arul nidhi
-
ఓటీటీలో హారర్ మూవీ.. నిద్రలేని రాత్రి కోసం సిద్ధమా?
బ్లాక్‌బస్టర్ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అరుళ్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డీమాంటి కాలనీ 2. ఇది 2015లో వచ్చిన హిట్ మూవీ డీమాంటి కాలనీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాట ఆగస్టు 15న విడుదలై దాదాపు రూ.55 కోట్లు రాబట్టింది. దీంతో అదే నెల 23న తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ మిశ్రమ స్పందన అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జీ5లో తమిళ, తెలుగు భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు.సినిమా విషయానికి వస్తే..క్యాన్సర్‌తో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను డెబీ (ప్రియ భవానీ శంకర్) ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అతడిని క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతడి ఆత్మహత్య వెనక కారణం తెలియక మానసికంగా సతమతమవుతుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని, ఈ తరహాలోనే పలువురూ మరణించారని తెలుసుకుంటుంది. తర్వాత ఏం జరిగింది? వరుస చావులకు చెక్ పెట్టేందుకు ఆమె ఏం చేసింది? ఈ పుస్తకానికి, డిమాంటి కాలనీకి ఉన్న లింకేంటి? అన్నది తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! View this post on Instagram A post shared by ZEE5 Tamil (@zee5tamil) చదవండి: హైదరాబాదీగా అలా అనడం కరెక్ట్ కాదు: హీరో సుదీప్ -
కావాలని అలా ప్లాన్ చేయలేదు: అరుళ్ నిధి
‘‘నేనిప్పటివరకూ ఎక్కువగా థ్రిల్లర్స్, సస్పెన్స్ సినిమాలు చేశాను. కావాలని అలా ప్లాన్ చేయలేదు. ఇక నుంచి వేరే జానర్ మూవీస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకూ నా ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదనే ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. అయితే ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ ద్వారా ఆ గుర్తింపు దక్కుతోందని భావిస్తున్నాను’’ అని హీరో అరుళ్ నిధి అన్నారు. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’.తమిళంలో హిట్ అయిన ఈ మూవీని ఎన్. శ్రీనివాస రెడ్డి సమర్పణలో బి. సురేష్ రెడ్డి, బి. మానసా రెడ్డి తెలుగులో ఆగస్టు 23న రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అరుళ్ నిధి మాట్లాడుతూ– ‘‘డీమాంటీ కాలనీ 2’కి తెలుగులో వస్తున్న స్పందనతో చాలా సంతోషంగా ఉన్నాం.ప్రోడ్యూసర్ సురేష్ రెడ్డిగారు తెలుగులో మంచి ప్రమోషన్ చేశారు. ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీలో మూడు, నాలుగో భాగాలు కూడా రానున్నాయి’’ అన్నారు. -
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: డీమాంటీ కాలనీ-2నటీనటులు: ప్రియాభవానీ శంకర్, అరుల్ నిధి, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులుదర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తునిర్మాతలు: విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమార్నిర్మాణసంస్థలు: బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్సంగీతం - సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ - హరీశ్ కన్నన్ఎడిటర్ - కుమరేశ్ డివిడుదల తేదీ: ఆగస్టు 23(తెలుగు)హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ఈ జానర్లో వచ్చే చిత్రాలకు కొదవే లేదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అందుకే ఇలాంటి కథలపై డైరెక్టర్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా 2015లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా డీమాంటీ కాలనీ-2 తీసుకొచ్చారు. ప్రియా భవానీ శంకర్, అరుల్ నిధి జంటగా నటించారు. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈనెల 23న రిలీజవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డీమాంటీ కాలనీ 2 అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకలా మరణించాడో తెలుసుకోవాలని ఆరాతీయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆరేళ్లకు ఒకసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి వెళ్లిన వ్యక్తులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలు ఆపేందుకు డెబీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి కూడా తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములను డెబీ, తన మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కాపాడిందా? వీరికి టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలా సాయపడ్డారు? తన భర్త కోరికను డెబీ నెరవేర్చిందా? శ్రీనివాస్‌ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే డీమాంటీ కాలనీ-2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా వచ్చిన డీమాంటీ కాలనీ 2. ప్రీక్వెల్‌ను బేస్ చేసుకుని ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అందుకే డీమాంటీ కాలనీ చూసిన వారికైతే సీక్వెల్ కాస్తా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డీమాంటీ అనే ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక హారర్ సినిమాలంటే సస్పెన్స్‌లు కామన్ పాయింట్. ఫస్ట్ పార్ట్‌లో సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, అతని ఆత్మతో మాట్లాడేందుకు భార్య చేసే ప్రయత్నాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.సెకండాఫ్ వచ్చేసరికి ఇందులోకి డీమాంటీ కాలనీ పాత్రలను తీసుకొచ్చిన తీరు ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డీమాంటీ కాలనీకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ చూపించారు. కథ మధ్యలో సర్ప్రైజ్లు కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. కథలో ప్రధానంగా ఆత్మతో పోరాడే సీన్స్ మరింత ఆసక్తిగా మలిచారు జ్ఞానముత్తు. ఈ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ హైలెట్. టిబెటియన్ యాక్టర్‌తో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హారర్‌తో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు లాంటి పాత్రలతో ఎమోషన్స్ పండించాడు. క్లైమాక్స్ విషయానికొస్తే ఆడియన్స్‌ను అద్భుతమైన థ్రిల్లింగ్‌కు గురిచేశాడు. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చివర్లో పార్ట్-3 పై ఇచ్చిన హింట్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేశాడు జ్ఞానముత్తు.ఎవరెలా చేశారంటే..ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో హావభావాలు అద్భుతంగా పండించింది. అరుని నిధి ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. గ్రాఫిక్స్, సౌండ్ ఫర్వాలేదనిపించాయి. సామ్ సీఎస్ బీజీఎం ఈ చిత్రానికి హైలెట్. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో కాస్తా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా హారర్ జానర్ ఇష్టపడేవారికి ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. -- పిన్నాపురం మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
కాలనీలో థ్రిల్
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న తమిళంలో రిలీజైంది. ఈ సినిమాని రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్–శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో ఈ నెల 23న విడుదల చేస్తున్నాయి. ‘‘హారర్ థ్రిల్లర్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ చిత్రం రూపొందింది. ‘తంగలాన్’ వంటి పెద్ద సినిమాతో పాటు విడుదలైన మా ‘డీమాంటీ కాలనీ 2’ కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తెలుగులోనూ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మేకర్స్. -
హారర్... థ్రిల్
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్– శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది.సినిమా హిట్టవ్వాలి’ అన్నారు. కాగా అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ రూపొందింది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి? చివరగా వెళ్లినవారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు?’ అనేది ‘డీమాంటీ కాలనీ 2’లో ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
తండ్రీ, కుమారుల అనుబంధమే 'తురువిన్ కురల్'
ప్రస్తుతం వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ చిత్రాలతో పాటు, వైవిధ్యభరిత కథాంశంతో కూడిన చిన్న చిత్రాలను ఈ సంస్థ నిర్మించడం విశేషం. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్ ఇటీవలే దర్శకుడు మణిరత్నం మెడ్రాస్ టాకీస్ సంస్థతో కలిసి చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ను ఏప్రిల్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. మరికొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి తురువిన్ కురల్. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 24వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నటుడు అరుళ్ నిధి కథానాయకుడుగా నటించారు. హరీష్ ప్రభు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి ఆత్మిక కథానాయకిగా నటించిన ఇందులో దర్శకుడు భారతీయ ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిందని దర్శకుడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, పాండిచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. ఇది తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో అరుళ్ నిధి బధిరుడు(చెవిటి)పాత్రను పోషించడం విశేషం అన్నారు. చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, సింటో పోదుతాస్ ఛాయాగ్రహణం సమకూర్చారు. Presenting the Title & 1st look poster of our Production#24 #ThiruvinKural 📢⚕️ Starring the promising @arulnithitamil @offBharathiraja & @im_aathmika 🌟 Directed By @harishprabhu_ns 🎬 Music By @SamCSmusic 🎶 DOP @sintopoduthas 🎥 Editing @thecutsmaker ✂️🎞️ 🤝 @gkmtamilkumaran pic.twitter.com/aTzr2cbDtD — Lyca Productions (@LycaProductions) February 16, 2023 -
ఓటీటీలో దూసుకెళ్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘డెజావు’
అరుల్‌నిథి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మిమే గోపి ప్రధాన పాత్రల్లో నటించిన మస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘డెజావు’. ఈ ఏడాది జులైలో విడుదలైన ఈ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ తమిళ్ మూవీ తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కంటెంట్ ప్రధానంగా, . గ్రిప్పింగ్ ట్విస్ట్‌లు, ఊహించని మలుపులతో అరవింద్ శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏమి జరుగుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?.. అనేదే డెజావు చిత్రం. ఈ కథలో పోలీసు ఇన్వెష్టిగేషన్ ప్రారంభం కావడం, హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం.. చిత్రంపై ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తుంది. చివరి వరకు కూడా దర్శకుడు ఈ చిత్రాన్ని సస్పెన్స్‌తో నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ విధమైన నాణ్యమైన కంటెంట్, థ్రిల్లింగ్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భవాని డీవీడీ ఇంక్ పై రాజశేఖర్ అన్నభీమోజు తెలుగు వెర్షన్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ ప్రశంసలు అందుకుంది. -
‘రేయికి వేయి కళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: రేయికి వేయి కళ్లు నటీనటులు: అరుళ్‌నిధి స్టాలిన్, అజ్మల్,మహిమ నంబియార్, ఆనంద్ రాజ్, జాన్ విజయ్, ఆడుకాలమ్ నరేన్ తదితరులు దర్శకత్వం : ము మారన్ సంగీతం: సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ:అరవింద్ సింగ్ ఎడిటర్: సాన్ లోకేష్ విడుదల తేది: సెప్టెంబర్ 30, 2022(ఆహా) ప్రస్తుతం ఓటీటీ వినియోగం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. ఏ భాషలో మంచి చిత్రం వచ్చినా కూడా ప్రేక్షకులందరూ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. అలా ఓటీటీలతో భాషాబేధం లేకుండా పోయింది. ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోకి తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ‘రేయికి వేయి కళ్లు’ పేరుతో తీసుకొచ్చిన ఈ చిత్రం ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 30 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఆ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం భరత్ (అరుల్ నిధి స్టాలిన్) ఓ క్యాబ్ డ్రైవర్. ప్రైవేట్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేసే సుశీల(మహిమ నంబియార్)తో ప్రేమలో ఉంటాడు. మరోవైపు ప్రేమ పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకొని బ్లాక్మెయిల్ చేసే గణేష్(అజ్మల్ అమీన్) సుశీలను వేధిస్తుంటాడు. తన ప్రేయసిని వేధిస్తున్న గణేష్‌ను వెంటాడే క్రమంలో భరత్.. గణేష్ ముఠాలో ఉండే మాయ హత్య కేసులో చిక్కుకుంటాడు. భరత్‌పై మాయ హత్యానేరం ఎందుకు పడింది? మాయ హత్యా కేసు నుంచి తప్పించుకోవడానికి భరత్ ఏం చేశాడు? బిజినెస్ మ్యాన్ మురుగన్ (ఆనంద్ రాజ్) భార్య వసంత్ (జాన్ విజయ్).. గణేష్‌ని ఎందుకు కలిసింది? సుశీలను వేధించడం వెనుక గణేష్ ప్లాన్ ఏమిటి? అనేది తెలియాలంటే ఆహాలో ‘రేయికి వేయి కళ్లు’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘రేయికి వేయి కళ్లు’ కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్, డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అంచనా వేయలేరు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.రివర్స్ ఆర్డర్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు.భరత్, సుశీల మధ్య ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో సినిమా ప్రారంభం అవుతుంది.డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ పాత్ర ఎంట్రీతో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. మాయ హత్య కేసు సినిమాను మరో మలుపు తిప్పుతుంది. మాయను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. డైరెక్టర్ ము. మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ, కథనాలు పకడ్బంధీగా రాసుకున్నారు. మర్డర్ మిస్టరీ ఛేదించే క్రమంలో ఎదురయ్యే ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి.సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారికి ‘రేయికి వేయి కళ్లు’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. క్యాబ్ డ్రైవర్ భరత్ పాత్రలో అరుణ్ నిధి స్టాలిన్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. అజ్మల్ అమీన్ సాఫ్ట్ విలనిజంతో బాగుంది. స్టాప్ నర్సింగ్ సుశీలగా మహిమ నంబియార్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై క్యూట్‌గా బబ్లీగా కనిపించారు. అనంద్ రాజ్, జాన్ విజయ్ పాత్రలు కొంత హాస్యాన్ని పండించడంతో పాటు కథకు మంచి ట్విస్టులుగా మారాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. అరవింద్ సివంగ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘కథ కూడా వినకుండానే ఓకె చెప్పా’
మహిళలకు సంబంధించిన కథా చిత్రాలన్నీ తన దృష్టిలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే అంటోంది నటి శ్రద్ధా శ్రీనాధ్. శాండల్‌వుడ్‌కు చెందిన శ్రద్ధా అక్కడ యూటర్న్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. ఇక కోలీవుడ్ ఇవన్ తందిరన్ చిత్రంతో పరిచయం అయ్యి సక్సెస్‌ను అందుకున్నా, మాధవన్, విజయ్ సేతుపతిలతో కలిసి నటించిన విక్రమ్‌వేదా చిత్రంతో అనూహ్యంగా పాపులర్ అయ్యింది. ఇటీవల జెర్సీ అంటూ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాల ఖాతాను ఓపెన్ చేసుకుంది. ఇలా సెలెక్టెడ్ చిత్రాలలో నటిస్తూ విజయాల శాతాన్ని పెంచుకుంటూ పోతున్న శ్రద్ధా శ్రీనాధ్ తాజాగా అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నేర్కొండిపార్వై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కాగా ఆమె నటించిన మరో తమిళ చిత్రం కే–13. అరుళ్‌నిధి హీరోగా నటించిన ఈ చిత్రానికి భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహించారు. ఎస్పీ సినిమాస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 3వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి శ్రద్ధా శ్రీనాధ్‌తో సాక్షి చిట్ చాట్. కాలు పెట్టిన చోటల్లా సక్సెస్ అందుకుంటున్నారు. తాజాగా తెలుగులో నటించిన జెర్సీ విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎలా ఫీలవులతున్నారు? చాలా సంతోషంగా ఉంది. జెర్సీ చిత్రంలో నటించడం మంచి అనుభవం. అది మానవ అనుబంధాలను ఆవిష్కరించే వైవిధ్య భరిత కథా చిత్రం. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. నానితో నటించడం తీయని అనుభూతి. కే–13 చిత్రం గురించి? కే–13 అంటే ఒక అపార్ట్మెంట్ బ్లాక్ నెంబరు. ఇది సైకలాజికల్ మిస్టరీతో కూడిన థ్రిల్లర్ యాక్షన్ కథా చిత్రం. కే–13 చిత్రంలో నటించడానికి కారణం? అరుళ్‌నిధి హీరో అనగానే కథ కూడా వినకుండానే నటించడానికి సై అనేశాను. ఎందుకుంటే ఆయన గురించి నాకు తెలుసు. లక్కీగా కథ విన్నాక బాగా నచ్చేసింది. అరుళ్‌నిధికి జంటగా నటించిన అనుభవం? అరుళ్‌నిధి చాలా మంచి ఫెర్ఫార్మర్. ఆయనతో నటించడం చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇందులో మీ పాత్ర గురించి? ఇందులో మలర్వేది అనే రచయిత్రి పాత్రలో నటించాను. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అరుళ్‌నిధి ఫిలిం మేకర్‌గా నటించారు. మేమిద్దరం అనుకోకుండా ఒక సారి కలుస్తాం. ఆ తరువాత ఏం జరిగిందన్నదే కే –13 చిత్రం. ఇది నా కేరీర్లో మంచి చిత్రంగా గుర్తుండిపోతుంది. దర్శకుడు భరత్ నీలకంఠన్ కొత్తవారైనా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని తెరకెక్కించారు. నేను తమిళంలో నటించిన నాలుగవ చిత్రం ఇది. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్‌తో కలిసి నటించడం గురించి? అజిత్ లాంటి గొప్ప నటుడితో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో చాలా స్ట్రాంగ్ పాత్రలో నటిస్తున్నాను. కథలో కీలకమైన పాత్ర. సోషల్ ఎలిమెంట్స్‌తో కూడిన చిత్రం ఇది. హింది చిత్రం పింక్‌ను చూశారా? చూడలేదు. చూస్తే ఒరిజనాలిటి పోతుందనే చూడలేదు. నటి కాకపోతే ఏం చేసేవారు? కచ్చితంగా టీచర్ని అయ్యేదాన్ని. ఎందుకంటే మా అమ్మ కూడా ఉపాధ్యాయురాలిగా పని చేశారు. పిల్లలకు విద్య నేర్పించడం అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. మీకు అలాంటి చిత్రాల్లో నటించాలన్న ఆశ లేదా? నేను నటించిన విక్రమ్ వేదా, యుటర్న్ లాంటి చిత్రాలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే. నా దృష్టిలో మహిళలకు సంబంధించిన కథా చిత్రాలన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే. ఎలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారు? కల్పనా చావ్లాగా నటించాలనుంది. నాసా శాస్త్రవేత్తగా ఆమె ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించారో. ఆమె మరణం కూడా నామనసును కలచివేసింది. -
పోలీస్ అధికారిగా అరుల్ నిధి
మళ్లీ పోలీస్ కథల ట్రెండ్ మొదలైందనిపిస్తోంది. తెరి చిత్రంలో విజయ్, సేతుపతి చిత్రంలో విజయ్‌సేతుపతి పోలీస్ అధికారి పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తానూ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా వస్తున్నానంటున్నారు యువ నటుడు అరుళ్‌నిధి. డిమాంటీ కాలనీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆయన హీరోగా శ్రీతేనాండాళ్ ఫిలింస్ అధినేత ఎన్.రామస్వామి నిర్మిస్తున్న చిత్రం ఆరాదుచిన్నం. ఐశ్వర్యారాజేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధారవి, తులసి, రోబోశంకర్, ఐశ్వర్యదత్త, చార్లీ, ఆర్ఎస్ఆర్.మనోహర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఆరం,వల్లినం వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అరివళగన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఆరాదుచిన్నం. ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయన్నారు. దీంతో ప్రభుత్వం ఆ హత్యా ఉదంతాలను ఛేదించడానికి ఒక స్పెషల్ పోలీస్ అధికారిని నియమిస్తుందన్నారు. ఆ అధికారే అరుళ్‌నిధి అని చెప్పారు. అయితే ఆ హంతకులు ఆ పోలీస్ అధికారిని, ఆయన కుటుంబాన్ని సమస్యలకు గురి చేస్తారన్నారు. వాటిని అధిగమించి పోలీస్ అధికారి హంతకుల్ని పట్టుకున్నారా? తన కుటుంబాన్ని రక్షించుకున్నారా? ఇంతకీ ఆ హంతకులు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? లాంటి పలు ఆసక్తికరమైన అంశాల సమాహారమే ఆరాదుచిన్నం అని పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు తిరువళ్లువర్ తిరుక్కురలోని అధికారం అనే భాగం నుంచి ఒక పాటను రూపొందించడం విశేషం అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, మదురై, పాండిచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించినట్లు వెల్లడించారు.