
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలె ఆయన నటించిన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ప్రమోషన్స్ కోసం చేసిన ప్రాంక్ వీడియో నెట్టింట ఎంతటి దుమారాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు ముందే బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్‌లో ఉండగానే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇప్పటికే పలు వార్తలు దర్శనమిస్తున్నాయి.
ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమా పలానా తేదీన విడుదలవుతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై విశ్వక్‌సేన్ స్పందించాడు. నిజానికి ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాకు కూడా ఓటీటీ రిలీజ్ డేట్ తెలియదని, ఫిక్స్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పాడు. ఇలాంటి రూమర్స్ వల్ల కొందరు ప్రేక్షకులు థియేటర్స్ వెళ్లకుండా వాయిదా వేసుకుంటారు. కాబట్టి మీరు పెట్టిన పోస్టులు అన్ని డిలీట్ చేయండి అంటూ విశ్వక్ కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment