Bigg Boss 7 Telugu: These Contestants Likely To Participate; Deets Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ షోలో రచ్చ చేసే కంటెస్టెంట్లు వీళ్లే! రెండు జంటలతో పాటు గ్లామర్‌ నటీమణులు..

Published Wed, Aug 2 2023 4:51 PM | Last Updated on Sat, Sep 2 2023 2:34 PM

Bigg Boss 7 Telugu: These Contestants Likely to Participate - Sakshi

సెలబ్రిటీలు ఏం చేసినా ప్రేక్షకులకు వినోదమే! కొట్టుకున్నా, కలిసి నవ్వుకున్నా, ఆటలాడినా, పాట పాడినా, గెంతులేసినా, గొడవ చేసినా.. ఏం చేసినా సరే జనాలు చూస్తారు. వీరి ఆసక్తిని గమనించే నెదర్లాండ్స్‌లో డచ్‌ భాషలో బిగ్‌ బ్రదర్‌ అనే షో మొదలుపెట్టారు. ఇంకేముంది.. అందరూ అనుకుందే జరిగింది. సెలబ్రిటీలంతా ఒకేచోట కనిపించేసరికి ఎగబడి చూశారు. ఈ సక్సెస్‌ను చూశాక వాళ్లు వెనకడుగు వేయలేదు. బిగ్‌ బ్రదర్‌కు సీక్వెల్స్‌ తీసుకువచ్చారు. అవన్నీ కూడా భారీ స్థాయిలో హిట్‌ అయ్యాయి. ఈ క్రేజ్‌ చూసి అమెరికాలో కూడా బిగ్‌ బ్రదర్స్‌ పేరిట షో మొదలుపెట్టారు. ఇక్కడ కూడా హిట్టే! నెమ్మదిగా బిగ్‌ బ్రదర్స్‌ కాన్సెప్ట్‌ అన్ని దేశాలకు పాకడం మొదలైంది. ఈ క్రమంలోనే ఇండియాలో అడుగుపెట్టింది.

హిందీలో బిగ్‌బాస్‌ పేరిట షో ప్రారంభించగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. దీంతో వరుసగా 16 సీజన్లు విజయవంతంగా రన్‌ చేశారు. ఓటీటీల వాడకం పెరిగిపోవడంతో ఓటీటీలోనూ బిగ్‌బాస్‌ షో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే బిగ్‌బాస్‌ వివిధ భాషలకు సైతం పాకింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటిదాకా ఆరు సీజన్లు వచ్చాయి. వీటికి అదనంగా ఓటీటీలో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ కూడా ప్రసారమైంది. ఇప్పుడు ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. త్వరలో బిగ్‌బాస్‌ 7 ప్రారంభం కానుంది.

సెప్టెంబర్‌ ప్రారంభంలో షో గ్రాండ్‌గా లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షో మేకర్స్‌ చాలామంది సెలబ్రిటీలను సంప్రదించారు. ఇందులో కొందరు హౌస్‌లోకి రావాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం ఫైనల్‌ లిస్టులో ఎలాగైనా చోటు కొట్టేయాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఈసారి హౌస్‌లోకి వెళ్లబోయేది వీరేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిలో బుల్లితెర నటి శోభా శెట్టి, యూట్యూబర్‌, నటి శ్వేతా నాయుడు, సింగర్స్‌ సాకేత్‌, మోహన భోగరాజు, సీనియర్‌ నటుడు ప్రభాకర్‌, బుల్లితెర జంట అమర్‌దీప్‌- తేజస్విని, టిక్‌ టాక్‌ దుర్గారావు దంపతులు, సురేఖా వాణి, జర్నలిస్టు సురేశ్‌, జబర్దస్త్ బ్యూటీ వర్ష, బ్యాంకాక్ పిల్ల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరిద్దరు చివర్లో హ్యాండ్‌ ఇచ్చినా మిగతా అందరూ దాదాపు షోలో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: ఆ మధ్య లవ్‌ బ్రేకప్‌.. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న హీరో
క్లీంకారకు స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చిన బన్నీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement