
రాంగోపాల్ వర్మ, శ్రీనివాస్
‘‘సూసైడ్ క్లబ్’ ట్రైలర్ చూశాను. మేకింగ్, సినిమాటోగ్రఫీ స్టయిలిష్‌గా ఉన్నాయి. కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శ్రీనివాస్ బాగా తీశాడు’’ అన్నారు దర్శకుడు రాంగోపాల్‌వర్మ. 3జీ ఫిలిమ్స్ సమర్పణలో ‘మజిలీ’ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్‌లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సూసైడ్ క్లబ్‘. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వంలో ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3జీ ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రాంగోపాల్‌వర్మ విడుదల చేశారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వర్మగారు మా ట్రైలర్‌ను రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. త్వరలో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు శ్రీనివాస్ బొగడపాటి. ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి.
Comments
Please login to add a commentAdd a comment