చాలాసార్లు మోసపోయా.. డబ్బులు తిరిగివ్వలేదు.. ఇన్నాళ్లకు!:శోభ | Shobha Shetty Fulfills Her Longtime Dream | Sakshi
Sakshi News home page

Shobha Shetty: గుడ్‌ న్యూస్‌ చెప్పిన బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో కలిసి..

Published Thu, Jan 25 2024 2:10 PM | Last Updated on Thu, Jan 25 2024 2:58 PM

Shobha Shetty Fulfills Her Longtime Dream - Sakshi

బిగ్‌బాస్‌ షో వల్ల పాపులారిటీ ఎంతొస్తుందో నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. షోలో ఏమాత్రం తడబడ్డా, గొడవలు పడ్డా వారిని సోషల్‌ మీడియాలో ఇట్టే ట్రోలింగ్‌ చేస్తుంటారు. అలా తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో శోభా శెట్టిపై విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. ప్రతీదీ తనకే కావాలన్న స్వార్థం, ఓటమిని అంగీకరించలేని తత్వం, చిన్నదానికీ గొడవపడే వైఖరి ఆమెను విమర్శలపాలు చేసింది. అదే సమయంలో శివంగిలా పోరాడే గుణం, స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్లే మంచి మనసు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల..
ఇక షో ముగిశాక తన పర్సనల్‌ లైఫ్‌పై ఎక్కువ ఫోకస్‌ చేసిందీ బ్యూటీ. ఈ మధ్యే తన ప్రియుడు యశ్వంత్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరుపుకుంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది శోభ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు సాకారమైందని, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు(జనవరి 22న) కొత్తింటి తాళం తన చేతికొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. శోభా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ చూశాం. నచ్చడంతో అడ్వాన్స్‌ డబ్బులు కూడా ఇచ్చాం. కానీ ఏవో కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయింది.

డబ్బులు తిరిగివ్వలేదు
అప్పుడు మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. అలా చాలాసార్లు మోసపోయాం. ఈ క్రమంలో ఈ ఇల్లు కూడా కొంటానా? లేదా? అని టెన్షన్‌పడ్డాను, కానీ మొత్తానికి నా కల నెరవేరింది. బిగ్‌బాస్‌ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదు. రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశాము. కాకపోతే ఆలస్యంగా ఈ ఇంటి తాళం నా చేతికి వచ్చింది. మేము 15వ అంతస్థులో ఉన్న ఫ్లాట్‌ తీసుకున్నాం. ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు మరో నాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ ఇంటికి షిఫ్ట్‌ అవుతాం' అని చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement