Ghani Movie Twitter Review In Telugu | Varun Tej | Saiee Manjrekar - Sakshi
Sakshi News home page

Ghani Twitter Review: ‘గని’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..

Apr 8 2022 8:21 AM | Updated on Apr 8 2022 9:40 AM

Ghani Movie Twitter Review In Telugu - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ తొలిసారి బాక్సర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన హీరోగా నటించిన గని మూవీ పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు నేడు(ఏప్రిల్‌ 8) థియేటర్స్‌లో విడుదలైంది.  అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. అతనికిది తొలి సినిమా. వరుణ్‌కు జోడిగా సయీ మంజ్రేకర్‌ నటించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తర్వాత విడుదలవుతున్న ‘గని’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ చేశాయి.  

ఓవర్సీస్‌తో పాటు  పలు చోట్ల ఈ సినిమా ప్రివ్యూస్‌ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కథేంటి, కథనం ఎలా ఉంది? బాక్సర్‌గా వరుణ్‌ రాణించాడా లేదా తదితర అంశాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. 

బాక్సర్‌గా వరుణ్ తేజ్‌ వందశాతం మెప్పించాడని చెబుతున్నారు. తమన్‌ మరోసారి తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేషాలు కూడా బాగా పండాయని ట్వీట్‌ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్‌లోనే అసలు స్టోరీ ఉందని కామెంట్‌ చేస్తున్నారు. ఉపేంద్ర ఎంట్రీతో సినిమా టర్న్‌ అయిందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement