Ashoka Vanamlo Arjuna Kalyanam
-
ఈవారం అలరించే సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Upcoming Theater OTT Movies Web Series In June 1st Week 2022: థియేటర్ల వద్ద సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ 'అఖండ'తో మొదలైన మూవీ పండుగ మే 27న విడుదలైన 'ఎఫ్ 3' (F3)తో కంటిన్యూ అవుతోంది. ఈ నెలలో 'సర్కారు వారి పాట', 'ఎఫ్3' విజయంగా దూసుకుపోతున్నాయి. ప్రతి వారం ఓ కొత్త సినిమా ప్రేక్షకులను కచ్చితంగా పలకిస్తుండంగా.. జూన్ మొదటి వారంలో అలరించే సినిమాలు, సిరీస్‌లు ఏంటో లుక్కేద్దామా ! 1. మేజర్ డిఫరెంట్ కథలు, సినిమాలతో అలరించే అడవి శేష్ మేజర్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. 36/11 ఉగ్రదాడుల్లో ప్రజల ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ప్రివ్యూలు వేసిన విషయం తెలిసిందే. 2. విక్రమ్ ముగ్గురు విలక్షణ నటులందరు కలిసి ఉర్రూతలూగించేందుకు వస్తుంది 'విక్రమ్'. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ సినిమాలో సూర్య అతిథిగా మెరవబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన 'విక్రమ్' జూన్ 3న తమిళ, తెలుగు భాషల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. 3. పృథ్వీరాజ్ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రాజ్‌పుత్ యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా రూపొందిన చిత్రం 'పృథ్వీరాజ్'. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. చంద్రప్రకాష్ ద్వివేది తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు పలు దక్షిణాది భాషల్లో రిలీజవనుంది. ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్‌లు ఇవే.. 1. 9 అవర్స్ (వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జూన్ 2 2. జనగణమన (మలయాళం)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 2 3. అశోకవనంలో అర్జున కల్యాణం- ఆహా, జూన్ 3 4. ది పర్ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 5. సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్, జూన్ 3 6. ది బాయ్స్ (వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ వీడియో, జూన్ 3 7. ఆశ్రమ్ (హిందీ వెబ్ సిరీస్-సీజన్ 3)- ఎంఎక్స్ ప్లేయర్, జూన్ 3 8. బెల్ఫాస్ట్ (హాలీవుడ్)- బుక్ మై షో, జూన్ 3 చదవండి: రీల్స్‌తో 3 కోట్లు గెలవాలనుకుని చివరికీ ఏమయ్యారు.. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రాబోయే సినిమాలివే!
ఇప్పటిదాకా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. మధ్యమధ్యలో కొన్ని చిన్న సినిమాలు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టాయి. అయితే ఈ వారం మాత్రం ప్రేక్షకుడికి వినోదాన్ని పంచేందుకు ఓ మల్టీస్టారర్ మూవీ సిద్ధమైంది. ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చూసిన ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించేందుకు వస్తోంది ఎఫ్ 3. ఈ వారం థియేటర్లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదొక్కటే ఉంది. అటు ఓటీటీ కూడా ఈ వారం సరికొత్త కంటెంట్‌తో ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సై అంటోంది. మరి ఈ వారం అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో చూసేయండి.. ఎఫ్ 3 వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్ 3. తమన్నా, మెహరీన్ కథానాయికలు. సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 27న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. మరి సమ్మర్ సోగ్గాళ్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారో లేదో చూడాలి. అశోకవనంలో అర్జున కల్యాణం మాస్ సినిమాలతో ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కల్యాణం. ఇందులో విశ్వక్ అద్భుతమైన నటన కనబర్చాడు. రుక్సార్ ధిల్లాన్ కథానాయికగా ఆకట్టుకుంది. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టిన ఈ చిత్రం ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కణ్మణి రాంబో ఖతీజా విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాతువాకుల రెండు కాదల్. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా విడుదలైంది. తాజాగా ఓటీటీ ట్రాక్ ఎక్కిన ఈ మూవీ మే 27 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. అటాక్ జాన్ అబ్రహం హీరోగా నటించిన మూవీ అటాక్: పార్ట్ 1. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి రానుంది. ఓటీటీలో ఇంకా ఏమేం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయంటే.. హాట్‌స్టార్ ఒబీ వ్యాన్ కెనోబి (వెబ్ సిరీస్) - మే 27 నెట్‌ఫ్లిక్స్ తులసీదాస్ జూనియర్ - మే 23 వెల్కమ్ టు వెడ్డింగ్ హెల్ - మే 23 స్ట్రేంజర్ థింగ్స్ (నాలుగో సీజన్) - మే 27 సోనీ లివ్ నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాపసీ (వెబ్ సిరీస్) - మే 27 సేత్తుమాన్ - మే 27 చదవండి 👇 'ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని ఐశ్వర్యరాయ్ చివరకు ఇలా తయారైంది' బెడ్ సీన్ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్ రిప్లై -
ఆహాలో అశోకవనంలో అర్జున కల్యాణం, ఎప్పుడంటే?
Ashoka Vanam Lo Arjuna Kalyanam OTT Release Date: వరుస అపజయాల తర్వాత అశోకవనంలో అర్జున కల్యాణం మూవీతో హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్సేన్. ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ పాత్రలే చేసిన ఈ మాస్ హీరో ఈసారి మాత్రం భిన్నంగా వినోదాత్మక పాత్రలో నటించి మెప్పించాడు. అతడు హీరోగా రుక్సార్ ధిల్లాన్, రితికా నాయక్ హీరోయిన్లుగా నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం మే 6న రిలీజైంది. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. చదవండి 👇 ఆది పినిశెట్టి పెళ్లి వేడుకల్లో టాలీవుడ్ హీరోల డ్యాన్స్ ప్రేమలో పడ్డ బ్యూటీ, ఖరీదైన గిఫ్ట్‌తో ప్రియుడి సర్ప్రైజ్ -
కోట్లు విలువ చేసే కారు కొన్న విశ్వక్ సేన్.. డైరెక్టర్ రియాక్షన్
Hero Vishwak Sen Bought Luxurious Car: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్ జంటగా కలిసి నటించిన చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. మే 6న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. తనకిష్టమైన బెంజ్ జీక్లాస్ 2022 మోడల్ కారుని కొని తన కల సాకారం చేసుకున్నాడు విశ్వక్. నా డ్రీమ్ కారుని కొనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న స్థిరమైన ప్రేమాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. నా జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి ఎంతో ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు విశ్వక్ సేన్. అయితే ఈ కారు విలువ రూ. 1.5 కోట్లు ఉంటుందని సమాచారం. కారుతో దిగిన విశ్వక్ సేన్ ఫొటోలు చూసి అభిమానులు సంబరపడుతున్నారు. విశ్వక్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్‌పై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రియాక్ట్ అయ్యారు. 'ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా' అని సరదాగా కామెంట్ చేశారు. కాగా కుటుంబా కథా చిత్రమైన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించగా, జే క్రిష్ సంగీతం అందించారు. చదవండి: ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్ View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్
Allu Arvind About Indian Cinema, Movie Industries: ప్రస్తుతం భారత సినీ పరిశ్రమ చాలా ప్రాబ్లమ్స్లో ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రీసెంట్గా విడుదలైన యంగ్ హీరో విశ్వక్సేన్ ‘అశోకవనంలో అర్జుణ కళ్యాణం’ మూవీ సెక్సెస్ మీట్ నిన్న నిర్వహించారు. ఈ వెంట్‌కు ఆయన ముఖ్య అథితిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా తాను కూడా చూశానని, చాలా బాగుందని చెప్పారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు వింత వ్యాధి.. ‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ అనంతరం ‘గతంలో కుటుంబం మొత్తం థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేవారు. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూసే అలవాటు పోయింది. శని, ఆదివారాలు వస్తే భార్య, భర్తతో ఏ సినిమాకు వెళ్దామండి అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ కనిపించడం లేదు. ఓటీటీలు వచ్చాక అది పూర్తిగా మారింది. సినిమా విడుదలయ్యాక ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే కాలం వచ్చింది’ అన్నారు. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లోకి రప్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు ‘ఒకప్పుడు ఎలాంటి హీరో సినిమా అయినా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవాడు. కానీ ఇప్పుడు పెద్ద హీరో సినిమా అయిన ప్రేక్షకులు అంత థియేటర్లకు రావడం లేదు. దీనికంతటికి కారణం ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో చాలా మరడమే. ఇప్పటికైన ఇలాంటి డేంజరస్ ట్రెండ్ నుంచి మనం బయటపడాలి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇప్పటికైన ఇండస్ట్రీ అది గ్రహించారు. ప్లిజ్ మీరందరు సినిమాకు వచ్చి చూస్తేనే ఈ సినిమాలు బ్రతకుతాయి’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందని, అక్కడి స్టార్లు నటించిన చిత్రాలు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నాయని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. -
దయచేసి ఆ పోస్టులు డిలీట్ చేయండి.. విశ్వక్ సేన్ రిక్వెస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలె ఆయన నటించిన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ప్రమోషన్స్ కోసం చేసిన ప్రాంక్ వీడియో నెట్టింట ఎంతటి దుమారాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు ముందే బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్‌లో ఉండగానే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇప్పటికే పలు వార్తలు దర్శనమిస్తున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా పలానా తేదీన విడుదలవుతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై విశ్వక్సేన్ స్పందించాడు. నిజానికి ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాకు కూడా ఓటీటీ రిలీజ్ డేట్ తెలియదని, ఫిక్స్ అయిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పాడు. ఇలాంటి రూమర్స్ వల్ల కొందరు ప్రేక్షకులు థియేటర్స్ వెళ్లకుండా వాయిదా వేసుకుంటారు. కాబట్టి మీరు పెట్టిన పోస్టులు అన్ని డిలీట్ చేయండి అంటూ విశ్వక్ కోరాడు. View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) -
అప్పుడే ఓటీటీకి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, స్ట్రీమింగ్ ఎక్కడంటే
Ashoka Vanamlo Arjuna Kalyanam Locks OTT Platform: ‘ఫలక్‌నుమా దాస్’ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథలతో మెప్పిస్పున యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఇప్పటి వరకు మాస్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా క్లాస్‌గా కనిపించాడు. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. విద్యాసాగర్ చింత ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు(మే 6న) థియేటర్లో విడుదలైంది. పెద్ద వివాదం తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. చదవండి: అబద్దాలనే ఈ సమాజం ఎక్కువగా నమ్ముతుంది : సమంత గ్రామీణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పెళ్లి అనే కన్సెప్ట్ చూట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీగా సాగే ఈ సినిమా విడుదలైన ప్రీమియర్ షో నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. కొంతమంది ఫన్నీగా ఉంది అంటుండగా మరికొందరు సినిమాను చాలా లాగ్ చేశారంటున్నారు. ఇలా మిశ్రమ స్పందన తెచ్చుకుంటూ యవరేజ్‌గా నిలిచిన ఈమూవీ త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయబోతోంది. ఇప్పటికే ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. చదవండి: ఎన్టీఆర్ షేర్ చేసిన స్పెషల్ ఫొటో.. క్షణాల్లో వైరల్ విశ్వక్ సేన్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు ఆహా కొనుగొలు చేసిందట. అయితే ఈ సినిమా నెల రోజుల తర్వాత ఆహా విడుదల కానుందని టాక్. అంటే జూన్ మొదటి వారంలో ఈమూవీ ఓటీటీలో విడదుల కానుందన్న మాట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటించింది. -
అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ రివ్యూ
టైటిల్: అశోకవనంలో అర్జున కళ్యాణం నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు కథ: రవికిరణ్ కోలా దర్శకత్వం: విద్యా సాగర్ చింతా నిర్మాత: బాపీనీడు. బి సంగీతం: జై క్రిష్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ పలనీ ఎడిటింగ్: విప్లవ్ నైషధం విడుదల తేది: మే 6, 2022 మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'అల్లం అర్జున్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. విశ్వక్ సేన్ సరసన రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా అలరించిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విభిన్నంగా ఆకట్టుకున్నాయి. అలాగే సినిమా ప్రమోషన్లో భాగంగా చేసిన చర్యలు పలు విమర్శలను కూడా మూటగట్టుకున్నాయి. విశ్వక్ సేన్‌కు ఓ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన కాంట్రవర్సీ తెలిసిందే. ఇవన్ని దాటుకోని ఎట్టకేలకు నేడు (మే 6) అశోకవనంలో అర్జున కల్యాణం థియేటర్లలో విడుదలైంది. మరీ అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్ ఏమేరకు అలరించాడు ? రివ్యూలో చూద్దాం. కథేంటంటే సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్ (విశ్వక్ సేన్)కు 33 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదు. ఇరుగుపొరుగు వారి మాటలు భరించలేక చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మాధవి(రుక్సార్ దిల్లాన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రెండు వేర్వేరు యాసలు, వేర్వేరు కులాలకు చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి? మాధవి చెల్లెలు వసుధ(రితికా నాయక్) చేసిన చిలిపి పని ఎక్కడికి దారి తీసింది? వీరి మధ్యలో కులాల ప్రస్థావన ఎలా వచ్చింది? అసలు అర్జున్‌కి పెళ్లి అయిందా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉదంటంటే... 30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోకపోవడం ఇప్పుడు కామన్. ఇదే పాయింట్‌ని తీసుకొని ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విద్యా సాగర్ చింతా. వయసు మీదపడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారందరికి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. పెళ్లి అనేది మనకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలని కానీ.. సమాజం కోసమే.. లేదా కుటుంబ గౌరవం కోసమో చేసుకోవద్దనే విషయాన్ని కామెడీగా చూపించాడు. ట్రైలర్లో చూపించినట్లుగా.. సినిమా అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీరియస్ అంశాలను కూడా ఎంటర్టైన్మెంట్ జోడించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో మాట్లాడేందుకు హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే హీరోయిన్ చెల్లెలు చేసే అల్లరి ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండాఫ్‌లో చాలా సీరియస్ అంశాలను సున్నితంగా చూపించాడు దర్శకుడు. అయితే కథలో కావాల్సినంత కామెడీ ఉన్నా.. నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఫస్టాఫ్‌లో చాలా సాగదీత సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుడి కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకునేలా లేదు. సెకండాఫ్‌లో కూడా ఎంగేజింగ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్ కూడా రోటీన్ ఉంటుంది. ఎవరెలా చేశారు? కొత్త తరహా చిత్రాలు, పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాడు విశ్వక్ సేన్. ఈ చిత్రంలో కూడా సరికొత్త గెటప్‌లో కనిపించాడు. మధ్యవయస్కుడు అల్లం అర్జున్‌గా విశ్వక్ సేన్ మెప్పించాడు. తన వయసుకు మించిన పాత్రను పోషించిన విశ్వక్‌ని అభినందించాల్సిందే. అమాయకుడిగా ఉంటునే..తనదైన కామెడీతో నవ్వించాడు. ఇక మాధవిగా రుక్సార్ దిల్లార్ ఆకట్టుకుంది. చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. ఇక హీరోయిన్ చెల్లెలు వసుధ పాత్రలో రితికా నాయక్ పరకాయ ప్రవేశం చేసింది. ఆమె చేసే అల్లరి ఆకట్టుకుంటుంది. గోపరాజు రమణ తనదైన పంచ్ డైలాగ్స్‌తో నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జై క్రిష్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా ‘ఓ ఆడపిల్ల ..’అనే పాట అందరికి నచ్చుతుంది. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎటిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణవ విలువసు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఫీమేల్ క్యారెక్టర్ చేయాలని ఉంది
‘‘సెట్స్‌లో నాదైన శైలిలో నటించాలనుకుంటాను. అందుకే దర్శకుల నుంచి పెద్దగా రిఫరెన్సెస్ కూడా అడగను. దర్శకులు చెప్పిన కథ, అందులోని సందర్భాల ప్రకారం నటించడమే నాకు ఇష్టం’’ అని దర్శక–నటుడు విశ్వక్ సేన్ అన్నారు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఈ చిత్రం రేపు థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ చెప్పిన విశేషాలు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ నా కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. ఈ సినిమాకు మ్యాజిక్ జరిగింది. కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. నిజానికి ఈ కథ విన్న వెంటనే సినిమా చేసేయాలనుకున్నాను. కథ వినడమే ఈ టైటిల్‌తోనే విన్నాను. సో.. వేరే టైటిల్స్ అనుకోలేదు. సినిమాలో తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు అనేవి ఒక లేయర్ మాత్రమే. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. సందేశం కూడా ఉంది. ముఖ్యంగా అనవసరంగా పోలికలు పెట్టుకుని ఆత్మన్యూనతా భావంతో బాధపడే అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ‘మీ(మహిళలను ఉద్దేశిస్తూ...) గురించి మీరే నిలబడాలి’ అనే డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ లోపే పెళ్లి చేసుకుంటాను! ఈ సినిమాలో అల్లం అర్జున్‌కుమార్ పాత్రలో కనిపిస్తాను. నా తొలి సినిమా ‘వెళ్లిపోమాకే’కు చేసిన వర్క్‌షాప్స్ కూడా ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి. 30 ఏళ్ల వయసు మీద పడిన పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్ క్యారెక్టర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ‘మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు వచ్చి చాలా రోజులైంది. ఇప్పుడు అలాంటి ఎంటర్టైన్మెంట్ను మా సినిమా అందిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం బరువు పెరిగాను. నిజానికి బరువు తగ్గడం సులభమే కానీ పెరగడం కష్టం. ఇక పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం ఉంది. నాకు 30 ఏళ్లు దాటే లోపే పెళ్లి చేసుకుంటాను. ఇక యాక్టర్‌గా నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. కమల్‌హాసన్‌గారు ‘భామనే సత్యభామనే’ సినిమాలో చేసిన ఫీమేల్ క్యారెక్టర్ లాంటివి చేయడానికి సిద్ధమే. అలాగే నేను తెలంగాణ హీరోగా మాత్రమే ఉండాలనుకోవడం లేదు. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తాను. పాన్ ఇండియా స్థాయిలో... తమిళ సినిమా ‘ఓ మై కడవులే..’ చిత్రానికి తెలుగు రీమేక్ ‘ఓరి... దేవుడా’ సినిమా చేశాను. ‘దమ్కీ’ సినిమా చేస్తున్నా. అయితే ‘దమ్కీ’ సినిమా కథపై దర్శకుడు నరేష్ కన్నా నాకే ఎక్కువ కమాండ్ ఉందనిపించి ఈ సినిమాకు నేను దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను. నరేశ్‌తో భవిష్యత్‌లో మరో సినిమా ఉండొచ్చు. హిందీలో ఓ సినిమా చేసే ప్రయత్నాలను మొదలుపె ట్టాను. ‘సవారి’ ఫేమ్ సాహితి దర్శకత్వంలో ‘స్టూడెంట్’ అనే సినిమా చేయాల్సి ఉంది. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాకు సీక్వెల్ ఉంటుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. -
ఒకే రోజు నాలుగు సినిమాలు, ప్రేక్షకుడి ఓటు ఎవరికో?
డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారిగా 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు. ఇక అదే రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజవుతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటు వేస్తారు? ఏ మూవీ హిట్ అందుకోనుందనేది వేచి చూడాల్సిందే! View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: నోరా ఫతేహితో డేటింగ్‌పై స్పందించిన కొరియోగ్రాఫర్ పెళ్లిపీటలెక్కబోతున్న రీల్ లైఫ్ జంట -
విశ్వక్ సేన్ అసలు హీరోనే కాదు: ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్
Danam Nagender Fires On Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్సేన్- ప్రముఖ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్ దేవీ నాగవల్లి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదంతో దూషించడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్ ‘చానళ్లు విశ్వక్ సేన్ హీరోగా గుర్తిస్తున్నారో లేదో మాకు తెలియదు. కానీ, మేం మాత్రం అతడిని హీరోగా గుర్తించడం లేదు. లైవ్‌లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదు. దేవి నాగవళ్లికి యాంకర్‌గానే కాదు, బయట సమాజంలో కూడా మంచి పేరు ఉంది. అలాంటి యాంకర్‌ను పట్టుకుని అతడు అలా అనడం సహించరానిది. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలి. లేకపోతే సైలెంట్‌గా ఉండాలి. స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అన్నారు. లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని, అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్ చెప్పుతో కొట్టేది ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ ‘విశ్వక్ సేన్ బయట కనపడితే మా మహిళలు చెప్పులు తీసుకుని కొడతారు. విశ్వక్ సేన్ లాంటి వ్యక్తికి బుద్ది చెప్పాల్సిందే. ఇంకోసారి మరెవరు ఇలాంటి పదాలు వాడకుండా చేయాలి. విశ్వక్ సేన్ లాంటి వాళ్లను సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నాను’ అని దానం నాగేందర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తమ మహిళ సంఘాలు ఆయనను కొట్టడానికి రెడీగా ఉన్నారని దానం హీరోపై ఫైర్ అయ్యారు. అనంతరం రోడ్లపై ఇలాంటి వ్యవహరాలు చేయడం. కిరోసిన్ డబ్బాను పట్టుకుని సినిమా ప్రమోషన్స్ చేసుకోవడానికి ఆయన ఏమైన పెద్ద హీరో అనుకుంటున్నాడా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే యాంకర్ దేవి నాగవళ్లి ఫిర్యాదుతో విశ్వక్ సేన్‌పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
అలాంటి పని చేయను: విశ్వక్ సేన్
‘‘నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులను అలరించడమే నా ధ్యేయం. వారు బాధ పడే పని ఎప్పటికీ చేయను. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్‌తో పాటు బలమైన కథ, సంగీతం, పాటలు సమపాళ్లలో ఉంటాయి. వయస్సు మీద పడుతున్నా పెళ్లి కాని యువకుడైన అల్లం అర్జున్‌కుమార్ పడే బాధలే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు విశ్వక్ సేన్. (చదవండి: విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్) విద్యాసాగర్ చింత దర్శకత్వంలో విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో విద్యాసాగర్ చింత, బీవీఎస్ఎన్ ప్రసాద్, రుక్సార్ థిల్లాన్, చిత్ర కథారచయిత, షో రన్నర్ రవికిరణ్ కోలా, సంగీత దర్శకుడు జై క్రిష్ తదితరులు పాల్గొన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విశ్వక్సేన్పై మంత్రికి ఫిర్యాదు చేసిన ప్రముఖ యాంకర్
యంగ్ హీరో విశ్వక్సేన్- టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరగుతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్, ఆయన టీం చేసిన ప్రాంక్ వీడియో విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఓ టీవీ ఛానెల్లో జరిగిన డిబెట్లో విశ్వక్ సేన్, సదరు యాంకర్‌కి మధ్య వాడివాడి చర్చ జరిగింది. స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరవడం, దానికి విశ్వక్ సేన్ అభ్యంతరకర ఎఫ్.. పదాన్ని వాడటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఇదే అంశంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి యాంకర్ దేవి నాగవల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మంత్రి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విశ్వక్ సేన్ ప్రవర్తన బాగాలేదు. కశ్చితంగా చర్యలు ఉంటాయి. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తా.. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానంటే ఎవరూ ఊరుకోరు. ఆయన సారీ చెప్పిన పద్దతి కూడా సరిగా లేదు.ఈ విషయాన్ని మా అసోసియేషన్ దృష్టికి కూడా తీసుకెళ్తాం' అని పేర్కొన్నారు. -
ఆ విషయంపై 'సారీ' చెప్పిన విశ్వక్ సేన్
Vishwak Sen Says Apology On Objectionable Word: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీపై ప్రముఖ టీవీ ఛానెల్ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ అభ్యంతరకర (ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. ప్రస్తుతం ఈ పదాన్ని వాడటంపై కూడా పలు విమర్శలు వస్తున్నాయి. మే 2న నిర్వహించిన మూవీ ప్రమోషన్లో ఓ విలేఖరి విశ్వక్ సేన్‌ను ఈ పదం వాడటంపై ప్రశ్నించారు. దీనికి విశ్వక్ స్పందిస్తూ 'దెబ్బ తగిలినప్పుడు అమ్మా అన్నట్టే.. ఆ పదం అలా వచ్చింది. నిజంగానే అలాగే వచ్చింది. ఇప్పట్లో చిన్న పిల్లలకు, 16 ఏళ్ల వయసున్న యూత్‌కు వద్దన్నా ఆ పదం వచ్చేస్తోంది. కానీ మీడియాలో ఆ పదం వాడినందుకు సారీ. దీనిపై రేపు (మే 3) క్లారిటీగా నోట్ రిలీజ్ చేస్తాను' అని తెలిపాడు. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
విశ్వక్ సేన్ గురించి చెప్పగానే షాకయ్యా!
Ravikiran About Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam: విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ఇందులో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు షో రన్నర్‌గా వ్యవహరించిన రవికిరణ్ మాట్లాడుతూ.. ‘‘రాజావారు రాణివారు’ సినిమాకు దర్శకత్వం వహించిన నేను ఇప్పుడు ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాకు షో రన్నర్‌గా వర్క్ చేశాను. సాధారణంగా వెబ్ సిరీస్‌లకు షో రన్నర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ఈ సినిమాకు షో రన్నర్ అనేది వస్తోంది. షో రన్నర్ అంటే క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీ. నేను దర్శకుడిగా చేసిన ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి విద్యాసాగర్ కెమెరామేన్‌గా చేశాడు. లాక్డౌన్లో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ కథను విశ్వక్ సేన్‌కు చెప్పడం జరిగింది. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని ప్రేమ్ అనే వ్యక్తి ఈ సినిమాకు దర్శకుడిగా చేయాల్సింది కానీ అతని వ్యక్తిగత కారణాల వల్ల కుదర్లేదు. దీంతో విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. విద్యాసాగర్‌లో మంచి దర్శకుడు ఉన్నాడని ‘రాజావారు రాణిగారు’ టైమ్‌లోనే నాకు తెలిసింది. దీంతో ఆయనకు దర్శకత్వ బాధ్యతలను ఇవ్వడం జరిగింది. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నేను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్వారితో ఓ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో బిజీగా ఉండటం వల్లే నేను ‘అశోకవనంలో....’ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా చాలామంది పేర్లను అనుకున్నాం. కానీ విశ్వక్ సేన్ పేరుని విద్యాసాగరే చెప్పాడు. ఒక్క క్షణం షాకయ్యాను. ఎందుకంటే ఇప్పటివరకు మెజారిటీ చిత్రాల్లో మాస్ పాత్రలే చేసిన విశ్వక్ సేన్‌ది ఈ చిత్రంలో కాస్త భిన్నమైన పాత్ర. పెళ్లి కాని 33 ఏళ్ల అల్లం అర్జున్ కుమార్‌గా బాగా నటించారు. చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. అల్లం అర్జున్‌కుమార్ పెళ్లి, అతని జీవితం నేపథ్యంలోనే కథ సాగుతుంది. సినిమాలో ఆంధ్రా అమ్మాయి, తెలంగాణ అబ్బాయిల పెళ్లి అన్నట్లుగా ఉంటుంది. సో.. సంస్కృతి, సంప్రదాయాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. లవ్, లైఫ్, మ్యారేజ్ అనే అంశాలను ప్రస్తావిస్తూనే కాస్త కొత్తగా, సీరియస్‌గా చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్లో నేను చేస్తున్న పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ కాకుండా, ఓ అడ్వెంచర్ కథ నా దగ్గర ఉంది. నా తర్వాతి సినిమాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చెబుతాను’’ అని రవికిరణ్ అన్నారు. చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు -
విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
Ram Gopal Varma Reacts To Vishwak Sen TV Anchor Video: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ చేసిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియోతో విమర్శల పాలైంది. ఈ క్రమంలోనే విశ్వక్ సేన్, చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది ప్రముఖ టీవీ ఛానెల్. అయితే ఈ డిబెట్లో యాంకర్‌కు విశ్వక్ సేన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. విశ్వక్ సేన్‌ను స్టూడియో నుంచి 'గెట్ అవుట్' అంటూ యాంకర్ గట్టిగా అరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోపై తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'ఒక పురుషుడి కన్నా పవర్‌ఫుల్‌గా ఒక మహిళ కనిపించడం నేను ఇంతవరకు చూల్లేదు. ఆమె సర్కార్ కన్నా తక్కువేం కాదు' అంటూ ఆ యాంకర్‌ను ట్యాగ్ చేశాడు ఆర్జీవీ. కాగా ప్రాంక్ వీడియో కారణంగా ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే లాయర్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో (హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు I never saw a woman looking so much more powerful than a man 💪😍💪 @Devi_Nagavalli is no less than SARKAR 🙏🙏🙏 pic.twitter.com/QbJIMTbR0K — Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2022 -
‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్
Argument Between TV Anchor And Hero Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం ఓ ప్రాంక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేయిస్తున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హీరో విశ్వక్ సేన్‌పై అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్లో(హెచ్ఆర్సీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు తాజాగా ఈ వీడియో కాస్తా కాంట్రవర్సి కావడంతో ప్రముఖ టీవీ చానల్ హీరో విశ్వక్ సేన్, సినీ ఇండస్ట్రీకి చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా ప్రాంక్ వీడియోలు చేయడం ఏంటని, హీరో మెంటల్ స్టేటస్‌పై ప్రశ్నించింది యాంకర్. ఈ నేపథ్యంలో విశ్వక్‌ను డిప్రెషన్ పర్సన్, పాగల్ శ్రీను వంటి పదాలు వాడారు. దీంతో విశ్వక్ యాంకర్‌పై ఫైర్ అయ్యాడు. ‘నేను డిప్రెషన్‌కి వెళ్లిపోయానని మీరు స్టేట్మెంట్ పాస్ చేయడం కరెక్ట్ కాదు. అలా ఏ డాక్టర్ చెప్పాడో అతడి నెంబర్ ఇవ్వండి నేను మట్లాడుతాను. నా పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియదు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు’ అన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. అలాగే ‘నాకు పాగల్ శీను అనే పేరు పెట్టారు. నేను కూడా మీపై పరువు నష్టం దావా వేయొచ్చు. కానీ నేను అలా చేయను. మీరు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. డిప్రెషన్ పర్సన్, పాగల్ శీను అని అనడం సరికాదు’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో యాంకర్ విశ్వక్ సేన్‌ను నువ్వు ముందు స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోమ్మంటూ గట్టిగా అరించింది. దీంతో యాంకర్‌పై విశ్వక్ విరుచుకుపడుతు అభ్యంతరకర(ఎఫ్.. అనే పదం) పదాన్ని వాడాడు. దీంతో సహనం కోల్పోయిన యాంకర్ ‘యు గెటవుట్ ఫస్ట్ ఫ్రమ్ స్టూడియో’ అంటూ పదే పదే చెప్పడంతో ‘నేను బయటకు పోతే నా గురించి ఇష్టమొచ్చినట్లు చెబుతారు. యు జస్ట్ షటప్’ అనేసి విశ్వక్ స్టూడియో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. -
హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
Complaint Of Hero Vishwak Sen: ప్రమోషన్స్ పేరుతో న్యూసెన్స్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్‌పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హ్యుమర్ రైట్ కౌన్సిల్(హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తన తాజా చిత్రం ‘ఆశోకవనంలో అర్జుణ కల్యాణం’ త్వరలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమాని చేత పెట్రోల్‌తో సూసైడ్ ప్రయత్నం చేసుకునే విధంగా ప్రాంక్ వీడియో చేయించింది చిత్ర బృందం. చదవండి: ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ కుమార్ హీరో విశ్వక్ సేన్, మూవీ టీంపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ పబ్లిక్కు అంతరాయం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. పబ్లిక్ ప్లేస్‌లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. చదవండి: ‘హిట్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఆ రోజే థియేటర్లో సందడి విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా మే 6న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ అభిమానితో అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సైతం సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే..
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తాజాగా హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే4 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే6న విడుదల కానుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంతో సుమ పల్లెటూరి మహిళ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్గా నటించింది. 'మహానటి' కీర్తి సురేష్ సెల్వ రాఘవన్‌తో కలిసి నటించిన తాజా చిత్రం 'సాని కాయిధం' . చిన్ని పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. అరుణ్ మథేశ్వరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిచారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో అలరించనుంది. థియేరట్‌లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే6న చిన్ని స్ట్రీమింగ్ కానుంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మించారు. పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్ సేన్ నటించినట్లు తెలుస్తోందినీ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెజాన్ ప్రేమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ)- మే5 ద వైల్డ్(వెబ్‌సిరీస్2)- మే6 నెట్‌ప్లిక్స్ రాధేశ్యామ్(హిందీ)-మే4 థార్(మిందీ)-మే6 40 ఇయర్స్ యంగ్(హాలీవుడ్)-మే4 ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(వెబ్‌సిరీస్)-మే6 డిస్నీ+హాట్‌స్టార్ హోమ్ శాంతి(హిందీ సిరీస్)-మే6 స్టోరీస్ ఆన్ది నెక్ట్స్ పేజ్(హిందీ సిరీస్)-మే6 జీ5 ఝండ్(హిందీ)-మే6 -
ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్
హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కోసం చేయించిన ప్రాంక్ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్డులో వెళుతుంటే ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారి ఆలోచించాలా అంటూ చిత్ర యూనిట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది. లేకపోతే ఆడియెన్స్ చూడరు. ఇలాంటి జిమ్మిక్కులు వర్కవుట్ కావని ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రాంక్ పేరుతో పబ్లిక్ ప్లేస్‌లో న్యూసెన్స్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. https://t.co/VXk5VSKO4y#VishwakSen and His Fan Hulchal On #Road | #AshokaVanamLoArjunaKalyanam | Filmylooks #Tollywood — MrB Celeb News (@mrbcelebnews) May 1, 2022 -
మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే, నేనూ లవ్ మ్యారేజ్ చేసుకుంటా!
‘‘కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే నిడివి గురించి నాకు పెద్దగా పట్టింపులు లేవు. ఎలాంటి పాత్రైనా చేస్తాను. అలాగే ఫలానా పాత్రలే చేయాలని పరిమితులు పెట్టుకోలేదు కూడా’’ అని అన్నారు హీరోయిన్ రుక్సార్ థిల్లాన్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించారు. విద్యాసాగర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో రుక్సార్ థిల్లాన్ మాట్లాడుతూ.. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా సందేశాత్మకంగా పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో నేను మాధవి అనే సింపుల్ గాళ్ పాత్ర చేశాను. కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి. ఇదో చాలెంజ్లా అనిపించింది. ఇక స్క్రీన్‌పై విశ్వక్, నా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. దర్శకుడు విద్యాసాగర్ నాకు యాక్టింగ్‌లో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక దర్శకులు సుకుమార్‌గారంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది. యాక్టింగ్‌లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్గార్లంటే ఇష్టం. కోవిడ్ వల్ల వరుసగా సినిమాలు చేయలేకపోయాను. రీసెంట్గా హిందీలో ఓ వెబ్ షో చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘‘మా ఇంట్లో దాదాపు ప్రేమ వివాహాలే. నేనూ ప్రేమ పెళ్లే చేసుకోవాలనుకుంటున్నా. నన్ను బాగా అర్థం చేసుకుని, నా కెరీర్‌ను సపోర్ట్ చేస్తూ, నా అభిప్రాయాలను గౌరవించే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. చదవండి: నాకు ఆశలు కల్పించి వెంటన్నే ఆ ఆశలపై నీళ్లు చల్లడం భావ్యమా? బిగ్‌బాస్ బ్యూటీకి సల్మాన్ ఖాన్ బంపరాఫర్, ఆమె ఎంత అడిగితే అంత! -
ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు !
Upcoming Telugu Movies On May 6 2022: మొన్నటిదాకా ఆర్ఆర్ఆర్, నిన్నటిదాకా నేడు కేజీఎఫ్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య విడుదలైంది. ఇక సినీ ప్రియులు, సినిమా నిర్మాతల దృష్టి వచ్చే శుక్రవారం పడింది. అంటే మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముచ్చటగా మూడు చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దామా ! మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'అశోకవనంలో అర్జున కల్యాణం'. రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా చేసిన ఈ మూవీకి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మూడు పదుల వయసులో వివాహం అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. యాంకర్‌గా బాగా రాణిస్తున్న సుమ కనకాల నటించిన సినిమా 'జయమ్మ పంచాయతీ'. గ్రామీణ నేపథ్యంతో సాగే కథతో వస్తున్న ఈ 'జయమ్మ పంచాయతీ' ఎంటో మే 6న తెలియనుంది. ఇక శ్రీవిష్ణు హీరోగా, కేథరీన్ త్రేసా హీరోయిన్గా వస్తున్న చిత్రం 'భళా తందనాన'. వారాహి బ్యానర్‌పై చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ 1 ఫేమ్ గరుడ రామ్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిచారు. ఈ మూవీ కూడా తన సత్తా చాటేందుకు మే 6 తేదినే ఎంచుకుంది. ఈ మూడు చిత్రాల్లో ప్రజలు ఎక్కువగా ఏ సినిమాను ఆదరిస్తారో చూడాలి. చదవండి: తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్.. అల్లు అర్జున్‌కు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
నాకు లవ్‌స్టొరీ ఉంది, కానీ బ్రేకప్ అయ్యింది: హీరో ఎమోషనల్
Vishwak Sen Love Breakup Story: 'పాగల్' సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్ విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్స్‌ను కాస్తా డిఫరెంట్‌గా చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇన్స్టాగ్రామ్ సెలబ్రెటీలతో విశ్వక్ సేన్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! ఈ క్రమంలో ప్రతి సినిమాలో తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉన్నట్లు నిజ జీవితంలో ఏదైనా ఉందా? అని ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి విశ్వక్ స్పందిస్తూ.. ప్రతి ఒక్క మగాడి జీవితం ఖచ్చితంగా ప్రేమ, బ్రేకప్ ఉంటుందన్నాడు. అలాగే తన జీవితంలో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందన్నాడు. ‘నా జీవితంలో ఒకేసారి లవ్‌లో పడ్డాను. అది కూడా బ్రేకప్ అయ్యింది. నా కాలేజీలో రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. అయితే కాలేజీ మూడేళ్లలో తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కాలేజీ అయిపోయాక తనని ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశాను. ఓ సంఘటనతో ఇద్దరం దగ్గరయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ.. ఆడియెన్స్ ఏం అంటున్నారంటే.. ‘ఇక అంతా ఓకే అనుకున్నాను. కానీ ఎందుకో తెలియదు ఆ అమ్మాయి నన్ను ఎప్పుడో వదిలేసింది. అయితే ఈ విషయం 30 రోజుల తర్వాత నాకు తెలిసింది. తను మొదటి రోజు లేదా 7వ రోజు చెబితే బాగుండేది. కానీ నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. అది చాలా బాధాకరం’ అంటూ విశ్వక్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికీ తనని మరిపోలేదని, బ్రేకప్ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుందని విశ్వక్ ఎమోషనల్ అయ్యాడు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని, బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండ కాస్తా జోష్ ఉన్న సాంగ్స్ పెట్టమని తనే దర్శకులకు చెబుతానన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ పాటలు కూడా ఫుల్ జోష్‌గా ఉంటాయని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అశోకవనంలో అర్జున కల్యాణం' ట్రైలర్ రిలీజ్..(ఫోటోలు)
-
36 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం నేరమా ?.. ప్రశ్నించిన విశ్వక్ సేన్
Ashoka Vanamlo Arjuna Kalyanam Trailer: 'పాగల్' సినిమా తర్వాత యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్ విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ దిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రారంభంనుంచి విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్ తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. 'రాసేసుంటది.. మొత్తం రాసేసుంటది స్క్రిప్ట్..' అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ, ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంది. 36 ఏళ్లు వస్తే పెళ్లి చేసుకోకూడదా ? అదేమైనా నేరమా ? జైళ్లో పెడతారా ? అని విశ్వక్ సేన్ చెప్పే డైలాగ్ ఎమోషనల్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో తెలంగాణ అబ్బాయి అర్జున్ కుమార్‌గా విశ్వక్ సేన్, ఆంధ్రా అమ్మాయి మాధవిగా రుక్సార్ దిల్లాన్ కనిపించనున్నారు. 33 ఏళ్లు వచ్చిన అర్జున్‌కు ఎందుకు పెళ్లి కాలేదు ? సంబంధం ఫిక్స్ అయిన తర్వాత మాధవి పెళ్లి వద్దని ఎందుకు చెప్పింది ? వంటి అంశాలతో సినిమా చూసి తెలుసుకునేలా ఆసక్తిగా ట్రైలర్ ఉంది. ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన లభించింది.