COOLIE Movie
-
జైపూర్‌కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్‌లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
ఎల్‌సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్‌తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్‌కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్‌లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
నాగార్జున ప్లాన్ వర్కవుట్ అవుతుందా.? నాగ్ ప్లాన్ ఏంటి.?
-
రజినీకాంత్ మూవీ షూటింగ్ లో పేలిన లిథియం కంటైనర్
-
'కూలీ' షూటింగ్.. కొద్దిలో తప్పిన అగ్ని ప్రమాదం
తమిళ స్టార్ హీరో రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తీస్తున్న సినిమా 'కూలీ'. ప్రస్తుతం వైజాగ్ పోర్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే చిత్రబృందానికి ఇప్పుడు కొద్దిలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో కంటైనర్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. చైనా నుంచి గత నెలలో వచ్చిన లిథియం బ్యాటరీల లోడ్ కంటైనర్ ఇది. తొలుత కంటైనర్ లోపల నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించిన టెర్మినల్ సిబ్బంది.. వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. అలా ఫైరింజన్లు వచ్చే సమయానికి కంటైనర్ లోని చాలా బ్యాటరీలని బయటకు లాగేశారు. కానీ కొన్ని బ్యాటరీలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే రజినీకాంత్ 'కూలీ' షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఊహించని ప్రమాదం జరగడంతో సెట్లో ఉన్నవాళ్లందరూ భయబ్రాంతులకు గురయ్యాడు. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇకపోతే 'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్, అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. 'విక్రమ్', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ ఈసారి అదరగొట్టేస్తాడనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఇది థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు) -
రజనీకాంత్ 'కూలీ' సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్- దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కూలీ’. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి టాలీవుడ్ కింగ్ నాగార్జున సడెన్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఆయన లుక్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు.కూలీ సినిమాలో సిమాన్ పాత్రలో నాగార్జున కనిపిస్తారని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే, అదీ రజనీకాంత్‌ను ఢీ కొట్టే పాత్ర అని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్‌తో మొదటిసారి నాగార్జున కనిపించనున్నారు. విలన్ పాత్ర నిజమే అయితే.. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు భారీగానే ఉంటాయని అప్పుడే అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే.రజనీకాంత్ చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రలకు ఇతర భాషా నటీనటులు పేరిగిపోతున్నారనే చెప్పాలి. ఈయన నటించిన జైలర్ చిత్రంతో ఈ ఫార్ములా మొదలైందని చెప్పవచ్చు. ఆ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాష్, టాలీవుడ్ నటుడు సునిల్ వంటి వారు కీలక పాత్రల్లో నటించి ఆ చిత్రానికి స్టార్ విలువ పెంచేశారు. అదేవిధంగా తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్ చిత్రంలోనూ బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఉపేంద్ర, నాగార్జున నటిస్తున్నారు. కన్నడ నటి రచితరామ్ కూడా కూలీ సినిమాలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. కూలీ సినిమాకు అనిరుధ్ సంగీత అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) -
రజినీకాంత్ తో కయ్యానికి సిద్దమైన నాగ్..
-
రజినీకాంత్ ని లెక్కచేయని ఫహాద్ ఫాజిల్
-
కోలీవుడ్‌కు కూలి 1000 కోట్లు.. పక్కనా..?
-
రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ప్రత్యకమైన స్థానం ఉంది. ఎందరో యువ సంగీత దర్శకులకు ఆయన ఒక ఆదర్శం. తన సంగీతంతో మూడు తరాల ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆయన సొంతం. అయితే, ఇళయరాజా తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి పెద్ద దుమారాన్నే క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రజనీకాంత్ 'కూలీ' సినిమా మేకర్స్‌కు ఆయన నోటీసులు పంపడం కూడా ఒకటి అని చెప్పవచ్చు.ఇళయరాజా సంగీతం అందించిన పాటలను ఎవరైనా ఉపయోగించుకుంటే వారికి కాపీరైట్, రాయల్టీ వంటి విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ తరచుగా కోర్టు నోటీసులు ఆయన పంపడం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి స్టార్ సింగర్‌కు కూడా ఆయన గతంలో నోటీసులు పంపారు. మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నారని బాలుకు నోటీసులు పంపడం అప్పట్లో చాలా వివాదాస్పదం అయింది. తన పాటలతో ఉన్న ఒప్పందం గడువు ముగిసినా కూడా ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలు ఇప్పటికీ కూడా ఉపయోగించుకుంటున్నాయని కొద్దిరోజుల క్రితం నోటీసులు పంపారు.తాజాగా ఇదిలా ఉంటే.. రజనీకాంత్ సినిమా 'కూలి' మేకర్స్‌కు కూడా ఇళయరాజా కోర్టు నోటీసులు పంపారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్లో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన సంగీతం అందించిన 'తంగమగన్' సినిమా నుంచి ఒక పాటను ఉపయోగించారట. 'వా వా పక్కం వా' అనే సాంగ్ 'కూలి' టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. తన అనుమతి లేకుండా సాంగ్‌ను ఎలా ఉపయోగిస్తారని ఆయన నోటీసులు పంపారు. కూలీ టీజర్లో సాంగ్‌ను తొలగించాలని కోరారు. ఈ విషయంపై సన్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.ఇళయరాజా పాటల హక్కులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం కోర్టు ఒక సూచనను వెళ్లడించింది. ఒక పాట రూపొందేందుకు సాహిత్యం, గాయకుడు సహా చాలామంది అవసరమని, సాహిత్యం లేనిదే పాట లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం సంగీతం అందించారని ఒక్కరికే ఆ హక్కులు దక్కవని చెప్పిన కోర్టు ఫైనల్ తీర్పును త్వరలో వెళ్లడిస్తామని పేర్కొంది. -
Coolie: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని వందల కోట్లా?
కాయకష్టం చేసుకుని బతుకును భారంగా ఈడ్చే వ్యక్తినే కూలీ అంటారు. అంతే కాకుండా డబ్బు కోసం ఎలాంటి పని చేసేవారినైనా కూలీనే అంటారు. వీటిలో నటుడు రజనీకాంత్ ఏ కోవకు చెందుతారో తెలియదు గానీ, ఇప్పుడు కూలీ పేరు మాత్రం నలుమూలలా మారుమ్రోగుతోంది. సినీ పరిశ్రమలో కూలీ టైటిల్ సక్సెస్‌కు అడ్రస్ అనుకుంటా. హిందీలో అమితాబచ్చన్ ఇదే పేరుతో చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. ఇక తెలుగులో వెంకటేశ్ నటించిన కూలీ నెంబర్ 1 చిత్రం కూడా సూపర్‌హిట్ అయ్యింది. అలాగే తమిళంలోనూ నటుడు శరత్‌కుమార్ కూలీ పేరుతో చిత్రం చేశారు.తాజాగా ఇదే టైటిల్‌తో సూపర్‌స్టార్ రంగప్రవేశం చేస్తున్నారు. అవును ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. స్టార్ దర్శకుడు లోకేకనకాజ్ తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. ఇందులో చాలా కాలం తరువాత నటి శోభన రజనీకాంత్ సరసన నటించబోతున్నారని, మరో ముఖ్యపాత్రలో క్రేజీ నటి శృతిహాసన్, బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్‌సింగ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇది వరకే విడుదల చేయగా అందులో రజనీకాంత్ గెటప్‌ను చూసి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సమీప కాలంలో చిత్ర టైటిల్‌తోపాటు టీజర్‌ను విడుదల చేశారు. కూలీ టైటిల్, టీజర్లను చూస్తుంటే సరికొత్త రజనీకాంత్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరపై ఆవిష్కరించనున్నారనేది సుస్పష్టం అవుతోంది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ కూలీ ప్రకంపనలు సృష్టిస్తోంది.లోకేష్ కనకరాజ్‌కు తన చిత్రాల షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్‌ను విడుదల చేసి, సెన్సేషనల్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆ మధ్య కమలహాసన్ హీరోగా చేసిన విక్రమ్ చిత్రం టీజర్లో ఆరంబిక్కలామా అనే డైలాగ్‌తో టీజర్‌ను రూపొందించి ఎగ్జైటింగ్కు గురి చేశారు. ఆ తరువాత విజయ్‌తో చేసిన లియో చిత్ర టీజర్లో బ్లడీ స్వీట్ అంటూ చిత్రంపై అంచనాలను పెంచేశారు.తాజాగా రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ చిత్ర టీజర్లో ఏది తప్పు? ఏది ఒప్పు అనే డైలాగ్ చోటు చేసుకుంటుంది. అంతే కాకుండా కూలీ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని, ఇందులో రజనీకాంత్ మరోసారి స్మగ్లర్‌గా నటిస్తున్నారని అర్థం అవుతోంది. ఇకపోతే ఇది కాస్ట్లీ చిత్రం అనడానికి మరో కారణం ఈ చిత్రం కోసం రజనీకాంత్ ఏకంగా రూ. 260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు, అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూ.60 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే గనుక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు లోకేష్కనకరాజ్నే అవుతారు. కాగా కూలీ చిత్రం జూన్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించగానే నటుడు ధనుష్ తన ఎక్స్ మీడియాలో మాస్ అని పేర్కొనడం మరో విశేషం.