రజనీపై వర్మ మరో ట్వీట్‌.. మండిపడుతున్న ఫ్యాన్స్‌ | Ram Gopal Varma Trolled Rajinikanth Why He Did Not Destroy Coronavirus | Sakshi
Sakshi News home page

‘రజనీ ఎందుకు కరోనాను నాశనం చేయట్లేదు’

Published Tue, Mar 24 2020 6:51 PM | Last Updated on Tue, Mar 24 2020 7:01 PM

Ram Gopal Varma Trolled Rajinikanth Why He Did Not Destroy Coronavirus - Sakshi

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై మరోసారి వంగ్యస్త్రాలు సందించాడు.  మహమ్మారిని నాశనం చేసేందుకు ఆయన ఏం చేయట్లేదంటూ ఫన్నీ మీమ్‌తో ట్విటర్‌లో సోమవారం షేర్‌ చేశాడు. ప్రుస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కరోనా వైరస్‌ను నాశనం చేయడానికి రజనీకాంత్‌ ఎందుకు ఏమీ చేయడం లేదు’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఇక ఆర్‌జివి ట్వీట్‌ చూసిన రజనీ అభిమానులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. తమ అభిమాన హీరోపై వ్యంగ్యంగా ట్వీట్‌ చేసినందుకు వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక రజనీని ట్రోల్‌ చేయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకు ముందు రజనీ నటించిన 2.0 విడుదల సమయంలో ఆయన లుక్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన  సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్మ  గెహెర్ అనే హర్రర్‌ థ్రిల్లర్‌  చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అమిత్ సాధ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement