Bigg Boss 6 Telugu: Singer Mohana Bhogaraju Likely To Participate In BB Show - Sakshi
Sakshi News home page

Mohana Bhogaraju In Bigg Boss: బిగ్‌బాస్‌ షోలో బుల్లెట్టు బండి సింగర్‌?

Published Wed, Aug 17 2022 7:34 PM | Last Updated on Thu, Sep 1 2022 1:24 PM

Bigg Boss 6 Telugu: Is Mohana Bhogaraju Participate In BB Show - Sakshi

బిగ్‌బాస్‌ షో కోసం రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే లోగో, టీజర్‌ వదిలి ప్రేక్షకులను అలర్ట్‌ చేసింది బిగ్‌బాస్‌ టీమ్‌. ఏయే కంటెస్టెంట్లను తీసుకోవాలి? ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండిస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అని పకడ్బందీగా లిస్టు రెడీ చేసుకుంది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్‌ రివ్యూయర్స్‌ ఆది రెడ్డి, గీతూరాయల్‌, కమెడియన్‌ చలాకీ చంటి, సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, శ్రీ సత్య, దీపిక పిల్లి, అర్జున్‌ కల్యాణ్‌, యాంకర్‌ ఆరోహి రావు, వాసంతి కృష్ణన్‌, నువ్వు నాకు నచ్చావ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సుదీప హౌస్‌లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో సుధీర్‌ ఎంపికవగా అతడి ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. మరోవైపు ఉదయభానుకు బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వచ్చింది కానీ ఆమె ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదట. అలాగే ఆర్జే సూర్య, నేహా చౌదరి, హీరోయిన్‌ ఇనయ సుల్తానా, అప్పారావు, తన్మయి పేర్లు ప్రచారంలో ఉన్నా వీళ్లు ఈ సీజన్‌లో అడుగు పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కంటెస్టెంట్‌ చివరి నిమిషంలో హ్యాండిస్తే మాత్రం వీరిలో ఎవరినైనా ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంది. ఇకపోతే సింగర్స్‌ కేటగిరీలో రేవంత్‌ సెలక్ట్‌ అయినట్లు భోగట్టా.

అలాగే ఓ ఫీమేల్‌ సింగర్‌ను కూడా రంగంలోకి దింపనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు బుల్లెట్టు బండి సింగర్‌ మోహన భోగరాజు. ఆమెను నేరుగా షో ప్రారంభంలోనో లేదంటే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారానైనా లోనికి పంపించాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే బిగ్‌బాస్‌ స్టార్ట్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే! ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ సెప్టెంబర్‌ 4 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఆ సమయంలో నెర్వస్‌గా ఉంటాను: పాయల్‌ రాజ్‌పుత్‌
జబర్దస్త్‌ ప్రవీణ్‌ ఇంట తీవ్ర విషాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement