Mohana Bhogaraju
-
బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!
సెలబ్రిటీలు ఏం చేసినా ప్రేక్షకులకు వినోదమే! కొట్టుకున్నా, కలిసి నవ్వుకున్నా, ఆటలాడినా, పాట పాడినా, గెంతులేసినా, గొడవ చేసినా.. ఏం చేసినా సరే జనాలు చూస్తారు. వీరి ఆసక్తిని గమనించే నెదర్లాండ్స్‌లో డచ్ భాషలో బిగ్ బ్రదర్ అనే షో మొదలుపెట్టారు. ఇంకేముంది.. అందరూ అనుకుందే జరిగింది. సెలబ్రిటీలంతా ఒకేచోట కనిపించేసరికి ఎగబడి చూశారు. ఈ సక్సెస్‌ను చూశాక వాళ్లు వెనకడుగు వేయలేదు. బిగ్ బ్రదర్‌కు సీక్వెల్స్ తీసుకువచ్చారు. అవన్నీ కూడా భారీ స్థాయిలో హిట్ అయ్యాయి. ఈ క్రేజ్ చూసి అమెరికాలో కూడా బిగ్ బ్రదర్స్ పేరిట షో మొదలుపెట్టారు. ఇక్కడ కూడా హిట్టే! నెమ్మదిగా బిగ్ బ్రదర్స్ కాన్సెప్ట్ అన్ని దేశాలకు పాకడం మొదలైంది. ఈ క్రమంలోనే ఇండియాలో అడుగుపెట్టింది. హిందీలో బిగ్‌బాస్ పేరిట షో ప్రారంభించగా ఊహించని స్థాయిలో ఆదరణ లభించింది. దీంతో వరుసగా 16 సీజన్లు విజయవంతంగా రన్ చేశారు. ఓటీటీల వాడకం పెరిగిపోవడంతో ఓటీటీలోనూ బిగ్‌బాస్ షో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే బిగ్‌బాస్ వివిధ భాషలకు సైతం పాకింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ విజయవంతంగా కొనసాగుతోంది. తెలుగులో ఇప్పటిదాకా ఆరు సీజన్లు వచ్చాయి. వీటికి అదనంగా ఓటీటీలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కూడా ప్రసారమైంది. ఇప్పుడు ఏడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. త్వరలో బిగ్‌బాస్ 7 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ ప్రారంభంలో షో గ్రాండ్‌గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో షో మేకర్స్ చాలామంది సెలబ్రిటీలను సంప్రదించారు. ఇందులో కొందరు హౌస్‌లోకి రావాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే మరికొందరు మాత్రం ఫైనల్ లిస్టులో ఎలాగైనా చోటు కొట్టేయాలని తాపత్రయపడుతున్నారు. ఇక ఈసారి హౌస్‌లోకి వెళ్లబోయేది వీరేనంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిలో బుల్లితెర నటి శోభా శెట్టి, యూట్యూబర్, నటి శ్వేతా నాయుడు, సింగర్స్ సాకేత్, మోహన భోగరాజు, సీనియర్ నటుడు ప్రభాకర్, బుల్లితెర జంట అమర్దీప్- తేజస్విని, టిక్ టాక్ దుర్గారావు దంపతులు, సురేఖా వాణి, జర్నలిస్టు సురేశ్, జబర్దస్త్ బ్యూటీ వర్ష, బ్యాంకాక్ పిల్ల ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరిద్దరు చివర్లో హ్యాండ్ ఇచ్చినా మిగతా అందరూ దాదాపు షోలో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: ఆ మధ్య లవ్ బ్రేకప్.. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న హీరో క్లీంకారకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ -
ఆటొడ్రైవర్తో ప్రేమ.. 'బుట్టబొమ్మ' ఫస్ట్ సింగిల్ అవుట్
చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే అమ్మాయి సత్య. మొబైల్ ఫోన్‌ని అంటిపెట్టుకుని ఉండే సత్య ఒకసారి ఓ ఆటోడ్రైవర్‌తో మాట్లాడుతుంది. ఆ పరిచయం ప్రేమదాకా దారి తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ‘బుట్టబొమ్మ’లో చూడాలి. అనికా సురేంద్రన్, సర్య వశిష్ట, అర్జున్ దాస్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘పేరు లేని ఊరులోకి..’ అంటూ సాగే తొలి పాటను సోమవారం రిలీజ్ చేశారు. స్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటను సనాపతి భరద్వాజ్ పాత్రుడు రంచగా, మోహనా భోగరాజు ఆలపించారు. నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మింన ఈ చిత్రం నెల 26న విడుదల కానుంది. -
బిగ్‌బాస్ 6లోకి బుల్లెట్టు బండి సింగర్?
బిగ్‌బాస్ షో కోసం రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే లోగో, టీజర్ వదిలి ప్రేక్షకులను అలర్ట్ చేసింది బిగ్‌బాస్ టీమ్. ఏయే కంటెస్టెంట్లను తీసుకోవాలి? ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండిస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అని పకడ్బందీగా లిస్టు రెడీ చేసుకుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ రివ్యూయర్స్ ఆది రెడ్డి, గీతూరాయల్, కమెడియన్ చలాకీ చంటి, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, శ్రీ సత్య, దీపిక పిల్లి, అర్జున్ కల్యాణ్, యాంకర్ ఆరోహి రావు, వాసంతి కృష్ణన్, నువ్వు నాకు నచ్చావ్ చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప హౌస్‌లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. కామన్ మ్యాన్ కేటగిరీలో సుధీర్ ఎంపికవగా అతడి ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఉదయభానుకు బిగ్‌బాస్ నుంచి పిలుపు వచ్చింది కానీ ఆమె ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదట. అలాగే ఆర్జే సూర్య, నేహా చౌదరి, హీరోయిన్ ఇనయ సుల్తానా, అప్పారావు, తన్మయి పేర్లు ప్రచారంలో ఉన్నా వీళ్లు ఈ సీజన్లో అడుగు పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కంటెస్టెంట్ చివరి నిమిషంలో హ్యాండిస్తే మాత్రం వీరిలో ఎవరినైనా ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంది. ఇకపోతే సింగర్స్ కేటగిరీలో రేవంత్ సెలక్ట్ అయినట్లు భోగట్టా. అలాగే ఓ ఫీమేల్ సింగర్‌ను కూడా రంగంలోకి దింపనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు బుల్లెట్టు బండి సింగర్ మోహన భోగరాజు. ఆమెను నేరుగా షో ప్రారంభంలోనో లేదంటే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారానైనా లోనికి పంపించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే బిగ్‌బాస్ స్టార్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే! ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ ఆరో సీజన్ సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ సమయంలో నెర్వస్‌గా ఉంటాను: పాయల్ రాజ్‌పుత్ జబర్దస్త్ ప్రవీణ్ ఇంట తీవ్ర విషాదం -
Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మంది స్టెప్పులు! వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
-
Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మందితో రికార్డు
Bullettu Bandi Song New Record: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన భోగరాజు పాడిన ఈ సాంగ్.. బారాత్‌లో ఓ పెళ్లికూతురి డ్యాన్స్‌తో సోషల్ మీడియా దృష్టిని ఆకట్టుకుంది. ఆపై రకరకాల వెర్షన్లతో క్రేజీ సాంగ్‌గా మారిపోయింది. తాజాగా ఈ సాంగ్ మరో ఫీట్ అందుకుంది. ఈ పాటకు జగిత్యాల పట్టణంలో 1000 మందితో నృత్యం చేయించి మరో మెట్టు ఎక్కించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో భాగంగా రవి మచ్చ యూట్యూబ్ ఛానెల్ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలో మహిళలు, యువతులు, చిన్నారులు మొత్తం వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సుంకే రవిశంకర్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతా సురేష్, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుల్లెట్ బండి సాంగ్‌ను రచయిత లక్ష్మణ్ రాయగా.. ఎస్కే బాజి సంగీతం అందించారు. -
‘బుల్లెట్టు బండి’ పాట సరికొత్త రికార్డ్
వెబ్ ప్రత్యేకం: తెలంగాణ యాసలో ఓ అమ్మాయి పెళ్లిపై పెట్టుకున్న ఆశలను ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాట కళ్లకు కట్టేలా ఉంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాట లేనిది ఏ వేడుక కూడా జరగడం లేదు. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా వంద మిలియన్ల క్లబ్లో చేరిపోయింది. అత్యధిక వ్యూస్ పొందిన జానపద పాటగా నిలిచింది. చదవండి: ఎంఏ, బీఈడీ చదివి మేస్త్రీ పనికి యువతి రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. బ్లూ రాబిట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో ఎస్కే బాజి సంగీతం అందించిన ఈ పాట ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లేందుకు ఎలాంటి ఆశలు.. ఊసులు పెంచుకుని ఉంటుందో ఈ పాటలో ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆడవారినే కాక పురుషులను కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటకు ఓ నవ వధువు డ్యాన్స్‌తో మరింత వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పాట తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఉండే ప్రతి చోటకు వెళ్లింది. తాజాగా ఆ పాట వంద మిలియన్ల క్లబ్లో చేరింది. పది కోట్ల మందికి పైగా ఆ పాటను విని ఎంజాయ్ చేశారు. ఇది ఒక్క యూట్యూబ్‌లోనే. మిగతా సోషల్ మీడియాలను పరిగణనలోకి తీసుకుంటే వ్యూస్ భారీగా ఉంటాయి. వంద మిలియన్లు దాటడంపై గాయని మోహన భోగరాజు స్పందిస్తూ.. ‘నా తొలి పాట మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని పోస్టు చేసింది. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు -
బుల్లెట్ బండి పాట: ఎవరీ మోహన భోగరాజు?
Bullet Bandi Song Singer Mohana Bhogaraju: 'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' ఇప్పుడెక్కడ విన్నా ఇదే పాట మార్మోగుతోంది. అటు సోషల్ మీడియాను,ఇటు యూత్‌ను షేక్ చేస్తోంది. ఫంక్షన్స్‌లో.. ఆటోల్లో.. కార్లలో.. ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతుంది. వాస్తవానికి ఈ పాట వచ్చి చాలా రోజులైంది. మళ్లీ ఇప్పుడు క్రేజ్ రావడానికి కారణం సాయిశ్రీయ అనే అమ్మాయి. తన పెళ్లి బరాత్‌లో ఈ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె స్టెప్పులకు ఫిదా అయిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’పాట నిర్మాతలు.. తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించారు. అయితే ఈ పాట అందరికి కనెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం సింగర్ మోహనా భోగరాజు. లక్ష్మణ్(మహబూబ్‌నగర్) కలం నుంచి జాలువారిన ఈ పాటకు ఎస్కే బాజి సంగీతం అందించగా, తెలంగాణ స్లాంగ్‌లో అద్భుతంగా ఆలపించింది మోహనా భోగరాజు. ఆమె ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఈ పాట పాడింది. అయితే ఈ పాట పాడింది ఆమేనని ఇప్పటికి చాలా మందికి తెలియదు. ‘బుల్లెట్ బండి’సాంగ్ వైరల్ అయ్యాక ఈ పాట పాడింది ఎవరు? ఆమె నేపథ్యం ఏంటని ఆరా తీరుస్తున్నారు. ఎవరీ మోహన భోగరాజు? మోహన భోగరాజు పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీతం అన్నా..పాటలన్నా ప్రాణంగా మారింది. అలా చిన్నప్పుటింనుంచే పాటలపై మమకారం పెంచుకున్న మోహన.. ఎక్కడ సంగీతం పోటీలు జరిగినా వెళ్లి పాల్గొనేది. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఆమె సెలక్షన్స్‌లోనే విఫలమయ్యేది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మళ్లీ పోటీల్లో పాల్గొనేది. అలా ఒకసారి ఓ పెద్ద కాంపిటీషన్ వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ విని ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ‘జైశ్రీరామ్’లో అవకాశం ఇప్పించాడు. అందులో ‘సయ్యామమాసం మనదేలే’అనే పాటను పాడింది మోహననే. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గానే పాడారు. ‘మనోహరి’ పాటతో ఫేమస్ తొలి పాట తర్వాత మోహనకు అవకాశాలు పెద్దగా రాలేదు. కోరస్‌గా పాడినప్పటికీ ఆమెకు గుర్తింపు రాలేదు. ఈ క్రమంలో కీరవాణి దగ్గర పనిచేసే ఓ గాయని సహాయంతో తాను రికార్డ్ చేసిన పాటల సీడీని కీరవాణికి అందించింది. ఆ పాటలు బాగా నచ్చడంతో తన టీమ్ మెంబర్‌గా చేర్చుకున్నాడు. మొదట్లో కోరస్ పాడించుకున్న కీరవాణి.. ‘బాహుబలి’లో మనోహరి పాటను ఆమెతో పాడించాడు. అది సూపర్ హిట్ అవ్వడంతో పాటు మోహనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే ఆమెకు ఆఫర్స్ క్యూకట్టాయి ‘రెడ్డమ్మ తల్లి’పై ప్రశంసల జల్లు ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్ సాంగ్, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’(తమిళ వెర్షన్) పాటలతో పాటు ప్రత్యేక ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు. 2019లో అరవింద సమేత వీర రాఘవ (2019) చిత్రంలోని ‘రెడ్డమ్మ తల్లి’పాటకు మోహనపై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు ఈ పాట పాడినందుకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు మోహన భోగరాజు నామినేట్ అయ్యింది. అలాగే వకీల్ సాబ్‌లోని ‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ పాడింది ఈ భామనే. వీటితో ‘సైజ్ జీరో’, ‘అఖిల్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఇజం’, ‘శతమానం భవతి’, ‘జవాన్’, ‘భాగమతి’, ‘సవ్యసాచి’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘ఎన్టీఆర్ బయోపిక్’, ‘ఓ బేబీ’, ‘వెంకీమామ’, ‘హిట్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో మోహన పాటలు పాడింది. బుల్లెట్ బండి అలా పుట్టింది ఇక ఇటీవల ఆమె విడుదల చేసిన ‘బుల్లెట్ బండి’ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఊరూ వాడా మారుమోగిపోతోంది. అయితే ఈ పాట ఎలా పుట్టిందో మోహన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మోపెండ్లీడుకొచ్చిన ఓ యువతి మనోభావాలను పాట రూపంలో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటుందట. ఆమె ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఆమె నేపథ్యం ఏంటి? అనేది తాను పెళ్లి చేసుకునే యువకుడి వివరించాలనేది తన కాన్సెప్ట్. తన ఆలోచనకు తగినట్లుగా లక్ష్మణ్ మంచి లిరిక్స్ అందించాడు. అందుకే మోహన ఈ పాటను వెంటనే ఒప్పేసుకొని ఆస్వాదిస్తూ పాడిందట. సినిమా పాటలు పాడుతున్నప్పటికీ ఫోక్ సాంగ్స్‌ని వదలని చెబుతోంది మోహన.