అక్కడ నేను చనిపోయాను: వర్మ | today is my death in twitter, says ramgopal varma | Sakshi
Sakshi News home page

అక్కడ నేను చనిపోయాను: వర్మ

Published Sat, May 27 2017 7:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

అక్కడ నేను చనిపోయాను: వర్మ

అక్కడ నేను చనిపోయాను: వర్మ

సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. మరోసారి సంచలనం సృష్టించాడు. తన సినిమాల్లో వివాదాలు, ట్విట్టర్‌లో పలువురి మీద కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ నుంచే బయటకు వెళ్లిపోయాడు!! ముందుగా రాత్రి 8 గంటలకు తాను ఒక అన్‌ ప్లెజెంట్ వార్త చెబుతానని అన్నాడు. కాసేపటి తర్వాత, అప్పటివరకు వేచి ఉండలేనని, ఇప్పుడే చెప్పేస్తానని అన్నాడు. ఒక్క నిమిషం కూడా తను వృథా చేయదలచుకోలేదని చెప్పాడు. తాను ట్విట్టర్ నుంచి బయటకు వెళ్లిపోతున్నానని, ఇన్ని సంవత్సరాల పాటు తనను ఫాలో చేసినందుకు నో థాంక్స్ అని తన ఫాలోవర్లకు చెప్పాడు.

తన అభిప్రాయాలన్నింటినీ ఇక మీదట ఫొటోలు, వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లోనే చెబుతానన్నాడు. తన ట్విట్టర్ మరణానికి ముందు ఇదే తన చిట్టచివరి ట్వీట్ అని, అయితే తాను ఎప్పుడూ 'రిప్' మాత్రం చెప్పబోనన్ని అన్నాడు. ట్విట్టర్‌లో తన జననం 27.5.2009 అని, మరణం 27.5.2017 అని చెబుతూ.. సరిగ్గా 8 సంవత్సరాల పాటు తాను ట్విట్టర్‌లో ఉన్న విషయాన్ని వెల్లడించాడు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ ట్విట్టర్ పేజి చూసేందుకు ప్రయత్నించగా, ఈ పేజీ మనుగడలో లేదనే సందేశం కనిపించింది. అంటే, ట్విట్టర్ నుంచి క్విట్ కావడంతో పాటు పాత ట్వీట్లు అన్నింటినీ కూడా డిలీట్ చేసేశాడన్న మాట!!

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement