
బిగ్‌బాస్ షో చప్పగా సాగుతున్నప్పుడు, తిరిగి పట్టాలెక్కించేందుకు వైల్డ్‌కార్డులనే నమ్ముకుంటున్నారు. అందుకే గత సీజన్‌తో పాటు ఈ సీజన్‌లో కూడా ఈ ఫార్ములానే నమ్ముకున్నారు. అది ఈసారి కాస్త ఫలించినట్లు కనిపిస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ లేక బోసిపోయిన బిగ్‌బాస్ హౌస్‌కు కాస్త కొత్త కళ వచ్చినట్లయింది.

వైల్డ్ కార్డులనే నమ్ముకుంటున్నారు
అటు కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్‌లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏడు వారాలుగాయవంతంగా కొనసాగుతున్న ఈ షోలో నేడు ఇద్దరు సెలబ్రిటీలు భాగం కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చేసింది.

గతేడాది తెలుగులో.. ఇప్పుడు కన్నడలో
ప్రోమోలో ఫేస్ రివీల్ చేయలేదు కానీ వచ్చిన ఇద్దరిలో ఒకరు మన తెలుగువారికి బాగా సుపరిచితురాలు. తనే కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి. పోయిన ఏడాదే తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొంది. సీరియల్‌లో చూపించిన ఉగ్రరూపాన్నే ఇక్కడ కూడా చూపించి కొంత నెగెటివిటీ మూటగట్టుకుంది.

మరి ఈసారైనా..?
కాకపోతే ఎవరినైనా ఎదురించే స్వభావం జనాలకు తెగ నచ్చేసింది. టాప్ 5 వరకు రాకుండానే వెనుదిరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం కన్నడ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. హౌస్‌లో ఎవరు నీకు పోటీ? అని హోస్ట్ కిచ్చా సుదీప్ అడిగితే.. తనకు ఎవరూ పోటీ కారంటోంది శోభా. మరి అక్కడ ఎన్నివారాలు హౌస్‌లో కొనసాగుతుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment