌టైం సెటిల్మెంట్తో పన్నుల చెల్లింపు తదితర అంశాలతో ఇది రూపొందింది. వాహన జరిమానా మాఫీ, స్పీడ్ లేజర్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు, అవగాహన కార్యక్రమాలు, జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు, వాహన యోగ్యత కేంద్రాలను అన్నిజిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ఉన్నతాధికారులు చేస్తున్నారు. వందరోజుల పణాళిక వివరాలు ఇలా... వన్‌టైం సెటిల్మెంట్.. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సమైకాంధ్ర ఉద్యమం రవాణాశాఖ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ నష్టాన్ని కొంత మేర పూడ్చుకునేందుకు వందరోజుల ప్రణాళిక ద్వారా వన్‌టైం సెటిల్మెంట్ను ప్రవేశపెడుతోంది. వాహనాలకు గడువులోపు పన్ను చెల్లించకపోతే పన్నుతో పాటు అపరాధ రుసుం కట్లాల్సి ఉంటుంది. యజమానులు ఒక్కసారి పెండింగ్ ఉన్న పన్నును చెల్లిస్తే అపరాధ రుసుం కట్టాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. దీని ద్వారా బకాయిలు వసూలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు.. ప్రమాదాలను నివారించేందుకు రవాణాశాఖ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వలన ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండడంతో.. ఇటువంటి వారిని కనిపెట్టేందుకు నూతనంగా బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ లేజర్గన్లు ఎంవీఐ, ఏఎంవీఐలకు త్వరలో అందించనుంది. రాష్ట్రంలోని 4.92 లక్షల మంది రవాణా డ్రైవర్లు ఉన్నారు. ప్రస్తుతం వాణిజ్య వాహనాల డ్రైవర్లకున్న వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని వీరందరికి వర్తింప చేయాలని ఆలోచిస్తున్నారు. కంప్యూటరైజ్డ్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు... కేంద్ర ప్రభుత్వ సహాకారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంప్యూటరైజ్డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం ద్వారా వాహనాల ఫినెట్‌నెస్ పరీక్షలు సులభతరం, వేగవంతం అవ్వాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కంప్యూటరైజ్డ్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పీపీపీ విధానంను అన్ని జిల్లాల్లో విస్తరణ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం కాల పరిమితి ముగిసిన రోడ్డు భద్రత మండలిని పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ చెర్మైన్‌గా జిల్లా స్థాయిలో భద్రత మండళ్లు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయి. ప్రతి నెలా జిల్లాల్లోని ఓ పాఠశాల లేదా కళాశాలలో రహదారి ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్విహిస్తారు. అధికలోడు వాహనాల ప్రయాణాన్ని నియంత్రించడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మద్యంతాగి, సెల్ఫోన్లో మాట్లాడుతూ, వ్యతిరేక మార్గంలో వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తారు. -
9 నిమిషాలు.. అద్భుత దర్శనం
అరసవల్లి, న్యూస్‌లైన్ : అరసవల్లి సూర్యనారాయణస్వామివారి మూలవిరాట్టును మూడో రోజు మంగళవారం ఉదయం భానుడి లేలేత కిరణాలు అభిషేకించాయి. ఈ అద్భుత దృశ్యం 9 నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది. ఇంద్ర పుష్కరిణి మీదుగా గాలి గోపురంలోంచి ఆలయ ఆవరణలోకి ప్రవేశించిన సూర్యకిరణాలు తొలుత ధ్వజస్తంభాన్ని తాకాయి. అనంతరం గర్భగుడిలోకి ప్రవేశించి 6.23 గంటల నుంచి 6.31 గంటల వరకు ఆదిత్యుడి మూలవిరాట్టును స్పృశించాయి. ఈ సమయంలో స్వామి బంగారు ఛాయలో దర్శనమిచ్చి భక్తులను సమ్మోహన పరిచారు. అపురూపమైన కిరణ దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్యూలైన్ల ద్వారా ఉదయం 6 గంటలకు భక్తులను లోపలికి అనుమతించారు. మంగళవారంతో కిరణ దర్శనం ముగిసింది. తొలి రోజు ఆదివారం వాతావరణం అనుకూలించక ఈ దర్శనం లభ్యం కాలేదు. అంతా సానుకూలంగా ఉండటంతో రెండో రోజు సోమవారం లభ్యమైంది. కాగా సోమవారం సాయంత్రం వర్షం పడడంతో కిరణ దర్శనం లభ్యం కాదని అనుకున్నప్పటికీ మంగళవారం ఉదయానికి వాతావరణం అనుకూలించటంతో సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. దాదాపు 2600 మంది భక్తులు కిరణ దర్శనం చేసుకున్నారు. మళ్లీ అక్టోబర్ 1,2,3 తేదీల్లో కిరణ దర్శనం లభ్యమవుతుందని ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. ఆదిత్యుడిని దర్శించుకున్న విశాఖ రూరల్ ఎస్పీ కిరణ స్పర్శ సమయంలో సూర్యనారాయణస్వామివారిని విశాఖపట్నం రూరల్ ఎస్పీ దుగ్గల్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. -
స్వామిని చేరని సూర్య కిరణాలు
-
స్వామిని చేరని సూర్య కిరణాలు
అరసవెల్లి: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి సూర్యదేవాలయంలో కిరణ దర్శనం భక్తులకు నిరాశ మిగిల్చింది. సూర్యకిరణాలు మూలవిరాట్‌ను తాకలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతియేటా మార్చి 9, 10, 11న సూర్యకిరణాలు సూర్యదేవుని మూలవిరాట్‌ను తాకుతాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఈసారి కూడా భారీగా వచ్చిన భక్తులు ఎగబడటంతో సూర్యకిరణాలు.. మూలవిరాట్‌ను తాకలేదు. భక్తులు అడ్డుగా నిల్చోవడంతో భానుడి కిరణాలు స్వామివారిని చేరలేదు. దీంతో ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆలయవర్గాల తీరు వల్లే అపూర్వ ఘట్టాన్ని చూడలేకపోయామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. అయితే ప్రతికూల వాతావరణంతో కిరణ దర్శనం రద్దు చేసినట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. రేపు, ఎల్లుండి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని భక్తులు ఎదురుచూస్తున్నారు. -
భార్య పీక కోసి.. బావిలోకి తోసేశాడు!
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. నిండు నూరేళ్లు కష్టసుఖాల్లో చేయి వీడనంటూ అగ్నిసాక్షిగా బాసలు చేసి భర్తే.. పెళ్లయిన రెండు వారాలకే కట్టుకున్న భార్య పీక కోసేశాడు. అంతేకాదు, ఆమెను బావిలోకి తోసేసి.. బండరాళ్లు కూడా విసిరాడు. సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్న అరసవిల్లిలో ఈ ఘాతుకం జరిగింది. అదనపు కట్నం కోసమే అతగాడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ''డిసెంబర్ 8న పెళ్లయింది. తన ఉద్యోగానికి తగిన కట్నం ఇవ్వలేదని వేధించారు. నిన్న రాత్రి శ్రీకాకుళంలో పాలు పొంగించాం. ఇరువైపులా బంధువులు అందరూ వచ్చారు. వచ్చాక, అందరూ భోజనం చేశారు. బంధువులంతా శ్రీకాకుళంలో వేరే బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యరాత్రి లేచి, బాత్రూంకి వెళ్లి, షేవింగ్ బ్లేడు పట్టుకుని మెడమీద పెట్టి కోసేశారు. నేను అరిచేసరికి అమ్మ, పిన్ని లేచారు. పిన్ని తలను గోడకేసి కొట్టారు. నేను పారిపోయాను. ఆ వీధిలో బావి ఉంది. అక్కడ కూర్చుని ఉంటే ఎత్తి బావిలో పారేసి, రెండుమూడు రాళ్లు విసిరేశారు. ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చి నన్ను బయటకు తీశారు. మా భర్త కూడా అగ్నిమాపకశాఖలోనే పనిచేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మరో అమ్మాయి ఎవరికీ ఇలా జరగకూడదన్నదే నా ఆరాటం'' అని దివ్యశ్రీ తెలిపింది. -
వైభవం.. ఆదిత్య, సత్యదేవుల జలవిహారం
క్షీవాదశి సందర్భంగా గురువారం సాయంత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి హంసనావికోత్సవం (తెప్పోత్సవం) వైభవంగా జరిగింది. ఉషా, ఛాయా, పద్మినీ సమేత ఆదిత్యుడి ఉత్సవమూర్తులను హంసవాహనంపై కొలువుదీర్చి ఆలయ సమీపంలోని ఇంద్రపుష్కరిణిలో జలవిహారం చేయించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య సింహవాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. కాగా, శ్రీకూర్మంలో కూర్మనాథస్వామివారు అమ్మవార్లతో కలిసి తెప్పలపై కొలువుదీరి శ్వేత పుష్కరిణిలో విహరించారు. స్వామి చక్రనారాయణ స్వామి, శయన పెరుమాళ్లతో కలసి పొలి కోతకు (వరి పంట కోత) వెళ్లారు. సాయంత్రం ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. -న్యూస్‌లైన్, అరసవల్లి (శ్రీకాకుళం) కార్తీక ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) పర్వదినం సందర్భంగా అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారి తెప్పోత్సవం పంపా నదిలో గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. సాయంత్రం ఐదున్నర గంటలకు రత్నగిరిపై నుంచి స్వామి, అమ్మవార్లను పంపానదీ తీరానికి తీసుకువచ్చారు.ప్రత్యేక పూజల అన ంతరం రాత్రి 6.45 నుంచి ఎనిమిది గంటల వరకూ హంసవాహనంగా అలంకరించిన తెప్పపై ఉత్సవం వైభవంగా జరిగింది. మంత్రులు సి.రామచంద్రయ్య, తోట నరసింహం, ఎమ్మెల్యేలు పర్వత చిట్టిబాబు, రాజా అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -న్యూస్‌లైన్, అన్నవరం -
పర్మిట్ లేకపోతే వాహనం సీజ్
అరసవల్లి, న్యూస్‌లైన్: పర్మిట్లు లేకుండా నడుస్తున్న వాణిజ్య వాహనాలకు ముకుతాడు వేయడానికి రవాణ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ప్రత్యేక దాడులు చేయనున్నారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి దాడులు చేయనున్నట్లు తెలిపారు. వాణిజ్య వాహనాలు, టాక్సీలు, బస్సులు తదితర వాహనాల పర్మిట్లు తనిఖీ చేస్తామన్నారు. పర్మిట్ లేకపోయిన, పన్ను చెల్లించకపోయిన సంబంధిత వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. స్కూల్, కాలేజీ బస్సులతో పాటు ఇతర వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, బీమా, అర్హులైన డ్రైవర్లు లేకపోయినా వాహనాలు సీజ్ చేస్తామన్నారు. జిల్లాలో రెండు బస్సులకు మాత్రమే రూట్ పర్మిట్లు ఉన్నాయని, వాటిని ఇప్పటికే తనిఖీ చేశామని తెలిపారు. శ్రీకాకుళం, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్, విజయవాడ తదితర ప్రంతాలకు నిబంధనలకు వ్యతిరేకంగా బస్సులు నడిపితే వెంటనే సీజ్ చేస్తామన్నారు. అలాగే లగేజీ తీసుకువెళ్లే వాహనాల్లో ప్రయాణి కులను తీసుకువెళితే సహించేది లేదని చెప్పారు. ప్రవేటు బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వోల్వో బస్సుల్లో ప్రయాణికులను తీసుకువెళ్లే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవరసర పరిస్థితిల్లో ఏం చేయాలన్న విషయాలు పూర్తిగా తెలియ జేయాలని ట్రావెల్సె వారికి తెలిపినట్లు చెప్పారు. ప్రయాణికుడి పూర్తివివరాలు, సెల్ నంబరు ఖచ్చితంగా ఉండాలని వారికి చెప్పినట్లు వివరించారు.