
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత బోయ ధర్నాకు దిగింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర45లో ఉన్న గీతా ఆర్ట్స్ ముందు అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించి మహిళా పోలీసులు దుస్తులు వేయించారు. అనంతరం సునీతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ సమయంలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నుంచి తనకు డబ్బులు రావాలని, ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ ధర్నాకు దిగినట్టు వెల్లడించింది. కాగా గతంలోనూ సునీత గీతా ఆర్ట్స్ ముందు పలుమార్లు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే.
చదవండి: రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే..
Comments
Please login to add a commentAdd a comment