తమిళ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ సినిమా 'తంగలాన్'. ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైంది. మన దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఊహించని మూవీ టీమ్ షాకయ్యే సంఘటన జరిగింది. తమిళ వెర్షన్ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయిపోయింది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.
విలక్షణ చిత్రాలు తీసే దర్శకుడు పా.రంజిత్.. 'తంగలాన్' సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. 18వ శతాబ్దంలో మొదలయ్యే కథ 5వ శతాబ్దానికి వెళ్లి మరీ ఆగుతుంది. ఇందులో అందరూ డీ గ్లామర్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరచగా.. కథ కూడా ఓ పట్టాన అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!)
లెక్క ప్రకారం ఆరు వారాల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్ కావాలి. కానీ ఇప్పుడు ప్రింట్ లీక్ కావడంతో సెప్టెంబరు 20 నుంచే దక్షిణాది భాషల్లో ఓటీటీ రిలీజ్ కానుందని, 27వ తేదీ నుంచి హిందీ వెర్షన్ అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఆన్‌లైన్‌లో ప్రింట్ లీక్ అయిపోయింది కాబట్టి బహుశా ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
'తంగలాన్' విషయానికొస్తే 1850లో చిత్తూరు ప్రాంతంలోని పల్లెటూరు. తంగలాన్ ఓ శ్రామికుడు. అతడికి భార్య ఐదుగురు పిల్లలు. ఓ రోజు పిల్లలతో.. ఏనుగు కొండ వెనకాల బంగారం కొండ ఉందని, దానికి ఓ రక్షకురాలు ఉందని ఏవో కథలు చెబుతాడు. కట్ చేస్తే తంగలాన్‌తోపాటు కొందరిని బ్రిటీష్ దొరలు బంగారం నిధుల కోసం కూలీలుగా తీసుకెళ్తారు. నిధి అన్వేషణ కోసం సాగించిన ప్రయాణంలో వీళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఏమైందనేదే కథ.
(ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment