యాంకర్ రవికి ఎందుకు సారీ చెప్పానంటే?: బిగ్‌బాస్‌ ఆదిరెడ్డి | Bigg Boss Contestant Adi Reddy Open About Issue With Anchor Ravi | Sakshi
Sakshi News home page

Adi Reddy: అతనంటే నాకు భయం లేదు.. సారీ చెప్పడానికి కారణమిదే: ఆది రెడ్డి

Published Tue, Jan 9 2024 1:40 PM | Last Updated on Tue, Jan 9 2024 2:16 PM

Bigg Boss Contestant Adi Reddy Open About Issue With Anchor Ravi - Sakshi

బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్‌-6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. అయితే తాను ప్రస్తుతం యూట్యూబర్‌గా రాణిస్తున్నారు. గతేడాది జరిగిన బిగ్‌బాస్‌ సీజన్‌-7 షోపై కూడా చాలా వీడియోలు చేశాడు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌గా చాలా సార్లు మాట్లాడారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆది రెడ్డి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో యాంకర్‌ రవిపై చేసిన వీడియో పట్ల సారీ చెప్పడంపై ఆయన స్పందించారు. 

ఆదిరెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'యాంకర్ రవి అంటే నాకు భయం లేదు. కానీ నేను అతనికి సారీ చెప్పా. ఎందుకంటే నేను ఫ్యామిలీ రిలేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. నా వల్ల వాళ్లు బాధ పడ్డప్పుడు నేను సారీ చెప్తే తప్పేముంది? మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ముఖ్యం కదా?. అసలు ఏం జరిగిందంటే.. బిగ్‌బాస్ టాస్క్‌లో యాంకర్‌ రవి అన్న సంచాలక్. ఆయనకు బిగ్‌బాస్‌ కొన్ని రూల్స్ చెప్పాడంట. ఆ విషయం బయట ఉన్న మనకు తెలియదు. కానీ.. నేను రవి అన్న కావాలనే సన్నీని ఓడించాడని నెగెటివ్‌గా వీడియోలో చెప్పా. కానీ హౌస్‌ లోపల జరిగేవి కొన్ని మనకు చూపించరు కదా. ఆ విషయం నాకు బిగ్‌బాస్‌ వెళ్లి వచ్చాక అర్థమైంది. మనమే రవిని తప్పుగా అనుకున్నామని నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సారీగా ఫీలయ్యాను. ' అంటూ క్లారిటీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement