రవికిరణ్ దంపతులకు ప్రసాదాలను అందజేస్తున్న ట్రస్టీలు రవి, గాయత్రి
సాక్షి, అరసవల్లి: ‘‘శ్రీకాకుళమే నా సొంతూరు..హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉంటూ పదో తరగతి వరకు టీపీఎం ఉన్నత పాఠశాలలోనే చదివాను’’అని సినీ, బుల్లితెర ఆర్టిస్ట్ ఎం.రవికిరణ్ చెప్పారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని భార్య సుష్మ, కుమారుడు ప్రభంజన్‌లతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడి వాడినే కాబట్టి.. సినిమాల్లో శ్రీకాకుళం యాస గొప్పతనాన్ని చూపిస్తున్నానన్నారు. భార్య సుష్మ కూడా ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో నటించి.. తర్వాత కథలో రాజకుమారి, గుండమ్మ కథ తదితర బుల్లితెర సీరియళ్లలో నటిస్తోందన్నారు. తాను కూడా స్నేహితుడా సినిమాలో, సుమారు 35 సీరియళ్లలో నటించానని వివరించారు. ప్రస్తుతం చిన్నకోడలు, అభిషేకం సీరియళ్లలో సీరియల్స్‌లో నటిస్తున్నట్టు పేర్కొన్నారు.
సుష్మాకిరణ్ పేరుతో వెబ్ సిరీస్‌ను త్వరలోనే ప్రారంభించనున్నామని, ఇందులో ముందుగా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని చూపించాలని నిర్ణయించుకున్నామన్నారు. తొలుత వీరికి ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, యామిజాల గాయత్రి, మండల మన్మథరావు తదితరులు ప్రత్యేక దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment