
కోలీవుడ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తీకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం 'డీమాంటీ కాలనీ'(Demonte Colony). తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి గుర్తింపు దక్కింది. అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హారర్ కథా చిత్రం 2015లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అజయ్ జ్ఞానముత్తు 9 ఏళ్ల తర్వాత డీమాంటీ కాలనీకి సీక్వెల్ చేశారు. ఇందులోనూ నటుడు అరుళ్ నిధినే కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ నటించారు. అరుణ్ పాండ్యన్, నటి మీనాక్షి గోవింరాజన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పార్టు 1 కంటే మరింత భారీ బడ్జెట్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది తెరపైకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది.కాగా ఈ చిత్రానికి పార్టు -3 ఉంటుందని చివరిలో లీడ్ ఇచ్చారు.

దీంతో డీమాంటీ కాలనీ సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఆ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం డిమాంటీ కాలనీ –3 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించి చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులోనూ అరుళ్ నిధినే హీరోగా నటించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.