ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘సరైనోడు’ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ పక్కా మాస్ మూవీని అల్లు అరవింద్ నిర్మించారు.
కాగా ‘సరైనోడు’ తర్వాత నిర్మాత అల్లు అరవింద్– దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ మాస్ కాంబో గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా నటిస్తారా? అనే విషయంపై సరైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment