అరసవల్లి(శ్రీకాకుళం జిల్లా): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ధర్మకర్తల సభ్యుల (ట్రస్ట్ బోర్డు) నియామకానికి రాష్ట్ర దేవదాయ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గత నెల 26న దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. సహాయ కమిషనర్ హోదా కలిగిన ఈ ఆలయానికి రెండు నెలల కిందటి వరకు ట్ర స్ట్ బోర్డు కొనసాగింది. ఆ బోర్డు పదవీ కాలం ముగియడంతో కొత్త ట్రస్ట్ బోర్డు నియామకానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరా వు చొరవ చూపించారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు అరసవల్లి సూర్యక్షేత్రానికి పాలక మండలి నియామకానికి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు.
15 లోగా దరఖాస్తు..
తాజా ఉత్తర్వుల ప్రకారం ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి 20 రోజుల్లోగా దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. ఈ ప్రకారం ఈనెల 15వ తేదీలోగానే ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు గడువుగా నిర్ణయించారు. సభ్యులు తమ అర్హత ధ్రువీకరణలతో కూడిన ప్రొఫార్మా–2ను నింపి ఆలయ సహాయ కమిషనర్‌కు స్వయంగా గానీ పోస్టు ద్వారా గానీ అందజేయాల్సి ఉంటుంది.
50 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవదాయ శాఖ పాలకమండలి నియామ కాల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రక్రియను ప క్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టింది. ఆలయాల ట్రస్ట్ బోర్డుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారికి 50 శాతం వరకు రిజర్వేషన్లు క ల్పిస్తూ తాజాగా చట్ట సవరణలు చేసిన సంగతి విదితమే. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ ప్రకారమే 2020లో అరసవల్లి ట్రస్ట్ బో ర్డులో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పక్కాగా అమలు చేశారు.
ఈ ప్రకారం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించడంతో పాటు మొత్తంగా అన్ని కేటగిరీల్లో సగం పదవుల్లో మహిళలనే నియమించాల్సి ఉంది. అరసవల్లి ఆల య స్థాయిని బట్టి 9+1 గా (ఒక చైర్మన్, 8 మంది సభ్యులు, ఒక ఎక్స్‌అఫీషియో మెంబర్) బోర్డును నియమించనున్నారు. ఈ ప్రకారం మొత్తం ఐదుగు రు వరకు మహిళలే మళ్లీ సభ్యులయ్యే అవకాశం ఉంది. ఆలయానికి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్‌గా ఉన్న ఇప్పిలి జోగిసన్యాసిరావే ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గానూ, ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్న ఇప్పిలి శంకరశర్మ ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా మళ్లీ నియమితులు కానున్నారు. దీంతో మిగిలిన 8 మంది సభ్యుల స్థానాలకు మాత్రమే ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు ఇవే..
ఆలయాల్లో పాలకమండలి సభ్యులుగా పనిచేయాలంటే కేవలం ఆసక్తి ఉంటే చాలదు. అందుకు తగిన అర్హతలను కూడా కలిగి ఉండాలనేలా దేవదాయ శాఖ చట్టంలో పేర్కొన్నారు.
ట్రస్ట్ బోర్డు సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కచ్చితంగా హిందువై ఉండాలి.
30 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతుడై ఉండాలి.
మంచి స్వభావం కలిగి, ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్నవారే అర్హులు.
మానసిక దివ్యాంగులు ఈ సభ్యత్వానికి అనర్హులు.
మద్యం, జూదం వంటి దురలవాట్లు లేని వారికి మాత్రమే అవకాశం.
ప్రభుత్వ శాఖలతో లావాదేవీలు ఉన్న వారికి, క్రిమినల్/ నేర చరిత్రలున్న వారికి పోలీసు కేసులున్న వారు అనర్హులు.
అరసవల్లి ఆలయానికి చెందిన భూముల లావాదేవీలు, ఎలాంటి లీజులు పొందిన వారు కూడా దరఖాస్తునకు అనర్హులు.
అరసవల్లి ఆలయ వ్యవహారాల్లో ప్రతివాదిగా ఉండకూడదు.
రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు
సూర్యదేవాలయానికి మరో సారి ట్రస్ట్ బోర్డు నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ల విధానంతోనే నియామకాలను చేపడతాం. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15లోగా తమ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వీటిని పరిశీలించి ప్రభుత్వానికి, దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక పంపిస్తాం. తదుపరి నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి.
– వి.హరిసూర్యప్రకాష్, ఆలయ ఈఓ
Comments
Please login to add a commentAdd a comment