'కూలీ' షూటింగ్.. కొద్దిలో తప్పిన అగ్ని ప్రమాదం | Rajinikanth Coolie Movie Team Fire Incident In Vizag | Sakshi
Sakshi News home page

Rajinikanth: రజినీకాంత్‌ మూవీ టీమ్‌కి తప్పిన ప్రమాదం

Published Sat, Sep 14 2024 4:24 PM | Last Updated on Sat, Sep 14 2024 5:02 PM

Rajinikanth Coolie Movie Team Fire Incident In Vizag

తమిళ స్టార్ హీరో రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తీస్తున్న సినిమా 'కూలీ'. ప్రస్తుతం వైజాగ్ పోర్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే చిత్రబృందానికి ఇప్పుడు కొద్దిలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో కంటైనర్ టెర్మినల్‌లో మంటలు చెలరేగాయి. చైనా నుంచి గత నెలలో వచ్చిన లిథియం బ్యాటరీల లోడ్ కంటైనర్ ఇది. 

తొలుత కంటైనర్ లోపల నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించిన టెర్మినల్ సిబ్బంది.. వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. అలా ఫైరింజన్లు వచ్చే సమయానికి కంటైనర్ లోని చాలా బ్యాటరీలని బయటకు లాగేశారు. కానీ కొన్ని బ్యాటరీలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)

అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే రజినీకాంత్ 'కూలీ' షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఊహించని ప్రమాదం జరగడంతో సెట్‌లో ఉన్నవాళ్లందరూ భయబ్రాంతులకు గురయ్యాడు. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇకపోతే 'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్, అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. 'విక్రమ్', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ ఈసారి అదరగొట్టేస్తాడనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఇది థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.

రజినీకాంత్ మూవీ షూటింగ్ లో పేలిన లిథియం కంటైనర్

(ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement