
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'గని'. సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల అయిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా గని మూవీ ఓటీటీలో దర్శనం ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన 4-5వారాల తర్వాత డిజిటిల్‌లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోను బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పుష్ప సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. రాధేశ్యామ్ కూడా రెండు వారాల్లోనే డిజిటల్‌లో సందడి చేసింది.
ఇప్పుడు గని సినిమా కూడా రిలీజ్ అయిన మూడు వారాలకు అంటే ఏప్రిల్ 29నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment