మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి..
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథగా వచ్చిన ఈ మూవీకి రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు తాజాగా హిందీ వర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే4 నుంచి ప్రసారం కానుంది.
ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయతీ’.విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే6న విడుదల కానుంది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంతో సుమ పల్లెటూరి మహిళ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్‌గా నటించింది.
'మహానటి' కీర్తి సురేష్ సెల్వ రాఘవన్‌తో కలిసి నటించిన తాజా చిత్రం 'సాని కాయిధం' . చిన్ని పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. అరుణ్ మథేశ్వరం ఈ చిత్రానికి దర్శకత్వం వహిచారు. ఇందులో కీర్తి సురేష్ ఒక గ్రామీణ యువతిగా డీ గ్లామరైజ్‌డ్ పాత్రలో అలరించనుంది. థియేరట్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మే6న చిన్ని స్ట్రీమింగ్ కానుంది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. సుధీర్ చంద్ర నిర్మించారు. పెళ్లి కోసం పాట్లు పడే మధ్యతరగతి అబ్బాయిగా విశ్వక్ సేన్ నటించినట్లు తెలుస్తోందినీ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమెజాన్ ప్రేమ్
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(కన్నడ)- మే5
ద వైల్డ్(వెబ్‌సిరీస్2)- మే6
నెట్‌ప్లిక్స్
రాధేశ్యామ్(హిందీ)-మే4
థార్(మిందీ)-మే6
40 ఇయర్స్ యంగ్(హాలీవుడ్)-మే4
ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్(వెబ్‌సిరీస్)-మే6
డిస్నీ+హాట్‌స్టార్
హోమ్ శాంతి(హిందీ సిరీస్)-మే6
స్టోరీస్ ఆన్‌ది నెక్ట్స్ పేజ్(హిందీ సిరీస్)-మే6
జీ5
ఝండ్(హిందీ)-మే6
Comments
Please login to add a commentAdd a comment