ravi kiran
-
ఇంటూరి రవికిరణ్ పై కొనసాగుతున్న ప్రభుత్వ వేధింపులు
-
ఇంటూరి రవికిరణ్ ను మరోసారి అరెస్ట్ చేసిన పోలీసులు
-
నా భర్తకు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టు
-
స్టార్ హీరోయిన్స్ జపం చేస్తున్న ‘రౌడీ’
ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ సినిమాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించడం ట్రెండ్‌గా మారింది. గతేడాది రిలీజ్ అయిన ఖుషీ నుంచి ఇదే ట్రెండ్ రిపీట్ అవుతోంది. ఆ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత నటించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఫ్యామిలీ స్టార్‌లో కూడా మరో స్టార్ హీరోయిన్ మృణాలు ఠాకూర్ మెరిసింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా విజయ్ స్టార్ హీరోయిన్ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నాడు. తన తదుపరి చిత్రంలో కూడా స్టార్ హీరోయిన్ నటించబోతుందట. ఆమె మరెవరో కాదు లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి. నిజానికి విజయ్, సాయిపల్లవి కాంబినేషన్లో సినిమా రావాలని టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ జోడికి దగ్గ కథ లేకపోవడం ఇన్నాళ్లు కలిసి నటించలేదు. తాజాగా యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కొల్లా ఓ అందమైన ప్రేమ కథతో వీరిద్దరిని కలిశాడు. స్టోరీ నచ్చడంతో కలిసి నటించేందుకు ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ చిత్రంతో అయినా విజయ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. -
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
-
రూరల్ యాక్షన్‌కి సై
హీరో విజయ్ దేవరకొండ అంటే సిటీ బ్యాక్‌డ్రాప్ కథలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలని ఓ రూరల్ యాక్షన్ డ్రామా మూవీ సైన్ చేశారు. ఈ సినిమా కోసం సిటీ నుంచి విలేజ్‌కి వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. అక్కడే ఫుల్ యాక్షన్ చేయనున్నారు.ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ నిరూపించుకున్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. -
చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పడికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం
-
చంద్రబాబు భద్రతపై ఎలాంటి అనుమానాలు లేవు: జైళ్ల శాఖ డీఐజీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలులో చంద్రబాబు నాయుడు భద్రతపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నిజం కాదని తేలిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో ఎంతో కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, డీఐజీ రవికిరణ్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జైలు లోపల చంద్రబాబుకు భద్రత కట్టుదిట్టంగానే ఉంది. మొదటి నుంచి 24 గంటలు సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. అడిషనల్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పుటికప్పుడు సెక్యూరిటీ వాచ్ చేస్తున్నాం. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేక నిజం కాదని తేలింది. చంద్రబాబు జైలుకు వచ్చినప్పటి నుంచి ప్రతీ వారం సెక్యూరిటీ పరిశీలిస్తూనే ఉన్నాం. శ్రీనివాస్ చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో లోపలికి వచ్చాడు. అతని జేబులో బటన్ కెమెరా దొరికింది. వెంటనే దాన్ని గుర్తించి పోలీసులకు అందజేశాం. బటన్ కెమెరాను అతను జైలు లోపలికి తీసుకు వెళ్లలేదు. అందులో జైలుకు సంబంధించిన సమాచారం ఏమీ లేదు. అతని కుటుంబ సమాచారం మాత్రమే ఉంది. మా జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్లు ఉన్నాయి. ఈనెల 23వ తేదీన డ్రోన్ కెమెరా తిరిగినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే సమాచారం పోలీసులకు తెలియజేశాం. పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు రావడం నిజం కాదు. జైలు లోపలికి గంజాయి ప్యాకెట్లు విసిరారు అనడం వాస్తవం కాదు. గంట గంటకు జైలు చుట్టూ పెట్రోలింగ్ జరుగుతూనే ఉంది. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఫోటో తీశారు అనడంలో వాస్తవం లేదు. చంద్రబాబు కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులను సంప్రదించాము. వారు పరీక్షలు నిర్వహించారు. ఇమ్మెచ్యూర్ కేటరాక్ట్ ఉన్నట్టు గుర్తించారు. కొంత సమయం తర్వాత చేయవచ్చని వైద్యులు సూచించారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి మేము ఎటువంటి తప్పుడు రిపోర్టు బయటికి ఇవ్వటం లేదు. పూర్తి వివరాలు కోర్టుకు పంపుతున్నాం. జైల్లో భద్రతకు సంబంధించి స్నేహబ్యారక్‌లో చంద్రబాబును ఏ రూమ్‌లో ఉంచామన్న విషయం బయటకు వెల్లడించాము. జైల్లో చంద్రబాబును ఫోటో తీసిన వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసాము. విచారణ చేస్తున్నాము. చంద్రబాబు భద్రతకు సంబంధించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. చంద్రబాబు తనకు గతంలో ఉన్న ఎలర్జీల గురించి వైద్యులకు చెప్పారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులకి రెండు లెటర్లు రాశాము. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యున్ని సంప్రదించి ఎటువంటి చికిత్స అవసరమవుతుందో సజెషన్స్ ఇవ్వమని భువనేశ్వరికి కూడా తెలియజేశాము. ఇదే విషయాన్ని కోర్టు కూడా తెలిపినట్టు చెప్పారు. -
బాబు ఆరోగ్యం బాగుంది
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. ఆయన వైద్య పరీక్షలకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై జీజీహెచ్ వైద్య బృందం, జిల్లా ఎస్పీ పి.జగదీష్ లతో డీఐజీ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు 67 కిలోల బరువు ఉన్నారన్నారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. జీజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్కండేయులు, డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతాదేవి, డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.హిమజ బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించిందని వెల్లడించారు. స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు.. ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి అన్నీ బాగున్నాయని చెప్పారు. తమతో ఆయన బాగా మాట్లాడారన్నారు. అన్ని విషయాలు అడిగామన్నారు. షుగర్ కూడా అదుపులోనే ఉందని తెలిపారు. చంద్రబాబు వాడుతున్న మందులను కూడా పరిశీలించామన్నారు. శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. వాటికి ఆయన వాడుతున్న మందులతో పాటు తాము కొన్ని రకాల మందులు ఇచ్చామని వివరించారు. స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్న మాట పూర్తిగా అసత్యమన్నారు. శరీరంపై ఉన్న దద్దుర్ల దృష్ట్యా చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని చెప్పారు. జీజీహెచ్‌లో చంద్రబాబుకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక గది ఏర్పాటు చేయలేదన్నారు. నిత్యం జీజీహెచ్‌లో ఒక ప్రత్యేక గది ఉంటుందని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీఐజీ రవికిరణ్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు జైళ్ల శాఖలో ఖైదీలకు ఏసీ ఏర్పాటు చేయలేదన్నారు. కాబట్టి తాము ఏసీని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. జైలు లోపల 85 ఏళ్ల వృద్ధ ఖైదీ కూడా ఉన్నారన్నారు. జైలు లోపల ఉన్న అందరినీ జాగ్రత్తగా చూస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రత్యేక ఖైదీ అయినందున మరింత శ్రద్ధ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జైలులో జరుగుతున్న ప్రతి విషయాన్ని కోర్టుకు నివేదిస్తున్నామని వివరించారు. రిపోర్టును బయట ఎవరికీ ఇవ్వలేదు.. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టును జీజీహెచ్ వైద్య బృందం తమకు అందించిందని డీఐజీ రవికిరణ్ చెప్పారు. ఆ రిపోర్టును తాము బయట ఎవరికీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు తరఫున వచ్చిన లాయర్లు ఇవ్వాలని అడిగితే ఆయన అనుమతి తీసుకుని, సంతకం చేయించుకుని రిపోర్టును లాయర్లకు అందజేశామని తెలిపారు. అందులో ఒక లైనును జైలు అధికారులు బ్లాక్ మార్కర్‌తో కనిపించకుండా చేశారన్న వార్తలు పూర్తిగా అవాస్తమన్నారు. ఆ లెటర్‌పై బ్లాక్ మార్కు చేసి ఎవరు వైరల్ చేస్తున్నారో తమకు తెలియదని చెప్పారు. కాగా తమ పట్ల డీఐజీ దురుసుగా ప్రవర్తించారని లోకేశ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ములాఖత్ సమయం ముగిసిందని.. నిబంధనల ప్రకారం మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రమే చెప్పానన్నారు. చంద్రబాబును కలిసిన లోకేశ్ చంద్రబాబును ఆయన తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్‌లో కలిశారు. శనివారం మధ్యాహ్నం 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్ అనంతరం వారు జైలు నుంచి నేరుగా వారు ఉంటున్న క్యాంప్‌కు వెళ్లారు. కాగా ములాఖత్‌లో లోకేశ్ డీఐజీ రవికిరణ్‌తో వాగ్వాదానికి దిగారని సమాచారం. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును వైద్యులు సూచించిన మేరకు చల్లటి వాతావరణంలో ఎందుకు ఉంచడం లేదని నిలదీసినట్టు తెలిసింది. -
జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై నారా కుటుంబం, టీడీపీ నేతల అబద్దాలు
-
బాబు జైల్లో అడుగు పెట్టినప్పుడు 66 కేజీలు ఉన్నారు: డీఐజీ
-
బాబు ప్రస్తుతం 67 కేజీలకు చేరుకున్నారు: డీఐజీ
-
బాబు భద్రతపై మరింత శ్రద్ధ
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు భద్రతపై జైలు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కోస్తాంధ్ర జైళ్ల డీజీ రవికిరణ్ బుధవారం సుమారు గంటపాటు జైల్లో తనిఖీలు చేశారు. బాబుకు కేటాయించిన స్నేహ బ్లాక్‌తో పాటు భద్రతను పరిశీలించారు. జైలు అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ వద్ద సీసీటీవీ కెమెరాలతో భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆర్మ్డ్ సిబ్బంది చంద్రబాబు వైపు ఎవరూ వెళ్లకుండా పహారా కాస్తున్నారు. బాబు సుముఖత వ్యక్తం చేస్తేనే ములాఖత్‌కు అనుమతిస్తున్నారు. ఎలా ముందుకెళ్దాం..! స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బుధవారం సెంట్రల్ జైలులో ఆయన్ని కలిశారు. విజయవాడ నుంచి వచ్చిన ఆయన తొలుత లోకేశ్‌తో మాట్లాడి అనంతరం జైల్లో చంద్రబాబును కలిశారు. సుమారు 40 నిమిషాలు వారు కేసు గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం జైలు బయటకు వచ్చిన లూథ్రా మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. లోకేశ్‌కు రజనీకాంత్ ఫోన్.. చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు సినీ నటుడు రజనీకాంత్ ఫోన్ చేసి.. కేసు గురించి వాకబు చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో లోకేశ్, భువనేశ్వరి బుధవారం రాజమహేంద్రవరంలో భేటీ అయ్యారు. మూడో రోజూ గడిచిందిలా.. చంద్రబాబు జైలు జీవితం గత రెండు రోజుల మాదిరిగానే మూడో రోజు కూడా సాగింది. తెల్లవారుజామున నిద్ర లేచిన చంద్రబాబు యోగా, వాకింగ్ చేసిన అనంతరం బ్లాక్ కాఫీ, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్‌తో అల్పాహారం తీసుకున్నారు. మధ్యాహ్నం అన్నం, రెండు కూరలతో.. రాత్రికి అన్నం, పుల్కా, కూరతో భోజనం చేసినట్లు తెలిసింది. -
Tarakasura: తెలుగులో మరో కన్నడ సంచలనం
కన్నడలో సంచలన విజయం సాధించిన ‘తారకాసుర’ చిత్రం అదే పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీజా మూవీస్ పతాకంపై ‘విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం’ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. రవికిరణ్ - మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేని సపని ముఖ్యపాత్ర పోషించడం విశేషం. "పద్మశ్రీ" ఫేమ్ చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరోహీరోయిన్లుగా... శాంసన్ యోహాన్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్సకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలో తెలుగులో రానున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి, విలన్ పాత్రధారి శాంసన్ యోహాన్, సెకండ్ హీరోయిన్ తృప్తి శుక్లా, సెకండ్ హీరో పద్మశ్రీ ఫేమ్ చక్రవర్తి పాల్గొనగా... ప్రముఖ దర్శకులు నగేష్ నారదాసి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, పద్మిని నాగులపల్లి ముఖ్య అతిధులుగా హాజరై... కన్నడలో ఘన విజయం సాధించిన "తారకాసుర" చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించాలని అభిలషించారు. శ్రీజా మూవీస్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ... ‘తెలుగులో ’తారకాసుర’ చిత్రానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. అందుకోసం షూటింగ్ కూడా చేస్తున్నాం. మా బ్యానర్ నుంచి త్వరలో ఒక స్ట్రయిట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాం" అన్నారు. -
‘రెచ్చిపోదాం బ్రదర్’మూవీ రివ్యూ
టైటిల్ : రెచ్చిపోదాం బ్రదర్ నటీనటులు :అతుల్ కులకర్ణి,రవికిరణ్, దీపాలి శర్మ,భానుశ్రీ,శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ, బెనర్జీ, అజయ్‌గోష్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్ తదితరులు నిర్మాణ సంస్థలు :ప్రచోదయ ఫిలిమ్స్ నిర్మాత: హనీష్ బాబు ఉయ్యూరు, వివి లక్ష్మీ దర్శకత్వం: ఏ. కె. జంపన్న సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: శ్యాం.కె. నాయుడు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: జులై 29, 2022 కథేంటంటే.. చంద్రమౌళి(బాను చందర్) ఓ జవాన్. బార్డర్లో ఉగ్రవాదుల చేసిన దాడిలో వీరమరణం పొందుతాడు. అతని కొడుకు అభి(రవికిరణ్) చిన్నప్పటి నుంచి జర్నలిస్ట్ కావాలని కోరిక ఉంటుంది. జవాన్ బార్డర్ లో గన్ను పట్టుకుని ఉగ్రవాదులను మట్టుపెడుతూ దేశాన్ని కాపాడితే జర్నలిస్ట్ పెన్ను పట్టుకుని దేశంలో అవినీతి జరగకుండా దేశాన్ని కాపాడుతాడనేది అతని ఉద్దేశం. అనుకున్నట్లే జర్నలిస్ట్ అవుతాడు. అభికి కెమెరామెన్‌గా భానుశ్రీ ఉంటుంది. టీవీ చానల్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే భరణి స్పోర్ట్స్ అకాడమీ పెట్టి ఎందరినో ఛాంపియన్స్ గా తయారు చేస్తున్న నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన భరణి (అతుల్ కులకర్ణి )ని ఇంటర్వ్యూ చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. అభి పనితనం మెచ్చిన ఆ చానల్ సీఈఓ కృష్ణ ప్రసాద్ (కోటేశ్వరరావు ), ఎండీ బాబురావ్ (బెనర్జీ) అతన్ని రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలతకు పంపుతారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి చేసే మోసాలను కవరేజ్ చేసి చానల్ ఇస్తే.. సీఈఓ, ఎండీ వాటిని ప్రసారం చేయకుండా.. మంత్రిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఇది నచ్చక అభి చానల్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ చానల్ పెట్టుకొని సమాజానికి ఉపయోగపడే వారిని ఇంటర్యూలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. ఓ సారి తన తోటి జర్నలిస్ట్‌కు చిన్న దెబ్బతగిలితే ఆస్పత్రికి తీసుకెళ్తాడు. అయితే ఆయన అనూహ్యంగా చనిపోయాడని వైద్యులు చెప్తారు. చిన్న దెబ్బకే ఎలా చనిపోతాడని అభి ఎంక్వయిరీ చేయగా.. షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆ నమ్మలేని నిజాలు ఏంటి? ఆ మోసం వేనుక ఉన్న గ్యాంగ్ లీడర్ ఎవరు? వ్యవసాయ మంత్రి చేసిన మోసాలు ఏంటి? నిజాయితీ గల జర్నలిస్ట్‌గా అభి వాటిని ఎలా బయటపెట్టాడు? అసలైన జర్నలిస్ట్ గా పని చేస్తే సమాజంలో ఎలాంటి మార్పు వచ్చింది అనేది తెలియాలంటే ‘రెచ్చిపోదాం బ్రదర్’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నిజాయితీగల జర్నలిస్ట్ అభి పాత్రలో(రవికిరణ్) మంచి నటనను కనబరిచాడు. అతనికి ఇది తొలి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. విలన్ భరణిగా అతుల్ కులకర్ణి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు. మంచి ముసుగులో మోసాలకు పాల్పడే పాత్ర తనది. నకిలీ విత్తనాలు ఇస్తూ రైతులను మోసం చేసే వ్యవసాయమంత్రి పాత్రలో అజయ్‌గోష్ మరోసారి తన అనుభవాన్ని తెరపైచూపించాడు.కెమెరామెన్‌గా దీపాలి శర్మ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. తను న్యాచురల్ గా చాలా బాగా నటించింది. రైతుగా శివాజీరాజా చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు . పోలీస్ ఆఫీసర్ గా పోసాని,హీరో కు ఫ్రెండ్ గా శశాంక్, హీరో కు ఫాదర్ గా భానుచందర్, టీవీ చానల్ సీఈఓ, ఎండీగా కోటేశ్వరరావు, బెనర్జీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ఒక దేశానికి ఆర్మీ ఎంత పవర్ఫుల్లో.. మనం ఉండే సొసైటీ లో ఒక రిపోర్టర్ కూడా అంతే పవర్ ఫుల్ అంటూ మంచి ఎమోషన్స్‌తో కూడుకున్న వైవిధ్యభరితమైన కథ ‘రెచ్చిపోదాం బ్రదర్’. ఒక నిజాయితీ గల పోలీస్, జర్నలిస్ట్ తలచుకొంటే సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి అని చాలా చక్కగా చెప్పారు దర్శకుడు జంపన్న.దీంతో పాటు దేశానికి రైతు ఎంత ముఖ్యమో.. వారు పడే కష్టాలు ఏంటో తెలియజేస్తూ.. సమాజం పట్ల మనకు ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశాడు. నేటి యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో పాటు డైలాగ్స్ పుష్కళంగా ఉన్నప్పటికీ.. కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం అందరిని ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా రైతులు పడే కష్టాలు, ప్రస్తుతం వారి పరిస్థితులను తెరపై చక్కగా చూపించాడు. ఇక సాంగేకిత విషయానికొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం సాయి కార్తీక్ సంగీతం. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. శ్యాం.కె. నాయుడు కెమెరా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ..కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. స్టార్ ను నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాకు వస్తే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. -
విశ్వక్ సేన్ గురించి చెప్పగానే షాకయ్యా!
Ravikiran About Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఇందులో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించిన రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘రాజావారు రాణివారు’ సినిమాకు దర్శకత్వం వహించిన నేను ఇప్పుడు ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాకు షో రన్నర్‌గా వర్క్ చేశాను. సాధారణంగా వెబ్ సిరీస్‌లకు షో రన్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఈ సినిమాకు షో రన్నర్ అనేది వస్తోంది. షో రన్నర్ అంటే క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ. నేను దర్శకుడిగా చేసిన ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి విద్యాసాగర్ కెమెరామేన్‌గా చేశాడు. లాక్డౌన్లో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కథను విశ్వక్ సేన్‌కు చెప్పడం జరిగింది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని ప్రేమ్ అనే వ్యక్తి ఈ సినిమాకు దర్శకుడిగా చేయాల్సింది కానీ అతని వ్యక్తిగత కారణాల వల్ల కుదర్లేదు. దీంతో విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. విద్యాసాగర్‌లో మంచి దర్శకుడు ఉన్నాడని ‘రాజావారు రాణిగారు’ టైమ్‌లోనే నాకు తెలిసింది. దీంతో ఆయనకు దర్శకత్వ బాధ్యతలను ఇవ్వడం జరిగింది. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నేను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్వారితో ఓ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో బిజీగా ఉండటం వల్లే నేను ‘అశోకవనంలో....’ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా చాలామంది పేర్లను అనుకున్నాం. కానీ విశ్వక్ సేన్ పేరుని విద్యాసాగరే చెప్పాడు. ఒక్క క్షణం షాకయ్యాను. ఎందుకంటే ఇప్పటివరకు మెజారిటీ చిత్రాల్లో మాస్ పాత్రలే చేసిన విశ్వక్ సేన్‌ది ఈ చిత్రంలో కాస్త భిన్నమైన పాత్ర. పెళ్లి కాని 33 ఏళ్ల అల్లం అర్జున్ కుమార్‌గా బాగా నటించారు. చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. అల్లం అర్జున్‌కుమార్ పెళ్లి, అతని జీవితం నేపథ్యంలోనే కథ సాగుతుంది. సినిమాలో ఆంధ్రా అమ్మాయి, తెలంగాణ అబ్బాయిల పెళ్లి అన్నట్లుగా ఉంటుంది. సో.. సంస్కృతి, సంప్రదాయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. లవ్, లైఫ్, మ్యారేజ్ అనే అంశాలను ప్రస్తావిస్తూనే కాస్త కొత్తగా, సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్లో నేను చేస్తున్న పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ కాకుండా, ఓ అడ్వెంచర్ కథ నా దగ్గర ఉంది. నా తర్వాతి సినిమాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చెబుతాను’’ అని రవికిరణ్ అన్నారు. చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు -
ఓటీటీలోకి ‘రాంగ్ స్వైప్’
డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో 'మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్ పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశ భరిత వినోదాత్మక చిత్రం ‘రాంగ్ స్వైప్’. క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే... ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ నవంబర్ 1న ఓటీటీ ‘ఊర్వశి’లో విడుదల కానుంది. స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్... సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు... ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ... ‘లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానే అయి ముందుండి నడిపించారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన ‘రాంగ్ స్వైప్’ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు’అన్నారు. -
ఇక్కడి యాస గొప్పతనాన్ని చూపిస్తున్నా: టీవీ నటుడు
సాక్షి, అరసవల్లి: ‘‘శ్రీకాకుళమే నా సొంతూరు..హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉంటూ పదో తరగతి వరకు టీపీఎం ఉన్నత పాఠశాలలోనే చదివాను’’అని సినీ, బుల్లితెర ఆర్టిస్ట్ ఎం.రవికిరణ్ చెప్పారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని భార్య సుష్మ, కుమారుడు ప్రభంజన్లతో కలిసి సోమవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడి వాడినే కాబట్టి.. సినిమాల్లో శ్రీకాకుళం యాస గొప్పతనాన్ని చూపిస్తున్నానన్నారు. భార్య సుష్మ కూడా ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో నటించి.. తర్వాత కథలో రాజకుమారి, గుండమ్మ కథ తదితర బుల్లితెర సీరియళ్లలో నటిస్తోందన్నారు. తాను కూడా స్నేహితుడా సినిమాలో, సుమారు 35 సీరియళ్లలో నటించానని వివరించారు. ప్రస్తుతం చిన్నకోడలు, అభిషేకం సీరియళ్లలో సీరియల్స్‌లో నటిస్తున్నట్టు పేర్కొన్నారు. సుష్మాకిరణ్ పేరుతో వెబ్ సిరీస్‌ను త్వరలోనే ప్రారంభించనున్నామని, ఇందులో ముందుగా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని చూపించాలని నిర్ణయించుకున్నామన్నారు. తొలుత వీరికి ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, యామిజాల గాయత్రి, మండల మన్మథరావు తదితరులు ప్రత్యేక దర్శనం చేయించి ప్రసాదాలను అందజేశారు. చదవండి: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’ -
వైద్య వృత్తిని వదిలి డీఎస్పీగా..
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఆయన ఒక డాక్టర్.. గిరిజనుల సమస్యలకు చలించిపోయారు.. వైద్యవృత్తిని నిర్వహిస్తూనే వారి సమస్యల పరిష్కారానికి కృషిచేశారు.. ఈ సమయంలో గిరిజనులు చూపించిన ఆప్యాయతతో వైద్య వృత్తి నుంచి అడ్మినిస్ట్రేటివ్ వైపు మరిలారు.. పాలనా విభాగంలో ఉంటే మరిన్ని సమస్యలు పరిష్కరించవచ్చనే తలంపుతో గ్రూప్–1 రాసి డీఎస్పీగా ఎంపికయ్యారు. తన ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు. వైద్యుడిగా పేర్గాంచి.. జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బి.రవికిరణ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన డీఎస్పీగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకుని తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు. వృత్తిరీత్యా ఈయన డాక్టర్. 2002–2008లో ఎంబీబీఎస్ పూర్తి చేసి 2010లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రిలో విధుల్లో చేరారు. అక్కడ 2014 వరకు విధులు నిర్వహించి, తర్వాత అదే జిల్లా అక్కులపేట పీహెచ్‌కీ బదిలీ అయ్యారు. వైద్యాధికారిగా పీహెచ్‌సీని ఆధునీకరించారు. కార్పొరేట్ ఆస్పత్రి స్థాయిలో పీహెచ్‌సీని మార్పు చేసి వైద్య సేవలు అందించారు. 2016, 2017లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఆస్పత్రి, ఉత్త వైద్యులుగా రవికిరణ్ పురస్కారాలు అందుకున్నారు. 2017, 2018లో విశాఖలో పనిచేశారు. బీజం పడిందిలా.. రవికిరణ్ అక్కులపేట పీహెచ్సీలో పనిచేస్తుండగా గిరిజనుల సమస్యలు గుర్తించారు. అల్లిపల్లిగూడెం గిరిజనులు, గిరిజనే తరులు మధ్య భూవివాదాలు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేశారు. అప్పుడే ఆయనకు అడ్మినిస్ట్రేటర్ కావాలనే ఆలోచన వచ్చింది. 2016లో గ్రూప్–1కు రాయగా 2017 ఫలితాలు వచ్చాయి. రవికిరణ్ 12వ ర్యాంకు సాధించారు. దీంతో ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్‌గా జంగారెడ్డిగూడెం వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యం సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయం అని డీఎస్పీ రవికిరణ్ అన్నారు. తాను చేపట్టాల్సిన పనులపై విజన్ ఉందని, ప్రధానంగా సైబర్, ఆర్థిక నేరాలు, బాలలు, స్త్రీల వేధింపుల కేసులపై దృష్టి, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో సబ్‌డివిజన్‌లో శాంతిభద్రత పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామన్నారు. యువతను సామాజిక సేవ, క్రీడలు, సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెట్టేలా అవగాహన కల్పిస్తామన్నారు. సీఎం పిస్టల్ అందుకుంటూ.. డీఎస్పీగా ఎంపికైన రవికిరణ్ 2018లో అనంతపురంలో శిక్షణ పొందారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సీఎం పిస్టల్ అవార్డును అందుకున్నారు. శిక్షణలో ఆల్‌రౌండర్‌గా నిలిచి హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా పురస్కారం పొందారు. అథ్లెటిక్స్‌లో రాణించి.. శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన రవికిరణ్ తండ్రి రాధాకృష్ణ, తల్లి విజయకుమారి. ఆయన భార్య విశాఖలోని మెప్మా జిల్లా మిషన్ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. రవికిరణ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రవికిరణ్ ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో అథ్లెటిక్స్‌లో రాణించారు. లాంగ్ జంప్, హైజంప్, పరుగు పోటీల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో 73 వరకు పతకాలు సాధించారు. మొత్తంగా 126 వరకు ఆయన పతకాలు పొందారు. -
నవ్వులతో రెచ్చిపోదాం
రవికిరణ్.వి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఏ.కె. జంపన్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. ప్రచోదయ ఫిలిమ్స్ పతాకంపై వి.వి లక్ష్మీ, హనీష్ బాబు ఉయ్యూరు నిర్మిస్తున్నారు. జంపన్న మాట్లాడుతూ – ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. మంచి భావోద్వేగాలతో కూడుకున్న వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిస్తున్నాం. సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉంది. సాయి కార్తీక్ సంగీతం, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘నేటి వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే చిత్రమిది. ఈ చిత్రంలో పాటలు చాలా ట్రెండీగా, కొత్తగా ఉంటాయి’’ అన్నారు రవికిరణ్. ‘‘ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. యువతను ఆలోచింపజేస్తూనే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదంతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు హనీష్ బాబు. దీపాలి శర్మ, శివాజీరాజా, పోసాని, శశాంక్, భానుచందర్, ఇంద్రజ తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
రాముడు లంకకు వెళ్లొస్తే...
పురాణాల్లో రావణుడు సీతని అపహరిస్తే ఆంజనేయుడు తొలుత లంకకి వెళ్లొచ్చాడు. రాముడే మొదటగా వెళ్లుంటే? అనే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బడిదొంగ’. మహేష్ సూర్య సిద్దగోని హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. బేబి శ్రీనిత్య సమర్పణలో సన్ మీడియా కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రంలో ఇషిక వర్మ, రవికిరణ్ ఇతర కీలకపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా లోగోని వ్యాపార వేత్తలు రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. మహేష్ సూర్య మాట్లాడుతూ– ‘‘22 ఏళ్లుగా మీడియా, సినీ రంగాల్లో కొనసాగుతున్నాను. పలు యాడ్ ఫిల్మ్స్ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా రూపొందనున్న చిత్రమిది. మూడేళ్ల పాటు ఈ కథపై పని చేశాను. హైదరాబాద్, యాదగిరిగుట్ట పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ‘‘గోవిందుడు అందరివాడేలే, రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల్లో నటించాను. హీరోయిన్గా ఇదే తొలిచిత్రం’’ అన్నారు ఇషిక వర్మ. నటుడు రవి కిరణ్, సంగీత దర్శకుడు రాజా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజా, కెమెరా: వంశీ, సహనిర్మాతలు: రామ్ వశిష్ట, శ్రీనిత్య, హర్ష వర్ధన్, టి.మల్లికార్జున్ రావ్, జగదీశ్. -
జైలు నుంచి విడుదలైన రవికిరణ్, రవీంద్ర
ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ధ్వజం సీతమ్మధార (విశాఖ ఉత్తరం): ముఖ్యమంత్రి చంద్రబాబు, తనయుడు లోకేశ్ ఆదేశాల మేరకే తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనని పొలిటికల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిరణ్, దరువు వెబ్ పోర్టల్ ప్రతినిధి ఇప్పాల రవీంద్ర మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే ఆరోపణపై వీరిని ఇటీవల అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైలుకు పంపిన విషయం తెలిసిందే. వీరు బుధవారం ఉదయం జైలు నుంచి బెయిలు మీద విడుదలయ్యారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. రవికిరణ్ మాట్లాడుతూ టీడీపీ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు కక్ష సాధింపుగా అరెస్ట్ చేసి హింసలు పెట్టారని, ఎమ్మెల్యే అనితను దూషించినట్లు గత నెలలో విశాఖలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. మళ్లీ పీటీ వారెంట్‌పై తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలుకు తీసుకెళ్లారని, ఆరు రోజులు రాత్రి పూట 8 నుంచి 2 గంటల వరకు కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ గుంటూరు నుంచి విశాఖ జైలుకు తీసుకొచ్చారన్నారు. లోకేశ్ అనేక సందర్భాల్లో నోరు జారిన వీడియోలనే పోస్టు చేశాను తప్ప తానేమీ కొత్తగా సృష్టించలేదన్నారు. తనకు తన కుటుంబానికి ఏం జరిగినా చంద్రబాబు, లోకేశ్‌లదే బాధ్యత అన్నారు. ఇప్పాల రవీంద్ర మాట్లాడుతూ, అన్యాయాలను, వాస్తవాలను, ప్రభుత్వ తప్పుడు విధానాలను సోషల్ మీడియోలో పోస్టు చేయడం తప్పా? అని ప్రశ్నించారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వం వైఫల్యాలను, దౌర్జన్యాలను, అరాచకాలను సోషల్ మీడియా ద్వారా ప్రాణమున్నంత వరకు ఎండగడతామని స్పష్టం చేశారు. -
చట్టాలు సామాన్యులపై ప్రయోగించడానికేనా?
‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్ భార్య సుజన సూటిప్రశ్న సాక్షి, విశాఖపట్నం: ‘‘దళితునిగా పుట్టాలని ఎవరు అనుకుంటారని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అన్నారు. అప్పుడు గుర్తుకు రాని చట్టాలు మాలాం టి సామాన్యులపై ప్రయోగించడం ఎంత వరకు న్యాయం. మా బతుకు మేం బతు కుతున్నా..మాపై కక్ష సాధిస్తున్నారు’’ అని ‘పొలిటికల్ పంచ్.ఇన్ఫో’ ఫేస్బుక్ పేజీ అడ్మిన్,సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ భార్య సుజన అన్నా రు. రవికిరణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు లు వేధిస్తున్న విషయం తెలిసిందే.టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు ఇటీవల విచారణకు పిలిపించి రవికిరణ్‌ను అరెస్ట్ చేశారు.విశాఖ సెంట్రల్‌జైలులో ఉన్న ఆయనను సుజన గురువారం కలిశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. -
బరువు పెరిగారంటే ఎస్సీ ఎస్టీ కేసా?
-
బరువు పెరిగారంటే ఎస్సీ ఎస్టీ కేసా?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మీద తాను ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయలేదని పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అన్నారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు అనితతో వివాదం ఏంటని మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ఓ సందర్భంలో అనిత అన్నారని.. దాని మీద తాను స్పందించి ఆమె అభివృద్ధి (బరువు పెరగడం) కనిపిస్తోంది గానీ, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదని సోషల్ మీడియాలో పంచ్ వేశానని చెప్పారు. అంతకుముందు కూడా సమైక్య రాష్ట్రం 23 జిల్లాలతో లోకేష్‌లా లావుగా ఉండేదని, తర్వాత 13 జిల్లాలతో స్లిమ్ అయ్యిందని తాను ఒక పంచ్ వేశానన్నారు. ఇలా బరువు పెరగడం గురించి మాట్లాడటమే తప్పంటే అలాంటివి చాలా ఉంటాయని తెలిపారు. వెయిట్ లాస్ ప్రకటనల విషయంలో కూడా బిఫోర్, ఆఫ్టర్ అంటూ మహిళలకు సంబంధించిన రెండు ఫొటోలతో పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తారని, అది మహిళలను అవమానించడం అయితే ఆ యాడ్ ఇచ్చినవాళ్ల మీద, ప్రకటనలు ప్రసారం చేసిన మీడియా మీద కూడా కేసులు పెట్టాలని ఆయన చెప్పారు. తనను తుళ్లూరు పోలీసులు గతంలో విచారించినప్పుడే తాము తలుచుకుంటే ఏమైనా చేస్తామని, మొద్దు శీనుకు ఏం జరిగిందో తెలుసు కదా అని బెదిరించారని.. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినా తమకు సంబంధం లేదని చెప్పారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వాయిస్‌ను అణగదొక్కాలన్న లక్ష్యంతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఇదే విశాఖలో ఆర్కే బీచ్‌లో బికినీ ఫెస్టివల్ పెట్టారని, దాన్ని సోషల్ మీడియా గట్టిగా చెప్పడంతో తర్వాత కాస్త వెనక్కి తగ్గారని అన్నారు. అప్పట్లో అనితగారు బికినీ వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారని, నిజానికి అది మహిళలను అవమానించడం అవుతుంది గానీ, గ్రోత్ అంటే అవమానించడం కాదని తెలిపారు. తాను ఈ తరహాలో ఎప్పుడూ ఊహించలేదని, తొలిసారి విచారణలో పోలీసులు చెప్పినట్లే ఇప్పుడు కూడా చేశారని, వాళ్లు అనుకున్నది సాధించారని రవికిరణ్ అన్నారు. ఆయన మీద 292, 509 సెక్షన్ల కింద, మహిళలపై వేధింపులకు గాను సెక్షన్ 6 కింద, ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టంలోని సెక్షన్ 3 కింద కేసులు నమోదు చేశారు. -
ఎల్లెల్లో...!
-
తుళ్లూరులో విచారణ పేరుతో వేధింపులు
-
విచారణ పేరుతో వేధింపులు
తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా - వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ఇన్చార్జ్ చల్లా మధుకు పరోక్ష బెదిరింపులు - తాము చెప్పినట్లు చేయాలని ‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్‌పై తీవ్ర ఒత్తిడి - టీడీపీ పెట్టిన అసభ్య పోస్టింగులపై ఫిర్యాదు స్వీకరించని పోలీసులు - 30వ తేదీన మళ్లీ విచారణకు రావాలని ఆదేశం సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగు తోంది. మంత్రి లోకేశ్ మీద వ్యంగ్య పోస్టింగులు పెట్టారన్న ఆరోపణలపై ‘పొలిటికల్ పంచ్’ ఫేస్బుక్ పేజీ నిర్వాహకుడు రవి కిరణ్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పటికే అభాసుపాలైంది. అయి నా అదే ఒరవడిని కొనసాగిస్తూ రవికిరణ్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ ఐటీ సెల్ రాష్ట్ర ఇన్చార్జ్ చల్లా మధుసూదన్‌రెడ్డిని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు విచారణ పేరిట మంగళవారం తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పిలి పించి హైడ్రామా నడిపారు. చల్లా మధు సూదనరెడ్డిని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో దాదాపు గంట పాటు అదనపు ఎస్పీ వైటీ నాయుడు, ఏఎస్పీ విక్రాంత్‌పాటిల్ విడివిడిగా విచారించారు. రవికిరణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అని పలుసార్లు ప్రశ్నించారు. ఆయనకు పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేవని, ఆ ఫేస్బుక్ పేజీతో పార్టీకి సంబంధంలేదని మధు సమా« ధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు ఆయన్ను పరోక్షంగా బెదిరించినట్లు సమాచారం. అనంతరం ఈ నెల 30న మరోసారి విచారణకు రావాల్సిం దిగా నోటీసులు ఇచ్చి పంపించారు. అయితే గంటసేపటి తర్వాత పోలీసులు చల్లా మధుకు ఫోన్ చేసి వెంటనే పోలీస్‌స్టేషన్‌కు రావాలన్నా రు. తాను అప్పటికే కృష్ణా జిల్లా సరిహద్దు దాటి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించానని, నోటీసులో పేర్కొన్న విధంగా ఈ నెల 30న విచారణకు హాజరవుతానని చెప్పారు. టీడీపీ అసభ్య పోస్టింగులపై స్పందించని పోలీసులు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ శాసనసభలను కించపరుస్తూ టీడీపీ సోషల్ మీడియా విభాగం చేసిన పలు అసభ్యకర పోస్టింగులపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని చల్లా మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. విచారణ పేరిట ప్రభుత్వ బెదిరింపులు, వేధింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపుల పేరిట ఎంతగా అణచివేయాలని ప్రయత్నిస్తే నెటిజన్లు మరింతగా రెచ్చిపోతారన్నారు. రవికిరణ్ పెట్టిన చిన్న పోస్టింగుపై రాద్ధాంతం చేస్తున్న ప్రభుత్వం తమ ఫిర్యాదుపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాగా, పోలీసుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరికీ సంఘీభావంగా పార్టీ తాడికొండ సమన్వయకర్త హెనీ క్రిస్టినా, రాష్ట్ర అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి, పార్టీ నేతలు రాకేష్‌రెడ్డి, వెంకటరెడ్డి, బత్తుల కిషోర్ తమ కార్యకర్తలతో తుళ్లూరు పోలీస్‌స్టేషన్ వద్దకు తరలివచ్చారు. పోలీసులు భారీగా మోహరించి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. రవికిరణ్‌పై తీవ్ర ఒత్తిడి రవికిరణ్‌ను అదనపు ఎస్పీ వైటీ నాయుడు, ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు దఫాలుగా మంగళవారం రాత్రి 9 గంట ల వరకు విచారించారు. ‘నీకు వైఎస్సార్ సీపీతో సంబంధాలున్నాయని ఒప్పుకో.. ఆ పార్టీ సూచనల మేరకే పోస్టింగులు పెడుతున్నట్లు సంతకాలు చెయ్యి’ అని పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమా చారం. 30న మళ్లీ విచారణకు రావాలని చెప్పి పంపారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడుతూ తాను ఫ్రీలాన్స్ జర్నలిస్టునని, తనకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అంటే అభిమానం తప్ప ఆ పార్టీతో ఏ సంబంధం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సైట్‌లోని అఫీషియల్ పేజీలో పెట్టిన కొన్ని పోస్టింగులను ఆద ర్శంగా తీసుకునే తాను కొన్ని పోస్టింగు లను పెట్టానని, వాటితో వైఎస్సార్ సీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. మంత్రి నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని అణగదొక్కడానికి తనను అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్ అరెస్ట్
-
‘పొలిటికల్ పంచ్’ రవికిరణ్ అరెస్ట్
► అర్ధరాత్రి అతడి ఇంటి నుంచి తీసుకెళ్లిన తుళ్లూరు పోలీసులు ► శంషాబాద్ డీసీపీకి రవికిరణ్ భార్య ఫిర్యాదు ► రాజకీయాలపై స్పందించడం నేరమవుతుందా అని ప్రశ్న ► సోషల్ మీడియాను అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు ► వైఎస్సార్సీపీ నేతల విమర్శ హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పొలిటికల్ పంచ్ వెబ్సైట్ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్ (35)ను గురువారం అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రవికిరణ్.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ ఇంట్లో ఏడాది న్నరగా అద్దెకు నివాసముంటున్నాడు. ఇంట్లోనే వెబ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరా త్రి ఒంటిగంటకు ఆదర్శనగర్ కాలనీలో ఉన్న అత డి నివాసానికి ఐదుగురు పోలీసులు వచ్చారు. ముందుగా ఇంటి యజమాని నీరటి రాజుతో మాట్లాడిన వారు.. ఆ తర్వాత రవికిరణ్ ఇంట్లోకి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మీరు ఎవరని రవికిరణ్ భార్య సుజన ప్రశ్నించగా.. తాము తుళ్లూరు పోలీసులమని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అభ్యంతరక రంగా వెబ్సైట్లో ప్రచారం చేస్తున్న కారణంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లారు. దీంతో సుజన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డీసీపీకి ఫిర్యాదు అర్ధరాత్రి వచ్చి తన భర్తను కొందరు తుళ్లూరు పోలీసులమంటూ తీసుకెళ్లారని, ఇంతవరకు తనకు ఎలాంటి సమచారమూ లేదని, తన భర్త ఆచూకీ కనుగొనాలంటూ రవికిరణ్ భార్య సుజన శంషా బాద్ డీసీపీ పి.వి.పద్మజకు గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన భర్త కిడ్నాప్ అయి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సినంత నేరం తన భర్త ఏమి చేశాడని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న పరిస్థితులపై పౌరులుగా స్పందించడం నేరమవుతుందా అని నిలదీశారు. ఏపీ పోలీసులే తన భర్తను తీసుకెళ్లి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలన్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అసహనం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పరిపాలన తీరుతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోయిందని వైఎస్సార్సీపీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, అరుణ్‌కుమార్ అన్నారు. రవికిరణ్ కుటుంబానికి మద్దతుగా వారు శంషాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమ వుతున్న బాబు సర్కారు మీడియాతో పాటు సోష ల్ మీడియాను అణగదొ క్కేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించే హక్కు ప్రజలకు లేదా అని నిలదీశారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నిం చారు. రవికిరణ్ అరెస్ట్ అన్యాయమన్నారు. వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉం టుందని తెలిపారు. రవికిరణ్ కుటుంబాన్ని పరా మర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నేత తాడి భాస్కర్‌రెడ్డి, ఆర్.రవిశంకర్ తదితరులున్నారు. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదుతో అరెస్టు: గుంటూరు ఎస్పీ నాయక్ సాక్షి, అమరావతి: శాసనమండలి భవనం ఫొటోపై పోర్నోగ్రఫీ ఫొటో పెట్టినందునే ‘పొలిటికల్ పంచ్’ వెబ్సైట్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ మీడియాకు తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. శానసనసభ కార్యదర్శి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రవికిరణ్‌పై కేసులు నమోదు చేశామన్నారు. విచారణ నిమిత్తం రవికిరణ్‌ను గుంటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. -
విజృంభించిన రవికిరణ్
వడోదర: జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పట్టుబిగిస్తోంది. తొలిరోజు తన్మయ్ సెంచరీ సాధించగా, రెండో రోజు బౌలింగ్‌లో రవికిరణ్ (4/31) నిప్పులు చెరిగాడు. దీంతో కశ్మీర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఒక్క పర్వేజ్ రసూల్ (81 బంతుల్లో 70; 11 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఆట నిలిచే సమయానికి జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ లో 46 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హైదరాబాద్ 328 ఆలౌట్ అంతకుముందు 234/3 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స 131.3 ఓవర్లలో 328 పరుగుల వద్ద ముగిసింది. మరో 94 పరుగులే జోడించి మిగతా 7 వికెట్లను కోల్పోయింది. కశ్మీర్ బౌలర్లు పర్వేజ్ రసూల్ (4/63), సమీయుల్లా బేగ్ (3/77), సుహెయిల్ అండ్లీవ్ (2/57) సమష్టిగా రాణించడంతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజ్‌లో నిలువలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ తన్మయ్ అగర్వాల్ (321 బంతుల్లో 119; 17 ఫోర్లు) మరో 13 పరుగులు చేసి నిష్క్రమించగా, బావనక సందీప్ (16), కె.సుమంత్ (0) నిరాశ పరిచారు. ఇద్దర్ని సమీయుల్లా పెవిలియన్‌కు పంపాడు. సీవీ మిలింద్ (19), ఆకాశ్ భండారీ (13), సిరాజ్ (13)లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కశ్మీర్ బ్యాట్స్‌మెన్ విలవిల అనంతరం తొలి ఇన్నింగ్స ఆరంభించిన కశ్మీర్‌ను రవికిరణ్ కోలుకోలేని దెబ్బతీశాడు. ఓపెనర్లు అహ్మద్ (0), శుభం (2)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో 3 పరుగులకే ఆ రెండు వికెట్లు పడ్డాయి. కాసేపటికి ప్రణవ్ (6)ను మిలింద్, దేవ్ సింగ్ (14)ను సిరాజ్ ఔట్ చేయడంతో 31 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోరుున జమ్మూకశ్మీర్ కష్టాల్లో పడింది. ఈ దశలో పర్వేజ్... ఆదిత్య సింగ్ (14)తో కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత రవికిరణ్ స్వల్ప వ్యవధిలో ఆదిత్యను, పునీత్ బిస్త్ (6)లను పెవిలియన్ పంపించి కశ్మీర్‌ను మళ్లీ దెబ్బతీశాడు. ఆట నిలిచే సమయానికి సమీయుల్లా (28 బ్యాటింగ్), రామ్ దయాళ్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సంక్షిప్త స్కోర్లు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స: 328 (తన్మయ్ 119; పర్వేజ్ 4/63, సమీయుల్లా 3/77), జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స: 156/7 (పర్వేజ్ 70; రవికిరణ్ 4/31, మిలింద్ 1/27) -
చేయి చేయి కలుపుదాం..చెత్తకు టాటా చెబుదాం..
ఖైరతాబాద్: చారిత్రక నేపథ్యమున్న భాగ్యనగరం ఎన్నో అందాలు నెలవు. హైటెక్ సిటీగా గుర్తింపు పొందిని గ్రేటర్లో రోజు రోజుకు పేరుకుపోతున్న చెత్తను అరికట్టి క్లీన్ అండ్ గ్రీన్‌గా చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇందుకోసం నగరంలో 36 కిలోమీటర్ల మేర ప్రధాన రోడ్లను గుర్తించి ఆయా రోడ్లలో ‘చెత్త రహిత సమాజం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ పరిధిలోని నెక్లెస్ రోడ్డు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్, డీఎంసీ సోమరాజుతో పాటు నెక్లెస్ రోడ్డులో వ్యాపారాలు చేస్తున్నవారితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. చెత్తను ఎప్పటికప్పుడు వ్యాపారులు రోడ్లపై పడకుండా బ్యాగుల్లో వేసుకోవాలని, రోజూ మెక్లిన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది, వాహనాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ఆ చెత్తను ఆయా వాహనాలలో వేయాలని సూచించారు. మెక్లిన్ సంస్థ ఎండీ ప్రేమానంద్ మాట్లాడుతూ రోజూ షిఫ్ట్‌ల వారీగా వాహనాలు తిరుగుతాయని తెలిపారు. సమావేశంలో సెంట్రల్ జోన్ ఏఎంహెచ్ఓలు డాక్టర్ దామోదర్, మనోహర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తుగా ఈ ప్రాంతాల్లో అమలు.. మహా నగరానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెత్త రహిత సమాజ నిర్మాణంలో భాగంగా తొలుత ఏడు ప్రధాన రోడ్లను గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. * బంజారాహిల్స్ రోడ్ నెంబర్. 2 నుంచి నాగార్జున సర్కిల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మీదుగా పెద్దమ్మ ఆల యం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ వరకు * జూబ్లీహిల్స్ రోడ్ నెం. 92 నుంచి కళింగ ఫంక్షన్ హాల్, సి.వి.ఆర్ న్యూస్ చానెల్ మీదుగా చెక్‌పోస్ట్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం. 12 పెన్షన్ ఆఫీస్, ఇన్కమ్ టాక్స్ కార్యాలయం మీదుగా కళింగ ఫంక్షన్ హాల్ వరకు * బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి జీవీకే మాల్, జలగం వెంగళరావు పార్కు మీదుగా పెన్షన్ ఆఫీస్ వరకు * ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సోమాజిగూడ, సీఎం క్యాంపు కార్యాలయం, బేగంపేట్ ఫ్లై ఓవర్ వరకు * బేగంపేట్ మీదుగా గ్రీన్‌ల్యాండ్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు, అసెంబ్లీ పరిసర ప్రాంతాల ప్రధాన రోడ్లలో అమలు చేస్తున్నారు. అతిక్రమిస్తే జరిమానా వచ్చే నెల 1న చెత్త రహిత సమాజ నిర్మాణంపై నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అదే రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఆ తరువాత షాపులు, తోపుడు బండ్లు.. ఇలా వ్యాపారాలు చేసుకునేవారి షాపుల ముందు చెత్త కనిపిస్తే మొదటి తప్పిదం కింద రూ.500, రెండోసారి రూ.1000, మూడోసారి రూ.3000, నాలుగోసారి రూ.4000, ఐదోసారి రూ. 10 వేల జరిమానా విధిస్తామన్నారు. ఆ తరువాత కూడా అదే తప్పిదం చేస్తే మూడు నెలల జైలు శిక్ష తప్పదు. -
విధి విడదీసింది...
వారిద్దరూ ప్రాణ స్నేహితులు ఒకరిది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, మరొకరిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి. రాజకీయ నేతల స్వార్థం రాష్ట్రాల్ని విడదీసినా వారి స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. వేసవి సెలవుల్లో రెండు కుటుంబాలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాయి. కానీ... తిరుగు ప్రయాణంలో విధి వారిద్దరినీ విడదీసింది. ప్రత్తిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రత్తిపాడు, న్యూస్‌లైన్: ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద కాటూరి వైద్య కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులైన జగ్గయ్యపేటకు చెందిన కుందేలు రవికిరణ్, సత్తుపల్లికి చెందిన దూదిపాళ్ల ప్రభు వేసవి సెలవుల్లో సకుటుంబసమేతంగా తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. ఈనెల 23వ తేదీ శుక్రవారం కుందేలు రవికిరణ్ తన కుటుంబసభ్యులైన తల్లి రాజ్యం, భార్య శ్రీదేవి, కుమార్తె గాయత్రి, కుమారుడు హవీష్, ప్రాణ స్నేహితుడు దూదిపాళ్ల ప్రభు, అతని భార్య శ్రీదేవి, కుమార్తెలు యోజిత, చేతనలతో కలిసి మొత్తం రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిదిమంది కారులో తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి బుధవారం సాయంత్రం జగ్గయ్యపేటకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కాటూరి మెడికల్ కళాశాలకు సమీపంలో నిర్మించిన వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవికిరణ్ (38)తో అతని తల్లి రాజ్యం (63), స్నేహితుడు ప్రభు కుమార్తె యోజిత (8) మృత్యువాత పడ్డారు. మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఒక కుటుంబం తల్లీ కొడుకును కోల్పోగా, మరో కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కన్నకూతురిని కోల్పోయింది. రవి ఎలా ఉన్నాడు... తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దూదిపాళ్ల ప్రభు భరించలేని గాయాల దెబ్బలను సైతం పంటిబిగువున భరిస్తూ, తన స్నేహితుడి యోగక్షేమాలను ఆరా తీయడం అందరిని కలిచివేసింది. స్ట్రెచర్‌పై చికిత్స పొందుతూనే తనకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులతో రవి ఎలా ఉన్నాడు.. వాడికేం ఇబ్బందిలేదుగా.. అంటూ అడిగాడు. తీవ్ర గాయాలతో బాధపడుతూ కూడా తన స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసిన వారు వారి స్నేహ బంధాన్ని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు. అమ్మా.. ఒక్కసారి లేమ్మా.. కుందేలు రవికిరణ్, అతిని తల్లి రాజ్యం మృతిచెందారన్న విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు, బంధువులు ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని కాటూరి వైద్యశాల వద్దకు చేరుకున్నారు. మృతుల రక్తసంబంధీకురాలు (ఒకరికి కుమార్తె, ఒకరికి చెల్లి) భోరున విలపించారు. విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలపై పడి అమ్మా లేవే.. ఒక్కసారి నాతో మాట్లాడవే.. ఏమిటే ముఖంపై ఇన్ని దెబ్బలు నీకు.. ఎలా ఓర్చుకున్నావమ్మా.. అన్నా లే అన్నా.. ఒక్కసారి లే అన్నా.. అంటూ పెద్దపెద్దగా ఏడవడంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా బంధువుల రోదనలతో మార్మోగింది. నొప్పులతో ఎగిరెగిరి పడుతూ.. ప్రమాదం బారిన పడిన వారిలో నలుగురు చిన్నారులు ఉండడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలకు, కాళ్లకు, చెవులకు, చేతులతో పాటు పలు భాగాల వద్ద తీవ్ర గాయాలవడంతో నొప్పులు భరించలేక ఆ చిన్నారులు అల్లాడిపోయారు. వైద్య సిబ్బంది వైద్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చిన్నారులు నొప్పులతో ఎగిరెగిరిపడుతూ ఎక్కిళ్లు పెట్టి ఏడవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది దేవుడా అంటూ విలపించారు,