Saketh
-
బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!
సెలబ్రిటీలు ఏం చేసినా ప్రేక్షకులకు వినోదమే! కొట్టుకున్నా, కలిసి నవ్వుకున్నా, ఆటలాడినా, పాట పాడినా, గెంతులేసినా, గొడవ చేసినా.. ఏం చేసినా సరే జనాలు చూస్తారు. వీరి ఆసక్తిని గమనించే నెదర్లాండ్స్‌లో డచ్ భాషలో బిగ్ బ్రదర్ అనే షో మొదలుపెట్టారు. ఇంకేముంది.. అందరూ అనుకుందే జరిగింది. సెలబ్రిటీలంతా ఒకేచోట కనిపించేసరికి ఎగబడి చూశారు. ఈ సక్సెస్‌ను చూశాక వాళ్లు వెనకడుగు వేయలేదు. బిగ్ బ్రదర్‌కు సీక్వెల్స్ తీసుకువచ్చారు. అవన్నీ కూడా భారీ స్థాయిలో హిట్ అయ్యాయి. ఈ క్రేజ్ చూసి అమెరికాలో కూడా బిగ్ బ్రదర్స్ పేరిట షో మొదలుపెట్టారు. ఇక్కడ కూడా హిట్టే! నెమ్మదిగా బిగ్ బ్రదర్స్ కాన్సెప్ట్ అన్ని దేశాలకు పాకడం మొదలైంది. ఈ క్రమంలోనే ఇండియాలో అడుగుపెట్టింది. హిందీలో బిగ్‌బాస్ పేరిట షో ప్రారంభించగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. దీంతో వరుసగా 16 సీజన్లు విజయవంతంగా రన్ చేశారు. ఓటీటీల వాడకం పెరిగిపోవడంతో ఓటీటీలోనూ బిగ్‌బాస్ షో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే బిగ్‌బాస్ వివిధ భాషలకు సైతం పాకింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటిదాకా ఆరు సీజన్లు వచ్చాయి. వీటికి అదనంగా ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కూడా ప్రసారమైంది. ఇప్పుడు ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. త్వరలో బిగ్‌బాస్ 7 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ ప్రారంభంలో షో గ్రాండ్‌గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షో మేకర్స్ చాలామంది సెలబ్రిటీలను సంప్రదించారు. ఇందులో కొందరు హౌస్‌లోకి రావాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం ఫైనల్ లిస్టులో ఎలాగైనా చోటు కొట్టేయాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఈసారి హౌస్‌లోకి వెళ్లబోయేది వీరేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిలో బుల్లితెర నటి శోభా శెట్టి, యూట్యూబర్, నటి శ్వేతా నాయుడు, సింగర్స్ సాకేత్, మోహన భోగరాజు, సీనియర్ నటుడు ప్రభాకర్, బుల్లితెర జంట అమర్దీప్- తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సురేఖా వాణి, జర్నలిస్టు సురేశ్, జబర్దస్త్ బ్యూటీ వర్ష, బ్యాంకాక్ పిల్ల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరిద్దరు చివర్లో హ్యాండ్ ఇచ్చినా మిగతా అందరూ దాదాపు షోలో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: ఆ మధ్య లవ్ బ్రేకప్.. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న హీరో క్లీంకారకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ -
PV Sindhu: భారత్ క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదగగలదు..
PV Sindhu Comments At MCRHRD: భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డీజీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ జ్ఞాపిక అందజేశారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో సివిల్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆపై ముఖాముఖీ చర్చలో పాల్గొన్న సింధు...మన వద్ద అందుబాటులో ఉన్న ప్రతిభను చూస్తే భారత జట్టు క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదగగలదని, ఇందు కోసం తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు సంయుక్తంగా చిన్నారులను ఆటల వైపు మళ్లించాలని సూచించారు. సెమీఫైనల్లో సాకేత్ జోడీ బెంగళూరు: రామ్‌కుమార్ రామనాథన్‌తో జతకట్టిన తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఈ జోడీ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికీ సింగిల్స్, డబుల్స్‌లో చుక్కెదురైంది. డబుల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సాకేత్–రామ్‌కుమార్ జంటకు ప్రత్యర్థి జోడీ స్టీవెన్ డీజ్ (కెనడా)–మలెక్ జజిరి (ట్యునిషియా) నుంచి వాకోవర్ లభించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం... జే క్లార్క్ (బ్రిటన్)–మార్క్ పోల్మన్స్ (ఆ్రస్టేలియా)తో తలపడుతుంది. మరో క్వార్టర్స్‌లో బ్రిటన్–ఆ్రస్టేలియన్ జోడీ 6–2, 6–1తో భారత టాప్‌సీడ్ జీవన్ నెడుంజెళియన్–పూరవ్ రాజా జంటపై గెలిచింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్ గుణేశ్వర్ 6–3, 2–6, 1–6తో టాప్‌సీడ్ జిరి వెసెలే (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం చవిచూశాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–3తో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జంటపై నెగ్గింది. నాలుగో సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 4–6, 7–6 (7/2), 4–10తో హ్యూగో గ్రెనియర్–ముల్లెర్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యింది. చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా -
ఓల్వో కార్ల పేరుతో మోసాలు.. కటకటాల్లోకి సాకేత్ తల్వార్
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన ఓల్వో కార్లు కొంటామంటూ నకిలీ పత్రాలు సమర్పించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని వరుసపెట్టి మోసాలు చేస్తున్న తల్వార్ గ్రూప్ డైరెక్టర్ సాకేత్ తల్వార్ ఎట్టకేలకు పట్టుబడ్డారు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఇతడి ఆచూకీని గోవాలో కనిపెట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. ఇతడితో పాటు ఇతడి కంపెనీపై మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయని, కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేశామని సోమవారం సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. నగరంలోని ఎస్‌ఏయూవీఈ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అభిసుబ్రమణ్యం, జ్యోతి గుత్తా, డి.శ్రీచరణ్, పి.శ్రీనివాస్ గౌతమ్ డైరెక్టర్లు. ఓల్వో కంపెనీకి చెందిన ఎక్స్ సి 90 కారు కొనడానికి రూ.95 లక్షల రుణం కోసం సుల్తాన్‌బజార్‌లోని కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రుణం మంజూరు చేసిన ఆ బ్యాంకు టోలీచౌకిలోని తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చెక్కును జారీ చేసి, దరఖాస్తుదారులకు సదరు కారు ఇవ్వాలని సూచించింది. ఎస్‌ఏయూవీఈ సంస్థకు ఆ కారు డెలివరీ చేసినట్లు.. తమకు మొత్తం ర. 95 లక్షలు ముట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టింన తల్వార్ కార్స్ బ్యాంకునకు వాటిని సమర్పింంది. రుణం పొందిన ఎస్‌ఏయూవీఈ సంస్థ నెలసరి వాయిదాలు చెల్లించలేదు. దీంతో అధికారులు సదరు ఓల్వో కారు వివరాలను ఆర్టీఏ విభాగం నుంచి సేకరించడానికి ప్రయత్నించారు. తమ వద్ద అలాంటి కారు రిజిస్టర్ కాలేదంట వారి నుంచి సమాధానం వచ్చింది. దీంతో తల్వార్ కార్స్‌తో పాటు ఎస్‌ఏయూవీఈ సంస్థ కుమ్మక్కై పథకం ప్రకారం తమను మోసం చేసినట్లు కెనరా బ్యాంకు అధికారులు గుర్తించారు. దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో సాకేత్ తల్వార్‌తో పాటు ఎస్‌ఏయూవీఈ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అభిసుబ్రమణ్యం, జ్యోతి గుత్తా, డి.శ్రీచరణ్, పి.శ్రీనివాస్ గౌతమ్‌లపై కేసు నమోదైంది. ఈ తరహాలోనే బంజారాహిల్స్ కేంద్రంగా పని చేసే రెబెల్ మోటార్ సైకిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఐడీబీఐ బ్యాంక్ అనుబంధ సంస్థను మోసం చేసిన వ్యవహారం పైనా సీసీఎస్‌లో మరో కేసు నమోదై ఉంది. 2018లో చోటు చేసుకున్న ఈ రెండు సందర్భాల్లోనూ నిందితు లు ఓల్వో కారు ఖరీదు పేరుతో నకిలీ పత్రాలు సమరి్పంచి రుణం తీసుకుని మోసం చేయడం గమనార్హం. సీసీఎస్‌లో నమోదైన రెండు కేసులతో పాటు బంజారాహిల్స్ ఠాణాలో మూడు, పంజగుట్ట, జూబ్లీహిల్స్, మియాపూర్‌లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదై ఉన్నాయి. దీంతో సాకేత్ తల్వార్ కొన్నాళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేసిన టీమ్–10 ఎస్సై కె.రామకృష్ణ గోవాలోని ఆరంబోల్ బీచ్‌లో ఉన్న మావి విల్లాలో అతడి ఆచూకీ కనిపెట్టారు. అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. -
ఎక్కడకు వెళ్లినా సాకేత్ అనే పిలుస్తారు
‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్లో సాకేత్‌గా బుల్లితెరకు పరిచయం అయిన గుడిబోయిన మధుబాబు అతి త్వరలోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’... ఇలా వరుస సీరియల్స్‌తో ఏడేళ్లుగా బుల్లితెర నటుడిగా బిజీ బిజీగా ఉన్న మధుబాబు తన గురించి పంచుకున్న ముచ్చట్లివి. ‘‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్ వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌లో నటించాను. ఆ తర్వాత అభిషేకం సీరియల్ మూడువేలకు పైగా దాటింది. దీంతోపాటు జీ టీవీలో వచ్చే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, జెమినీలో వచ్చే రెండు రెళ్లు ఆరు సీరియల్స్‌లో నటిస్తున్నాను. అన్ని సీరియల్స్ టాప్ రేటింగ్‌లో నన్ను నిలబెట్టాయి. ఇంతగా బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడకు వెళ్లినా నా అసలు పేరుకన్నా సాకేత్ అని పిలిచేవారు. ఆ పేరుతోనే ఇప్పటికీ పిలిచేవారున్నారు. బీటెక్ చేస్తూ.. పుట్టి పెరిగింది వరంగల్‌లోని హన్మకొండలో. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. స్కూల్, కాలేజీల్లో ఏ చిన్న సందర్భం వచ్చినా డ్యాన్స్‌లో ముందుండేవాడిని. హైదరాబాద్‌లో బీటెక్ చేశాను. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ, ఈ ఇండస్ట్రీకి రావాలని ఆలోచనా ఎక్కువ ఉండేది. దానికితోడు స్నేహితుల ప్రోత్సాహం నన్ను ‘యంగ్ ఇండియా’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేలా చేసింది. సెలక్ట్ అయ్యాను. ఆ తర్వాత ‘పవనిజం’ సినిమా చేశాను. ఇప్పుడు ‘సత్యాగ్రాహి’ సినిమాలోనూ నేనే హీరోని. డ్యాన్స్ బాగా వచ్చినా నటన కోసం రెండు నెలల పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నా. ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్లో... ఉద్యోగం చేయకపోయినా ఏమీ అనలేదు హైదరాబాద్‌కి వచ్చి పన్నెండేళ్లు అయ్యింది. నేను బీటెక్ చదువుకుని ఉద్యోగం చేయకుండా ఈ ఫీల్డ్కి వచ్చినందుకు మా ఇంట్లో వాళ్లు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. పిల్లల ఇష్టాలకే వదిలేశారు. మా తమ్ముడికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. యానిమేషన్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు. మాకు ఒక చెల్లి. తను ఇప్పుడు కెనడాలో ఉంటోంది. మా బావ, తను ఇద్దరూ ఫిజియో థెరపిస్ట్‌లు. వాళ్లన్నా, వాళ్ల బాబు లక్కీ అన్నా నాకు చాలా ఇష్టం. మద్యం తెచ్చిన ముప్పు మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. జాలి గుండె. మా నాన్న మందుకు బానిసవడంతో కుటుంబం మొత్తం చాలా సఫర్ అయ్యాం. ఆ సమయంలో కొండంత అండగా నిలిచి మా బాగోగులు చూసుకున్న దేవతలాంటి మా అమ్మమ్మ మూడేళ్ల క్రితం దేవుడి దగ్గరకు వెళ్లిపోవడంతో ఆమెను బాగా చూసుకోవా లనుకున్న నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న తాగుడు వ్యసనం మూలంగా మా బంధువులు మమ్మల్ని చులకనగా చూసేవారు. అలాంటి తండ్రి మీద ఆశ వదిలేసుకోమనేవారు. కానీ, వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ, విరుగుడు మందులు వాడుతూ ఆ మద్యం చెర నుంచి విడిపించి హైదరాబాద్ తీసుకువచ్చాను. మంచి ప్లాట్ కొనుక్కొని అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అమ్మానాన్నలు నా సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్నలో వచ్చిన ఈ మార్పు చూసి మా బంధువులంతా ఆశ్చర్యపోతుంటారు. గతంలో వెలివేసినట్టుగా చూసిన వారే ఇప్పుడు మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. వాళ్లు అప్పుడు మమ్మల్ని అలా నిరుత్సాహపరచడం వల్లే మేము పట్టుదలతో ఎదిగాం అనిపిస్తుంది. చాలా నిరుత్సాపడ్డాను టీవీ సీరియల్స్ ద్వారా ఇంత పేరు వస్తుందని మొదట్లో అనుకోలేదు. సినిమాలో నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశాను. కానీ, కొన్ని సినిమాలు సగం షూటింగ్‌తోనే ఆగిపోయి చాలా నిరుత్సాహపడ్డాను. ముందుగానే అనుకున్న సీరియల్ ఆఫర్ ఆగిపోయింది. అవకాశాలు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూశాను. ఓర్పు వహించాను. ఆ తర్వాత ఒకటొకటిగా అవకాశాలు వచ్చాయి. సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఆ ప్రయత్నాలూ మానుకోలేదు. పవనిజం తర్వాత ఇప్పుడు సత్యాగ్రాహి సినిమా చేస్తున్నాను. సంతోషమే బలం ఇప్పుడు ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నాం. మా అమ్మ జీవితంలో చాలా బాధలు పడింది. ఆమెను సంతోషంగా చూసుకోవాలి. మా కుటుంబాన్ని అర్ధం చేసుకుని మాతో ఫ్రీగా కలిసిపోయే అమ్మాయి భార్యగా రావాలనుకుంటున్నాను. వస్తున్న అవకాశాలు అందుకుంటూ ఇలా సీరియల్స్, సినిమాలు చేసుకుంటూ రోజులు హ్యాపీగా గడిపేయాలనుకుంటున్నాను.’’ – సంభాషణ: నిర్మలారెడ్డి -
ట్రైలర్ బాగుంది
‘‘సూసైడ్ క్లబ్’ ట్రైలర్ చూశాను. మేకింగ్, సినిమాటోగ్రఫీ స్టయిలిష్‌గా ఉన్నాయి. కొత్త జనరేషన్ ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ శ్రీనివాస్ బాగా తీశాడు’’ అన్నారు దర్శకుడు రాంగోపాల్‌వర్మ. 3జీ ఫిలిమ్స్ సమర్పణలో ‘మజిలీ’ సినిమా ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సూసైడ్ క్లబ్‘. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వంలో ప్రవీణ్ ప్రభు వెంకటేశం మరియు 3జీ ఫిలిమ్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం రాంగోపాల్‌వర్మ విడుదల చేశారు. ‘‘ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వర్మగారు మా ట్రైలర్‌ను రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. త్వరలో మా సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు శ్రీనివాస్ బొగడపాటి. ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి. -
వాస్తవ సంఘటనలతో...
‘మజిలీ’ ఫేమ్ శివ రామాచద్రవరపు లీడ్ రోల్లో ప్రవీణ్ యండమూరి, సాకేత్, వెంకటకృష్ణ, చందన ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘సూసైడ్ క్లబ్’. శ్రీనివాస్ బొగడపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రవీణ్, ప్రభు, వెంకటేశం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రం ట్రైల్ షోను నిర్వహించారు చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించాను. స్క్రీన్‌ప్లే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. యాక్టర్స్ అందరూ పాత్రలకు పక్కాగా సూట్ అయ్యారు’’ అన్నారు. ‘‘తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాం. రాత్రి, పగలు షూటింగ్ చేశాం. మా ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాం’’ అన్నారు శివ. -
పర్హీన్ ప్రభాకర్‌పై దోపిడీ ముఠా దాడి
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య, బాలీవుడ్ నటి పర్హీన్ ప్రభాకర్‌పై దేశ రాజధానిలో దోపిడీ దొంగల ముఠా దాడికి పాల్పడింది. థక్ థక్ గ్యాంగ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దాడికి తెగబడినట్టు పోలీసులు పేర్కొన్నారు. పర్హీన్ దక్షిణ ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని సర్వప్రియ విహార్‌లో ఉండే పర్హీన్ తన కారులో సెలెక్ట్ సిటీ వాక్ మాల్‌కు వెళుతుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద దోపిడీ ముఠా అడ్డగించిందని పోలీసులు చెప్పారు. ఆమె తన కారును పార్క్ చేసి వారితో మాట్లాడుతుండగా దాడికి దిగి ఆమె వద్దనున్న రూ 16,000 నగదు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని రోడ్డుకు ఎదురుగా పార్క్ చేసిన వారి కారులో పరారయ్యారు. దోపిడీ ముఠా దాడికి గురైన పర్హీన్ రోడ్డుపై కుప్పకూలారు. ఓ ఆర్మీ అధికారి ఆమెకు సాయం అందించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితుల వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పోలీసులకు అందచేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని దక్షిణ ఢిల్లీ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. -
క్వార్టర్స్‌లో సాకేత్
పుణే: ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 4–6, 6–2, 6–0తో పెజ్దా క్రిస్టిన్ (సెర్బియా)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రామ్‌కుమార్ రామనాథన్ 7–6 (9/7), 6–3తో బ్రైడన్ క్లియెన్ (బ్రిటన్)పై, యూకీ బాంబ్రీ 6–4, 7–6 (7/4)తో పావిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. -
సాకేత్ శుభారంభం
పుణే: ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్న మెంట్ పుణే ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 6–3, 4–6, 6–2తో తొమిస్లావ్ బ్రికిక్ (బోస్నియా హెర్జెగోవినా)పై గెలిచాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 12 ఏస్‌లు సంధించాడు. మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్) 6–4, 6–2తో కరీమ్ మొహమ్మద్ మామౌన్ (ఈజిప్ట్)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ 3–6, 6–4, 6–7 (6/8)తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) చేతిలో... గతేడాది రన్నరప్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 3–6, 3–6తో ఇవాన్ కింగ్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయారు. -
సాకేత్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కజకిస్తాన్‌లోని అస్తానాలో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో క్వాలిఫయర్ సాకేత్ 0–6, 4–6తో నాలుగో సీడ్ డక్‌హీ లీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయాడు. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)–మత్సుయి (జపాన్) జోడీ 6–7 (3/7), 6–4, 10–8తో నికోలా మిలోజెవిచ్ (సెర్బియా)–ఆల్డిన్ సెట్‌కిక్ (బోస్నియా హెర్జెగోవినా) జంటపై గెలిచి సెమీస్‌కు చేరింది. -
194వ ర్యాంక్‌లో సాకేత్ మైనేని
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్‌సలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని 194వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌సలో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 287 పాయింట్లతో మరోసారి భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌కే చెందిన విష్ణువర్ధన్ 431వ ర్యాంక్‌లో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న 28వ ర్యాంక్‌లో, లియాండర్ పేస్ 59వ ర్యాంక్‌లో, దివిజ్ శరణ్ 63వ ర్యాంక్‌లో ఉన్నారు. మరోవైపు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్‌సలో మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
బాలగంధర్వుడు సాకేత్ రామ్
-
చిన్న వయసులోనే లండన్ ట్రినిటీ కాలేజి పట్టా
-
సగర్వంగా.. తిరంగా..
డేవిస్ కప్ ప్లే ఆఫ్‌కు భారత్ * కొరియాపై 3-0తో గెలుపు * పేస్-బోపన్న అలవోక విజయం చండీగఢ్: భారత డేవిస్‌కప్ జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఆసియా ఓసియానియా గ్రూప్-1 పోరులో భారత్ 3-0తో కొరియాపై విజయం సాధించింది. తొలి రోజు రెండు సింగిల్స్‌లో రామ్‌కుమార్, సాకేత్ విజయం సాధించగా... శనివారం జరిగిన డబుల్స్ పోరులో లియాండర్ పేస్ - రోహన్ బోపన్న జోడి 6-3, 6-4, 6-4తో కొరియా జోడీ హంగ్ చుంగ్ - సియోంగ్ చాన్ హంగ్‌లపై గెలిచి విజయాన్ని పూర్తి చేసింది. ఆదివారం నామమాత్రపు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరుగుతాయి. తడబాటు లేకుండా... అనుభవం, నైపుణ్యంతో భారత జోడీ డబుల్స్ మ్యాచ్‌లో చెలరేగి ఆడింది. గంటా 41 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పేస్ ద్వయం మంచి సమన్వయంతో ఆడారు. మేఘావృతమైన వాతావరణం, ప్రత్యర్థుల అనుభవలేమిని ఆసరాగా చేసుకున్న బోపన్న గంటకు 200 కి.మీ.ల వేగంతో సర్వీస్‌లు చేశాడు. పేస్ అద్భుతమైన వ్యాలీలతో ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌లో బోపన్న రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడం, మూడోసెట్లో పేస్ ఒకసారి సర్వీస్ చేజార్చుకోవడం మినహా భారత్ జోడి ఎక్కడా ఇబ్బందిపడలేదు. మ్యాచ్ మొత్తంలో ఈ ఇద్దరు తమ సర్వీస్‌ల్లో కేవలం 17 పాయింట్లు మాత్రమే కోల్పోయారు. మూడో సెట్లో కాస్త అలసత్వం చూపిన ఇద్దరు 10 పాయింట్లు చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో బోపన్న 9, పేస్ 3 ఏస్‌లు సంధించారు. తొలిసెట్ ఎనిమిదో గేమ్‌లో హంగ్ సర్వీస్‌ను పేస్ వ్యాలీ విన్నర్‌తో బ్రేక్ చేశాడు. దీంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాతి గేమ్‌లో అద్భుతమైన ఏస్‌తో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. రెండోసెట్ మూడో గేమ్‌లో మళ్లీ హంగ్ సర్వీస్‌ను పేస్ బ్రేక్ చేశాడు. వేగంగా పరుగెత్తుతూ సంధించిన లో వ్యాలీని ప్రత్యర్థులు అందుకోలేకపోయారు. స్వల్ప ఆధిక్యాన్ని చివరి వరకు కొనసాగిస్తూ భారత్ రెండోసెట్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడోసెట్ తొలి గేమ్‌లోనే చుంగ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి బోపన్న జంట ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో గేమ్‌లో బోపన్న బ్రేక్ పాయింట్‌ను కాపాడుకున్నా... ఆరో గేమ్‌లో పేస్ సర్వీస్ కోల్పోయాడు. చివరకు పదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. మా ఇద్దరి మధ్య సమన్వయం బాగా కుదిరింది. అదే లేకపోతే ఇలాంటి విజయాలు సాధించడం కష్టం. ఈ మ్యాచ్‌లో మేం పెద్దగా కష్టపడలేదు. మా బలం మేరకు మాత్రమే ఆడాం. తక్కువ స్థాయి ప్రత్యర్థులు ఎదురైనప్పుడు ఎలా ఆడాలో తెలుసు కాబట్టి ఎక్కడా ఇబ్బంది పడలేదు. - బోపన్న మేం బాగా ఆడాం. మూడు సెట్లలోనే మ్యాచ్ గెలిచాం. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా.. మా సత్తాను మరింత చూపెట్టేవాళ్లం. కుడి, ఎడమ మేళవింపు ఎప్పుడైనా ఇబ్బందిగానే ఉంటుంది. చుంగ్ మంచి కోణాల్లో షాట్లు కొట్టాడు. హంగ్ కాస్త స్లో. సింగిల్స్‌లో మా వాళ్లు బాగా ఆడారు. కొరియాపై 3-0తో గెలవడమంటే అంత సులువుకాదు. - పేస్ -
సాకేత్ జోరు
న్యూఢిల్లీ : ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించిన సాకేత్... డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-3, 6-3తో టాప్ సీడ్ దివిజ్ శరణ్ (భారత్)-ఫ్లావియో సిపొల్లా (ఇటలీ) జంటపై సంచలన విజయం సాధించింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6-4, 6-1తో జె లీ (చైనా)ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ ఫైనల్లో మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ (భారత్) జంటతో సాకేత్-సనమ్ తలపడతారు. -
‘చెక్’ పెడతాం: బోపన్న
న్యూఢిల్లీ : డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను ఓడించి వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధిస్తామని భారత డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘చెక్ జట్టులో వందలోపు ర్యాంక్ ఆట గాళ్లు ఇద్దరున్నా ఇబ్బంది లేదు. గతంలో చాలాసార్లు మేటి ఆటగాళ్లను ఓడించాం. ఏ ఆటగాడు ఒత్తిడిని జయిస్తాడనే దానిపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి. వరల్డ్ గ్రూప్‌కు వెళ్లడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకుంటాం’ అని బోపన్న వెల్లడించాడు. మరోవైపు లియాండర్ పేస్ కోసం హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేనిని డేవిస్ కప్ జట్టు నుంచి పక్కకు పెట్టడం సరైంది కాదని భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ అభిప్రాయపడ్డారు. పేస్ లేని సమయంలో సాకేత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని గుర్తు చేశారు. ‘పేస్ ఆడాలనుకుంటే అవకాశం ఇవ్వండి. కానీ సాకేత్‌ను పక్కనబెట్టడం సరైంది కాదు. కుర్రాడికి ఆటలో అనుభవం లేకపోవచ్చుగానీ పేస్-బోపన్న మాదిరిగా ప్రత్యర్థులను చూసి భయపడే వ్యక్తిత్వం మాత్రం కాదు’ అని అమృత్‌రాజ్ వివరించారు.