Ghani Movie
-
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి!
కరోనా వల్ల పూర్తిగా చతికిలపడ్డ బాక్సాఫీస్ బిజినెస్ అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 హిట్లతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాల సక్సెస్‌ను చూసి మరిన్ని చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచేందుకు సై అంటున్నాయి. అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలేంటో చూసేయండి.. జెర్సీ షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన జెర్సీకి ఇది రీమేక్. తెలుగు జెర్సీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌కు సైతం దర్శకత్వం వహించాడు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతోంది. 1996 ధర్మపురి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ సమర్పణలో గగన్ విహారి, అపర్ణ హీరోహరోయిన్లుగా నటించిన సినిమా 1996 ధర్మపురి. విశ్వజగత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 22న రిలీజవుతోంది. ఆహా గని - ఏప్రిల్ 22 అమెజాన్ ప్రైమ్ ఓ మై డాగ్ - ఏప్రిల్ 21 గిల్టీ మైండ్స్ - ఏప్రిల్ 22 జీ 5 అనంతం - ఏప్రిల్ 22 నెట్‌ఫ్లిక్స్ కుథిరైవాల్ - ఏప్రిల్ 20 ద మార్క్డ్ హార్ట్ - ఏప్రిల్ 20 హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 21 సోని లివ్ అంత్యాక్షరి - ఏప్రిల్ 22 వూట్ లండన్ ఫైల్స్ - ఏప్రిల్ 21 చదవండి: అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి భారీ ఆఫర్‌ను తిరస్కరించిన బన్నీ!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్ -
రెండు వారాలకే ఆహాలో గని, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ఎక్కువగా లవ్ స్టోరీలతో పలకరించిన వరుణ్ ఈ సినిమాలో మాత్రం బాక్సర్‌గా కనిపించాడు. అయితే ఈ యాక్షన్ మూవీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. అంచనాలకు తగ్గట్లుగా ఫలితాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో ఈ సినిమా అప్పుడే ఓటీటీ బాట పట్టింది. ఏప్రిల్ 8న థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం కేవలం పదిహేను రోజుల్లోనే ఆహాలో రిలీజవుతోంది. ఈ విషయాన్ని తెలుగు ప్లాట్‌ఫామ్ ఆహా అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 22 నుంచి ఆహలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. Kanivini yerugani style lo vastunnadu #GhaniOnAHA. Gear up to witness the Mega Prince @IAmVarunTej in this action family drama on 22nd April. @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @abburiravi @sidhu_mudda @Bobbyallu pic.twitter.com/Y7Lz5DZk4K — ahavideoin (@ahavideoIN) April 17, 2022 చదవండి: 'అందులో నిజం లేదు,ఆ కారు ప్రభాస్ది కాదు'.. పీఆర్ టీం క్లారిటీ -
'గని' సినిమా డిజాస్టర్‌పై స్పందించిన వరుణ్‌తేజ్
యాక్షన్ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీకి వచ్చిన హీరో వరుణ్ తేజ్. కానీ అతడి కెరీర్లో రొమాంటిక్ సినిమాలే హిట్స్‌గా నిలిచాయి. ఫిదా, తొలి ప్రేమ వంటి లవ్‌స్టోరీలతో హిట్స్ సాధించిన వరుణ్ ఈసారి యాక్షన్ ఫిలిం గనితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 8న విడుదలైన గని బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. వీకెండ్స్‌లోనూ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్‌గా మిగిలింది. ఈ క్రమంలో గని సినిమాపై వరుణ్ తేజ్ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. 'ఎన్నో ఏళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను సర్వదా విధేయుడిని. గని మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా నిర్మాతలకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాము. కానీ మా ఆలోచనలను అనుకున్నరీతిలో తెరపై చూపించలేకపోయాము. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ప్రతి సినిమా చేస్తాను. ఈ క్రమంలో కొన్నిసార్లు గెలుస్తాను, మరికొన్నిసార్లు సినిమా ఫలితాల నుంచి నేర్చుకుంటాను. ఏదేమైనా కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను' అంటూ ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్. pic.twitter.com/MXtMtBofR2 — Varun Tej Konidela (@IAmVarunTej) April 12, 2022 చదవండి: హీరో నాగచైతన్య కారుకు పోలీసుల జరిమానా మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన బిందు మాధవి లవ్ ఎఫైర్ -
బన్నీ అలా అంటాడని ఊహించలేదు: ఉపేంద్ర
Upendra Comments On Allu Arjun In Latest Interview: హీరో ఉపేంద్ర.. ఒకప్పుడు తెలుగులోనూ హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిద్యమైన కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇక్కడ తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం సహా నటుడి పాత్రలు చేస్తున్న ఆయన అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యామూర్తి’ చిత్రంలో ప్రతికథానాయకుడిగా కనిపించాడు. తాజాగా గని మూవీలో ఓ కీ రోల్ పోషించాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: పెద్దపల్లి జిల్లా గొదావరి ఖనిలో నాని మూవీ షూటింగ్ ఈ సందర్భంగా ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి మూవీని గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ సెట్లో బన్నీ చాలా సరదాగా ఉండేవాడన్నాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి మూవీ సెట్ బన్నీ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. నాకు రోజు ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడు. నాకు ఇష్టమైన వంటకాలు ఏవో తెలుసుకుని స్పెషల్‌గా చేయించి తీసుకువచ్చేవాడు. ఆ సినిమా పూర్తయ్యేవరకు బన్నీ నన్ను ఒక గిప్ట్లా చూసుకున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు! అలాగే ‘‘ఓ రోజు బన్నీని ఇలా అడిగాను. మీకు అంత్యంత సంతోషాన్ని ఇచ్చేది ఏది.. ఖరీదైన కార్ల? టూర్ల? అని అడిగాను. దానికి అతను ‘అసలు నాకు దేనిపై పెద్దగా ఆసక్తి ఉండదు. నాకు సంతోషాన్ని ఇచ్చేది సినిమాలు మాత్రమే. షూటింగ్ ఉంటే నాకు ఆరోజు పండగ రోజులా ఉంటుంది’ అని సమాధానం ఇచ్చాడు’ అని ఉపేంద్ర పేర్కొన్నారు. అనంతరం బన్నీ నోట నుంచి అలాంటి సమాధానం ఊహించలేదని, వర్క్ పట్ల అతడు చూపించే అంకితభావం చూసి ఆశ్చర్యం వేసిందన్నాడు. కొత్త ఇండస్ట్రీకి వచ్చేవారు బన్నీని చూసి నేర్చుకోవాలి అని ఉపేంద్ర పేర్కొన్నారు -
Ghani Movie: అప్పుడే ఓటీటీలోకి 'గని'!
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'గని'. సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల అయిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా గని మూవీ ఓటీటీలో దర్శనం ఇచ్చేందుకు రెడీ అవుతుంది. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన 4-5వారాల తర్వాత డిజిటిల్లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోను బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పుష్ప సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. రాధేశ్యామ్ కూడా రెండు వారాల్లోనే డిజిటల్లో సందడి చేసింది. ఇప్పుడు గని సినిమా కూడా రిలీజ్ అయిన మూడు వారాలకు అంటే ఏప్రిల్ 29నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. -
Ghani Movie Review: ‘గని’ పంచ్ అదిరిందా?
-
వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్
Manchu Vishnu Comments On Varun Tej Ghani Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ మూవీ ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్ 8న) థీయేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గనితో తొలిసారి బాక్సర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీపై ‘మా’ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు కామెంట్స్ చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. చదవండి: కేజీఎఫ్‌తో పాటు ‘సలార్’ గ్లింప్స్, ఆడియన్స్‌కి ప్రశాంత్ నీల్ డబుల్ ట్రీట్ Wishing all the best for my brother @IAmVarunTej for #Ghani. Wishing you a grand success 💪🏽 — Vishnu Manchu (@iVishnuManchu) April 8, 2022 ఈ రోజు గని రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు వరుణ్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడు. ‘ఆల్ ది బెస్ట్ మై బ్రదర్ వరుణ్ తేజ్. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ విష్ణు రాసుకొచ్చాడు. ఇక దీనిపై నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఓ వర్గం నెటిజన్లు అయితే ఆయన ట్వీట్‌పై నెగిటివిటి ప్రచారం చేస్తూ కామెంట్స్ చేస్తుండగా.. వారందరికి విష్ణు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. కాగా నేడు విడుదలైన ‘గని’ మూవీ మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంటుంది. చదవండి: Ghani Review: ‘గని’ పంచ్ ఎలా ఉందంటే.. -
‘గని’ మూవీ రివ్యూ
టైటిల్ : గని జానర్ : స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియ, నవీన్ చంద్ర, నరేశ్ తదితరులు నిర్మాతలు : అల్లు బాబీ, సిద్దు ముద్ద దర్శకత్వం : కిరణ్ కొర్రపాటి సంగీతం : తమన్ ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ సినిమాటోగ్రఫీ : జార్జ్ సి. విలియమ్స్ విడుదల తేది : ఏప్రిల్ 8, 2022 మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో కథల ఎంపిక విషయంలో కాస్త తడపడినా.. ఆ తర్వాత ఢిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా వరుణ్ చేసిన మరో ప్రయోగం ‘గని’. ఇందులో తొలిసారి బాక్సర్‌గా తెరపై కనించబోతున్నాడీ హీరో. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘గని’ కథేంటంటే ‘గని’(వరుణ్ తేజ్)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. వాళ్ల నాన్న విక్రమాదిత్య(ఉపేంద్ర) విషయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల ‘గని’ బాక్సింగ్‌కు దూరమవుతాడు. దీంతో గనికి తండ్రి మీద విపరీతమైన ద్వేషం ఏర్పడుతుంది. మరోవైపు జీవితంలో ఎప్పుడూ బాక్సింగ్ జోలికి వెళ్లొద్దని గని అమ్మ(నదియ) ఒట్టు వేయించుకుంటుంది. గని మాత్రం తల్లికి తెలియకుండా బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటూనే ఉంటాడు. ఎప్పటికైనా నేషనల్ చాంపియన్‌గా నిలవాలనేదే అతని ఆశయం. అసలు గని బాక్సింగ్‌లో నేషనల్ చాంపియన్ కావాలని ఎందుకు అనుకుంటున్నాడు? వాళ్ల నాన్న విషయంలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి? తండ్రి గురించి అసలు విషయం తెలుసుకున్న తర్వాత గని ఏం చేశాడు? తన తండ్రికి ఈశ్వర్(జగపతి బాబు)చేసిన అన్యాయం ఏంటి? ఈశ్వర్ అసలు రూపాన్ని గని ఎలా బయటపెట్టాడు? గని చివరకు నేషనల్ చాంపియన్‌గా నిలిచాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్. కానీ ‘గని’ క్యారెక్టర్ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలను చూపిస్తూ కథను ముందుకు నడిపించాడు దర్శకుడు కిరణ్ కొర్రపాటి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో తడబడ్డాడు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా నడిపించి, అసలు కథను సెకండాఫ్‌లో చూపించాడు. ఫస్టాఫ్‌లో వచ్చే కాలేజీ సీన్స్, తల్లి కొడుకుల సెంటిమెంట్ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హీరోయిన్‌తో ప్రేమాయాణం అయితే అతికినట్లే ఉంది తప్ప వారి లవ్‌కి ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాలేడు. కమర్షియల్ సినిమా అన్నాక ఓ హీరోయిన్ ఉండాలి అనే కోణంలో ఆమె క్యారెక్ట్‌ని సృష్టించారు తప్ప.. ఈ కథకి అసలు ఆ పాత్రే అవసరం లేదనిపిస్తుంది. ఇక తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. నవీన్‌చంద్ర, వరుణ్‌ల మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎలాంటి సర్ప్రైజ్ లేకుండా ఫస్టాఫ్ అంతా చాలా చప్పగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉపేంద్ర ప్లాష్‌బ్యాక్ సీన్‌తో సెకండాఫ్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కథంతా మళ్లీ రొటీన్‌గానే సాగుతుంది. తండ్రికి అన్యాయం చేసిన ఈశ్వర్ ఇండియన్ బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) నెలకొల్పడం.. ఆ ముసుగులో కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం..దానిని గని అరికట్టడంతో కథ ముగుస్తుంది. అయితే ఇక్కడ వచ్చే ప్రతి సీన్ గతంలో స్టోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను గుర్తుకు చేస్తాయి. ప్రేక్షకుడి ఊహకి తగ్గట్టుగా కథనం సాగుతుంది. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో, గనిలోనూ అదే ఉంది. కాకపోతే ఎమోషన్ మిస్సయిందనిపిస్తుంది. ప్రతి పాత్రకు పేరున్న నటులను తీసుకోవడం సినిమాకు కలిసొచ్చింది. ఎవరెలా చేశారంటే.. బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ మెప్పించాడు. ఈ పాత్ర కోసం వరుణ్ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. రింగ్‌లోకి దిగే నిజమైన బాక్సర్లాగే కనిపించాడు. మాయ పాత్రలో సాయీ మంజ్రేకర్ పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. ఇక హీరో తండ్రి విక్రమాదిత్యగా ఉపేంద్ర తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించాడు. కథను మలుపు తిప్పే పాత్ర అతనిది. గని కోచ్ పాత్రకు సునీల్ శెట్టి న్యాయం చేశాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈశ్వర్ పాత్రలో జగపతిబాబు పరకాయ ప్రవేశం చేశాడు. హీరో తల్లిగా నదియా, బాక్సర్‌గా నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలు యావరేజ్‌గానే ఉన్నప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని విలీనం చేయడంలో నేపథ్య సంగీతానిది కీలక పాత్ర.. ఆ విషయంలో తమన్‌కి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. బాక్సాఫీస్‌పై ‘గని’ పంచ్ ఎలా ఉంటుందో ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘గని’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన హీరోగా నటించిన గని మూవీ పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు నేడు(ఏప్రిల్ 8) థియేటర్స్‌లో విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. అతనికిది తొలి సినిమా. వరుణ్‌కు జోడిగా సయీ మంజ్రేకర్ నటించింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత విడుదలవుతున్న ‘గని’పై టాలీవుడ్లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేశాయి. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రివ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కథేంటి, కథనం ఎలా ఉంది? బాక్సర్‌గా వరుణ్ రాణించాడా లేదా తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #Ghani in UK 🇬🇧 One word Review : “Routine Sports Drama” Positives: Varun Tej Thaman BGM Production Values Negatives: Writing Directing Saiee Manjrekar#VarunTej #SaieeManjrekar #Sunielshetty #Upendra #Thaman #Nadhiya #Jagapathibabu — Manyu Cinemas (@ManyuCinemas) April 8, 2022 బాక్సర్‌గా వరుణ్ తేజ్ వందశాతం మెప్పించాడని చెబుతున్నారు. తమన్ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. First half report :BGM is the only plus.. Pre interval is ok 👍 Apart from that chaala slow ga undi.. 🏃🤷♂️Ala ala velthadi.. 🙃@tollymasti #tollymasti . .#Ghani #GhaniReview #GhaniFromApril8th #GhaniReleasePunch #VarunTej #GhaniMovie — Tollymasti (@tollymasti) April 8, 2022 కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేషాలు కూడా బాగా పండాయని ట్వీట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్‌లోనే అసలు స్టోరీ ఉందని కామెంట్ చేస్తున్నారు. ఉపేంద్ర ఎంట్రీతో సినిమా టర్న్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Ghani Just Good. Normal Sports Drama.@IAmVarunTej as Boxer is 👌 Easily a good movie for #VarunTej FINAL Word: EASILY WATCHABLE — JD 🏴☠️ (@Tight_Slapz) April 8, 2022 #GhaniReview : “Routine Sports Drama” 👉Rating : 2/5 ⭐️ ⭐️ Positives: 👉#VarunTej 👉Production Values Negatives: 👉Weak Writing & Direction 👉Pointless Drama 👉Outdated Scenes 👉Predictable Narration 👉No high points#GhaniMovie #GHANI — PaniPuri (@THEPANIPURI) April 8, 2022 #Ghani is just a boring mixture all the sports dramas we've seen. One can actually predict every upcoming scene in the movie. The writing and music failed terribly. No notable performances. This one's easily avoidable. — A (@Iwatchfilmsss) April 7, 2022 #Ghani Overall A Routine Sports Drama that offers nothing new except a few good moments in the 2nd Half! The film is predictable from the first few scenes and the entire 1st half is wasted with a love track. 2nd half is somewhat better but still lacks the punch. Rating: 2.5/5 — Venky Reviews (@venkyreviews) April 8, 2022 #Ghani 1st Half Decent with Love scenes, Comedy & Twist..2nd Half Excellent👌@MusicThaman BGM & Songs Highlight🔥@IAmVarunTej Looks, Body Building & Acting Superb Fantastic❤️ On the Whole Very Good Revenge Sports Drama..Watch it with your Family..Rating 3.5/5👍#GhaniReview https://t.co/cZpzQAGZpt — They Call Me #Ghani❤️ (@VakeelSaab26) April 8, 2022 #Ghani 1st half average and love track could have been avoided. 2nd half is better and climax is very good. Fight scenes shot very well. @MusicThaman BGM is superb and elevates scenes. @IAmVarunTej has given his best and he is superb. Overall it is a good sports drama. 3.5/5🔥 — Asim (@Being_A01) April 7, 2022 #Ghani : Well Made Action Drama Good Firsthalf follwed by decent second half @IAmVarunTej scores with his screen presence but acting could have been better #Upendra sir is good #Naveen is decent #Sunilshetty ☹️. BGM from @MusicThaman ❤️🔥.Decent direction from the debutant...3.25/5 — Swathi Cinephile (@Swathi_diva25) April 7, 2022 -
వరుణ్‌తేజ్ కోసం లావణ్య ట్వీట్.. మరోసారి డేటింగ్ రూమర్స్ తెరపైకి!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు ఈ వార్తలపై అటు వరుణ్ కానీ, లావణ్య కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్‌కి లావణ్య స్పెషల్ విషెస్ తెలియజేసింది. దీంతో ఈ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న గని చిత్రం రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. సినిమా రిలీజ్ డేట్ నేపథ్యంలో గని టీంకు లావణ్య స్పెషల్ విషెస్ చెప్పింది. 'వరుణ్.. ఈ పాత్ర కోసం నువ్వు 110 శాతం ఎఫర్ట్ పెట్టావని తెలుసు. నీతో పాటు నీ టీం చేసిన హార్డ్ వర్క్‌కి తగిన ప్రతిఫలం దక్కాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. Wishing @IAmVarunTej and the team #Ghani all the very best for tomorrow, you gave your 110 % to this role, and i pray that you & your team’s hard work will be rewarded by our incredible audience! 🍀 #GhaniFromApril8th pic.twitter.com/KVeYNUn3H7 — LAVANYA (@Itslavanya) April 7, 2022 -
యాక్షన్ ఫిల్మ్స్ చేద్దామని వచ్చా.. కానీ రొమాంటిక్ సినిమాలే..: వరుణ్ తేజ్
‘‘నా కెరీర్లో రొమాంటిక్ ఫిల్మ్స్ హిట్స్‌గా నిలిచాయి. కానీ యాక్షన్ ఫిల్మ్స్ చేయడానికే ఇండస్ట్రీకి వచ్చాను. యాక్షన్ జానర్‌పై నాకున్న ఇష్టమే నన్ను ‘గని’ సినిమా చేసేలా ప్రేరేపించిందేమోనని అనుకుంటున్నాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వరుణ్ తేజ్ చెప్పిన విశేషాలు. ‘మిస్టర్’ (2017) సినిమా సమయంలో కిరణ్ కొర్రపాటితో మంచి పరిచయం ఏర్పడింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నేను హీరోగా చేసిన ‘తొలిప్రేమ’ (2018) సినిమాకు కిరణ్ కో డైరెక్టర్‌గా చేశాడు. అప్పుడు కిరణ్ నాకో కథ వినిపించాడు. ఆ తర్వాత మేం చర్చించుకుని ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయాలనుకున్నాం. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ పాయింట్‌ను ఇచ్చింది నేనే కానీ పూర్తి కథను సిద్ధం చేసుకున్నది మాత్రం కిరణే. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలంటే నాకు ఇష్టం. హాలీవుడ్లో వచ్చిన ‘రాకీ’ ఫ్రాంచైజీని ఫాలో అయ్యాను. తెలుగులో వచ్చిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు బాబాయ్ కల్యాణ్‌గారి ‘తమ్ముడు’, శ్రీహరిగారి ‘భద్రాచలం’ నాకు చాలా ఇష్టం. యాక్షన్ విత్ ఎమోషన్... ‘గని’ సినిమాలో నేను చేసిన గని క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. లక్ష్యం ఏంటో తెలుసు కానీ, గమ్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో తెలియని యువకుడిలా కనిపిస్తాను. సెకండాఫ్‌లో సరైన గైడ్‌లైన్స్‌తో గని ఎలా విజేతగా నిలిచాడు? అనే అంశాలు ఉంటాయి. అసలు ఓ యువకుడు బాక్సింగ్‌ను వృత్తిగా ఎంచుకుంటే అతను ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది? చాంపియన్‌గా నిలవడానికి అతనికి అడ్డుగా నిలిచే అంశాలు ఏంటి? అనే విషయాలను ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమాలో ఉపేంద్రని డిఫరెంట్‌గా చూస్తారు. మదర్ సెంటిమెంట్ కూడా సినిమాలో కీలకంగా ఉంటుంది. చదవండి: ప్లీజ్ నా గురించి తప్పుడు ప్రచారం చేయకండి: రాశీ ఖన్నా అప్పుడు కాస్త ఫీలయ్యా!... గని’ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. తొలిప్రేమ (2018) సినిమా పూర్తయిన తర్వాత ‘గద్దలకొండ గణేశ్’ (2019) స్టార్ట్ కావడానికి ముందే ఫారిన్ వెళ్లి బాక్సింగ్‌లో ఉన్న బేసిక్స్ నేర్చుకున్నాను. ఆ నెక్ట్స్ రామ్‌చరణ్ అన్నయ్య ట్రైనర్ రాకేశ్ ఉడయార్ ఫిట్నెస్ విషయంలో నాకు శిక్షణ ఇచ్చారు. లాక్డౌన్ సమయంలో ఇద్దరు బాక్సింగ్ ట్రైనర్స్ నాతోనే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. అయితే షూటింగ్ స్టార్ట్ కావడానికి నెల ముందు ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. ‘గని’ షూటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే 2020 జూలై 30 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించాం. కానీ కోవిడ్ కారణంగా ‘గని’ రిలీజ్ చాలాసార్లు వాయిదా పడింది. కాస్త ఫీలయ్యాను. నా కజిన్స్ అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలుగా చేస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. పైగా దర్శకుడు కిరణ్, సయీ మంజ్రేకర్‌కు ‘గని’ చిత్రమే తెలుగులో తొలి సినిమా. దీంతో నేనే సినిమాను ముందుకు నడిపించేలా ఎక్కువ బాధ్యతను తీసుకున్నాను. ఈ సినిమాతో మరింత క్రమశిక్షణ అలవడింది. ‘మిస్టర్, అంతరిక్షం’ సినిమాల ఫలితాలు భిన్నంగా ఉన్నా కొత్త విషయాలు నేర్చుకున్నా. చదవండి: ఉపేంద్ర డైరెక్షన్లో మెగాస్టార్ చిత్రం.. కానీ! ఆ హీరోలతో మల్టీస్టారర్స్... అల్లు అర్జున్‌గారి ‘పుష్ప’, రామ్‌చరణ్‌గారి ‘ఆర్ఆర్ఆర్’లకు మంచి స్పందన రావడం హ్యాపీ. అలాగే తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతున్నందుకు ఓ తెలుగు హీరోగా కూడా హ్యాపీ. కథ కుదిరితే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ చేస్తా. సాయిధరమ్‌తేజ్, నితిన్‌లతో మల్టీస్టారర్ ఫిల్మ్స్ చేయడం అంటే ఇష్టం. తర్వాతి చిత్రాలు... వెంకటేశ్‌గారితో నటిస్తున్న ‘ఎఫ్ 3’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ కమిటయ్యాను. మరో మూడు కథలు విన్నాను. -
ఉపేంద్ర డైరెక్షన్లో మెగాస్టార్ చిత్రం.. కానీ!
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో కన్నడ నటుడు ఉపేంద్ర ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ పలు ఆసక్తికర వాఖ్యలు చేశారు. తాను నటించిన 'A', ఉపేంద్ర వంటి చిత్రాల ద్వారా 24 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసని కాని దానికంటే ముందు ఓ చిన్న ఫ్లాషబాక్ ఉంది. 'నాకు మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ గురించి చెప్పాలి. 24 సంవత్సరాల క్రితం నేను డా. రాజశేఖర్‌తో 'ఓంకారం' అనే చిత్రాన్ని డైరెక్షన్ చేశాను. ఆ సమయంలో అశ్వినీదత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది. కానీ నాకు అదృష్టం లేక ఆ సినిమా చేయలేకపోయాను. అయితే ఇప్పటికీ ఆ చిత్రం చేయలేకపోయినందుకు బాధపడుతుంటాను' అని ఉపేంద్ర తెలిపారు. -
ఆ రెండూ నచ్చితే గ్లామర్‌గా నటిస్తా: హీరోయిన్
‘‘గని’ సినిమాలో నాది బబ్లీ గర్ల్ క్యారెక్టర్. సరదాగా ఉంటుంది. తెలుగులో నా తొలి చిత్రం విడుదలవుతుండటంతో చాలా ఎగ్జయి టింగ్‌గా ఉంది. ప్రేక్షకుల మధ్య కూర్చొని ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేచి చూస్తున్నా’’ అని సయీ మంజ్రేకర్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సయీ మంజ్రేకర్ విలేకరులతో పంచుకున్న విశేషాలు. మా నాన్నకు (దర్శకుడు, నటుడు, నిర్మాత మహేశ్ మంజ్రేకర్) భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఆయన వారసురాలిగా నేను ఇండస్ట్రీలోకి రావడం ఒత్తిడిగా భావించలేదు కానీ, ఓ బాధ్యతగా ఫీలయ్యా. నా వల్ల నాన్న పేరు చెడిపోకూడదని ఆలోచిస్తుంటా. నాన్న సలహాలు నా కెరీర్‌కి చాలా ఉపయోగ పడ్డాయి. నేను నటించే సినిమాల కథల్ని అమ్మానాన్నలతో కలిసి వింటాను. అయితే చేయాలా? వద్దా? అనే తుది నిర్ణయం నాదే. చదవంది: రామ్ చరణ్‌కి జోడిగా అంజలి! ఏ సినిమాలో అంటే మూడేళ్ల క్రితం డైరెక్టర్ కిరణ్‌గారు ముంబై వచ్చి ‘గని’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయి, ఓకే చెప్పేశాను. ‘గని’ మంచి కథ. ప్రేక్షకులకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. వరుణ్ తేజ్ మంచి మనసున్న కో స్టార్. కిరణ్గారిని నేను ఎన్ని డౌట్లు అడిగినా విసుక్కోకుండా చెప్పారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దగార్లకి ఇది తొలి సినిమా. ఎప్పుడూ సెట్స్‌లోనూ ఉంటూ మంచి సినిమా నిర్మించారు. తెలుగు పరిశ్రమ అంటే నాకు మంచి గౌరవం. తెలుగు సినిమాలను హిందీ డబ్బింగ్లో చూస్తాను. ‘మగదీర, పుష్ప’ సినిమాలకు ఫిదా అయిపోయాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ అంటే ఇష్టం. ఎన్టీఆర్, అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ‘గని’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసినప్పుడు లోలోపల ఎగిరి గంతేశాను. ‘దబాంగ్ 3’ ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప అను భూతినిచ్చింది. ∙కథ, పాత్ర.. ఆ రెండూ నచ్చితే గ్లామర్‌గా నటించడానికి సిద్ధమే. నా ఫేవరెట్ నటి ఆలియా భట్. ఆమెను చూసి, ఇన్‌సై్పర్ అవుతుంటా. నేను నటించిన మరో తెలుగు చిత్రం ‘మేజర్’ కూడా త్వరలో విడుదల కానుండటం హ్యాపీ. తెలుగులో మరికొన్ని కొత్త సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో రెండోవారం కూడా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ చూసేందుకు సినీప్రియులు ఎగబడుతున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం దూకుడు చూస్తుంటే మరి కొన్ని రోజుల దాకా దీని ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ సినిమాను కొద్దిగా ఇరకాటంలో పెట్టేందుకు ఈ వారం వచ్చేస్తున్నాయి మరికొన్ని చిత్రాలు. అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఓసారి చూద్దామా ! 1. గని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయి మంజ్రేకర్ జోడీగా వస్తున్న క్రీడా నేపథ్యం ఉన్న సినిమా 'గని.' కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న 'గని' ఏప్రిల్ 8న ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. బాబాయి పవన్ కల్యాణ్ 'తమ్ముడు' సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం చేసినట్లు వరుణ్ చెబుతున్నాడు. జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి భారీతారగణంతో వస్తున్న 'గని' ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి. 2. మా ఇష్టం (డేంజరస్) సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందిన క్రైమ్ డ్రామా చిత్రం 'మా ఇష్టం (డేంజరస్)'. అప్సరారాణి, నైనా గంగూలీ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఏప్రిల్ 8న విడుదల కానుంది. స్వలింగ సంపర్కులైన ఇద్దరు మహిళల ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. వర్మ చేసిన ఈ ప్రయోగాన్ని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు.. 1. స్టాండప్ రాహుల్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్గా వచ్చిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. శాంటో మోహన వీరంకి తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో మార్చి 18న విడదలైంది. కాగా ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ చస్వీ (హిందీ) ఏప్రిల్ 7 ఎత్తర్కుం తునిందావన్ (ఈటీ, తమిళం) ఏప్రిల్ 7 ఎలైట్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 8 మెటల్ లార్డ్స్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 ది ఇన్‌బిట్విన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 అమెజాన్ ప్రైమ్ వీడియో మర్డర్ ఇన్ అగోండా (హిందీ) ఏప్రిల్ 8 నారదన్ (మలయాళం) ఏప్రిల్ 8 జీ5 ఎక్ లవ్ యా (కన్నడ) ఏప్రిల్ 8 అభయ్ 3 (హిందీ) ఏప్రిల్ 8 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ది కింగ్స్ మెన్ (హాలీవుడ్) ఏప్రిల్ 8 -
ఏడుసార్లు వాయిదా.. ఓటీటీకి వాళ్లు ఒప్పుకోలేదు: కిరణ్ కొర్రపాటి
‘‘ప్రజలపై సినిమాల ప్రభావం ఉంటుందని నమ్ముతాను. అందుకే నేను డైరెక్షన్ చేసే సినిమాల్లో సామాజిక అంశాలను ప్రస్తావిస్తాను. ‘గని’లో కూడా కొన్ని అంశాలను చూపించే ప్రయత్నం చేశాను’’ అని కిరణ్ కొర్రపాటి అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గని’ చిత్రంతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ చెప్పిన విశేషాలు. ∙చెన్నైలో మా నాన్నగారు (సీనియర్ జర్నలిస్ట్ కె. వెంకటేశ్వర రావు)తో కలిసి సినిమా ప్రివ్యూ షోస్‌కి వెళ్లేవాడిని. అక్కడి వాతవారణం, సినిమాలు నాకు బాగా నచ్చేవి. సినిమాల పట్ల నాకు ఉన్న ఆసక్తిని గమనించి నాన్నగారు ప్రోత్సహించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత దర్శకుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేయాలనుకున్నాను. దర్శకులు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, హరీష్ శంకర్, వెంకీ అట్లూరి దగ్గర దర్శకత్వ శాఖలో చేశాను. అలాగే రవితేజగారు హీరోగా నటించిన ఓ నాలుగు చిత్రాలకు దర్శకత్వ శాఖలో చేశాను. ‘మిస్టర్’ (వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం) సినిమాకు వర్క్ చేసిన సమయంలో వరుణ్ తేజ్‌కు ‘గని’ కథ చెప్పాను. ఆ తర్వాత ‘తొలిప్రేమ’ షూటింగ్ చివరి రోజు కిరణ్‌తో సినిమా చేస్తున్నట్లుగా చెప్పారట వరుణ్. అలా ‘గని’ సినిమా సెట్ అయ్యింది. జీరో టు హీరో సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాల్లో జీరోలో ఉన్న ఓ వ్యక్తి హీరో కావడం అన్నట్లుగా కథ ఉంటుంది. ‘గని’ చిత్రంలోనూ ఇదే పాయింట్. కానీ ‘గని’ క్యారెక్టర్ ఏంటి? అతని ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. మదర్ సెంటిమెంట్ బాగుంటుంది. ‘గని’లో మంచి లవ్ ట్రాక్ కూడా ఉంది. నిర్మాతలు ఒప్పుకోలేదు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే హీరో సిక్స్‌ప్యాక్‌తో ఉండాలి. ఈ సిక్స్‌ప్యాక్ బాడీ షేప్‌ను హీరో ఆరు నెలలు మెయిన్టైన్ చేస్తే చాలు. కానీ కరోనా వల్ల ‘గని’ షూటింగ్ చాలాసార్లు వాయిదా పడటంతో దాదాపు మూడేళ్లు ఒకే ఫిజిక్‌ను వరుణ్ మెయిన్టైన్ చేయాల్సి వచ్చింది. ఇది చాలా కష్టం. ఇక బాక్సింగ్ ఎపిపోడ్స్ చిత్రీకరణ సమయంలో సెట్స్‌లో దాదాపు 500 మందిని మేనేజ్ చేయడం ఓ పెద్ద టాస్క్. అలాగే కమర్షియల్ అంశాలను జోడిస్తూ బాక్సింగ్ నేపథ్యానికి ఆడియన్స్‌ను కనెక్ట్ చేసేలా కథను రెడీ చేయడం కోసం నన్ను నేను చాలెంజ్ చేసుకున్నాను. అవుట్‌పుట్ బాగా వచ్చింది. ‘గని’ రిలీజ్ దాదాపు ఏడుసార్లు వాయిదా పడింది. దీంతో గత ఏడాది నవంబరులో సినిమాను ఓటీటీకి ఇస్తే నాకు ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పాను. కానీ ఇందుకు నిర్మాతలు ఒప్పుకోలేదు. వరుణ్ తేజ్, అల్లు బాబీ, సిద్ధు ముద్దగార్లు చాలా సపోర్ట్ చేశారు. తర్వాతి సినిమాలు నిర్మాతగా వరుణ్ తేజ్ నాకు అడ్వాన్స్ ఇచ్చారు. పుల్లారావు, భగవాన్ బేనర్లో, చెరుకూరి సుధాకర్ బ్యానర్లలో సినిమాలు కమిటయ్యాను. -
‘గని’ టీంకు తెలంగాణ సర్కార్ షాక్, తగ్గించిన టికెట్ రేట్స్
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మూవీ టీం షాకిచ్చింది. తెలంగాణలో గని మూవీకి సంబంధించి టికెట్ల ధరల్లో పెంపుదల లేదని తెలిపింది. పాత ధరల ప్రకారమే సినిమా టికెట్ల రేట్లు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. పాత రేట్ల ప్రకారం అయితే.. మల్టీప్లెక్స్‌లో రూ. 250 నుంచి రూ. 200 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా 150 ప్లస్ జీఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఇక గని మూవీ టికెట్ రేట్లలో పెంపుదల లేకపోడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: RC15: ఒక్క ఫైట్ సీన్‌కే రూ. 10 కోట్లు ఖర్చు పెట్టించిన శంకర్! కరోనా కారణంగా సినిమా పరిశ్రమ కొన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని వెసులుబాటు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన గని మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించగా.. ఉపేంద్ర, నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి, నరేష్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
‘వైజాగ్ సినిమా హబ్ కావాలంటే పెద్దలు ముందుకు రావాలి’
‘‘చిత్రపరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కి మీరు (అల్లు అరవింద్) మాస్టర్. అల్లు రామలింగయ్యగారి పేరు మీద రాజమండ్రిలో హోమియోపతి మెడికల్ కాలేజీ పెట్టినట్లు వైజాగ్‌లో అల్లు రామలింగయ్యగారు, చిరంజీవిగారి పేర్లు కలిసి వచ్చేలా ఓ యాక్టింగ్ కాలేజీ పెట్టించాలని అరవింద్‌గారిని కోరుతున్నాను. విశాఖపట్నం సినిమా హబ్ కావాలంటే అరవింద్‌గారి వంటి పెద్దలు ముందుకు రావాలి. చిరంజీవిగారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఆయన ఆశీస్సులు అందరికీ ఉంటాయి. వైజాగ్ సినిమా హబ్ అయితే లోకల్ టాలెంట్ చాలామంది వస్తారు. వైజాగ్‌లో ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రభుత్వం, ప్రజల సహకారం ఉంటుంది’’ అని ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో జరిగిన ‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ ధరలను పెంచింది. ‘ఆర్ఆర్ఆర్’కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇండియాలో కలెక్షన్స్ వైజ్‌గా టాప్‌లో ఉంది. ఇండియాలో రెండు బ్లాక్‌బస్టర్స్ మనవే. అల్లు బాబీ తన తండ్రి అల్లు అరవింద్ స్థాయి ప్రొడ్యూసర్ కావాలి. పదేళ్ల క్రితం వరుణ్ తేజ్ స్టార్ హీరో అవుతాడని చెప్పాను. ఇప్పుడు వరుణ్ తేజ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని చెబుతున్నాను. ‘పుష్ప’ సినిమాతో బన్నీ ఇండియాను షేక్ చేశాడు’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘‘కేజీఎఫ్’ చూసినప్పుడు వరుణ్‌తో ఇలాంటి సినిమా తీయాలి కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఏదో ఒక రోజు వరుణ్‌తో అలాంటి సినిమా చేస్తాను. కిరణ్ మంచి దర్శకుడు అవుతాడు. అల్లు బాబీకి సినిమా పట్ల మంచి నాలెడ్జ్ ఉంది. వైజాగ్ పై ప్రేమతో మంత్రిగారు నాకు ఇచ్చిన సలహాను తప్పకుండా తీసుకుంటా. మా నాన్నగారు పాలకొల్లులో పుట్టి సినిమాల్లోకి వెళ్లాలని మద్రాసు వెళ్లారు. అలా సినిమా పరిశ్రమలో యాభై ఏళ్లు పైన ఉన్నారు. నేను నిర్మాతగా టాలీవుడ్‌తో సరిపోదని, హిందీలో కూడా సినిమాలు తీశాను. కానీ బన్నీ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా ఇతర దేశాల్లోని క్రికెటర్స్ కూడా తగ్గేదేలే స్టెప్‌ను అనుకరించేలా చేశాడు. అల్లు పతాకాన్ని ఎక్కడికో తీసుకుని వెళ్లాడు’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘మా అన్నయ్య అల్లు బాబీ పూర్తి స్థాయి నిర్మాత అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అన్నయ్య కథ ఓకే చేస్తే మినిమమ్ గ్యారంటీ. మా కజిన్ సిస్టర్ వివాహం సిద్ధుతో జరిగింది. సిద్ధు ఇప్పుడు ‘గని’తో నిర్మాత అయ్యాడు. వరుణ్ ఎన్నుకునే కథలు, అతని జర్నీ నన్ను గర్వపడేలా చేస్తాయి’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘నేను కిరణ్‌ను నమ్మాను. ‘గని’ సినిమా చూశాక తప్పు చేయలేదనిపించింది. కల్యాణ్ బాబాయ్‌గారి ‘తమ్ముడు’ సినిమా చాలా ఇష్టం. తమ్ముడు అంత కాకపోయినా ఆ సినిమా అంత బాగుండాలని ప్రయత్నం చేశాం. చిరంజీవిగారి గురించి మాట్లాడకపోతే నాకు ఇన్ కంప్లీట్‌గా ఉంటుంది. మా పెదనాన్నగానే కాదు.. ఓ యాక్టర్‌గా కూడా ఆయన నాకు స్ఫూర్తి. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తున్న నాన్నగారికి (చిరంజీవిని ఉద్దేశిస్తూ..) థ్యాంక్స్’’ అన్నారు. కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘గని’ త్రీ ఇయర్స్ కల.. కష్టం. ఒక వ్యక్తి నమ్మకం. అతనే వరుణ్. పవన్ కల్యాణ్‌గారికి ‘తమ్ముడు’ ఎలాంటి మైల్స్టోన్ అయ్యిందో.. వరుణ్ తేజ్ కెరీర్లో ‘గని’ అలా మైల్స్టోన్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఓ మంచి సినిమా చేసే ప్రయత్నం చేశాం’’ అన్నారు అల్లు బాబీ. ‘‘వరుణ్ లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా ఎలా వస్తుందని అల్లు అర్జున్‌గారు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అల్లు అరవింద్‌గారు మంచి గైడ్‌లైన్స్ ఇస్తారు’’ అన్నారు సిద్ధు ముద్ద. ఏపీ ఎన్ ఫోర్స్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్, ‘గని’ చిత్రబృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెగా పంచ్
-
విశాఖలో ‘గని’ ప్రీరిలీజ్ ఈవెంట్ .. భారీగా తరలివచ్చిన అభిమానులు
-
విశాఖలో ‘గని’ ప్రీరిలీజ్ ఈవెంట్, బన్నీకి గజమాలతో ఘన స్వాగతం
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం ఈ రోజు విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు(ఏప్రిల్ 2న) సాయంత్రం జరగనున్న ఈ వెంట్ కోసం బన్నీ విశాఖకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా విశాఖలోని అభిమానులు అల్లు అర్జున్‌కు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Allu Arjun gets massive welcome at Vizag Airport. He came to attend Ghani Pre release event. #Ghani #AlluArjunForGhani #AlluArjun pic.twitter.com/MsI5HnNdTO — Phani Kumar (@phanijournalist) April 2, 2022 -
ఆయన్ను చూసి బాక్సర్ అవ్వాలనుకున్నాను.. 'గని'తో ఆశ తీరింది
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. వరుణ్ తేజ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన నవీన్ చంద్ర చెప్పిన విశేషాలు. చదవండి: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం ఐకాన్ స్టార్.. మా మామయ్యగారు టి. శివకుమార్ బాక్సర్. ఆయన్ను చూసి, నేను బాక్సర్ అవ్వాలనుకున్నాను. కానీ యాక్టర్ అయ్యాను. ‘గని’లో ఆది అనే బాక్సర్ పాత్ర పోషించడంతో నేను బాక్సర్ కావాలన్న ఆశ తీరినట్లయింది. ఆది క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌తో ఉంటుంది. లాక్డౌన్స్ వల్ల ‘గని’ షూటింగ్‌కు కాస్త ఇబ్బందులు కలిగాయి. దీంతో బాక్సర్‌గా చాలా రోజులు ఫిట్‌గానే ఉండటం చాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే నిజమైన బాక్సర్స్‌లా కనిపించాలని జాతీయ స్థాయి బాక్సర్స్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ప్రతి రోజూ పరీక్షలే! .. వరుణ్ అమేజింగ్ యాక్టర్. సెట్స్‌లో దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అలానే కరోనా నిబంధనలు పాటిస్తూ, షూటింగ్ చేసినప్పుడు సిద్ధు, అల్లు బాబీగార్లు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిరోజూ యూనిట్లో అందరికీ కరోనా పరీక్షలు చేయించేవారు. అరవింద..తో నటుడిగా మెరుగయ్యాను.. ‘అరవింద సమేత వీర రాఘవ’ యాక్టర్‌గా నన్ను మెరుగుపరిచింది. ‘గని’ చిత్రంలోని ఆది క్యారెక్టర్ మరో ఎక్స్పీరియన్స్. డేట్స్ కుదరకపోవడం వల్ల తమిళ హిట్ మూవీ ‘సారపట్ట పరంపర’లో అవకాశాన్ని కోల్పోయాను. రామ్‌చరణ్‌గారు హీరోగా శంకర్‌గారి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. ఏప్రిల్ 7న మొదలైయ్యే అమృత్సర్ షెడ్యూల్లో నేను పాల్గొంటాను. ఇక నేను హీరోగా చేసిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ సెట్స్‌పై ఉన్నాయి. చదవండి: పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఫోకస్ కాలేదు -
అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఎవరైనా సరే, నా ప్రాధాన్యత దానికే!
‘‘గని’ బాక్సింగ్ నేపథ్యంలో ఉన్నా ఫ్యామిలీ డ్రామా, భావోద్వేగాలు ఉంటాయి. చక్కటి కథని నిజాయతీగా తీశాం. మా సినిమా గురించి గొప్పలు చెప్పను. కానీ, ‘గని’ మంచి చిత్రం. ప్రేక్షకులు కూడా మంచి సినిమా చూశాం అంటారు’’ అని అల్లు బాబీ అన్నారు. వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా అల్లు బాబీ, సిద్ధు ముద్ద చెప్పిన విశేషాలు... అల్లు బాబీ మాట్లాడుతూ.. ‘‘పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఇండస్ట్రీకి క్యూబ్ సిస్టమ్‌ని తీసుకొచ్చింది నేనే. ‘జస్ట్ టిక్కెట్’ సంస్థతో పాటు ‘ఆహా’లోనూ యాక్టివ్‌గా ఉన్నాను. అయితే నేను తెరవెనకే ఉండటంతో ఎక్కువగా ఫోకస్ కాలేదు. ఇప్పుడు సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టాను. బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ కథ రెడీ చేసి, వరుణ్ తేజ్‌కి వినిపించాడు కిరణ్. వరుణ్‌కి బాగా నచ్చింది. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్), నేను, సిద్ధు విన్నాం.. మాకూ నచ్చింది. కిరణ్‌పై ఉన్న నమ్మకంతో తనే డైరెక్షన్ చేస్తాడని వరుణ్ అంటే ఓకే అన్నాం. అందుకే వరుణ్ని తీసుకున్నాం.. ఈ సినిమా కోసం వరుణ్ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా మేకోవర్ అయ్యారు. ‘గని’ కథకి తను కరెక్ట్ అని తీసుకున్నామే కానీ మా కజిన్ బ్రదర్ అని కాదు. సిద్ధు ముద్ద కూడా మా కజిన్ బ్రదరే. సయీ మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర.. వంటి వారిని కథకు అవసరం మేరకు తీసుకున్నామే కానీ ‘గని’ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని కాదు. అయితే కన్నడంలో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నాం. ఆ బాధ్యత నాదే.. నాన్నగారు (అల్లు అరవింద్) ‘నీకు నువ్వుగా కష్టపడి పని నేర్చుకో.. నీకు నచ్చింది చెయ్’ అన్నారు. ఆయన ఇచ్చిన సలహాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్‌కి మంచి పేరుంది. అయినప్పటికీ ‘అల్లు బాబీ కంపెనీ’ అనే ప్రొడక్షన్‌ని స్టార్ట్ చేశాను. ‘గని’ సినిమా రిజల్ట్ ఏదయినా పూర్తి బాధ్యత నాదే. నా ప్రాధాన్యత ఎప్పుడూ కథకే. ఆ తర్వాత నటీనటులు. అది అల్లు అర్జున్ కావొచ్చు, వరుణ్ కావొచ్చు.. లేకుంటే వేరేవారు కావొచ్చు. నటీనటుల రెమ్యునరేషన్నూ పరిగణనలోకి తీసుకుంటా. నేనే సినిమా తీసినా మంచి కథతోనే తీస్తాను. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నాను. రెండక్షరాల టైటిల్ కావాలనుకున్నాం – సిద్ధు ముద్ద మరో నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ– ‘‘గద్దలకొండ గణేష్’ చిత్రం నుంచే అమెరికాలో ప్రొఫెషనల్ బాక్సింగ్ నేర్చుకున్నారు వరుణ్ తేజ్. ‘గని’ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు రియల్ బాక్సింగ్‌లా ఫీలవుతారు. ఈ చిత్రానికి ముందు ‘గణేశ్, బాక్సర్, ఫైటర్’ వంటి టైటిల్స్ అనుకున్నాం. రెండక్షరాలతో కావాలని ‘గని’ ఫిక్స్ చేశాం. తెలుగులో వస్తున్న తొలి ప్రొఫెషనల్ బాక్సింగ్ చిత్రం మాదే. కిరణ్ చక్కగా తీశాడు. తమన్ మంచి నేపథ్య సంగీతం అందించారు. జార్జ్ సి. విలియమ్స్ మంచి విజువల్స్ అందించారు. మా సినిమా తప్పకుండా కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది’’ అన్నారు. చదవండి: బార్లో తాగి రెచ్చిపోయిన హీరో.. సింగర్‌పై లైంగిక దాడి -
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోసం ఐకాన్ స్టార్..
Allu Arjun Chief Guest For Varun Tej Ghani Movie Pre Release Event: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్‌కు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమం గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఘనంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచ్చేయనున్నారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మేకర్స్ వెల్లడించారు. అల్లు అర్జున్ రాకతో ఈ కార్యక్రమం మరింత సందడిగా మారనుంది. కాగా వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బీటౌన్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా చేస్తోంది. వరుణ్‌కు తల్లిగా నదియా కనిపించనున్నారు. జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనువిందు చేయనున్నారు. అంతేకాకుండా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా 'కోడితే' అంటూ ప్రత్యేక గీతంలో అలరించనుంది. Icon St𝔸𝔸r @alluarjun garu to grace the grand pre-release event of #Ghani 🥊 on April 2nd @ Vizag! 💥⚡#GhaniFromApril8th 👊@IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @shreyasgroup pic.twitter.com/Vc6H54HkrD — Geetha Arts (@GeethaArts) March 29, 2022 -
తమన్నా 'కొడ్తే' ఫుల్ సాంగ్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన విషయం తెలిసిందే! 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జాగ్వార్', 'జై లవకుశ', 'కేజీఎఫ్: చాప్టర్ వన్', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గనిలో ఆమె డ్యాన్స్ చేసిన కొడ్తే ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటలో బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన తమన్నా స్టెప్పులతో రఫ్ఫాడిచ్చింది. తమన్ మ్యాజిక్, తమన్నా ఫిజిక్ మామూలుగా లేవంటూ యూట్యూబ్‌లో కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఆలపించింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. చదవండి: అభిమానంతో థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తాన్ మోడల్ -
‘గని’ ట్రైలర్ వచ్చేసింది, యాక్షన్ సీన్స్ మాములుగా లేవుగా..
Ghani Movie Trailer: వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది. చదవండి: సందీప్ వంగ మూవీలో రష్మిక ఐటెం సాంగ్, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో హైలెట్ అయ్యింది. ఇందులో వరుణ్ ‘ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి’ అని ‘ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సోసైటీ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది’ అంటూ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇందులో వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా సందడి చేయనుండగా.. నటి నదియా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారు. -
స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు
సినిమాకి ఓ కథ ఉంటుంది. ఆ కథకు ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అదే స్క్రీన్ పై ఓ ‘ప్లే’ ఉంటే... స్క్రీన్ పై ఆట ఆడేవారికి ఓ కిక్కు.. చూసేవారికి మరింత కిక్కు. అలాంటి కిక్ ఇవ్వడానికి తెలుగు స్పోర్ట్స్ మూవీస్ కొన్ని రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలేంటో ఓసారి చదివేద్దాం. ప్రొఫెషనల్ బాక్సర్‌గా.. ఇప్పటివరకూ లవర్ బాయ్‌గా కనిపించిన విజయ్ దేవరకొండ వెండితెరపై తన పంచ్ పవరేంటో చూపించేందుకు ‘లైగర్’లో బాక్సర్‌గా మారారు. హీరోలను తనదైన శైలిలో పవర్‌ఫుల్‌గా చూపించే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్‌లా కనిపించేందుకు విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్‌తో ఈ సినిమాలో ఢీ కొట్టారు విజయ్. టైసన్ నటించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. థాయిల్యాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు సినీ లవర్స్ అటు బాక్సింగ్ లవర్స్ ఈ స్క్రీన్ ప్లేని ఆగస్ట్ 25న చూడనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్‌లో గని పంచ్ వేసవిలో తన పంచ్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు గని. బాక్సర్ గని పాత్రలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గని’. ఇప్పటివరకూ లవ్‌స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్ చేసిన వరుణ్ ‘గని’లోని పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ‘గని’ పంచ్ పవర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 8 వరకూ ఆగాల్సిందే. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఇందులో సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రధారులు. ఈసారి గోల్‌పై గురి ‘మజిలీ’లో క్రికెటర్‌గా కనిపించి, మంచి కలెక్షన్ల స్కోర్ తెచ్చుకున్న నాగచైతన్య తన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’లో గోల్‌పై గురి పెట్టారు. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇది. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నారని టాక్. వాటిల్లో ఒకటి హాకీ ప్లేయర్ అని తెలుస్తోంది. నాగచైతన్య హాకీ ఆడుతున్న సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అయింది కూడా. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మిల్కీ బ్యూటీ.. బబ్లీ బౌన్సర్ ఓ వైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘బబ్లీ బౌన్సర్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపిస్తారు. అయితే బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. బౌన్సర్ నుంచి బాక్సర్‌గా మారే క్యారెక్టర్లో తమన్నా కనిపిస్తారని సమాచారం. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. బ్యాడ్మింటన్ నేపథ్యంలో.. సుధీర్‌బాబు డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ప్రముఖ బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఒకటి. సుధీర్–గోపీచంద్ ఇద్దరూ కలిసి బ్యాడ్మింటన్ ఆడారనే విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ నుంచి సినిమాల్లోకి వచ్చారు సుధీర్. ఇక పుల్లెల బయోపిక్‌ని ఎప్పుడో ప్రకటించినా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సుధీర్ బ్యాడ్మింటన్ రాకెట్‌తో షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. -
వరుణ్ తేజ్ ‘గని’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న 'గని' చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా భీమ్లా నాయక్ రిలీజ్ నేపథ్యంలో గని చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా గని కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 8న మూవీని విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ తమ అధికారికరంగా వెల్లడించింది. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే వరుణ్ తేజ్ బాక్సార్‌గా కనిపించనున్న ఈ మూవీకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇందులో బాలీవుడ్ భామ సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. Mega Prince @IAmVarunTej's #Ghani is all set to hit the screens on 𝐀𝐏𝐑𝐈𝐋 𝟖𝐭𝐡! 🥊#GhaniFromApril8th 🤩@IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @RenaissanceMovi @adityamusic pic.twitter.com/IFnZNDWBSt — Geetha Arts (@GeethaArts) March 2, 2022 -
బాబాయ్ కోసం వెనక్కి.. మరోసారి వాయిదాపడ్డ 'గని' మూవీ
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న 'గని' చిత్రం మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా భీమ్లా నాయక్ రిలీజ్ నేపథ్యంలో గని చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని పేర్కొంది. కాగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పనలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇక కొత్త రిలీజ్ డేట్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. #Ghani will meet you on big screens at a later date!🥊 A new release date will be announced very soon! ✨@IAmVarunTej @IamJagguBhai @nimmaupendra @SunielVShetty @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic @dhilipaction pic.twitter.com/oQoWGNALae — Renaissance Pictures (@RenaissanceMovi) February 22, 2022 -
థియేటర్స్‌లో పంచ్ ఇవ్వడానికి గని రెడీ!
థియేటర్స్‌లో పంచ్ ఇవ్వడానికి గని రెడీ అయ్యాడు. హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గని పాత్రలో కనిపించనున్న చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో అన్ని పాటలకూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్య రిలీజ్ చేసిన ‘రోమియో జూలియట్...’ పాట కూడా బాగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ ఇటీవలే డబ్బింగ్ పూర్తి చేశారు. మిగతా కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
హీరోయిన్ అదితి శంకర్ పాడిన పాట విన్నారా?
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలోని ‘రోమియో జూలియట్’ పాటను విజయవాడలో విడుదల చేశారు. దర్శకుడు శంకర్ కూతురు, నటి అదితీ శంకర్ ఈ పాటతో గాయనిగా మారారు. అల్లు బాబీ మాట్లాడుతూ– ‘‘గని’ సినిమా అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘ఈ పాటను నేనెప్పుడో ట్యూన్ చేసి పెట్టుకున్నాను.. అనుకోకుండా ‘గని’ కి కుదిరింది. అదితీ శంకర్‌తోనే ఈ పాట పాడించాలని ముందునుంచే అనుకున్నాను’’ అన్నారు తమన్. -
వరుణ్ తేజ్ సినిమా కోసం సింగర్‌గా మారిన డైరెక్టర్ శంకర్ కూతురు
Shankar Daughter Turns As Singer : ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కార్తి సరసన ఆమె నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌మీదుంది. అయితే అదితి హీరోయిన్‌గానే కాకుండా సింగర్‌గానూ పరిచయం అవుతుంది. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని చిత్రంలో రోమియో జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్‌ను అదితి పాడింది. ఈ పాటను రేపు(మంగళవారం)రిలీజ్ చేయనున్నారు. విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో జరిగే ఓ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఆవిష్కరించనున్నారు. MY SINGING DEBUT✨🎙🎼 Waited so long to share this with you all. Another dream come true. @MusicThaman sir Thank you so much for trusting me and giving me this opportunity. Hope you guys like it♥️🧿🤞#ghani #romeojuliet #singingdebut pic.twitter.com/JOboB9VaMM — Aditi Shankar (@AditiShankarofl) February 6, 2022 -
వరుణ్ తేజ్ గని మూవీకి 2 రిలీజ్ డేట్స్, ఎప్పుడైనా రావొచ్చు..
కరోనా కారణంగా వాయిదా పడ్డ క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్‌ను మేకర్స్ వరసగా ప్రకటిస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు రావాల్సిన పాన్ ఇండియా చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్‌తో పాటు పెద్ద సినిమాలు ఆచార్య, భీమ్లా నాయక్, ఎఫ్3 సినిమాల రిలీజ్ డేట్స్‌ను నిన్న(సోమవారం) వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని సినిమా రిలీజ్ డేట్‌ను కూడా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఫిబ్రవరి 25వ తేదీ లేదా మార్చిన 4వ తేదీన గని మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మేకర్స్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చామని, గని మూవీని ఫిబ్రవరి 25 లేదా మార్చి 4వ తేదీన రిలీజ్ చేస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా గని చిత్రాన్ని ముందుగా దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 24కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా తమన్నా స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. After careful deliberation and considering the prevailing situations, #Ghani 🥊 will be releasing on February 25th or March 4th! See you all in theaters soon! 🤩@IAmVarunTej @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @abburiravi @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/Oqi2cDyIMh — Renaissance Pictures (@RenaissanceMovi) February 1, 2022 -
'గని' డబ్బింగ్ పూర్తి, రిలీజ్ విషయంలోనే సస్పెన్స్!
సక్సెస్‌ఫుల్‌గా డబ్బింగ్ పూర్తి చేశాడు గని. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. సయీ మంజ్రేకర్ హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ మూవీలో గని అనే బాక్సర్ పాత్రలో కనిపిస్తారు వరుణ్‌తేజ్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ వర్క్‌ను పూర్తి చేశారు. తాను డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు వరుణ్. కాగా మార్చి 18న ‘గని’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొత్త రిలీజ్ డేట్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయట. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
వరుణ్ బర్త్‌డే: అదరగొట్టేసిన గని ఫస్ట్ గ్లింప్స్
మెగా వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు వరుణ్ తేజ్ కొణిదెల. బుధవారం (జనవరి 19న) వరుణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు తాజాగా నటిస్తున్న క్రీడా చిత్రం 'గని' నుంచి 'పవర్ ఆఫ్ గని' పేరిట స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ పాత్రను ఎలివేట్ చేస్తూ చూపించారు. సీరియస్ లుక్‌లో రింగులోకి దిగిన వరుణ్ ప్రర్థిని మట్టి కరిపించాడు. ఈ వీడియో చూసిన అభిమానులు నీ కష్టానికి ప్రతిఫలం హిట్ రూపంలో తప్పకుండా దక్కుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం సమ్మర్లో రిలీజ్ కానుంది. -
‘గని’ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చూశారా? అదరగొట్టేసిందిగా..
Tamannaah Special Song Released From Ghani Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ - సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఆమె తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. కాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. చదవండి: తొలి రోజు ‘బంగార్రాజు’ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే.. 'రింగారే రింగా రింగా .. రింగా రింగా' అంటూ సాగే ఈ పాటకు తమన్ సంగీతం అందించాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. హారిక నారాయణ్ ఈ పాటను ఆలపించింది. కాగా ఈ పాటలో తమన్నా తన స్టెప్పులతో అదరిగొట్టింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా బాక్సింగ్ నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్గా దూపొందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: గుర్రంతో డ్యాన్స్ చేయించిన బాలయ్య.. వీడియో వైరల్ -
‘గని’ విడుదలపై చిత్రబృందం క్లారిటీ
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్. కాగా థియేట్రికల్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘గని’ కోసం ఎంతో కష్టపడ్డాం. క్లిష్టమైన లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఖరీదైన సెట్స్ వేశాం. విజువల్‌గా ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుంది. కరోనా పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలా చిత్రాలు రిలీజ్‌కి పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని, పోటీ వద్దనుకుని మా సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. ‘గని’ చిత్రం థియేటర్స్‌లోనే వస్తుంది’’ అని శుక్రవారం చిత్రబృందం పేర్కొంది. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజవుతుందనే ప్రచారం సాగుతోంది. -
క్రిస్మస్ సిత్రాలు.. థియేటర్లలో సందడికి సిద్ధంగా..
Upcoming Movies In Theaters On This Christmas Festival: సినిమా విడుదలకు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడుతుంటారు. పండగ వేళ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి అనేక కసరత్తులు చేస్తారు. పర్వదినాల్లో సినిమాలను ప్రదర్శించేందుకు ఆసక్తిగా సిద్ధమవుతుంటారు మేకర్స్. ఈ సవంత్సరం దసరా, దీపావళి సందడి ముగిసింది. దీపావళికి థియేటర్లలో రిలీజై హిట్ సాధించిన బాలీవుడ్ చిత్రం 'సూర్యవంశీ'. ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ పండుగ. గతేడాది క్రిస్మస్కు కొవిడ్ కారణంగా ఏ చిత్రం థియేటర్లతో విడుదల కాలేదు. కరోనాతో దెబ్బతిన్న థియేటర్లకు మళ్లీ పాతవైభవాన్ని తీసుకురానున్నాయి పలు చిత్రాలు. 1. గని గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్‌తేజ్ నుంచి వస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. 2. శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24న రిలీజ్ కానున్న నాని చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రంపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతకుముందు వచ్చిన టక్ జగదీష్, వీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాగా, చాలా కాలం తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బెంగాల్ నేపథ్యం ఉన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ‘టాక్సీవాలా’తో విజయం అందుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 3. '83' బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘83’. భారత క్రికెట్ జట్టు 1983లో సాధించిన ప్రపంచ కప్పు విజయం నేపథ్యంలో సాగే చిత్రమిది. రణ్వీర్ కెప్టెన్ కపిల్‌దేవ్‌గా ఆయన భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా 2019 జూన్‌లో మొదలైంది. 2020 ఏప్రిల్ 10న విడుదల అనుకున్నా కరోనా కారణంగా ఆ ఏడాది డిసెంబరు 25కి మారింది. అప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది జూన్ 4న విడుదల అని ప్రకటించారు. ఎక్కువ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉండటంతో మళ్లీ వాయిదా వేసి డిసెంబరు 24 అని ఖరారు చేశారు. ఈ తేదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మారే అవకాశం లేదని చిత్రబృందం చెబుతోంది. ‘83’ విజయంపై బాలీవుడ్ వ్యాపార వర్గాలు చాలా నమ్మకంగా ఉన్నాయి. 4. జెర్సీ (హిందీ) తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘జెర్సీ’ చిత్రం అదే పేరుతో హిందీలోనూ రూపొందింది. ఆయనే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. షాహిద్‌కపూర్ కథానాయకుడిగా నటించారు. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’గా మెప్పించిన షాహిద్ ఈ చిత్రంపైనా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే.. -
చరణ్ వాయిస్‌తో గని టీజర్, కేక పెట్టిస్తున్న డైలాగ్స్
Varun Tej Ghani Teaser Out Now: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వహిస్తున్నాడు. అందులోని వరుణ్ మాస్ లుక్ ఇప్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీని నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టైటిల్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే గని ప్రపంచం ఇదేనంటూ ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్‌ను వదిలారు మేకర్స్. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తుండగా.. రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. మధ్యలో ‘ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్’ అంటూ చెప్పిన డైలాగ్ కేక పెట్టించేలా ఉంది. ఇక వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చదవండి: కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ట్రీట్ -
Ghani: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే..
మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. అందులోని వరుణ్ మాస్ లుక్ ఇప్పటికే మెగా అభిమానులకు తెగ నచ్చేసింది. సినిమా విడుదల కోసం ఎంతగానో వేయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అయితే వారిని సంతోషపెట్టేందుకు మూవీ మేకర్స్ గని ప్రపంచం ఇదేనంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో హీరోయిన్ నుంచి విలన్ వరకు కీలకమైన పాత్రలన్నింటినీ చూపించారు. మొదట నదియా, తర్వాత నరేష్ కనిపించగా, క్రమంగా తనికెళ్ల భరణి, నవీన్ చంద్ర, సాయి మంజ్రేకర్, నవీన్ చంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్రను చూపించారు. అయితే గని ప్రపంచంలో వీళ్లందరు ఉంటారనట్లుగా వీడియో ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాస్టింగ్ చూస్తే ఆ అంచనా రెట్టింపు అయ్యేలా ఉంది. బాలీవుడ్ నటుడు మహేష్ ముంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే సినిమా టీజర్‌ను నవంబర్ 15న రిలీజ్ చేయనున్నట్లు వీడియోలో చూపించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అల్లు వెంకటేష్, సిద్దు ముద్దా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గని చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. -
కొడుకు ఎంట్రీ.. బన్నీ అభిమానులకు సర్ప్రైజ్ ట్రీట్
Allu Arjun Son Allu Ayaan As Ghani Viral Video: సాధారణంగా స్టార్ హీరోల వారసులు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమయ్యింది. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమా ద్వారా డెబ్యూ ఇవ్వనుండగా, ఇప్పుడు కొడుకు అల్లు అయాన్ గని సినిమా కోసం రంగంలోకి దిగాడు. వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫాంహౌస్‌లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ ఈ మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌కు అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను గీతా ఆర్ట్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. అచ్చం బన్నీలాగే ఎనర్జీ, స్టైల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ఉపేంద్ర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: పునీత్ చనిపోయి నేటికి 11రోజులు.. వేలాదిగా జనం క్యూ.. ఎయిర్‌పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩 ▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H — Geetha Arts (@GeethaArts) November 8, 2021 -
ఆకట్టుకుంటున్న ‘గని’ ఫస్ట్ లిరికల్ సాంగ్
మోగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘గని’. ఈ మూవీలోని తొలిపాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేస్తూ బుధవారం(అక్టోబర్ 27) ఉదయం 11 గంటలకు ఫుల్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు నిన్న చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ రోజు గని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ మ్యూజిక్ సెన్సెషన్ తమన్ సంగీతం అందించిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఇటీవలే విడుదలైన ‘గని ఫస్ట్ పంచ్’ గ్లింప్స్‌కు కూడా ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కుతోంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. చదవండి: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, నవంబర్‌లో ‘భోళా శంకర్’ వస్తున్నాడు A lot of effort went into making this film and this song is a small peek into that.🥊🥊🥊 Hope you guys like our #GhaniAnthem !!! 💪🏽https://t.co/fvtRxVDSkE#Ghani@nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @adityamusic pic.twitter.com/uAFLVW6FpE — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 27, 2021 -
ఫస్ట్ పంచ్ విసిరిన ‘గని’.. ఆకట్టుకుంటున్న వరుణ్
మెగా హీరో వరుణ్ తేజ్ హీరో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ మెగా హీరో బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడదులైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచగా.. తాజాగా ఆ సినిమా నుంచి గని ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో వరుణ్ రక్తమోడుతూ పంచ్ విసిరాడు. బాక్సర్‌గా బాడీని పూర్తిగా ట్రాన్స్ఫామ్ చేసుకున్న ఈ కుర్ర హీరో లుక్ ఆకట్టుకునేలా ఉండి.. అంచనాలను ఇంకా పెంచింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ మూవీని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత వరుణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చదవండి: రేచీకటితో వెంకటేశ్, నత్తితో వరుణ్.. మామూలుగా ఉండదుగా -
బాక్సింగ్ పంచ్‌కి రెడీ అయిన వరుణ్‌తేజ్
Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఈ చితత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే విడదులైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాకుండా యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్‌ను రంగంలోకి దించారు. ఇక వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Let’s light up the theatres this Diwali with #Ghani 🥊🥊🥊 pic.twitter.com/tHSXfbEkTp — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 5, 2021 -
జిమ్‌లో తెగ కష్టపడుతున్న వరుణ్ తేజ్
Varun Tej Workout Video: హీరోలు ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్ మెయింటెన్ చేస్తుంటారు. యాక్షన్ సినిమాకు ఒక రకంగా, మాస్ సినిమాకు మరో రకంగా, ఫ్యామిలీ డ్రామాకు ఇంకో విధంగా.. ఇలా జానర్‌ను బట్టి, ఎంచుకున్న కథను బట్టి హీరో తన శరీరాకృతిని మార్చుకోక తప్పదు. అందులోనూ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా అయితే బాడీని మరింత సానబెట్టాల్సిందే! కొణిదెల వారసుడు వరుణ్ తేజ్ కూడా ఇప్పుడదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా! ఇందులో వరుణ్ బాక్సర్‌గా రింగులోకి దిగి ఫైట్ చేయనున్నాడు. ఇందుకుగానూ కండలు పెంచడం కోసం జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'హార్డ్వర్క్కు బ్యాక్ అప్ అంటూ ఉండదు' అని క్యాప్షన్ ఇచ్చిన ఈ వీడియోలో వరుణ్ బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా తమన్నా స్పెషల్ సాంగ్‌లో నర్తించే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు సమాచారం. No back-ups for hard work!🥊#Ghani#MondayMotivaton pic.twitter.com/XqXLlVXXnJ — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 2, 2021 -
తమన్నా స్పెషల్ సాంగు.. వరుణ్ మాసు స్టెప్పు
‘గని’తో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ స్టెప్పులేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గని’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలో ఉన్న ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట తమన్నా. త్వరలో ఈ మాసీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’, ‘జాగ్వార్’, ‘జై లవకుశ’, ‘కేజీఎఫ్: ఛాప్టర్ వన్’, ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ‘గని’ చిత్రాన్ని ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కోవిడ్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. -
ఆటలతో ఆకట్టుకున్న హిట్ సినిమాలివే!
కోడి రామ్మూర్తి బయోపిక్ రానుంది. పి.వి.సింధు ఆటను బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో? ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్ వెళ్లి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్టు. లేకుంటే అంతే. చాలాకాలం స్పోర్ట్స్‌ను పట్టించుకోని ఇండియన్ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. అసలు ఇంతకు ముందు ఏం స్పోర్ట్స్ మూవీస్ వచ్చాయి.. ఇక మీదట ఏం రానున్నాయి మనకు తెలియాలి... ఎస్... తెలియాలి... జమీందారు కూతురైన హీరోయిన్– బంగ్లా లాన్లో బాడ్మింటన్ బ్యాట్ పట్టుకుని, ఫ్రెండ్స్‌తో రెండు బాల్స్ ఆడి, అప్పుడే కారులో వచ్చిన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘డాడీ’ అనడం వరకే మన సినిమాల్లో ఆటలు కనిపించేవి. సినిమాలో ఆట ఎప్పుడైనా ఒక భాగమే తప్ప ఆటే సినిమా కావడం ఏమిటి ఎవరు చూస్తారు అని మన వాళ్లు ఆ జానర్‌ని ఔట్ చేసి కోర్ట్ బయట ఎప్పుడో కూచోబెట్టారు. కాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆటే కథ. ఆటే క్లయిమాక్స్. ఆటే హీరో. ఆటగాడే హీరో. నీవు లేని నేను లేను శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ అని పాట స్కేటింగ్ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్.టి.ఆర్ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆటల ప్రస్తావన మనకు లేదు. విలువిద్య ఉంది కాని సినిమా విలువిద్యలో ఒకరు ఆగ్నేయాస్త్రం వేస్తే ఒకరు వరుణాస్త్రం వేస్తారు. రెండు ఆకాశంలో గంటసేపు ప్రయాణించి ఢీకొంటాయి. ఇలాంటివి ఒలింపిక్స్ వారు ఒప్పుకోరు. కాలం మారి చిరంజీవి వచ్చి ‘ఇంటిగుట్టు’లో మిక్స్డ్ కబడ్డీ ఆడాడు నళినితో. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా కనిపించాడు. మెల్లగా ఆటల బంతి దొర్లడం మొదలెట్టింది. ఆట మార్చిన అశ్వని 1991లో తెలుగులో ‘అశ్వని’ వచ్చింది. జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్వని నాచప్ప జీవితం స్ఫూర్తితో ఆమెనే హీరోయిన్గా పెట్టి ‘ఉషాకిరణ్ మూవీస్’ తీసిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి తెలుగులో. ఒక పేదింటి అమ్మాయి కూడా క్రీడాకారిణి కావచ్చు అని చెప్పిన కథ ఇది. ఆట నేపథ్యంలో పూర్తి సినిమా తీయవచ్చని నిరూపించింది. కాని ఆ స్థాయి కథ లేదా ఆ వాతావరణం ఏర్పడలేక పోయింది. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌ని నేపథ్యంగా తీసుకుంది. పూరి జగన్నాథ్ వచ్చి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో కూడా అదే కిక్ బాక్సింగ్‌ని తీసుకున్నాడు. హీరో పంచ్ విసిరే ఆటలే ఆటలుగా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈత కొట్టే హీరో కంటే పంచ్ కొట్టే హీరోకు హిట్ కొట్టే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ 2003లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ కథకు ఆటను నేపథ్యంగా తీసుకోవచ్చని మరోసారి గట్టిగా ఇండస్ట్రీకి చెప్పింది. ఇందులో మహేశ్ బాబు కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాన్డును కథగా తీసుకున్నప్పటికీ పూర్తి విజయం మాత్రం ‘ఒక్కడు’ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గానే స్పోర్ట్స్ కథలు కనిపిస్తూ వచ్చాయి. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ్ హైస్కూల్’ (క్రికెట్), ప్రకాష్ రాజ్ ‘ధోని’ (క్రికెట్), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెట్), ‘సై’ (రగ్బీ)... ఇవన్నీ ఆటలను చూపినవే. హీరో నాని క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ చేసి పెద్ద హిట్ అందుకుంటే నాగ చైతన్య కూడా అదే క్రికెట్ నేపథ్యంలో ‘మజిలీ’ చేసి విజయం సాధించాడు. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’లో క్రికెట్, సందీప్ కిషన్ ‘ఏ1ఎక్స్‌ప్రెస్’లో హాకీ ఆటలు ప్రేక్షకుల్ని గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. అన్నింటికి మించి మహిళా బాక్సింగ్‌ను తీసుకుని వెంకటేశ్ హీరోగా, రితికా మోహన్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ‘గురు’, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా మహిళా క్రికెట్‌ను తీసుకుని వచ్చిన ‘కౌసల్యా క్రిష్ణమూర్తి’, మహిళా ఫుట్‌బాల్‌ను తీసుకుని విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ క్రీడల్లోనే కాదు సినిమాల్లో కూడా మహిళల విజయాన్ని చూపించాయి. వరుస కట్టిన సినిమాలు ఇక మీదట కూడ బోలెడు స్పోర్ట్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా ‘గుడ్‌లక్ సఖీ’ (షూటింగ్), నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ (విలువిద్య) రానున్నాయి. ఇవి కాకుండా కోడి రామ్మూర్తి, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, విశ్వనాథన్ ఆనంద్‌ల బయోపిక్‌లు వరుసలో ఉన్నాయి. ఇక తమిళం నుంచి డబ్ అయిన తాజా సినిమా ‘సార్పట్టా’ కాలం వెనక్కు వెళ్లి మన దేశీయులు ఆడిన బాక్సింగ్‌లో పల్లె పౌరుషాలు పట్టుదలలు ఏ విధంగా ఉంటుందో చూపింది. అసలు గతాన్ని తవ్వుకుంటూ వెళితే ఎన్ని స్పోర్ట్స్ డ్రామాలు దొరుకుతాయో కదా. ఓడటం తెలిసినవాడే గెలవడం నేరుస్తాడు. ఆటల్లో ఉంటేనే ఓడటం గెలవడం ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం కూడా మనిషిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌ను అంటుకుపోతున్న నేటి తరాన్ని క్రీడామైదానం వైపు తరమాలంటే బయట, బడులలో, సినిమాల్లో ఎంత క్రీడా వాతావరణం కనిపిస్తే అంత మేలు. క్రీడలకు జయం. ఒలింపిక్స్‌లో ఉన్న భారతీయులకు జయం. ఈ ఒలింపిక్స్ జరిగినన్నాళ్లు అంతటా క్రీడా వాతావరణమే ఉంటుంది. ఒకవైపు ఆటలూ చూడొచ్చు. చూడని స్పోర్ట్స్ సినిమాలనూ చూడొచ్చు. నిజంగా ఇది క్రీడా వీక్షణ సమయమే. ‘లగాన్’ నుంచి సిక్సర్లే 2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్లో ‘లగాన్’ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్ సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలమేంటి... అక్కడ పన్ను పెంచడమేంటి... దానిని ఎదుర్కొనడానికి పల్లెటూరివాళ్లు బ్రిటిష్ వారితో క్రికెట్ ఆడటం ఏంటి... అసలా కథను తీయడం ఎలా సాధ్యం. దర్శకుడు అశితోష్ గొవారికర్ తీశాడు. సినిమా దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది. మన తెలుగువాడు నగేశ్ కుకునూర్ మూగ, చెవిటి ఆటగాడి కథను తీసుకుని అద్భుతంగా తీసిన ‘ఇక్బాల్’ ఒక గ్రామీణ క్రికెట్ బౌలర్ కథను చెప్పింది. ఆ తర్వాత మహిళా హాకీని తీసుకు షారూక్ ఖాన్ ‘చక్‌దే ఇండియా’ తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. వయసు మీరిన కోచ్ పాత్రలో షారూక్ కనిపించడానికి సిద్ధమయ్యి మరీ హిట్ కొట్టాడు. పరుగుల నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘పాన్‌సింగ్ తోమార్’, మిల్కా సింగ్ ఆత్మ కథ ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీ కోమ్’, ‘ధోని’, ‘సైనా’, ‘సుల్తాన్’... ఇవన్నీ ఉద్వేగపూరిత క్రీడా అనుభవాన్ని ఇచ్చాయి. మహిళా కుస్తీ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ రికార్డుల చరిత్రను తిరగరాసింది. ఇక 1983 వరల్డ్ కప్ నేపథ్యలో ‘1983’ రానుంది. ఫర్హాన్ ఖాన్ బాక్సర్‌గా ‘తూఫాన్’ తాజాగా విడుదలైంది. మిథాలి రాజ్ బయోపిక్ ‘శభాష్ మితూ’ వరుసలో ఉంది. ‘మైదాన్’ (ఫుట్‌బాల్) కూడా. -
గర్వించదగిన క్షణం.. అన్నయ్య బాబీపై బన్నీ ఎమోషనల్ ట్వీట్
అల్లు ఫ్యామిలీకి టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. అల్లు రామలింగయ్య మొదలు.. అల్లు శిరీష్ వరకు కొన్ని దశాబ్ధాల నుంచి చిత్ర పరిశ్రమంలో ఈ ఫ్యామిలీ రాణిస్తుంది. అల్లు రామలింగయ్య వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అల్లు అరవింద్.. ప్రస్తుతం టాలీవుడ్లో బడా నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన వారసులు అల్లు అర్జున్, అల్లు శీరీష్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ మాత్రం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. నటన పట్ల ఆయనకు ఆసక్తి లేకపోవడంతో అతన్ని నిర్మాతగా చిత్ర సీమకి పరిచయం చేయబోతున్నాడు అల్లు అరవింద్. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'గని' సినిమాని అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ గని సెట్స్ కు వెళ్లాడు. అక్కడ కాసేపు గడిపి గని టీమ్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అన్నయ్య అల్లు బాబీతో దిగిన ఓ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్ చేశాడు అల్లు అర్జున్. ఇది గర్వించదగిన క్షణం అని పేర్కొంటూ ఫిలిం మేకర్‌గా అన్నయ్య జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకున్నారు. అల్లు ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం అని పోస్ట్ పెట్టారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి అల్లు బాబీకి పెద్ద ఎత్తున బెస్ట్ విషెస్ చెబుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ‘గని’ విషయాకొస్తే.. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. A very prideful moment to see my brother #AlluBobby in a shooting as a producer. So glad his journey has started as a film maker officially . Welcome on board to ALLU ENT. #alluentertainment #allubros 🖤 pic.twitter.com/Iq3fsW8tK0 — Allu Arjun (@alluarjun) July 23, 2021 -
నా జుట్టుకు ఏం అయింది.. వరుణ్ తేజ్ ఆసక్తికర పోస్ట్
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ..టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డా.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్ మాత్రం అన్ని రకాల మూవీలు చేస్తూ టాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన ‘గద్దలకొండ గణేశ్’, ‘ఎఫ్ 2’ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’అనే సినిమాల్లో నటిస్తున్నారు. షూటింగ్‌లతో నిత్యం బిజీ బిజీగా ఉండే ఈ యంగ్ హీరో.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి ఇలా వచ్చి అలా వెళ్తుంటాడు. తన సినిమాలకు సంబంధించి విషయాలు కానీ, లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తే కానీ ఆయన పోస్టులు పెట్టడు. ఇక ఆయన రేర్‌గా పెట్టే పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అరే.. నా జుట్టుకు ఏం అయింది’అంటూ వరుణ్ ఓ ఓల్డ్ ఫోటోని షేర్ చేశాడు. అందులో వరుణ్ హెయిర్ స్టైయిల్ ఢిపరెంట్‌గా ఉంది. జుట్టంతా ముళ్లులుగా పైకి లేచి స్టైలీష్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలైతే వరుణ్ న్యూ లుక్‌కి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
ఫినిషింగ్ టచ్‌కు ‘గని’రెడీ.. ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్
వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ బాగానే కష్టపడుతున్నాడు. జిమ్‌కెళ్లి కండలు పెంచడమే కాకుండా.. బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ సినిమాలో భాగం కావడం ఆసక్తిని పెంచేసింది.ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. అందులో వరుణ్ తేజ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను ప్రారంభినట్టుగా తెలిపారు. And the final round begins!!!🥊🥊🥊#Ghani pic.twitter.com/US3IsMQWa7 — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) July 10, 2021 -
బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న హీరోలు
తెరపై విలన్ ముఖం మీద హీరో ఒక్క కిక్ ఇస్తే.. చూసే ఆడియన్స్‌కి ఓ కిక్. హీరో వరుసగా కిక్‌ల మీద కిక్‌లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్ ఇవ్వనున్నారు. బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ కోసం బాక్సర్ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్. దీంతో ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ ఎపిసోడ్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’ చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. లాక్డౌన్ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్ ప్రాక్టీస్‌తోనే గడిచిపోయిందని వరుణ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్ నుంచి సాలిడ్ బాక్సింగ్ సీన్స్‌ను ఆశించవచ్చు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్‌గా కనిపించారు ఫర్హాన్. ఇప్పుడు ‘తుఫాన్’ కోసం వీరి కాంబినేషన్ రిపీటైంది. అయితే ‘తుఫాన్’లో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్ కల్చర్‌ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్. ‘బ్రూస్లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ‘బాక్సర్’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ ఓ హీరోయిన్. ‘గురు’లో బాక్సర్‌గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్ అటు నార్త్‌లో ఈ బాక్సర్లు కొట్టే కిక్‌లకు వసూళ్ల కిక్ ఖాయం అనే అంచనాలున్నాయి. -
Ghani: హాలీవుడ్ స్టైల్ యాక్షన్ షురూ
వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం ‘గని’. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడగానే తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టనున్నారు. సిద్ధు ముద్ద మాట్లాడుతూ – ‘‘మా సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ లాక్‌డౌన్‌లోనూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు వరుణ్. లాక్డౌన్ తర్వాత మొదలయ్యే షెడ్యూల్లో వరుణ్, ఇతర ప్రధాన తారాగణంపై యాక్షన్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇందుకోసం భారీ స్టేడియమ్ సెట్ వేయించాం. హాలీవుడ్లో ‘టైటాన్స్’, బాలీవుడ్లో ‘సుల్తాన్’ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో యాక్షన్ పార్ట్ చిత్రీకరిస్తాం’’ అన్నారు. సో...యాక్షన్ హాలీవుడ్ స్టైల్లో ఉంటుందని ఊహించవచ్చు.