RamGopal Varma
-
ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట
సాక్షి,గుంటూరు : ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీపై అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. నిన్నటి (సోమవారం) విచారణలో కూడా వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పిన హైకోర్టు.. ఈరోజు(మంగళవారం) షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆర్జీవీపై నమోదైన అన్నీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నమోదైన కేసుల విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. ఇదీ చదవండి: ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ -
కొనసాగుతున్న అరాచకపర్వం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు.. ఎక్కడికి తీసుకెళుతున్నారు.. అనే విషయాలను కుటుంబసభ్యులకు కూడా చెప్పడంలేదు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబసభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు అత్యుత్సాహంగా కేసులు నమోదుచేసి అరెస్టు చేస్తున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జైళ్లకు తరలించారు.ఒకరిని అరెస్టుచేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్శకుడు రాంగోపాల్‌వర్మ సహా ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. నటులు పోసాని, శ్రీరెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాలో జగ్గంపేటకు చెందిన కాపారపు వెంకటరమణను అరెస్టు చేసిన సీఐ శ్రీనివాస్‌రావు కాకినాడ కోర్టులో హాజరుపరిచి, అనంతరం రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను మంగళవారం ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్ నిమిత్తం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సబ్‌జైలుకు తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పఠాన్ అయూబ్‌ఖాన్, పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన అన్నంగి నరసింహస్వామి, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం ముదిగుబ్బకు చెందిన జనికుల రామాంజనేయులుపై కందుకూరులోను, అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన కురమయ్యగారి హనుమంతరెడ్డిపై నెల్లూరు జిల్లా సంగం పోలీస్‌స్టేషన్‌లోను కేసులు నమోదు చేశారు. రాయవరం ప్రాంతానికి చెందిన ఖండవిల్లి సునీల్‌కుమార్, కోరుకొండకు చెందిన లగవత్తుల శివసత్యకుమార్, కనిగిరికి చెందిన హరీశ్వర్‌రెడ్డి, కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కాకరపర్తి శ్రీనివాస్‌పై విశాఖపట్నంలో కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆయతపల్లికి చెందిన ప్రసాద్‌రెడ్డిని బుధవారం మఫ్టీలో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అరెస్టు చేసిన నకిరేకల్‌కు చెందిన పి.రాజశేఖర్‌రెడ్డిని నూజివీడు తరలించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పశ్చిమగోదావరి జిల్లా కో–కన్వినర్లు పాటూరి దొరబాబు, కమతం మహేష్‌లకు 41ఏ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. శ్రీరెడ్డిపై కేసు నమోదుటీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియా యాక్టివిస్ట్, సినీనటి మల్లిడి శ్రీరెడ్డిపై మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలోని బొమ్మూరు పొలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై అనకాపల్లి పోలీసులకు టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు రత్నకుమారి మరో ఫిర్యాదు చేశారు. రాంగోపాల్‌వర్మకు నోటీసులు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్ ఎస్ఐ శివరామయ్య బుధవారం హైదరాబాద్‌లో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు నోటీసు అందించారు. ఈనెల 19న మద్దిపాడు స్టేషన్‌కు రావాల్సిందిగా అందులో కోరారు. వ్యూహం చిత్రం నిర్మించే సమయంలో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేశ్, బ్రాహ్మణిని అవమానించేలా పోస్టింగ్‌లు పెట్టారంటూ రెండురోజుల కిందట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ కేసు నమోదు చేశారు. పోసానిపై ఫిర్యాదులుసినీనటుడు పోసాని కృష్ణమురళీ టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును అసభ్య పదజాలంతో దూషించారని టీడీపీ నేతలు బాపట్ల సీఐ అహ్మద్జానీకి ఫిర్యాదు చేశారు. సీఎం తదితరులపై అసభ్య పోస్టులు పెట్టిన పోసానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు గుంటూరు, నరసరావుపేటల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రాంగోపాల్ వర్మ కోసం భారీ ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
హారర్... థ్రిల్
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్– శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది.సినిమా హిట్టవ్వాలి’ అన్నారు. కాగా అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ రూపొందింది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి? చివరగా వెళ్లినవారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు?’ అనేది ‘డీమాంటీ కాలనీ 2’లో ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
'జాము రాతిరి జాబిలమ్మా' అంటూ అభిమాన హీరోయిన్‌తో వర్మ సాంగ్
'జాము రాతిరి జాబిలమ్మా.. జోల పాడనా' సాంగ్ వినిపించగానే ఎవరికైన టక్కున గుర్తుకొచ్చేది అలనాటి హీరోయిన్ శ్రీదేవి. క్షణ క్షణం సినిమాలో ఈ పాటకు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ సాంగ్ తరాలు మారినా ఆదరణ మాత్రం తగ్గలేదు. 1990లో విడుదలైన క్షణ క్షణం సినిమాను స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.క్షణ క్షణం సినిమాలో జాము రాతిరి జాబిలమ్మా అంటూ.. వెండితెరపై వెంకటేశ్, శ్రీదేవి కనిపించిన విషయం తెలిసిందే. అయితే, వెంకటేశ్ స్థానంలో శ్రీదేవి పక్కన రామ్ గోపాల్ వర్మ ఉంటే.. అదేలా సాధ్యం అంటారా..? ఏఐ టెక్నాలజీ సాయంతో వర్మ అభిమానులు దీనిని క్రియేట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ సాంగ్‌ను రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేశాడు. శ్రీదేవి పక్కన కనిపించే భాగ్యం తనకు కల్పించిన ఏఐ టెక్నాలజీకి ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పారు.Thanks to AI , Me in Venkatesh pic.twitter.com/VhnhUv8ddM— Ram Gopal Varma (@RGVzoomin) May 31, 2024 అతిలోక సుందరి శ్రీదేవి అంటే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అమితమైన అభిమానంతో పాటు గౌరవం కూడా ఉంది. ఆ ఇష్టంతోనే క్షణ క్షణం, గోవిందా గోవిందా చిత్రాల్లో శ్రీదేవినే హీరోయిన్గా ఉండాలని ఎంపిక చేశారు. -
ఆర్జీవీ దగ్గర ఓనమాలు నేర్చుకున్న దర్శకులు వీళ్లే! (ఫోటోలు)
-
ఆర్జీవీ యువర్ ఫిల్మ్
దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ‘యువర్ ఫిల్మ్’ అంటూ ఓ కాన్సెప్ట్‌ను క్రియేట్ చేశారు. ప్రేక్షకులే ఓ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే విధానానికి శ్రీకారం చుడుతూ ఆర్జీవీడెన్.కామ్ అనే వెబ్‌సైట్‌ను మొదలుపెట్టారు ఆర్జీవీ. ఈ వెబ్సైట్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు, క్లుప్తంగా సినిమా కథాంశం వంటి వివరాలను ఉంచుతారు. ఆడిషన్స్ ఇచ్చే వారి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ ఆడిషన్స్‌లో ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే, వారు ఆ ప్రాజెక్ట్‌కి ఫైనలైజ్ అవుతారు. అలా ఫైనల్ అయినవారితో ఆరు నెలల్లో సినిమా నిర్మిస్తారట రామ్‌గోపాల్ వర్మ. ఆర్జీవీ డెన్ ద్వారా భాషతో సంబంధం లేకుండా ఈ ఎంపిక జరుగుతుందని రామ్‌గోపాల్ వర్మ పేర్కొన్నారు. -
మార్చిలో వ్యూహం
అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘శపథం’ ఉంటుంది. రామధూత క్రియేషన్్సపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ‘వ్యూహం’ సినిమా నేడు(ఫిబ్రవరి 23), ‘శపథం’ చిత్రాన్ని మార్చి 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ‘వ్యూహం’ ను మార్చి 1న, ‘శపథం’ ను మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు రామ్‌గోపాల్ వర్మ. ‘‘వ్యూహం’ను మార్చి 1కి, ‘శపథం’ను మార్చి 8కి వాయిదా వేశాం. ఈ సారి కారణం లోకేష్ కాదు. కొన్ని సాంకేతిక పరమైన కారణాలు, మేం కోరుకున్న థియేటర్స్ లేనందున వాయిదా వేశాం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు రామ్‌గోపాల్ వర్మ. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి ఆయన తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ‘వ్యూహం’ ఉంటుందన్నారు రామ్‌గోపాల్ వర్మ. -
వ్యూహం ఫిక్స్
‘వ్యూహం’ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయింది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నాయి? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వంటి కథాంశంతో ‘వ్యూహం’ రూపొందింది. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటించారు. -
'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియెరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదలపై డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: Lal SalaamTwitter Review: 'లాల్ సలాం' ట్విటర్ రివ్యూ) వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలగిపోవడంతో తాను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 23న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. వ్యూహం సినిమాపై మరొకసారి ఒక కమిటీ సమీక్షించి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా విడుదల కానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. -
ఆర్జీవీ 'వ్యూహం' సినిమాకు లైన్ క్లియర్
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు సూచనలతో రెండోసారి కూడా సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు క్లియెరెన్స్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వ్యూహం చిత్రాన్ని ఫిబ్రవరి 16న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేవయాలని తెలంగాణ హైకోర్టులో టీడీపీ నేత నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రం విడుదల అంశంలో జాప్యం ఎదురైంది. లోకేష్ పిటిషన్‌తో హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి సినిమా విడుదలను గతంలో తాత్కాలికంగా నిలువరించింది. వ్యూహం సినిమాను మరొకసారి సమీక్షించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మరొకసారి సెన్సార్ ఇవ్వాలని గతంలో కొర్టు తెలిపింది. (ఇదీ చదవండి: థియేటర్లో అలజడి రేపిన పవన్ ఫ్యాన్స్.. ఇంకెప్పుడు మారుతారో..!) కోర్టు నిర్ణయంతో మరోసారి వ్యూహం చిత్రానికి తాజాగా సెన్సార్ నిర్వహించారు. చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని సెన్సార్ బోర్డు తెలపడంతో వ్యూహం చిత్రం ఫిబ్రవరి 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని చిత్ర నిర్మాత తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. -
కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తలనరికి తెస్తే రూ.కోటి ఇస్తామన్న వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 న్యూస్ యాంకర్ సాంబశివరావులను సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 5.30 గంటలపాటు వారిద్దరిని కలిపి, విడివిడిగానూ విచారించారు. టీవీ 5 చానల్ నిర్వహించిన డిబేట్ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూర్వకంగానే కొలికపూడి శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలు చేశారని రామ్‌గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందుకు బాధ్యులుగా ఆయన పేర్కొన్న కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు, టీవీ 5 చానల్ ఎండీ, చీఫ్ ఎడిటర్ బి.ఆర్.నాయుడు, న్యూస్ యాంకర్ సాంబశివరావు, ఫిరోజ్, టీవీ 5 మేనేజింగ్ ఎడిటర్లపై పలు సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 3న కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ అధికారులు మొదటి దఫా విచారించారు. కాగా ఆరోజు న్యూస్ యాంకర్ సాంబశివరావు విచారణకు హాజరుకాలేదు. దాంతో వారిద్దరిని సోమవారం సీఐడీ అధికారులు విచారించారు. ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు? ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారా? ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీయ ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా.. సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూడదన్న అవగాహన లేదా..? అంటూ వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. అందుకు వారిద్దరూ సమ్మతించారు. -
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్‌లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్‌గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్‌ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్‌లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్‌గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్‌గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్‌లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్‌తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా నేడు (డిసెంబర్ 29) థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్ కోర్టు మెట్లు ఎక్కాడు. తెలంగాణ కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఏ ప్రాతిపదికన సెన్సార్ ఇచ్చారో తెలుపుతూ ఆ రికార్డులను కోర్టుకు అందించాలని CBFCని కోరింది. జనవరి 11 వరకు కోర్టు సమయం ఇచ్చింది. చినబాబుకు నిద్ర లేకుండా చేస్తున్న వర్మ వ్యూహం సినిమాను అడ్డుకునేందకు కాంగ్రెస్, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్, గంటా శ్రీనివాస్, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. అప్పుడు CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. వర్మ వ్యూహానికి చినబాబు లిటిగేషన్ పెట్టాడు. తప్పు చేయని వాడిపై ఎన్ని సినిమాలు తీసినా ఎప్పటికీ భయపడడు కదా..! మరి ఎందుకు చినబాబులో ఇంత భయం. తప్పు చేయకుంటే ఉలుకు ఎందుకు..? చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎవరైనా కానీ గతంలో ఏం చేశారు...? ఉన్నది ఉన్నట్లు ప్రపంచానికి చూపుతాను అని వర్మ అంటున్నాడు. అలా కాకుండా లేనివి ఉన్నట్లు సినిమాలో చూపుతే నిజం ఏంటో టీడీపీ కూడా మరో సినిమా తెరకెక్కించ వచ్చు కదా.. ఎటూ తన వర్గం వారే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు వెంటే తిరుగుతున్న పవన్ కూడా పచ్చ బ్యాచ్‌లోనే ఉన్నాడు.. డబ్బుకు కొదవ లేదు, డైరెక్టర్లకు కొదవ లేదు, చేతిలో రామోజీ ఫిలిమ్ సిటీ.. ఇలా ఎన్నో చంద్రబాబు గుప్పెట్లోనే ఉన్నాయి. మా నాన్నే ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు అని సినిమా తియొచ్చు కదా చినబాబు... గతంలో తమరి రాజకీయ జీవితంలో ఎలాంటి వెన్నుపోట్లు లేకుంటే ఒక్క సినిమా తీసి ప్రజలకు చూపించండి.. అందులో నిజం ఉంటే యాత్ర సినిమా మాదిరి సూపర్ హిట్ చేస్తారు.. లేదంటే తొక్కి పాతరేస్తారు.. ఇప్పుడు వర్మ వ్యూహం సినిమా కూడా అంతే సినిమాలో నిజం ఉంటే ఆదరిస్తారు... లేదంటే వారానికే మరిచిపోతారు... వెన్నుపోటు నుంచి బాబు కథ తెలిసిందే కదా..! వర్మ వ్యూహానికే భయపడిపోయి వ్యవస్థల ద్వారా ఎటాక్ చేసి వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు చినబాబు నానాపాట్లు పడుతున్నాడు. సినిమా నచ్చితే చూస్తారు లేదంటే వదిలేస్తారు. మేము సుద్దపూసలం అని చెప్పుకుంటున్న పచ్చ బ్యాచ్ మంద.. వర్మ వ్యూహానికి ఎందుకు వణుకుతున్నారు..? గతంలో ఎలాంటి తప్పులు చేయనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..? వెన్నుపోటు రాజకీయం నుంచి ఓటుకు నోటు వరకు బాబు గారి చరిత్ర తెలుగు ప్రజలకు తెలిసిందే కదా.. నారా వారి రాజకీయ చరిత్రే ఇదీ.. ఇందులో వర్మ కొత్తగా చూపించేది ఏముంది..? మహా అయితే కొత్తగా వచ్చిన ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్‌ను తెరపైకి తీసుకొస్తాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ల రాజీకీయ జీవిత కథ మధ్యయుగం నాటిదికాదు కదా.. నిజం ఎంటో ఇప్పుడున్న వారందరికీ తెలుసు కదా.. వర్మ వ్యూహం సినిమాలో తప్పుంటే వెంటనే సోషల్‌మీడియాలో ఉతికేస్తారు.. నిజం ఉంటే మెచ్చుకుంటారు. అసలు సినిమానే వద్దనుకుంటే చూడకుంటే సరిపోయే.. అలాంటి దానికి ఇంత గోల ఎందుకు చినబాబు.. ఉచితంగానే వ్యూహం సినిమాకు పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వర్మ కూడా సరిగ్గా ఉపయోగించుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. వర్మకు కూడా కావాల్సింది ఇదే. ఈ విషయంలో ఆయన భారీగానే సక్సెస్ అయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్‌పై సెటైర్ల సినిమా సీనియర్ ఎన్టీఆర్ యుగపురుషుడు, దేవుడు.. అని తెలుగు ప్రజలు అంటారు. అందులో అభ్యంతరం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడ ఒక జిల్లాకు ఆయన పేరే పెట్టారు. కానీ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబీకులు ఎన్టీఆర్‌ను ఆయన చరమాంక దశలో ఒంటరిని చేశారు. కనీసం పండగరోజు కాస్త పప్పన్నం పంపించే వాళ్లు కూడా కాదని ప్రచారం ఉండనే ఉంది. ఈ కారణమే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి అవకాశం కల్పించిందని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అలా ఆ వయసులో తనకు సహాయంగా నిలిచిన ఆమెను ఎన్టీఆర్ ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే ఆమె మొదటి భర్త నుంచి విడాకులు పొంది ఉంది కాబట్టి ఎన్టీఆర్‌కు భార్య అయ్యింది. రాజకీయంగా కూడా చక్రంతిప్పి ఉండవచ్చు. ఇదే కథతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వచ్చింది. చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయలేదా..? లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వెన్నుపోటు అంకం, ఆ సమయంలో ఎన్టీఆర్ అరణ్యరోదన, అదే మనసును కలిచివేసి ఆయన మరణించడం. చరమాంకంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయాడం, చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చడం, నీతిమాలిన వాడు అని ఆయన దూషించడం, అందుకు ప్రతిగా బాబు కూడా ఎన్టీఆర్‌పై ధ్వజమెత్తడం. ఎన్టీఆర్‌ను విలువల్లేనివాడిగా చిత్రించడం, ఎన్టీఆర్ అవసరం తమకులేదని ప్రకటించడం. వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఎల్లో మీడియా పేపర్ క్లిప్పింగ్స్‌తో పాటు యూట్యూబ్‌లలో వీడియోలు కూడా ఉన్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కూడా వర్మ ఇదే చూపించాడు.. ఒక్క పచ్చ బ్యాచ్ మాత్రమే సినిమాను తప్పబట్టింది.. మిగిలన ఎవరూ తప్పబట్టలేదు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వర్మను అభినందించడం విశేషం. చంద్రబాబు పాత్ర గత సినిమాల్లోనే ఉంది.. వర్మ చూపించేది ఏంటి..? సీనియర్ ఎన్టీఆర్ జీవితం మీద , ఆయన రాజకీయం మీద వ్యంగ్యంగా స్పందిస్తూ వచ్చిన సినిమాలు గతంలో కూడా ఉన్నాయని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వాటిల్లో ముఖ్యమైనవి 'నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, గండిపేట రహస్యం వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి. నేటితరం కూడా వీటిని ఆసక్తితో చూస్తోంది. యూట్యూబ్‌లో వీటికి బాగానే ఉన్నాయి వ్యూస్. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, రామోజీరావు.. తదితర నిజజీవిత పాత్రలన్నీ ఈ సినిమాల్లో ఉన్నాయి. అప్పటికి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించలేదు. ఈ సినిమాల్లో కథను ఎంతడేర్గా చూపించారంటే... చంద్రబాబును ఉద్దేశించినట్టుగా అనిపించే 'ఇంద్రబాబు' పాత్రకు వ్యాంపులతో ఎఫైర్‌ను పెట్టేంత సాహసం చేశారు ఆ సినిమాల మేకర్లు. ఈ సినిమాలు అప్పటికి, ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలిచాయి. మండలాధీశుడులో నటుడు కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తే.. గండిపేట రహస్యంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎన్టీఆర్‌గా చేశాడు. ఈ సినిమాలు డైరెక్టుగా ఎన్టీఆర్ మీద సంధించిన అస్త్రాలు. ఈ సినిమాలు వచ్చినప్పుడు ఎన్టీఆరే వాటిని చూసీ చూడనట్టుగా వదిలేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్టీఆరే వాటిని లైట్‌గానే తీసుకున్నాడు. ఆ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రలను పోషించిన కోటా, పృథ్వీలపై ఆయా సమయాల్లో దాడులు జరిగాయి. అయితే ఎన్టీఆర్ ఆ దాడులను వారించాడంటారు. -
వ్యూహం.. ఒక వాస్తవం
సాక్షి, అమరావతి/ విజయవాడ స్పోర్ట్స్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2019 వరకు కుట్రలు– ఆలోచనల మధ్య జరిగిన రాజకీయమే ‘వ్యూహం’ చిత్రమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. రాజకీయాలను ప్రజలు చూసే కోణం నుంచే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ చిత్రంలో ఎలాంటి కల్పితాలు లేవని, పాత్రల పేర్లు సైతం రాజకీయ నాయకుల వాస్తవ పేర్లతోనే తెరకెక్కించామని స్పష్టం చేశారు. విడుదలను ఆపేందుకు పన్నిన కుట్రలను సైతం ఛేదించుకుని ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘వ్యూహం’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘జగ గర్జన’ పేరుతో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. వ్యూహం సినిమాలో షాట్ వన్ను ఎంపీ నందిగం సురేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ వెన్నుపోటుతోనే ఫేమస్ అయిన చంద్రబాబునాయుడు ఇప్పటికీ తన రాజకీయ సౌలభ్యం కోసం ఎన్టీఆర్ అభిమానులను వాడుకుంటున్నారని చెప్పారు. ఈ చిత్రం ద్వారా తన పరువు పోతుందని, విడుదల ఆపాలని లోకేశ్ కోర్టుకెళ్లడం పెద్ద జోక్ అన్నారు. తెల్లారి లేస్తే లోకేశ్ అందర్నీ పచ్చి బూతులు తిడుతూ అవమానించడం ఇతరుల పరువు తీయడం కాదా.. అని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ను రంగుల రాజాగా అభివర్ణించారు. తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పవన్‌కల్యాణ్‌కు లేదని, ఆంధ్రాలో చంద్రబాబు, లోకేశ్‌లకు ప్రస్తుతం బర్రె ‘లెక్క’ పవన్‌కల్యాణ్ మారాడని ఎద్దేవా చేశారు. బట్టలూడదీస్తాం.. రోడ్డు మీద ఈడ్చి తంతాం.. కోస్తాం.. అంటూ పవన్‌కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ ప్రతిరోజూ మాట్లాడుతుంటారని, ఇలాంటి వ్యాఖ్యలు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సైతం మాట్లాడరని ఆయన చెప్పారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో జరిగిన కుట్ర రాజకీయాలను, కాంగ్రెస్‌తో చేతులు కలిపి చంద్రబాబు పన్నిన పన్నాగాలను, బాబు హయాంలో జరిగిన ప్రజాధనం దోపిడీని ఈ చిత్రంలో తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మంచి మనసున్న ప్రజానేత సీఎం జగన్ జీవిత చరిత్రను తెరకెక్కించడం తనకు దక్కిన అదృష్టమన్నారు. స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ మంచి ప్రజానాయకుల జీవిత చరిత్రను ప్రముఖ దర్శకుడు తెరకెక్కించడం మంచి పరిణామమన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని చెప్పారు. ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, శివకుమార్, అదీప్‌రాజు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి ప్రసంగించారు. సంగీత దర్శకురాలు కీర్తన, పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. -
డబ్బులిస్తే తీసుకోండి.. సమర్థులకే ఓటేయండి
సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం అభ్యర్థులెవరైనా డబ్బులిస్తే తీసుకుని ఓటును మాత్రం సమర్థులకే వేయాలని సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ‘ఓటుకు నోటు’కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరమ్, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్, ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్‌ల ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’వాల్‌పోస్టర్‌ను రామ్‌గోపాల్ వర్మ మంగళవారం ఆవిష్కరించారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ...ప్రజలను మేలుకొల్పడంలో పొలిటికల్ కార్టూన్స్ చాలా ప్రభావం చూపిస్తాయన్నారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండి, అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యం తదితర అవసరాలను మెరుగుపరిచే అభ్యర్థులనే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. తానెప్పుడూ పొలిటికల్ మేనిఫెస్టో చూడనని, దానిని రూపొందించడం, అమలు చేయడం తెలిస్తే తానే ఓ రాజకీయ నాయకుడిగా మారిపోయే వాడినని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’లో భాగమైన కార్టూనిస్ట్‌లను ఆర్జీవీ అభినందించారు. వ్యంగ్య చిత్రాలను గీసే వారు ఇంత సీరియస్‌గా ఉంటారని కార్టూనిస్టులను చూశాకే తెలిసిందని చమత్కరించారు. కార్యక్రమంలో కార్టూనిస్టులు శంకర్ (సాక్షి), సుభాని, మృత్యుంజయ, నర్సిం, అక్బర్, వెంకటేశ్ కతుల, రాకేశ్, పి.ఎస్.చారీ, సురేందర్ సముద్రాల, జె.వెంకటేశ్, నివాస్ చొల్లేటి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి తదితర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
తొలిసారిగా...ఓ చారిటీ ఈవెంట్లో వర్మ...
సాక్షి, హైదరాబాద్ : ఓ వైపు తెలంగాణ ఎన్నికల రణక్షేత్రం అంతకంతకూ వేడెక్కుతూ పూటకో మలుపులు తిరుగుతోంది. అయినప్పటికీ‘‘తెలంగాణ రాజకీయం పట్ల ఆసక్తి కలగడం లేదు. ఇక్కడ డ్రామా లేదు’’ అని తను గతంలో అన్న మాటల్ని పునరుద్ఘాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహం, శపధం సినిమా రూపొందిస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగనున్న మిక్స్ అండ్ మింగిల్ మెగా క్రిస్మస్ కార్నివాల్ పోస్టర్ని బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో శనివారం రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. తొలిసారి ఒక సేవా కార్యక్రమానికి నిధుల సేకరణకు మద్ధతు తెలుపుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సేవ చేయను..కానీ సపోర్ట్ చేస్తాను... ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను మిషన్ భధ్రత పేరుతో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తూ తాను వ్యక్తిగతంగా సేవ చేయననే మరోసారి చెప్పారు. అయితే చేసేవారికి మద్ధతు తెలపాలనే ఉద్దేశ్యంతోనే తొలిసారిగా ఈ తరహా ఈవెంట్‌కి వచ్చానన్నారు. అయితే ఇకపై కూడా ఇలా మద్ధతు ఇవ్వడం అనేది కొనసాగుతుందా అంటే నీలిమ ఆర్య ( కార్యక్రమ నిర్వాహకురాలు) లాంటి ఫ్రెండ్ అడిగితే కావచ్చునన్నారు. ఆసక్తి ఆంధ్రపైనే... తెలంగాణ రాజకీయాల్లో డ్రామా లేదని, అందుకే తాను ఇక్కడి విషయాలు అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు వర్మ. ఆంధ్ర రాజకీయాలే తప్ప తెలంగాణ రాజకీయాలపై సినిమాలు ఎందుకు తీయడం లేదు అన్న ప్రశ్నకు బదులిస్తూ తన కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉందన్నారు. ఇలాంటి ఈవెంట్లకు రావడం ద్వారా సమాజానికి భిన్నంగా ఉండే తన జీవనశైలి నుంచీ తాను కాస్త బయటపడుతున్నట్టుగా సాధారణ జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టుగా అనుకోవచ్చునా అనే ప్రశ్నకు ఆయన బదులిస్తే... అది కేవలం అపోహ మాత్రమేనని తాను ఎన్నటికీ మారనని స్పష్టం చేశారు. వర్మ మేకప్‌తో, మెదడుతో మాట్లాడరు... అందుకే ఈ కార్యక్రమానికి వివాదాస్పద దర్శకుడు, సేవా కార్యక్రమాల పట్ల బహిరంగంగానే విముఖత చూపే రామ్‌గోపాల్ వర్మ అనే దర్శకుడ్ని ఎంచుకోవడం పట్ల ఆయన ఫ్రెండ్ నీలిమ ఆర్య స్పందించారు. ఆయన ముఖానికి మేకప్ ఉండదని, అంతేకాదు ఆయన మైండ్‌తో కాకుండా హృదయంతో మాట్లాడతారని అందుకే తాను ఆయన్ను ఎంచుకున్నానని చెప్పారు. మిషన్ భధ్రత పేరుతో అమ్మాయిలకు ఇన్నర్‌వేర్ ఉచితంగా పంపిణీ చేయబోతూ, నిధుల సేకరించే ఈవెంట్‌కి వర్మను పిలవడం ట్రోల్స్‌కు గురవదా? అంటే అయినా పర్లేదు అనుకున్నానని, ఈ విషయమై వర్మ కూడా ముందే తనను హెచ్చరించారని నీలిమ స్పష్టం చేశారు. అయితే తాను వర్మ విషయంలో నమ్మిన దానికి తగ్గట్టుగా మాత్రమే నడుచుకున్నానన్నారు. ఆయనను మరిన్ని చారిటీ ఈవెంట్లకు కూడా పిలిచే అవకాశం ఉందన్నారు. -
స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడు: రాంగోపాల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: చేతికి మైకు దొరికింది కదాని రెచ్చిపోయి ఊగిపోవాడం, నిజానిజాలు తెలుసుకోకుండా చేతిలో ఉన్న స్క్రిప్టుని యథాతధంగా చదివి నిరాధార ఆరోపణలు చేసి తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శించే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, పవన్ ఏదైనా ఆలోచనతో చేయడని, స్క్రీన్ మీద చేసేదే పవన్ బయట చేస్తున్నాడన్నారు. సినిమాలో నటించే హీరో బయట హీరో కాలేడు. పవన్‌కు తనపైనే తనకు నమ్మకం లేదన్నారు. ఈ సారైనా ప్రజలు తనపై జాలి చూపిస్తారని పవన్ భావిస్తున్నాడన్న ఆర్జీవీ.. విప్లవానికి, పవన్ పార్టీకి ఏం సంబంధం? అంటూ ప్రశ్నించారు. చదవండి: బాబూ పవనూ.. నీ తొక్కలో లెక్క తప్పింది చూస్కో! ‘‘రాజకీయాలను పవన్ సినిమాలా చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ తన ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నాడు. నిఘా వర్గాలు తమ పని చేసుకోకుండా పవన్‌కు నివేదికలు ఇస్తున్నాయా? ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేయాలనేదే పవన్ ఆలోచన. సినిమాల్లో సీన్స్ రియాక్షన్నే పవన్ బయట చూపిస్తాడు’’ అని ఆర్జీవీ దుయ్యబట్టారు. -
కోడి పందేలను తిలకించిన రాంగోపాల్ వర్మ
-
వైఎస్ జగన్ సెంట్రిక్ గా నేను తీసే సినిమా ఎలా ఉంటుందంటే : రాంగోపాల్ వర్మ
-
డేంజరస్ ట్రైలర్.. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు?
అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ, నట్టి కుమార్, ఏబీ శ్రీనివాస్ రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ సినిమా. మగవాళ్లతో ఇద్దరు అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్య క్రమంలో నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్, నిర్మాత ఏబీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అబ్బా ఓ అబ్బాయా..
ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, జయలలిత, అనిత చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గీత సాక్షిగా..’. ఆంథోని మట్టిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పుష్పక్, జేబీహెచ్‌ఆర్‌ఎన్‌కేఎల్ సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై చేతన్ రాజ్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అనే పాటను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘పాట క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘గీత సాక్షిగా’. ఈ పాటకి రెహమాన్ సాహిత్యం అందించగా, సాహితీ చాగంటి పాడారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ హనుమ నరిసేటి. -
కొత్త తరహా సినిమాలను ఆదరిస్తారు
‘‘ఎంటర్ ది డ్రాగన్’ సినిమా చూసినప్పటి నుంచి అలాంటిది చేయాలనుకున్నాను. అందుకే ‘అమ్మాయి’ సినిమా నా కలల ప్రాజెక్ట్. పూజా భాలేకర్ లాంటి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయి దేశంలోనే లేరు. కొత్త తరహా సినిమాలు తీస్తే ఆదరిస్తామని మరోసారి ‘అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకులు నిరూపించారు’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లడ్కీ’ (తెలుగులో ‘అమ్మాయి’). టి. అంజయ్య, శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘అమ్మాయి’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో టి. అంజయ్య మాట్లాడుతూ– ‘‘ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ)గారు తీసిన ‘శివ’ తర్వాత ‘అమ్మాయి’ సినిమానే పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ తీయమంటున్నారు. ఆ చిత్రాన్ని నేనే నిర్మిస్తా’’ అన్నారు. ‘‘అమ్మాయి’ వంటి మంచి హిట్ ఇచ్చిన ఆర్జీవీ, అంజన్నగార్లకు థ్యాంక్స్’ అని అన్నారు నిర్మాత రామ సత్యనారాయణ. -
వాళ్లను విశ్లేషించడం మూర్ఖత్వం!
‘‘నాకు తెలిసిన ఓ రిటైర్డ్ పోలీసాఫీసర్ కొండా మురళిగారి గురించి చెప్పారు. ఆ తర్వాత మాజీ నక్సలైట్లతో మాట్లాడాను. కథ ఒక కొలిక్కి వచ్చాక కొండా ఫ్యామిలీని కలిసి, సినిమా గురించి చెబితే వారు ఒప్పుకున్నారు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘కొండా’. త్రిగుణ్, ఇర్రా మోర్ జంటగా నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్‌పై కొండా సుష్మితా పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొండా మురళి, సురేఖల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు (1990 నుంచి 2000) ఈ సినిమా ఉంటుంది. కొండా దంపతుల కుమార్తె సుష్మిత ఈ చిత్రనిర్మాత కాబట్టి వాళ్లకు పాజిటివ్‌గా తీయలేదు.. తను నిర్మాత కాకున్నా నేను అనుకున్నది తీసేవాణ్ణి. ప్రస్తుతం ‘లడకీ’ అనే ఓ హిందీ చిత్రం తీశాను. అమితాబ్ బచ్చన్‌గారితో ఓ హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. మనం చేసేది మనం చేస్తాం.. పరిస్థితులు ఇంకోటి చేస్తాయి. నాలుగు నెలల క్రితం ‘సినిమా టికెట్ రేట్లు తగ్గించి సినిమాలను చంపేస్తున్నారు’ అన్నారు. ఆ తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మళ్లీ తగ్గించారు. పరిస్థితులను బట్టి మారాల్సి వస్తుంది. ప్రేక్షకుడిని, ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లను విశ్లేషించడమంత మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. -
డేంజరస్ సేల్స్.. ఆర్జీవీనా మజాకా ! మూవీ బిజినెస్‌లో మరో యాంగిల్
Rgv Dangerous Movie: డేంజరస్ సినిమా బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోనూ అదరగొడుతోందని దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెలిపారు. ఈ సినిమాను నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా అందుబాటులో ఉంచగా అవన్ని హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయని ఆయన వెల్లడించారు. టోకెన్లు సోల్డ్ అవుట్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన డేంజరస్ సినిమాను ప్రపంచంలోనే తొలిసారిగా నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) పద్దతిలో రిలీజ్ చేస్తున్నట్టు గత వారం ప్రకటించారు. మొత్తం ఆరు లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో ఐదు లక్షల టోకెన్లు వేలానికి అందుబాటులో ఉంచి సినిమా యూనిట్ దగ్గర కేవలం లక్ష టోకెన్లు ఉంచుకున్నారు. తాజాగా ఐదు లక్షల టోకెన్లు అమ్ముడైనట్టు వర్మ వెల్లడించారు. సినిమా యూనిట్ దగ్గరున్న లక్ష యూనిట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. The 100,000 tokens left are for the DANGEROUS team as one can understand the details in https://t.co/bmcI4QhJQR Rest of all the 500,000 TOKENS are SOLD OUT 💐💐💐 pic.twitter.com/LEh30fIT5z — Ram Gopal Varma (@RGVzoomin) November 3, 2021 ఏది చేసినా సంచలనమే క్రియేటివ్ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. శివ మూవీతో మూవీ మేకింగ్ లెక్కలనే మార్చేసిన వర్మ ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్లో సరికొత్త పంథాకు తెర లేపారు. గతంలో విష్ణుతో చేసిన అనుక్షణం సినిమాను డిస్ట్రిబ్యూషన్‌ని ఓపెన్ మార్కెట్లో ఉంచారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డేంజరస్ సినిమాను బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై పని చేసే నాన్ ఫంజిబుల్ టోకెన్లుగా అమ్మకానికి పెట్టారు. చదవండి: ఏ సినిమా ఇండస్ట్రీ చేయని ప్రయోగం చేస్తోన్న ఆర్జీవీ..! -
ఆర్యన్ ఖాన్‌కు బెయిల్, ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పలువురు ఖాన్ ఫ్యాన్స్కూడా సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తున్నారు. (Aryan Khan Drugs Case: ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్) ఆ దేవునికి ధన్యవాదాలు. ఒక తండ్రిగా చాలా రిలీఫ్ పొందుతున్నాను. అంతా మంచిగా, సానుకూలంగా జరగాలని ఆశిస్తున్నానంటూ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు. అలాగే కాలమే తీర్పు చెబితే సాక్షులతో అవసరం లేదంటూ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా ట్వీట్ చేశారు. వీరితోపాటు నటి స్వర భాస్కర్, తదితరులు ట్విటర్ ద్వారా సంతోషాన్ని ప్రకటించారు.(Aryan Khan drugs case: ఆయన ఉండి ఉంటే: సీఎంకు క్రాంతి వాంఖడే బహిరంగ లేఖ) ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియమించు కోలేరు. అంటే దీనర్థం అండర్ ట్రయల్ గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా అని ప్రశ్నించారు. అంతేకాదు ఇన్నాళ్లు ఆర్యన్‌కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా, అందుకే అనవసరంగా ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చిందా? అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. కాగా ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ లభించింది. దాదాపు మూడు వారాల తరువాత ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. So if It just took Mukul Rahtogi’s argument, to get bail for Aryan , does it mean his earlier lawyers were so incompetent that he had to spend so many days in jail needlessly? — Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021 Thank god . As a father I am So relieved .. … May all good and positive things happen. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 28, 2021 FINALLY ! 👏🏽👏🏽👏🏽👏🏽 https://t.co/2zW4ldEqpW — Swara Bhasker (@ReallySwara) October 28, 2021 -
మైసమ్మకు మద్యం తీర్థం
గీసుకొండ: ఎప్పుడు వివాదాలను సృష్టించుకుంటూ మీడియా ఫోకస్ తనపై ఉండేలా చూసుకునే సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మంగళవారం తన కొత్తచిత్రం ‘కొండా’ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కోటగండి వద్ద వరంగల్–నర్సంపేట రహదారి పక్కన ఉన్న కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తీర్థంగా మద్యం ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక్కడి అమ్మవారికి భక్తులు మద్యాన్ని తీర్థంగా పోయడం సంప్రదాయంగా వస్తోంది. అమ్మవారికి మద్యంపోయడంపై ఆర్జీవీ స్పందిస్తూ..తానెప్పుడూ వోడ్కా తాగుతానని, అమ్మవారికి విస్కీ పట్టించానని తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు. -
రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం కొండా ప్రారంభం
-
‘దెయ్యం గుడ్డిది ఐతే?’
సుమీత్, జాకీర్, హైమ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘దెయ్యం గుడ్డిది ఐతే?’. దాసరి సాయిరాం దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ– ‘‘నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. లెక్కలేనన్ని చూశాను. కానీ దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం అనే కథాంశంతో ఉన్న సినిమా ఇప్పటివరకూ చూడలేదు. ‘దెయ్యం గుడ్డిది ఐతే’ అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా కొత్తగా ఉంది’’ అన్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
నాన్నతో సినిమా చేయడం హ్యాపీ
దర్శక–నిర్మాత నట్టి కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘డి.ఎస్.జె’ (దెయ్యంతో సహజీవనం). ఈ సినిమా ద్వారా నట్టి కుమార్ కుమార్తె కరుణ కథానాయికగా, కుమారుడు క్రాంతి నిర్మాతగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘నా దర్శకత్వంలో నా కూతురు కరుణ హీరోయిన్గా, నా కుమారుడు క్రాంతి నిర్మాతగా చేయడం ఓ మంచి అనుభూతి’’ అన్నారు నట్టి కుమార్. ‘‘నాన్న డైరెక్షన్లో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు నట్టి కరుణ. -
రూ. 250 పవర్‌స్టార్ సినిమా రిలీజ్ కంటే ముందే!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ మీద రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘పవర్‌స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాత కథ’. ఈ సినిమాను ఆయన శనివారం ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు సినిమా బాగుందని మెచ్చుకున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ వర్మను ఓ రేంజ్లో దుమ్మెత్తిపోశారు. దీంతో ట్విటర్లో సరికొత్త వార్‌కు తెరలేసినట్లు అయింది. ఈ సినిమాలో అచ్చం పవన్ కల్యాణ్ పోలిన వ్యక్తి హీరోగా నటించారు. గతంలో వర్మ యాప్ ద్వారా ఈ సినిమాను విడుదల చేయడం.... అనంతరం పవర్‌స్టార్ పవన్ అభిమానులు వర్మ ఆఫీసు వద్ద భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దాంతో పవర్‌స్టార్ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టులను తన యాప్‌లో వర్మ విడుదల చేశాడు. దీనికి సంబంధించి వర్మ మరోసారి వరుస ట్వీట్లు చేశారు. పవర్ ఫుల్ హిట్, రికార్డు బ్రేకింగ్ వ్యూస్, ఇండస్ట్రీ ఛేంజర్ అని ఉన్న పోస్టర్‌ను వర్మ ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి: వర్మ ఆఫీస్‌పై జనసేన కార్యకర్తల దాడి 💪💪💪💪💪💪💪💪💪 pic.twitter.com/7f3gB1S12J — Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2020 సినిమాను చూడటంలో ఇబ్బందులు ఉంటే రిఫ్రెష్ చేయండి సినిమా చూడొచ్చు అని కూడా వర్మ ట్వీట్ చేశారు. http://rgvworldtheatre.com లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని వర్మ చెప్పారు. People who had problems loading the film, please refresh the page now and u can watch pic.twitter.com/PMoY8nJdRg — Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2020 To watch POWER STAR Download the https://t.co/YpBOXfI9v7 App at https://t.co/LKQXOmFi4Z pic.twitter.com/AndfvVBWm9 — Ram Gopal Varma (@RGVzoomin) July 25, 2020 రూ. 150లు చెల్లిస్తే యూట్యూబ్‌లో రాకముందే సినిమా చూడొచ్చని, అదే రూ. 250 చెల్లిస్తే సినిమా విడుదల కాక ముందే సినిమా చూడొచ్చు అని వర్మ ట్వీట్ చేశారు. pic.twitter.com/6ElkPHxXL5 — Ram Gopal Varma (@RGVzoomin) July 24, 2020 -
ప్రవన్ కల్యాణ్ అద్భుతమైన నటుడు: వర్మ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘పవర్ స్టార్’ సినిమాకు సంబంధించిన మరో స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రవన్‌కల్యాణ్ నటిస్తున్న మెగా మూవీ పవర్‌స్టార్‌ను ఆర్జీవీవరల్డ్ థియేటర్లో విడుదల కాబోతుంది’’ అంటూ పవర్ స్టార్‌లో లీడ్ రోల్లో నటిస్తున్న వ్యక్తి గ్లాసును తదేకంగా చూస్తున్న మరో పోస్టర్‌ను షేర్ చేశారు. అంతేగాకుండా తన హీరో ప్రవన్‌కల్యాణ్ అద్భుతమైన నటుడని, ఇతర స్టార్లతో పోలిస్తే ఎంతో పవర్ఫుల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే సినిమా విడుదల తేదీని తేదీని మాత్రం వెల్లడించలేదు.(ఆర్జీవీ అదిరిపోయే సమాధానం) కాగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ.. ‘‘బ్రేకింగ్ న్యూస్: ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో కొత్త సినిమాకు ‘పవర్ స్టార్’ అని పేరు పెట్టాం. ఇందులో పీకే, ఎమ్ఎస్, ఎన్బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో అర్థం చేసుకోవడానికి ఎటువంటి బహుమతులు ఇవ్వబడవు’’ అని ట్విటర్ వేదికగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అనేక పోస్టర్లు విడుదల చేసిన ఆర్జీవీ సోషల్ మీడియాలో ఎప్పటికపుడు సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత, మారుతీరావుల కథ ఆధారంగా ‘మర్డర్’ , ‘కరోనా వైరస్’, ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’, ‘కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్’ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. The hero of POWER STAR Mr. @PrawanKalyan is a FANTASTIC actor more POWERful than any STAR pic.twitter.com/wRhspWoZB5 — Ram Gopal Varma (@RGVzoomin) July 14, 2020 -
ఆర్జీవీ అదిరిపోయే సమాధానం
సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్‌గోపాల్ వార్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పవర్ స్టార్’. ఈ లాక్డౌన్ కాలంలో క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అమృత, మారుతీరావుల కథ ఆధారంగా మర్డర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మర్డర్‌తో పాటు ‘కరోనా వైరస్’, ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’, ‘కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్’ చిత్రాలను చేస్తున్నారు. తాజాగా ‘పవర్ స్టార్’ పేరుతో ఓ చిత్రం చేయబోతున్నట్లు ఆదివారం ట్విటర్ వేదికగా ఆర్జీవీ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. (ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్) అయితే ఆర్జీవీ దగ్గర కథలు అయిపోవడంతోనే నిజ జీవిత కథలు, సంఘటనలపై పడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నా కాలేజీలో జరిగిన కథనే శివ. గాయం, సర్కార్, సత్య, కంపెనీ, రక్తచరిత్ర ఇవన్నీ నిజ జీవిత కథల ఆధారంగానే తెరకెక్కించిన చిత్రాలు. నా మొత్తం సినీ కెరీర్లో 70 శాతం చిత్రాలు సమాజంలో జరిగిన ఘటనలు, నిజ జీవిత అనుభవాల ఆధారంగానే తెరకెక్కించాను. మరికొన్ని ఇంగ్లీష్ నవలలు, ఫారిన్ చిత్రాల నుంచి కాపీ కొట్టాను’ అంటూ ఆర్జీవీ కుండబద్దలు కొట్టి చెప్పారు. ప్రస్తుతం ఆర్జీవీ సమాధానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే) Here is the STAR of my new film POWER STAR ...This shot was taken when he visited my office ..Any resemblance to any other person is incidentally coincidental and intentionally unintentional.. pic.twitter.com/geulQ4YAj8 — Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020 -
ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్
హైదరాబాద్: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం ‘మర్డర్’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ కథా చిత్రమ్ అనేది ఉపశీర్షిక. ఫాదర్స్ డే సందర్భంగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అమృత, మారుతీరావుల పాత్రలను పరిచయం చేశారు. తాజాగా మరో పోస్టర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ పోస్టర్లో అమృత తన కుమారుడిని ఎత్తుకుని ఉంది. అంతేకాకుండా అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన భావోద్వేగానికి ఫిదా అయ్యానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (యాంకర్ని పొగిడిన ఆర్జీవీ..) ఇక ఫాదర్స్ డే సందర్భంగా చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘ఓ తండ్రి తన కుమార్తెను ఎక్కువ ప్రేమతో పెంచడం వల్ల కలిగే ప్రమాదం. అమృత, మారుతీరావుల కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. ఫాదర్స్ డే రోజున.. ఈ విషాద తండ్రి పోస్టర్‌ను విడుదల చేస్తున్నాను’ అని ఆర్జీవీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు పోస్టర్లను విడుదల చేస్తూ.. ‘మర్డర్ అనేది మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ’ ‘అతి ప్రేమే అతి ద్వేషానికి కారణమవుతుందని, తీవ్ర హింసకు దారి తీస్తుంది’ అని పేర్కొంటూ వరుస ట్వీట్లు చేశారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. (అమృతా ప్రణయ్ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్..) Am overwhelmed with the emotional intensity portrayed by @AvanchaSahithi in this pic from MURDER #LoveCanMURDER pic.twitter.com/AZvhM4EyaC — Ram Gopal Varma (@RGVzoomin) June 26, 2020 MURDER is “మారుతి వధించిన ప్రణాయామృత విషాద గాధ" #LoveCanMURDER pic.twitter.com/NEfVZp6NRJ — Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020 MURDER is a story of extremes ..EXTREME LOVE resulting in EXTREME HATE and culminating in EXTREME VIOLENCE #LoveCanMURDER pic.twitter.com/7SN7fS9uUZ — Ram Gopal Varma (@RGVzoomin) June 23, 2020 -
ఆ తర్వాత ఏలియన్స్ దాడులా?: వర్మ
హైదరాబాద్: సమాజంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై ఇప్పటివరకు కవితలు, పాటలు రాసిన వర్మ తాజాగా ఏకంగా ఓ సినిమాను తెరకెక్కిస్తూ ఆశ్చర్యపరిచారు. ఇప్పటికే వర్మ ‘కరోనా వైరస్’ ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెటిజన్ల తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పటికే వివిధ సమస్యలతో ప్రపంచం కొట్టుమిట్టాడుతుంటే మిడతల రూపంలో కొత్త సమస్య వచ్చిచేరింది. మిడతల దండు పంటపొలాలను నాశనం చేస్తుండటం ప్రభుత్వాలకు తలపోటుగా మారింది. ఈ క్రమంలో మిడతల దండుపై తన దైన శైలిలో స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశాడు వర్మ. (ఈశ్వర్, అల్లా, జీసస్‌లపై ఒట్టు: వర్మ) వైరస్లు ప్రపంచంపై దాడి చేసిన అనంతరం ప్రస్తుతం మిడతలు అటాక్ చేస్తున్నాయని, తదుపరి ఏలియన్స్ దాడులు చేస్తాయా? అని ప్రశ్నిస్తూ వర్మ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉంటే మిడతలు మాత్రం ప్రపంచ పర్యటనలో ఉన్నాయి’ అంటూ మరో సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా తీయడానికి వర్మకు మరో సబ్జెక్ట్ దొరికిందని కొందరు కామెంట్స్ చేస్తుండగా.. ‘మిడతల దండు’ అనే సినిమా తీయండి అంటూ మరికొందరు వర్మకు సూచనలిస్తున్నారు. (ఆర్జీవీకి అభినందనలు: బిగ్‌బీ) While the entire WORLD is in a LOCKDOWN the LOCUSTS are on a WORLD TOUR 🙄🙄🙄 pic.twitter.com/K2IuOxP4K3 — Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2020 The entire WORLD is in a LOCKDOWN and the LOCUSTS are on a WORLD TOUR 🙄🙄🙄 pic.twitter.com/sTb7nZqPoY — Ram Gopal Varma (@RGVzoomin) May 30, 2020 -
గల్లీ కుర్రాడి ప్రేమకథ
నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సూర్య’. ఈ చిత్రం ద్వారా ఉమామహేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్, క్విట్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నట్టికుమార్ కుమార్తె నట్టి కరుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నిజమేనా...’ అంటూ సాగే పాటను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నటీనటులు కస్తూరి, శివబాలాజీ, మధుమిత విడుదల చేశారు. నట్టి క్రాంతి మాట్లాడుతూ –‘‘చిన్నప్పటి నుంచి సినిమా రంగం అంటే ఇష్టం. ఓ వైపు చదువుకుంటూనే అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటన, దర్శకత్వంలో శిక్షణ పొందాను. వైజాగ్ సత్యానంద్‌గారి దగ్గర కూడా నటనలో శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ‘‘సైకాలజీ కోర్సు పూర్తి చేసిన నేను ‘ముద్ర’ సినిమాతో నిర్మాతగా మారి, వరుసగా సినిమాలు తీస్తున్నాను. చక్కటి ప్రేమకథా చిత్రం ‘సూర్య’. అల్లరి చిల్లరగా తిరిగే ఓ గల్లీ కుర్రాడు ప్రేమలో పడిన నేపథ్యంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురయ్యాయి? అనేదే ఈ చిత్రకథ. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మిగతా చిత్రీకరణను పూర్తి చేస్తాం’’ అన్నారు నట్టి కరుణ. ఈ చిత్రానికి కెమెరా: వల్లీ ఎస్.కె., సంగీతం: సుకుమార్ పి, సమర్పణ: నట్టి కుమార్. -
రజనీపై వర్మ మరో ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మరోసారి వంగ్యస్త్రాలు సందించాడు. మహమ్మారిని నాశనం చేసేందుకు ఆయన ఏం చేయట్లేదంటూ ఫన్నీ మీమ్‌తో ట్విటర్లో సోమవారం షేర్ చేశాడు. ప్రుస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కరోనా వైరస్‌ను నాశనం చేయడానికి రజనీకాంత్ ఎందుకు ఏమీ చేయడం లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. And why the f... is Rajnikant not doing anything to destroy the Coronavirus?????..Just asking — Ram Gopal Varma (@RGVzoomin) March 21, 2020 ఇక ఆర్జివి ట్వీట్ చూసిన రజనీ అభిమానులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. తమ అభిమాన హీరోపై వ్యంగ్యంగా ట్వీట్ చేసినందుకు వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక రజనీని ట్రోల్ చేయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు రజనీ నటించిన 2.0 విడుదల సమయంలో ఆయన లుక్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్మ గెహెర్ అనే హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అమిత్ సాధ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది
‘‘ఎంఎంఓఎఫ్’ ట్రైలర్ చూశాక నేను నిదానంగా వెళుతున్నానా? సినిమా తీసినవారు ఫాస్ట్‌గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కథలతో మరెన్నో సినిమాలు చేయాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. జేడీ చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో యన్.యస్.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంఎంఓఎఫ్’. అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ జేకే క్రియేష¯ŒŒ్స బ్యానర్స్‌పై ఆర్ఆర్ఆర్ రాజశేఖర్, జేడీ కాశీం నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. డైరెక్టర్ శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘వర్మలా సినిమాలు చేయాలని, అతన్ని అనుకరించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మంచి నటుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే త్వరగా సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జేడీ చక్రవర్తితో చాలా కాలం తర్వాత నటించాను. ఆర్జీవీగారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ‘ఎంఎంఓఎఫ్’ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నటుడు బెనర్జీ. జేడీ చక్రవర్తి, నటులు ఉత్తేజ్, మనోజ్ నందం, నిర్మాత రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
గర్ల్ డ్రాగన్
విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. పూజా భలేకర్ ప్రధాన పాత్రధారిగా ఇండో–చైనీస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌కు గ్లామర్ మేళవించి ఓ కొత్త ట్రెండ్‌లో రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇందులో పూజా చేసే పోరాటాలు హైలైట్‌గా ఉంటాయి. ఇటీవల చైనాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. తాజాగా ఈ చిత్రం వైజాగ్ షెడ్యూల్ ముగిసింది’’ అని చిత్రబృందం వెల్లడించింది. -
‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ ఓ ట్రెండ్ సెట్టర్
ఒకప్పుడు బ్రూస్లీ నటించిన హాలీవుడ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో బ్రూస్లీ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూడా బ్రూస్లీ అంటే ఎనలేని అభిమానం. తన సినిమాలలోని ఫైట్స్ ఆయనను స్ఫూర్తిగా చేసుకుని చేసినవే అని వర్మ చెబుతుంటారు. ఇదిలావుండగా...ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో తన దర్శకత్వంలో ఆర్జీవీ ఇప్పుడు ఓ సినిమాను రూపొందిస్తున్నారు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రం కావడం విశేషం. మొదటి నుంచి విభిన్నచిత్రాలు చేస్తూ.. ఓ ప్రత్యేక పంథా కు తెరతీసిన వర్మ మార్షల్ ఆర్ట్స్ కు గ్లామర్ ను మేళవించి మరో కొత్త ట్రెండుకు తెర తీయబోతున్నారు. ఇండో చైనీస్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రధారి పూజా భలేకర్ చేసిన రిస్కీ ఫైట్స్ అత్యంత ఆకర్షణీయంగా, వళ్ళు గగుర్పొడిచేవిధంగా ఉండనున్నాయని చిత్రబృందం వెల్లడించింది. పై పెచ్చు ఆమె గ్లామర్ కూడా ఒక హైలైట్ కానుందని వారు చెప్పారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు విశేషమైన ప్రేక్షక స్పందన లభించడమే కాదు ట్రెండింగ్ అయ్యింది. లోగడ చైనాలోనూ మేజర్ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్ లో పూర్తి చేసుకుంది. జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా చిత్రనికి సంబందించిన పోస్టర్స్‌ను విడుదల చేసింంది. చదవండి: రేణుక, ఆమె బిడ్డకు సాయం చేయండి: ఆర్జీవీ కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ -
చటాన్‌పల్లిలో ‘దిశ’ సినిమా షూటింగ్
షాద్‌నగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని బైపాస్ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద శుక్రవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ నిర్వహించారు. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ) శంషాబాద్‌లో అత్యాచారం, హత్య అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే చటాన్‌పల్లి శివారులో మృతదేహాన్ని కాల్చివేసిన బ్రిడ్జి వద్ద స్కూటీ, లారీతో సన్నివేశాన్ని కూడా చిత్రీకరణ చేశారు. కాగా దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ ఈ నెల 17న శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్‌ను కలిసి దిశ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. (‘దిశ’ ఘటనను ఉద్వేగ భరితంగా మలుస్తా: వర్మ ) -
నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం
‘‘స్టాలిన్ అనేది నా ఫేవరెట్ పేరు. స్టాలిన్ రష్యన్ నియంత. ‘స్టాలిన్’ పేరుతో చిరంజీవిగారు సినిమా చేశారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత ‘స్టాలిన్’ అనే పేరుని వింటున్నాను. ఈ చిత్రం టైలర్ చాలా బావుంది’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. జీవా, రియా సుమన్, నవదీప్ ముఖ్య పాత్రల్లో రతిన శివ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సీరు’. తెలుగులో ‘స్టాలిన్’ టైటిల్‌తో వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్, నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విట్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘జీవా చాలా ఈజ్‌తో నటించాడు. ఇందులో నవదీప్ లుక్ (నవదీప్‌ది విలన్ పాత్ర) విభిన్నంగా కనిపిస్తోంది. నాకు హీరోలకన్నా విలన్స్ అంటేనే ఇష్టం. దర్శకుడు సినిమాను బాగా హ్యాండిల్ చేశారు’’ అన్నారు. ‘‘జీవా తండ్రి ఆర్.బి. చౌదరిగారి బ్యానర్లో రాజశేఖర్‌గారు సింహరాశి, గోరింటాకు వంటి పెద్ద హిట్ సినిమాలు చేశారు. వాళ్ల నాన్నగారి పేరు నిలబెట్టాలని జీవా మంచి మంచి సినిమాలు చేస్తున్నాడు. ‘రంగం’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు జీవితా రాజశేఖర్. ‘‘మొదటి నుంచి తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఉంది. నన్ను ‘రంగం’ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వర్మగారి సినిమాలంటే నాకు ఇష్టం. ఆయన దగ్గర డైరెక్షన్ నేర్చుకోవాలని అనుకున్నాను. త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు జీవా. ‘‘తెలుగు ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశాను. మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు రతిన శివ. ‘‘తెలుగు ప్రేక్షకులకు తెలుగు, తమిళం అనే భేదాలు ఉండవు. అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తారు. తొలిసారి ఇందులో పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించాను’’ అన్నారు నవదీప్. ‘‘నట్టి ఫ్యామిలీకి ఈ సినిమా మంచి విజయం తీసుకురావాలి’’ అన్నారు టి. అంజయ్య. ‘‘మంచి పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు నట్టికుమార్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రియా సుమన్, నిర్మాతలు దామోదర ప్రసాద్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, వేల్స్ శ్రవణ్, శివ బాలాజీ, మధుమిత పాల్గొన్నారు. -
దిశ ఘటనపై సినిమా తీస్తున్నా
నిర్భయ సంఘటన తర్వాత ఇటీవల జరిగిన దిశా అత్యాచారం ఘటన దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు దిశా ఘటనపై సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘దిశా ఘటనలో దిశా శరీరాన్ని పెట్రోల్‌తో కాల్చేసి దారుణానికి పాల్పడ్డారు రేపిస్టులు. ఆ రేప్ చేసినవాళ్ల మానసిక స్థితి ఏంటి? దిశను ఎందుకు చంపారు? అని ఈ సినిమాలో చూపించబోతున్నాను. రేపిస్టులందరూ గతంలో జరిగిన రేప్ కేసుల్లో జరిగిన తప్పులు చేయకూడదనుకుంటున్నారు కానీ మానభంగం చేయకూడదు అని మాత్రం అనుకోవడం లేదు’’ అన్నారు. -
వర్మ తదుపరి చిత్రం ‘దిశ’
సమాజంలో జరిగిన వాస్తవిక ఘటనల అంశాలనే కథగా తీసుకొని సినిమాలను తెరకెక్కించడంలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దిట్ట అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వర్మ తీసిన వివాదస్పద చిత్రాలే ఇందుకు నిదర్శనం. తాజాగా యావత్ దేశాన్ని కుదిపేసిన దిశ ఘటన ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు వర్మ అధికారికంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించాడు. వర్మ తన తదుపరి సినిమాకు సంబంధించి అంశాలను వెల్లడిస్తూ, దిశ అత్యాచార ఘటన జరిగిన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా చేయబోతున్నాను. ఆ సినిమాకు ‘దిశ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాం. ఢిల్లీలో నిర్భయ ఘటన వంటి అత్యంత పాశవిక ఘటన జరిగిన తర్వాత ఓ యువతిపై అత్యాచారం చేసి సజీవదహనం చేశారు. నిర్భయ దోషుల నుంచి కొత్తగా వస్తున్న అత్యాచార దోషులు ఏం నేర్చుకుంటున్నారో ‘దిశ’ చిత్రంలో భయంకరమైన గుణపాఠంగా తెలపబోతున్నాం. నిర్భయను అత్యాచారం చేసి రోడ్డు మీద వదిలివెళ్లారు. అలా చేస్తే శిక్ష పడదు అనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదని దిశను ఆ దోషులు కాల్చి చంపారు. నిర్భయ దోషులను ఈ రోజు ఉరి వేయాల్సింది. కానీ మురికి న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్ వేసి ఉరిశిక్ష వాయిదా పడేలా చేశారు’ అంటూ వర్మ వరుస ట్వీట్లు చేశాడు. ఇక అంతకుముందు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు వాయిదా పడటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. My next film is titled “DISHA” which is going to be about the DISHA rape ..After the brutal rape and horrific murder of NIRBHAYA, the DISHA rapists went further in their ghastliness in actually burning the poor girl with petrol #DishaNirbhayaTruth pic.twitter.com/3SiiesIgR8 — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 Film “DISHA” will detail the thought process of the DISHA rapists as in why they killed her..They dint want to do the mistake of NIRBHAYA rapists by leaving the girl alive so that she could lead the police to them #DishaNirbhayaTruth ..The below pic shows where the act happened pic.twitter.com/OJJO10Mic6 — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 My film DISHA will expose a scary lesson to all of us that the rapists are trying to learn from the mistakes of previous rapists but they are not stopping the rapes #DishaNirbhayaTruth pic.twitter.com/SAUSbf6qSB — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 The film “DISHA” will RAPE the fact that in a country where a monster like Advocate A P Singh can play football with the courts for years,people will always celebrate the instant justice delivered to DISHA #DishaNirbhayaTruth pic.twitter.com/KYmtgvtll7 — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 చదవండి: నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం ఆ కీచకులను వెంటనే ఉరితీయండి: గంభీర్ ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా -
నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం: వర్మ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడటంపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్ష పడకుంటా అడ్డుకుంటున్న న్యాయవాది ఏపీ సింగ్‌పై మండిపడుతూ వరుస ట్వీట్లు చేశాడు. ‘మురికి మనిషి ఏపీ సింగ్ నీతినియమాలను ఉల్లంఘిస్తే తన కూతురునైనా కాల్చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో చూడండి. ఇది మన సిస్టమ్‌కు ఉరి వేస్తూ అతడు వేసిన ఒట్టు అది. మన దేశానికి ఎంతో అవమానకరం’అంటూ 2013లో ఏపీ సింగ్‌కు సంబంధించిన ఇంటర్వ్యూ లింక్‌ను షేర్ చేశాడు. ‘అత్యంత క్రూరంగా, అహంకారంతో మన వ్యవస్థను న్యాయవాది ఏపీ సింగ్ మార్చుతుంటే.. మన వ్యవస్థ కంటే తెలంగాణ పోలీసులపైనే ప్రజలకు ఎక్కువ నమ్మకం కలుగుతుంది’, ‘నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడనివ్వని ఏపీ సింగ్ సవాల్ చేస్తున్నాడు. నేను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం’అంటూ మరో రెండు ట్వీట్లు శనివారం చేశాడు. అయితే శుక్రవారం దోషులకు ఉరిశిక్ష వాయిదా వేస్తూ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన వెంటనే వర్మ ట్విటర్ వేదికగా మండిపడిన విషయం తెలిసిందే. నాడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురైతే.. నేడు మన వ్యవస్థ చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురవుతోందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని మీరు ఊహించగలరా మోదీ గారూ. దానిని తెలుసుకోవడం కోసం.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి’ అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా నిర్బయ దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు శిక్ష అమలుకానుండగా.. కొన్ని గంటల ముందు కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వచ్చేవరకు ఉరిశిక్ష అమలు చేయరాదని ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష పదే పదే వాయిదా పడటాన్ని యావత్ దేశం జీర్ణించుకోలేకపోతోంది. Just check the interview of this dirt piece called A P Singh where he’s bragging to burn his own daughter and this is the scum who made our system stay the hanging ..SHAME ON OUR COUNTRY https://t.co/hjQb3gBati — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 If even filthy scum like advocate A P Singh also can manipulate the system with such brutal arrogance, it’s no wonder people have more faith in the telangana police than in our system https://t.co/w8UwJebNP8 — Ram Gopal Varma (@RGVzoomin) February 1, 2020 చదవండి: ఆ కీచకులను వెంటనే ఉరితీయండి: గంభీర్ ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా -
ట్రైలర్ బాగుంది
‘‘సూసైడ్ క్లబ్’ ట్రైలర్ చూశాను. మేకింగ్, సినిమాటోగ్రఫీ స్టయిలిష్‌గా ఉన్నాయి. కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శ్రీనివాస్ బాగా తీశాడు’’ అన్నారు దర్శకుడు రాంగోపాల్‌వర్మ. 3జీ ఫిలిమ్స్ సమర్పణలో ‘మజిలీ’ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సూసైడ్ క్లబ్‘. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వంలో ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3జీ ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రాంగోపాల్‌వర్మ విడుదల చేశారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వర్మగారు మా ట్రైలర్‌ను రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. త్వరలో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు శ్రీనివాస్ బొగడపాటి. ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి. -
బంపర్ ఆఫర్: వోడ్కా విత్ వర్మ!
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూటే సపరేటు. కొత్తగా, వైవిధ్యంగా చిత్రాలను తెరకెక్కించాలన్నా.. పొలిటికల్ సెటైర్ సినిమాలతో అగ్గిరాజేసి వివాదాలు సృష్టించాలన్నా వర్మకే సాధ్యం. అంతేకాకుండా వీటితో పాటు రొమాంటిక్, అడల్ట్ చిత్రాలను కూడా తెరకెక్కించడంలో ఈ వివాదస్పద దర్శకుడు సిద్దహస్తుడు. తన శిష్యులను దర్శకులుగా పెట్టి తక్కువ బడ్జెట్‌తో తానే స్వయంగా సమర్పిస్తూ ఈ మధ్య వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్లను కూడా వర్మ వినూత్నంగా నిర్వహిస్తుంటాడు. భారీ హంగులతో కూడిన ప్రమోషన్లు కాకుండా సింపుల్‌గా సోషల్ మీడియాను ఉపయోగించుకుటూ తన సినిమాకు కావాల్సిన హైప్‌ను క్రియేట్ చేసుకుంటాడు. ప్రస్తుతం ఆర్జీవీ సమర్పణలో ‘బ్యూటిఫుల్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా ప్రారంభించారు ఆర్జీవీ. దీనిలో భాగంగా వర్మ తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘వోడ్కా విత్ ఆర్జీవీ లైవ్. ఈ రోజు ‘బ్యూటిఫుల్’టీం ప్రి న్యూఇయర్ ప్రయివేట్ పార్టీ ఉంది. నాతో మరియు మా టీమ్‌తో కలిసి తాగడానికి అదేవిధంగా మాట్లడటానికి వీలుగా ఈ పార్టీకి మీ అందరినీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు ఫెస్బుక్, ఇన్‌స్టా లైవ్‌లో కలవడానికి ఆహ్వానిస్తున్నా’అంటూ వర్మ ట్వీట్ చేశాడు. వర్మ తన దైన స్టైల్లో చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ బంపర్ ఆఫర్ వర్మతో వోడ్కా పార్టీ’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘వోడ్కా, స్టఫ్ మీరు పంపిస్తారా లేక మేమే తెచ్చుకోవాలా’అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఇప్పటికే చిత్ర హీరోయిన్ నైనా గంగూలీతో వర్మ స్టెప్పులేసి జనాలను ఈ సినిమాపై ఫోకస్ చేసేలా చేశాడు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ వస్తోంది. ఆర్జీవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యూటిఫుల్’. చిత్రం న్యూఇయర్ కానుకగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇంటెన్స్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. రవి శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ సీరియస్ వంగవీటి కుమారి లో ఈ “బ్యూటిఫుల్” అందాలని ఇలా ఎప్పుడు చూసావయ్యా అగస్త్య మంజు??????🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/tgImoxaRMo — Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2019 చదవండి: కిందటి జన్మలో రంగీలా తీశా! రామ్ గోపాల్ వర్మకు నోటీసులు -
బ్యూటిఫుల్ మూవీ ప్రెస్ మీట్
-
కిందటి జన్మలో రంగీలా తీశా!
‘‘లవ్‌స్టోరీ చిత్రాల్లో నా పేరు జోడించి కొన్ని యుగాలు అయిపోతుంది. కిందటి జన్మలో ‘రంగీలా’ తీశాను. ‘బ్యూటిఫుల్’ చిత్రం ఒక విధంగా ‘రంగీలా’కి సీక్వెల్లా ఉంటుంది. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది కేవలం పబ్లిసిటీ కోసం పెట్టింది కాదు’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆర్జీవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. జనవరి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ – ‘‘నాకు వచ్చిన ఆలోచనను మంజుతో పంచుకున్నాను. తను పూర్తి కథ చేసి సినిమా తెరకెక్కించాడు. సాధారణ కథల్లో మగవాళ్లు ఎదుగుతుంటారు. ఆడవాళ్లు ఇంట్లో ఉంటారు. కానీ ఇందులో రివర్స్‌లో జరుగుతుంది. హీరోయిన్ బాగా ఎదుగుతుంది. తన సక్సెస్‌ను చూసి హీరో తట్టుకుంటాడా లేదా అనేది కథాంశం. విలన్స్ ఉండరు. సింపుల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటుంది. నైనా ఈ పాత్ర చేయడానికే పుట్టింది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వర్మగారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బాగా కష్టపడ్డాను. నా పరిచయ గీతాన్ని వర్మగారే షూట్ చేశారు. 3 రోజుల్లో 11 కాస్ట్యూమ్స్‌తో షూట్ చేశాం’’ అన్నారు నైనా. ‘‘ఇదో ఇంటెన్స్ లవ్‌స్టోరీ. అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా గురించి మాట్లాడినా, చూసినా వర్మగారు కన్నీళ్లు పెట్టుకునేవారు. అంత ఎమోషనల్‌గా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు’’ అన్నారు సూరి. -
కొత్త ఏడాది బ్యూటిఫుల్
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అన్నది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కింది. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ప్రేమ కథాంశంతో వైవిధ్యభరితంగా రూపొందిన చిత్రమిది. సూరి, నైనాల అభినయం మనసులను హత్తుకుంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి శంకర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, కెమెరా, దర్శకత్వం: అగస్త్య మంజు. -
మరికొన్ని సెటైరికల్ చిత్రాలు తీస్తాను
‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రాన్ని నవంబర్ 29న రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మా సినిమా కుల ద్వేషాలను రెచ్చగొడుతుందనే కారణాలు చూపి రిలీజ్‌ను అడ్డుకోవడానికి ప్రయ త్నించి, రిలీజ్ వాయిదా పడేలా చేశారు. రిలీజ్ ఆలస్యం కావడం వల్ల మాకు నష్టం జరిగింది. దీనికి కారణం అయిన వాళ్లందరి మీద నష్టపరిహారం దావా వేయబోతున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన టైగర్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రం ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’. సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అజయ్ మైసూర్, టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించారు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహ–నిర్మాతలు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో వర్మ మాట్లాడుతూ– ‘‘ఇదొక సెటైరికల్ చిత్రం. జరగబోయే దాన్ని ఊహించి తీసిన చిత్రం. చాలామందికి అర్థం కాలేదేమో. మెల్లిగ్గా అర్థం చేసుకుంటారు. బయట రాజకీయ నాయకులు ఒకరినొకరు నిజంగానే తిట్టుకుంటుంటారు. వాళ్లను పట్టించుకోకుండా సరదాగా సినిమా తీసిన మా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. బయట జరిగే వాటితో పోలిస్తే మేం చాలా తక్కువ చూపించినట్లు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కామెడీగా తీసుకొని ప్రతికూలంగా ఉన్నప్పుడు సీరియస్‌గా తీసుకుంటే ఎట్లా? సెన్సార్ బోర్డ్, ఇంద్రసేన్ చౌదరి, ది గ్రేట్ కేఏ పాల్ మరికొందరు సృష్టించిన ఇబ్బందుల వల్ల రెండు వారాలు ఆలస్యంగా మా సినిమా విడుదలయింది. ఏ కారణాలు చెప్పి ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలనుకున్నారో, హైకోర్ట్ ఆ ఆరోపణలన్నీ కొట్టిపారేసి రిలీజ్‌కు అనుమతి ఇచ్చింది. కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు కూడా వాళ్ల ఆరోపణలను ఆపలేదు. ‘మేం కోర్ట్ని మోసం చేశాం’ అని ఇంద్రసేన్ చౌదరి అనే వ్యక్తి ఆరోపించారు. అంటే.. వాళ్లు కోర్ట్ని అవమానించినట్టే. ఆయనకి కోర్ట్ మీద సరైన అవగాహన లేదనుకుంటాను. రిలీజ్ ఆలస్యం వల్ల మాకు నష్టం జరిగింది. దీని వెనుక ఉన్నవాళ్ల అందరి వివరాలు సేకరిస్తున్నాం. వాళ్ల మీద నష్టపరిహారం దావా వేయాలనుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ఇంద్రసేన్ చౌదరి, కేఏ పాల్, జ్యోతి ఉన్నారు. వాళ్లు నా మీద మార్ఫింగ్ కేసు కూడా పెట్టారు. మమ్మల్ని ఇబ్బంది పెడదాం అని అనుకున్నవాళ్లను వదిలే సమస్యే లేదు. త్వరలో మరిన్ని సెటైరికల్ చిత్రాలు తీస్తాను. అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నేను చనిపోయినట్టు పోస్ట్‌లు పెట్టడం తప్ప వేరే కళ లేనట్టుంది. సెటైర్ స్టయిల్లోనే మరిన్ని సినిమాలు తీస్తా. నా తదుపరి చిత్రం ‘ఎంటర్ ది గాళ్ డ్రాగన్’’అన్నారు. ఈ కార్యక్రమంలో టి. అంజయ్య, నట్టి కుమార్ పాల్గొన్నారు. -
అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు
‘‘సెన్సార్ బోర్డ్ రూల్ ప్రకారం చూస్తే ఏ సినిమా కూడా విడుదల కాదు. సెన్సార్ వాళ్లు అన్ని రూల్స్‌ను నా సినిమా మీదే ప్రయోగిస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఓటు వేసి మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమా చూడాలో? చూడకూడదో తెలియదా? ఆ విషయాన్ని ఇద్దరు, ముగ్గురు సెన్సార్ వాళ్లు చూసి చెప్పాలా? నా దృష్టిలో సెన్సార్ అనేది అవుట్ డేటెడ్’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి. అంజయ్య సమర్పణలో అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ కారణాల వల్ల కాలేదు. ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా మార్చారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఏ కులాన్ని, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను. ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను.. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. చిత్ర సహనిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ –‘‘మా సినిమాను నవంబర్ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్ 14న సెన్సార్‌కి పంపించాం. ఎలాంటి కారణం చూపకుండా సెన్సార్ వారు ఇంతవరకూ సినిమా చూడలేదు. అందుకే కోర్టును ఆశ్రయించడంతో వారంలోపు సినిమా చూసి, ఎగ్జామినేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. ఎవర్నీ కించపరిచేలా ఉండదు’’అన్నారు అజయ్ మైసూర్. ఈ చిత్రానికి సహ నిర్మాత: నట్టి కరుణ. -
తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!
‘‘బయట, సోషల్ మీడియాలో నాపై భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి నాకు బాగా తిట్టించుకోకపోతే నిద్రపట్టదు. నాలో అలాంటి బుద్ధి ఒకటి డెవలప్ అయ్యింది. ఎవరైనా పొగిడితే నాకు నిద్ర వస్తుంది’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. టైగర్ కంపెనీ ప్రొడక్షన్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్ పతాకాలపై రామ్‌గోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో నేను తీసిన తొలి సందేశాత్మక చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితుల నుంచి ఈ సినిమా ఆలోచన వచ్చింది. 2019 మే 22 నుంచి సెప్టెంబరు 2020 కాలపరిమితిలో సినిమా ఉంటుంది. అంటే జరిగినవి, జరుగుతున్నవి తీయడంతో పాటు జరగబోయేవి కూడా ఊహించి తీసిన చిత్రం. రాజకీయ వ్యంగ్యంగా ఈ సినిమా ఉంటుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఈ సిరీస్‌ను కంటిన్యూ చేయవచ్చేమో! ► ఈ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి పాత్ర వేయడానికి ఒకరు అవసరం అయ్యారు. ఆ పాత్ర కోసం ఆర్టిస్టును వెతుకుతున్నప్పుడు ఓ వ్యక్తిని నేను సోషల్ మీడియాలో చూశాను. నాసిక్‌లో వెయిటర్‌గా చేస్తున్నాడని తెలిసింది. అతన్ని పిలిపించి నటనలో శిక్షణ ఇప్పించాం. ► ఈ సినిమాలో ఏ వర్గం వారినీ హైలైట్ చేయలేదు. టార్గెట్ చేయలేదు. కొన్ని రియల్æలైఫ్ క్యారెక్టర్స్‌ను పోలి ఉన్న ఆర్టిస్టులను సినిమాలో తీసుకోవడం జరిగింది. దీంతో ఆడియన్స్ వారి ఆలోచనకు తగ్గట్లు ఊహించుకుంటున్నారు. అంతే కానీ నేను ఎవర్నీ టార్గెట్ చేయలేదు. ► ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఎన్టీఆర్‌కు అంకితం ఇచ్చాం. ‘కమ్మ రాజ్యంలో...’ని ప్రఖ్యాతిగాంచిన ఇద్దరు తండ్రీకొడుకులకు అంకితమివ్వాలనుకుంటున్నాను. ఈ సినిమా ఐడియా మాత్రమే నాది. టీమ్ అంతా కలిసి తీశాం. సెన్సార్ నుంచి టైటిల్‌పై అభ్యంతరం ఎదురైతే ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్ అనుకుంటున్నాం. ► ఇప్పుడు గ్యాంగ్‌స్టర్, క్రిమినల్ కథల కన్నా పొలిటికల్ క్రిమినల్ స్టోరీసే ఆసక్తికరంగా ఉంటున్నాయి. మా కంపెనీ నుంచి రానున్న మరో చిత్రం ‘బ్యూటీఫుల్’ వచ్చే నెల 6న విడుదలవుతుంది. ఓ చైనీస్ కో–ప్రొడక్షన్ కంపెనీతో ఢలేడీ బ్రూస్లీ’ సినిమా తీస్తున్నాం. నేను భక్తి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఒప్పుకోరేమో!. ► ట్రైలర్లో పప్పు వడ్డించే సీన్ ఉంది? అభ్యంతరం తెలుపుతూ కాల్స్ వచ్చాయా? నేను విన్నది ఏంటంటే ఈ సీన్ తెలుగు దేశంవారికి బాగా నచ్చిందట. అంటే తెలుగుదేశం వారు బయటకు చెప్పలేని విషయాన్ని నేను చెప్పినందుకు వారికి నచ్చిందేమో. ఆ సీన్ నచ్చిందని కొన్ని ఫోన్లు వచ్చాయి. అయినా ఓ తండ్రి తన కొడుక్కి ప్రేమగా పప్పు వడ్డిస్తాడు. ఈ సీన్‌ను ఏదోలా భావిస్తే నా తప్పు కాదు. ► ఈ టీజర్లో ‘బుడ్డోడు’ అనే డైలాగ్ ఉంది? ఇది ఒక యాక్టర్ గురించి అంటారా? అది మీరు సినిమాలో చూడండి. ► కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరూ భయపడరు? అని అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న వ్యాఖ్యలను అలాగే పెట్టారు..? మనుషులు అన్నప్పుడు చూశారు. మరి ఇప్పుడు సినిమాలోని యాక్టర్ అంటే ప్రాబ్లమ్ ఏంటి? అల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉన్నదే కదా! ► ఈ సినిమా జగన్మోహన్రెడ్డిగారికి ఫేవరబుల్‌గా ఉంటుందని కొందరి అభిప్రాయం? ► అది కరెక్ట్ కాదు. జరగనిది ఊహించి ఒక భవిష్యత్‌ను తెరకెక్కించినప్పుడు ఎవరికీ ఫేవర్‌గా చూపించలేం. జరిగిన సంఘటనలు అయితే ఎవరు కరెక్ట్? ఎవరు కాదు? అని ఓ అంచనాతో ఉండొచ్చు. మరి జరగని దాని గురించి ఎలా ఫేవర్‌గా తీస్తారు? ► జనసేన ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది? సినిమాలో పవన్‌కల్యాణ్‌ను పోలి ఉన్న ఓ వ్యక్తి మనసేన అనే పార్టీ పెడతారు. ఈ ‘మనసేన’ పార్టీకి, జనసేనకు ఏ సంబంధం లేదు. ► ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల ఆధారంగా సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉందా? మరో ‘సర్కార్’ తీయాలని ఉంది. ► ట్రైలర్లో స్పీకర్ నిద్రపోతున్నట్లు చూపించారు నిజంగా జరిగి, పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని గురించి కామెంట్ చేయడానికి ఎవరికైనా హక్కు ఉంటుందని నా అభిప్రాయం. అందరికీ తెలిసిన దాన్నే నేను సినిమాలో చూపించాను. -
వర్మ మరో సంచలనం; టీజర్ విడుదల
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ టీజర్ విడుదలైంది. బ్రూస్లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఈ సినిమాను టీజర్‌ను వర్మ విడుదల చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. వర్మ అభిమానులు మెచ్చేలా ఈ సినిమా టీజర్ ఉంది. పూజా భలేకర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్టుగానే కనిపిస్తోంది. ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని, తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇండో-చైనా సంయుక్త నిర్మాణంలో జింగ్ లియు, టి.నరేశ్, టి.శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. రవి శంకర్ సంగీతం అందించారు. -
‘పప్పులాంటి అబ్బాయి..’ పాట ట్రెండింగ్!
ఇటీవల కాలంలో ‘టాక్ ఆఫ్ ది టాలీవుడ్’గా నిలిచిన చిత్రాల్లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఒకటి. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై సిద్దార్థ తాతోలు దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ అందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘‘800 థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘పప్పు లాంటి అబ్బాయి..’ పాట మంచి ఆదరణతో ట్రెండింగ్ అయ్యింది. మొత్తం ఏడు పాటల్లో ఏ పాటకు ఆ పాట హైలైట్‌గా ఉంటుంది. ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదు. ఫ్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపథ్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. టి.అంజయ్య సమర్పణలో నిర్మితమైన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. నరేష్కుమార్, టి. శ్రీధర్. -
గ్యాంగ్ వార్
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముంబైలో ఆవిష్కరించారు. ఆర్.ఎస్. సురేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్ కథాంశమిది. ఇందులోని 5 ఫైట్స్ చాలా బాగుంటాయి. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాల సంగీత దర్శకుడు రవిశంకర్ అందించిన ఆర్ఆర్ మా సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ అంశాలున్న చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా నిర్మించాం. జూలైలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ వ్యంగ్యాస్త్రాలు
-
పవన్‌పై రాంగోపాల్ వర్మ సెటైర్
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ స్పందించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తనను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని వర్మ ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే అని, ఆయనను నిజంగా గెలిపించాలనుకునే ఓటర్లు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని పవన్‌కే ఓటు వేసేవారంటూ వర్మ సెటైర్ వేశారు. కాగా తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా ప్రత్యర్థులు కుట్ర పన్నారంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: (నన్ను అసెంబ్లీకి అడుగుపెట్టనీకుండా కుట్ర...) -
నా గదిని గర్ల్స్ హాస్టల్ చేసేశారు : వర్మ
సాక్షి, విజయవాడ : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను విద్యనభ్యసించిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించారు. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పుడు రెండు సంవత్సరాలు ఇదే గదిలో ఉండేవాడినని, దీనిని ఇప్పుడు గర్ల్స్ హాస్టల్‌గా మార్చారని ట్విటర్లో పేర్కొన్నారు. ఇదిగో ఈ లవ్లీ గర్లే ఇప్పుడు ఈ గదిలో రూమ్మేట్స్గా ఉంటున్నారు అంటూ వారితో దిగిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. నేను నిలుచుకున్న వెనకాలే శ్రీదేవి ఫొటో ఒకటి ఉండేది, దాన్ని నేనే అంటించాను అంటూ తన కాలేజీ స్మృతులను వర్మ గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వర్మ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రాహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వర్మతో పాటు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిని వర్మ ఎన్టీఆర్ ఆశీస్సులతో తన పంతం నెగ్గిందన్నారు. వర్మ, అగస్త్య మంజులు సంయుక్తంగా డైరెక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మే 31న ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల కానుంది. -
వర్మ ప్రెస్‌మీట్ నిరాకరణపై నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను మీడియా సమావేశం ని ర్వహించకుండా అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, విజయవాడ పోలీస్ కమి షనర్, విజయవాడలోని ఐలాపురం, నోవాటెల్ హోటళ్ల జనరల్ మేనేజర్లకు భారత ప్రెస్‌కౌన్సి ల్ (పీసీఐ) నోటీసులు జారీ చేసింది. 15 రోజు ల్లోగా దీనిపై రాతపూర్వక సమాధానమివ్వాల ని పీసీఐ కార్యదర్శి అనుపమా భట్నాటర్ ఆదేశించారు. గత నెల 26న విజయవాడలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడంపై ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజే యూ) సీనియర్ నాయకుడు, పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ పీసీఐకి ఫిర్యాదు చేశారు. పీసీఐ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు కార్య దర్శి అనుపమా తెలియజేశారన్నారు. ఇది భా వప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్పించడంతో పాటు ముందుస్తు సెన్సార్ షిప్ (ప్రీ సెన్సార్ షిప్) విధించినట్టుగా భావించాల్సి ఉంటుంద ని నోటీసుల్లో పీసీఐ పేర్కొన్నట్లు అమర్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాతలు మీడియా సమావేశం నిర్వహించకుండా అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పార్టీ, పోలీసుల ఒత్తిళ్ల కారణంగానే మీడియా సమావేశం నిర్వహించేందుకు హాలు బుక్ చేయడానికి కూడా రెండు హోటళ్లు నిరాకరించాయని అమర్నాథ్ తెలిపారు. -
వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం
-
తెలంగాణ తెస్తనంటే నవ్విండ్రు
సంచలనానికి కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. తీసే సినిమా, చేసే ట్వీట్, మాట్లాడే మాట... ఇలా ఆయన ఏం చేసినా సెన్సేషనే. ‘రక్తచరిత్ర’, ‘వంగవీటి’, లేటెస్ట్గా ‘లక్ష్మీస్: ఎన్టీఆర్’ సినిమాతో రియలిస్టిక్ స్టోరీస్ చెప్పడంలో వర్మ ది బెస్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇటీవల ఓ రౌడీషీటర్ బయోపిక్ (కోబ్రా) ద్వారా ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇవడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ‘కేసీఆర్’ బయోపిక్‌ను అనౌన్స్ చేశారు వర్మ. ‘టైగర్ కేసీఆర్: ది అగ్రెసివ్ గాంధీ’ అనేది టైటిల్. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనేది ట్యాగ్‌లైన్. టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి, వర్మ ట్వీటర్లో – ‘‘ఆంధ్రా వాళ్లు తెలంగాణ వాళ్లను థర్డ్ క్లాస్‌గా ట్రీట్ చేయడం తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. పక్క రాష్ట్రంలోని నాయకుల్లా కాకుండా కేసీఆర్, వైఎస్ఆర్ మాత్రమే వాళ్ల పిల్లలను వాళ్లలాంటి నాయకులుగా తయారుచేయగలిగారు. ట్యాగ్‌లైన్‌లో ‘ఆడు’ అనే పదాన్ని ప్రాబ్లమ్‌గా భావిస్తున్న వాళ్లకు కేసీఆర్ ఏం సాధించకముందు అతన్ని చిన్నచూపు చూసినవాళ్ల కోణంలోంచి పెట్టాను. కేసీఆర్, కేటీఆర్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. -
దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై ఫిర్యాదు
జగద్గిరి గుట్ట: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై బాచుపల్లిలోని కౌసల్యకాలనీకి చెందిన తెలుగుదేశం అభిమాని దేవీబాబు చౌదరి బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వైసీపీలో చేరుతున్నట్లు మార్ఫింగ్ ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమాపై న్యాయస్థానంలో కేసు వేసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా చేసింది కూడా తానేనని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.(వావ్ షాకింగ్ ట్విస్ట్ అంటున్న రాంగోపాల్ వర్మ) -
వావ్ షాకింగ్ ట్విస్ట్ అంటున్న వర్మ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముగిసినా ఫలితాలు వెలువడటానికి మే 23వ తేదీ వరకూ వేచి చూడాల్సి రావడంతో సోషల్ మీడియాలో.... రకరకాల వార్తలు, కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ పార్టీల గెలుపు, ఓటములపై నెటిజన్లు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. అయితే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏకంగా ఓ అడుగు ముందుకేశారు. ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు (చంద్రబాబు మెడలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పిన) ఓ మార్ఫింగ్ ఫోటోను రాంగోపాల్ వర్మ షేర్ చేశారు. ’వావ్ షాకింగ్ ట్విస్ట్, వైఎస్సార్ సీపీలో చేరిన సీబీఎన్’ అని క్యాప్షన్ పెట్టారు. Wowwww in a shocking twist, just now CBN joined YSRCP. pic.twitter.com/wmY0VMzZJn — Ram Gopal Varma (@RGVzoomin) 13 April 2019 అంతేకాకుండా ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సంబంధించిన ఓ వీడియోను కూడా వర్మ షేర్ చేశారు. కేఏ పాల్ ఓటు వేసి...పోలింగ్ బూత్ నుంచి బయటకు పరుగెత్తుకుంటూ రోడ్డు మీదకు వచ్చి డాన్స్ చేయడం...ఆయన వెనుక భద్రతా సిబ్బంది పరుగులు తీస్తున్న వీడియోను షేర్ చేసి... ‘గొలుసు వేసి కట్టేయకపోతే కరుస్తాడేమో’ అని వ్యాఖ్యానించారు. Golusesi katteyyaka pothey karusthaademo? 🙄🙄🙄 pic.twitter.com/5MnpiIX24r — Ram Gopal Varma (@RGVzoomin) 13 April 2019 -
ఆర్టిస్ట్ ఆర్జీవి
నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టడం రామ్‌గోపాల్ వర్మకు క్లాప్‌బోర్డ్‌తో పెట్టిన విద్య. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఆర్జీవి ఆర్టిస్ట్ కాబోతున్నారు. ఇన్నాళ్లు యాక్షన్ అంటూ నటీనటులకు చెప్పిన ఆయన యాక్షన్ చేయబోతున్నారు. ఆర్జీవి గన్‌షాట్ ఫిల్మ్ బ్యానర్లో వస్తున్న ‘కోబ్రా’తో వర్మ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆర్ పాత్రలో కనిపిస్తారు. ఇందులో సీయం కేసీఆర్ పాత్ర కూడా ఉండటం విశేషం. వర్మతో పాటు ఆగస్త్య మంజు దర్శకత్వం వహించనున్నారు. కీరవాణి స్వరకర్త. -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్‌ను బిఫోర్ ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్‌గోపాల్‌వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్‌కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్‌లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్‌గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్‌లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్‌లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్‌మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్‌గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్‌ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్‌గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
వర్మచెప్పిన ఎన్టీఆర్ కథ
ఎన్టీఆర్ జీవితంలో వెన్నుపోట్ల వెనుక ఉన్న కథను ప్రేక్షకులకు చెప్తానని ప్రకటించిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తాను అనుకున్నది చేసి చూపించాడు. ఎన్టీఆర్ జీవితంలో అందరికీ తెలియాల్సిన క్రూరపథకాలు ఉన్నాయని ఈ సినిమాతో చెప్పాడు. పత్రికలు ఈ విషయాలను ఎప్పుడూ రాయలేదని తొక్కిపెట్టాయని చాటింపు వేశాడు. నిజం నివురుకప్పి ఉన్నా ఎప్పుడో ఒకసారి అగ్నిని వెదజల్లుతుందని ఈ సినిమాతో తేల్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న కష్టకాలాన్ని, దుఃఖకాలాన్ని, ఆయనను క్షోభకు గురి చేసిన కాలాన్ని ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో తెర మీదకు తీసుకువచ్చి గతకాలపు జర్నీ చేయించాడు. వర్తమానం పట్ల ప్రేక్షకులకు ఆలోచన కలిగించాడు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో మినహా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం భారీ ఓపెనింగ్స్‌తో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (ట్యాగ్ లైన్ అసలు కథ) విడుదలైంది. ఏపీలో విడుదల కోర్టు పరిధిలో ఉంది. కథ విషయానికొస్తే... ఇది ఎన్టీఆర్ కథనా లేదా లక్ష్మీ పార్వతి కథనా లేదా లక్ష్మీపార్వతికి తెలిసిన ఎన్టీఆర్ కథనా లేక లోకానికి తెలియని ఎన్టీఆర్ కథనా అనేది సినిమా చూశాకనే ప్రేక్షకులకు తెలుస్తుంది. నిన్నమొన్న వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు (కథానాయకుడు, మహానాయకుడు) వదిలిపెట్టిన అనేక విషయాలు ఈ సినిమాలో కనిపించాయని ప్రేక్షకులు అనుకుంటారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే అభిమాని ఎంటరైనప్పటి నుంచి ఎన్టీఆర్ మరణించే వరకు జరిగిన సంఘటనలు ఈ సినిమాలో ప్రధాన కథ. సినిమా కథ ప్రకారం ‘మనదేశం’ పార్టీ స్థాపించి తెలుగువారి విజేతగా నిలిచిన ఎన్టీఆర్ (సినిమాలో నటుడు విజయకుమార్) 1989లో మొదటిసారి ఓడిపోయినప్పుడు చేదు పరిస్థితులు ఎదుర్కొంటాడు. సొంత కుటుంబం, తను నిర్మించుకున్న రాజకీయ కుటుంబం ఒక్కసారిగా దూరం కావడంతో పలకరించే దిక్కు లేక ఇక రాజకీయాలు వద్దు, జీవితాన్ని ఏదో ఒకలా బతికేస్తానని అనుకుంటాడు. ఆ సమయంలో ఆయన జీవితంలోకి వస్తుంది లక్ష్మీపార్వతి (నటి యజ్ఞా శెట్టి). ఆయన జీవిత చరిత్రను రాయడమే తన జీవితాశయమని చెప్పి ఎన్టీఆర్ మనసు ఆకట్టుకుంటుంది. ‘మీరు మామూలు మనిషి కాదు స్వామీ, మీలో చాలా గొప్ప శక్తి ఉంది’ అని ఆయన్ని ఉత్తేజపరుస్తుంది. అలా అడుగుపెట్టిన ఆమె రోజురోజుకూ∙ఆయన జీవితానికి ఎంత దగ్గరయిందీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ ఆమెని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ కథలో చూపిస్తారు. ఇదంతా ఫస్ట్‌హాఫ్‌లో ఉంటుంది. అయితే వారి బంధాన్ని అప్పటి మీడియా సహకారంతో ఎన్టీఆర్ అల్లుడైన బాబు (సినిమాలో శ్రీతేజ్) లక్ష్మీపార్వతిపై విషం చిమ్మడంతో కథపై పట్టు బిగియటం సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరపున రాయబారిలా ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన బాబు మీరు చేస్తున్నది తప్పు అని ఎన్టీఆర్‌ను హెచ్చరిస్తాడు. అప్పటి నుంచి బాబుని దూరం పెడతాడు ఎన్టీఆర్. ఆ టైమ్‌లో ఎన్టీఆర్‌ని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా చేయమని అడుగుతాడు ఒక ఆత్మీయ నటుడు. ఆ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఆ సినిమా 100 రోజుల వేడుక తిరుపతిలో భారీగా చేస్తున్నానని ఆ నటుడు ఆహ్వానితుల జాబితాని ఎన్టీఆర్‌కి చూపిస్తాడు. ఆ జాబితాలో లేని లక్ష్మీపార్వతి పేరుని ఎన్టీఆర్ స్వయంగా రాస్తాడు. అది తెలుసుకున్న బాబు ఎలాగైనా ఆ సభకి ఆమె రాకుండా అడ్డుకునేందుకు కుటుంబ సభ్యులందర్నీ ఎన్టీఆర్ వద్దకు తీసుకొచ్చి, ఆమె సభకి వచ్చినా ఫర్వాలేదు కానీ, స్టేజ్‌పైకి రానివ్వద్దని ఆంక్షలు విధిస్తాడు. సరేనన్న ఎన్టీఆర్ తిరుపతి సభలో ఆమె గురించి ప్రస్తావించడమే కాక ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తాడు. దాంతో కుటుంబ సభ్యులతో పాటు అందరూ నివ్వెరపోతారు. అక్కడి నుంచి బాబు తన రాజకీయ చదరంగాన్ని ప్రారంభిస్తాడు. ఆమెను అనేకసార్లు దూషించిన బాబు ఆమెకే ఫోను చేసి, సంధి చేసుకుని ఎన్టీఆర్‌కి మళ్లీ దగ్గరవుతాడు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ తన చరిష్మాతో అత్యధిక సీట్లు గెలుచుకుని సీఎంగా పగ్గాలు చేపడతాడు. ఇది ఓర్వలేని బాబు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం ఎలాంటి కుట్రలు పన్నాడు? ఎంతమందిని పావులుగా వాడుకున్నాడు? మీడియాని ఎలా హస్తగతం చేసుకున్నాడు? సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ని ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ప్రీ క్లైమాక్స్. సినిమాలో వైశ్రాయ్ ఉదంతాన్ని ఎమోషనల్‌గా చూపించాడు వర్మ. 74 ఏళ్ల వయస్సులో ఒక సీఎం పదవిలో ఉండి ఎంతో జీవితాన్ని చూసిన ఎన్టీఆర్ ఏడుస్తూ ఉండే సంఘటన చూసిన ఎవరైనా చలించిపోతారు. ‘సొంత కొడుకులు, సొంత కూతుళ్లు, అల్లుళ్లు, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు నన్ను వెన్నుపోటు పొడిచారు. చెప్పులతో దాడి చేశారు. ఆ సంఘటన జరిగిన రోజునే నేను చచ్చిపోయాను లక్ష్మీ’ అని ఎన్టీఆర్ అంటారు. విశ్లేషణ ఇది దర్శకుడు వర్మ తాను పరిశోధించి తాను యదార్థమని తలిచి చెప్పిన కథ. ఎన్టీఆర్ వంటి ఓ గొప్పనాయకుడు ఎందుకు ఒంటరివాడయ్యారు? ఆ సమయంలో లక్ష్మీ పార్వతికి ఎలా దగ్గర అయ్యారు? వారి మధ్య ప్రేమ చిగురించడానికి దారితీసిన సంఘటనలు ఏంటి? లక్ష్మీపార్వతి మీద ఎన్టీఆర్ కుటుంబం ఎలాంటి కుట్రలు చేసింది? ఆ కుట్రలకు ముఖ్య కారకులు ఎవరు? ఎన్టీఆర్ మరణానికి కారణమైన వెన్నుపోటు వెనక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? వంటి అంశాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేట్టు చూపించారు. ఎవరెలా చేశారంటే... పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎన్టీఆర్ పాత్ర చేసిన రంగస్థల నటుడు పి.విజయ్ కుమార్ ఆహార్యం, హావభావాలు, డైలాగ్ డెలివరీ అచ్చం ఎన్టీఆర్‌ను తలపించింది. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పట్ల ప్రేమ, అమాయకత్వం, బాధ, వేదన, అవమాన భారం.. ఇలా అన్ని భావాలను అద్భుతంగా పలికించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. వెన్నుపోటు రాజకీయాలు చేసే కుటిల రాజకీయ నాయకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించే లా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల పనితీరు... నిజజీవిత కథలను తెర మీద మలచడం వర్మకు బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఆయన తీసిన ‘రక్తచరిత్ర‘, ‘కిల్లింగ్ వీరప్పన్’, ‘వంగవీటి’ తదితర చిత్రాలు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో వర్మ ఈ కథను నడిపారు. ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ పాయింట్. రమ్మీ అందించిన ఫోటోగ్రఫీ చాలా కొత్తగా ఉంది. డైలాగులు... ► నా 70 ఏళ్ల జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం.. ► పాముకు పాలుపోసి పెంచినా అది విషంతోనే కాటేస్తుంది.. వాడూ అంతే... ► జీవితం ఎప్పుడు ఎందుకు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు ► మీరు నా పిల్లలు అయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా ఛీ.. ► తమ్ముళ్లూ.. వాడి మాట వినకండి.. మీకు నేనున్నా.. ధైర్యంగా బయటకు రండి ► ఇక పార్టీలో ఏ నిర్ణయమైనా నాకు తెలీయకుండా జరగడానికి వీల్లేదు. ► అబద్ధానికి నోరు పెద్దది.. అన్యాయానికి చేతులు పెద్దవి. తారాగణం: విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్ దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు నిర్మాత: రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి సంగీతం: కల్యాణీ మాలిక్ -
మరోసారి ఎన్టీఆర్‌గారికి వెన్నుపోటు పొడిచారు
‘‘ఎన్టీ రామారావుగారికి మరొక్కసారి వెన్నుపోటు జరిగింది. ఎందుకంటే.. అప్పట్లో ‘సింహగర్జన’ సభ పెట్టుకోకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురి చేసి చంపేశారు. ఇవాళ ఆయన మీద తీసిన సినిమా రిలీజ్ కానివ్వకుండా కుట్ర చేసి మళ్లీ వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు రామారావుగారికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. ఆయన కుటుంబం, పార్టీ కార్యకర్తలు అందరూ వెన్నుపోటు పొడిచారు. కానీ ఇవాళ మేమందరం రాజ్యాంగ హక్కుల ద్వారా ఆయన సినిమా రిలీజ్ చేయిస్తాం. మాకు కచ్చితంగా విజయం దక్కుతుంది అనుకుంటున్నాను. ఎన్టీఆర్‌గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి ముఖ్యపాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీర్’. ఏ జీవి, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి, దీప్తీ బాలగిరి నిర్మించారు. ఈ చిత్రం నిన్న ఆంధ్రప్రదేశ్ మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఏపీలో రిలీజ్ ఆపమని హై కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కప్రాంతం మినహా సినిమా రిలీజ్‌ని ఆపడమనేది కరెక్ట్ కాదు. ఏ దర్శకుడైనా సినిమా తీసేది ప్రేక్షకుడికి చూపించడానికే. కొందరు చూడటానికి వీలు లేదు అని చెప్పడం అన్యాయమే కదా? అందరికీ సినిమా చూడాలనే కోరిక ఉంది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో చూడకూడదంటే ఎలా? ఒక్కచోట రిలీజ్ అయితే అన్నిచోట్లా సినిమా రిలీజ్ అయినట్టే. సోషల్ మీడియా వల్ల మొత్తం తెలిసిపోతుంది. సినిమాను ఆపాలనుకుని ప్రయత్నిస్తే వాళ్లకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ►ఓ డెమోక్రటిక్ కంట్రీలో రియలిస్టిక్ మూవీ తీసినప్పుడు మీరు చూడకూడదని ఆపేయడం కరెక్ట్ కాదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమాను నిర్మించిన రాకేష్ రెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని నాకు తెలియదు. ఒకవేళ తెలిసుంటే సినిమా తీయనని చెప్పడం లేదు. ఈ సినిమా వైసీపీకి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ల మనిషిని ఎందుకు నిర్మాతగా పెడతారు. ఆ డబ్బేదో నాకే ఇస్తారు కదా? లేకపోతే ఊరూ పేరూ లేని వాళ్లతో తీయిస్తారు. సినిమాలో ఉన్న నిజానిజాలు బయటకు రాకూడదన్నది వాళ్ల భయం తప్పితే ఎవరు తీశారన్నది సమస్యే కాదు. ►ఎన్టీఆర్‌గారి జీవితంలో జరిగిన కథ అందరికీ తెలుసు. ఆ సంఘటనలను ఏ విధంగా చూపించాలా అనే ఎగై్జట్‌మెంట్‌తో ఈ మూవీ స్టార్ట్ చేశాను. ఎన్టీఆర్‌గారు చక్రవర్తిలా బతికారు. వైస్రాయ్ ఘటన జరిగినప్పటి నుంచి చనిపోయేవరకు ఆయన పడ్డ మానసిక వేదనకు నేను బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ►డెమోక్రసీలో ఉన్నప్పుడు మన అభిప్రాయాలను చెప్పే హక్కు మనందరికీ ఉంది. ఈ మధ్య ‘పద్మావత్’, ఉడ్తా పంజాబ్’ సినిమా సమయాల్లో సుప్రీమ్ కోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చాక ఆ సినిమాను ఆపే హక్కు ఎవ్వరికీ లేదు అన్నది దాని సారాంశం. కానీ ఊహించని విధంగా మా సినిమా రిలీజ్‌పై స్టే రావడం సర్ప్రైజ్. సాధారణంగా కోర్టులు నిష్పక్షపాతంగా ఉంటాయి. కోర్టుపై ఒత్తిడి ఎవరు తెచ్చి ఉంటారో మనందరికీ తెలుసు. నేను పేర్లు చెప్పకపోవడం ధైర్యం లేకపోవడం కాదు. నేను చెప్పినా చెప్పకపోయినా దీని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు కాబట్టి. ►కోర్టువాళ్లు ఆదేశించిన విషయాన్ని గౌరవిస్తూ సినిమాను ఆపేశాం. వేరే కోర్టును ఆశ్రయించడానికి మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. నిర్మాత రాకేశ్ రెడ్డిగారు ఆ పనిలో ఉన్నారు. వీలున్నంత త్వరగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విడుదలయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందరికీ సినిమాను ఒకేసారి చూపించాలనుకుంటాం. కుదరకపోతే వాళ్లు అప్పుడూ గెలిచిట్టే, ఇప్పుడూ గెలిచినట్టే. ప్రేక్షకుడు నిజం తెలుసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పడానికి, రిలీజ్ అయిన థియేటర్స్‌లో వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్సే నిదర్శనం. ఎన్టీఆర్‌గారి జీవితం తుది దశలో ఏం జరిగిందో తెలుసు కోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. నిజం ఇవాళ బయటకు వచ్చింది. కొందరికి ఇవాళ తెలుస్తుంది. కొందరికి రేపు. కానీ అందరికీ కచ్చితంగా తెలుస్తుంది. దర్శకుడిగా మనం ఎలాంటి కథ చెబుతున్నాం అన్న విషయాన్ని బట్టి సీరియస్‌నెస్ వస్తుంది. నేను చెబుతున్నది ఎంతో చరిత్ర కలిగి ఉన్న రామారావుగారి కథ. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లక్ష్మీ పార్వతిగారికి, ఎన్టీఆర్‌గారికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? ఆ బంధాన్ని ఉపయోగించుకొని కొందరు రాజకీయ కుట్ర ఎలా నడిపించారు? ఆయన్ను ఎలాంటి మానసిక క్షోభకు గురి చేశారు? అనే అంశాలను చూపించాం. శేఖర్‌కపూర్ తీసిన ‘బాండిట్ క్వీన్’ సెన్సార్ సమస్యలు ఎదుర్కొంది. సెన్సార్ వాళ్లు చాలా కట్స్ చెప్పారు. ఆ తర్వాత రివైజింగ్ కమిటీకు వెళ్తే వాళ్లు సినిమా బ్యాన్ చేయాలన్నారు. దాన్ని దాటి పైదానికి వెళ్తే ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ చేసుకోండి అని చెప్పారు. మూడు కమిటీలు. మూడు భిన్న అభిప్రాయాలు. సినిమా రిలీజ్ అయింది. మళ్లీ ఎవరో కేస్ వేశారు. కేసు సుప్రీమ్ కోర్టుకు వెళ్లింది. కోర్టు సినిమా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. ►నిజం అనే దానికి ప్రత్యేకమైన అర్థం లేదు. సరైన వీడియో ప్రూఫ్ లేనప్పుడు నిజాన్ని నిర్ధారించలేం. ఆ సమయంలో నేనూ లేను, మీరూ లేరు. 25 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. అప్పుడు ఉన్నవాళ్లను అడిగినా కూడా వాళ్లకు అనుకూలంగానే చెబుతారు. నిజం అనేది నమ్మేట్టుగా ఉండాలి. ఒకవేళ కాదు అంటే ఆల్టర్నేటివ్ ఏంటి అనేది చెప్పగలగాలి. అలా చెబితే మీ సినిమా మీరు తీసుకోండి. నేను రీసెర్చ్ చేసి, అందులో తెలుసుకున్న నిజాలను మనస్ఫూర్తిగా నమ్మి తీసిన సినిమా ఇది. ►హై కోర్టు కౌన్ కిస్కా వాళ్ల మాటలు వినదు కదా. స్టే ఎత్తేయడానికి సుప్రీమ్ కోర్టుకు వెళ్లాం. ప్రాసెస్‌లో ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని జోస్యం చెప్పలేను. ఎందుకంటే నేను కోర్టు నడపను, ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రినీ కాదు. ప్రధాన మంత్రిని కూడా కాదు. ఫైట్ చేస్తాం. ►ప్రతీ సినిమాకో సీజన్ ఉంటుంది. సంక్రాంతి, సమ్మర్, దసరా ఇలా. మా సినిమాలో పొలిటికల్ క్యారెక్టర్స్ ఉండటం వల్ల సినిమాకు హైప్ తీసుకురావడానికి ఎలెక్షన్ టైమ్ ఎంచుకున్నాం తప్పితే ప్రేక్షకులను ప్రేరేపించాలనే ఉద్దేశమే లేదు. ►సినిమా ఓ ఎమోషన్ తీసుకొస్తుంది. అది చూసి ఇలా జరిగిందా? అని నమ్మితే మీకు అంతకుముందు ఆ నాయకుల మీద ఉన్న ఇంప్రెషన్ పోవచ్చు. ఎన్నికల ముఖ్య ఉద్దేశం నమ్మకమే. సినిమా వల్ల ఆ ప్రభావం కొంత పడొచ్చు. ఎంత పడుతుంది, ఏ రేంజ్లో పడుతుందో చెప్పలేను. సినిమాకు వస్తున్న స్పందన పట్ల 100 శాతం సంతృప్తి చెందాను. ‘ఎన్టీఆర్‌గారికి నిజమైన వారసుడు మీరే’ అని నాకు ఎవరో ఓ మెసేజ్ పంపారు. అదే నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాను కథకుడిగా తీశా. సినిమా డబ్బుతో కూడుకున్నది కాబట్టి వ్యాపారంగానే తీశాను. రాజకీయంగా మాత్రం తీయలేదు. నిర్మాత రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ... ‘‘ఇవాళ తెలుగువారందరికీ శుభదినం. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్లకు బ్లాక్ డే. ఈ సినిమా ఏపీలో రిలీజ్ కాదని మేం ఎవ్వరూ ఊహించలేదు. వర్మగారి దమ్ము, ధైర్యాలు అందరికీ తెలిసిందే. సినిమాలో నిజం ఉంది కాబట్టే వాళ్లు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. న్యాయం గెలుస్తుంది. కొందరు స్వలాభం కోసం ఇలా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. బడ్జెట్ ఎంత? వచ్చే డబ్బెంత? అని కాదు. వెయ్యి కోట్లకు సరి పడా పేరు వచ్చింది. -
వైశ్రాయ్ ఘటనే పెద్ద కుట్ర
‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయాలనుకున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 29న విడుదల చేస్తున్నాం. సెన్సార్ సమస్య వల్ల విడుదల వాయిదా పడలేదు. మా సినిమా విడుదలకు కోర్టు, ఎలక్షన్ కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. ఎన్నికలు అయిపోయేవరకూ మా చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వరంటూ మాకు సమాచారం అందడంతో బోర్డుపై కేసు పెట్టాలనుకున్నాం. అయితే అలాంటిదేమీ లేదని తెలియడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం’’ అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. విజయ్ కుమార్, యజ్ఞాశెట్టి లీడ్ రోల్స్‌లో రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వర్మ పంచుకున్న విశేషాలు... బాలకృష్ణకి అంకితం ఎన్టీఆర్‌గారి బయోపిక్ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్లో సినిమా ఆగిపోయింది. అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు. అందుకే గతంలో ప్రెస్మీట్లో చెప్పినదే మళ్లీ చెబుతున్నా.. ఈ సినిమా బాలకృష్ణకే అంకితం. నా కెరీర్లో చాలా ప్రత్యేకం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నా కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని ఎందుకు అంటున్నానంటే.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన తెలుగు వ్యక్తి ఎన్టీఆర్‌గారు. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారాయన. అలాంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఎక్స్ట్రీమ్ ట్రాజెడీని తెరకెక్కించడం డిఫికల్ట్, ఎమోషనల్ టాస్క్. దాన్ని జస్టిస్ చేయడం చాలా పెద్ద బాధ్యత. దాన్ని గుర్తు పెట్టుకునే ఎన్టీఆర్‌గారి వ్యక్తిత్వానికి ఏమాత్రం అగౌరవం కలగకుండా ఈ సినిమా తీశా. నేను నమ్మిన నిజంతో... ‘వైశ్రాయ్ హాటల్’ సంఘటన జరిగినప్పుడు నేను ‘రంగీలా’ సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు. ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్‌లైట్‌లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తీశా. నా మాటను నమ్మని వాళ్లకు సినిమాటిక్‌గా అనిపించవచ్చు. ఈ సినిమా చూశాక ‘ఇలా జరగలేదు’ అనుకుంటే వారు నమ్మినదాన్ని సినిమా తీసుకోవచ్చు. నిజం బయటకు వస్తుందని భయం మాఫియా నేపథ్యంలో బాలీవుడ్లో సినిమాలు తీసినా వివాదాలు లేవు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో మాత్రం వివాదాలు రావడానికి కారణం నిజం బయటకు వస్తుందని, ఇంతకు ముందెప్పుడూ తెలియని నిజాలు ఇప్పుడు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయేమోననే భయం. అందుకే సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అవతలివారి దగ్గరే నిజం ఉంటే, సినిమాని ఆపడానికి ఎందుకు ప్రయత్నించాలి? లక్ష్మీపార్వతిగారు వచ్చాకే... ఈ సినిమాని లక్ష్మీపార్వతిగారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు. ఎన్టీఆర్‌గారి జీవితంలోకి ఆమె వచ్చినప్పటి నుంచే సినిమా తీశా. ఆమె పైన చాలా అభియోగాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్గారిలాంటి సూపర్‌స్టార్‌కి మామూలు వాళ్లు దగ్గరవలేరు కదా? అంటే ఆమెలో ఏదో ప్రత్యేకం ఉందనేగా? ఈ చిత్రంలో నాదెండ్ల భాస్కరరావుగారి ఎపిసోడ్ ఉండదు. అందుకే కొత్తవారితో... రియలిస్టిక్ క్యారక్టర్లను పెద్దగా ఫేమస్ కానివారు చేసినప్పుడు ఆ పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయని నా నమ్మకం. అందుకే ‘వీరప్పన్, వంగవీటి’ చిత్రాలను కూడా కొత్తవాళ్లతోనే చేశా. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో విజయ్‌కుమార్ చక్కగా ఒదిగిపోయారు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆయన రెండు నెలలు వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌గారిని మనం సినిమాల్లోనూ, పొలిటికల్ స్పీచుల్లోనే చూశాం. కానీ, ఆయన లివింగ్ రూమ్‌లో, బెడ్రూమ్లో వ్యవహరించిన తీరు పట్టుకోవడమంటే ఏ నటుడికైనా ఒక ట్రెమండస్ ఎమోషనల్ డెప్త్‌ను కేప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆయన చాలా బాగా చేశారు. యజ్ఞాశెట్టి కన్నడ నటి. ఏ పార్టీకీ సపోర్ట్ కాదు ఈ సినిమా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనడం అవాస్తవం. మనం ఏం చెప్పినా అవతలివాళ్లు ఏది నమ్మాలనుకుంటే దాన్నే నమ్ముతారు. నిర్మాత రాకేష్‌రెడ్డి వైసీపీ అని ముందు నాకు తెలియదు.. తెలిసినా నేను ఏమీ అనేవాడిని కాదు.. అది వేరే విషయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎలా ఉంటుంది? అవి అవాస్తవాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఆపేస్తే రూ. 50 కోట్లు ఇస్తామని నిర్మాతకి ఆఫర్ వచ్చిందనేమాట అవాస్తవం. నేను సినిమా మేకర్ని. కష్టపడి ఓ సినిమా చేసినప్పుడు దాన్ని రిలీజ్ చేయాలనే అనుకుంటా. అంతేకానీ విడుదల చేయకూడదనుకోను. సినిమాను విడుదల చేయొద్దని డిస్ట్రిబ్యూటర్లకు బెదిరింపులు వచ్చాయనడం కూడా తప్పు. అవన్నీ యూట్యూబ్ చానళ్లలో వచ్చిన విషయాలు. ఏది అబద్ధమో? నాకు చంద్రబాబు మూలాన నష్టం జరగలేదు.. వైఎస్ జగన్ వల్ల లాభం కూడా లేదు. అటువంటప్పుడు బాబుగారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీయాల్సిన అవసరం ఏముంది?. ఎన్టీఆర్‌గారి బయోపిక్ గురించి నేను బాలకృష్ణని కలిశాను. కానీ, ఆయన నన్ను కలవలేదంటున్నారంటే.. ఆయన చెప్పింది అబద్ధమై ఉండాలి. లేదంటే నేను చెప్పిందైనా అబద్ధం అయి ఉండాలి. దేన్ని నమ్ముతారో మీ ఇష్టం (నవ్వుతూ). చంద్రబాబుగారే విడుదల చేయిస్తారు ఇది ప్రజాస్వామ్య దేశం. ఒకరి భావ స్వేచ్ఛను అడ్డుకునే హక్కు మరొకరికి లేదు. మా సినిమాని ఆపడం 100శాతం ఎవరి వల్లా కాదు. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రి కనుక లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా మా సినిమాని ఏపీలో ఆయనే విడుదల చేయిస్తారు. నాకు చాలా వ్యసనాలున్నాయి వివాదాల వల్ల వచ్చే పబ్లిసిటీ నాకు వ్యసనం అయిపోయిందనే మాట ఉంది. నాకు ఉన్న చాలా వ్యసనాల్లో ఇది కూడా ఓ వ్యసనమైనా పర్వాలేదు. నా కెరీర్లో 90శాతం ఔట్ ఆఫ్ ద బాక్స్ కాంట్రవర్శీలను తీసుకునే సినిమాలు చేశా. ‘సర్కార్, రక్తచరిత్ర, వంగవీటి’... ఇలా ఏదైనా అలాంటిదే. ‘కథానాయకుడు’ చూశా బాలకృష్ణ ‘కథానాయకుడు’ సినిమా చూశా. అందులో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పడానికి నేనెవరిని? అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ లేకుండా సీన్లను పేర్చారనిపించింది. అది కరెక్ట్ కాదు ఆడియన్స్ ఎక్కువగా నెగటివిటీని ఇష్టపడతారనడం కరెక్ట్ కాదు. సినిమాలో ఫండమెంటల్‌గా ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అనేది మెయిన్. గాంధీ సినిమా చేస్తున్నామని చెప్పి బ్రిటీష్‌ని అందులో నుంచి తీసేస్తే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ ఉంటుంది? సినిమా అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? ఏ స్కూల్‌కి వెళ్లారు? ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అన్నది కాదు. బ్రిటీషర్ల రాకతో సినిమా ఆపేస్తే ఎలా ఉంటుంది? ఓటర్లకు అవగాహన ఉంటుంది నాయకులు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చిన విధానంపై ఓటర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఆ నమ్మకంతోనే వారికి ఇష్టమైన వ్యక్తికి ఓటు వేస్తారు. వారు బాగా నమ్మిన వ్యక్తి గురించి సడన్‌గా ఏదో తెలిసి నమ్మకం పోగొట్టుకున్నారనుకోండి.. ఏ మేరకు సాధ్యమవుతుంది? అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందనే విషయం నాకు తెలియదు. ముందుపోటు పొడుస్తా... నేను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు. ఎప్పుడూ ముందుపోటే పొడుస్తా. నేను జ్యోతిష్కుడిని కాదు ఆంధ్రప్రదేశ్‌కి కొత్త ముఖ్యమంత్రి ఎవరని చెప్పడానికి నేను జ్యోతిష్కుడిని కాదు. కాకపోతే ఎవరు వచ్చినా ఫరక్ పడదు. మార్పు అనేది ప్రాసెస్‌లో రావాలేగానీ, ఎన్నికలతో జరుగుతుందని అనుకోను. కాకపోతే సీఎంగా ఒక చాయిస్ పవన్ కల్యాణ్, మరో చాయిస్ కేఏ పాల్. పవన్ కల్యాణ్ మంచి అందగాడు. తనొస్తే అందమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు మధ్యలోని సినిమా పేజీల్లో చూసే అతని ఫొటో ముఖ్యమంత్రి అయితే రోజూ మొదటి పేజీలో చూడొచ్చు. కేఏ పాల్ ముఖ్యమంత్రి అయితే ప్రతి రోజూ కామెడీనే. రూ.200 పెట్టి కామెడీ సినిమా చూడాల్సిన అవసరం ప్రజలకు రాదు. ఆయన గతంలో నన్ను ముంబైలో కలిశారు. మనిషి పుట్టి దాదాపు 60వేల ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేఏ పాల్ అంత అబద్ధాలు చెప్పేవారిని నేనెప్పుడూ చూడలేదు. కేసీఆర్ బయోపిక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నా. ఇందులో వివాదాలేమీ ఉండవు. త్వరలోనే వివరాలు చెబుతా. నేను తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో ఒకటి సెప్టెంబరులో విడుదల అవుతుంది. చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు ఎన్టీఆర్‌గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్ హోటల్ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప ఎన్టీఆర్‌గారిని పెద్దగా కలిసింది లేదు. సీబీఎన్ (చంద్రబాబునాయుడు), రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన ‘వైశ్రాయ్’ కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు. వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా తీస్తున్న టైమ్‌లో ‘ఇ లాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది’ అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను (నవ్వుతూ).. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్లో ఉన్నప్పుడు వార్నింగ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మనం లీగల్‌గా కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ఏదీ కష్టం కాదు. -
ఆ వార్తల్లో నిజంలేదు
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేష్ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎవరో కొన్నారంటూ ఆన్లైన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, అవన్నీ కేవలం పుకార్లే అని నిర్మాతలు కొట్టిపారేశారు. ‘‘ఎవరికి, ఎంత ఖరీదుకి ఫైనల్ చేయబోతున్నారన్న వివరాలు రామ్‌గోపాల్ వర్మ, రాకేష్ రెడ్డిలు త్వరలోనే తెలియజేస్తారు. మా చిత్రాన్ని ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ‘‘మా సినిమా ట్రైలర్, ఓ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చూస్తుంటే సినిమా క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవీ యూట్యూబ్ చానల్లోనే కోటిమందికిపైగా చూశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ‘నీ ఉనికి...’ పాటని 30 లక్షల మందికిపైగా చూశారు. వీటన్నిటినీ చూస్తుంటే మా సినిమాకి థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టడం ఖాయం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: రమ్మీ, సంగీతం: కళ్యాణ్ కోడూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్య చౌదరి. -
సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ : వర్మ
సాధారణంగా బయోపిక్ అంటే, జీవితంలోని అన్ని విషయాలూ కాకపోయినా ముఖ్యమైన విషయాల్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అయితే స్వర్గీయ ఎన్టీఆర్‌పై ఏకకాలంలో బయోపిక్‌లు వస్తుండటంతో వీటిల్లో ఏది యధార్థానికి దగ్గరగా ఉంటుంది అనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్‌పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ వర్మ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లలో ఏది నిజాయితీతో, యధార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్న చిత్రం అంటూ వర్మపెట్టిన పోల్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. వర్మ పోల్‌కు 41, 734 ఓట్లు రాగా, అందులో 85 శాతం లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఓటు వేయగా, కేవలం 15 శాతం నెటిజన్లు మాత్రమే మహానాయకుడుకు బాసటగా నిలిచారు. ఈ పోల్ రిజల్ట్‌ను పోస్ట్ చేస్తూ సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. Which film will be more honest and truthful ? — Ram Gopal Varma (@RGVzoomin) February 17, 2019 ఇక ఇప్పటికే వచ్చిన కథా నాయకుడు రిలీజ్ తర్వాత... అది వాస్తవాలకు దూరంగా ఉందని భావించిన ప్రజలు వర్మ మూవీ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. మహానాయకుడులో వెన్నుపోటు ఎపిసోడ్‌ని మేనేజ్ చేసి ఉంటారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన ఆ భాగం చూపించకపోతే, అదసలు అన్నగారి చరిత్రే కాదనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ఓ ఎజెండాతో అసలు విషయాన్ని పక్కన పెట్టినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఎన్టీఆర్స్ లక్ష్మి
‘మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వుసువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలై మనసును తాకితేనీ పిలుపేమో అలికిడి... పులకింత నీ తాకిడి’ (లక్ష్మీపార్వతి రాసిన కవితల్లో ఎన్టీఆర్‌కి ఇష్టమైన కవిత) ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో రామ్‌గోపాల్ వర్మ ఏం చూపించబోతున్నారో విడుదలైతే కానీ తెలీదు. లక్ష్మీపార్వతిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం ఆమెలో ‘ఎన్టీఆర్స్ లక్ష్మి’ కనిపించారు. హైదరాబాద్, ఫిల్మ్‌నగర్‌లోని లక్ష్మీపార్వతి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నవ్వుతూ పలకరించింది. ఆ పక్కనే ఒక కుర్చీలో యువకుడిగా ఉన్నప్పటి ఎన్టీఆర్ ఫొటో. గోడలకు మిడిల్ ఏజ్‌లో ఉన్న ఎన్టీఆర్ పెయింటింగ్, మరో వైపు ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి పెళ్లి ఫొటో ఉన్నాయి. ఆ ఇంట్లో ఎటు చూసినా ఎన్టీఆరే. గుంటూరు జిల్లా పొన్నూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పచ్చల తాడిపఱు. అది లక్ష్మీపార్వతి సొంతూరు. కృష్ణాజిల్లా, గుడివాడకు పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది నిమ్మకూరు. అది ఎన్టీఆర్ సొంతూరు. ఈ రెండు ఊర్లకు మధ్య ఓ మధురమైన బంధం దేశ రాజధాని న్యూఢిల్లీలో మొగ్గ తొడిగింది. ఆ ఆత్మసఖునితో తనకు ఏర్పడిన బాంధవ్యాన్ని, అనంతర కాల జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు లక్ష్మీపార్వతి. తొలి తలపు సందర్భం ‘‘నా జీవితంలో ముఖ్యమైనవి నాలుగు సంఘటనలు. ఐదేళ్ల వయసులో ‘గులేబ కావళి కథ’ సినిమా చూసేటప్పుడు ఎన్టీఆర్‌ను దగ్గరగా చూడాలని ఏడ్చి మొండికేస్తే మా నాన్న తెర దగ్గరగా కూర్చోపెట్టారట. ఆ సంఘటన లీలగా గుర్తుంది. రెండోది.. స్కూల్లో ఉన్నప్పుడోసారి ఎన్టీఆర్ వస్తున్నారని పిల్లలందరం రోడ్డు మీదకొచ్చాం. మమ్మల్ని చూసి ఆయన దిగి వచ్చి చేతులూపారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా నేను రోడ్డు మీద నుంచి కదల్లేదు. మా టీచర్ వచ్చి చెవి మెలేసి తీసుకెళ్లే వరకు ఆ భ్రాంతిలోనే ఉండిపోయాను. నేను పెద్దయిన తర్వాత మరోసారి ఆ మహానుభావుణ్ని చూసే అవకాశం వచ్చింది. తెనాలిలో మీటింగ్. ఎన్టీఆర్‌గారికి రచయితగా పరిచయం కావాలనే తపన నాది. సభలో చదివి వినిపించడానికి పాట రాసుకుని వెళ్లాను. చాలామంది వచ్చారు. ఉదయం నుంచి ఒక గదిలో కూర్చోబెట్టారు. చెమటకు ముద్దయిపోయాం అందరం. నా చేతిలోని పాట కాగితం కూడా. ఏడాది పిల్లవాడిని ఇంట్లో అమ్మ దగ్గర పెట్టి వచ్చాను. ఎన్టీఆర్ సాయంత్రం నాలుగ్గంటలకు వచ్చారు, కానీ జనం గుమిగూడిపోవడంతో కంటి నిండా చూడలేకపోయాను. ఆ సమూహంలో కిందకు వంగి చేయి చాచి ఆయన పాదాలు తాకి కళ్లకద్దుకుని వెనక్కి వచ్చేశాను. అది మూడో సంఘటన. ఇక నాలుగోది.. ఢిల్లీలో సంభవించింది. ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని ఉపేంద్ర గారిని అడిగి ఉన్నాను (అప్పటికే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను). ఆ అవకాశం 1985, నవంబర్ ఒకటిన వచ్చింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవులు, కళాకారులకు సన్మానం. ఆయన ఎదురుగా సభలో మాట్లాడటంతోపాటు సన్మానం కూడా అని తెలిసినప్పటి నుంచి తిండి తినబుద్ధి కాలేదు, నిద్రపట్టలేదు. తీరా ఆ రోజు ఆయన కనిపించగానే సూర్యభగవానుడే దిగివచ్చినట్లు కళ్లు విభ్రమ చెందాయి. ఆయన కాళ్ల మీద పడిపోయాను. ఆయన నన్ను గుర్తు పెట్టుకున్న తొలి సందర్భం కూడా అదే. మలుపులో మహద్భాగ్యం అది 1986, మే నెల.. మహానాడుకు వెళ్లడానికి మహిళల కోసం విడిగా బస్సు వేశారు. అప్పుడు నేను గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి మహిళా విభాగం జనరల్ సెక్రటరీని. మహిళలందరం బస్సులో వెళ్లాం. వేదికకు దగ్గరగా మా సీట్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ని దగ్గరగా చూశాను. సమావేశం పూర్తయింది. బస్సులు కదులుతున్నాయి బస్ ఎక్కమని అనౌన్స్మెంట్ వస్తోంది. ఎన్టీఆర్ వేదిక దిగడం, నేను లేచి బస్ కోసం నడవడం అనుకోకుండా ఒకేసారి జరిగాయి. ఉపేంద్రగారు పలకరించడంతో ఆగాను. బారికేడ్‌కు ఆవల ఎన్టీఆర్, ఇవతల నేను. ఆ టర్నింగ్ దగ్గర ఆయన వెళ్లాల్సిన దారి, మా దారి వేరవుతాయి. ఒక్క క్షణం ముందుగా ఆయన తన దారిలో వెళ్లిపోయినా, నేను ఒక్క క్షణం ఆలస్యంగా సీట్లోంచి లేచినా ఒకరికొకరం ఎదురుపడేవాళ్లమే కాదు. కాకతాళీయంగా జరిగిపోయింది. ఆ టర్నింగ్ నా జీవితాన్నే మలుపు తిప్పింది. అది కూడా ఆయన పుట్టిన రోజు నాడు. ఆయన ఎదురుగా కనిపిస్తే నాకు ఇక ఏమీ తెలిసేది కాదు, వెంటనే కాళ్ల మీద పడిపోయాను. ఆయనే పైకి లేపి... నా ముఖంలోకి చూస్తూ, చూపుడు వేలు చూపిస్తూ ‘లక్ష్మీపార్వతి గారు’ అన్నారు. అంతే మేఘాల్లో తేలిపోయినట్లయింది నాకు. రచనగా ‘రామ’ చరితం నేను ఎంఫిల్ చేస్తున్న రోజుల్లో మా కాంటెంపరరీ స్టడీస్ విభాగం ఆంధ్ర సారస్వత పరిషత్ భవనంలో ఉండేది. రోజూ మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో ఎన్టీఆర్ ఇంటికి పరుగు తీసేదాన్ని. ఒక్కోరోజు ఆయన కనిపించేవారు. ‘మీ థీసీస్ ఎంత వరకు వచ్చింది’ అని అడిగేవారు. ఎంఫిల్ పూర్తయిన తర్వాత ఆ సంగతి చెప్పడానికి వెళ్లి, ధైర్యం చేసి ‘మీ బయోగ్రఫీ రాస్తాను’ అని అడిగాను. పెద్దగా నవ్వేశారాయన. ‘మై లైఫ్ ఈజ్ యాన్ ఓషన్’ అన్నారు. జీవితం అంటే పైకి కనిపించే పార్శ్వం మాత్రమే కాదు, దాని వెనుక కష్టాల కోణాలుంటాయనేది ఆయన ఉద్దేశం. ‘నాకు కష్టాలు తెలుసు, కష్టాల్లోనే పెరిగాను, కష్టాల్లోనే బతుకుతున్నాను. కష్టం విలువ తెలుసు’ అన్నాను. ఆ మాట ఆయనకు నచ్చింది. ఆయన జీవిత చరిత్ర రాయడం కోసం 1985–86 సంవత్సరాల్లో నిమ్మకూరుకు వెళ్లి బంధువులతో మాట్లాడిన సంగతి కూడా చెప్పాను. ఆయనకంటే ముప్పై ఆరేళ్ల చిన్నదాన్ని. నా మాటలు చిన్నపిల్ల చేష్టలా అనిపించినట్లున్నాయి. నా తల మీద చిన్నగా కొట్టి నవ్వారు. కానీ నేను పట్టుదలతో ఉన్నాననే నమ్మకం కలిగిందాయనకు. ఎంఫిల్ అవార్డు అందుకోవడానికి వచ్చినప్పుడు మరోసారి కలిసి బయోగ్రఫీ గురించి గుర్తు చేశాను, అప్పుడు ఒప్పుకున్నారాయన. నర్సరావుపేటలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ వారాంతంలో హైదరాబాద్‌కి వచ్చి బయోగ్రఫీ కోసం నోట్స్ రాసుకున్నాను. ఊహించని వరం నేను దేవుడిలా ఆరాధించే రూపం ఎన్టీఆర్. ఆయన కూడా నన్ను అంతలా ఆరాధిస్తున్నారని తెలిసినప్పుడు సంతోషం వేయకుండా ఎలా ఉంటుంది? నాతో మాట్లాడాలనిపించినప్పుడు కాలేజ్‌కి ఫోన్ చేసేవారాయన. కాలేజ్‌కి ఫోన్ చేయడం నాకు ఇబ్బందిగా ఉంటోందని తెలిసి ఇంటికి ఫోన్ పెట్టిం చారు. రోజూ గంటలకు గంటలు మాట్లాడే వారు. ఓసారి హైదరాబాద్‌కి వెళ్లినప్పుడు ఫోన్ బిల్లు చూపించి ‘ఇది మన ప్రేమ ఫలితం’ అని నవ్వారు. బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది. రెండు లక్షలకు పైనే. అంతలా ఆరాధిస్తున్న మనిషి∙‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగినప్పుడు నా నోటి నుంచి మరో మాట ఎలా వస్తుంది? ఆయన మనసులో స్థానం పొందడం నా అదృష్టం అని నేననుకుంటూ ఉంటే.. ఓ రోజు ఆయనే ‘లక్ష్మీ! నీ మనసులో నాకు స్థానం లభించడం నా అదృష్టం’ అన్నారు. ‘నువ్వంటే నాకు ప్రేమ కాదు లక్ష్మీ, ఆరాధన’ అనేవారు. వేటూరి గారి సన్మాన సభలో నా ప్రసంగానికి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ సభలో మిగిలిన వారితో ‘అందుకే ఆమె అంటే నాకంతటి ఆరాధన. విద్వత్తుకు మరేదీ సాటి రాదు’ అన్నారు. భార్యలో మంచి లక్షణాన్ని అంగీకరించడం గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్లకే సాధ్యం. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి సంక్షోభంలో పడినప్పుడు కూడా ఆయన నాకు అండగా నిలిచారు. కుటుంబం అంతా ప్లాన్ చేయడంతో కంచి పీఠాధిపతి నుంచి ఫోన్ వచ్చింది. నేను పుట్టింటికి కానీ కంచి ఆశ్రమానికి కానీ వెళ్లిపోతే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మళ్లీ ఇచ్చేస్తామన్నారు. అప్పుడు కూడా నా గౌరవాన్ని తగ్గనివ్వలేదాయన. నాకే కాదు, పెద్దావిడను కూడా గొప్పగా గౌరవించేవారు. ఆమెను తలుచుకుంటూ ఆయనకు తెలియకుండా ఉమ్మడి కుటుంబంలో ఆమెకు జరిగిన అన్యాయాలు, ఆయన దృష్టికి వచ్చిన తర్వాత పరిష్కరించిన సంఘటనలను నాతో పంచుకునే వారు. సినిమా షూటింగులతో ఆమెకు తగినంత సమయం ఇవ్వలేకపోయానని, కొన్ని సినిమాలను తగ్గించుకుని ఉండాల్సింది అని బాధపడేవారు. జ్ఞాపకాలే సర్వస్వం పదో ఏట నుంచి కష్టాలనే చూశాను. అన్ని కష్టాల్లో నాకు సాంత్వననిచ్చింది ఆధ్యాత్మిక మార్గమే. తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో కూడా నా ఉపన్యాసం ఉండేది. ఎన్టీఆర్ ముగ్ధులైపోయింది కూడా ఆ శ్లోకాల పఠనానికే. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. కానీ సంస్కృతం రాదు. సంస్కృతం వచ్చిన నన్ను భాగస్వామిని చేసుకుని ఆయన ఆ లోటును పరిపూర్ణం చేసుకున్నారు. నా చేత ఆ శ్లోకాలను మళ్లీ మళ్లీ చదివించుకుని, భాష్యం చెప్పించుకుని ఆనందించేవారు. ఇప్పటికీ నన్ను నడిపిస్తున్న శక్తి తరంగాలు ఆయన జ్ఞాపకాలే. నా కొడుకు కోటేశ్వర ప్రసాద్, కోడలు దేవ స్మిత ఇద్దరూ డాక్టర్లు. వాళ్లను చూసుకుంటూ, నా స్వామి స్మరణంలో కాలం గడుపుతున్నాను’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి పిల్లలకు చెప్పారు నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్న తర్వాత ఆ సంగతి కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు... అందరినీ పిలిచి ‘ఈ వయసులో నా ఆరోగ్యాన్ని పట్టించుకునే సహచరి కావాలి. ఆమె అభిరుచులు నా ఇష్టాలు సరిపోతు న్నాయి. నాకు ఆమె పట్ల గౌరవం ఉంది’ అని చెప్పారు. అంతా విని రామకృష్ణ ‘పెళ్లి తర్వాత మేము ఇంటికి రావచ్చా’ అని అడిగారు. అప్పుడు ఎన్టీఆర్ ‘తప్పకుండా రావచ్చు, రావాలి కూడా’ అన్నారు. మా వివాహానికి కుటుంబ అంగీకారమే కాదు, సమాజ ఆమోదం కూడా ఉంది. ఆయనకు బ్రెయిన్లో క్లాట్ ఏర్పడి, పెరాలసిస్ వచ్చిందని ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదెవ్వరూ. ఆయన కడుపున పుట్టడం వాళ్ల అదృష్టం. ఆయన్ని కాపాడుకోవాలనే ఆలోచనే లేదెవ్వరికీ. క్షోభకు గురి చేయకుండా బతకనిచ్చి ఉంటే ఆయన్ని మరో పదేళ్లు కాపాడుకునేదాన్ని. ‘నీ చేతి వంట కోసమే బతకాలి’ నేను టీ తాగను, టీ పెట్టడమూ రాదు. ఆయనే టీ పెట్టడం నేర్పించారు. ఆయనకు నచ్చినట్లు వంట చేయాలని వంటల పుస్తకాలు తెప్పించుకున్నాను. సూర్యకాంతమ్మగారి వంటల పుస్తకం చూస్తూ వారంలో వంట నేర్చుకున్నాను. తర్వాత నా వంట తింటూ ‘నీ చేతి వంట కోసమే నూరేళ్లు బతకాలనుంది లక్ష్మీ’ అనేవారు. సి.ఎం అయిన తర్వాత ఆరుగురు వంటవాళ్లున్నా సరే... ‘లక్ష్మీ నువ్వేం వండావు’ అని అడిగి, అదే తినేవారు. నేషనల్ ఫ్రంట్ లీడర్లు హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కూడా ‘నువ్వేదయినా చేసిపెట్టు’ అన్నారు. నేను చేసిన గారెలు, బజ్జీలను ‘మా తెలుగు వంటకాల రుచి ఎలా ఉంది’ అంటూ వాళ్లకు కొసరి కొసరి పెట్టించారు. అది చాలా చిన్న తిట్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్లో నన్ను తిడుతూ కొట్టిన పై సన్నివేశం కరెక్టే. అది చాలా చిన్న తిట్టు. మాటల్లో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. రామ్‌గోపాల్ వర్మతో ఎన్టీఆర్ జీవితం మొత్తం చెప్పడానికి కుదరలేదు. నేను రాసిన బయోగ్రఫీ రెండు భాగాలు (ఎదురు లేని మనిషి, తెలుగుతేజం) ఇచ్చాను. వర్మగారు ఎన్టీఆర్‌తో పని చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సంప్రదించి సమాచారం సేకరించారు. సొంతంగా అధ్యయనం చేసి మరీ తీశారు. నేను నీలిరంగు చీరలో ఉన్న ఫొటో అసలుదే. అది నా దగ్గర లేదు. ఆయనెలా సంపాదించారో తెలియదు. ఇరవై మూడేళ్ల నా అంతర్మధనం దృశ్యరూపం సంతరించుకుంటోంది. చరిత్రను, వాస్తవాన్ని ఎంత లోతున పాతి పెట్టాలని చూసినా ఏదో ఒక రోజు అవి ఉవ్వెత్తున ఎగిసి పడతాయి. ‘ఎంత బాగున్నావో!’ ఓ రోజు... రవీంద్రభారతికి వెళ్లడానికి బస్సు దిగి రోడ్డు దాటుతున్నాను. ఓ కారు నా దగ్గరగా వచ్చి ఆగింది. ఆ కారులో ఎన్టీఆర్! అబిడ్స్ నుంచి వస్తున్నారు. ఓ క్షణం ఆగి చూసి వెళ్లిపోయారు. అప్పుడు నేను గాలికి రేగిపోయి ముఖాన పడుతున్న జుత్తును చేత్తో వెనక్కి తోసుకుంటూ కొంగు భుజాన కప్పుకుని తల పక్కకు తిప్పి చూశానట. ‘ఆ దృశ్యం ఇప్పటికీ ఫొటోలాగ నా మదిలో ముద్రించుకుపోయింది లక్ష్మీ. అప్పుడే నిన్ను కారులో ఎక్కించుకుని నాతో తీసుకెళ్లి పోవాలనిపించింది. ఆ రోజు పసుపురంగు చీరలో చాలా బాగున్నావు’ అని చాలా రోజులకు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పారాయన. -
దగా దగా పాటను తొలగించాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రంలో దగా.. దగా.. కుట్ర పాట విషయంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఈ పాటను సినిమాతోపాటు సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ నుంచి తొలగించాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దగా.. దగా.. కుట్ర పాటలో ఏపీ సీఎం చంద్రబాబును కించపరిచేలా చూపుతున్నారని, ఈ పాటను సినిమా నుంచి, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా సెన్సార్ బోర్డును ఆదేశించాలని కోరుతూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ ఏపీకి చెందిన వ్యక్తి అయినప్పుడు, ప్రజాప్రయోజన వ్యా జ్యాన్ని తెలంగాణ హైకోర్టులో ఎలా దాఖలు చేస్తా రని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసే నాటికి హైకోర్టు ఉమ్మడిగానే ఉందని, ఈ పాట ను హైదరాబాద్‌లో విడుదల చేశారని ఎమ్మెల్యే తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడు చేయడానికి సంబంధించిన పాట అని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేలా ఉందని అన్నారు. చంద్రబాబును మోసకారిగా చూపుతున్నారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి బాబే కారణమన్నట్లు ఈ పాటలో చూపుతున్నారని తెలిపారు. -
అప్పుడు నారాయణ అనేస్తా!
‘‘ప్రతి సినిమాను ఒకే రకమైన ష్యాషన్‌తో తీస్తాను. ఆడితే ఒళ్లు దగ్గరపెట్టుకుని తీశాడంటారు. ఆడకపోతే రివర్స్‌లో మాట్లాడతారు. ఫిల్మ్ మేకింగ్‌లో తెలిసి తప్పులు చేయను. ఏ దర్శకులూ కావాలని తప్పులు చేయరు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో రామ్‌గోపాల్‌వర్మ సమర్పణలో అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజవుతోంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ చెప్పిన విశేషాలు... ► ‘భైరవగీత’ చిత్రాన్ని భుజాన వేసుకోలేదు. అ«ధఃపాతాళంలోకి కూరుకుపోయిన నన్ను ఓ చేయి ఇచ్చి పైకి లాగుతుందనుకుంటున్నాను. ఒక సినిమా కథ వల్ల ఆడొచ్చు లేదా స్టార్డమ్ వల్ల ఆడొచ్చు. కానీ ఒక డైరెక్టర్ సీన్‌ను చెప్పే విధానంలో ఉండే మార్పే నా దృష్టిలో సినిమాటిక్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ అరుదుగా మారుతుంటుంది. దీన్ని చాలా సంవత్సరాల తర్వాత నేను సిద్ధార్థ్ దర్శకత్వంలో చూశాను. ►నా దగ్గర నుంచి 30–40మంది డైరెక్టర్లు వచ్చి ఉంటారు. నా వర్కింగ్ స్టైల్ ఇన్ప్లూయెన్స్తో సిద్ధార్థ్ నా దగ్గరకు వచ్చాడు. అందుకే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్‌లో నా మార్క్ కనిపించి ఉండొచ్చు. సినిమాలో సిద్ధార్థ్ స్టైల్ తెలుస్తుంది. లోయర్ స్టేటస్ ఉన్న వ్యక్తి, హయ్యర్ స్టేటస్ ఉన్న అమ్మాయిని ప్రేమిస్తాడు. దానివల్ల ఎలాంటి రెబలిజమ్ మొదలైంది? అనేది ఈ చిత్రకథ. ►వంశీ అనే అతను ఈ సినిమా స్క్రిప్ట్ రాశాడు. ఆ తర్వాత మేం మార్పులు చేశాం. ఈ స్క్రిప్ట్‌ను íసిద్ధార్థ్ డైరెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. సిద్ధార్థ్‌ను శిష్యుడుగా అనుకోవడం లేదు. ఎప్పుడెప్పుడు నా నుంచి బయటపడాలా అని చూస్తున్నాడు. సినిమా ఆడితే.... రామ్‌గోపాల్ వర్మ ఎవరు? అని సిద్ధార్థ్ అడిగినా ఆశ్చర్యపోవడానికి లేదు. ‘2.ఓ’ సినిమాను పిల్లలు చూసే సినిమా అనడానికి కారణం ‘భైరవగీత’ పబ్లిసిటీ కోసమే. ►కావాలని తప్పులు చేయం. సినిమా బాగా ఆడకపోవడానికి ఒక్కరే కారణం అవ్వరు. నాలుగైదు కారణాలు ఉంటాయి. ‘ఆఫీసర్’ చిత్రం బ్యాడ్‌గా ఉందని తెలిస్తే రిలీజ్ కూడా చేయం కదా. నాగార్జున, నేను ఇద్దరూ నమ్మి ‘ఆఫీసర్’ సినిమా చేశాం. అందుకే రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి హీట్ డిస్కషన్ లేదు. ►నేను దేవుణ్ణి నమ్మనని ఎప్పుడూ చెప్పలేదు. భక్తులను నమ్మననే చెప్పాను. నేను దేవుణ్ణి నమ్మితే చాలా పాపాలు చేయలేను. నాకు తోచినవన్నీ చేసేసి చనిపోయే 5 నిమిషాల ముందు నారాయణ అనేస్తా. నేను డైరెక్టర్‌నే కాదు యాక్టర్‌ని కూడా. ►ఎన్టీఆర్‌గారి జీవితంలో లక్ష్మీపార్వతి వచ్చిన తర్వాతి సంఘటనలే కీలకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తున్నాను. ఇందులో కొత్తగా తెలియనిది చెప్పడం లేదు. బాలకృష్ణగారి ‘యన్.టీ.ఆర్’ బయోపిక్ సబ్జెక్ట్‌కు, నా సబ్జెక్ట్‌కు కనెక్షన్ లేదు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో చంద్రబాబునాయుడుగారి పాత్ర ఎలా ఉంటుంది? అనేది సినిమాలో తెలుస్తుంది. ఈ సినిమా పరంగా నా ఇంట్రెస్ట్‌నే శాటిస్ఫై చేస్తాను. స్క్రిప్ట్ చూపించనని లక్ష్మీపార్వతిగారికి చెప్పాను. నమ్మకం ఉంటేనే అనుమతి ఇవ్వమని కోరాను. ఇందులో అందరూ కొత్తవారే నటిస్తున్నారు. జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ‘యన్.టీ.ఆర్’ బయోపిక్, వైఎస్సార్ ‘యాత్ర’ సినిమాల టైమ్‌లోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజవుతుందంటే అది కాకతాళీయమే. ►రామ్ ఇలాంటోడు అలాంటోడు అన్నారు. నేను తప్ప అందరూ ‘మీటూ’లో ఉన్నారు బాలీవుడ్లో. వచ్చిన వార్ల పేర్లు విని షాక్ అయ్యాను. ►ఓటు ప్రాముఖ్యత గురించి నా చిన్నప్పుడు నేనూ విన్నాను. ఇప్పటివరకు నా లైఫ్‌లో ఓటు వేయలేదు. పాలిటిక్స్‌ను అర్థం చేసుకునే టైమ్ నాకు లేదు. నాకు ఎవ్వరు ఉన్నా ఓకే. చట్టానికి లోబడి ఉంటాను కాబట్టి ప్రభుత్వాలు చట్టాన్ని మార్చితే ఆ మార్పులను ఫాలో అవుతాను. నాకు ఆసక్తి ఉన్న పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు అమెరికన్ పాలిటిక్స్ అంటే ఇష్టం. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ గెలుస్తాడని ఇండియాలో ముందు చెప్పింది నేనే. -
భయానికి అర్థం తెలియదు
‘‘నేను థియేటర్ ఆర్టిస్టుని. సిద్ధు (డైరెక్టర్), వర్మగారు ఆడిషన్ చేసి ‘భైరవగీత’ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. నా తొలి సినిమా తెలుగులో చేయడం హ్యాపీ. ఈ సినిమా నా జీవితాంతం గుర్తుంటుంది’’ అని ఐరా మోర్ అన్నారు. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవగీత’. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతోంది. ఐరా మోర్ పంచుకున్న విశేషాలు... ► లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. ఇందులో నేను గీత పాత్రలో నటించా. స్వతంత్ర భావాలు కలిగిన స్ట్రాంగ్ అమ్మాయి. లండన్‌లో చదివి హోమ్ టౌన్‌కి వస్తుంది. దేవుడి మీద పెద్దగా భక్తి ఉండదు. కానీ మానవత్వాన్ని నమ్ముతుంది. కుల వ్యవస్థను నమ్మదు. సొంత ఇంట్లోనే కులాల మధ్య అంతరం కనిపిస్తుంది.. బానిసత్వం తెలుస్తుంది. అలాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. వర్మగారు ముక్కుసూటి మనిషి. ఆయనకు ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. అంతేకానీ, మనసులో పెట్టుకుని కన్ఫ్యూజ్ చేయరు. ► మాది జమీందారీ కుటుంబం. మా సామాజిక వర్గంలో భయం అనే పదానికి మీనింగ్ తెలియదు. భయం తెలియకపోవచ్చు కానీ, ఒక రకమైన బెరుకు మాత్రం ఉంటుంది. ► చాలా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అక్కడ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ ఉండేది కాదు. కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేది. నేను కిసెస్కి కంఫర్టబుల్ కాదు. కానీ, తొలి సినిమాలో అవన్నీ చేసేటప్పుడు కాస్త థ్రిల్లింగ్‌గానే అనిపించింది. నా పాత్రను దృష్టిలో పెట్టుకుని చాలా చేశా. నాకు తెలుగు అర్థం కాదు. పాత్రను అంగీకరించడానికి ముందు నేను వందసార్లు ఆలోచిస్తా. ► ‘మీటూ’ లాంటి విషయాల గురించి అమ్మాయిలు చెప్పడం మంచిదే. మనం పనిచేసే వాతావరణం చాలా క్లియర్‌గా ఉండాలి. నేను రవితేజ, మహేష్బాబుగార్ల సినిమాలు చాలా చూశా. అనుష్కగారంటే చాలా ఇష్టం. నా పాత్ర నచ్చితే అది చిన్న రోల్ అయినా చేస్తా. -
అలా అన్నాడంటే ఫ్రాడ్ లేదా పిచ్చోడు అయ్యుండాలి
‘‘భైరవగీత’ నాకు చాలా స్పెషల్ మూవీ. నేను ఇన్నేళ్లలో ఎన్నో సినిమాలకు దర్శకుడిగా చేయడంతోపాటు చాలా చిత్రాలు నిర్మించాను. డైరెక్షన్ అంటే ఓవరాల్ ఎఫెక్ట్ అనుకుంటారు అందరూ. కానీ ఉన్న మెటీరియల్‌ను ఉపయోగించి సినిమాటిక్ యాంగిల్లోకి మార్చేవాడే నిజమైన దర్శకుడు అని నా భావన’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సిద్ధార్థ తాతోలుని దర్శకునిగా పరిచయం చేస్తూ రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన చిత్రం ‘భైరవ గీత’. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘సిద్ధార్థ నా దగ్గర ఒక సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. అప్పుడు విలువైన సలహాలు ఇచ్చేవాడు. అతను ఇంటిలిజెంట్. కడప వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే సిద్ధార్థ ఆ ట్రైలర్‌ను నేను చేస్తానన్నాడు. సిద్ధూ అ సినిమా ఎలా చేస్తాడనే డౌట్ ఉండేది. నువ్వు నిజంగా చేయగలుగుతావా? అని కూడా అడిగాను. ఎవరైనా చేయలేని పని చేస్తాను అన్నాడంటే వాడు ఫ్రాడ్ అన్నా అయ్యుండాలి లేదా పిచ్చోడైనా అయ్యుండాలి. అతను పిచ్చోడు కాదు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రష్ చూసి షాకయ్యాను. ఈ సీన్‌ను ఇలా కూడా తీయొచ్చా అనిపించింది. అది నాకొక లెసన్. డైరెక్షన్ అనుభవం లేకుండా చేయటమనేది రేర్‌గా జరుగుతుంది. నా టైమ్‌లో నేను, మణిరత్నం, శేఖర్ కపూర్ ఎక్కడా అసిస్టెంట్స్‌గా చేయలేదు. ‘భైరవగీత’ కష్టంతో కూడుకున్న సినిమా. 90 శాతం కొత్తవాళ్లతో తీసిన చిత్రం’’ అన్నారు. సిద్ధార్థ తాతోలు మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ చదివిన నేను సినిమాల్లోకి వెళతాను అనగానే నన్ను సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాముగారికి థ్యాంక్స్ చెప్పి ఇచ్చిన చాన్స్‌ని చిన్నదిగా చేయదలచుకోలేదు. హీరో ధనుంజయ్‌ను ఈ సినిమా తర్వాత అందరూ భైరవా అని పిలుస్తారు. హీరోయిన్ ఐరా మోర్తో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. అభిషేక్ గారితో పాటు నన్ను నమ్మి నాతో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నిజ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నేను ఇప్పటివరకు 10 సినిమాల్లో నటించాను ఇది నా 11వ చిత్రం’’ అన్నారు ధనుంజయ్. -
రహస్యంగా...
భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాతగా వంద చిత్రాలకు చేరువలో ఉన్న తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ చిత్రం ‘రహస్యం’. సాగర్ శైలేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రామ్‌గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ విడుదల చేశారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నూతన దర్శకులకు మార్గదర్శి మా ఆర్జీవీగారు. ఆయన చేతుల మీదుగా ఈ వేడుక జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.‘‘రామ సత్యనారాయణ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నందుకు అభినందనలు’’అని వర్మ అన్నారు. ‘‘రామ సత్యనారాయణ నాకు 14 ఏళ్లుగా తెలుసు. చిన్న సినిమాలు తీసి, విడుదల చేయటంలో ఆయనకు ఆయనే సాటి’’ అన్నారు పూరి. ‘‘వర్మగారిని కలవటం నా జీవితాశయం. ఈ రోజు అది నెరవేరింది. రామ సత్యనారాయణగారు ప్యాషన్ ఉన్న నిర్మాత. నన్ను నమ్మి ఏ రోజూ ఆయన షూటిం గ్‌కు రాలేదు’’ అని శైలేష్ అన్నారు. -
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్
-
నేను వైల్డ్ హార్స్‌ని.. మంకీని కూడా
‘‘ఆఫీసర్ ఒక సిన్సియర్ ఎఫర్ట్. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సినిమా మీద ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. స్క్రిప్ట్ వినగానే నచ్చింది. కానీ ఆర్జీవీ మీద నమ్మకం లేదు. నమ్మకం లేనిది ఆయన డైరెక్షన్ కేపబిలిటీ మీద, టాలెంట్ మీదా కాదు. ఆయన మూడ్ మీదే. అందుకే చిన్న టెస్ట్ పెట్టాను’’ అన్నారు నాగార్జున. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన చిత్రం ‘ఆఫీసర్’. మైరా సరీన్ కథానాయిక. కంపెనీ పతాకంపై సుధీర్ చంద్ర, రామ్‌గోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘వర్మ ఒక వైల్డ్ హార్స్. ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా మధ్యలో దృష్టి మారిపోతుంటుంది. చేసే పని మీదే దృష్టి ఉండాలన్నది నా మనస్తత్వం. ‘ఈ సినిమా చేసి మళ్లీ మనం గొడవలు పడటం ఎందుకు?’ అని వర్మతో అన్నాను. మళ్లీ ఇంకోసారి కథ చెప్పు అని రెండు మూడు సార్లు కలిశాను. అలా తన కాన్సన్ట్రేషన్కు టెస్ట్ పెట్టాను. బాగా తీశాడు. సినిమా ఒప్పుకున్నాక నాకు రాసిన లెటర్లో తన్నమన్నాడు. తన్నాల్సిన అవసరం లేదు. బాగా తీశాడు. ఆర్జీవి సౌండ్‌తో, బ్యాక్‌గ్రౌండ్‌తో ఆడుకుంటాడు. ఈ సినిమాలో కూడా సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బావుంటుంది. సౌండ్ మీ గుండెల వరకూ వెళ్తుంది’’ అని అన్నారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘నేను సినిమాల్లో వైల్డ్ హార్స్‌ని. ట్వీటర్లో వైల్డ్ మంకీని. నేను సినిమాని సీరియస్‌గా తీసుకోను అన్నది అబద్ధం. చేసేటప్పుడు సీరియస్‌గా చేసి ఆ తర్వాత పక్కన పెట్టేస్తాను. ‘ఆఫీసర్’ సినిమాలో రియలిస్టిక్ యాక్షన్, సౌండ్... ఇలా కొన్ని అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని చేశాను. ‘ఇలా చేయాలి’ అనే ఇన్టెన్షన్ ఉన్నప్పుడు అనుకున్నట్లే బాగా చేస్తాం. అందుకే నాగ్‌కి లెటర్లో తన్నమని రాశాను. రీచ్ అయ్యానో లేదో.. తన్నుడు కార్యక్రమం ఉందో లేదో చూడాలి. ‘ఆఫీసర్’ సినిమా కచ్చితంగా న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చిన ఆర్జీవీకి, నాగార్జునకు చాలా థ్యాంక్స్. టిపికల్ హీరోయిన్ రోల్ చేయలేదు. చాలా పవర్ఫుల్ పాత్ర ప్లే చేశాను. స్టంట్స్ కూడా చేశాను’’ అని అన్నారు మైరా సరీన్. -
కెలకమాకు సామీ ... వర్మకు కౌంటర్
వివాదాస్పద దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ తన ట్విట్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ పై ఆయన చేసిన కామెంట్లతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు కూడా. అనవసర విషయాలపై రియాక్ట్ కావడం, దానిపై ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయడం వర్మకు అలవాటు. తనపై వచ్చే విమర్శలను రాంగోపాల్ వర్మ ఏమాత్రం పట్టించుకోరు. తనపై వచ్చే విమర్శల జడివానకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన సెటైర్లు వేస్తూనే ఉంటారు. తాజాగా వర్మ పవన్‌పై కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్ తిరుమలకు కాలినడకన వెళ్తూ మార్గమధ్యలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై వర్మ ట్వీట్ చేస్తూ..‘పవర్‌స్టార్ పవర్ఫుల్ ఎనర్జీకి ఇదే ఉదాహరణ’ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. అయితే వర్మ కామెంట్‌కు రామ జోగయ్య శాస్త్రి కౌంటర్ ఇస్తూ.. ‘ కెలకమాకు సామీ... కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరూ చేయగలరు.. ఇది మీకు హుందా అయినది కాదు. తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు. ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేసి మాట్లాడుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. మరి రామజోగయ్య శాస్త్రి ట్విట్ కు వర్మ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. కెలకమాకు సామీ ...కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు ...ఇది మీకు హుందా అయినది కాదు 😎తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు 😎 ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి😎 https://t.co/7Rv2gYjqHP — Ramajogaiah Sastry (@ramjowrites) 13 May 2018 -
వాడి ప్రేమ కళ్లలో చూపిస్తాడు
► మదర్స్ డే సందర్భంగా మీ అబ్బాయి గురించి షేర్ చేసుకోండి.. సూర్యవతి: మనసులో ఉన్నది చెప్పేస్తాను. పక్షపాతం, అమ్మ ప్రేమలాగా కాకుండా ఇన్ని సంవత్సరాలు తనని చూసి చెబుతున్నాను. వర్మలాంటి గొప్ప వ్యక్తికి మదర్ అయినందుకు నాకు గర్వం గా ఉంది. అతని నేచర్ వల్ల. మూడేళ్ల వయసులో ఏ మాట అన్నాడో ఇప్పుడే అదే అంటున్నాడు. అప్పుడు సరిగ్గా గుర్తించలేదు. చిన్నప్పటి నుంచి ఫుడ్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. 5–6 సంవత్సరాలు పాలు తాగే ఉన్నాడు. చీమని తొక్కితే కూడా ఇష్టపడేవాడు కాదు. అవసరం లేకుండా ఎందుకు తొక్కడం అని అంటాడు. ► అంటే వర్మకు నాన్ వెజ్ అలవాటు లేదా? చికెన్ తింటాడు. అలవాటు అయింది కాబట్టి. కానీ అనవసరంగా దోమను చంపడం ఎందుకు? అంటాడు. ► వర్మ చూడటానికి ఇంటిలిజెంట్‌లా కనిపిస్తారు. చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారా? వర్మ ఏకసంతాగ్రహి. ఒక్కసారి విన్నా కూడా గుర్తుపెట్టుకుంటాడు. ► ఒక గొప్ప వ్యక్తికి మదర్ అయినందుకు గర్వంగా ఉంది అన్నారు. వర్మలో గొప్పతనం ఏంటి?మంచి డైరెక్టర్ అనా ? వ్యక్తిగానా ? డైరెక్టర్‌గా కాదు. వ్యక్తిగా, అతని స్వభావం వల్ల. మాట్లాడే తీరు వల్ల. ► వర్మ గారు ఉమెన్ గురించి మాట్లాడే విధానాన్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. అలాంటప్పుడు మీకెలా అనిపిస్తుంది? లోపల తనేంటో నాకు బాగా తెలుసు. వివేకానండుడిని ఎందుకు ఇష్టపడతాం? తన స్వభావం వల్ల. వర్మ స్వభావం ఏంటో నాకు తెలుసు కాబట్టి తనంటే నాకు బాగా ఇçష్టం. వర్మ ఏది చేస్తాడో అదే చెప్తాడు. చెప్పని విషయాలు చేయడు. చిన్నప్పుడే ఒక యోగిలాగా ఉండేవాడు. ► పిల్లలు నార్మల్‌గా ఉంటేనే తల్లిదండ్రులకు బావుంటుంది. యోగిలా ఉన్నాడని భయం అనిపించేదా? చాలా టెన్షన్ పడ్డాను. ఈ పిల్లవాడు ఏంటీ ఇలా ఉన్నాడూ అని. స్కూల్‌కి వెళ్లడం ఇష్టముండేది కాదు. అమ్మా నాన్నల మనస్సు కష్టపెట్టుకూడదని వెళ్లేవాడు. మార్కులు చాలా బాగా వచ్చేవి. నైన్త్ క్లాస్ ఆ టైమ్‌కి వచ్చేసరికి క్వార్టర్లీ ఎగ్జామ్స్‌లో 30 మార్కులు వస్తే హాఫ్ ఇయర్లీలో 90 మార్క్ వచ్చేవి. ఎందుకూ? అని అడిగితే నాకు రాయాలి అనిపించలేదు అనేవాడు. ► మరి సిస్టర్‌తో ఎలా ఉండేవాడు. నేనూ, తన సిస్టర్ అంటే వర్మకు ప్రాణం. అసలు అరవడం లాంటివి ఏమీ చేయడం. పని వాళ్ల మీద కూడా కేకలు పెట్టడు. చాలా సాఫ్ట్. మృదుస్వభావి. ఇష్టం లేకపోతే కూర్చోబెట్టి చెబుతాడు. అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చెబుతాడు. అప్పటికీ వినకపోతే పట్టించుకోడు. మనల్ని పూర్తిగా కట్ చేస్తాడు. పనివాళ్లనైనా అంతే ఇంట్లో వాళ్లని అయినా అంతే. ► ఆయన మాటల తీరుని చూస్తే సెంటిమెంట్స్ లేని వ్యక్తిగా కనిపిస్తారు. మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? నా వయసు 76. నేను చాలా మందిని చూశాను. పొద్దునే లేవగానే అమ్మను చూడటం, వాళ్లకు దండం పెట్టడం లాంటివి చేస్తుంటారు. నా కొడుకు అలాంటివి ఏమీ చేయడు. నేనంటే తనకు బోలెడంత ప్రేమ. తన కళ్లలో చూపిస్తాడు. వాడు ఎక్కడున్నా వాడి మనసులో నేనుంటాను. వెరీ వెరీ హ్యాపీ. మనల్ని ప్రేమించే వ్యక్తి మనసులో మనం ఉన్నాం అంటే ఎంత దూరంలో ఉన్నా కుడా ఆ దూరం తెలియదు. ► అమ్మాయిల మీద కామెంట్ చేస్తుంటారు వర్మ. మీరెప్పుడైనా నీకూ సిస్టర్ ఉంది. ఇలా కామెంట్ చేయోద్దు అని చెబుతుంటారా? ఎప్పుడూ చెప్పలేదు. తనని నేను పూర్తిగా అర్థం చేసుకోలేదని చెప్పలేదు. నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. తను ఒక యోగిలా ఉంటాడు. ఒక పరిపూర్ణమైన మనిషిలా. అన్నీ లెవెల్స్ దాటిన మనిషి అన్నీ ఒకేలా మాట్లాడగలడు. ఒక లెసన్‌లా ఉంటుంది వర్మ మాట్లాడుతుంటే. ఒక పరిపూర్ణమైన మనిషి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మళ్లీ అదే విషయాన్ని ఇంకొకరు చెబితే అంత బాగా అనిపించదు. ► మీ అబ్బాయి మాట్లాడే మాటలు లెసన్ అంటారా? లెసన్ అనను. పరిపూర్ణమైన మనిషి. ఆ మనిషి ఆ మాట మాట్లాడాడు అంటే ఆ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నాడని అర్థం. – డి.జి.భవాని -
నా వెనుక దేవుడున్నాడు
► ముందుగా ‘ఆఫీసర్’ గురించి నాలుగు మాటలు? నాగార్జునతో మళ్లీ ఎందుకు సినిమా తీయాలి అని అనుకున్నారు? రామ్‌గోపాల్‌వర్మ: హీరోయిజమ్‌తో నేను సినిమా తీసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ‘ఆఫీసర్’ కథ రాయగానే నాగార్జున గారే మైండ్లోకి వచ్చారు. అతన్నే అప్రోచ్ అయ్యాను. ► ఈ మధ్య కాలంలో వచ్చిన మీ సినిమాలన్నీ వచ్చినట్టు వెళ్లిపోతున్నాయి. మరి ఆఫీసర్ సక్సెస్ అవుతాడా? ‘ఆఫీసర్’ ఆడియన్స్‌కు ఎంత నచ్చుతుందన్న విషయం మీద డిపెండ్ అవుతుంది. ► మీ నుంచి మళ్లీ›‘శివ, గోవిందా గోవిందా, క్షణక్షణం’ లాంటి సాలిడ్ హిట్ మూవీస్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. వాళ్ల నిరీక్షణకు ‘ఆఫీసర్’ సరైన సమాధానం చెబుతాడా? పైన సమాధానం మళ్లీ చదవండి. ► అఖిల్‌తో మూవీ అనౌన్స్ చేశారు. దాని స్టేటస్ ఏంటి? 2 నెల్లలో స్టార్ట్ అవుతుంది. ► మీరు గమనించారో లేదో ఒకప్పుడు మీ సినిమాలు కంటెంట్ చుట్టూ తిరిగేవి. ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్‌గా ఉన్నప్పటికీ సెన్సేషన్ చుట్టూ తిరిగుతునట్టుగా అనిపిస్తుంది? ఏ కళ్లు పెట్టుకొని చూస్తే ఆ కళ్లకి కనిపించేలా కనిపిస్తుంది. ► మీరు అనౌన్స్ చేసిన సినిమాలు 10 వరకూ ఉన్నాయి. వాటి స్టేటస్ ఏంటి? అన్నీ వాటి వాటి టైమ్ వచ్చినప్పుడు వస్తాయి. ► ఎవరికైనా కాంట్రవర్శీల కన్నా స్మూత్‌గా లైఫ్ వెళ్లిపోతే బావుండు అనుకుంటారు. మీరేమో కాంట్రవర్శీలే కావాలి అంటారు. అందులో ఆనందం ఉందా మీకు? చిన్నప్పటి నుంచి. ► ఎవరి మీద పడితే వాళ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునే దమ్ము మీకుంది. ఏంటి మీ ధైర్యం? మాఫియా అండ ఉంది అన్నది కొందరి అభిప్రాయం. నా వెనుక దేవుడున్నాడు. ► మీకు బొత్తిగా ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు వాళ్ల గురించి ట్వీట్ చేసిన వాళ్ల శరీరం గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఏ ‘ఉమెన్’ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్సువల్ ఆబ్జెక్టా? నా దృష్టిలో సృష్టి సృష్టించిన ఒకే ఒక్క అద్భుతం ఉమెన్. ► రీసెంట్ శ్రీ రెడ్డి కాంట్రవర్శీలో పవన్ కల్యాణ్‌ని తిట్టమని మీరే అన్నారని ఆమె చెప్పారు. ఎవరినైనా సరే తిట్టే దమ్మున మీరు శ్రీ రెడ్డిని ఎందుకు అడ్డం పెట్టుకున్నారు ?అసలేంటి శ్రీ రెడ్డికీ మీకు ఉన్న సంబంధం ?ఒకవేళ శ్రీ రెడ్డిని మీరు సపోర్ట్ చేయకుండా అమెను క్రిటిసైజ్ చేస్తే మీ గురించి బైటపెట్ట తగ్గ వీడియోలు ఆమె దగ్గర ఉన్నాయా?ఈ టోటల్ శ్రీ రెడ్డి ఇష్యూలో పొలిటికల్ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉందని చాలా మంది అభిప్రాయం. నిజమా? దీనికి సంబంధించిన నా వివరణ యూట్యూబ్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు చూసుకోవచ్చు. ► మీరు మనుషుల్ని వదిలిపెట్టరు. ఆ మాటకొస్తే దేవుడ్ని కూడా వదిలిపెట్టరు. భయం, భక్తి అనేవి మీ వంటికి తెలియదా? లైఫ్‌లో ఎన్నో మాట్లాడకూడని విషయాలు మాట్లాడారు. ఎప్పుడైనా ఈ మాట మాట్లాడి ఉండకూడదు అని రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేనెప్పుడూ రిగ్రెట్ ఫీల్ అవ్వను. ముందుకు వెళ్లిపోతూ ఉంటా. ► ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అప్పుడు ‘ఆన్ ఎర్త్ దేరీజ్ నో లొకెషన్ విచ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఉమెన్ బాడీ’ అన్నారు. అవును. నేనా విషయాన్ని నమ్ముతాను. ► పవన్ కల్యాణ్ మీద మీరు చేపించిన కామెంట్స్‌కి పూరీ ఫీల్ అయ్యారు? దానికి మీరెమంటారు? అనటం నా హక్కు. ఫీల్ అవ్వడం తన హక్కు. ► ఫైనల్లీ వర్మ అద్భుతమైన టెక్నీషియన్. అది ఎవరూ కాదనలేని విషయం. కాకపోతే మీరు తీసిన సినిమాల వల్ల మాట్లాడే మాటల వల్ల‘ సైకో’ అని మీకు ‘పర్వెర్ట్’ అని చాలా మంది అంటారు. దాని గురించి మీరెంమంటారు? నేను చెప్పేవి, చేసేవి అర్థం చేసుకోలేని వాళ్ల అభిప్రాయాల గురించి నేను పట్టించుకోను. ► ‘వర్మ పని అయిపోయింది’ అనే వాళ్లకు మీ సమాధానం ఏంటి? ఆఫీసర్. ► ‘ఆఫీసర్’ ట్రైలర్‌కు నెగటీవ్ ఫీడ్‌బ్యాక్ వస్తుంది. దాని గురించి ఏమంటారు? పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ని అడగండి. ► రీసెంట్ టైమ్‌లో మీకు సాలిడ్ సక్సెస్ లేదు. కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునట్టుగా కూడా అనిపించదు. మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? నాకు సరిపడినన్ని. -
ఆఫీస్ ముగిసింది
అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్ వర్మది హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ‘శివ’ సినిమా ఎంత ట్రెండ్ సెట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా వీరి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఆఫీసర్’ సినిమా షూటింగ్ శనివారం ముగిసింది. ‘‘ఆఫీసర్ సినిమాలోని లాస్ట్ షాట్ చిత్రీకరణ ముగిసింది’’ అని వర్మ తెలిపారు. కంపెనీ పతాకంపై వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయిక. ఇందులో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఆయన హైదరాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ ఆఫీసర్‌గా వెళ్తారట. ముంబై నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఇప్పటికే టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే నెలలో ఈ సినిమాని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
వర్మ పరిశ్రమకు పట్టిన చీడపురుగు
-
శ్రీరెడ్డి వివాదం; సంచలనం రేపిన పవన్
సాక్షి, హైదరాబాద్: గడిచిన కొద్దిరోజులుగా తీవ్రదుమారం రేపుతోన్న శ్రీరెడ్డి వివాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధంలేని వ్యవహారంలోకి తనను లాగిందేకాక, తనపై, తన కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జరిగిన ఘటనలకు సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. నారా లోకేశ్, టీడీపీ అనుకూల మీడియా దారుణమైన కుట్రలు చేసిందని, 10 కోట్ల రూపాయలు ఇచ్చిమరీ తన మాతృమూర్తిని తిట్టించారని పవన్ ఆరోపించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్లు దుమారంరేపుతున్నాయి. నా కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారు: ‘‘ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి అండగా నిలబడ్డ నాకు చంద్రబాబు నాయుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చారు. సచివాలయం వేదికగా లోకేశ్, అతని సన్నిహితుడు, అనుకూల టీవీచానెల్స్‌తో కలిసి నా కుటుంబంపై ఆరు నెలలుగా నిరవధిక అత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒకటే.. కొడుకుగా కన్నతల్లిని కాపాడుకోలేనప్పుడు చావడమే నయం. ఈ రోజు నుంచి ఏ క్షణమైనా చావడానికి సిద్ధపడి ముందుకు వెళుతున్నాను’’ అని పవన్ తెలిపారు. డబ్బులిచ్చింది వీళ్లే: దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, భర్త, పిల్లలే ప్రపంచంగా జీవించి, ఎవరికీ అపకారం చేయని తన మాతృమూర్తిపై కొందరు వ్యక్తులతో దారుణంగా తిట్టించారని, అలా తిట్టడానికి రూ.10 కోట్లు ఇచ్చారని, దర్శకుడు వర్మ, ప్రముఖ చానెల్ యజమాని, దాని నిర్వాహకుడు, నారా లోకేశ్, అతని స్నేహితులు కలిసి చేస్తోన్న దారుణాలు చంద్రబాబుకు తెలియదంటే నమ్మాలా? అని పవన్ పేర్కొన్నారు. హోదా కంటే ‘వ్యభిచారమే’ ముఖ్యమా?: అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు చేస్తోన్న కుట్రలను విమర్శించే క్రమంలో పవన్ అతితీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ సీఎం చంద్రబాబు గారు.. ప్రత్యేక హోదా సాధన కంటే.. పచ్చ చానెళ్లు చేస్తోన్న వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంపైనే మీరు ఎక్కువ శ్రద్ధపెట్టారు. అసలు మీ ఉద్దేశం ఏమిటి?’’ అని పవన్ నిలదీశారు. -
వర్మది క్రూయల్ మైండ్
" నేను ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయ్యింది. మా నాన్నగారు అల్లు రామలింగయ్య, ఆ తర్వాతి తరంలో నేను, చిరంజీవి, ఆ తర్వాతి తరంలో పవన్ కల్యాణ్ నుంచి.. చిత్ర పరిశ్రమలో ఉన్న మాకు ఇండస్ట్రీ అంటే భక్తి, గౌరవం. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న బాధాకరమైన విషయాలు మీకు తెలిసినవే. శ్రీరెడ్డిగారు తీసుకొచ్చిన కొన్ని విషయాలపై ఫిల్మ్‌చాంబర్‌లో జరిగిన మీటింగ్స్‌లో ఒక్కదానిలో తప్ప అన్నింటిలో నేనూ ఉన్నా. లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఓ కమిటీ పెట్టుకోవాలి. వాటిని అరికట్టడానికి తీసుకోబోతున్న జాగ్రత్తల గురించి త్వరలో ఇండస్ట్రీ చెబుతుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. గురువారం అల్లు అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి పని చేయబోతోంది. 50 శాతం అవుట్‌సైడర్స్, 50 శాతంæఇండస్ట్రీవాళ్లతో కలిపి ఒక రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. వేధింపులు ఎదురయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 క్రాఫ్ట్స్‌లో వారు ఏ విభాగానికి చెందితే అందులోంచి తొలగించాలని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీలో నేను కూడా ఉండబోతున్నా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి నేను సీనియర్ మెంబర్ని. నేను టార్గెట్ చేస్తున్నది రామ్‌గోపాల్ వర్మని. రామ్‌గోపాల్‌వర్మ అనే వ్యక్తి గొప్ప సినిమాలు తీసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆల్ ఇండియా డైరెక్టర్‌గా ముంబైలో ఉన్నాడు. ఆయన తెలుగు ఇండస్ట్రీని తల్లిలా భావించాలి. కానీ, అతను ఎంత ద్రోహం చేస్తున్నాడు? ఎంత నికృష్టుడో చెప్పడానికే మీ ముందుకు వచ్చా. ‘బాహుబలి’ తీసింది మేమురా? తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకుని గర్వపడే ఈ సమయంలో ఇలాంటివి ఏంటి? అని బాధపడుతున్న తరుణం. బుధవారం రాత్రి ఓ వీడియో చూశాక రామ్‌గోపాల్ వర్మ‘గారు’ అనే గౌరవం పోయింది. ఒక ఛండాలపు మాటను పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డితో నేనే (వర్మ) అనిపించానని, ఇందుకు ఫ్యాన్స్‌కు క్షమాపణ అని రామ్‌గోపాల్ వర్మ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇంకో వీడియోలో రామ్‌గోపాల్‌వర్మ చెప్పడం వల్లే తాను ఇవన్నీ చేశానని శ్రీరెడ్డి వాయిస్ విన్నాను. ఈ వీడియో బయటకు వస్తుందని సేఫ్‌గా వర్మ ముందే తానే శ్రీరెడ్డితో అలా చెప్పించానని వీడియో రిలీజ్ చేసి, క్షమాపణ చెప్పాడు. నువ్వు (వర్మని ఉద్దేశించి) సురేశ్‌బాబు (నిర్మాత) ఫ్యామిలీతో మాట్లాడి, శ్రీరెడ్డికి 5 కోట్లు ఇప్పించడానికి ట్రై చేశానని చెప్పావు. నేను సురేశ్ ఫ్యామిలీ మెంబÆŠ్సతో మాట్లాడాను. ‘‘లా ఆఫ్ ది ల్యాండ్‌కు మేము లొంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్. ఎంకరేజ్ చేయం’’ అని చెప్పారు. శ్రీరెడ్డికి నువ్వు ఇప్పిస్తానన్న 5 కోట్ల ఆఫర్ నీకు ఇచ్చింది ఎవరు? ఆ అమ్మాయితో ఓ బూతు మాట్లాడించి పవన్ సైజ్ (ఇమేజ్) తగ్గిండానికి నీకు ఫండ్ చేస్తున్నది ఎవరు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? వంటి సందేహాలతో నాకు నిద్ర పట్టలేదు. ఇండస్ట్రీలోని ఒక ఫ్యామిలీపై నీకింత జాగ్రత్త ఉంటే.. మా కుటుంబం మీద లేదా? అంటే.. ఈ కుటుంబంలో చిరంజీవి, పవన్, రామ్‌చరణ్ ఉన్నారు. నీకీ కుటుంబం అంటే దుగ్ధ. సురేశ్ కుటుంబాన్ని కాపాడాలని అలా చేశానని అన్నావు. ఎంత నాటకం? నీ బతుక్కి అవసరమా? నువ్వు తెలివైనవాడివే. కానీ క్రూయల్ మైండ్. వర్మను ఏం చేస్తారనేది ఇండస్రీయే నిర్ణయిస్తుంది. వర్మకు సొసైటీ ఎటువంటి శిక్ష విధించాలి?’’ అన్నారు. -
రేపు శాంపిల్
ఇప్పటివరకూ ఆఫీసర్ ఎలా ఉంటాడో మాత్రమే తెలుసు. కానీ అతను డ్యూటీలో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో, ఎంత నిబద్ధతగా నడుచుకుంటాడో, క్రిమినల్స్ అంతు ఎలా తేలుస్తాడో తెలీదు. రేపు ఆఫీసర్ డ్యూటీ చేయడాన్ని చిన్న శాంపిల్ చూపిస్తాం అంటున్నారు ‘ఆఫీసర్’ టీమ్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘ఆఫీసర్’. కంపెనీ పతాకంపై సుధీర్ చంద్ర, రామ్‌గోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. మైరా సరీన్ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను రేపు విడుదల చేయనున్నారు. శనివారం రామ్‌గోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా నాగార్జున కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు. ‘‘నా ప్రెస్టీజియస్ మూవీ ‘ఆఫీసర్’ టీజర్‌ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నాను. నాగ్.. నాకు బర్త్‌డే విషెస్ అంటే పెద్దగా నచ్చదు. బట్ ప్లీజ్ మీరు విష్ చేయండి’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు వర్మ. దానికి నాగార్జున ‘‘ హే వర్మ. విషింగ్ యూ ఏ వెరీ వెరీ... ఎంజాయ్ ది డే. ఎలాగూ నువ్వు చేస్తావనుకో’’ అని సరదాగా రిప్లై ఇచ్చారు. ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. -
ఆయనకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే!
సాక్షి, సినిమా : నటి రాధికాఆప్తే అంటే సంచలనానికి మారుపేరు అంటారు. సినిమాలతోనే జీవిస్తున్న ఈమె సినిమా వాళ్లపై తరచూ మాటాల తూటాలు పేల్చుతుంటారు. సెక్సీ పోజులతో దర్శనం ఇవ్వడం, వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించడం రాధికాఆప్తే నైజం. ఈ మధ్య గోవా సముద్ర తీరంలో బాయ్‌ఫ్రెండ్‌తో అర్ధనగ్నంగా కనిపించి వార్తల్లోకెక్కింది. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ అమ్మడిని రక్తచరిత్ర చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ఆ తరువాత ధోని చిత్రంతో కోలీవుడ్‌కు వచ్చింది. కబాలి చిత్రంలో రజనీకాంత్‌కు జంటగా నటించి పాపులారిటీని తెచ్చుకుంది. కాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి అందరికీ తెలిసిందే. తనకు ఏం అనిపిస్తే అది అనేసి తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంటారు. అలాంటిది తనను నటిగా పరిచయం చేసిన ఆయనకే రాధికాఆప్తే షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఈ అమ్మడు ఇప్పుడున్న నటులు, దర్శకుల్లో ఎవరు రిటైర్మెంట్ తీసుకోవాలని అంటారు అన్న ప్రశ్నకు ఏ మాత్రం తడుముకోకుండా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అని టక్కున బదులిచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రాధికాఆప్తే వ్యాఖ్యలకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. -
ఇద్దరి గురి ఎవరిపై?
ఫుల్లీ లోడెడ్ గన్‌తో టార్గెట్‌పై కాన్సంట్రేట్ చేశారు నాగార్జున. ఆన్ డ్యూటీలో ఈ ఆఫీసర్ ఏ విధంగా టార్గెట్‌ను రీచ్ అయ్యాడో తెలుసుకోవాలంటే మాత్రం ‘ఆఫీసర్’ సినిమా చూడాల్సిందే. నాగర్జున హీరోగా కంపెనీ పతాకంపై సుధీర్ చంద్రతో కలిసి రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘ఆఫీసర్’. మైరా సరీన్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. క్లైమాక్స్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ‘‘నా గన్‌తో పాటు మైరా సరీన్ గన్ కూడా ‘ఆఫీసర్’ సినిమా కోసం ఫుల్‌గా లోడై ఉంది. మే 25న థియేటర్స్‌లో షూట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు నాగార్జున. అంతేకాదు.. ఆన్లొకేషన్స్ ఫొటోలను షేర్ చేశారు. వీటిని చూసిన అభిమానులు నాగ్ మరో హిట్‌పై గురిపెట్టాడు అని అనుకుంటున్నారు. ‘‘మైరా సరీన్ యాక్టింగ్ చూసి నాగార్జున, నేను ఇంప్రెస్ అయ్యాం. సరీన్‌కు ఇది ఫస్ట్ మూవీ అంటే నమ్మబుద్ధి కావడం లేదు’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ఆఫీసర్ చిత్రాన్ని మే 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రామ్‌గోపాల్‌వర్మను అరెస్టు చేయాలి
అనంతపురం : ఐద్వా నాయకులురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మపై తక్షణం కేసు నమోదు చేసి అరెస్టు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులును ఐద్వా, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. మంత్రిని ఆదివారం ఆయన స్వగృహంలో ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి ఇతర నాయకురాళ్లు, నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ్‌గోపాల్ వర్మ ఇంగ్లీషులో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) అనే డిజిటల్ పోర్స్ సినిమా నిర్మించారన్నారు. దాని ట్రైలర్ యూటూబ్‌లో విడుదల చేశారన్నారు. ఆ సందర్భంగా ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్‌గోపాల్‌వర్మ ఐద్వా నాయకురాలు పీ మణి, సామాజిక కార్యకర్త పీ దేవిలపై అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా వ్యహరించిన ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకురాళ్లు యమున, చంద్రిక, రామాంజినమ్మ, వైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు నూరుల్లా, బాలకృష్ణ, పి.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీదేవి మరణంతో టైటిల్ ప్రకటన వాయిదా వేసిన వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వర్మ సొంత నిర్మాణ సంస్థ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఈ రోజు తెల్లవారు జామున ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణించడంతో టైటిల్ ప్రకటన చేయలేదు. రాంగోపాల్ వర్మ శ్రీదేవి మరణించడంతో అందరికన్నా ఎక్కువ బాధకు గురయ్యారని చెప్పొచ్చు. అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈరోజు ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేస్తూ విచారం వ్యక్తం చేస్తున్నారు. తనని తాను శ్రీదేవి ఆరాధకుడిగా చెప్పుకునే వర్మ ఆమెతో గడిపిన ప్రతిక్షణాన్ని సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు. వీటన్నింటి మధ్య నాగ్ సినిమా టైటిల్‌ను ప్రకటించలేదు. వర్మ టైటిల్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే. -
ఆర్జీవీ విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద అశ్లీల వెబ్ సిరీస్ ‘జీఎస్టీ’పై నమోదైన కేసులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) విచారణ వాయిదా పడింది. ఇప్పటికే ఓసారి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న ఆయన శుక్రవారం రెండోసారి హాజరుకావాల్సి ఉంది. తొలి రోజు విచారణలో ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించిన విషయం తెలిసిందే. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు సమాచారం అందించారు. ఈలోపు జీఎస్టీకి వర్మకు ఉన్న సంబంధాలను ఆరా తీసేందుకు ఈ వెబ్ సిరీస్‌కు పనిచేసిన మరికొందరిని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ విచారణలో తగిన ఆధారాలు లభిస్తే వర్మను అరెస్టు చేయాలా? లేక న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసి కోర్టు ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలా? అనే అంశంపై న్యాయనిపుణుల్ని సంప్రదిస్తున్నారు. నివేదిక వచ్చిన తర్వాతే వర్మను ప్రశ్నిస్తే మరిన్ని కీలకాంశాలు రాబట్టడంతో పాటుగా తదుపరి చర్యలు తీసుకోవానికి ఆస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
రాంగోపాల్ వర్మకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : వివాదాలకు కేంద్ర బిందువు, సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. గాడ్ సెక్స్ ట్రూత్(జీఎస్టీ)పై నమోదైన కేసులో తమ ముందు విచారణకు రావాలని వర్మకి సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల ఎదుట గురువారం వర్మ హాజరు కావాల్సివుంది. నోటీసు అందుకున్నా తాను విచారణకు హాజరు కాలేనని లాయర్ ద్వారా పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నానని, వచ్చే వారంలో మళ్లీ నోటీసు ఇస్తే వస్తానని వర్మ తెలిపినట్లు సమాచారం. రాంగోపాల్ వర్మకి పోలీసులు మళ్లీ నోటీసు ఇవ్వనున్నారు. మహిళలఫై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, మహిళలను పెట్టి న్యూడ్(అశ్లీల) సినిమాలు తీస్తానని అన్నందుకే నోటీసు ఇచ్చామని, దానిఫై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలియజేశారు. -
నాగ్ నాకు బ్రైట్ ఫ్యూచర్ ఉందని జాతకం చెప్పారు
నాగార్జునకి సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చాయండీ. చేయి చూసి భవిష్యత్తు చెప్పేస్తున్నారు. అదేంటి నాగార్జున ‘రాజుగారి గది 2’లో చేసిన రుద్రా పాత్ర గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఆ సినిమా గురించిన విషయం కాదు ఇది. ‘‘నాగార్జునగారు ఫ్యూచర్‌ని ప్రెడిక్ట్ చేస్తున్నారు’’ అని అంటున్నారు మైరా సరీన్. ఎవరీ మైరా సరీన్ అంటే నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు మైరా. ఈ చిత్రానికి ‘శపథం: మై రివెంజ్ కంప్లీట్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ‘‘షూటింగ్ గ్యాప్‌లో సరదాగా నాగ్ సార్ నా చేతి రేఖలను చూసి, ‘ఫిల్మ్ ఇండస్ట్రీలో నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది’ అని జోస్యం చె‡ప్పారు’’ అని పేర్కొన్నారు మైరా సరీన్. ఈ బ్యూటీకి ఇది ఫస్ట్ మూవీ. ఇంతకీ ఈ మైరా సరీన్‌ని రామ్‌గోపాల్ వర్మ ఎక్కడ చూశారు? ఎలా సెలెక్ట్ చేశారో తెలుసా? ‘‘మైరాను నేనో పార్టీలో చూసి, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అని అడిగాను. ఆ తర్వాత ఆడిషన్లో తన నాచ్యురల్ పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయ్యాను. తను చాలా ఎక్స్‌ప్రెసివ్’’ అన్నారు వర్మ. మరి నాగార్జున జోస్యం చెప్పినట్టుగా, వర్మ షాక్ అయినట్టుగా మైరా సరీన్ ఆడియన్స్‌ను కూడా ఇంప్రెస్ చేస్తారో లేదో చూడాలి. కంపెనీ పతాకంపై సుధీర్ చంద్ర– రామ్ గోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మైరా సరీన్ -
రాంగోపాల్ వర్మ పిచ్చి వదిలిస్తాం..
సాక్షి, విజయవాడ : ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మపై బీజేపీ మహిళా మోర్చ నేతలు శుక్రవారం విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీఎస్టీ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నాడంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చ నేతలు మాట్లాడుతూ.. వర్మకు పిచ్చి పట్టడం వల్లే ఇటువంటి అర్థంపర్థం లేని పనులు చేస్తున్నాడని మండిపడ్డారు. అందుకే ఆయనను భార్యతో పాటు కూతురు కూడా వెలి వేశారని అన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాంగోపాల్ వర్మ పిచ్చి వదిలిస్తామని బీజేపీ మహిళా మోర్చ నేతలు హెచ్చరించారు. కాగా... దేవుడూ, సెక్సూ, నిజమూ కలగలిసిన మియా మాల్కోవా అంటూ రాంగోపాల్ వర్మ ఓ ప్రెస్ నోట్ ద్వారా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు...ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మొత్తం ఫైనల్ వీడియో ఈ జనవరి 26 ఉదయం 9 గంటలకి 'మియా మాల్కోవా' పేరుతో ఉన్న అఫీషియల్ విమియో (www.vimeo.com) ఛానల్లో విడుదలవుతోంది. 26న రిలీజ్ అవ్వబోయే ఆ ఫుల్ వీడియోలో మాల్కోవా సంపూర్ణ నగ్నత్వంలోని అణువణువునీ నా కెమెరాతో ఒక పెయింటింగ్ లా తీర్చిదిద్దాను. ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని యూరోప్ లో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. నా కెమెరా కన్ను ఆమె సుందర నగ్నశరీరంలోని అంగాంగాన్ని ఆరాధించడమే కాకుండా ఆమె ఆలోచనల్లో వ్యక్తమయ్యే గూఢతని, ఆమెలో నిక్షిప్తమై ఉన్న శృంగార గాఢతని కూడా ఒక ఆధ్యాత్మిక కోణంలో ప్రకటిస్తుంది. దేవుడు, సెక్స్ మరియు నిజం లో మియా మాల్కోవా.. సమాజం అసభ్యం అనుకునే పదజాలాన్ని కూడా పలుకుతుంది..దానికి కారణం ఏది ఎవరికి సభ్యం, ఏది ఎవరికి అసభ్యం అని అనాది నుంచి వస్తున్న ప్రశ్నకి సమాధానమివ్వటానికే. విపరీత కట్టుబాట్ల సమాజం, ఒక పద్ధతి ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన స్వేఛ్చాలోచనల్ని బహిరంగ పరచడమే ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ యొక్క ముఖ్య ఉద్దేశ్యం . జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక మాగాడు తనపై చూపే శృంగారమయమైన ఆరాధనకు లొంగి శారీరకంగా, మానసికంగా ఆనందంలో తేలియాడాలనే స్వేచ్ఛను కోరుకున్న ప్రతి స్త్రీకి ఈ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనే ప్రాజెక్టు ఒక ప్రతినిధి. సెక్స్ పరంగా పొందే అపరాధ భావాలని, బలవంతపు బంధాలని, కుహనా నైతిక విలువలని అధిగమించడానికి ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనేది ఒక మహోన్నత సాధనం. అప్పటి వరకు ఉన్న ఆలోచనలకి అవతల ఏముందో ఆలోచించినప్పుడే ఏ మనిషికైనా ఒక బలమైన తాత్వికత పుడుతుంది. అదే జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో దర్శించడానికి దోహదపడుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది అనేక అవార్డులను పొందిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ కి తాను కూర్చిన సంగీతం మియా మాల్కోవా శృంగారంలో నాణ్యతనే కాకుండా ఆమె భావప్రకటనల్లోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని కూడా అత్యంత శక్తివంతంగా వ్యక్తపరచడానికి దోహదపడింది. సాధారణ స్వరకల్పనలకి అందని మహాద్భుతమైన ‘బాహుబలి’ కి, ఆధ్యాత్మికతని నిలువెల్లా నింపుకున్న ‘అన్నమయ్య’ సంగీతాన్ని కూర్చిన అత్యంత గొప్ప స్వరకవి కీరవాణి సెక్స్ విషయంలో కూడా అంతే నిబద్ధతని చూపడం, మియా మాల్కోవాలోని నిక్షిప్త నిధికి సరితూగే సంగీతాన్ని ఇవ్వటం నన్ను అబ్బురపరిచింది. మియా మాల్కోవా మీద నాకున్న అత్యంత గౌరవానికి గల కారణం తాను తనకు నచ్చిన విధంగా జీవించే నిర్ణయం తీసుకోవడం, తనకు తోచిన విధంగా సెక్స్ ని ఎంజాయ్ చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం....అంతే కాకుండా సెక్స్ ని పవిత్రంగా చూస్తూ అందులో మునిగి తేలడానికి సిగ్గు, అపరాధభావం ఉండకూడదని చెప్పే తన ఆలోచనల వెనక వున్న లోతుల్ని కూడా నేను చూడగలగడం. ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’లో మియా మాల్కోవా తన నిజాయితీ లోని శక్తితోటి, తన నమ్మకాలపై ఉన్న పట్టుతోటి, జగదేక సుందరిలాంటి తన అందమైన ముఖంలోని అమాయకత్వంతోటి ప్రతి వారిని సమ్మోహనంగా వశపరుచుకుంటుంది. మియాలోని అందం మరియు తాత్వికత, నిజాయితీ కలగలిసిన మాటల మూలాన సెక్స్ లోని అన్ని అంశాలు కళ్ళు, మెదడున్న ఎవరికైన స్వచ్ఛంగా, పవిత్రంగా, అందంగా కనిపిస్తాయి. మియా మాల్కోవా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే బలమైనది . ఎందుకంటే తాను కేవలం అందం అనే ఆయుధంతో యుద్ధం ప్రకటించి దాపరికాల సరిహద్దులన్నీ దాటి హిపోక్రిటికల్ మానవ సమాజంపై ధ్వజమెత్తి జయించటానికి నడుం కట్టుకుంది. ఏ మాత్రం కల్తీలేని ఆనందాన్ని ఎన్నో లక్షల మంది ప్రజలకి ఇవ్వడంలో మియా మాల్కోవా ఒక చారిటీ క్వీన్. అందుకనే ఆమె ఆలోచనలని అర్థం చేసుకునే బుర్ర వున్న ప్రతి ఒక్కరు ఆమెకు మనసారా కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేస్తారు. పేరుకుపోయిన సామాజిక కట్టుబాట్లు, దొంగ ముసుగులు, అనవసరమైన సంకెళ్లు అన్నింటినీ ఒక అందమైన నగ్న స్త్రీ నుంచి వచ్చే సహేతుకమైన ఆలోచనలతో పటాపంచలు చేసి ఒక కొత్త సెక్స్ ఒరవడిని సృష్టించడమే ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ వెనుక ఉన్న ఒక తాత్వికత. ఒక్క మాటలో చెప్పాలంటే, “‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ లో మియా మాల్కోవాని చూసి, విని అర్ధం చేసుకున్న వారందరి మనస్సులో సెక్స్ కి అర్ధమే మారిపోతుంది!! అని వర్మ పేర్కొన్నాడు. -
‘పవన్ నీకు దమ్ము, ధైర్యం లేదనుకుంటారు’
సాక్షి, హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన అని అభివర్ణించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా తమిళ ప్రజలంతా ఆయనకే ఓటేస్తారని, అతనిపై పోటీ చేయడం దండుగ అని పేర్కొన్నాడు. కొంతమంది తమిళ ప్రజలు తమ గౌరవాన్ని కోల్పోయారని, అది రజనీ తీసుకొస్తానని చెప్పడం గొప్ప విషయమని ప్రశంసించాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలను రజినీకాంత్‌తో పోలుస్తూ మరో కామెంట్ చేశాడు. ఇప్పటికే కేసీఆర్-పవన్ భేటీపై అవసరం ఎంతటికైనా మారస్తుందన్న వర్మ ..'సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేసినట్లుగానే పవన్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని స్థానాల్లో పోటీచేయాలి. అలా జరగకపోతే రజినీకాంత్‌లో ఉన్న దమ్ము, ధైర్యం పవన్‌లో లేవని ఆయన అభిమానులు భావిస్తారు. ఒకవేళ రజినీకాంత్‌లా కాకుండా తక్కువ స్థానాల్లో పోటీ చేస్తే మాత్రం అది మన తెలుగువారి ప్రతిష్టకే అవమానకరం' అని ఫేస్బుక్లో సంచలన పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, మా నేత రెండు రాష్ట్రాల్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా రాంగోపాల్ వర్మ ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ‘ట్విట్టర్ అజ్ఞాతవాసిలోకి వెళ్లిన నేను పవన్ అజ్ఞాతవాసితో స్పూర్తిని పొంది తిరగి వచ్చా అని’ సెటైరిక్ ట్వీట్ చేశాడు. Twitter Ajnaatavaasam loki velina nenu p k ajnaatavaasi tho inspire ayyi malli vachcha pic.twitter.com/nzjjDcHw5B — Ram Gopal Varma (@RGVzoomin) 2 January 2018 -
‘అవసరం ఎంతటికైనా మార్చేస్తుంది’
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ భేటీ అయిన విషయం తెలిసిందే. పవన్ తొలిసారిగా ప్రగతి భవన్‌కు రావటం, సీఎంతో భేటీ కావటం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. గతంలో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు దిగిన ఈ ఇద్దరు ఇలా భేటి కావడం.. కేసీఆర్ పాలనపై పవన్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్నే ప్రస్తావిస్తూ.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ భేటిపై తనదైన శైలిలో స్పందించారు. అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చెస్తుందని ఫేస్బుక్ వేదికగా సెటైర్ వేశారు. వర్మ పోస్ట్ ఏమిటంటే.. పవన్ కల్యాణ్: ఏయ్.. కేసీఆర్ నీ తాట తీస్తా..!!! కేసీఆర్: ఆడి పేరేందిరా బై.. ??? అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతటికైనా మార్చేస్తుంది. జై రాజకీయ నాయకుల్లారా! అని కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోకి క్యాప్షన్‌గా పోస్ట్ చేశారు. -
రజనీ పొలిటికల్ ఎంట్రీపై వర్మ కామెంట్!
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. తలైవా రాజకీయాల్లోకి రావడం ‘ఈవెంట్ ఆఫ్ ది సెంచరీ’ అని అభివర్ణించిన వర్మ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రజనీని ఆదర్శంగా తీసుకొని అన్నిస్థానాల్లో పోటీచేయాలని తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నాడు. ‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన (ఈవెంట్ ఆఫ్‌ది సెంచరీ).. రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పే సందర్భంలో రజనీ స్క్రీన్‌పై కనిపించే సూపర్ స్టార్ కన్నా వెయ్యిరెట్లు ప్రభావితంగా కనిపించారు. తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన తలైవా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పీకే(పవన్ కళ్యాణ్) ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి’ అని వర్మ సూచించాడు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. సత్యం, కార్యం, అభివృద్ధి (ట్రూత్, వర్క్, గ్రోత్).. తమ పార్టీ మూల సూత్రాలుగా ఉంటాయని అభిమానులతో రజనీ చెప్పారు. -
‘పవన్ ఫస్ట్ లుక్ కన్నా శిరీష్ ఫస్ట్ లుక్ బెట్టర్’
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్‌పై రామ్‌గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. తన ట్విట్టర్లో ‘ నేను పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిని. అయితే, ఒక్క క్షణం ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. పీఎస్పీకే 25 ఫస్ట్ లుక్ కంటే ఒక్క క్షణం ఫస్ట్ లుక్ మిలియన్స్ టైమ్స్ బెట్టర్ అని‘ వర్మ ట్విట్ చేశారు. ఈ సారి అల్లు శిరీస్ పవన్ కళ్యాణ్‌పై పైచేయి సాధించాడని కూడా ఆ ట్విట్లో పేర్కొన్నారు వర్మ. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక్క క్షణం చిత్రంలో హీరో అల్లు శిరీష్, హీరోయిన్ సురభిలు నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలిసారిగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ మాస్ పాటను ఆలపించారన్న ప్రచారం జరుగుతోంది. -
పవన్ అభిమానులకు వర్మ సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్..! తనకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు విడిచారు. మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ జన సమూహం అవుతున్నారంటే ఎవరిని పుట్టించిన ఏ అమ్మలో ఏ బిడ్డ తప్పుందో ఏ అమ్మకి కూడా తెలియదని ప్రతి నాన్నకు తెలుసని వివాదస్పద పోస్ట్ చేశారు. ఇక పవన్ రాజకీయ పార్టీ జనసేనపై.. పవన్, సన్నీలియోన్ తో కలిసి రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తే అసాధారణ రాజకీయ శక్తిగా మారుతారని తన ప్రగాఢ నమ్మకమని, ఎందుకంటే ఇద్దరు వేరు వేరు విధాలుగా ప్రజలకి వేరు వేరు వినోదాత్మక సుఖాలు ఇచ్చారని వర్మ పేర్కొన్నాడు. ఇక చివరిగా సన్నీలియోన్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య ఒకరిని కౌగిలించుకునే అవకాశం వస్తే ఎవరిని కౌగిలించుకుంటారన్నది పవన్ అభిమానిగా పవన్ లక్షల అభిమానులకు నా ప్రశ్న. అని అభిమానులను ఆగ్రహానికి గురిచేసే పోస్టు పెట్టారు. ఈ వరుస పోస్టులపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలోమండిపడుతున్నారు. ఎప్పుడు సన్నీలియోన్, శ్రీదేవి తప్ప వర్మకు వేరే ధ్యాస లేదంటూ విమర్శిస్తున్నారు. -
అప్పుడు సన్నీ.. ఇప్పుడు ఇవాంక..!
సాక్షి, హైదరాబాద్ : అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి విచ్చేయనున్నారు. ఇక ఆమె రాకపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో కామెంట్లు చేశాడు. ‘నాకు ఏ మాత్రం రాజకీయ అవగాహన లేదు. ఇవాంక హైదరాబాద్‌లో ఎందుకు పర్యటిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె అందాన్ని చూడటానికి మాత్రం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. గతంలో సన్నీ లియోనీ ఇండియాకు వచ్చినప్పడు ఎంత ఎగ్జయిట్ అయ్యానో.. ఇప్పుడూ అంతే ఆత్రుతతో ఉన్నా ’ అని వర్మ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇవాంకను బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో పోలుస్తూ వర్మ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా, ఈ నెల(నవంబర్) 28న జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సమ్మేళనానికి ఇవాంక హాజరుకాబోతున్నారు. మూడు రోజులపాటు ఈ సమ్మేళనం జరగనుంది. ఎనిమిదో సమ్మేళనాన్ని భారత్-అమెరికాలు సంయుక్తంగా భారత్‌లో నిర్వహించాలని గతేడాది ప్రధాని మోదీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఫస్టఫాల్.. ముందసలు!
ట్విట్టర్లో రోజూ ఏదో ఒక కొట్లాట, తిట్లాట ఉండేదే! చిదంబరానికి మోదీ మీద కోపం వస్తే ట్విట్టర్లోకి వెళ్లి ‘కుహూ’ అంటాడు రామ్‌గోపాల్ వర్మకు టీడీపీ వాళ్లపై కోపం వస్తే ఆ ట్విట్టర్లోకే వెళ్లిపోయి ‘క్యా బే’ అంటాడు. ట్విట్టర్లో అంతా ఫైట్ మాస్టర్లేనా? పీటర్ హేన్స్లేనా! కాదు, కొన్ని కూల్ పిట్టలూ వచ్చి వాలుతుంటాయి. రెండు మూడు రోజులగా కొన్ని పిట్టలు ‘ఫస్ట్ ఆఫ్ ఆల్’ అనే కొమ్మను పట్టుకుని ఎగురుతున్నాయి. ఇవన్నీ నెటిజన్ల జోక్స్. రెండు లైన్ల జోక్స్. వాటిల్లో వైరల్ అయిన జోక్ ట్వీట్స్ ఇవి. ఎంజాయ్ చెయ్యండి. హ్యాపీ జర్నీ. కిటికీలోంచి బయటికి చేతులు పెట్టకు. ఫస్ట్ ఆఫ్ ఆల్.. నేను ఫ్లైట్‌లో వెళ్తున్నా. నీకేది ఇష్టమో అందులో డిగ్రీ చెయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండియన్. నా మెసేజ్‌లకు రిప్లై ఎందుకు ఇవ్వడం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్... నువ్వెవరో నాకు తెలీదు! హేయ్, ఐ లవ్ యు. ఫస్ట్ ఆఫ్ ఆల్.. అది నా ప్రాబ్లం కాదు. -
‘లక్ష్మీ వీరగ్రంధం’ తీయడం చట్టవిరుద్ధం
హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మౌన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధపెట్టాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూర్చుంటే... ఆ బాధల నుంచి కాస్త ఉపసమనం దొరుకుందని వచ్చాను. నా భర్తకు జరిగిన అన్యాయంపై ఎన్నో యేళ్లుగా పోరాటం చేస్తున్నా. నా పోరాటానికి తప్పనిసరిగా నా భర్త తోడు ఉన్నారు. ఆయన ఆత్మ నాకు అండగా ఉంటుంది. నా జీవిత చరిత్రపై లక్ష్మీ వీరగ్రంధం సినిమా తీయడం చట్టవిరుద్ధం. అనుమతి లేకుండా సినిమా తీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ సినిమాకు నా అనుమతి తప్పనిసరి. అయితే లక్ష్మీ వీరగ్రంధం సినిమా గురించి నన్ను ఎవరూ ఇంతవరకూ సంప్రదించలేదు’ అని అన్నారు. మరోవైపు ఎన్టీ రామారావు జీవితకథ ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఆరు భాషల్లో లక్ష్మీ వీరగ్రంధం అయితే దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీ వీరగ్రంధం చిత్రాన్ని ఆరు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. పూర్తి ఆధారాలతో ఈ సినిమా తీస్తున్నానని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. అలాగే లక్ష్మీ వీరగ్రంధం సినిమా టీజర్‌ను కేతిరెడ్డి ఇవాళ మీడియాకు విడుదల చేశారు. -
ఎన్టీఆర్ బయోపిక్‌పై వివాదం
-
‘టీడీపీ ఎమ్మెల్యే అనితకు అంత సీన్ లేదు’
సాక్షి, విశాఖ : తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట ఎమ్మెల్యే అనితపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి అనితకు లేదన్నారు. ఆమె తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని గొల్ల బాబూరావు మండిపడ్డారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. టీడీపీ అలీబాబా 40 దొంగల్లో అనిత ఓ సభ్యురాలని గొల్ల బాబూరావు వ్యాఖ్యలు చేశారు. కాగా ఎమ్మెల్యే అనిత ...రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కునున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై స్పందించిన విషయం తెలిసిందే. చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైఎస్ఆర్ సీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న వాళ్లపై కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఎమ్మల్యే అనిత వ్యాఖ్యలపై వర్మ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. బయట తెలిసిన చరిత్ర వెనుక... లోపలి అసలు చరిత్ర చూపించడమే తన అసలు సిసలు ఉద్దేశమంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
25 ఏళ్ల తరువాత వారి కాంబినేషన్లో..
-
‘సీనియర్ ఎన్టీఆర్’.. వర్మ ఫస్ట్ లుక్
సాక్షి, హైదరాబాద్: దివంగత నందమూరి తారక రామారావు జీవిత కథను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరిట తెరకెక్కిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ లుక్‌లో ఓ మహిళ చెప్పులు విడిచి గడప దాటుతూ ఇంట్లోకి వెళుతుండగా.. లోపల మరో వ్యక్తి కాషాయపు దుస్తులు ధరించి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఈ లుక్‌ను గమనిస్తుంటే లోపలికి వెళ్తున్న పాత్రలో లక్ష్మీపార్వతి, లోపలున్న వ్యక్తి ఎన్టీఆర్ పాత్రలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వివాదాస్పద పోస్ట్ లు చేసిన రామ్ గోపాల్ వర్మ తాజా లుక్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే లీడ్ రోల్స్ లో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. -
వీహెచ్ x వర్మ.. ఓ అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి పోస్టర్ చించేసిన కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు బట్టలను చించేయాలని హీరో విజయ్ దేవరకొండను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. వీహెచ్ మారుమూల పల్లెలో జన్మించి ఉంటారని, కనీసం పలకా బలపం కూడా పట్టి ఉండరని అందుకే అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్‌ను నడిరోడ్డులో చించేశారని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో పలు వివాదాస్పద పోస్టులు పెట్టారు. వీహెచ్ మైండ్ సెట్ పురాతన కాలంలో ఉండిపోయిందని అన్నారు. అదీ ఎంతలా అంటే మధ్యయుగ కాలంలోని మనుషుల్లా అని నొక్కి చెప్పారు. హనుమంతరావు అర్జున్ రెడ్డి పోస్టర్‌ను ఎందుకు చించేశారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. బహుశా.. అంత అందమైన అమ్మాయి.. విజయ్ దేవరకొండకు ముద్దివ్వడం ఆయనకు రుచించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీహెచ్‌కు అలాంటి అందమైన మహిళ ఎప్పుడూ ఇలా ముద్దు ఇవ్వాలేదా? అని ప్రశ్నించారు. వీహెచ్.. అర్జున్ రెడ్డి పోస్టర్‌ను తన మనవళ్లు, మనవరాళ్లకు చూపించి అందులో ఏదైనా తప్పుందా? అని అడగాలని అన్నారు. తాను చేసిన పోస్టులు తాతయ్యకు అర్థం కాదేమోనని కామెంట్ చేశారు. 'తాతయ్యా..! అర్జున్ రెడ్డి సినిమా మీ తాతయ్యల కోసం కాదు. మీ మనవళ్లు మనవరాళ్ల కోసం అని అర్థం చేసుకోండి.' అని వర్మ పోస్టులో పేర్కొన్నారు. 'మీ పార్టీ ఎలానో తాతయ్య అయిపోయింది. మీ పిల్ల చేష్టల వల్ల భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి రాష్ట్రంలోని మీ మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ ఓటు వేయరని అన్నారు. అప్పుడు మీ వల్ల మీ కాంగ్రెస్ పార్టీ పే..ద్ద.. తాతయ్య అయిపోతుంది' అంటూ మరో కామెంట్ చేశారు. -
చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?
-
చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయినా?
ఆమెను అలా పోల్చడం సరికాదు వర్మకు జొన్నవిత్తుల కౌంటర్ హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన సినీ నటి చార్మిని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో వరుస కామెంట్లు పెట్టారు. సిట్ విచారణ ముగిసిన అనంతరం ధైర్యంగా బయటకు వచ్చిన చార్మిని చూస్తే.. ఆమెను సిట్ విచారించినట్టుగా కాకుండా ఆమెనే సిట్‌ను ప్రశ్నించినట్టు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు తర్వాత చార్మి.. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ధైర్యంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. సిట్ విచారణ సందర్భంగా చార్మి గోర్ల నమూనాలను తీసుకోవడం కాదు.. ఆమె మేకప్ చేసుకున్నట్టు కనిపిస్తున్నదని వర్మ పేర్కొన్నారు. అయితే, దర్శకుడు వర్మ వ్యాఖ్యలపై రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 'చార్మి వీరనారి కాదు.. సిట్ అధికారులు ఆంగ్లేయులు కాదు. చార్మిని ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం సరికాదు' అని జొన్నవిత్తుల అన్నారు. -
హైదరాబాద్ ఇంత బ్యాడా?
ముంబై ప్రజలు అడుగుతున్నారు:వర్మ సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో ఎక్సైజ్ సిట్ తీరును తప్పుపడుతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మంగళవారం ఫేస్బుక్లో వరుస పోస్టింగ్‌లతో విరుచుకుపడ్డారు. ఈ కేసు తీవ్రత ఎలా ఉన్నా హైదరాబాద్ ప్రతిష్టను మాత్రం దెబ్బ తీస్తోందని, హైదరాబాద్ ఇంత బ్యాడా అని ముంబై ప్రజలు తనను అడుగుతున్నట్లు పేర్కొన్నారు. కొందరినే టార్గెట్ చేసి జాతీయ స్థాయిలో డ్రామా నడపడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట కూడా మసకబారుతుందని అన్నారు. అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ విచారణతో వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని చాలా మంది అనుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను అనేక విషయాల్లో ముంబై ప్రజలు మెచ్చుకుంటారని కానీ టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ వ్యవహారాన్ని చూసి షాక్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ‘బాహుబలి’ ద్వారా తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని డైరెక్టర్ రాజమౌళి పెంచారని ప్రజలు అనుకుంటుండగా అకున్ సబర్వాల్, ఆయన బృందం కలసి తలదించుకునేలా చేశారని అన్నారు. అందుకే సిట్‌ను సరిగా సెట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. వర్మ ట్వీట్స్‌పై రంగారెడ్డి కోర్టులో కేసు సినీరంగాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో ఎక్సైజ్ శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. డ్రగ్స్ మాఫియా పేరుతో సినీ పరిశ్రమ ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు బాహుబలిలా కనిపిస్తున్నారంటూ వర్మ తన ట్వీటర్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ న్యాయవాది రంగప్రసాద్ కోర్టులో పిటిషన్ వేశారు. వర్మ వ్యాఖ్యలు ఎక్సైజ్ శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని, ఇది శిక్షార్హమని తన పిటిషన్లో పేర్కొన్నారు. నిబం ధనలు ఉల్లంఘిస్తే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కూడా జైలుశిక్ష పడే అవకాశముందన్నారు. -
డ్రగ్స్ కేసు.. వర్మపై కోర్టులో పిటిషన్
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో ఎక్సైజ్‌శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలైంది. సినీ పరిశ్రమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ బాహుబలిలా మీడియాకు కనిపిస్తున్నారని వర్మ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వర్మ వ్యాఖ్యలను తప్పుబడుతూ న్యాయవాది రంగప్రసాద్ రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు చేశారని, ఇలా వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమేనని రంగప్రసాద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుతో వర్మకు సంబంధం లేదని, అయినా ఎక్సైజ్ అధికారులను కించపరిచేవిధంగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వర్మ వ్యాఖ్యలు చేశారని రంగప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించేవిధంగా వ్యవహరించడం, వ్యాఖ్యలు చేయడం ఐపీసీ సెక్షన్ 343 ప్రకారం చట్టవిరుద్ధమని, ఇలా ప్రవర్తించినందుకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కూడా జైలుశిక్ష పడే అవకాశముందని ఆయన చెప్పారు. సినీ ప్రముఖుల తరహాలోనే డ్రగ్స్ తీసుకున్న స్కూలు పిల్లలను కూడా పిలిచి గంటలు గంటలు విచారిస్తారా? అని వర్మ ప్రశ్నించడం తగదని, దేశంలో మైనర్లు, మేజర్లకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని రంగప్రసాద్ అన్నారు. ఎక్సైజ్‌శాఖను అవమానపరిచేవిధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయని, పోలీసు, ఎక్సైజ్‌శాఖలపై ప్రజల్లో గౌరవముందని, దానిని దెబ్బతీయడం సరికాదని చెప్పారు. టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తున్నదంటూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా?' అని నిలదీశారు. -
డ్రగ్స్ కేసు.. వర్మపై కోర్టులో పిటిషన్
-
డైరెక్టర్ వర్మకు అకున్ కౌంటర్ ఇదే!
హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను అమరేంద్ర బాహుబలిలా మీడియా చూపిస్తున్నదంటూ ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా?' అని నిలదీశారు. వర్మ వ్యాఖ్యలపై అకున్ సబర్వాల్ పరోక్షంగా స్పందించారు. డ్రగ్స్ తీసుకున్న స్కూల్ పిల్లల పేర్లు బయటపెట్టబోమని, ఇలా బయటపెడితే వారి భవిష్యత్తు, జీవితం నాశనం అవుతాయని పేర్కొన్నారు. సిట్ మీద కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, పూర్తిగా చట్టబద్ధంగానే సిట్ విచారణ సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న స్కూల్ పిల్లలు మైనర్లు అని, చట్టప్రకారం వారి పేర్లు వెల్లడించకూడదని చెప్పారు. ఎవరి పిల్లలైనా పిల్లలేనని, చిన్నవాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని చెప్పారు. డ్రగ్స్ తీసుకున్న పిల్లల తల్లిదండ్రులను పిలిచింపి కౌన్సెలింగ్ ఇప్పించినట్టు తెలిపారు. -
అకున్‌తో బాహుబలి–3 తీయాలేమో!
-
అకున్‌తో బాహుబలి–3 తీయాలేమో!
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణపై రాంగోపాల్‌వర్మ - ఫేస్బుక్లో వివాదాస్పద కామెంట్లు - నటీనటులను విచారించినట్టే విద్యార్థులను విచారిస్తారా అని ప్రశ్న - వర్మపై మండిపడ్డ ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం - అరెస్ట్ తప్పదంటూ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌పై ఫేస్బుక్లో అనుచిత కామెంట్లు పెట్టారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు, సిట్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. అరెస్టు తప్పదంటూ హెచ్చరించింది. అకున్ను బాహుబలిలా చూపుతున్న మీడియా: వర్మ ‘సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా? డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ విభాగం తన ప్రచారానికి సినీ నటులను ట్రైలర్, టీజర్‌గా వాడుకుంటోంది. డ్రగ్స్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదన్న విషయం చట్టపరంగా బయటపడుతుంది. కానీ అకున్ సబర్వాల్ విచారణలో సినీ వ్యక్తులు చెప్పిన విషయాలు, చెప్పని విషయాలను మీడియాకు లీకులిస్తున్నారు. అకున్ను మీడియా అమరేంద్ర బాహుబలి తరహాలో చూపిస్తోంది. బహుశా అకున్ సబర్వాల్‌తో రాజమౌళి బాహుబలి పార్ట్–3 తీయాలేమో. డ్రగ్స్ తీసుకున్నట్టు ఎక్కడా ఎలాంటి కేసులు లేకున్నా విచారణ పేరుతో మీడియాకు లీకులిచ్చి సంబంధిత నటీనటుల కుటుంబీకులు బాధపడేలా, వారి గౌరవం దెబ్బతినేలా అకున్ సబర్వాల్, అతడి దర్యాప్తు బృందం వ్యవహరిస్తోంది. డ్రగ్స్ నియంత్రణలో అకున్ పాత్ర సరైనదే కానీ, విచారణకు హాజరవుతున్న వారితో సిట్ వ్యవహరిస్తున్న తీరుపై మీడియాలో వచ్చే ఊహాగానాలను ఆపడం మీ బాధ్యత కాదా? విచారణ జరుగుతున్న తీరుపై మీడియాకు లీకులిచ్చి సంబంధిత విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల పట్ల మీ విభాగం అమర్యాదగా ప్రవర్తిస్తోంది’ అంటూ రాంగోపాల్ వర్మ ఫేస్బుక్లో కామెంట్లు చేశారు. కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం... డ్రగ్స్ కేసు విచారణ జరుపుతున్న అధికారులు, అకున్ సబర్వాల్‌పై వివాదాస్పద కామెంట్లు చేసిన వర్మపై ఎక్సైజ్ సిట్‌తోపాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా విచారణ సంస్థ, అధికారులపై ఆరోపణలు చేసిన వర్మపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమూద్ అలీ మీడియాకు తెలిపారు. అరెస్టు తప్పదని హెచ్చరించారు. వర్మ విజ్ఞతకే వదిలేస్తున్నాం: చంద్రవదన్ రాంగోపాల్‌వర్మ చేసిన కామెంట్లు సరికాద ని, అయినా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. అన్ని ఆధారాలతోనే విచారణ జరుగుతోందని, అంద రూ సహకరిస్తున్నారని తెలిపారు. చట్టాలకు లోబడే చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం పూర్తి అధికారం ఇచ్చిందని చెప్పారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎక్సైజ్ శాఖను దెబ్బతీసే ప్రయత్నం కొంత మంది చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పబ్బులకు నోటీసులిచ్చి విచారణ జరిపామన్నారు. వీటిలో నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్న ‘ఎఫ్ క్లబ్’ పబ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మరో 14 పబ్బుల యాజమాన్యాలకు హెచ్చరిక నోటీసులిచ్చామని, సీసీ కెమెరాలు, రికార్డులు తదితర వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశామన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలని, అక్కడ పార్టీలు చేసే ఈవెంట్‌మేనేజర్లు, డ్యాన్సర్ల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. ఆరు నెలల నుంచి ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్బుల లైసెన్స్ సస్పెన్డ్ చేస్తామని హెచ్చరించారు. -
నో డౌట్.. డైరెక్టర్ వర్మ అరెస్టు ఖాయం!
-
నో డౌట్.. డైరెక్టర్ వర్మ అరెస్టు ఖాయం!
సిట్ విచారణను ఆటంకపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఆయనపై కేసు పెడుతాం... హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీప్రముఖులను విచారిస్తున్న సిట్ అధికారులపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసును విచారిస్తున్న అధికారి లక్ష్యంగా వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్, సిట్ అధికారులపై వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అలీ మీడియాతో మాట్లాడారు. ఎక్సైజ్‌శాఖ చేపడుతున్న విచారణపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. రాంగోపాల్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, సాయంత్రం ఆయనపై ఆబిడ్స్ పోలీసు స్టేషన్ లేదా ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదుచేస్తామని తెలిపారు. సిట్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మ అరెస్టు ఖాయమని, నో డౌట్ అని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో విచారణను ఆటంకపరిచేవిధంగా వర్మ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అకున్ సబర్వాల్ ఫొటో పెట్టి బాహుబలి-3 అంటూ వర్మ వ్యాఖ్యలు చేయడం చాలా అభ్యంతరకరని మండిపడ్డారు. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్, సుబ్బరాజులకు మద్దతుగా తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'సిట్ అధికారులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం' అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో వర్మ పోస్ట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే తెలుగు ఆర్టిస్టుల సంఘం 'మా' సైతం తప్పుబట్టింది. -
వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్!
వాస్తవ సంఘట నలను, జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సిద్ధహస్తుడు! ఫర్ ఎగ్జాంపుల్... తెలుగులో ఆయన తీసిన ‘రక్త చరిత్ర’, ‘వంగవీటి’... కన్నడలో ‘కిల్లింగ్ వీరప్పన్’... హిందీలో ‘సర్కార్’ సిరీస్, ‘ద ఎటాక్స్ ఆఫ్ 26/11’ సినిమాలు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను తీయబోతు న్నట్టు వర్మ ప్రకటించారు. అంటే... ఎన్టీఆర్ గురించి వర్మ స్వయంగా చెప్పిన మాటలు, ‘జై ఎన్టీఆర్...’ అంటూ పాడిన పాటతో కూడిన ఆడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అందులో ‘నేను ఎన్టీఆర్ ఫ్యాన్’ అని వర్మ పేర్కొన్నారు. అయితే... హీరోగా ఎవరనేది వర్మ చెప్పలేదు. ఎన్టీఆర్ తనయుడు, నటుడు బాలకృష్ణ తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా త్వరలో సినిమా తీస్తామనీ, అందులో తానే హీరోగా నటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే... బాలకృష్ణ హీరోగా నటించబోయే ఎన్టీఆర్ బయోపిక్‌కి వర్మ దర్శకత్వం వహిస్తారా? లేదా మరో హీరోతో తీస్తారా? వెయిట్ అండ్ సీ!! -
సన్నీ లియోన్‌లా కావాలని..
-
సన్నీ లియోన్‌లా కావాలని..
‘ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకటి కావాలనుకుంటారు. నేను.. సన్ని లియోన్‌లా కావాలనుకుంటున్నాను. ఆమెలాగా సెక్సువాలిటీయే పెట్టుబడిగా డబ్బు సంపాదించి లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా..’ అంటూ ఓ యువతి తన తల్లిదండ్రుల ముందే బాంబు పేల్చడంతో మొదలవుతుంది.. ‘మేరీ బేటీ సన్నీ లియోన్ బన్నా చాహ్తీ హై’(నా కూతురు సన్నీ లియోన్‌లా కావాలనుకుంటోంది) షార్ట్ ఫిలిం. సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ఈ లఘుచిత్రం శనివారం యూట్యూబ్‌లో విడుదలైంది. తనకు నచ్చినట్లు జీవిస్తానని వాదించే అమ్మాయి, ఆ మార్గం సరైంది కాదని వారించే తల్లిదండ్రుల నడుమ ఒక గదిలో చోటుచేసుకున్న సంభాషణను షార్ట్ ఫిలింగా మలిచిన ఆర్జీవీ.. కేవలం నాలుగు గంటల్లోనే 50వేలకు పైగా హిట్స సాధించడం గమనార్హం. ‘గన్స అండ్ థైస్’ వెబ్ సిరీస్ ప్రోమోలో హింస, శృంగారాన్ని విచ్చలవిడిగా చూపించిన వర్మ.. ‘మేరీ బేటీ సన్నీలియోన్..’లో మాత్రం అలాంటి పని చేయలేదు. అయితే సంభాషణలు మాత్రం పీక్స్‌లో ఉంటాయి. సన్నీ లియోన్ కావాలనుకునే యువతిగా నైనా గంగూలీ(వంగవీటి ఫేం), తండ్రి పాత్రలో మకరంద్ దేశ్‌పాండే(ఏక్‌నిరంజన్, దండుపాళ్యం ఫేం), తల్లిపాత్రలో దివ్యా జగ్దలే నటించారు. ఆర్జీవీ టాకీస్ పతాకంపై రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం నిడివి 11.30 నిమిషాలు. దీనిని చూసి ఎప్పటిలాగే ‘వర్మ పర్వర్షన్ ఇంకాస్త శృతిమించింద’ని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. -
అక్కడ నేను చనిపోయాను: వర్మ
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మరోసారి సంచలనం సృష్టించాడు. తన సినిమాల్లో వివాదాలు, ట్విట్టర్లో పలువురి మీద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ నుంచే బయటకు వెళ్లిపోయాడు!! ముందుగా రాత్రి 8 గంటలకు తాను ఒక అన్ ప్లెజెంట్ వార్త చెబుతానని అన్నాడు. కాసేపటి తర్వాత, అప్పటివరకు వేచి ఉండలేనని, ఇప్పుడే చెప్పేస్తానని అన్నాడు. ఒక్క నిమిషం కూడా తను వృథా చేయదలచుకోలేదని చెప్పాడు. తాను ట్విట్టర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నానని, ఇన్ని సంవత్సరాల పాటు తనను ఫాలో చేసినందుకు నో థాంక్స్ అని తన ఫాలోవర్లకు చెప్పాడు. తన అభిప్రాయాలన్నింటినీ ఇక మీదట ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లోనే చెబుతానన్నాడు. తన ట్విట్టర్ మరణానికి ముందు ఇదే తన చిట్టచివరి ట్వీట్ అని, అయితే తాను ఎప్పుడూ 'రిప్' మాత్రం చెప్పబోనన్ని అన్నాడు. ట్విట్టర్లో తన జననం 27.5.2009 అని, మరణం 27.5.2017 అని చెబుతూ.. సరిగ్గా 8 సంవత్సరాల పాటు తాను ట్విట్టర్లో ఉన్న విషయాన్ని వెల్లడించాడు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ట్విట్టర్ పేజి చూసేందుకు ప్రయత్నించగా, ఈ పేజీ మనుగడలో లేదనే సందేశం కనిపించింది. అంటే, ట్విట్టర్ నుంచి క్విట్ కావడంతో పాటు పాత ట్వీట్లు అన్నింటినీ కూడా డిలీట్ చేసేశాడన్న మాట!! To all my twitter followers,I have a pleasantly unpleasant surprise for u in an hours time at 8 pm — Ram Gopal Varma (@RGVzoomin) 27 May 2017 Just decided to prepone my surprise to be revealed at 8 pm to now itself because I don't want to waste anymore time — Ram Gopal Varma (@RGVzoomin) 27 May 2017 My pleasantly unpleasant surprise is I am getting out of Twitter ..To all my followers,no thanks for following me all these years — Ram Gopal Varma (@RGVzoomin) 27 May 2017 I decided to speak only through pictures and videos on instagram from now on https://t.co/AjvynLEHrW — Ram Gopal Varma (@RGVzoomin) 27 May 2017 This my last tweet before my tweet death..but I will not RIP nd seriously work from now on @RGVzoomin Birth:27/5/2009 Death:27/5/2017 — Ram Gopal Varma (@RGVzoomin) 27 May 2017 -
హాట్ హాట్‌గా 'గన్స్ అండ్ థైస్'
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ వివాదం. వివాదాలతోనే సినిమాలకు ప్రమోషన్లు తెప్పించే రేంజ్‌కు ఆయన ఎప్పుడో ఎదిగిపోయారు. తాజాగా గన్స్ అండ్ థైస్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నట్లు తన ట్వీటర్ ద్వారా వెల్లడించాడు వర్మ. ఊరికే ప్రకటనతో సరిపెడితే ఆయన వర్మ ఎందుకు అవుతారు. దానికి తోడు ఓ ఆరున్నర నిమిషాలకు పైగా నిడివి గల ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. అంతే ఒక్కసారిగా కొత్త వివాదం బయటకు వచ్చింది. కారణం గన్స్ అండ్ థైస్ ట్రైలర్లో మహిళలను అశ్లీలంగా చూపించడం. దీన్ని సమర్ధించుకుంటూ వర్మ చేసిన మరికొన్ని ట్వీట్లు అగ్ని ఆజ్యం పోసినట్లయింది. 'ఒక వెబ్‌సిరీస్‌లో కథను ఉన్నది ఉన్నట్లు చూపించొచ్చు. సెన్సార్షిప్ ఈ మీడియంలో ఉండదు.' అని వర్మ పేర్కొన్నాడు. ‘గన్స్ అండ్ థైస్’ ట్రైలర్లో క్రైమ్ సీన్లు జుగుప్సాకరంగా ఉన్నాయి. తన సినిమాల్లో ఇంత వరకూ సెన్సార్షిప్ కారణంగా చూపించలేని భయంకరమైన హింసను ఈ ట్రైలర్లో చూపించాడు వర్మ. గతంలో ముంబై మాఫియాకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించాలని. . ఆ సన్నివేశాలను రియలిస్టిక్‌గా చిత్రీకరించాలని ప్రయత్నించినా కుదరలేదని.. ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్‌లో వాటిని ప్రజంట్ చేస్తున్నట్లు తెలిపాడు. -
మనసు దోచావ్ అన్నారు!
సర్కార్... ఓ బ్రాండ్. అమితాబ్ బచ్చన్ హీరోగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’ సినిమాలు సూపర్ హిట్. ఈ బ్రాండ్‌లో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన మూడో సినిమా ‘సర్కార్–3’కి కథ, స్క్రీన్‌ప్లే అందించింది పాతికేళ్ల తెలుగబ్బాయి పి. జయ కుమార్. ఊరు కడప జిల్లాలోని రైల్వే కోడూరు. సినిమాలపై పిచ్చితో ఢిల్లీ జేఎన్‌యూలో ఎం.ఎ. ఫిల్మ్స్ ఫైనల్ సెమిస్టర్ డుమ్మా కొట్టి వర్మ దగ్గర చేరిన జయకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ – ‘‘వర్మగారి దగ్గర రెండున్నరేళ్లు గా పని చేస్తున్నా. ‘సర్కార్–3’ కోసం ఆయన కథలు పరిశీలిస్తున్నప్పుడు నేనీ కథ చెప్పగానే ‘మేం వెధవలమనుకుంటున్నావా?’ అన్నారు. ‘ఎందుకు సార్!’ అన్నా. ‘అలా ఫీలైనోడే ఇలాంటి కథ రాయగలడు’ అన్నారు. కథ ఆయనకు నచ్చడంతో ‘సర్కార్–3’ స్టార్ట్ చేశారు. ‘క్లైమాక్స్‌తో నువ్వు నా మనసు దోచావ్’ అని అమితాబ్‌గారు మెచ్చుకున్నారు. అమితాబ్–వర్మ సినిమాతో రచయితగా పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు. -
బాహుబలి: టాలీవుడ్ కులాలపై వర్మ సెటైర్లు
బాహుబలి-2 సినిమా సాధించిన బ్లాక్ బస్టర్ విజయంతో ప్రతి ఒక్కరూ దీని గురించే మాట్లాడుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తలలో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఇదే పనిలో కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన టాలీవుడ్లో ఉన్న కులాల కుమ్ములాటల గురించి ప్రస్తావించేందుకు ఈ సినిమాను వాడుకున్నాడు. కొంతమంది హీరోలు కాపుల మీద, కమ్మల మీద దృష్టి పెట్టినట్లుగా ప్రభాస్ కూడా రాజుల మీద మాత్రమే దృష్టి పెట్టి ఉంటే అతడు కేవలం ఒక ప్రాంతీయ హీరోగానే మిగిలిపోయేవాడని, అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు అంతర్జాతీయ స్టార్ అయ్యాడని వర్మ ట్వీట్ చేశాడు. ప్రాంతీయ అభిమానుల గురించి ప్రభాస్ పెద్దగా పట్టించుకోడు కాబట్టి అతడు జాతీయ, అంతర్జాతీయ అభిమానులను సొంతం చేసుకున్నాడని, ప్రాంతీయ అభిమానులను గురించి పట్టించుకునే స్టార్లు ఎప్పటికీ ప్రాంతీయంగానే ఉండిపోతారని కూడా అన్నాడు. ఇక ఉత్తర భారతానికి చెందిన ఒక వ్యక్తి... హిందీ సినిమాలో తొలిసారి ఓ దక్షిణాది హీరో మిగిలిన ఉత్తరాది హీరోలందరినీ హీరోయిన్లుగా కనపడేలా చేశాడంటూ కామెంట్ చేశారు. దానికి కూడా స్పందించిన వర్మ.. ఉత్తర దక్షిణాలను వేర్వేరుగా చూడొద్దని, భారతీయ సినిమా అనే మొత్తం కాన్సెప్టులో చూడాలని, అలాగే ప్రభాస్‌ను కేవలం దక్షిణ భారతీయ నటుడిలా కాకుండా భారతీయ నటుడిలా చూడాలని హితవు పలికాడు. If Prabhas concentrated on Rajulu like others did on Kaapulu kammalu etc he would remain regional..he became international because he dint — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 Since Prabhas dint care regional fans he got national and international fans .. Stars who care regional fans will always remain regional — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 Only bigger film than BB2 is to see extremely tight close ups of all south Indian super stars n directors when being told BB2 collections — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 Seeing love of entire india for him I request u to lose this horrible regressive view of north south divide and embrace Prabhas as Indian https://t.co/3vX8UyfoXI — Ram Gopal Varma (@RGVzoomin) 2 May 2017 -
‘బాహుబలి-2’ మీకు నచ్చలేదా? అయితే..!
సినీ పండితులు ముందే చెప్పారు. అభిమానులు ఎప్పుడో ఊహించారు. అంతా అనుకున్నట్టుగానే భారీ అంచనాలతో విడుదలైన ‘బాహుబలి-2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపిస్తున్నది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్బులో చేరిన ఈ సినిమా భారత సినీ చరిత్రలో వెయ్యికోట్ల క్లబ్బులో చేరిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ పండితులు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కొంతమందికి ‘బాహుబలి-2’ సినిమా నచ్చి ఉండకపోవచ్చు. అలా ఈ సినిమా నచ్చనివారు ఎవరైనా ఉంటే వారికోసం దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్ ముందుకొచ్చారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వర్మ ‘బాహుబలి-2’ సినిమాను మాత్రం ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలోనే ‘ఎవరికైనా ‘బాహుబలి-2’ సినిమా నచ్చకపోతే వారిని చూసి నేను బాధపడతాను. వారికి మానసిక వైద్యుడి సాయం అవసరముంది. అలాంటి వారి డాక్టర్ బిల్లు స్వచ్ఛంద సేవ కింద నిర్మాత శోభూ భరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రేక్షకులు ‘బాహుబలి-2’ ఆదరిస్తున్న పరిస్థితిని చూస్తుంటే.. ఈ సినిమా చూడటానికి అరుణగ్రహం నుంచి గ్రహాంతరవాసులు స్పేస్‌షిప్‌లో భూమికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ తనదైన స్టైల్లో పేర్కొన్నారు. Be sad on person who disliked #Baahubali2 as he/her needs psychiatric help nd I request producer @Shobu_ in to pay doctor bill for charity — Ram Gopal Varma (@RGVzoomin) 29 April 2017 -
అయ్యా.. నన్ను ఒగ్గెయ్యండయ్యా..: రాజమౌళి
ఒకవైపు నాలుగు రోజుల్లో భారీ సినిమా విడుదల కాబోతోంది. అదికూడా ముందు ఒక భాగం అనుకున్నది రెండు భాగాలుగా తీసిన సినిమా. అలాంటప్పుడు దర్శకుడు ఎంత టెన్షన్‌తో ఉంటాడో ఊహించగలం కదా. కానీ ఇలాంటి సమయంలో రాంగోపాల్ వర్మ తనతో కలిసి తీయించుకున్న ఫొటోను ట్వీట్ చేసి.. దానికి ఏవేవో కామెంట్లు పెట్టడంతో రాజమౌళి ఏమనుకున్నారో ఏమో.. 'అయ్యా, నన్ను ఒగ్గెయండయ్యా' అంటూ వర్మను బతిమాలుకున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి గతంలో ఎప్పుడో ఒక సందర్భంలో తాను ఉన్న ఫొటోను రాంగోపాల్ వర్మ పొద్దున్నే ట్వీట్ చేశారు. దానికి 'బ్యూటీ అండ్ అగ్లీ' అని కేప్షన్ పెట్టారు. ఇక అప్పటినుంచి ట్వీట్ల యుద్ధం మొదలైంది. తాను అగ్లీగా ఉన్నానని, రాజమౌళి మాత్రం అందమైన బాహుబలి కంటే కూడా చాలా సెక్సీగా కనపడుతున్నారని ఆ తర్వాత మరింత వివరణ ఇచ్చారు వర్మ. అయితే ఈ సంవాదంలోకి ఉన్నట్టుండి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ ప్రవేశించాడు. మీరిద్దరూ గొప్ప దర్శకులన్నది వాస్తవమని, అయితే ఇద్దరూ అగ్లీగానే ఉన్నారని ట్వీట్ చేశాడు. దాంతో వర్మకు చిర్రెత్తుకొచ్చింది. మీరు చాలా బాగా చెప్పారని, అందరూ మీ అంత, షారుక్ ఖాన్ అంత అందంగా ఉండలేరని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దానికి మళ్లీ కమాల్ స్పందిస్తూ తాను అందంగా ఉన్నానన్న విషయం తనకు తెలుసని, అయితే షారుక్ ఖాన్ గురించి మాత్రం చెప్పలేనని అన్నాడు. దానికి ఈ ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని వర్మ అన్నారు. ఆ తర్వాత తనదైన శైలిలో అగ్లీ.. బ్యూటీ అంటూ ఆ రెండు పదాల కలయికతో ఓ పెద్ద వాక్యాన్ని ట్వీట్ చేశారు. @RGVzoomin Ayyaaa...nannu oggeyyandayyaa.... -
వర్మతో సినిమా చేస్తానన్న సూపర్ స్టార్
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో స్టార్ హీరో కాదు కదా.. కొత్త హీరోలు కూడా వర్మ సినిమా అంటే బయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. గత దశాబ్ద కాలంలో వర్మ సినిమా స్థాయి దారుణంగా పడిపోయింది. ఈ గ్యాప్ లో ఒక్క అమితాబ్ తప్ప మరే స్టార్ హీరో కూడా వర్మతో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో సత్తా చాటుతున్న మోహన్ లాల్ బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన కంపెనీ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన లాల్, మరోసారి వర్మతో సినిమా చేయడానికి తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. -
ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్ బాబు
హైదరాబాద్ : మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు. గుండెపోటుతో దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. నెహ్రూ తన ఆప్తమిత్రుల్లో ఒకరని, ఆయన మృతి బాధాకరమన్నారు. షిర్డీ సాయిబాబా.. నెహ్రూ కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మంచు మనోజ్ కూడా నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. Devineni Nehru Garu 's sad demise is an irreparable loss to the politics. I will miss him! My most sincere condolences to the family. — Manoj Manchu ❤️ -
రాజమౌళి.. పవన్ కలిసి సినిమా తీస్తే!
ఒకవైపు కాటమరాయుడు సినిమా విడుదలై దాని రికార్డుల గురించి చర్చలు జరుగుతుండటం, మరోవైపు బాహుబలి 2 సినిమా ఆడియో రిలీజ్, ప్రీరిలీజ్ వేడుక అట్టహాసంగా జరగడంతో.. ఈ అంశంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. రాజమౌళి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించి ఓ సినిమా చేస్తే అది బాక్సాఫీసులను బద్దలుకొట్టి, రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని అన్నాడు. అది వీలైనంత త్వరగా జరిగితే బాగుంటుందని తాను ఆశిస్తున్నట్లు కూడా రామూ చెప్పాడు. అమెరికాలో ఇప్పటికే 9 లక్షల డాలర్ల వసూళ్లను దాటిన కాటమరాయుడు సినిమా త్వరలోనే ఒక మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకునేందుకు సిద్ధంగా ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికి మొత్తం 6.04 కోట్ల రూపాయలను ఈ సినిమా అమెరికాలో వసూలు చేసినట్లు చెప్పాడు. If @ssrajamouli and @PawanKalyan do a film together it will box the office and record the breaks and as a fan I wish that to happen ASAP — Ram Gopal Varma (@RGVzoomin) 26 March 2017 Telugu film #Katamarayudu is all set to cruise past $ 1 million in USA... Sat $ 245,052. Total: $ 924,089 [₹ 6.04 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) 26 March 2017 -
టాలీవుడ్‌పై వర్మ మార్కు సెటైర్లు
టాలీవుడ్ నుంచి ముంబై వెళ్లిపోయి.. అక్కడే సినిమాలు తీసుకుంటూ, అక్కడే తన ఆఫీసు కూడా పెట్టేసుకున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ... బాహుబలి పేరుతో మరోసారి టాలీవుడ్ మీద విరుచుకుపడ్డాడు. ఇందుకోసం ఎప్పటిలాగే తన ట్విట్టర్ అకౌంట్ వాడుకున్నాడు. బాహుబలి 2 ట్రైలర్‌కు ప్రపంచం అంతా జై కొడుతున్నా, టాలీవుడ్ మాత్రం సూపర్ సైలెంట్‌గా ఉందని, అందుకు కారణం కుళ్లు సముద్రంలో మునిగిపోవడమేనని అన్నాడు. టాలీవుడ్ పవర్ఫుల్ స్టార్లు జాతీయ స్థాయిలో ప్రయత్నించి, ఘోరంగా విఫలమై ఇప్పుడు ప్రాంతీయ స్థాయిలో మిగిలిపోయారని, ప్రభాస్ మాత్రం రెండు దెబ్బలతో అంతర్జాతీయ స్టార్ అయిపోయాడని వర్మ చెప్పాడు. బాహుబలి 2 తర్వాత టాలీవుడ్లో పవర్‌ఫుల్లెస్ట్ మెగా సూపర్‌స్టార్లందరికీ కూడా ప్రభాస్ కాలిగోటిని అందుకోడానికి రెండున్నర జన్మలు పడుతుందని వ్యాఖ్యానించాడు. BB2 trailerni Prapanchamantha jai kodutunna tollywood matram super silentgaa vundataaniki kaaranam Kullu samudramlo munigipovadam moolana — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2017 Tollywood powerful starlu national ga try chesi ghoramga fail ayyi regional ayipoyaru .Prabhas rendu debbalatho international star ayipoyadu — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2017 BB2 tharvatha tollywoodlo powerfulest mega superstarlandariki kooda Prabhas kaali gotinandukovataaniki rendunnara janmalu paduthundhi — Ram Gopal Varma (@RGVzoomin) 16 March 2017 -
దెబ్బ తిన్న సింహంలా తిరిగొచ్చిన సర్కార్
ఆయన యాంగ్రీ యంగ్ మాన్. ఇప్పుడు కాదు.. ఎప్పుడో ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎప్పుడూ లేనంత మరింత యాంగ్రీగా తిరిగొచ్చాడు. ఎందుకంటే, దెబ్బతిన్న సింహం ఎప్పుడూ మరింత ప్రమాదకరం అవుతుంది. సుభాష్ నాగ్రే కూడా అంతే. సర్కార్ సినిమాల్లో ప్రతి సిరీస్‌కు ఆయన మరింత యాంగ్రీగా కనిపిస్తాడు. వయసు పెరిగేకొద్దీ అమితాబ్ బచ్చన్ ముఖంలో నవరసాలు మరింత ఘాటుగా పలుకుతున్నాయి. రాంగోపాల్ వర్మ తీసిన సర్కార్-3 సినిమా ట్రైలర్ చూస్తే అదే అనిపిస్తుంది. ''గాయపడిన సింహం మరింత ప్రమాదకరం'' అనే మాటలతోనే ఈ సినిమాలో అమితాబ్ ఇంట్రడక్షన్ కనిపిస్తుంది. ఆయన కొడుకులు ఇద్దరూ మరణిస్తారు గానీ ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గరు. సర్కార్-2 సినిమాలో శంకర్ పాత్ర పోషించిన అభిషేక్ బచ్చన్ ఫొటో గోడకు వేలాడుతుంటుంది. 'దర్ద్ కీ కీమత్ చుకానీ పడ్తీ హై' (బాధ విలువను చెల్లించక తప్పదు) అని అమితాబ్ సింహంలా గర్జిస్తారు. ఈసారి సర్కార్ సినిమాలో కొత్త పాత్రలు చాలానే కనిపిస్తాయి. సర్కార్ మనవడు శివాజీ పాత్రలో అమిత్ సాద్ కనిపిస్తాడు. గోవింద్ దేశ్‌పాండే పాత్రలో రెబల్‌గా మనోజ్ బాజ్‌పాయి, అను పాత్రలో వెన్నుపోటు పొడిచే హీరోయిన్ యామీ గౌతమ్, వాల్యా అనే పాత్రలో సర్కార్‌కు వ్యతిరేకంగా ఉండే జాకీ ష్రాఫ్.. వీళ్లంతా మనకు కొత్తగానే కనిపిస్తుంటారు. సర్కార్‌కు నమ్మకస్తుడైన సహాయకుడిగా రోనిత్ రాయ్ ఉంటాడు. తుపాకుల మోతలు, ఎప్పటికప్పుడు టెన్షన్.. తప్పనిసరిగా సర్కార్ సినిమాలో ఉండే వినాయక చవితి అన్నీ ఇందులో ఉంటాయి. 'ఈ చేతులతోనే చంపుతా' అనే సుభాష్ నాగ్రే మాటలతో సర్కార్ -3 ట్రైలర్ ముగుస్తుంది. అంటే, దీనికి మరో భాగం కూడా ఉంటుందని అనుకోవాలేమో మరి!! రాంగోపాల్ వర్మ మళ్లీ అమితాబ్‌తో కలిసి తీసిన ఈ సినిమా వెండితెర మీదకు ఎప్పుడు వస్తుందో మాత్రం రాము ఇంకా చెప్పలేదు. Amitabh Bachchan in and as SARKAR in SARKAR 3 Trailer.... May the POWER be with you... https://t.co/ZuUM8b0lJa — Ram Gopal Varma (@RGVzoomin) 1 March 2017 -
అమ్మఆత్మ..మోదీ భూత వైద్యుడు
-
హారర్ మూవీ:అమ్మఆత్మ..మోదీ భూతవైద్యుడు
చెన్నై: తమిళనాట నిమిష నిమిషానికి మారుతున్న ఉత్కంఠ పరిణామాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సౌమ్యుడుగా, పార్టీకి వీరవిధేయుడుగా వుంటూ వచ్చిన తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ మంగళవారం తిరుగుబాటుపై ట్విట్టర్ ద్వారా వర్మ స్పందించారు. పన్నీర్ ధిక్కారం వెనక మోదీ సర్కారు వ్యూహం ఉంది.. మోదీ అండతోనే పన్నీర్ సెల్వం శశికళపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు చెలరేగుతుండగానే..వర్మ ట్విట్టర్ ద్వారా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు జయ సమాధి సాక్షిగా పురుచ్చిత్తలైవి ఆత్మ తనతోమాట్లాడిందనీ, రాష్త్ర ముఖ్యమంత్రిగా ఉండమని ఆదేశించిందన్న పన్నీర్ సెల్వం వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తమిళనాట రాజకీయాలు రాజకీయ హారర్ మూవీని తలపిస్తున్నాయన్నారు. అమ్మ ఆత్మ పన్నీర్ సెల్వం రాష్ట్ర ముఖమంత్రిగా ఉండాలని ఆదేశిస్తే.... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూత వైద్యుడు కానున్నారా అంటూ ట్వీట్ చేశారు. కాగా పన్నీర్ సెల్వం ఎగరవేసిన తిరుగుబాటు జెండా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంమొత్తం తమిళరాజకీయ పరిణామాలవైపు చూస్తోంది. అటు ముఖ్యమంత్రి పీఠంపై చిరకాలంగా కన్నేసిన శశికళ...తాజా భంగపాటుతో తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే పన్నీర్ సెల్వంను చెక్ పెట్టే పనిలో బిజీగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. నా ఆత్మ క్షోభిస్తోంది.. అంటూ నిన్న సాయంతం సెల్వం పేల్చిన బాంబులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయనకు భారీ మద్దతు లభిస్తోంది. అటు శశికళకూడా సెల్వం డీఎంకేతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. మరి.. రానున్న కాలంలో తమిళనాట రాజకీయ పరిణామాలు ఎలా పరిణమించనున్నాయో.. వేచి చూడాల్సిందే.. Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now? — Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2017 -
ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ
-
ఆయనవి అసమాన ధైర్యసాహసాలు: వర్మ
సాధారణంగా ఎవరినైనా విమర్శించడానికి మాత్రమే తన ట్విట్టర్ ఖాతాను ఉపయోగించుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ప్రత్యేక హోదా ఉద్యమం గురించి స్పందించారు. విశాఖపట్నంలో నిర్వహించదలచిన శాంతియుత ప్రదర్శన విషయంలో వైఎస్ జగన్ అసలైన నిబద్ధతను, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని చెప్పారు. గురువారం విశాఖలో తలపెట్టిన నిరసన ప్రదర్శనలకు తనవంతు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన ఆయనకు 'హ్యాట్సాఫ్' అని ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రానికి మేలుచేసే అంశం కోసం శాంతియుతంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తామంటే.. దాన్ని అడ్డుకునేందుకు ఏకంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని విమానాశ్రయం రన్‌వే మీదనే అరెస్టు చేసిన ఘటన విశాఖపట్నంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పోలీసుల తీరును వైఎస్ జగన్ గట్టిగా నిలదీశారు. అసలు వచ్చినవాళ్లు పోలీసులా కాదా.. ఐడీ కార్డులేవని అడిగారు. Y S Jagan showed real determination and exempalary courage in his actions to support today's protest..Hats off to him — Ram Gopal Varma (@RGVzoomin) 26 January 2017 -
'వర్మ గురించి మాట్లాడటం వేస్ట్'
ట్విట్టర్లో ఎప్పుడూ కామెంట్లు పెడుతూ సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడటం వేస్ట్ అని చిరంజీవి అన్నారు. ఖైదీ నెం.150 సినిమా ప్రీలాంచ్ వేడుక సందర్భంగా నాగబాబు - వర్మ మధ్య మొదలైన వివాదం గురించి 'సాక్షి టీవీ' ఇంటర్వ్యూలో ఆయనను అడిగినప్పుడు ఇలా స్పందించారు. ఎవరినైనా ఒకళ్లను పొగడాలంటే పొగడచ్చు గానీ, అందుకోసం రెండోవాళ్లను కించపరచడం సరికాదని, రాంగోపాల్ వర్మ అలాగే చేస్తారని అన్నారు. ఆయన చాలా కుత్సితంగా ఆలోచిస్తారని, తన సినిమా పోస్టర్లు విడుదల చేసినప్పుడు అందులోని లుంగీ స్టిల్ గురించి చాలా ఘోరంగా కామెంట్ చేశారని, అది మంచిపద్ధతి కాదని చెప్పారు. ఆయన చాలా మేధావి అని, తన ఆలోచనలను సక్రమంగా ఉపయోగించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది గానీ ఇలా కామెంట్లు చేయడం తగదని అన్నారు. నాగబాబు మనసులో ఏదీ దాచుకోలేడని, అందుకే ప్రీలాంచ్ వేడుక సందర్భంగా రాంగోపాల్ వర్మ గురించి గట్టిగా మాట్లాడాడని తెలిపారు. పవన్ కల్యాణ్ గురించి కూడా వర్మ పలు విమర్శలు చేశాడని, ఆయన ఎవరినీ వదలట్లేదని చెప్పారు. -
వర్మ గురించి మాట్లాడం వేస్ట్:చిరంజీవి
-
వర్మ ట్వీట్లపై చిరంజీవి ఏమన్నారు..
ఖైదీ నెం.150 చిత్రం ప్రీలాంచ్ వేడుక సందర్భంగా చెలరేగిన వివాదంపై ఎట్టకేలకు చిరంజీవి స్పందించారు. వ్యక్తిగతంగా తనకు ఎవరితోనూ విభేదాలు లేవని, తాను రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లను పట్టించుకోనని చెప్పారు. అయితే తన పెద్ద తమ్ముడు నాగబాబు ఏ సందర్భంలో హర్టయ్యాడో మాత్రం తనకు తెలియదని ఆయన అన్నారు. ఖైదీ నెం.150 చిత్రం ప్రీలాంచ్ వేడుక వేదికపై నాగబాబు మాట్లాడుతూ యండమూరి వీరేంద్రనాథ్, రాంగోపాల్ వర్మల పేర్లు ప్రస్తావించకుండా వారిని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. దానిపై వర్మ కూడా అదేస్థాయిలో ప్రతిస్పందిస్తూ వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా కూడా 'తేలుపిల్ల కుట్టిందా.. వానపాము కరిచిందా' అంటూ నాగబాబు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని వర్మ ప్రశ్నించారు. (తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?) -
తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?
ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు మొదలుపెట్టిన వివాదాన్ని దర్శకుడు ఇప్పట్లో ముగించడానికి రాంగోపాల్ వర్మ ఇష్టపడుతున్నట్లు లేడు. చిరంజీవి ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ అంటూ.. 'రౌడీ నెం.150' అనే ఒక పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసిన వర్మ.. మళ్లీ అర్ధరాత్రి అదే అంశం మీద మరో సెటైర్ వేశాడు. నాగబాబును 'ఎన్బి' అని సంబోధించిన వర్మ.. ''నిన్న అంత అరిచి ఈవాళ ఇంత సైలెంట్‌గా ఉండటానికి కారణం, తేలుపిల్ల కుట్టిందా, వానపాము కరిచిందా?'' అని ప్రశ్నించాడు. (వర్మ సమర్పించు.. రౌడీ నెం.150) చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా రచయిత యండమూరి, రామ్‌గోపాల్ వర్మలపై మండిపడ్డారు. ఒక వ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్‌ను ఒక మాట అంటే మైలేజి పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు. అయితే దానిమీద వెంటనే ట్విట్టర్లో విపరీతంగా కౌంటర్లు వేసిన వర్మ.. దాన్ని అక్కడితో ఆపకుండా ప్రతిరోజూ అదే అంశంపై ఏదో ఒకటి చెబుతూనే ఉండటం గమనార్హం. (రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు) NB ninna antha arichi ivvala intha silentgaa vundataaniki kaaranam, thelu pilla kuttindha? Vaana paamu karichindha? — Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2017 -
వర్మ సమర్పించు.. రౌడీ నెం.150
దాదాపు తొమ్మిదిన్నరేళ్ల విరామం తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో మొదలైన వివాదాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పట్లో ముగించేలా లేడు. చిరంజీవి ఫ్యాన్స్ డిజైన్ చేసిన పోస్టర్ అంటూ.. 'రౌడీ నెం.150' అనే ఒక పోస్టర్‌ను తన ట్విట్టర్లో విడుదల చేశాడు. ఖైదీనంబర్ 150 పోస్టర్‌కు వర్మ ముఖాన్ని అతికించి.. మెగాస్టార్ అభిమానులు ఈ ఫొటోను తయారుచేశారని చెప్పాడు. మరోటి అచ్చం ఖైదీ టైటిల్ లాగే ఉండేలా తయారుచేసి, చేతిలో కాఫీగ్లాసు పట్టుకుని దాన్ని ముఖానికి అడ్డుపెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ ఫొటో పెట్టాడు. ఖైదీ నెం.150 వేడుక సమయంలో వేదికమీద నుంచి నాగేంద్రబాబు చేసిన ప్రసంగంలో రాంగోపాల్ వర్మను పేరు ప్రస్తావించకుండా చేసిన విమర్శలతో వర్మ తీవ్రంగా మండిపడ్డాడు. దేవుడు చిరంజీవి కుటుంబంలో పవన్, చరణ్, సాయిధరమ్, వరుణ్, బన్నీ.. వీళ్లందరికీ చాలా సానుకూల లక్షణాలు ఇచ్చాడు గానీ, నాగబాబుకు మాత్రం బ్యాలెన్స్ ఇవ్వలేదని అంతకుముందు మరో ట్వీట్లో వర్మ మండిపడ్డాడు. ఆ తర్వాత.. వివిధ ప్రముఖులు ఈ అంశాలపై చెప్పిన కొటేషన్లను కూడా వర్మ ట్వీట్ చేశాడు. అందులో.. 'అద్దాల మేడల్లో ఉండేవాళ్లు ఎదుటి వారి మీద రాళ్లు వేయకూడదు' అని భగవద్గీత అన్నట్లు కూడా పేర్కొన్నాడు. అలాగే, 'తన కుటుంబంలోని పనికిమాలినవాళ్లను ప్రేమించడం వారినే విధ్వంసం చేస్తుంది' అని డామన్ వయాన్స్ అన్న మాటను, 'జీవితంలో పూర్తిగా ఓడిపోయి ఇతరులను విమర్శించడం అంటే, తుపానుకు ఎదురుగా నిలబడి నోటితో గాలి ఊదడం' అన్న ఫ్రాంక్లిన్ ఫోయర్ మాటలను కూడా ట్వీట్ చేశాడు. వీటన్నింటినీ కూడా నాగబాబును ఉద్దేశించే ఆయన పేరు ప్రస్తావించకుండా వర్మ చెప్పడం గమనార్హం. Love for one's own undeserving family members will be destructive to oneself----Damon Wayans — Ram Gopal Varma (@RGVzoomin) 8 January 2017 People who live in glass houses should not throw stones at others --Bhagavadgeetha — Ram Gopal Varma (@RGVzoomin) 8 January 2017 Absolute Failures in life criticising others Is like blowing wind with one's mouth against a hurricane---Franklin Foer — Ram Gopal Varma (@RGVzoomin) 8 January 2017 -
రాంగోపాల్ వర్మపై మెగాఫ్యాన్స్ ఫైర్
-
రాంగోపాల్ వర్మపై మెగాఫ్యాన్స్ ఫైర్
'ఖైదీనంబర్ 150' ప్రీ రిలీజ్ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు రచయిత యెండమూరి వీరేంద్రనాథ్, దర్శకుడు రాంగోపాల్ వర్మపై చేసిన విమర్శలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనపై విమర్శలు చేసిన నాగబాబుకు అంతే ఘాటుగా వర్మ బదులిచ్చారు. నాగబాబుకు చురకలంటించారు. ఈ ఎపిసోడ్లో వర్మ తీరుపై మెగాఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా కుటుంబంపై, నాగబాబుపై వర్మ శృతిమించి ఆరోపణలు చేస్తున్నారని అభిమానులు అంటున్నారు. 'ఖైదీనంబర్ 150' వేడుకలో నాగాబాబు మాట్లాడుతూ.. 'తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ముంబై వెళ్లిన ఒకడు రకరకాల కూతలు కూస్తున్నాడు. ఈ కూతలు ఆపేసి దర్శ కత్వం సక్రమంగా చేసుకుని, ఆ బాంబ్ ఏదో అక్కడే ముంబై లో పేల్చుకుంటే... వాడికీ మంచిది, మాకూ మంచిది. చిరంజీవి సినిమా ఎలా ఉండాలి? ఆయన ఎలా చేయాలి? అని మాట్లాడడం. ఇలాంటి అక్కుపక్షి, పనికిమాలిన సన్నాసి కూసే కూతలతో మాకేం కాదు. ఇలాంటి పక్షి ఎన్ని కూతలు కూసినా.. సూపర్‌హిట్ సినిమాని ఆపలేవు. ఫెయిల్యూర్ సినిమాని లేపలేవు’’ అంటూ వర్మపై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు దర్శకుడు వర్మ అంతే ఘాటుగా బదులిచ్చారు. దశాబ్ద కాలం లొ ఒక్క రక్తచరిత్ర తప్ప (తెలుగు లో) హిట్ లెదు. ఆయన జయ అపజయాల గురించి హితబోధలు. #KhaidiNo150 #BossIsBack — Stay Strong !! (@pepparsalt9) 8 January 2017 ‘నాగబాబు సార్.. మీకు ఇంగ్లిష్ అర్థం కాదు ఎవరితోనైనా చదివించుకోండి. నాకు సలహా ఇచ్చేముందు మీ ‘జబర్దస్త్’ కెరీర్ గురించి ప్రశ్నించు కోండి. ‘ప్రజారాజ్యం’ టైమ్‌లో మీ అన్నయ్యకు తప్పుడు సలహాలిచ్చి ఆయన ఓడిపోయేలా చేశారు. ‘అక్కుపక్షి’ అనే కామెంట్స్ చేసి టైమ్ వృథా చేసుకునే బదులు మీ సోదరు లను బతిమాలుకోండి. లేదంటే రోడ్డున పడే అవకాశం ఉంది’’ అని వర్మ ట్వీట్స్ చేశారు. నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి ? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి. #KhaidiNo150 #BossIsBack — Stay Strong !! (@pepparsalt9) 8 January 2017 మొత్తానికి ఈ ఎపిసోడ్లో వర్మ తీరును మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. 'నాగబాబు మాట్లాడిన దానిలో తప్పు ఎంటి? ఒకరిని విమర్శించేటప్పుడు స్వీకరించే గుణం కూడా ఉండాలి.. ఆయన మాత్రం శివ పేరు చెప్పుకొని ఇంకా సన్మాన సభలు పెట్టుకోవచ్చు. అందరి చేత భజన చెయించుకోవచ్చు.. దశాబ్దకాలంలో తెలుగులోఒక్క రక్తచరిత్ర తప్ప హిట్ లేదు. ఆయన జయాపజయాల గురించి హితబోధలా' అంటూ ఒక నెటిజన్ వర్మను విమర్శించారు. ఇలా వర్మను విమర్శిస్తూ పలు పోస్టులు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు వర్మ అభిమానులు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. 'మా అన్న మెగాస్టార్ కదా అని వాడు వీడు అని వాగితే అక్కడ సైలెంట్ గా ఉండటానికి వాడు బాలయ్య అభిమానో లేదా చంద్రబాబు ఫ్యాన్ కాదు దటీజ్ రాంగోపాల్ వర్మ' అంటూ ఓ నెటిజన్ ఫేస్బుక్లో కామెంట్ చేశారు. కాగా, మెగాఫ్యాన్స్ తనపై గుర్రుగా ఉండి పెడుతున్న కామెంట్లపై వర్మ కూడా స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న వరుసగా నాగబాబుపై విమర్శలు ట్వీట్ చేసిన వర్మ.. ఈ రోజు మెగాస్టార్ ఫ్యాన్స్ మార్ఫింగ్ చేసి పెట్టిన ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఖైదీనంబర్ 150 పోస్టర్‌కు వర్మ ఫేస్ అంటించి.. రౌడీనంబర్ 150 అంటూ మెగాస్టార్ అభిమానులు ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ఇది ఆయనకు నచ్చినట్టే ఉంది. -
రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు..!
-
మరో బాంబు పేల్చిన రాంగోపాల్ వర్మ!
-
మరో బాంబు పేల్చిన రాంగోపాల్ వర్మ!
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగాబాబు విమర్శల నేపథ్యంలో కాసేపటి కిందే.. మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ఆయన తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. అసలు తాను తెలుగులో ట్వీట్ చేయనే లేదని, చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని వర్మ తేల్చేశారు. ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేసిన నాగాబాబు అంతే ఘాటుగా వర్మ విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి తప్పుడు సలహా ఇచ్చావో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు. నాగబాబు సార్‌కి ఇంగ్లిష్ అర్థం కాదని, కాబట్టి ఎడ్యుకేట్ అయిన స్నేహితుడి ద్వారా తన ఇంగ్లిష్ ట్వీట్ల గురించి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. గ్రేట్ మెగాబ్రదర్ ముందు నాగబాబు 0.01శాతం మాత్రమేనని, అందుకే నాగాబాబులా చిరంజీవి అరవలేదని ఘాటుగా చురకలంటించారు. 'నాకు సలహాలు ఇచ్చేముందు నాగాబాబు తన జబర్దస్త్ కెరీర్ ఏమిటో ప్రశ్నించుకోవాలి' అని అన్నారు. నాగబాబు సార్.. ఖైదీ 150 ట్రైలర్ ఇప్పుడే చూశాను. అద్భు..........తంగా ఉంది. అవతార్ కంటే కూడా బాగుంది' అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందిస్తూ.. తన తరఫున చిరంజీవిగారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. అయితే, ఈ ట్వీట్లను హ్యాక్ చేసి పెట్టినవేనని వర్మ ట్విస్టు ఇచ్చారు. అంతకుముందు ఆయన చేసిన ట్వీట్ల సారాంశమిది. 'నాగబాబు గారూ, మీరు ట్విట్టర్లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు.. అది వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను చాలా నిజాయితీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్'' అని వర్మ ముగించారు. -
చిరంజీవి గారికి సారీ: వర్మ
ఖైదీ నెం. 150 చిత్రం ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించారు. ఈ అంశంపై శనివారం రాత్రి వరుసపెట్టి ట్వీట్లు చేశారు. చివరగా.. తన తరఫున చిరంజీవిగారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. ఆయన ట్వీట్లలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి... ''నాగబాబు గారూ, మీరు ట్విట్టర్లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు.. అది వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను చాలా నిజాయితీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్'' అని వర్మ ముగించారు. Naga babu gaaru meeru twitter lo leru kaabatti yevarainaa naa ee tweetlu meeku choopistarani aashisthunnanu ..meerante naaku chaala ishtam — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Nenedho naa style lo andari meedha anniti meedha yedho oka opinion cheputhoo vuntanu ..votti mee family meedhe kaadhu ..adhi vine vuntaru — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Naa tweetlu Modi gari daggaranunchi Bachcgangaari Varakoo chivariki naa meedha nene chaala commentlu chesthoo vuntanu — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Kaani meeru chaala offend ayyi hurt ayyarani naaku thelisindhi kanuka nenu chaala genuine gaa meeku mee family ki sorry chepthunnanu — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Naa vuddeshyam vere ayina meeru hurt ayyaru kanuka chiranjeevigariki kooda naa tharapuna dayachesi sorry cheppandi..Thanks — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 -
సర్కార్ 3లో అమితాబ్ లుక్
రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సర్కార్ 3. గతంలో రెండు భాగాలుగా రిలీజ్ అయిన సర్కార్‌కు సీక్వల్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వంగవీటి తరువాత వర్మ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సర్కార్ గెటప్‌లో సాసర్లో టీ తాగుతున్న అమితాబ్.. వర్మ మార్క్ కెమెరా వర్క్, లైటింగ్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. అమితాబ్ లుక్‌తో పాటు టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చ్ 17న రిలీజ్ చేయనున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లతో ఇమేజ్ కోల్పోయిన రామ్ గోపాల్ వర్మ సర్కార్ సీక్వల్తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. -
బోర్ కొడుతోంది వర్మా..
ముంబై: వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి అదే బాట పట్టాడు. హిందువులు భక్తితో పూజించే లక్ష్మీదేవిని టార్గెట్‌గా చేసుకొని వర్మ శుక్రవారం ట్వీట్ల వర్షం కురిపించాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎప్పటిలాగే వర్మ చేసిన ట్వీట్లపై నెటీజన్లు తీవ్రంగా స్పందించారు. 'ఫైనాన్స్ గాడెస్ లక్ష్మీదేవి లేకుండానే అమెరికా మన కన్నా ఎలా సంపన్నదేశమైంది? వేల సంవత్సారాలుగా లక్ష్మీదేవిని పూజిస్తున్నా ఎక్కువశాతం ఇండియన్స్ ఎందుకు పేదవారిగా ఉన్నారు' అంటూ వర్మ చేసిన ట్వీట్లపై పలువురు నెటీజన్లు స్పందించారు. గతంలోనూ మీరు ఇలాంటి ట్వీట్స్ చేశారు మాకు బోర్ కొడుతోంది అంటూ కొందరు ట్వీట్ చేయగా.. మరికొందరు మాత్రం 'నువ్ అమెరికాలో లేవు కాబట్టే' అంటూ స్పందించారు. @RGVzoomin u asked dis infinite times before n now we r bored #justsaying — Nams (@921188) December 30, 2016 -
బాలీవుడ్‌తో పాటు, ఖాన్‌లపై వర్మ ఏమన్నారంటే..
ముంబై: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బస్తీమే సవాల్ అంటూ.. వంగ వీటి సినిమా వివాదాన్ని చాలెంజ్ చేసిన వర్మ ఈ సారి బాలీవుడ్ ఖాన్ లపై విరుచుకుపడ్డారు. అమీర్ ఖాన్ తాజా మూవీ దంగల్ పై ప్రశంసలు కురిపించడంతో పాటుగా అటు సినిమా ఇండస్ట్రీపై , ఇటు ఇతర ఖాన్ లపై వరుస ట్వీట్లలో రెచ్చిపోయి కమెంట్ చేశారు. భారతీయ ప్రేక్షకుల తెలివితేటలపై అమిర్ ఖాన్ నమ్మకానికి సలాం కొట్టాల్సిందే. సూపర్ స్టార్లు ఎప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. 50ల తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లు చేసి చూపిస్తుంటారు. అమిర్ కూడా అదే చేశాడు. అసాధ్యం అనుకున్న వాటిని చేసి చూపిస్తాడు.అలా ఎదగడంలో అమీర్ సిన్సియారిటీని చూస్తే.. ఆయన పాదాలను తాకాలని ఉంది. అమిర్ కారణంగా ప్రపంచం అంతా ఇండియాను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది. బాలీవుడ్ లో ఆలం ఆరా కాలం నుంచి చూస్తున్నా.. ఏ స్టార్ హీరో అయినా తండ్రిగా కనిపించేందుకు బరువు పెరిగి లావుగా కనిపించాలని అనుకున్నాడా? ఇతర ఖాన్స్ అంతా ప్రేక్షకులను వెర్రివాళ్లను చేద్దామని అనుకుంటే.. అమిర్ మాత్రం ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ను నమ్ముతాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఇంతటితో సరిపెట్టలేదు వర్మ... 'దంగల్' చూశాక మొత్తం చిత్ర పరిశ్రమతోపాటు మిగిలిన ఖాన్లు కూడా జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తీరాలని తాను ఫీల్ అవుతున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. Seeing Dangal I feel all us in entire industry including other khans should learn gymnastic martial arts and kick ourselves on our asses — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2016 Which Star of Bollywood since Alam Ara would have taken a decision of putting on weight to look like a father of grown up daughters ? — Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2016