ఆన్‌లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ స్కామ్ గుట్టును అస్సాం పోలీసులు ఛేదించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కోట్లాది రూపాయల ఆర్థిక కుంభకోణంలో అస్సామీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రసిద్ధ కొరియోగ్రాఫర్,నటి 'సుమీ బోరా' ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చేశారు. రెండురోజులుగా పరారీలో ఉన్న ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ కావడంతో తాజాగా పోలీసులకు లొంగిపోయింది.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ రాబడి వస్తుందని నమ్మించి ప్రజలను మోసం చేసిన నిందితుడు బిషల్ ఫుకాన్ (22)ను అస్సాం పోలీసులు మొదట అరెస్టు చేశారు. ఫుకాన్ అరెస్టు తర్వాత తన బంధువు అయిన సుమీ బోరా, ఆమె భర్త తార్కిక్ బోరా పేర్లు తెరపైకి వచ్చాయి. అసలైన ప్రధాన సూత్రధారులు వారిద్దరేనని పోలీసులు గుర్తించారు. అస్సామీ చిత్ర పరిశ్రమలో తన పరిచయాల ద్వారా నటులు, గాయకులు, రాజకీయ నాయకులు, సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తులతో సహా అనేక మందిని టార్గెట్ చేస్తూ.. భారీ మొత్తంలో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టించింది.
ఇదీ చదవండి: సందీప్, సాయి ధరమ్‌తేజ్‌తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్
ఆమెకు మంచి గుర్తింపు ఉండటంతో చాలామంది మధ్యతరగతి వారు కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. అలా సుమారు రూ. 2,200 కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. కొంతకాలం క్రితం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సుమీ బోరా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. అందుకు రూ. 3 కోట్లు ఖర్చు చేసింది. బోరా తరచుగా విహారయాత్రలు చేస్తూ తన భర్తతో విలాసవంతమైన జీవితం గడిపేది. ఆమె భర్త తార్కిక్ బోరా కూడా ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ కావడం విశేషం. ఇలా ఈ జంట రూ. 2,200 కోట్ల బిగ్ స్కామ్‌కు పాల్పడింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో వారిద్దరూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment