సూర్యనారాయణునికి స్వర్ణ మకర తోరణం | Swarna Makara Thoranam for Arasavalli Lord Suryanaryana Swamy | Sakshi
Sakshi News home page

సూర్యనారాయణునికి స్వర్ణ మకర తోరణం

Published Fri, Jul 30 2021 7:01 PM | Last Updated on Fri, Jul 30 2021 7:01 PM

Swarna Makara Thoranam for Arasavalli Lord Suryanaryana Swamy - Sakshi

ఆదిత్యునికి అలంకరించనున్న బంగారు మకరతోరణమిదే

సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య మూలవిరాట్టుకు 112 మంది భక్తులు సంయుక్త విరాళాలుగా అందించిన రూ.1.56 కోట్లతో బంగారు మకరతోరణాన్ని తయారు చేయించారు. 3 కేజీల 361 గ్రాముల బరువు గల ఈ బంగారు మకర తోరణాన్ని ఆలయ అనివెట్టి మండపంలో ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ ఆధ్వర్యంలో ప్రదర్శించారు.

ఈ పుణ్యక్షేత్రంలో అత్యధిక విరాళంగా మకరతోరణాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, మండవల్లి రవి (ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యుడు), పెద్దిన కాళిదాస్, పొట్నూరు శ్రీనివాస్‌ తదితరుల బృందం కమిటీగా ఏర్పడి ఈ విరాళాలను భక్తుల నుంచి సేకరించారు. ఆగస్టు 1న ప్రత్యేక పూజల అనంతరం ఆదిత్యుని మూలవిరాట్టుకు ఈ మకరతోరణాన్ని అలంకరించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement