సయీ మంజ్రేకర్
‘‘గని’ సినిమాలో నాది బబ్లీ గర్ల్ క్యారెక్టర్. సరదాగా ఉంటుంది. తెలుగులో నా తొలి చిత్రం విడుదలవుతుండటంతో చాలా ఎగ్జయి టింగ్‌గా ఉంది. ప్రేక్షకుల మధ్య కూర్చొని ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేచి చూస్తున్నా’’ అని సయీ మంజ్రేకర్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గని’. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సయీ మంజ్రేకర్ విలేకరులతో పంచుకున్న విశేషాలు.
మా నాన్నకు (దర్శకుడు, నటుడు, నిర్మాత మహేశ్ మంజ్రేకర్) భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఆయన వారసురాలిగా నేను ఇండస్ట్రీలోకి రావడం ఒత్తిడిగా భావించలేదు కానీ, ఓ బాధ్యతగా ఫీలయ్యా. నా వల్ల నాన్న పేరు చెడిపోకూడదని ఆలోచిస్తుంటా. నాన్న సలహాలు నా కెరీర్‌కి చాలా ఉపయోగ పడ్డాయి. నేను నటించే సినిమాల కథల్ని అమ్మానాన్నలతో కలిసి వింటాను. అయితే చేయాలా? వద్దా? అనే తుది నిర్ణయం నాదే.
చదవంది: రామ్ చరణ్‌కి జోడిగా అంజలి! ఏ సినిమాలో అంటే
మూడేళ్ల క్రితం డైరెక్టర్ కిరణ్‌గారు ముంబై వచ్చి ‘గని’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయి, ఓకే చెప్పేశాను. ‘గని’ మంచి కథ. ప్రేక్షకులకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. వరుణ్ తేజ్ మంచి మనసున్న కో స్టార్. కిరణ్‌గారిని నేను ఎన్ని డౌట్లు అడిగినా విసుక్కోకుండా చెప్పారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దగార్లకి ఇది తొలి సినిమా. ఎప్పుడూ సెట్స్‌లోనూ ఉంటూ మంచి సినిమా నిర్మించారు.
తెలుగు పరిశ్రమ అంటే నాకు మంచి గౌరవం. తెలుగు సినిమాలను హిందీ డబ్బింగ్‌లో చూస్తాను. ‘మగదీర, పుష్ప’ సినిమాలకు ఫిదా అయిపోయాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ అంటే ఇష్టం. ఎన్టీఆర్, అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ‘గని’ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్‌ని దగ్గరగా చూసినప్పుడు లోలోపల ఎగిరి గంతేశాను.
‘దబాంగ్ 3’ ప్రమోషన్ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు రామ్‌చరణ్‌ని కలవడం గొప్ప అను భూతినిచ్చింది. ∙కథ, పాత్ర.. ఆ రెండూ నచ్చితే గ్లామర్‌గా నటించడానికి సిద్ధమే. నా ఫేవరెట్ నటి ఆలియా భట్. ఆమెను చూసి, ఇన్‌సై్పర్ అవుతుంటా. నేను నటించిన మరో తెలుగు చిత్రం ‘మేజర్’ కూడా త్వరలో విడుదల కానుండటం హ్యాపీ. తెలుగులో మరికొన్ని కొత్త సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment