భారీ ప్రాజెక్ట్‌లో గోపిచంద్.. డైరెక్టర్‌గా ఎవరంటే? | Tollwyood Hero Tottempudi Gopichand Latest Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

Tottempudi Gopichand: భారీ ప్రాజెక్ట్‌లో గోపిచంద్.. డైరెక్టర్‌గా ఎవరంటే?

Published Mon, Mar 10 2025 2:54 PM | Last Updated on Mon, Mar 10 2025 2:54 PM

Tollwyood Hero Tottempudi Gopichand Latest Movie Pooja Ceremony

టాలీవుడ్ హీరో గోపీచంద్ ఈ ఏడాదిలో కొత్త సినిమా చేసేందుకు రెడీ ‍అయ్యాడు. గతేడాది విశ్వం, భీమా చిత్రాలతో మెప్పించిన గోపిచంద్‌ కొత్త ఏడాదిలో ప్రాజెక్ట్‌ ప్రకటించారు. అతని కెరీర్‌లో 33వ చిత్రంగా నిలవనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను గోపీచంద్‌ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.

ఈ సినిమాకు సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఐబీ 71, ఘాజీ వంటి చిత్రాలతో సంకల్ప్‌ రెడ్డి ఫేమస్ అ‍య్యారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై  శ్రీనివాస చిట్టూలి మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇదివరకెన్నడు చూడని పాత్రలో గోపిచంద్‌ కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దాదాపు 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక సిబ్బంది వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement