swarna
-
కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శిస్తే తప్పేంటి..?
-
పొన్నాల వాట్సాప్ స్టేటస్‌పై ఎర్రబెల్లి ఫైర్
సాక్షి, వరంగల్: బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆస్పత్రిలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను.. సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శిస్తున్న ఓ ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు సెటైరిక్‌గా ప్రచారం చేసుకున్నాయి. అయితే సీనియర్ నేత పొన్నాల సైతం ఆ ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నారు. ఈ పరిణామంపై వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మండిపడ్డారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా, గౌరవంగా కలిసి పలకరించారు. అందులో తప్పేం ఉందో అర్థం కావడం లేదు. పొన్నాల.. మీరొక సీనియర్ లీడర్. స్వార్దంతో పార్టీని వీడిన మీరు.. ఇలా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి స్టేటస్లు పెట్టడం సిగ్గు చేటు. .. మీకు సంస్కారం లేదని ఈ విషయంతో అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి మీ దారిన మీరు పోయారు. మీ వయస్సు కు తగ్గ విధంగా ప్రవర్తించండి. మరోసారి ఇలాంటివి పెడితే సహించే ప్రసక్తే లేదు’’ అని వీడియో సందేశం ద్వారా పొన్నాలను ఉద్దేశించి ఎర్రబెల్లి స్వర్ణ ఫైర్ అయ్యారు. -
కొండా Vs ఎర్రబెల్లి.. తెర వెనుక ఏం జరుగుతోంది?
సాక్షి, వరంగల్: వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి.. కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టిందా.. ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందా.. తూర్పు టిక్కెట్ రాజకీయంగా దూమారం రేపుతుందా?.. అంటే ఔననే సమాధానం వస్తుంది. డీసీసీ తొలి సమావేశంలో వర్గ విబేధాలు బహిర్గతంకావడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తుంది. తూర్పులో కొండా వర్సెస్ ఎర్రబెల్లి అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రచ్చకెక్కాయి. తూర్పులో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు సాగుతుంది. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే తానే అంటు మాజీమంత్రి కొండా సురేఖ ప్రచారం సాగిస్తుండగా అనూహ్యంగా డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. వరంగల్ డిసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు కొండ సురేఖ-మురళీ దంపతులు విశ్వప్రయత్నం చేశారు. చివరకు ఎర్రబెల్లి స్వర్ణకు డీసీసీ పదవి దక్కింది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న కొండా దంపతులు పార్టీలో తమ ప్రాధాన్యతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ తూర్పునియోజకవర్గంలో తొలిసారి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నాయకులతోపాటు పక్క జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు హజరయ్యారు. తూర్పు టిక్కెట్ ఆశిస్తు ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులు మాత్రం ఆ సమావేశానికి హాజరుకాలేదు. వారి అనుచరులను సైతం సమావేశానికి హాజరుకాకుండా కట్టడి చేశారు. కానీ కొండా వర్గానికి చెందిన కట్టస్వామి హాజరయ్యారు. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించే ప్రయత్నం చేయగా అతనిపై పరకాల నియోజకవర్గానికి చెందిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి వర్గానికి చెందినవారు దాడి చేశారు. చొక్కా చించేసి చితకబాదారు. పార్టీ ముఖ్యనాయకుల సమక్షంలోనే రెండు వర్గాలు పరస్పరం తన్నుకోవడంతో సమావేశం రసాభసగా మారింది. ముందుగా ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్‌రావు, కొండా సురేఖ-మురళీ వర్గీయులే కొట్టుకున్నారని ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఎర్రబెల్లి వర్గీయులు కొట్టిపారేశారు. పార్టీలో గ్రూప్‌లు లేవని, తామందరిది ఒకే గ్రూప్ కాంగ్రెస్ అని ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. డీసీసీ సమావేశానికి కొండా దంపతులు దూరంగా ఉన్నప్పటికి సాయంత్రం లేబర్ కాలనీలో కొండా మురళీ పర్యటించి పలువురిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కొండా దంపతుల పని అయిపోయిందని, సురేఖ ఇటురాదని, వేరే వాళ్లు వస్తారని ప్రచారం కావడంపై మురళీ ఘాటుగానే స్పందించారు. సురేఖ ఎటూ పోదు..తూర్పు నుంచే పోటీ చేస్తుందని మురళి స్పష్టం చేశారు. ఇరువర్గాల నేతల వ్యాఖ్యలు కాస్త పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పైకి అంతాకలిసి ఉన్నామని పోజులిచ్చినప్పటికి అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలతో రగిలిపోతున్నారు. వర్గ విబేధాలకు ప్రధాన కారణం వరంగల్ తూర్పు అసెంబ్లీ టిక్కెట్, డీసీసీ అధ్యక్ష పదవేనని తెలుస్తుంది. పనిచేసే వారికి అధిష్టానం డీసీసీ పదవి ఇచ్చిందని ఎర్రబెల్లి వర్గం భావిస్తుండగా, ఏకాభిప్రాయం లేకుండా ఎలా డీసీసీ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారని కొండా వర్గీయులతోపాటు అసంతృప్తివాదులు మడిపడుతున్నారు. ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న టికెట్ పోరు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన టీపీసీసీ సమావేశంతో సైతం బహిర్గతమైనట్లు సమాచారం. ఆ సమావేశంలో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించారట. పీసీసీ నాయకత్వం కొండా సురేఖను పరకాల నుంచి పోటీ చేయాలని సూచించగా, సురేఖ మాత్రం వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తానని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ నాయకత్వం కొండా ప్రతిపాదనలకు భిన్నంగా ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంతో తూర్పు తమదేనంటూ ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులకు మింగుడు పడడంలేదట. అందులో భాగంగానే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయట. తూర్పు అభ్యర్థిగా సురేఖ స్వయంగా ప్రకటించుకుని నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించన ఎర్రబెల్లి స్వర్ణ సైతం తూర్పులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. డీసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇవ్వకుండా ఎర్రబెల్లి స్వర్ణకు కట్టబెట్టడమే కాకుండా తెరచాటుగా తూర్పు నియోజకవర్గంపై స్వర్ణ కన్నెయ్యడంతో కొండా దంపతులు అసంతృప్తితో పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. చదవండి: కొండా వర్గీయుడిపై ఇనుగాల వర్గీయుల దాడి ఎవరైనా తూర్పులో కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్‌కు వేలాడదీస్తామని, పాత కొండా మురళిని చూస్తారని హెచ్చరించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇద్దరు మహిళా నేతల మధ్య టికెట్ పోరు అటు పార్టీ పెద్దలను ఇటు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరోక్ష హెచ్చరికలు, గ్రూప్ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతుంటే వర్గ విభేదాలు, గ్రూప్ తగాదలు తలనొప్పిలా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వర్ణ రథంపై శ్రీవారు ( ఫొటోలు)
-
సూర్యనారాయణునికి స్వర్ణ మకర తోరణం
సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య మూలవిరాట్టుకు 112 మంది భక్తులు సంయుక్త విరాళాలుగా అందించిన రూ.1.56 కోట్లతో బంగారు మకరతోరణాన్ని తయారు చేయించారు. 3 కేజీల 361 గ్రాముల బరువు గల ఈ బంగారు మకర తోరణాన్ని ఆలయ అనివెట్టి మండపంలో ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ పుణ్యక్షేత్రంలో అత్యధిక విరాళంగా మకరతోరణాన్ని రికార్డుల్లో నమోదు చేశారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, మండవల్లి రవి (ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు), పెద్దిన కాళిదాస్, పొట్నూరు శ్రీనివాస్ తదితరుల బృందం కమిటీగా ఏర్పడి ఈ విరాళాలను భక్తుల నుంచి సేకరించారు. ఆగస్టు 1న ప్రత్యేక పూజల అనంతరం ఆదిత్యుని మూలవిరాట్టుకు ఈ మకరతోరణాన్ని అలంకరించనున్నారు. -
స్వర్ణ ప్యాలెస్ ఘటనతో.. నిరంతరం నిఘా
మచిలీపట్నం: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనతో కోవిడ్ ఆసుపత్రులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కోవిడ్ ఆసుపత్రులుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వారి భద్రతకు పెద్దపీట వేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచడంతో పాటు, నిఘాను పట్టిష్టం చేసేలా చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జారీచేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఎంపిక చేసిన 13 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించారు. ఇప్పటికే 11 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రి, మచిలీపట్నం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న కోవిడ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం నాటికి సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. లిబర్టీ ఆసుపత్రిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి కోవిడ్ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ పెంచేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రుల్లోని కోవిడ్ కేంద్రం మొత్తం సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తున్నారు. ప్రధాన గేటు మొదలుకొని కేంద్రంలోని అన్ని గదులు, పరీక్షలు నిర్వహించే ప్రదేశం, వైద్య సేవలు అందించే వార్డులు, నమోదు కేంద్రం ఇలా అన్ని చోట్లా సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. వీటిని కోవిడ్ విభాగం ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షణ చేయడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సీసీ పుటేజీలను భద్రపరచాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు విముఖత చూపే ఆసుపత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, కోవిడ్ నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో కరోనా తగ్గుముఖం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఐసీఎంఆర్ తాజా నివేదికల మేరకు 2,89,290 లక్షల మందికి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించారు. 12,760 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 9,665 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇంకా 2,863 మంది కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా గణాంకాల మేరకు ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణాలోనే తక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి. రికవరీ శాతం కూడా జిల్లాలో బాగానే ఉండటం అధికారులకు ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాలో కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ ఆసుపత్రులు: 13 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినవి: 11 కరోనా పరీక్షల సంఖ్య: 2,89,290 పాజిటివ్ కేసులు: 12,760 కోలుకున్న వారు: 9,665 చికిత్స పొందుతున్న వారు: 2,863 -
ఇక్కడా ఉంది... ఓ స్వర్ణ ప్యాలెస్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ...పది మంది మృతి ఘటన భయానక దృశ్యాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అలాంటి దుర్ఘటనలు ఇతర జిల్లాల్లో జరగకూడదని అధికార యంత్రాంగం నిఘా వేస్తున్న వేళ...రాజమహేంద్రవరంలో ఎంచక్కా ఓ లాడ్జిలోని గదులను అద్దెకు తీసుకొని కోవిడ్ రోగులకు ఓ సాధారణ వైద్యుడు లక్షల రూపాయలు గుంజుకుంటూ చికిత్స అందిస్తున్న వైనం తాజాగా బయటపడింది. కోవిడ్ రోగికి ఎంత సీరియస్‌గా ఉన్నా సరే చిటికెలో బాగు చేసేస్తామంటూ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు గుంజుతూ చివరిలో ‘సారీ’ చెప్పి శవాన్ని అప్పగిస్తున్నారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సమీపంలో ఉన్న ఓ ఆసుపత్రిలో రోగులను పెట్టకుండా మెయిన్ రోడ్డులో ఓ ప్యాలెస్‌లో (లాడ్జి) గదులు అద్దెకు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. వారి వద్దనుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ దందాకు తెరలేపుతున్నాడు ఓ సాధారణ వైద్యుడు. దగ్గు, జ్వరం లక్షణాలతో వస్తే చాలు కోవిడ్‌గా నిర్ధారించేసి వైద్యం ప్రారంభించేస్తున్నారు. ఎటువంటి భద్రతా నిబంధనలు అక్కడ కానరావు. కోవిడ్ వైద్య చికిత్సలకు తాము సూచించిన ఆసుపత్రులు మినహా ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, హోటళ్లలో నిర్వహణకు అనుమతే లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ బాగోతంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో డీఎంహెచ్‌వో దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా అడిషనల్ డీఎంహెచ్‌వోకు ఆదేశాలు జారీచేశారు. అయితే అక్కడ ఏమీ లేదని, దీనిపై విచారణ చేశామని ఆమె చెబుతుండడం గమనార్హం. అయితే బాధితులు నేరుగా తమకే ఫిర్యాదు చేశారని, ఫోన్లో సంభాషణ ఆడియో క్లిప్‌లు తమ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా వెంటనే విచారణ ప్రారంభించామని డీఎంహెచ్‌వో సుబ్రమణ్వేశ్వరి ‘సాక్షి’కి తెలిపారు. దందా నిజమేనని, స్వయంగా బాధితుల ఆడియో క్లిప్పింగ్‌లు తన వద్ద ఉన్నాయని ఉన్నతాధికారి చెబుతుండగా ... కిందిస్థాయి అధికారి మాత్రం ‘అబ్బే...అక్కడేమీ జరగడం లేద’ని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. మా అమ్మ చనిపోతుందని తెలిసినా డబ్బులు గుంజారు మా అమ్మ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాం. అక్కడ వైద్యులు ఆమె పరిస్థితి బాగోలేదు తీసుకెళ్లిపొమ్మని చెప్పారు. ఉదయం నుంచి అర్ధ్రరాత్రి వరకు ఎన్నో ఆసుపత్రులకు ఆటోలో తిప్పాం. ఎవరూ జాయిన్ చేసుకోలేదు. అయితే సెంట్రల్ జైలు వద్ద ఒక ఆసుపత్రి ఉంది ... అక్కడకు వెళ్లమంటే వెళ్లాం. అక్కడ వైద్యులు చూసి ‘చూద్దాం బతికిద్దాం...ముందుగా రూ.1.50 లక్షలు కట్టండ’ని తెలిపారు. డబ్బులు అప్పుచేసి తెచ్చి రూ.50 వేలు కట్టాను. మర్నాడు ఉదయం అమ్మ చనిపోయింది. కనీసం ఐసీయూలో కూడా పెట్టలేదు, ఆక్సిజన్ ఇవ్వలేదు. రెండు ఇంజక్షన్లు, సిలైన్ పెట్టి వదిలేసి... ఒక్కరోజుకు రూ.50 వేలు తీసుకున్నారు.–శ్రీనివాస్, రాజమహేంద్రవరం అనుమతి ఎవరికీ ఇవ్వలేదు కోవిడ్ చికిత్సకు మేము సూచించిన ఆసుపత్రులు తప్ప అదనంగా ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. హోటల్లో కోవిడ్ చికిత్స చేసేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం.– అభిషిక్త్ కిశోర్, కమిషనర్, రాజమహేంద్రవరం విచారణ ప్రారంభించాం కోవిడ్ చికిత్సకు ఆ ఆసుపత్రికి ఎటువంటి అనుమతి లేదు. అలాగే మెయిన్ రోడ్డులో ఓ ప్యాలెస్‌లో కోవిడ్ రోగులను ఉంచి చికిత్స చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. దానికి సంబంధించి మా వద్ద ఓ ఆడియో క్లిప్ కూడా ఉంది. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాం. దీనికి సంబంధించి రిపోర్టు రావాల్సివుంది. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. చర్యలు తప్పవు.– సుబ్రహ్మణ్వేశరి,డీఎంహెచ్‌వో, కాకినాడ -
స్వర్ణ హోటల్స్ గ్రూపు మరో హోటల్ కూడా..
కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్ భవన నిర్మాణ అనుమతులకు నీళ్లోదిలింది. వినియోగదారుల నుంచి భారీ స్థాయిలో హోటల్ బిల్లు వసూలు చేస్తున్న యాజమాన్యం వారి భద్రతను గాలికి వదిలేసింది. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు హోటల్‌కి ఉండాల్సిన కనీస అగ్రిప్రమాద నిరోధకాలు కూడా ఏర్పాటు చేయలేదంటే హోటల్ యాజమాన్యానికి ఉన్న నిబద్ధత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. పటమట(విజయవాడ తూర్పు): నగరంలోని హోటళ్లు. భారీ షాపింగ్‌కాంప్లెక్స్‌లు, ఆస్పత్రుల యాజమాన్యాలకు ఆదాయమే తప్ప వినియోగదారుల భద్రత అనేది పట్టదని తాజాగా హోటల్ స్వర్ణప్యాలెస్ ఘటన చెబుతోంది. నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భవన నిర్మాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అమలు చేయాల్సిన నిబంధనలు, అనుమతులు ఇవ్వటానికి అవలంబించాల్సిన పరిశీలనలు కేవలం తూతూ మంత్రంగానే ఉంటున్నాయి. కేవలం రెసిడెన్షియల్ భవనానికి మాత్రమే వీఎంసీ నుంచి అనుమతులు పొందిన స్వర్ణ ప్యాలెస్ హోటల్ కేటగిరీలో వ్యాపారం నడుపుతోంది. 18 మీటర్ల ఎత్తును ప్రామాణికంగా హోటల్ యాజమాన్యం గత ప్రభుత్వాల సిఫారసుతో అనుమతులు పొంది ఇప్పుడు కోవిడ్ పేషెంట్ల ప్రాణాలు బలికొంది. ప్రమాద సమయాల్లో సంరక్షణ ఏదీ.. హోటళ్లు, ఆస్పత్రులు, కాంప్లెక్స్‌లకు రెండు మార్గాలు ఉండాలి. భవనానికి ఒకటి వెళ్లేందుకు.. మరొకటి అత్యవసర సమయంలో బయటకు వచ్చేందుకు. అత్యవసర మార్గలు ఆర్సీసీతో లేదా మెటల్‌తో కానీ మెట్లు ఏర్పాటు చేయాలి. కానీ హోటల్ స్వర్ణప్యాలెస్‌కు ఒక ఎంట్రీ మాత్రమే ఉంది. అత్యవసర మార్గం లేకపోవటం మరణాలకు ప్రధాన కారణం. ♦ ఎమర్జెన్సీ లైట్స్ కనీసం నాలుగు గంటలు పాటు వెలిగేలా సోలార్ విద్యుత్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలి. కానీ హోటల్లో అలాంటివేమీ కనిపించలేదు. ♦అగ్నిప్రమాదం సంభవిస్తే అగ్నిప్రమాద నిరోధకాలు ఏర్పాటు చేయాలి. కానీ హోటల్ల్లో స్మోక్ అలారం కూడా లేదు. సెంట్రల్ ఏసీ ఉన్న భవనాలకు ఆటోమేటిక్ స్మోక్ డంపర్స్ ఉండాలి. ఇదిలేకపోవటంతో ఏసీ పైపుల ద్వారా పొగ హోటల్‌ల్లోని అన్ని గదుల్లో వ్యాపించే అవకాశం ఉంది. ఫైర్ ఎగ్జిట్మెట్లు లేకపోవటం, ఆటోమేటిక్ ఫైర్ స్ప్రింకర్లు ఏర్పాటు చేసుకోకపోవటంతో ప్రమాద స్థాయి తీవ్రతను తెలియజేస్తోంది. పార్కింగ్‌లో నిర్మాణాలు భవన నిర్మాణ నిబంధనల మేరకు సెల్లార్లో కేవలం పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలి. కానీ విజయవాడ నగరంలోనిæ స్వర్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మాత్రం అవేమీ పట్టించుకకోకుండా హోటళ్లను నిర్వహిస్తోంది. ఏలూరు రోడ్డులోని హోటల్ స్వర్ణ ప్యాలెస్ సెల్లార్‌ను స్టోర్ రూంగా వినియోగిస్తుండగా... లబ్బీపేట బందరురోడ్డులోని హోటల్లో కిచెన్ నిర్వహిస్తోంది. రింగ్‌రోడ్డులోని హోటల్ మెట్రోపాలిటిన్ హోటల్‌ది అదే తీరు.. ప్రమాదాలు జరిగితే అగ్నిమాపక వాహనం తిరిగేందుకు హోటళ్లకైతే రెండు మీటర్ల సెట్‌బ్యాక్ ఉండాల్సిందిగా భవన నిర్మాణ నిబంధనలు ఉంటే కేవలం ఒక మీటర్లే సెట్‌బ్యాక్ వదిలారు. దీనిపై గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఇతర హోటళ్లదీ.. షాపింగ్కాంప్లెక్స్లదీ అదేతీరు.. గత ప్రభుత్వాల హయాంలో భవన నిర్మాణాలలో అనేక అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి.. లబ్బీపేటలో పీవీపీ రోడ్డులో ఉన్న హోటల్ మినర్వ జీప్లస్3కి అనుమతి తీసుకుని అనధికారికంగా ఒక ఫ్లోర్ నిర్మాణం చేసింది. బీపీఎస్(బిల్డింగ్ పేనలైజేషన్కు స్కీం) కు దరఖాస్తు చేసుకున్నా పెనాల్టీ చెల్లించకపోవటంతో ఇటీవల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు రెడ్ నోటీస్(ఇది అత్యవసరంగా, ప్రమాదకరంగా ఉండే వాటిని మాత్రమే జారీ చేస్తారు) అంటించినా స్పందించలేదు. దీనికితోడు సెట్‌బ్యాక్స్‌లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేయకూడదని భవన నిర్మాణ నిబంధనలున్నా అక్కడ స్ట్రీట్ ఫుడ్ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనిపైగతంలో దుమారం రేగటంతో కొంతకాలం ఆపేసినా తర్వాత వ్యాపారాన్ని కొనసాగించింది. ♦స్వర్ణ హోటల్స్ గ్రూపునకు చెందిన మరో హోటల్ ఏలూరు రోడ్డులోని ఆయూష్ ఆస్పత్రి ఎదురుగా హోటల్‌కు భవనం నిర్మాణమంతా అనధికారికమే. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలో గత అక్టోబరులో అనధికారిక ఫ్లోర్‌ను అధికారులు పగలకొట్టారు. కొద్ది నెలలకే ఫ్లోర్‌ను మళ్లీ నిర్మించారు. ♦హోటల్ మురళీఫార్యూ్చన్ అనధికారికంగా రెండు అంతస్తులను నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు పోతున్నారు. ♦ఏలూరు రోడ్డులోని స్వర్ణ కాంప్లెక్స్‌పై రినోవేషన్ పేరుతో అనధికారికంగా ఫ్లోర్ వేసినా అధికారులు పట్టించుకోలేదు. దీనికితోడు సినిమా థియేటర్ల, ఆడిటోరియాలకు వర్తించే నిబంధనలను గాలికి వదిలేసి రెండోస్టేర్ కేస్ లేకుండా అలాగే నిర్వహిస్తుంది. అగ్నిప్రమాదం జరిగితే సినిమాకు వెళ్లిన ప్రేక్షకులు మైక్రోవోవెన్లో మాదిరి అందులో కాలిపోవాల్సిందే. ♦ బందరు రోడ్డులోని హోటల్ వివాంతది కూడా అదే నేపథ్యంలో హోటల్ పై అంతస్తులో ఉన్న కాఫీ షాప్ కూడా అనధికారికమే. ♦లెనిన్‌సెంటర్‌లో ఉన్న చందన బ్రదర్స్‌పై అనధికారికంగా నిర్మాణం చేపట్టినా అధికారులు, సిబ్బందికి ముడుపులు అందటంతో చూసీ చూడనట్లు వ్యవహరించారు. ♦బందరురోడ్డులోని కళాంజలి కాంప్లెక్దీ అదేతీరు. అధికారికంగా జీప్లస్ 3 అనుమతి తీసుకుని అనధికరింగా మరో అంతస్తు నిర్మించింది. వీటికి ఫైర్ ఎన్ఓసీ లేదు. ♦కళానికేతన్ భవనానికి అదేతీరు.. సరైన సెట్‌బ్యాక్స్ మాత్రమే ఉన్న ఈ భవనం లోపల అనుమతులు మించి కట్టడాలు చేయటం, అనధికారికంగా ఫ్లోర్ వేసి వ్యాపారం చేస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకుంటాం విజయవాడ నగరంలో ఉన్న భారీ భవనాల యాజమానులు నిబంధనల్లో ఉన్న లొసుగులను వినియోగించుకుని నిర్మాణాలు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునేది ఓ కేటగిరీలో వ్యాపార కార్యాకలాపాలు సాగించేది మరో కేటగిరీలో. దీనిపై పరిశీలన చేయాల్సి ఉంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా స్కూల్స్, హాస్పిటల్స్, హోటళ్లను ముందస్తు పరిశీలన చేశాకే అనుమతులు మంజూరు చేస్తాం. –ఉదయ్, రీజనల్ ఫైర్ అధికారి -
కరోనాను ఇలా గెలిచాను
స్వర్ణ కిలారి తన ‘లిప్తకాలపు స్వప్నం’ అనే పుస్తకం ద్వారా హైదరాబాద్ సాహితీ బృందాల్లో సుపరిచితులు. ఇప్పుడు ఫేస్బుక్ వల్ల మరింత మందికి తెలిశారు. దానికి కారణం కోవిడ్‌ను జయించాక ఆమె రాసిన పోస్ట్ వైరల్‌గా మారడమే. ఆ పోస్ట్ ఎంతోమందికి ధైర్యం ఇవ్వడమే. ఆ పోస్ట్‌లో ఆమె రాసిన అనుభవం ఆమె మాటల్లో.... ‘‘కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చ్ నెల మొదటి వారంలో తెలిసింది. మార్చ్ మూడో వారం నుండి లాక్డౌన్ ప్రారంభం అయింది. నా భర్త, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం అప్పటికే రోజూ ఆఫీస్‌కు వెళ్లి వస్తున్నాడు కనుక ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో వలస కార్మికుల ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కష్టం చూడలేక కొంతమేరకు తోచిన సాయం చేయగలిగాను. కొన్నాళ్ళు గడిచాక వ్యాధి విస్తృతంగా వ్యాపించడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరో తెలియని వ్యక్తులకు వచ్చింది, కానీ త్వరలోనే మన దగ్గరి వాళ్లకు కూడా వస్తుంది అని అర్ధం అయింది’’. నాకెలా తెలిసిందంటే... ఒకరోజు ఒళ్ళు కాస్త వేడిగా అనిపించింది. రాత్రికల్లా ఎక్కువయి పారసిటమాల్ వేసుకునే స్థితి ఏర్పడింది. రెండో రోజు, మూడో రోజు కూడా 99–100 డిగ్రీలు వుండేది టెంపరేచర్. తర్వాత మాతోనే ఉండే చెల్లి కూతురు దరహాసకు కూడా జ్వరం మొదలైంది. ఎందుకో కరోనా వచ్చిందా అనే అనుమానం వచ్చి ఇద్దరం ఆసుపత్రిలో టెస్ట్‌కి శాంపిల్ ఇచ్చి వచ్చాం. రిపోర్ట్ వచ్చేసరికి మా జ్వరం తగ్గిపోయింది కానీ బాగా నీరసం, దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లం, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి. రిపోర్టులో మాకు పాజిటివ్ అని వచ్చింది. ఆదుర్దా పడ్డాం కానీ వెంటనే తేరుకుని తరువాత ఏం చేయాలో ఆలోచించాము’’. వాడిన మందులు వెంటనే తెలిసిన ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్లతో ఫోన్లోనే మాట్లాడి, వారిచ్చిన ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలుపెట్టాం. మొదటి నాలుగు రోజులు పారసిటమాల్, తరువాత విటమిన్ సీ, డీ, జింక్, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఒక యాంటీబయోటిక్ కూడా ఇచ్చారు. ప్రతీరోజూ థర్మామీటర్‌తో జ్వరం చెక్ చేసుకోవడం, ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ శాచురేషన్ చెక్ చేసుకోవడం చేశాము. ఉదయం ఒకసారి కషాయం, ఉడకబెట్టిన గుడ్డు, నానబెట్టిన బాదం, మొలకలు, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, మళ్లీ సాయంత్రం కషాయం, ఒక ఫ్రూట్ జ్యూస్, రాత్రికి చపాతీ, ఒక కప్పు పసుపు వేసిన పాలు. రెండ్రోజులకు ఒకసారి భోజనంలో చికెన్ కూడా తీసుకున్నాము. కరోనా టైంలో నేను చేసిన పనులు ► అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌లలో ఎప్పటినుండో చూడాలి అనుకున్న సినిమాలు చూసాను. ► ఎప్పటినుండో పెండింగ్‌లో వున్న ఒక రెండు ఆర్టికల్స్ పూర్తి చేయగలిగాను. ► రోజూ యోగాసనాలు, గదిలోనే నడక. మధ్యలో రెగ్యులర్‌గా ప్రభుత్వ కాల్ సెంటర్ నుండి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందో వాకబు చేశారు. ఐసొలేషన్ కిట్ పంపిస్తాం అంటే ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, కిట్ వద్దని చెప్పాను. నాతోపాటు దరహాస కూడా ఉండటం వల్ల పెద్దగా బోర్ కొట్టకుండా, ఒకరికొకరం అన్నట్టు ఉండగలిగాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే... ఇదొక కొత్త వ్యాధి. లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా వున్నాయి. లక్షణ తీవ్రతను బట్టి ఆసుపత్రిలో వుండాలా, యింట్లోనే ఐసోలేషన్ లో వుండాలో డాక్టర్ సలహాతో నిర్ణయించుకోవాలి. ఈ వ్యాధి తగ్గి, మనం ఆరోగ్యంగా బయట పడాలంటే ముఖ్యంగా కావలసింది ధైర్యం. కరోనా రావడం నేరం, ఘోరం కాదు. రహస్యంగా వుంచాల్సిన అవసరమూ లేదు. మన చుట్టుపక్కల వాళ్లు జాగ్రత్తగా ఉంటూ, ఎక్కువ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. నాకు అర్థమయ్యింది ఏమిటంటే కరోనా పట్ల మనకు వుండాల్సింది అప్రమత్తత. భయాందోళనలు కాదు! -
నువ్వే నీ శక్తి
ఆడపిల్లలకు ప్రమాదాలు అనుక్షణం పొంచి ఉంటాయి.ఎప్పుడు ఎవరు లైంగిక దాడి చేస్తారో ఊహించలేకపోతున్నాం.అమ్మాయి ఎంత జాగ్రత్తగా ఉన్నా జరుగుతూనే ఉండే దాడులు ఇవి. ఆ ప్రమాదాల దాడి నుంచి ఆడబిడ్డను రక్షించేదెవరు? అందుకు రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, అవి స్పందించేలోపు ఆడపిల్లలే ప్రతిస్పందించాలి. ధైర్యంగా ముందుకు అడుగు వేసి దాడి చేయబోయిన వాడికి దడ పుట్టించాలి. అమ్మాయిల్లో అలాంటి ధైర్యాన్ని పాదుకొల్పడానికే కర్రసామునేర్చుకుని ప్రదర్శిస్తున్నానని చెప్పారు స్వర్ణయాదవ్. ఇటీవలే ఆమె హైదరాబాద్,రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎదుటకర్రసాము ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. స్వర్ణ యాదవ్‌ది నాగర్ కర్నూల్ జిల్లా, వెల్దండ మండలం, బైరాపూర్ గ్రామం. అమ్మానాన్నలు వెంకటమ్మ, పెద్దయ్య వ్యవసాయం చేస్తారు. ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు. అత్యంత సాధారణ నేపథ్యం నుంచి రాష్ట్రం గర్వించదగిన స్థాయిలో జానపద గాయనిగా, కర్రసాము యుద్ధ కళాకారిణిగా ఎదగడంలో ఆమె వేసిన ప్రతి అడుగూ సాహసోపేతమైనదే. ఇప్పుడు అందుకుంటున్న ప్రశంసల వెనుక ఉన్న పోరాట జీవితాన్ని సాక్షితో మాట్లాడుతున్న సందర్భంలో గుర్తు చేసుకున్నారు స్వర్ణయాదవ్. బాయిలో బచ్చలి కూర ‘‘నేను ఇప్పుడు కర్రసాము స్వర్ణగా పరిచయమయ్యాను. కానీ అంతకు ముందు జానపద గాయనిగా వందల వేదికల మీద పాటలు పాడాను. ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా సొంతూరులో ప్రభుత్వ పాఠశాలలో తొలిసారి పాట పాడాను. మా అక్కలు నేర్పించిన ‘బాయిలో బచ్చలి కూర...’ అనే ఆ పాట స్కూలు తర్వాత గ్రామస్థాయి పోటీలు, మండలం, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాకు ప్రథమ స్థానాన్ని తెచ్చి పెట్టింది. జానపదంలో పాటతోపాటే నాట్యం కూడా చేస్తాం. అలా వేదిక మీద డాన్స్ చేయడంతో బిడియం పోతుంది. మనుషుల్లో కలిసి పోయే చొరవ వస్తుంది. ఆ చొరవే నన్ను తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ గేయాలు పాడేలా ముందడుగు వేయించింది. ఉద్యమం ఊపందుకోవడానికి పాటలను మించిన మాధ్యమం మరొకటి ఉండదని చెప్పి, మా ఊరిలోని ఉద్యమ గాయకుల బృందంలోని వాళ్లు నన్ను కూడా పాట పాడమని అడిగారు. అలా ఉద్యమంలోకి ఉరికిన దాన్ని... గళమెత్తాక ఎన్ని వేదికల మీద ఎన్ని గేయాలు పాడానో ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు. నేను నేర్చుకున్న ఉద్యమ గేయాలే కాకుండా, అక్కడికక్కడే ఆ సందర్భాన్ని బట్టి సొంతంగా పదాలు కూర్చుకుని పాడడం కూడా వచ్చేసింది. ఇంతవరకు పాటను కాగితం మీద రాసుకున్నది లేదు, నేరుగా పాడడమే. ఆడపిల్లలు ఇలా ఉండాలంటూ గవర్నర్ తమిళిసైకర్రసాము నిపుణురాలు స్వర్ణయాదవ్నుఅక్కున చేర్చుకున్న దృశ్యం బతికించడమే బతుకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేస్తున్నాను. మరో యూనివర్సిటీలో ఎం.ఏ పాలిటిక్స్‌లో సీటు వచ్చింది. కానీ కళలకు కాణాచి అయిన తెలంగాణలో కళలు తెరమరుగవుతున్నాయి. సంగీత వాయిద్యాలు చిలక్కొయ్యల మీదనే ఉండిపోతున్నాయి. వాటిని కిందికి దించి తిరిగి మోగించాలని, కళలకు జీవం పోయడంలోనే జీవితాన్ని వెతుక్కోవాలని అనుకున్నాను. ఆర్ట్ ఫార్మ్‌ను బతికించడంలో మన బతుకుకు కూడా భరోసా ఉంటుందని నిరూపిస్తాను. అందులో భాగంగానే కర్రసాము, కత్తిసాము నేర్చుకుని ప్రదర్శిస్తున్నాను. మొండిగా ప్రాక్టీస్ నెల రోజుల్లో కర్రసాములో మెళకువలు పట్టుపడ్డాయి. మొదట్లో దెబ్బలు తగిలాయి. భుజాలు నొప్పి, ఒళ్లు నొప్పులతో రాత్రి నిద్రపట్టేది కాదు. ఎందుకు మొదలు పెట్టానా అని కూడా అనిపించింది. కానీ మొండిగా ప్రాక్టీస్ చేశాను. అమ్మాయిలందరికీ కర్రసాము వచ్చి ఉండాలి. నేర్చుకున్నంత మాత్రాన ఎప్పుడూ కర్ర వెంట తీసుకెళ్లడం కుదురుతుందా అనుకుంటారు. కానీ ప్రమాదం తరుముకొచ్చినప్పుడు చేతిలో కర్ర లేకపోయినా, ప్రత్యర్థిని మట్టికరిపించే ఒడుపులు ఈ సాధనలో తెలుస్తాయి. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకోగలమనే ధీమా కలిగితే అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం దానంతటదే పుట్టుకొస్తుంది’’ అన్నారు స్వర్ణయాదవ్. ఇక్కడ ఒకమాట చెప్పాలి. ప్రతి మనిషికీ ఒక అండ కావాలి. ఆ అండ బయట ఉండదు. తనలో నిద్రాణంగా ఉన్న ఆత్మవిశ్వాసమే ఆ అండ. అలాగే ప్రతి మనిషీ... ఒక ఆధారాన్ని కోరుకుంటారు. ఆ ఆధారం మరొకరు అయి ఉండకూడదు. తనకు తానే అయి ఉండాలి. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలు... అమ్మాయిల చుట్టూ పరిభ్రమించడానికి ప్రమాదాలు కూడా భయపడతాయి.– వాకా మంజులారెడ్డి -
సీ రామాపురం వద్ద స్వర్ణ జైనమందిరం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతికి సరిగ్గా పది కిలోమీటర్ల దూ రంలో కోట్ల వ్యయంతో నిర్మించిన స్వర్ణ జైన మందిరం రూపుదిద్దుకొంది. సీ రామాపురంలోని శ్రీబ్రహ్మర్షి సిద్దేశ్వర్ గురుదేవ్ ఆశ్రమంలో దీన్ని శోభాయమానంగా నిర్మించారు. శ్రీబ్రహ్మేశ్వ ర్ పార్శ్యనాథ ఆలయంగా దీనికి నామకరణం చేశారు. దక్షిణ భారత దేశంలో తొలి జైన స్వర్ణ మందిరం ఇదేనని ఆశ్రమ ని ర్వాహకులు చెబుతున్నారు. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారి రాజేంద్ర సీ మెహతా దీన్ని నిర్మించారు. రూ.5 కోట్ల అంచనా వ్యయంతో ఆలయాన్ని పాలరాతితో నిర్మించారు. 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయం ఉంది. ప్రస్తుతం దేవాలయం లోపల బంగారు తాపడాలను పూర్తి చేశారు. మ రో రెండేళ్లలో ఆలయం మొత్తం బంగారు లేపనంతో మెరిసిపోనుందని నిర్వాహకులు తెలిపారు. జైనులు పవిత్రంగా పూజించే రిషభ దేవుడి నుంచి మహా వీరుని వరకూ 24 జైన తీర్థంకరుల ప్రతిమలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. జైనుల రెండవ తీర్థంకరుడైన పార్శ్వనాథుని విగ్రహాన్ని ఇక్కడ ప్రముఖంగా ప్రతిష్టించారు. శివుడు, లక్ష్మీనారాయణలను ఒకే చోట పూజించే ఏకైక ఆలయంగా దీన్ని పేర్కొంటున్నారు. రెండు వేల పురాతన చరిత్ర కలిగిన సోంపుర సముదాయానికి చెందిన ఆలయ నిర్మాణ శిల్పుల వంశానికి చెందిన ప్రఖ్యాత శిల్పులు ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో ఆలయ మూలమూర్తి ప్రతిష్ఠ జరుగుతుందని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. శ్రీ సిద్దేశ్వర్ బ్రహ్మర్షి గురుదేవ్, మారుధర్ రత్నశాసన ప్రభావక్ ఆచార్య, రత్నాకర్ సురేశ్వర్‌జీ ఆలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశ్రమ పీఆర్ఓ డీవీ హరీశ్ తెలిపారు. -
స్వర్ణకు సలామ్
పెనుమంట్ర (ఆచంట): పెనుమంట్ర మండలం మార్టేరులో రూపుదిద్దుకుని రైతులకు సిరులు కురిపిస్తున్న స్వర్ణ రకం వరి వంగడం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హరిత విప్లవం ద్వారా దేశంలో ఆహార భద్రతకు దోహదపడిన వరి వంగడాలపై ఇటీవల ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా 1980 దశకం ముందు నుంచి అధిక దిగుబడిని, రైతులకు పంట భరోసాను ఇచ్చిన మార్టేరు స్వర్ణ రకం కేంద్ర ప్రభుత్వ అధికారుల లెక్కల్లో అగ్రగామిగా నిలిచింది. మొత్తంగా 1980కి ముందు నుంచి రైతునేస్తాలుగా గుర్తింపు పొందిన 51 రకాల విత్తనాలను జాతీయ స్థాయిలో ప్రముఖమైనవిగా అధికారులు గుర్తించారు. వీటిలో వరికి సంబం«ధించి స్వర్ణతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలోనే రూపుదిద్దుకున్న ‘మసూరి’ వంగడం కూడా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ జాబితాలో మొక్కజొన్నలో డీహెచ్ఎం 101 రకం కూడా ఉంది. ల్యాండ్‌మార్కు రకంగా.. న్యూఢిల్లీలో 1941లో ఏర్పాౖటెన బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ సంస్థ దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచిన ప్రముఖ విత్తన రకాలపై పరిశోధన చేస్తోంది. సంస్థను నెలకొల్పి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ, మసూరి రకాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ‘ల్యాండ్‌మార్కు’ రకాలుగా బ్రీడర్స్ ఇండియన్ సొసైటీ గుర్తించింది. ఢిల్లీలో అవార్డు ప్రధానం జాతీయస్థాయిలో స్వర్ణ రకం గుర్తింపు పొందిన క్రమంలో మార్టేరు వరిపరిశోధనా స్థానంకు పురస్కారం దక్కింది. ఢిలీల్లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రాంగణంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఆర్ఎస్ పరోడ, డాక్టర్ గురుగోవింద్ కుష్, డాక్టర్ పీఎల్ గౌతమ్, డాక్టర్ జీఎస్ సంధు, డాక్టర్ వీఎల్ చోప్రా చేతుల మీదుగా మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రధాన డైరెక్టర్ డాక్టర్ పీవీ సత్యనారాయణ పురస్కారం అందుకున్నారు. మా సంస్థకు గర్వకారణం దేశంతో పాటు విదేశాల్లోనూ స్వర్ణ రకం సాగులో ఉండటం మా సంస్థకు గర్వకారణం. మార్టేరులో ఈ రకాన్ని సృష్టించిన శాస్త్రవేత్తలకు ప్రజలు, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి స్ఫూర్తితో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలను, పెట్టుబడి తగ్గించి చేయగల విత్తనాలను, మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణమైన వంగడాల తయారీకి శాస్త్రవేత్తలతో కలిసి నిరంతరం కృషి చేస్తున్నాం. – డాక్టర్ పీవీ సత్యనారాయణ, వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్, మార్టేరు -
ఎంపీ బాల్క సుమన్ సోదరి వివాహానికి హాజరైన సీఎం
మెట్పల్లి: కరీంనగర్ జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్స్‌లో బుధవారం జరిగిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సోదరి స్వర్ణ-శ్రీకాంత్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరై ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సీఎం తన సతీమణి శోభ, కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితతో కలసి మెట్పల్లి వచ్చారు. ఈ వివాహానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్, ఎంపీలు వినోద్‌కుమార్, కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సింగరేణి సీఎండీ శ్రీధర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.