
Ravikiran About Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఇందులో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించిన రవికిరణ్ మాట్లాడుతూ..
‘‘రాజావారు రాణివారు’ సినిమాకు దర్శకత్వం వహించిన నేను ఇప్పుడు ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాకు షో రన్నర్‌గా వర్క్ చేశాను. సాధారణంగా వెబ్ సిరీస్‌లకు షో రన్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఈ సినిమాకు షో రన్నర్ అనేది వస్తోంది. షో రన్నర్ అంటే క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ. నేను దర్శకుడిగా చేసిన ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి విద్యాసాగర్ కెమెరామేన్‌గా చేశాడు. లాక్‌డౌన్‌లో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కథను విశ్వక్ సేన్‌కు చెప్పడం జరిగింది. నా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని ప్రేమ్ అనే వ్యక్తి ఈ సినిమాకు దర్శకుడిగా చేయాల్సింది కానీ అతని వ్యక్తిగత కారణాల వల్ల కుదర్లేదు. దీంతో విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. విద్యాసాగర్‌లో మంచి దర్శకుడు ఉన్నాడని ‘రాజావారు రాణిగారు’ టైమ్‌లోనే నాకు తెలిసింది. దీంతో ఆయనకు దర్శకత్వ బాధ్యతలను ఇవ్వడం జరిగింది.
చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నేను మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌వారితో ఓ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో బిజీగా ఉండటం వల్లే నేను ‘అశోకవనంలో....’ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా చాలామంది పేర్లను అనుకున్నాం. కానీ విశ్వక్ సేన్ పేరుని విద్యాసాగరే చెప్పాడు. ఒక్క క్షణం షాకయ్యాను. ఎందుకంటే ఇప్పటివరకు మెజారిటీ చిత్రాల్లో మాస్ పాత్రలే చేసిన విశ్వక్ సేన్‌ది ఈ చిత్రంలో కాస్త భిన్నమైన పాత్ర. పెళ్లి కాని 33 ఏళ్ల అల్లం అర్జున్ కుమార్‌గా బాగా నటించారు.
చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
అల్లం అర్జున్‌కుమార్ పెళ్లి, అతని జీవితం నేపథ్యంలోనే కథ సాగుతుంది. సినిమాలో ఆంధ్రా అమ్మాయి, తెలంగాణ అబ్బాయిల పెళ్లి అన్నట్లుగా ఉంటుంది. సో.. సంస్కృతి, సంప్రదాయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. లవ్, లైఫ్, మ్యారేజ్ అనే అంశాలను ప్రస్తావిస్తూనే కాస్త కొత్తగా, సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్‌లో నేను చేస్తున్న పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ కాకుండా, ఓ అడ్వెంచర్ కథ నా దగ్గర ఉంది. నా తర్వాతి సినిమాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చెబుతాను’’ అని రవికిరణ్ అన్నారు.
చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment