
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. రాజ్ వర్మ ఎంటర్‌టైన్‌మెంట్– శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది.
సినిమా హిట్టవ్వాలి’ అన్నారు. కాగా అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ రూపొందింది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి? చివరగా వెళ్లినవారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు?’ అనేది ‘డీమాంటీ కాలనీ 2’లో ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment