Allu Arvind
-
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’
‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. యుఐ వరల్డ్’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో మొదలవుతుంది ‘యుఐ’ చిత్రం టీజర్. ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటిస్తున్న చిత్రం ‘యుఐ’. జి. మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ మనోహరన్ సహనిర్మాత. బందీలుగా ఉన్నవారి హాహాకారాలు, విచిత్ర వేషధారణలో ఉన్న వ్యక్తులు కనిపిస్తుండగా, వారిని రక్షించడానికే అన్నట్లు హీరో ఉపేంద్ర ఎంట్రీతో టీజర్ ముగుస్తుంది. సోమవారం జరిగిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఈ చిత్రానికి ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ (ఐఎల్ఎమ్) క్రియేషన్ టెక్నాలజీని వాడాం. దాదాపు 90 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర సరసన రీష్మా నానయ్య నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీ శర్మ, పి. రవిశంకర్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమెరా: హెచ్‌సి వేణుగోపాల్. -
నాన్నగారి ప్యాషన్ మమ్మల్ని నిలబెట్టింది
‘‘మా నాన్నగారు (అల్లు రామలింగయ్య) సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే లక్ష్యంతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోనే వదిలేసి చెన్నై వెళ్లారు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానం. ఆయన చిత్ర పరిశ్రమలోకి రావడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. యానిమేషన్ రంగంలో గుర్తింపు సంపాదించుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ అధినేతలు రాజీవ్ చిలక, శ్రీనివాస్ చిలక ‘చిలకప్రోడక్షన్’ బ్యానర్ పేరుతో చిత్ర నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యానర్ లోగోను నిర్మాతలు అల్లు అరవింద్, శరత్ మరార్ విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాజీవ్ చేసిన ‘చోటా భీమ్’ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. రాజమౌళి దగ్గరున్న ప్యాషన్‌ని రాజీవ్లో చూశాను’’ అన్నారు. ‘‘సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న శ్రీనివాస్, రాజీవ్‌లకు అభినందనలు’’ అన్నారు శరత్ మరార్. రాజీవ్ చిలక మాట్లాడుతూ– ‘‘లయన్ కింగ్’ సినిమా చూసి ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు?అనిపించింది. అలాంటి యానిమేషన్ సినిమా చేయాలనే లక్ష్యంతోనే ‘గ్రీన్ గోల్డ్ సంస్థ’ని ప్రారంభించాం. మా చిలకప్రోడక్షన్లో ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు. ‘ ‘2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్‌ను ఆరంభించాం. 2008లో ఆరంభించిన ‘చోటా భీమ్’ ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ ప్రయాణంలో భాగంగా సినిమాలు నిర్మించడానికి చిలకప్రోడక్షన్స్ని స్టార్ట్ చేశాం’’ అని శ్రీనివాస్ చిలక అన్నారు. -
కొంతమంది కావాలనే బురద జల్లుతున్నారు: సురేశ్ కొండేటి
గోవాలో జరిగిన సంతోషం అవార్డ్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని గత 21 ఏళ్లుగా ఇస్తున్న సినీ జర్నలిస్ట్ సురేశ్ కొండేటి స్పందించారు. ఈ అవార్డులు పూర్తిగా తన వ్యక్తిగతమని.. తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదంటూ ట్వీట్ చేశారు. సురేశ్ కొండేటి ట్వీట్లో రాస్తూ..' అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను . ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు . ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నా. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే . అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నా. గోవా ఈవెంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్‌కు రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్. ఇది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను. నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి' అంటూ ట్వీట్ చేశారు. pic.twitter.com/zlLhjNx8UM — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే ..… — Suresh Kondeti (@santoshamsuresh) December 4, 2023 -
కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. రెండుసార్లు వరుస విజయాలు సాధించిన బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టేశారు. కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. మొత్తంగా 64 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ అధికారం చేపట్టబోతోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హస్తం పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు. సినీ పరిశ్రమను ఆదుకోవడం హస్తం పార్టీకి కొత్తేమీ కాదన్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు కూడా సినీపరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా చిత్రపరిశ్రమను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నామని, త్వరలోనే ఇండస్ట్రీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని చెప్పారు. చదవండి: సిల్క్ స్మితపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ వైరల్.. -
తొలి ప్రయత్నంలోనే హిట్టవడం ఆనందం
‘సత్యం’ రాజేశ్, కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పాలిమేర 2’. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ నెల 3న విడుదల చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా ముందుకు వెళ్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా వంశీ నందిపాటిని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అభినందించారు. వంశీ మంచి అభిరుచిగలవాడని, మొదటి ప్రయత్నంలో చిరస్మరణీమైన హిట్ అందుకోవడం తనకు ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ యూనిట్ నవంబరు 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని కూడా ఆయన వెల్లడించారు. -
బేబీ టీమ్‌కు స్పెషల్ పార్టీ ఇచ్చిన అల్లు అరవింద్ (ఫోటోలు)
-
వరుణ్- లావణ్యల పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అల్లు అరవింద్
-
నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!
నా ద్వారా పైకి వచ్చిన దర్శకులు చాలామంది గీత దాటారన్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. కెరీర్లో కొంత సక్సెస్ కాగానే ఆ విషయం మర్చిపోయి గీత దాటి వేరే సినిమాలు చేశారని పేర్కొన్నాడు. మే 5న మలయాళంలో రిలీజైన 2018 మూవీ అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గురువారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్ చేశాడు. 2018 మూవీ చూశా, ఇది మనం తెలుగులో రిలీజ్ చేయాలి అని చెప్పాడు. ఇతర భాషల్లో వస్తున్న మంచి సినిమాలన్నీ మనమే చేస్తున్నం కదా.. ఇది కూడా మనమే చేద్దాం అంటే సరేనన్నాను. అయితే ఇక్కడ నేను గానీ, దిల్ రాజుగానీ.. సీనియర్స్ అందరం జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి. అందులో వాళ్లను ఎదగనివ్వాలి. మొత్తం మనమే ఆక్రమించేసి మనమే పైకొచ్చేయాలనేది సరి కాదు. పక్కవాళ్లకు స్పేస్ ఇవ్వడమే నా ఆటిట్యూడ్. ఇప్పటికీ నాకోసం నిలబడ్డాడు చందూ మొండేటి కార్తికేయ 2 తీసి ఏడాది దాటిపోయింది. అయితే ఆ సినిమా రిలీజవకముందే నాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్మెంట్ ఉంది. కార్తికేయ 2 రిలీజ్ కాకముందే అతడో గొప్ప డైరెక్టర్ అని గ్రహించి బుక్ చేసుకున్నాను. నాద్వారా పైకొచ్చినవాళ్లలో చాలామంది గీత దాటారు. వాళ్ల పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ చందూ మొండేటి మాత్రం నాతో సినిమా చేయడానికే నిలబడ్డారు' అని వ్యాఖ్యానించాడు అరవింద్. అయితే అల్లు అరవింద్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: అమ్మాయిలపై అత్యాచారం... నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష -
అల్లు అర్జున్ను చూసి తండ్రిగా గర్వపడుతున్నా : అల్లు అరవింద్
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ను చూసి గర్వపడుతున్నానని అల్లు అరవింద్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కొడుకు బన్నీపై ప్రశంసలు కురిపించారు. 'గతంలో నన్ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అని పిలిచేవారు. నా సినిమాల గురించి మాట్లాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొంతమంది అయితే వాళ్ల పిల్లలకు నన్ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ అని పరిచయం చేస్తున్నారు. ఒక తండ్రికి ఇంతకన్నా గుర్తింపు ఏం ఉంటుంది? ఒక తండ్రిగా నాకు అది గర్వకారణం.బన్నీని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు మరోసారి గర్వపడుతున్నా. ఇక నా మనవరాలు అల్లు అర్హ కూడా సినిమాల్లోకి వచ్చేసింది. సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రంలో అర్హ కీలక పాత్రలో నటించింది. తనను స్క్రీన్‌పై చేసేందుకు మేమంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన అల్లు అరవింద్
-
అల్లు అరవింద్‌కు నలుగురు కుమారులని తెలుసా?
స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లు అరవింద్. నటుడిగా కాకుండా నిర్మాతగా కెరీర్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో బడా నిర్మాతగా వెలుగొందుతున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ కింద ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆయనకు ముగ్గురు కుమారులు అని అందరూ అనుకుంటారు. వారే అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేశ్ (బాబీ). కానీ అల్లు అరవింద్‌కు మరో కుమారుడు కూడా ఉండేవాడన్న విషయాన్ని శిరీష్ బయటపెట్టాడు. 'మా నాన్నకు మేం నలుగురం. పెద్దన్నయ్య అల్లు వెంకటేశ్ తర్వాత రాజేష్ జన్మించాడు. వీళ్లిద్దరి తర్వాత అర్జున్ పుట్టాడు. ఐదారేళ్ల వయసులో రాజేశ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నేను పుట్టడాని కంటే ముందే ఇది జరిగింది' అని చెప్పుకొచ్చాడు అల్లు శిరీష్. చదవండి: మనసుకు గాయమంటూ రేవంత్ ఏడుపు చాలా నెర్వస్‌గా ఉంది, అంతా మీ చేతుల్లోనే: సమంత -
అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోయినా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి అను ఇమ్మానుయేల్‌ని పిలిచి మరి అల్లు అరవింద్ డైరెక్ట్‌గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. శిరీష్‌తో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ రోజు పూజలోని శిరీష్‌ని నేను కలిశాను. ఆ తర్వాత మూవీ కోసం ఓసారి కాఫీ షాప్‌లో మాట్లాడకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు. అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య మూవీలో నటించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అంతే. అల్లు అరవింద్ కూడా ఓసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. -
త్వరలో 'కాంతార' హీరో రిషబ్ శెట్టితో సినిమా: అల్లు అరవింద్
ఓటీటీల వల్ల జనాలు థియేటర్లకు రావడం లేదు అనేదాంట్లో ఏమాత్రం నిజం లేదని నిరూపించాయి పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కార్తికేయ 2 సినిమాలు. కంటెంట్ ఉంటే చాలు కేవలం మౌత్ టాక్‌తోనే జనాలను థియేటర్స్‌కు రప్పించవచ్చని నిరూపించింది కాంతార. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగులో దీన్ని రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతున్న తరుణంలో బుధవారం ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'సినిమాకు భాషా సరిహద్దులు లేవు, ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం రుజువు చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ. ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో విష్ణు తత్వం, రౌద్ర రూపం చూశాక ఇది సింహాచలంకి దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఇందులో హీరో ఎంత గొప్పగా చేశాడో మీరు చూశారు. అతను ఫీల్ అయ్యి చేయడం వల్ల ఈ సినిమా అంతలా కనెక్ట్ అయింది. ఈ చిత్రానికి అజనీష్ లోకనాధ్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. జాతరలో జరిగే అరుపులను, కొన్ని సౌండ్స్‌ను రికార్డ్ చేసి మ్యూజిక్‌తో పాటు వదిలారు. ఈ సినిమాను కన్నడలో చూసిన బన్నీ వాసు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అన్నాడు. ఏంటి, బన్నీ వాసు ఇంత ఎగ్జైట్మెంట్గా చెబుతున్నాడు అనుకున్నాను. సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యి దీన్ని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించి తెలుగులో రిలీజ్ చేశాం. ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏమిటంటే గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని రిషబ్ శెట్టిని అడిగాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు' అని చెప్పాడు అల్లు అరవింద్. చదవండి: సర్దార్లో అన్ని గెటప్సా? సూర్యను దాటేస్తాడా? బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కాంతా.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
టాలీవుడ్లో దూసుకెళ్తున్న ‘కాంతార’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
‘కేజీయఫ్’తర్వాత కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్నాయి. శాండిల్ వుడ్ చిత్రాలపై యావత్ భారత్ సీనీ ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అందుకే కన్నడ మేకర్స్ పాన్ ఇండియా స్థాయి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కన్నడ ప్రేక్షకుల కోసమే రూపొందిస్తుంటే.. అవి కూడా మిగతా భాషల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిత్రాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’.ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. (చదవండి: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కాంతర’ బడ్జెట్ ఎంతో తెలుసా..?) తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఒక్క రోజే రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.114 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టి రికార్డుని సృష్టించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. -
చిరంజీవి ఫ్యామిలీతో గొడవ? మరోసారి అల్లు అరవింద్ క్లారిటీ!
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలు లేవంటూ సోషల్ మీడియాలో తరచూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. మా మధ్య ఎటువంటి గొడవలు లేవు అని అటు చిరంజీవి, ఇటు అల్లు అరవింద్ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్లకు చెక్ పడటం లేదు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఎందుకిలా కాంట్రవర్సీలోకి లాగుతారు? మా కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక తన మనవరాలు గురించి మాట్లాడుతూ.. 'అర్హ ఎంతో తెలివైనది. ఇంత చిన్న వయసులో అంత తెలివైనవాళ్లను చూడటం చాలా అరుదు. నా మనవరాలు కాబట్టి ఎక్కువ చెప్పుకోకూడదులే' అంటూనే అర్హపై ప్రశంసల వర్షం కురిపించారు అల్లు అరవింద్. చదవండి: గరికపాటికి సారీ చెప్పిన చిరంజీవి అమ్ము ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మరోసారి ఎఫ్ఎన్సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4 వేల 600మంది సభ్యులున్న ఈ సెంటర్లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లుఅరవింద్ , సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్‌లోని సభ్యులే గెలుపొందారు. చదవండి: (డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్) -
‘పక్కా కమర్షియల్’ టికెట్ రేట్స్‌పై బన్నీవాసు క్లారిటీ
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టికెట్ల ధరలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా ‘పక్కా కమర్షియల్’ టికెట్ ధరలు ఉంటాయని చెప్పారు. (చదవండి: స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ..‘టికెట్ రేట్స్ అందరికి అందుబాటులో ఉండాలని కోరుకునే వారిలో అల్లు అరవింద్, నేను ముందు వరుసలో ఉంటాం. పక్కా కమర్షియల్ మూవీలో టికెట్ల రేట్లను తగ్గించాం. ఈ సినిమాకి నైజాంలో 160(జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్‌లో రూ.100+ జీఎస్టీ’గా టికెట్ రేట్లు ఉంటాయి’ అని బన్నీ వాసు స్పష్టం చేశారు. టికెట్ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఆయన చెప్పుకొచ్చారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని, ఎఫ్3కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది’ అని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్
Allu Arvind About Indian Cinema, Movie Industries: ప్రస్తుతం భారత సినీ పరిశ్రమ చాలా ప్రాబ్లమ్స్లో ఉందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదలైన ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రీసెంట్గా విడుదలైన యంగ్ హీరో విశ్వక్సేన్ ‘అశోకవనంలో అర్జుణ కళ్యాణం’ మూవీ సెక్సెస్ మీట్ నిన్న నిర్వహించారు. ఈ వెంట్‌కు ఆయన ముఖ్య అథితిగా వచ్చారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమా తాను కూడా చూశానని, చాలా బాగుందని చెప్పారు. చదవండి: స్టార్ హీరో సల్మాన్‌కు వింత వ్యాధి.. ‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ అనంతరం ‘గతంలో కుటుంబం మొత్తం థియేటర్‌కు వచ్చి సినిమాలు చూసేవారు. ప్రస్తుతం థియేటర్లకు వచ్చి సినిమా చూసే అలవాటు పోయింది. శని, ఆదివారాలు వస్తే భార్య, భర్తతో ఏ సినిమాకు వెళ్దామండి అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ కనిపించడం లేదు. ఓటీటీలు వచ్చాక అది పూర్తిగా మారింది. సినిమా విడుదలయ్యాక ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే కాలం వచ్చింది’ అన్నారు. కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లోకి రప్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు ‘ఒకప్పుడు ఎలాంటి హీరో సినిమా అయినా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవాడు. కానీ ఇప్పుడు పెద్ద హీరో సినిమా అయిన ప్రేక్షకులు అంత థియేటర్లకు రావడం లేదు. దీనికంతటికి కారణం ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో చాలా మరడమే. ఇప్పటికైన ఇలాంటి డేంజరస్ ట్రెండ్ నుంచి మనం బయటపడాలి. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇప్పటికైన ఇండస్ట్రీ అది గ్రహించారు. ప్లిజ్ మీరందరు సినిమాకు వచ్చి చూస్తేనే ఈ సినిమాలు బ్రతకుతాయి’ అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందని, అక్కడి స్టార్లు నటించిన చిత్రాలు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నాయని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. -
గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ధర్నాకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర45లో ఉన్న గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది. కాగా గతంలోనూ సునీత గీతా ఆర్ట్స్ ముందు పలుమార్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. చదవండి: రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే.. -
Ghani Movie: అప్పుడే ఓటీటీలోకి 'గని'!
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'గని'. సాయి మంజ్రేకర్ ఇందులో హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల అయిన సంగతి తెలిసిందే. బాక్సింగ్ ప్రధానంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా గని మూవీ ఓటీటీలో దర్శనం ఇచ్చేందుకు రెడీ అవుతుంది. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన 4-5వారాల తర్వాత డిజిటిల్లోకి వస్తుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం రెండు నుంచి మూడు వారాల్లోపే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోను బ్లాక్ బస్టర్ విజయం సాధించిన పుష్ప సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. రాధేశ్యామ్ కూడా రెండు వారాల్లోనే డిజిటల్లో సందడి చేసింది. ఇప్పుడు గని సినిమా కూడా రిలీజ్ అయిన మూడు వారాలకు అంటే ఏప్రిల్ 29నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా ఈ సినిమాలో కన్నడ హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, జగపతి బాబు, నదియా కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. -
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై వెబ్‌సిరీస్
Prakash Jha Set To Direct Multilingual Series On PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్ రాబోతుంది. భారతదేశ రూపురేఖల్ని మార్చిన పీవీ తీరుపై వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగానే వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా దీనికి దర్శకత్వం వహించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నట్టు ప్రకాష్ ఝా ప్రకటించారు. వెబ్ సిరీస్‌ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి అల్లు అరవింద్ నిర్మించనున్నారు. 2023లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. -
Pushpa Pre Release Images: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
అందుకే ఈ షోకు హోస్టింగ్ చేస్తున్నా: బాలకృష్ణ
Nandamuri Balakrishna: 'మనిషి ప్రజెంటేషనే అన్‌స్టాపబుల్. నవ్వడం, నవ్వించడమే యాక్టింగ్ కాదు, పాత్రలోకి ప్రవేశించడం. అది ఎంతో ఒత్తిడితో కూడుకుంది. ఇక ప్రతి ఇండస్ట్రీలో పోటీ ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడే అసలు మనిషి ఆవిష్కరించబడతాడు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే అన్‌స్టాపబుల్. ప్రతి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరడమే అన్‌స్టాపబుల్. ఇది నాకు నచ్చింది. అందుకే ఒప్పుకున్నా. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా. మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా. ఆహాలో అన్‌స్టాపబుల్‌లో కలుద్దాం' అన్నారు బాలకృష్ణ. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్’ నవంబరు 4వ తేదీ నుంచి ఓటీటీ ఆహాలో ప్రసారం కానుంది. గురువారం ఈ కార్యక్రమం కర్టెన్ రైజర్ జరిగింది. Aha lo kaludhaam ani mana balayya garu annarante history repeat avvatam khayam!🔥#UnstoppableWithNBK#NBKonAHA. pic.twitter.com/8fqiqLnMYV — ahavideoIN (@ahavideoIN) October 14, 2021 ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాలకృష్ణ వెండితెరపై నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఒకరోజు ‘ఆహా’ టీమ్‌తో కలిసి ఏదో మాట్లాడుతూ.. ‘బాలకృష్ణతో షో చేస్తే ఎలా ఉంటుంది’ అని అన్నాను. అందరూ అరుపులు, ఈలలు వేశారు. మరో క్షణం ఆలోచించకుండా వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేశా, ఆయన ఓకే అన్నారు. ఇక ఆహాకు 1.5మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ లక్ష్యం. పెద్ద పెద్ద సంస్థలు కూడా పొందలేని నెంబర్లు ‘ఆహా’కు వస్తున్నాయి. ఇది తెలుగువారి ఘనత. తెలుగువారి సినిమాలను దేశవ్యాప్తంగా చూస్తున్నారు. తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ‘బాహుబలి’ ఎంతో గౌరవాన్ని తెచ్చింది. అలాంటి గౌరవాన్ని నిలబెట్టేందుకే ‘ఆహా’ కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా’’ అని అన్నారు. -
ఇలాంటి సమయంలో సెలబ్రేషన్ కావాలి!
‘‘అఖిల్ ఓ సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు.. తనలో అదే నాకు బాగా ఇష్టం. రానున్న ఐదారేళ్లల్లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయాలనే మాస్టర్ ప్లాన్ తన మైండ్‌లో ఉంటుంది. ‘సిసింద్రీ’ నుంచి ఇప్పటివరకు తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అఖిల్‌ని చూస్తుంటాను.. తను ఓ సినిమాకి అంత అంకితం అవుతాడు’’ అన్నారు నాగచైతన్య. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో దర్శకడు వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిపిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘జోష్’కి వాసూ వర్మ దర్శకత్వం వహించారు.. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. బన్నీ వాసుతో ‘100›పర్సెంట్ లవ్’ చిత్రం చేశాను. తన ప్రయాణం చూస్తే గర్వంగా ఉంది. అరవింద్‌గారు కథ ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అంటారు.. అది అలాగే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ మూవీ తీయాలంటే అంత కేర్ ఉండాలి.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ చూస్తుంటే ఓ సెలబ్రేషన్‌లా అనిపించింది.. ఇలాంటి సమయంలో థియేటర్స్‌లో మన ప్రేక్షకులకు సెలబ్రేషన్ కావాలి.. ఈ సినిమా ఆ సెలబ్రేషన్‌ని ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అఖిల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పగలను. భాస్కర్ ఈ సినిమాను బాగా తీశాడు’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంటే రామానాయుడుగారిని చూశాం.. ఇప్పుడు అరవింద్‌గారిని చూస్తున్నాం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి యూత్‌ఫుల్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టబోతున్నాడు’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలిగిన సినిమా ఇది. చైతూగారి ‘100 పర్సెంట్ లవ్’ సినిమాతో నిర్మాతగా మారాను. ఇప్పుడు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నా కెరీర్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ఈ టీమ్‌లో నన్ను భాగస్వామి చేసిన అరవింద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు వాసూ వర్మ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘మీ వెనకాల (నాగచైతన్య, అఖిల్) అక్కినేని లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. అయితే అఖిల్‌ని తెలుగు ప్రేక్షకులందరి వద్దకూ చేర్చాలన్నదే నా ప్రయత్నం.. అది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో కచ్చితంగా జరుగుతుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ – ‘‘నాపై నమ్మకం ఉంచిన అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను.. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోలేను. ఇది ఖాయం’’ అన్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, నటి ఆమని, సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత అల్లు బాబీ, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. -
బాక్సింగ్ పంచ్‌కి రెడీ అయిన వరుణ్‌తేజ్
Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఈ చితత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే విడదులైన పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాకుండా యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్‌ను రంగంలోకి దించారు. ఇక వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Let’s light up the theatres this Diwali with #Ghani 🥊🥊🥊 pic.twitter.com/tHSXfbEkTp — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 5, 2021 -
'అల.. వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో బన్నీ!
అల్లు అర్జున్‌కి దక్షిణాదిలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన స్టైలిష్ లుక్స్, నటనతో సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారట. అది కూడా ‘అల.. వైకుంఠపురములో’ సినిమా రీమేక్‌తో అని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘షాజాదే’ (యువరాజు) పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ జంటగా రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పరేశ్ రావల్, మనీషా కొయిరాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అతిథి పాత్ర చేయాలని అల్లు అర్జున్‌ని చిత్రవర్గాలు కోరగా, ఆయన పచ్చజెండా ఊపారని టాక్. తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ అతిథి పాత్ర లేదు. మరి ‘షాజాదే’లో అతిథి పాత్రను జోడించి ఉంటారా? ఉంటే.. ఆ పాత్రను అల్లు అర్జున్ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. -
టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ ఉండవంటున్న అనుపమ
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం 18 పేజెస్. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. జూన్1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ కళ్ళకు గంతలు కట్టేయగా, దానిపై అనుమమ ఏదో రాస్తున్నట్లు ఆసక్తికరంగా పోస్ట్‌ర్‌ను డిజైన్ చేశారు. ఇక అనుమమ సైతం పోస్టర్‌ను షేర్ చేస్తూ.. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేసింది. రొమాంటికి ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు. నా పేరు నందిని. నాకు మొబైల్లో అక్షరాలను టైప్ చెయ్యడం కన్నా ఇలా కాగితం పై రాయడం ఇష్టం. టైప్ చేసే అక్షరాలకి ఎమోషన్స్ వుండవు ఎవరు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి. కానీ రాసే ప్రతి అక్షరానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. దాని పై నీ సంతకం ఉంటుంది. నాకెందుకో ఇలా చెప్పడమే బాగుంటుంది. #18PagesFirstLook pic.twitter.com/JE32WXbrdv — Anupama Parameswaran (@anupamahere) June 1, 2021 చదవండి : సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. సాయం కోసం డబ్బు తీసుకోవడం లేదు! -
'ఆహా'తో నిర్మాతగా కిక్ చూడాలంటున్న రవితేజ?
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజకు ‘క్రాక్’ సినిమా రూపంలో ఓ సాలిడ్ హిట్ దక్కిందనే చెప్పాలి. ఇలా హిట్ పడిందో లేదో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వరుస ప్రాజెక్టులతో కేరీర్‌ను పరిగెత్తిస్తున్నాడీ హీరో. ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ అప్పుడే మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడు. అంతేనా ఇప్పటి వరకు హీరోగానే చేస్తున్న రవితేజ త్వరలో నిర్మాత అవతారం ఎత్తనున్నాడనే వార్తలు టాలీవుడ్లో కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. సినీ రంగంలో రవితేజ కంటే ముందే చాలామంది హీరోలు నిర్మాతలుగా మారి తమ టాలెంట్‌ను నిరూపించకున్నారు. అంతెందుకు ఇండస్ట్రీలో చిన్న హీరోలు సైతం వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇంతకీ ఈ ఖిలాడీ ఏ సినిమా చేయబోతున్నాడు? ఏ హీరోతో చేస్తాడు? అనే కదా మీ డౌటు. మన మాస్ రాజా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్మాతగా అడుగుపెట్టబోతున్నాడట. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో సంప్రదింపులు జరపాలని సన్నాహాలు చేస్తుండగా, అల్లు అరవింద్ ఈ ప్రయత్నానికి బ్రేక్ వేసినట్లు సమాచారం. అరవింద్ స్వీయ సంస్థ ‘ఆహా’లో ఓ వెబ్ సిరీస్‌ను వీరిరువురి కలయికలో రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్త నటులను పరిచయం చేయాలని రవితేజ యోచిసున్నట్లు తెలుస్తోంది. దీనికి స్వయంగా రవితేజ దగ్గరుండి అన్ని పనులు చూసుకోనున్నట్టు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతోపాటు సిల్వర్ స్క్రీన్ మూవీస్ కూడా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. మరి మాస్ హీరోగా ఎనలేని అభిమానులను సంపాదించుకున్న ఈ విక్రమార్కుడు నిర్మాతగా మారి అందులో సక్సెస్ కిక్‌ను ఎంజాయ్ చేస్తాడా? లేదా? వేచి చూడాల్సిందే! ( చదవండి: రవితేజ ‘ఖిలాడి’ టీజర్ మాములుగా లేదుగా ) -
వ్యాక్సిన్ వల్ల ప్రాణహాని ఉండదు: అల్లు అరవింద్
గతేడాదే కరోనా పీడ విరగడవుతుందనుకుంటే ఈసారి మరింత విజృంభిస్తూ జనాలను హడలెత్తిస్తోందీ మాయదారి వైరస్. అయితే ఈసారి కోవిడ్ టీకా అందుబాటులోకి రావడంతో కొంతలో కొంత ఉపశమనం లభిస్తోంది. కానీ అనేకమంది వ్యాక్సిన్ పనితీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ టీకా వేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వ్యాక్సిన్ పనితీరు పట్ల సందేహాలు విడనాడండని పిలుపునిచ్చారు. "నాకు కరోనా వచ్చిన మాట వాస్తవమే. కానీ రెండు వ్యాక్సిన్ డోసుల తర్వాత కరోనా సోకిందనేది నిజం కాదు. నేను ఒక వ్యాక్సిన్ డోసు తీసుకున్నాను. తర్వాత ముగ్గురం స్నేహితులం ఊరెళ్లాం. ఇక్కడికి వచ్చాక ముగ్గురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న నాకు, మరో మిత్రుడికి మూడు రోజుల పాటు కొద్దిగా జ్వరం వచ్చి పోయింది. కానీ వ్యాక్సిన్ వేయించుకోని ఇంకో మిత్రుడు మాత్రం ఆస్పత్రిలో చేరాడు. కాబట్టి వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా ఎక్కువగా ఇబ్బందిపెట్టదు అని చెప్పడానికి మేమే నిదర్శనం. వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిమందికి కూడా కరోనా చాలా ఆలస్యంగా వస్తుంది. టీకా వేయించుకోవడం వల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదు. దీనికి నేనే ఉదాహరణ. అందరూ ఎటువంటి భయాలు పెట్టుకోకుండా తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోండి" అని అల్లు అరవింద్ సూచించారు. చదవండి: భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే.. -
భర్త చనిపోయిన అమ్మాయిని హీరో ప్రేమిస్తే..
‘‘ఈ సినిమాలో భర్త చనిపోయిన ఓ యువతిని హీరో ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఈ కథను సెంటిమెంటల్‌గా దర్శకుడు ఎలా ముందుకు తీసుకువెళ్లాడు? అన్నది సినిమాలో తెలుస్తుంది. బస్తీ బాలరాజుగా కార్తికేయ బాగా చేశాడు. ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటామన్న నమ్మకం ఉంది. అలాగే అక్టోబరు నుంచి డేట్స్ ఉంచమని కార్తికేయకు ఫోన్ చేసి చెప్పాను.. థ్యాంక్స్ సార్ అన్నాడు’’ అని అన్నారు అల్లు అరవింద్. కార్తికేయ, లావణ్యా త్రిపాఠీ జంటగా కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చావు కబురు చల్లగా...’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా జ్యూక్‌బాక్స్ విడుదల కార్యక్రమంలో కార్తికేయ మాట్లాడుతూ– ‘‘హిట్, ఫ్లాప్ గురించి ఆలోచించకుండా బస్తీ బాలరాజు క్యారెక్టర్ చేయాలనుకున్నాను. బన్నీ (అల్లు అర్జున్) కంటే అరవింద్‌గారే యూత్‌ఫుల్‌గా ఉన్నారనిపిస్తుంటుంది నాకు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఓ కొత్త దర్శకుడికి ఇంతకన్నా మంచి లాంచ్ దొరకదని నేను అనుకుంటున్నాను’’ అన్నారు కౌశిక్. ‘‘మాస్ డైరెక్టర్ల మధ్య తిరిగే క్లాస్ కథ ఈ సినిమా. కార్తికేయ యాక్టింగ్ నేచురల్‌గా అనిపించింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా మాకు తెలి సింది. అరవింద్‌గారికి సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉన్నప్పటికీ ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఆలోచిస్తాం. డబ్బులు కన్నా సినిమాలు థియేటర్స్‌లో విడుదలైతేనే బాగుంటుందని నమ్ముతాం మేం. ఇండస్ట్రీ బాగుండాలి. అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఆహ్లాదకరమైన పోటీ మంచిదే. కానీ అనవసర రాజకీయాలు చేయొద్దు’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాసు. ఈ కార్యక్రమంలో ఆమని, లావణ్యా త్రిపాఠీ పాల్గొన్నారు. సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటామనే నమ్మకం ఉంది – నిర్మాత అల్లు అరవింద్ -
మా స్నేహం అలానే ఉంది
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మెయిల్’. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో స్వప్నా సినిమాస్ పతాకంపై స్వప్నా దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. ఈ నెల 12న ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘నేను, అశ్వినీదత్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు అవుతోంది. మాతో పాటు వచ్చిన వాళ్లలో ఇంకా సినిమాలు తీస్తున్నది మేం మాత్రమే. ఇది మా గొప్పతనం అనటం కంటే మా పిల్లలు మా నుండి వస్తున్న దాన్ని అందుకోవటం వల్లే మాకు ఉత్సాహం వచ్చింది. మేమిద్దరం కలిసి ఏడు సినిమాలు చేశాం. సినిమాలు వచ్చాయి.. పోయాయి. మా స్నేహం మాత్రం అలానే ఉంది. స్వప్నను పిలిచి ఆహా కోసం వెబ్ సిరీస్ చేయమన్నాను. ఉదయ్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ రష్ చూపించింది. నాకు నచ్చింది.. త్వరలోనే ఆహాలో వస్తుంది’’ అన్నారు. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాకు పరిశ్రమలో ఎవరు ఆత్యంత ఆప్తులు అంటే ముగ్గురు పేర్లు చెప్తాను. చిరంజీవిగారు, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు. అరవింద్ గారు పిలిచి వెబ్ సిరీస్ చేయమన్నారని మా అమ్మాయి స్వప్న చెప్పింది. అప్పుడు నేను నీకిది గోల్డెన్ చాన్స్ అని చెప్పాను’’ అన్నారు. స్వప్నాదత్ మాట్లాడుతూ– ‘‘పార్టనర్షిప్ గురించి నాన్నతో మాట్లాడితే ‘నేను, అరవింద్ ముప్ఫై ఏళ్లుగా సినిమాలు చేశాం. హిట్స్ తీశాం, ఫ్లాపులు తీశాం. ఏ రోజూ ఒక్క మాట అనుకోలేదు. అదీ నిజమైన పార్టనర్షిప్ అంటే’ అన్నారు. మా హృదయానికి దగ్గరైన కథ ఇది. ఎంతో హాయిగా ఇంట్లోనే అందరూ కూర్చుని చూసే సినిమా’’ అన్నారు. ఉదయ్ మాట్లాడుతూ– ‘‘ఈ కథను నేను ఇండిపెండెంట్‌గా చేద్దామనుకుంటున్న సమయంలో స్వప్నగారు కథ విని ఓకే చేశారు. మాపై ఎలాంటి ప్రెషర్ లేకుండా చిత్రీకరణకు సపోర్ట్ చేశారు’’ అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ– ‘‘ఎంతో పెద్ద లెగసీ ఉన్న అరవింద్‌గారు, అశ్వనీదత్‌గారితో సినిమా చేయటం ఆనందంగా ఉంది. వరల్డ్ సినిమా స్టైల్లో ఉదయ్ ‘మెయిల్’ను తెరకెక్కించారు’’ అన్నారు. -
అందుకే సామ్ జామ్‌కు శుభం కార్డు
సాక్షి, హైదరాబాద్: బుల్లితెరపై అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'సామ్ జామ్'. అయితే ఈ షోకు త్వరలోనే శుభం కార్డు పడనున్న సంగతి తెలిసిందే. చివరి ఎపిసోడ్ సందర్భంగా సామ్ జామ్‌కు హీరో నాగచైతన్య రానున్నాడు. సమంత హోస్ట్‌గా ఈ షో ప్రారంభం అవుతుదంటూ ట్రైలర్ విడుదలగానే దీనిపై ప్రేక్షకులు, అభిమానుల అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ప్రారంభమైన అనంతరం ఈ షోకు అంతగా ప్రేక్షక ఆదరణ లభించలేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈ షో టీవీలో ప్రసారం కాకపోవడమేనని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. కేవలం ఓటీటీ ప్లాట్పాంలోనే ఈ షో ప్రసారమవ్వడంతో ప్రేక్షకులు అంతగ ఆసక్తి చూపకపోవడంతో వీక్షకుల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు సమాచారం. (చదవండి: నాకు నీ గురించి అన్నీ తెలుసు: చై) దీంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా అనుకున్న పది ఎపిసోడ్స్ కంటే ముందుగానే ముగించాలని షో నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సామ్ జామ్ మొదటి సిజన్‌ను మొత్తం పది ఎపిసోడ్లుగా నిర్ణయించి.. పది మంది టాలీవుడ్ అగ్ర నటీనటులను గెస్ట్‌గా ఆహ్వానించాలని ఆహా వ్వవస్థాపకులు, నిర్మాత అల్లు అరవింద్ నిర్ణయించారంట. ఇందుకోసం ఈ షో హోస్ట్ అయిన సమంతకు 1.5 కోట్ల రెమ్మూనరేషన్ కూడా ఇచ్చారంట. అయితే ఈ షోకు అంతగా వ్యూస్ రాకపోవడంతో 8 ఎపిసోడ్లకే సామ్ సామ్‌కు శుభం కార్డు వేయాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. (చదవండి: సమంతకు నో చెప్పిన నాగచైతన్య!) తోలి ఎపిసోడ్‌ను మెగా స్టార్ చిరంజీవితో దీపావళి సందర్భంగా ప్రారంభించిన సామ్ జామ్‌లో ఇప్పటి వరకు రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, తమన్నా, విజయ్ దేవరకొండ, దర్శకుడు క్రిష్, నాగ్ అశ్విన్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోకు అతిథిగా డార్లింగ్ ప్రభాస్ కూడా రావాల్సి ఉంద. ఇక ఇటీవల సినిమా షూటింగ్‌లు కూడా ప్రారంభం కావడంతో అగ్ర హీరోలంతా బిజీ అయిపోయారు. దీంతో వారిని ఆహ్వానించడం సవాలుగా మారడంతో ఎనిమిది ఎపిసోడ్లకే ఈ షోను పరిమితం చేసినట్లు అల్లు అరవింద్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇక రేపు జరిగే చివరి 8వ ఎపిసోడ్‌ను ఆసక్తిగా మార్చడానికి ఈ షో హోస్ట్ సామ్ భర్త, హీరో నాగచైతన్య అతిథిగా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో నెట్టింటా సందడి చేస్తోంది. -
ఘనంగా నిహారిక-చైతన్యల సంగీత్ ఫొటోలు
-
‘ఆహా’ ఓటీటీ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్
-
ఓటీటీ తీసుకురావడం గర్వంగా ఉంది
‘‘ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీలా డిజిటల్ ఇండస్ట్రీ కూడా ఒకటి.. దాన్ని తెలుగుకు తీసుకొచ్చినందుకు, అది కూడా పూర్తిగా తెలుగు భాషలో తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు హీరో అల్లు అర్జున్. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ఆహా’ ఓటీటీ గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘రెండు మూడేళ్ల కిందట.. రాత్రి ఒంటి గంట, రెండు గంటలైనా నాన్న (అల్లు అరవింద్) టీవీ షోలు చూస్తుండేవారు. ఈ మధ్య మీరు సినిమాలకంటే టీవీ షోలే ఎక్కువగా చూస్తున్నారు? అంటే.. బాగుంటున్నాయి.. వీటిని తెలుగుకి తీసుకురావాలి అన్నారు?. తెలుగులో ఓటీటీ కల్చర్ సాధ్యపడుతుందా? అన్నాను. కొన్ని రోజుల తర్వాత.. ‘మై హోమ్’ గ్రూప్ రామ్ జూపల్లిగారు ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది.. తను నాకు మంచి ఫ్రెండ్. మేమందరం కలిసి మాట్లాడుకున్నప్పుడు ఓటీటీ ఐడియా వచ్చింది. నేను చాలా గర్వపడాల్సిన సమయమిది.. మా నాన్నగారు ఐదు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో హిట్స్ సాధించారు.. అయితే ఈ ఓటీటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఈ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌కి సంబంధించింది.. అందుకే ఇండస్ట్రీలో కంటెంట్‌పై బాగా పట్టున్న ‘దిల్’ రాజుగారితో భాగస్వామ్యం అయ్యాం. ఓటీటీ అంటే యంగ్ మైండ్‌సెట్ ఉండాలి, యంగ్‌స్టర్ ఉండాలనుకున్నప్పుడు నాకు విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు.. తనతో మాట్లాడాం. భాగస్వామ్యం అయ్యాడు. ‘ఆహా’ తెలుగులో నంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 8న ‘ఆహా’ని లాంచ్ చేశాం. ఉగాది నుంచి ఉగాది వరకు సుమారు 50షోలు చేయాలనుకున్నాం. ‘ఆహా’లో ‘కంటెంట్ మేనేజ్మెంట్ బోర్డ్’ చీఫ్ క్రియేటివ్ అడ్వైజర్‌గా వంశీ పైడిపల్లిని తీసుకున్నాం. ‘సామ్ జామ్’ అనే ఆసక్తికరమైన షోని సమంత చేస్తున్నారు.. ఈ షోకి అన్నీ తానై దర్శకురాలు నందినీరెడ్డి వెనకుండి నడిపిస్తున్నారు. ఈ దీపావళికి మరో మూడు షోలు రానున్నాయి’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘జూపల్లి రామేశ్వరరావుగారు, అరవింద్‌గారు, రామ్.. ‘ఆహా’లో నన్నూ భాగస్వామ్యం కావాలని కోరారు. సినిమాలతో నేను తీరిక లేకుండా ఉంటున్నాను. దీంతో నా కుమార్తె, నా అల్లుడు ‘ఆహా’లో జాయిన్ అయ్యారు. ‘ఆహా’ స్టార్ట్ అయిన తొమ్మిది నెలల్లో కోవిడ్ టైమ్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లను అలరిస్తోంది. అరవింద్‌గారు ఏది మొదలు పెట్టినా దాన్ని సాధించే తీరుతారు. ఈ ‘ఆహా’ ద్వారా తెలుగును భారతదేశం మొత్తం తీసుకెళతారనడంలో సందేహం లేదు’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అల్లువారి కోడలి ఫన్నీ చాలెంజ్..
-
అల్లువారి కోడలి ఫన్నీ చాలెంజ్..
లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన చాలా మంది సరికొత్త చాలెంజ్‌లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్(బాబీ) సతీమణి నీలు షా సరికొత్త ఫన్నీ చాలెంజ్ చేసి చూపెట్టారు . కాళ్లకు సాక్స్‌లు ధరించి శీర్షాసనం వేసిన ఆమె.. ఒక కాలితో మరో కాలికి ఉన్న సాక్స్‌ను తొలగించారు. ఇలా శీర్షాసనంలో ఉండగానే రెండు కాళ్లకు ఉన్న సాక్స్‌లను తొలగించేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నీలు షా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫన్ చాలెంజ్ యాక్సెప్టెడ్ అని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండాలని.. సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
-
నట్టింట్లోకి నెట్టుకొస్తున్న సినిమా
సినిమా ఇంకా థియేటర్లో ఉండగానే టీవీలోనో, కంప్యూటర్లోనో, సెల్ఫోన్లోనో చూసే చాన్స్ వస్తే బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే. అది కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమానో వేరే స్టార్ హీరో సినిమానో అయితే చేతిలో ఉన్న రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టే. తంతే బూరెల బుట్టలో పడ్డట్లే. సినిమా లవర్స్‌కి ‘ఓటీటీ’ ఇలాంటి బంపర్ ఆఫర్లే ఇస్తోంది. ‘ఓటీటీ’ అంటే ‘ఓవర్ ది టాప్’ అని అర్థం. ‘పై చేయి’ అన్నమాట. నిజమే.. పరిస్థితి చూస్తుంటే సినిమాకంటే ‘డిజిటల్ ప్లాట్‌ఫామ్’దే పై చేయి అయ్యే చాన్స్ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఓటీటీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఒకప్పుడు వినోదం అంటే సినిమానే. ఇప్పుడు సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, పార్కులు, పబ్బులు, గేమింగ్ జోన్లు.. ఇలా ఎన్నో. ఇవి కాదనుకుని ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే సినిమా అద్భుతంగా ఉండాలి. అయినా వంద రోజులు ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు పదులు, వందల్లో ఉండే థియేటర్ల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. వేల థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వడంతో మహా అయితే బొమ్మ (సినిమా) ఏడెనిమిది వారాలు స్క్రీన్ మీద ఉంటుంది.. అంతే. అయితే థియేటర్లో ఉన్న సినిమా ఈ ఏడెనిమిది వారాల్లోపు ఎక్కడైనా దర్శనమిస్తే.. ఇక థియేటర్‌కి వెళ్లి చూడాలనుకున్నవాళ్లు కూడా ఇంటిపట్టునే చూడాలనుకుంటారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్.. ఇలా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాగూ వచ్చేస్తాయి కాబట్టి వచ్చినప్పుడు సినిమా చూసేద్దాం.. పనిగట్టుకుని థియేటర్‌కి వెళ్లడం ఎందుకని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. థియేటర్ అధినేతలకు ఈ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తెలుగు పరిశ్రమలో ఇంకా ఈ విషయమై వివాదాలు జరుగుతున్నట్లు కనిపించడంలేదు కానీ తమిళ పరిశ్రమకు చెందిన పంపిణీదారులు, థియేటర్ అధినేతలు చర్చలు మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే... రజనీకాంత్ ‘దర్బార్’ విడుదలై 50వ రోజు పూర్తి కాకుండానే డిజిటల్‌కి వచ్చేసింది. ఇక థియేటర్‌కి ఎవరు వెళతారు? కార్తీ నటించిన ‘ఖైదీ’ అయితే విడుదలైన 30వ రోజు లోపే నెట్టింట్లో దర్శనమిచ్చింది. ఇలా అయితే సినిమా కొనుక్కున్నవాళ్ల పరిస్థితి ఏంటి? ఆడించేవాళ్ల (థియేటర్ ఓనర్స్) పరిస్థితి ఏంటి? ఈ విషయంపై తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ‘‘సినిమా విడుదలైన ఎనిమిది వారాలు లేదా 100 రోజులు తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్లో, టీవీ చానల్స్‌లో విడుదల చేయాలి’’ అని సినిమా కొనే ముందు అగ్రిమెంట్లో రాయించుకోవాలనుకుంటున్నారు. పంపిణీదారులు, థియేటర్ అధినేతల అభిప్రాయం ఇలా ఉంటే.. ‘‘ఒకవేళ మా సినిమాను థియేటర్లో 50 నుంచి 60 రోజులు ఆడిస్తానంటే అప్పుడు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్స్’లో విడుదలను జాప్యం చేస్తాం’’ అంటూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ల ముందు కొందరు నిర్మాతలు ఓ డిమాండ్ ఉంచారు. ‘‘చిన్న సినిమాలకు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్’ బెస్ట్. విడుదలైన నెలలోపు ఓటీటీలో వచ్చేస్తే చిన్న సినిమా నిర్మాతకు కాస్త రెవెన్యూ వస్తుంది’’ అన్నది ఓ నిర్మాత వాదన. ప్రస్తుతం తమిళ పరిశ్రమలో ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇక మన తెలుగు విషయానికొస్తే... మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాలు విడుదలైన 50 రోజులకు రీచ్ అయ్యే టైమ్‌కి నెట్టింట్లోకి రావడం విశేషం. సినిమా థియేటర్లో ఉండగానే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి వస్తే... ఎగ్జిబిటర్స్‌కి కొంత మేర నష్టం జరుగుతుందనే చెప్పాలి. ఒకవేళ 50 రోజుల్లో రెవెన్యూ వచ్చేస్తే.. ఆ తర్వాత బోనస్‌గా వచ్చే వసూళ్లకు గండిపడినట్లే. అయితే చిన్న సినిమాలకు ‘ఓటీటీ’ పెద్ద వరం. టెక్నాలజీ పెరిగే కొద్దీ పెను మార్పులు వస్తుంటాయి. ఈ మార్పు అందరి మంచికీ కారణం అయితే అదేదో యాడ్‌లో ‘మరక మంచిదే’ అన్నట్లుగా ‘మార్పు మంచిదే’ అనుకోవచ్చు. ఓటీటీ కోసమే సినిమాలు నిర్మించనున్నాం – నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బేనర్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘ఆహా’ పేరుతో వచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్, సినిమాల స్ట్రీమింగ్ జరుగుతాయి. ‘‘ప్రారంభమైన రెండు వారాల్లోనే ఆరు లక్షల పైనే రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి’’ అని ‘ఆహా’ ప్రతినిధులు తెలిపారు. ఒకవైపు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు అల్లు అరవింద్.æమరి.. సినిమా విడుదల తర్వాత ‘ఓటీటీ’ ప్లాట్ఫామ్లో ప్రదర్శించాలంటే ఎన్ని వారాలు గ్యాప్ ఉండాలి? చిన్న సినిమాలకు ‘ఓటీటీ’ వల్ల ఎలాంటి లాభం చేకూరుతుంది? అనే ప్రశ్నలకు అల్లు అరవింద్ ఈ విధంగా చెప్పారు. ►ఓ నెల తిరక్కుండానే అనూహ్యంగా ఐదు లక్షల మంది మా ‘ఆహా’ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. నాలుగైదు నెలల్లో మా యాప్‌కి ఇంత స్పందన వస్తుందనుకుంటే నెలకే వచ్చింది. సో.. ఓటీటీలకు కూడా జనం పెరుగుతున్నారు. ప్రజలకు ఏది అవసరమో దాన్ని ఇవ్వడమే ఇండస్ట్రీ ఉద్దేశం. ఓటీటీ కోసమే నిర్మించే సినిమాలు అతి త్వరలో రాబోతున్నాయి. మంచి కథతో వస్తే మేమే రెండు మూడు కోట్ల రూపాయలు ఆఫర్ చేసి, ఓటీటీ కోసమే సినిమాలు తీయమని చెప్పబోతున్నాం. దీనివల్ల చాలా మందికి అవకాశాలు పెరుగుతాయి. ఓటీటీల కోసమే సినిమాలు తీసే నిర్మాతల సంఖ్య పెరుగుతుంది. మనం థియేటర్స్‌కి వెళ్లకుండా ఓటీటీ వాళ్లకే సినిమా ఇవ్వొచ్చు, ఓ 50 లక్షలు సంపాదించుకోవచ్చనే అభిప్రాయం చిన్న సినిమా నిర్మాతలకు ఏర్పడుతుంది. ►చిన్న సినిమాలకు థియేటర్లో ఏడెనిమిది వారాల సమయం పెట్టలేం. మా సినిమాలు ఓటీటీలో పడటం లేదని చిన్న సినిమాల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది.. మాకు అంత సమయం పెట్టొద్దని అంటున్నారు. అయితే ‘ఓటీటీలో ఇచ్చేట్లు అయితే డైరెక్ట్‌గా ఇచ్చేసుకోండి మాకు అవసరం లేదు’ అని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. దీన్ని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ టేకప్ చేసి రూల్స్ పెడితే బాగుంటుందను కుంటున్నా. చిన్న సినిమా అంటే నా ఉద్దేశం ఐదు కోట్ల లోపు చేసేవి. ఆ చిన్న సినిమాలకి ఓటీటీ వాళ్లు ఇచ్చేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నాలుగు వారాలు దాటాక 30 రోజుల్లోనే మేము ఇచ్చుకుంటాం అని చిన్న సినిమా వాళ్లు అడుగుతున్నారు. ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతామనే ఉద్దేశంతో ఓటీటీలకు ఇవ్వాలనుకుంటారు.. చిన్న సినిమా వాళ్లు గ్రహించాల్సింది ఏంటంటే.. నాలుగువారాల్లో ఓటీటీలో వస్తుందనుకుంటే థియేటర్‌కి వెళ్లి చూడాల్సిన అవసరం ఏంటి? అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. అది గ్రహించి చిన్న సినిమా వాళ్లు కూడా పెద్ద సినిమాల్లా ఎనిమిది వారాలకు ఒప్పుకుంటే బాగుంటుంది. అయితే పెద్ద సినిమాలు ఎలాగూ 8 వారాలు ఆడతాయిలే అని నిర్మాతలు అనుకుంటున్నారు.. ఇందుకు ఓటీటీ వాళ్లు కూడా ఒప్పుకుంటున్నారు. 8 వారాలు గ్యాప్ ఉండాలి – నిర్మాత డి. సురేష్‌బాబు ‘‘సినిమా విడుదలైన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రదర్శితం అవ్వాలంటే కనీసం ఎనిమిది వారాలు గ్యాప్ ఉండాలి. అదే కరెక్ట్ అంటాను. అయితే ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్’ అధినేతలు కొందరు ఈ విషయంతో ఏకీభవించడంలేదు. 30 రోజుల్లో అయితేనే డిజిటల్ ప్లాట్ఫామ్లో సినిమాని ప్రదర్శించే హక్కులు కొంటామని కొందరు ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్’ ప్లేయర్స్ నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారు. -
‘పలాస’ డైరెక్టర్‌కు అరవింద్ ఆఫర్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా విడుదల కాకముందే కరుణ కుమార్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ టాలీవుడ్ కొత్త డైరెక్టర్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలో చేయనున్నాడు. దీనికి సంబంధించి గీతా ఆర్ట్స్ అధినేత, నిర్మాత అల్లు అరవింద్ కరుణ కుమార్‌కు అడ్వాన్స్‌గా ఓ చెక్ కూడా ఇచ్చాడు. ‘పలాస 1978’ చిత్ర బృందం ఆహ్వానం మేరకు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాస్‌లు మూవీ ప్రివ్యూ షో చూశారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్‌ను అల్లు అరవింద్ అభినందించారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా నేచురల్‌గా ఉందని, ప్రతిభ గల డైరెక్టర్ అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఆయనతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటిస్తూ మీడియా సమక్షంలోనే అడ్వాన్స్‌గా చెక్‌ను అందించారు. దీంతో కరుణ కుమార్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయబోతున్నట్లు ఖరారైంది. ఇక తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల కానుంది. రఘు కుంచె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సంగీతమందించాడు. చదవండి: పలాస నాకు చాలా ప్రత్యేకం పలాస చూశాక ధైర్యం వచ్చింది -
టాలీవుడ్ దర్శకులకి గ్రాండ్‌పార్టీ ఇచ్చిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్ర సక్సెస్‌లో మునిగితేలుతున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రముఖుల కోసం బన్నీ ప్రత్యేకంగా ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బన్నీ టాలీవుడ్ ప్రముఖ దర్శకులందరితో దిగిన ఫోటో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన అల వైకుంఠపురంలో చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు కనబరుస్తోంది. కాగా ఈ చిత్రం ఇప్పటికే 150 కోట్ల షేర్కుచేరువైనట్లు తెలుస్తోంది. (అల.. విజయోత్సాహంలో...) అల వైకుంఠపురంలో.. సినిమా నిర్మాతగా తన తండ్రికి కూడా భారీగా లాభాలు తీసుకొచ్చింది. ఇక బన్నీ కెరియర్లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా ఇది నిలిచిపోయింది. ఈ నేపధ్యంలో బన్నీ టాలీవుడ్ దర్శకులకోసం ఒక అదిరిపోయే పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో అల్లు అర్జున్ తన ట్విటర్లో పెట్టారు. ఈ పార్టీలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్,త్రివిక్రమ్‌తో పాటు దర్శకులు, యువ దర్శకులు, కో డైరెక్టర్లు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. I whole heartedly Thank everyone for coming home and being a part of our celebrations. This one will always be the most special... thank you all for making it more memorable with your presence. Humbled. pic.twitter.com/Y4jZAobziY — Allu Arjun (@alluarjun) February 3, 2020 -
స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...
ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఇండస్ట్రీ అల్లు అరవింద్! ఇప్పటికీ బిజీ! కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. అంత ఖాళీ లేనప్పుడు ఇప్పుడెలా కూర్చున్నారు?! ఇంత దగ్గరగా! ఇంత లవ్లీగా! ఇంత ప్లెజెంట్‌గా! ఇదంతా ఆయన బెటర్ హాఫ్ నిర్మల ఆయనకు ఇచ్చిన స్పేస్! స్పేస్ చేసుకోవడం కాదు.. స్పేస్ ఇచ్చుకోవడం ఉంటే.. ఆ దాంపత్యం ఎప్పటికీ స్వీట్ అండ్ స్ట్రాంగ్ అంటున్నారు.. మిస్టర్ అండ్ మిసెస్ అల్లు అరవింద్. మీ పెళ్లి బంధం ‘అల్లుకున్న’ రోజుల గురించి? అరవింద్: (నవ్వుతూ)... మా నాన్నగారు, నిర్మల పెదనాన్న ఫ్రెండ్స్. ‘మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడు పల్లెటూరి అమ్మాయిని చేసుకోనంటున్నాడు. మినిమమ్ విజయవాడ అమ్మాయి అంటున్నాడు. చూడండి’ అని ఆయనతో మా నాన్నగారు అంటే, ‘మా తమ్ముడు కూతురు పెళ్లీడుకొచ్చింది. వాళ్లతో మాట్లాడతాను’ అన్నారాయన. ఆ తర్వాత నాన్నగారు వెళ్లి చూసొచ్చి, ‘అమ్మాయి బాగుంది. నాకు నచ్చింది’ అని చెప్పేశారు. నేను చూడ్డానికి వెళ్లాక పెద్దగా ఇంటర్వ్యూలు లేవు. అమ్మాయిని చూపించారు. అంతే.. తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లిచూపులకి, పెళ్లికి మధ్య గ్యాప్ ఎంత? అరవింద్: 1974లో మా పెళ్లి జరిగింది. పెళ్లి చూపులకి, పెళ్లికి మధ్య ఐదు నెలలు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో ఓసారి కాఫీకి తీసుకెళదామని ట్రై చేశాను. ‘మా అమ్మను అడగండి’ అంది. ‘నువ్వు అడుగు. వాళ్లు పంపిస్తే వెళదాం’ అన్నాను. ఊహూ అంది. యాక్చువల్‌గా మా అత్తగారు పాతకాలం మనిషిలా ఉండరు. అప్పట్లో మా అత్తగారిని మ్యానేజ్ చేసుకుని ఉంటే, ఈవిడని కాఫీకి తీసుకెళ్లగలిగేవాడిని. ముందు అది తెలియలేదు. ఆ తర్వాత మా అత్తగారు పాతకాలపు మనిషి కాదని తెలిసింది. మీకు ముగ్గురు సిస్టర్స్. మీ పెళ్లయ్యేనాటికే వాళ్ల పెళ్లయిందా? అరవింద్: నా చెల్లి వసంత పెళ్లి, మా పెళ్లి ఒక్క రోజు తేడాలో జరిగింది. ఏప్రిల్ 7న మా పెళ్లి. 8న ఇద్దరి రిసెప్షన్ ఒకే రోజు జరిగింది. మరి.. పెళ్లయ్యాక కాఫీకి వెళ్లారా? నిర్మల: వెళ్లాం. మా రిసెప్షన్ మదరాసులో జరిగింది. ఆ వేడుక కోసం మా అమ్మానాన్న వచ్చారు. వాళ్లని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కి వెళ్లాం. ఇంటికి వచ్చేటప్పుడు భుహారీ హోటల్లో కాఫీ తాగాం. అప్పట్లో అది పెద్ద హోటల్. అరవింద్‌గారిలో మీకు నచ్చిన లక్షణాలు? నిర్మల: దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. కూల్‌గా ఉంటారు. అది బాగా నచ్చుతుంది. అయితే మా పెళ్లయిన కొత్తలో ‘ఏంటీ.. ఏం చెప్పినా సీరియస్‌గా తీసుకోరు’ అనుకునేదాన్ని. అరవింద్: మామూలుగా భర్త అంటే కొంచెం సీరియస్‌గా అలా ఉంటారు కదా. నేనలా ఉండకపోయేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. ఇంత లైట్‌గా ఉన్నారేంటి అనుకుంది. అయితే కొన్ని సందర్భాల్లో నా కోపం చూసి, ఓహో కోపం కూడా వస్తుందనుకుంది. మీ కుటుంబానికి సినిమా పరిశ్రమతో సంబంధం లేదు కదా.. మరి ‘అల్లువారింట్లో’ అడ్జస్ట్ కావడానికి ఇబ్బందిపడ్డారా? నిర్మల: మా నాన్నగారిది ఆయిల్ బిజినెస్. సినిమాలతో సంబంధం లేదు. దాంతో పూర్తిగా వేరే కల్చర్‌లోకి వచ్చినట్లు అనిపించింది. మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఇంట్లో చాలామంది పనివాళ్లు ఉండేవారు. నాన్న బిజినెస్ వ్యవహారాలు చూసుకునేదాన్ని. అంత లిబరల్గా పెంచారు. నన్ను క్వీన్లానే చూసుకున్నారు. మరి అత్తింట్లో కూడా క్వీన్లానే ఉన్నారా? నిర్మల: అరవింద్‌గారు, ఇంకా అందరూ అలానే చూసుకుంటారు (నవ్వుతూ). అరవింద్: అయితే తనకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ. ఇంటికి పెద్ద కోడలిగా అన్నీ చూసుకుంది. పెళ్లికి ముందు ఉన్నంత లిబరల్గా అయితే లేదు. జాయింట్ ఫ్యామిలీనే కదా? నిర్మల: అవును. మా పెళ్లితో పాటు ఒక ఆడపడుచుకి పెళ్లయింది. తను కూడా కొన్నాళ్లు మాతోనే ఉంది. ఈయన అక్కగారు పెళ్లి చేసుకోలేదు. అప్పటికి సురేఖ (చిరంజీవి సతీమణి)గారికి కూడా పెళ్లి కాలేదు. సురేఖగారిది, నాదీ ఇంచు మించు ఒకే ఏజ్ కావడంతో బాగా కలిసిపోయేవాళ్లం. మా పుట్టింట్లో మా మేనత్తలతో కలిసి పెరిగాను. అలా ఉమ్మడి కుటుంబం నాకు అలవాటే. దాంతో ఇబ్బందిగా అనిపించలేదు. అరవింద్: తనకి మనుషులంటే ఇష్టం. చిరంజీవిగారు, సురేఖగారి పెళ్లి మీ చేతుల మీద జరిగిందనుకోవచ్చా? అరవింద్: అవును... దగ్గరుండి తనే బాధ్యతగా చేసింది. స్క్రీన్‌పై మీ మావయ్య (అల్లు రామలింగయ్య) గారు కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. నటుడిగా అంత జోవియల్‌గా కనిపించిన ఆయన మీతో ఎలా ఉండేవారు? అరవింద్: ఈవిడకి ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్. నిర్మల: అవును. మావయ్యగారు వెరీ ఫ్రెండ్లీ. అరవింద్: ఆయనకు భోజనం పెట్టడం అన్నీ చేసేది. వయసు పైబడిన తర్వాత నాన్నకు ఆరోగ్యం సహకరించకపోతే భోజనం తినిపించేది. మామాకోడలు అంత బాగుండేవాళ్లు. నిర్మల: నన్ను కూతుళ్లతో సమానంగా చూశారు. ఎప్పుడూ నన్ను పేరుతో పిలవలేదు. ‘అమ్మాయి’ అనే పిలిచేవారు. ఆయన షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక వీళ్లెవరూ దొరికేవారు కాదు. దాంతో ఏదైనా చెప్పాలనుకుంటే నాతోనే షేర్ చేసుకునేవారు. అరవింద్: నాపై చాడీలు కూడా చెప్పేవారు. ‘ఆ వెధవ...’ అంటూ నన్ను తిట్టేవారు. మా కాపురంలో పుల్లలు పెట్టేవారు కూడా (నవ్వులు). నిర్మల: అవును.. ‘చూడమ్మాయి.. వాడు లేట్‌గా వస్తున్నాడంటే పని ఉందని కాదు.. నువ్వు జాగ్రత్తగా ఉండాలి’ అనేవారు. అరవింద్: ఎలా చెప్పేవారంటే.. ‘అమ్మాయి.. వాడు పది తర్వాత ఇంటికి వచ్చాడు. అంత పనేం లేదు. ఓ కంట కనిపెట్టు’ అనేవారు. అవి విన్నప్పుడు మీకు భయం అనిపించేదా? నిర్మల: అలా ఏం లేదు. మావయ్యగారు అలా అన్నారని ఆయనతో చెప్పేదాన్ని. ఇద్దరం నవ్వుకునేవాళ్లం. అరవింద్: నాన్నతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు చాలా గౌరవం కూడా ఇచ్చేది. అంతెందుకు? ఇప్పటికీ మా అమ్మ అలా హాల్లోకి వస్తే టక్కున లేచి నిలబడుతుంది. నిర్మల: ఆ రోజుల్లో అత్తగారు అంటే.. అలానే గౌరవించేవాళ్లు. ఆరోగ్యం సహకరించినంత వరకూ అత్తయ్యగారే అన్నీ చూసుకున్నారు. వంట చేసేటప్పుడు మాత్రం ఏం చేయాలని మాట్లాడుకుని చేసేవాళ్లం. నేను నాన్‌వెజ్ పెద్దగా తిననని నా కోసం వేరే చేసేవారు. నాకు వేడిగా తినడం అలవాటు. అందుకని అందరి కోసం వెయిట్ చేయకుండా తినమనేవారు. దాంతో నాకు అమ్మ ఇంటికి, అత్తింటికి తేడా తెలియలేదు. అత్తగారిని చూడగానే లేచి నిలబడే జనరేషన్ నుంచి వచ్చారు. మారిన కాలంలో ఇప్పటి కోడళ్లు అలా చేయకపోవచ్చు. ఈ మార్పు? నిర్మల: ఆ రోజుల్లో అలా ఒక అలవాటు ఉండేది. అత్తయ్యగారు అని కాదు. అప్పట్లో పెద్దవాళ్లు ఎవరు వచ్చినా లేచి నిలబడటం అనేది ఒక పద్ధతి. అప్పట్లో ఆడవాళ్లు పెద్దగా బయటకు వెళ్లడం ఉండేది కాదు. ఇప్పుడు ఆడవాళ్లు బయటకు వెళుతున్నారు. నిరూపించుకుంటున్నారు. ఇప్పటి కోడళ్ల అలవాట్లు ఇప్పటి కాలానికి కరెక్ట్. అరవింద్: మీకో విషయం చెప్పనా.. మా ఆవిడని ‘ఉత్తమ అత్తగారు’ అని మా కోడళ్లే చెబుతారు. అందుకే ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం. అత్తాకోడళ్లు ఫ్రెండ్లీగా ఉంటారు. మా కోడళ్లు మా ఆవిడని ‘నో నాన్సెన్స్’ అత్తగారు అని అంటారు (నవ్వుతూ). ఉమ్మడి కుటుంబంలో గొడవలు లేకుండా ఉండాలంటే ఏదైనా టిప్స్? నిర్మల: నేను ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉంటాను. కాలంతో పాటు మనం కూడా మారాలి. ఫలానా విషయం గురించి బన్నీకి చెప్పకపోయావా అమ్మా? అంటే బన్నీ గురించి మీకు తెలుసు కదా అత్తయ్యా అంటుంది. అరవింద్: వారి జీవితాలను ఓవర్‌ల్యాప్ చేయం. ఎవరి స్పేస్ వారికి ఇస్తాం. బాబీ, బన్నీ, శిరీష్.. ఈ ముగ్గురి మనవళ్లను చూసుకుని అల్లు రామలింగయ్యగారు మురిసిపోయిన విశేషాల గురించి? అరవింద్: పిల్లలతో బాగా ఆడుకునేవారు. మా పెద్దబ్బాయి బాబీ మీద ఒకసారి ఆయనకు ఎందుకో కోపం వచ్చింది. కర్ర తీసుకుని, వాడిని కొట్టడానికి ముందుకొస్తే, బాబీ పరిగెత్తాడు. కొంచెం పరిగెత్తాక ‘రేయ్.. ఆయాసం వస్తోంది. వచ్చి ఒక దెబ్బ తిని వెళ్లు’ అంటే, వాడు దగ్గరకొచ్చి ఒక్క దెబ్బ తిని వెళ్లాడు (నవ్వుతూ). అరవింద్‌గారు 45 ఏళ్ల వయసులో తన తండ్రితో చెంప దెబ్బ తిన్నారు. ఆ విషయాన్ని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఆ చెంప దెబ్బ విషయం మీకు తెలుసా? అరవింద్: కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ, ఇంటికి రాగానే బ్రేక్ స్పీడ్‌గా వేశాను. నాన్నగారు విండ్ షీల్డ్‌కి కొట్టుకోబోయారు. ఆ కోపంతో నా చెంప మీద ఒక్కటిచ్చారు. మా ఆవిడ చూసేసిందేమోనని కంగారుపడ్డాను కానీ చూడలేదు. ఈ వయసులో కూడా నాన్నతో తన్నులు తిన్నాడనుకుంటుందేమోనని కంగారు. లోపలికెళ్లి నాన్న కొట్టిన విషయం చెప్పి, అమ్మ దగ్గర గొడవపడదామనుకున్నాను. కానీ అమ్మతో చెప్పేటప్పుడు తను వింటుందేమోనని మ్యాటర్‌ని సైలెంట్ చేసేశాను. కట్ చేస్తే.. బెడ్రూమ్లోకి వెళ్లగానే ఎందుకండీ మావయ్యగారు అలా కొట్టారు అంది. అబ్బా... తెలిసిపోయిందనుకున్నాను. తను వరండాలో నిలబడి చూసిందట. నాన్న నన్ను అలా కొట్టగానే భయపడి లోపలికి పారిపోయింది. పిల్లల పెంపకం బాధ్యతను ఇద్దరూ సమానంగా తీసుకున్నారా? అరవింద్: నేను బాధ్యత తీసుకోలేదు. ఆ అవసరం రాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. 1973లో ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి ఈరోజు వరకూ బిజీగా ఉన్నాను. పిల్లల విషయాలను మా అమ్మ, నా పెద్ద చెల్లి వసంత, ఈవిడ.. ఈ ముగ్గురూ చూసుకున్నారు. మా చెల్లి కొన్నాళ్లు మాతోనే ఉంది. ఆవిడకి మేనల్లుళ్లు అంటే చాలా ప్రేమ. ఇప్పటికీ బాబీ, బన్నీ, శిరీష్ మా మీద కోపం వస్తే వాళ్ల మేనత్తకి కంప్లైంట్ చేస్తారు. బన్నీ (అల్లు అర్జున్)ని హీరోని చేయాలని ఎవరు అనుకున్నారు? నిర్మల: మా పెళ్లయిన నాలుగైదేళ్లకు చిరంజీవిగారితో సురేఖగారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత చిరంజీవిగారి ఫంక్షన్స్ అవీ చూసి, బన్నీ హీరో అయితే బాగుంటుందనుకునేదాన్ని. ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి.. స్టేజ్ మీద బన్నీని చూసుకోవచ్చు అనే ఇమాజినేషన్ ఉండేది. కానీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి, మెచ్యుర్టీ వచ్చాక ఇండస్ట్రీలోకి వెళితే బాగుంటుందనుకునేదాన్ని. అయితే తను ఇష్టపడితేనే.. నా అభిప్రాయాన్ని పాటించాలనుకునేదాన్ని కాదు. మీక్కూడా బన్నీని హీరోగా చూడాలని ఉండేదా? ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’తో పోల్చితే ఆ తర్వాతి సినిమాల్లో బన్నీ మేకోవర్ సూపర్.. అలా మార్చుకున్న తీరు గురించి? అరవింద్: బన్నీకి పట్టుదల ఎక్కువ. అనుకుంటే సాధిస్తాడు. యానిమేషన్ స్కూల్లో అడ్మిషన్ కావాలి. రోజుకు పది నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేస్తే కానీ అక్కడ పాస్ అవుతారు. ఓ మూడు నెలలు ప్రతి రోజూ 12 గంటలు సాధన చేశాడు. అక్కడ అడ్మిషన్ వచ్చింది. బన్నీ మంచి యానిమేటర్. అయితే సీట్ వచ్చాక ‘గంగోత్రి’కి చాన్స్ వచ్చింది. ‘ఒక సెమిస్టర్ మానేయ్.. ‘గంగోత్రి’ క్లిక్ అయితే చూద్దాం’ అన్నాను. ‘గంగోత్రి’ తర్వాత ‘ఆర్య’ చేశాడు. ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అరవింద్‌గారికి ఇంటిని పట్టించుకునే తీరిక లేదు కాబట్టి ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య వాదనలు జరిగేవా? నిర్మల: అలా ఏం లేదు. ఇల్లు బాగుండాలంటే నేనన్నా వర్క్ చేయాలి లేదా ఆయన అయినా వర్క్ చేయాలి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండాలంటే ఆయన నాతోనే ఉండాలి అనుకుంటే కుదరదు. నేను ఈ జనరేషన్ వాళ్లకి అదే చెబుతాను. మనం అన్ని సౌకర్యాలు అనుభవించాలంటే జీవిత భాగస్వామికి తప్పనిసరిగా స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు అరవింద్గారినే తీసుకోండి.. ఆయన ఏ పనీ చెయ్యకుండా నాతోనే ఉండాలి అనుకుంటే గీతా ఆర్ట్స్‌లాంటి పెద్ద సంస్థను ఎలా మేనేజ్ చేస్తారు? మా పిల్లలకు అన్నీ సమకూర్చాలంటే ఆయన స్పేస్ ఆయనకు ఇవ్వాల్సిందే. అలా కాకుండా బాగా పని మీద ఉన్నప్పుడు ‘ఇంటికి రండి’ అని నేను సతాయించకూడదు. అలా ఇంట్లోవాళ్లు సతాయిస్తే.. ‘అయ్యో ఇంటికి వెళ్లాలా’ అని ఆలోచిస్తారు. ఆ ఆలోచన రాకుండా మేనేజ్ చేయటంలోనే నేను ఆయనకు స్పేస్ ఇచ్చినట్లు. తప్పనిసరిగా ఆయనకు ఆ క్రియేటివ్ స్పేస్ నేను ఇస్తాను. ఫైనల్లీ.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఏం చేయాలి? అరవింద్: భార్యాభర్తల మధ్య నమ్మకం ముఖ్యం. మా పెళ్లైన ఈ 45 సంవత్సరాల్లో ఇంత పెద్ద గ్లామర్ ఇండస్ట్రీలో నేను ఉన్నప్పటికీ ఏనాడూ తను నన్ను అనుమానించలేదు. అదే మా పెద్ద సక్సెస్. అసలు మనస్పర్థలను రోజుల తరబడి సాగనివ్వకూడదు. ఏదైనా సరే ఇద్దరూ కూర్చుని, మాట్లాడుకోవాలి. నిర్మల: మళ్లీ చెబుతున్నాను. పార్టనర్‌కి స్పేస్ ఇవ్వండి. మా ఇద్దరి విషయంలో మొదట్లోనే ఓ అగ్రిమెంట్ ఉంది. అదేంటంటే ‘క్యారెక్టర్ ఈజ్ యువర్సెల్ఫ్’. అంటే.. నువ్వేంటో అదే నీ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ మీరు ఎలా చేసుకుంటారో అది మీ ఇష్టం. అందుకని ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని మేం ఒకరికొకరు చెప్పుకోం. మన క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుందో అలా ఉంటాం. మా జీవితం హ్యాపీగా గడిచిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. భార్యాభర్తలు కష్ట సుఖాలను సమానంగా పంచుకుంటూ ముందుకెళ్లడం మంచి వైవాహిక జీవితానికి నిదర్శనం. మీ జీవితంలో జరిగిన ఓ విషాద ఘటన (కుమారుడు చనిపోవడం) తాలూకు బాధను ఎలా అధిగమించారు? అరవింద్: ఫ్యామిలీ సపోర్ట్ ముఖ్యం అండీ. నిర్మల కూడా చాలా ధైర్యం ఉన్న మనిషి. మా మూడో అబ్బాయి శిరీష్ పుట్టడం వెనకాల ఒక కారణం ఉంది. బన్నీ తర్వాత పుట్టిన అబ్బాయి చనిపోయాడు. ఆ బాబుకి ఐదేళ్లు. మాకు ఊహించని షాక్. ముగ్గురు బాబులు ఉన్నారు కదా, ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకుంది. కానీ మూడో బాబు చనిపోయాక.. మళ్లీ తన కడుపున ఆ బాబు పుడతాడని, ‘రీకేనలైజేషన్’ (మళ్లీ పిల్లలు పుట్టడానికి) చేయించుకోవాలనుకుంది. 30ఏళ్ల క్రితం వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందలేదు. అయినా తను ఆ నిర్ణయం తీసుకుంది. ‘మేజర్ ఆపరేషన్ సార్. మూడు గంటలు జరుగుతుంది. అయినా పిల్లలు పుట్టే చాన్స్ పది శాతమే’ అని డాక్టర్ అన్నారు. అప్పట్లో మూడు గంటల ఆపరేషన్ అంటే లైఫ్ రిస్క్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. వద్దని నిర్మలతో అన్నాం. గైనకాలజిస్ట్ కూడా ఇదే చెప్పారు. అయినా సరే నిర్మల ఒప్పుకోలేదు. ఆపరేషన్ చేయించుకుంది. కానీ, ఆ తర్వాత కొన్ని నెలల వరకూ గర్భం రాలేదు. దీంతో ఓ వైద్య పరీక్ష చేశాం. సారీ.. ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది అన్నారు. ఈ విషయం ఆమెకు చెప్పడానికి సందేహించాం. కానీ తనకు తెలిసిపోయింది. అయితే ‘ఐ విల్ గెట్ బ్యాక్ మై సన్’ అంది నిర్మల. అన్నట్లుగానే.. ఆ తర్వాతి నెల తను ‘కన్సీవ్’ అయింది. అలా పుట్టిన బాబే శిరీష్. నిర్మల: ఆ బాబు చనిపోయాడు, నేను ఏడ్చినా, ఏం చేసినా రాడు. ఈ గ్యాప్‌ని ఎలా ఫిల్ చేసుకోవచ్చని ఆలోచించాను. అందుకే మొండిగా ఆపరేషన్ చేయించుకున్నాను. స్నేహాని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు మీ ఇద్దరి రియాక్షన్? అరవింద్: అర్జున్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ విషయం మా ఇంట్లో అయిదు నిమిషాల్లోనే సెటిల్ అయ్యింది. ముందు స్నేహ విషయం బన్నీ తన అమ్మ దగ్గరే చెప్పాడు. నిర్మల: అర్జున్ వచ్చి స్నేహాని చేసుకుంటాను అంటే, నువ్వు చేసుకున్నా, మేం వేరే అమ్మాయిని చూసి చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలి. మాకు ముఖ్యం అదే. నువ్వు హ్యాపీగా ఉంటే మేం హ్యాపీ అన్నాను. – డి.జి. భవాని -
అదే మా బ్యానర్ విజయ రహస్యం
‘‘శైలజా రెడ్డి అల్లుడు’ తర్వాత కొన్ని నెలలు ఓ కథ మీద వర్క్ చేశాడు మారుతి. ఆ తర్వాత మరో ఆలోచనను పంచుకున్నాడు. అది నచ్చింది. కానీ ఎక్కడో చిన్న సందేహం. అయితే మా అమ్మగారి వల్ల ఈ సినిమా చేయాలనుకున్నాను’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’’ వాస్. సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌పై ‘బన్నీ’ వాస్ నిరి్మంచారు. సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ‘బన్నీ’ వాస్ చెప్పిన విశేషాలు. ►దర్శకుడు మారుతి, నేను, యూవీ క్రియేషన్స్ వంశీ, యస్కేయన్ (ఈ చిత్ర సహనిర్మాత) మంచి ఫ్రెండ్స్. ఏ ఐడియా వచి్చనా నలుగురం పంచుకుంటాం. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లా ఎప్పుడూ ఉండం. మారుతి క్రియేటర్ కాబట్టి అతని ఆలోచనల్ని నేను గౌరవిస్తాను. ►‘ప్రతి రోజూ పండగే’ కథ బాగానే అనిపించింది కానీ అమ్మానాన్నలను అశ్రద్ధ చేసేవాళ్లు ఎవరుంటారు? కనెక్ట్ అవుతారా? అనే డౌట్‌ని కొందరు వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే మా అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ‘ఐదు రోజులుగా నీతో మాట్లాడటానికి ప్రయతి్నస్తున్నాను రా’ అన్నారు. నాకు వెంటనే తల్లిదండ్రులను అశ్రద్ధ చేసేవాళ్లలో నేను కూడా ఉన్నానా? అని భయం వేసింది. మేం పట్టించుకోనప్పుడు మీకెలా ఉంటుంది అమ్మా? అని అడిగాను. ‘పెద్దయిపోయారు. మీకు బాధ్యతలు ఉంటాయని సర్ది చెప్పుకుంటాం రా’ అని చెప్పింది. అందరం ఏదో ఒకసారి మన పేరెంట్స్‌ను అశ్రద్ధ చేస్తున్నవాళ్లమే. అలాంటి కథ కాబట్టి మారుతిని గోఎహెడ్ అన్నాను. ►ఈ చిత్రంలో తేజ్ ఫిట్బాడీతో కనిపిస్తాడు. ‘బాడీ మీద క్రమశిక్షణ తప్పింది. వర్కౌట్ చేస్తాను’ అని ఈ సినిమా కోసం బాడీని రెడీ చేశాడు. యాక్టర్‌గా తనను తాను చాలా మెరుగుపరుచుకుంటున్నాడు. ►చావు అనివార్యం. పెళ్లి, పుట్టినరోజుని ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో చావుని కూడా అలానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ విషయాన్ని సీరియస్‌గా, ఫన్నీగా చెప్పాం. ►అల్లు అరవింద్‌గారి సలహాలు బావుంటాయి. మనం చెప్పినదాంట్లో పాయింట్ ఉందంటే తీసుకుంటారు. మూడు జనరేషన్స్ (అరవింద్‌గారు , నేను, నూతన దర్శకులు) కలసి పని చేయడమే మా బేనర్ విజయ రహస్యం. ►ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్, అఖిల్– ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చిత్రం, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’, నిఖిల్– సూర్యప్రతాప్ సినిమాలు చేస్తున్నాం. ►సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించను. కానీ ఎప్పుడైనా బాధ కలిగినా, నా అభిప్రాయాలను పంచుకోవాలన్నా ఫేస్బుక్లో స్పందిస్తా. ►మేం అడ్వాన్స్ ఇచ్చినా ఆ దర్శకుడికి వేరే ఆఫర్ ఉంటే చేసుకోమంటాం. దర్శకులను మా దగ్గరే ఉండాలని నిబంధన పెట్టం. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక మాత్రం వదలం (నవ్వుతూ). -
అల్లు అరవింద్ డాన్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం సందడిగా జరిగింది. హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో జరిగిన ఈ వేడుకలో నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. నటీనటులతో పాటు నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. సాయిధరమ్ తేజ్ స్వయంగా ఆయనను వేదిక మీదకు తీసుకెళ్లి డాన్స్ చేయాలని కోరారు. సీనియర్ నటుడు సత్యరాజ్‌తో కలిసి హుషారుగా వేదికపై స్టెప్పులేశారు. మరో నిర్మాత బన్నీ వాసు కూడా హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నృత్యం చేశారు. ‘తకిట తథిమి’ పాటకు హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటులు కూడా డాన్స్ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. మారుతి దర్శకత్వం తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌కుమార్, నరేశ్, రావురమేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. Team #PratiRojuPandaage justifying the tagline"పది మంది ఉండగా,ప్రతిరోజూ పండగే the expectations &buzz of the movie reached sky high with this electrifying moments frm pre-release🕺💃 All set for the celebrations on Dec 20th in the theatres near you 🤩#PratirojuPandaageOnDec20th pic.twitter.com/bHIMRQlgDF — Eluru Sreenu (@elurucnu) December 16, 2019 -
గౌరవంగా ఉంది
‘అర్జున్ సురవరం’తో మంచి హిట్ అందుకున్నారు నిఖిల్. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్, ‘బన్నీ’ వాసు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్–ప్లే సుకుమార్ అందిస్తున్నారు. ‘‘గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. సుకుమార్, ‘బన్నీ’ వాసు, సూర్య ప్రతాప్‌లతో పని చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు నిఖిల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సుకుమార్ సినిమాలో నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవల విడుదల అయిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఆ ఉత్సాహంతో నిఖిల్ తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్, అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ఓ సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సుకుమార్ కథ - స్క్రీన్ ప్లేను అందించడం విశేషం. సుకుమార్ శిష్యుడైన పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది. గతంలో సుకుమార్ అందించిన కథతో సూర్యప్రతాప్ తెరకెక్కించిన కుమారి 21ఎఫ్ విజయవంతమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
ఇక ఆగేది లేదు
నాన్‌స్టాప్‌గా దూసుకెళ్లడానికి స్కెచ్ రెడీ చేశారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జయరామ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తొలి షెడ్యూల్ ముగిసింది. ఫైట్ సీన్లు తీశారు. షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి తన భార్య పిల్లలతో (భార్య స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హా) కలిసి స్విట్జర్లాండ్ వెళ్లొచ్చారు అల్లు అర్జున్. ఇప్పుడు షూటింగ్‌ను షురూ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో ఆరంభం కానుంది. ఇక పెద్దగా బ్రేక్ తీసుకోకుండా సినిమా పూర్తయ్యే వరకూ నాన్‌స్టాప్‌గా షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారట. ఈ సినిమాకు పీడీవీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. -
షూటింగ్ సెట్లో అయాన్, అర్హా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. బుధవారం సెట్స్ పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా తొలి రోజు షూట్ సందర్భంగా తీసిన ఓ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సెట్స్‌లో బన్నీ కుమారుడు అల్లు అయాన్, కుమార్తె అర్హాలు కనిపించడం హైలెట్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కారులో నుంచి దిగిన బన్నీ సెట్లోకి ఎంటర్ అయ్యారు. ఇంకా ఈ వీడియోలో త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, బన్నీ వాసు, సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్‌లతో పాటు చిత్ర యూనిట్‌ను చూపించారు. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. -
ఫైర్‌మేన్‌ను అభినందించిన మెగాస్టార్
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ యంత్రంగా అన్ని విధాల శ్రమిస్తోంది. ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్‌మేన్ క్రాంతి కుమార్ ను అభినందించారు. అంతేకాదు క్రాంతి కుమార్‌కు కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా ఈ బహుమతిని అందజేశారు. క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్ సేషన్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని శ్రీ అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరపున ఆర్. స్వామినాయుడు పాల్గొన్నారు. -
విజయ్‌కి సక్సెస్ కొత్త కాదు
‘‘మేమంతా వెనకుండి కేవలం సపోర్ట్ చేశాం. ‘టాక్సీవాలా’ విజయం యూనిట్ సమిష్టి కృషి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్, మాళవికా నాయర్ ముఖ్య తారలుగా నటించిన సినిమా ‘టాక్సీవాలా’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది. ఈ సినిమా మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టాక్సీవాలా’ సినిమా సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. విజయ్‌కి సక్సెస్ కొత్తేమీ కాదు. అతను చాలా సక్సెస్‌లు అందుకున్నాడు. నిర్మాత ఎస్కేఎన్కు ఇది తొలి విజయం. త్వరలో సక్సెస్ మీట్లో కలుద్దాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా పైరసీ అయినప్పుడు కొత్త టీమ్ కదా అని బాధపడ్డాను. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లైన్ గురించి చెప్పినప్పుడు వంశీ నాకు విజయ్ దేవరకొండని సజెస్ట్ చేశాడు. రాహుల్ చాలా కొత్తగా తీశాడు. ఇంత హైప్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు మారుతి. ‘‘ఆడియో ఫంక్షన్లో థియేటర్స్‌ని నింపమని ప్రేక్షకులను కోరాను. అలా చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. సపోర్ట్ చేస్తున్న నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విజయ్ దేవరకొండ. ‘‘ఈ సినిమా టెక్నికల్‌గా సక్సెస్ అయ్యింది అంటున్నారు. అందుకే నా టెక్నికల్ టీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. వంశీగారు, బన్నీగారు, మారుతిగారికి థ్యాంక్స్’’ అన్నారు రాహుల్. ‘‘అవకాశం ఇచ్చిన అరవింద్‌గారికి, వంశీ, బన్నీలకు థ్యాంక్స్. సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’అన్నారు ఎస్కేఎన్. ‘‘ౖపైరసీ అయిన సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నవారందరికీ థ్యాంక్స్’’ అన్నారు ప్రియాంక జవాల్కర్. -
‘మహానటి’కి అల్లువారి పార్టీ
మహానటి సినిమాకు వసూళ్లతో పాటు ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. సినిమా విడుదల అయిన రోజు నుంచీ సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. సినీ విమర్శకులు సైతం ‘మహానటి’ని సావిత్రికి నివాళిగా అభివర్ణించారు. మహానటి ఇంత గొప్ప విజయం సాధించడానికి దర్శక,నిర్మాతలు పడిన కష్టం తెరమీద కనబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌లను మీడియా సమక్షంలో సత్కరించారు. తాజాగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ మహానటి బృందానికి ప్రత్యేక విందు పార్టీని ఇచ్చారు. నిన్న (ఆదివారం) సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణిలు కూడా హాజరయ్యారు. స్వప్నదత్, ప్రియాంక దత్, నాగ్ అశ్విన్‌లను అల్లు అర్జున్, అరవింద్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది. మే 9న రిలీజైన మహానటి అమెరికాలో మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి విజయవంతంగా దూసుకెళ్తోంది. -
అందులో నా స్వార్థం కూడా ఉంది – అల్లు అరవింద్
‘‘మా గీతా ఆర్ట్స్‌తో పాటు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలతో కలిసి ‘వి4 క్రియేషన్స్’ అనే కొత్త సంస్థని స్టార్ట్ చెయ్యడంలో నా స్వార్థం కూడా ఉంది. యంగ్‌స్టర్స్‌తో కలిసి ఉంటే వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అర్థమవుతుంది. తద్వారా అప్డేటెడ్గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు తీసే వీలుంటుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘నెక్ట్స్ నువ్వే’ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కొత్త బేనర్‌ని స్టార్ట్ చెయ్యడానికి కారణం ఏంటని అందరూ అడుగుతున్నారు. ఏ నిర్మాతైనా తను నమ్మిందే కరెక్ట్ అని సిన్మాలు తీస్తూ వెళితే కొన్నాళ్లకు సినిమాలు తియ్యకుండా ఆగిపోతారు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా సినిమాలు తీస్తేనే కంటిన్యూ అవ్వగలుగుతాం. వి4లో మూడు బేనర్లే ఉన్నాయి. నాలుగోది బేనర్ కాదు. ఫ్రెష్ థాట్స్, యునీక్ సబ్జెక్ట్స్‌తో వచ్చేవారు నాలుగోవారు అవుతారు’’ అన్నారు. ‘‘నవంబర్ 3న సిన్మాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘ఆదితో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాం’’ అని జ్ఞానవేల్ రాజా అన్నారు. ‘‘నేనీ సినిమా డైరెక్ట్ చేశానంటే కారణం అల్లు శిరీష్. టాలెంట్‌ని ఎంకరేజ్ చెయ్యడంలో శిరీష్ ముందుంటారు. మంచి సినిమా తీశానన్న తృప్తి కలిగింది’’ అన్నారు ప్రభాకర్. నటుడు సాయికుమార్, దర్శకుడు మారుతి, వైభవి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ పాల్గొన్నారు. -
అండ్ ది టైటిల్ ఈజ్... సంపూర్ణ రామాయణం
ఇండియన్ సినిమా రేంజ్‌ని పెంచిన ‘బాహుబలి’ తర్వాత... భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించవచ్చనే నమ్మకం చాలామందిలో కలిగింది. 200, 300, 500 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు. ముఖ్యంగా తెలుగులో 500 కోట్ల సినిమాను మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్రీడీ ఎఫెక్ట్‌తో మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇంకా దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిఫుణులను సెలక్ట్ చేయలేదు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు. కానీ, టైటిల్‌ని మాత్రం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అండ్ ది టైటిల్ ఈజ్ ‘సంపూర్ణ రామాయణం’ అని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బుధవారం గీతా ఆర్ట్స్ సంస్థ ‘సంపూర్ణ రామాయణం’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించడంతో ఇది రామాయణం సినిమాకే అని ఊహించవచ్చు. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. -
మనవడు, మనవరాలే అతిథులుగా...
సాధారణంగా కొత్త సినిమా పూజా కార్యక్రమాలకు చిత్ర పరిశ్రమలోని పెద్దలను, శ్రేయోభిలాషులను అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. లేదా యూనిట్ సభ్యుల సమక్షంలో పూజలు జరిపించేస్తారు. ‘పెళ్లి చూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో జీఏ2 పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే... అల్లు అరవింద్ మనవడు, మనవరాలు అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ తనయుడు అయాన్ కెమేరా స్విచ్చాన్ చేయగా, అల్లు వెంకట్ తనయ అన్విత క్లాప్ ఇచ్చారు. ‘‘రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. మే రెండోవారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు ‘బన్ని’ వాసు. ఈ చిత్రానికి కెమేరా: మణికంఠన్, సంగీతం: గోపీసుందర్. -
కిమ్స్ ఆస్పత్రికి చేరుకుంటున్న ప్రముఖులు
-
'కారణాలు చిరంజీవే వివరిస్తారు'
ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకోకుండా వేదిక మార్చాల్సి రావటంతో ఏర్పాట్లను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గుంటూరులోని హాయ్లాండ్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడగా.. తాజాగా నిర్మాత అల్లు అరవింద్ ఫంక్షన్‌కు అనుమతులు వచ్చినట్టుగా ప్రకటించారు. అయితే వేదిక మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చిరంజీవే వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ఖైదీ వేడుకకు అనుమతి ఇవ్వలేదని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా హీరోలందరూ ఈ వేడుకలో పాల్గొంటారన్న ప్రచారం జరుగుతుండగా.. పవన్ వస్తాడా రాడా అన్న అనుమానం అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ విషయం పై కూడా క్లారిటీ ఇచ్చిన అరవింద్, పవన్ ఖైదీ వేడుకకు హాజరు కావటం లేదని తెలిపారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రాలేకపోతున్నారన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానుల అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉన్నారు. -
మార్కెట్లోకి గోల్డ్ డ్రాప్ రైస్ బ్రాన్ ఆయిల్
-
బొమ్మరిల్లు భాస్కర్ మళ్లీ వస్తున్నాడు
దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు భాస్కర్. ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకొని బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. అయితే తొలి మ్యాజిక్ ను తరువాత కంటిన్యూ చేయలేకపోయిన భాస్కర్, ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. బొమ్మరిల్లు తరువాత పరుగు లాంటి సక్సెస్ ఇచ్చినా ఆరెంజ్, ఒంగోళు గిత్త సినిమాలు భాస్కర్ కెరీర్ ను కష్టాల్లో పడేశాయి. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని ఇటీవల మలయాళ సూపర్ హిట్ సినిమా బెంగళూర్ డేస్ ను తమిళ్ లో రీమేక్ చేశాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి గ్యాప్ తీసుకొని టాలీవుడ్ లో రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడు. మెగా కాంపౌండ్ తో మంచి రిలేషన్ ఉండటంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ముందుగా ఈ సినిమాను అల్లు అర్జున్ హీరోగా ప్లాన్ చేసినా.. ఇప్పుడు వేరే హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. -
అల్లు శిరీష్‌కు ప్రేమతో.. నాన్న కానుక
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు శిరీష్ కు ఖరీదైన బహుమతిని అందించారు. దసరా పండుగను పురస్కరించుకుని శిరీష్ కు ఆడి క్యూ7 కారును కానుకగా ఇచ్చారు. ఇటీవల శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ గిప్ట్ ఇచ్చారు. ఆడి క్యూ7 కారంటే తనకెంతో ఇష్టమని కారు ఈ సందర్భంగా నాన్నకి థ్యాంక్సు చెప్పారు. అన్నయ్య అల్లు అర్జున్ సమక్షంలో కీని తీసుకుంటున్న ఫొటోను శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
‘పిల్లా నవ్వులేని జీవితం’ మూవీ స్టిల్స్
-
‘కొత్త జంట’ 25 రోజుల వేడుక
-
పండగలో... ‘కొత్త జంట’
‘‘నా దృష్టిలో డబ్బులొచ్చిన సినిమానే హిట్ సినిమా. ‘కొత్తజంట’ విడుదలై మూడు వారాలు దాటుతున్నా... ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. కుటుంబం మొత్తం చూడదగ్గ చక్కని ఎంటర్టైనర్గా మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా శిరీష్‌కి మంచి సక్సెస్ ఇచ్చిన మారుతితో గీతా ఆర్ట్స్ బేనర్లోనే మరో సినిమా తీస్తా’’ అని అల్లు అరవింద్ అన్నారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘కొత్త జంట’. ఈ చిత్రం 25 రోజుల వేడుకను శనివారం హైదరాబాద్‌లో జరిపారు. ఈ సందర్భంగా చిత్రం సమర్పకుడు అల్లు అరవింద్ మాట్లాడారు. శిరీష్‌తో పెద్ద హిట్ తీయాలని కాకుండా, స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలని ఈ చిత్రం చేశానని, తన గత చిత్రాల్లా కాకుండా, బలవంతపు వినోదం లేకుండా చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోందని మారుతి ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నా కెరీర్‌కి ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఈ సక్సెస్‌తో నా బాధ్యత పెరిగింది. మంచి విజయాన్నిచ్చిన మారుతికి కృతజ్ఞతలు’’ అని అల్లు శిరీష్ అన్నారు. ఇంకా నటీనటులు శ్రుతి, మధు నందన్, రవి, హరి, ఏడిద శ్రీరామ్, ప్రవీణ్, సంగీత దర్శకుడు జేబీ, ఆర్ట్ డెరైక్టర్ రమణ తదితరులు మాట్లాడారు. -
‘కొంత్త జంట’ మూవీ న్యూ స్టిల్స్
-
‘కొత్త జంట’ ఆడియో ఆవిష్కరణ
-
కొత్తగా ఉండే జంట
‘‘ఈ ప్రచార చిత్రం బావుంది. దర్శకుడు మారుతి కొత్త జంటను కొత్తగా ఆవిష్కరించాడు’’ అని అల్లు అరవింద్ చెప్పారు. అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ‘కొత్త జంట’ ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌లో జగపతిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లా డుతూ -‘‘ఈ టీమ్ ఎనర్జీ లెవెల్స్ బావున్నాయి. బన్నీ వాసు దగ్గరుండి ఈ సినిమా రూపొందించాడు’’ అన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేయాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని మారుతి చెప్పారు. ఈ నెల 12న పాటలను, మే 1న చిత్రాన్ని విడుదల చేస్తామని బన్నీ వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్, జెబి, డీఎమ్‌కె, బాబు నాయక్, రావిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అంతేకాదు తన భార్య స్నేహ రెడ్డితో కలిసివున్న ఫోటో కూడా పోస్ట్ చేశారు. దంపతులిద్దరూ చేతులు కలిపి చిరునవ్వులు చిందిస్తూ తమ కలల పంట కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఫోటోలో కనిపించారు. 'తన ప్రేమకు ప్రతిరూపం ఊపిరి పోసుకుని కళ్లకు ముందుకు వస్తే ఏ మగాడైన తన భార్య, బిడ్డతో మళ్లీ ప్రేమలో పడతాడు. క్యూటీ త్వరలో మా మధ్యకు వస్తుంది' అంటూ పోస్ట్ చేశారు అల్లు అర్జున్. అయితే బన్నీ భార్య ఆడపిల్లకు జన్మినిచ్చినట్టు అంతకుముందు రుమార్లు వచ్చాయి. వీటిని అప్పుడే అల్లు అరవింద్ తోసిపుచ్చారు. ఇప్పుడు ఫోటోతో అల్లు అర్జున్ పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు. స్నేహకు త్వరలోనే(ఈ నెలలోనే) డెలివరీ కానుందని సమాచారం. అంటే త్వరలోనే జూనియర్ బన్నీ రాబోతున్నాడన్నమాట. -
యాంగ్రీమేన్గా శ్రీకాంత్
ఓ యాంగ్రీమేన్ తన సెలవుల్ని పిల్లలతో గడపాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓ సినిమా చేస్తున్నారు. జొన్నలగడ్డ శ్రీనివాస్ దర్శకత్వంలో సి.ఎస్.రెడ్డి-జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి సావిత్రి కెమెరా స్విచాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. వీఎన్ ఆదిత్య గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘చిన్న పిల్లలందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ మొదలు పెడతామని దర్శకుడు తెలిపారు. తెలుగులో తనకిదే తొలి చిత్రమని కథానాయిక సోనియా మాన్ చెప్పారు. ఈ చిత్రానికి కథ: భూపతిరాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సీహెచ్ గోపీనాథ్. -
ఆ నాలుగు కుటుంబాలే పరిశ్రమను శాసిస్తున్నాయి
వారి వల్లే నటులకు అవకాశాలు రావడంలేదని హెచ్ఆర్సీకి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమను దగ్గుబాటి, అల్లు అరవింద్, చిరంజీవి, ఎన్టీఆర్ కుటుంబాలే శాసిస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను వారి అధీనంలో పెట్టుకొని చిన్న నిర్మాతలకు థియేటర్లను ఇవ్వకుండా పొట్టగొడుతున్నారని ఆరోపిస్తూ న్యాయవాది అరుణ్‌కుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు సోవువారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సినిమా పరిశ్రమలో ఈ కుటుంబాలే గుత్తాధిపత్యం చేస్తున్నాయని, దీంతో కొందరు నటులకు అవకాశాలు లేకుం డా పోతున్నాయని తెలిపారు. సినిమా అవకాశాలు లేకే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. చిత్ర పరిశ్రమలో వీరి ఆధిపత్యంపై విచారణ జరిపించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఆ 4 కుటుంబాల ఆధిపత్యం కారణంగా తమకు అన్యా యం జరిగిందంటూ ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామంటూ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు పేరిరెడ్డి నిరాకరించారు.