
అభిమానులే కాదు, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూసే కథానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో కూలీ ఒకటి. కారణం ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కావడమే. అంతేకాదు. లోకేశ్ కనకరాజ్ వంటి క్రేజీ దర్శకుడు, సన్ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థ చేస్తున్న చిత్రం ఇది. ఇకపోతే నటి శృతిహాసన్, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, తెలుగు స్టార్ నటుడు నాగార్జున, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించడంతో పాటూ ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కూడా కీలక పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అంతే కాదు క్రేజీ నటి పూజాహెగ్డే ఒక ప్రత్యేక పాటలో మెరుపులు మెరిపించనున్నారని సమాచారం. ఇక అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై ఎవరికై నా ఎందుకు ఆసక్తి ఉండదు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌కు, విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరికుంది.
దీంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా కూలీ చిత్ర వర్గాల నుంచి వచ్చిన ఓ అప్‌డేట్ ఈ చిత్ర టీజర్‌ను రెడీ చేశారట. ఈ చిత్ర టీజర్ చాలా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు ఫుల్‌జోష్‌లో ఉన్నారట. దీన్ని మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం. మార్చి 14న లోకేశ్ కనగరాజ పుట్టినరోజు ఉంది. అదే రోజున కూలీ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment