Upcoming Movies OTT And Theatre Releases In April 2nd Week, Details Inside - Sakshi
Sakshi News home page

OTT And Theatre Releases: ఏప్రిల్‌ రెండో వారంలో రిలీజవుతున్న సినిమాలు ఇవే..

Published Tue, Apr 5 2022 6:38 PM | Last Updated on Fri, Apr 8 2022 3:22 PM

Upcoming Movies Theatre And OTT April 2nd Week - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్‌' మూవీతో రెండోవారం కూడా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌ నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ మూవీ చూసేందుకు సినీప్రియులు ఎగబడుతున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం దూకుడు చూస్తుంటే మరి కొన్ని రోజుల దాకా  దీని ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమాను కొద్దిగా ఇరకాటంలో పెట్టేందుకు ఈ వారం వచ్చేస్తున్నాయి మరికొన్ని చిత్రాలు. అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్‌ ఓసారి చూద్దామా !

1. గని

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, సయి మంజ్రేకర్‌ జోడీగా వస్తున్న క్రీడా నేపథ్యం ఉన్న సినిమా 'గని.' కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న 'గని' ఏప్రిల్‌ 8న ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. బాబాయి పవన్‌ కల్యాణ్‌ 'తమ్ముడు' సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం చేసినట్లు వరుణ్‌ చెబుతున్నాడు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్‌ శెట్టి వంటి భారీతారగణంతో వస్తున్న 'గని' ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. 

2. మా ఇష్టం (డేంజరస్‌)



సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్‌లో రూపొందిన క్రైమ్‌ డ్రామా చిత్రం 'మా ఇష్టం (డేంజరస్‌)'. అప్సరారాణి, నైనా గంగూలీ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఏప్రిల్‌ 8న విడుదల కానుంది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. వర్మ చేసిన ఈ ప్రయోగాన్ని ఆడియెన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారో లేదో చూడాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. 

ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు..

1. స్టాండప్ రాహుల్‌



యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా వచ్చిన చిత్రం 'స్టాండప్ రాహుల్‌'. శాంటో మోహన వీరంకి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 18న విడదలైంది. కాగా ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' వేదికగా ఏప్రిల్‌ 8 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 

నెట్‌ఫ్లిక్స్‌
చస్వీ (హిందీ) ఏప్రిల్‌ 7
ఎత్తర్కుం తునిందావన్‌ (ఈటీ, తమిళం) ఏప్రిల్‌ 7
ఎలైట్‌ (వెబ్ సిరీస్‌) ఏప్రిల్‌ 8
మెటల్‌ లార్డ్స్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 8
ది ఇన్‌బిట్విన్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 8

అమెజాన్ ప్రైమ్‌ వీడియో
మర్డర్‌ ఇన్‌ అగోండా (హిందీ) ఏప్రిల్ 8
నారదన్‌ (మలయాళం) ఏప్రిల్ 8

జీ5
ఎక్‌ లవ్‌ యా (కన్నడ) ఏప్రిల్ 8
అభయ్‌ 3 (హిందీ) ఏప్రిల్ 8

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
ది కింగ్స్‌ మెన్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్ 8

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement