కూలీ కంప్లీట్‌ | Lokesh Kanagaraj shares excitement as he wraps up shoot of Coolie with Rajinikanth | Sakshi
Sakshi News home page

కూలీ కంప్లీట్‌

Published Wed, Mar 19 2025 12:29 AM | Last Updated on Wed, Mar 19 2025 12:29 AM

Lokesh Kanagaraj shares excitement as he wraps up  shoot of Coolie with Rajinikanth

‘కూలీ’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, షౌబిన్‌ షాహిర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గెస్ట్‌ రోల్‌లో ఆమిర్‌ ఖాన్, స్పెషల్‌ సాంగ్‌లో పూజా హెగ్డే నటించారు. సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మించింది.

కాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ధృవీకరించారు మేకర్స్‌. పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు రజనీకాంత్‌ హీరోగా ‘జైలర్‌ 2’ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement