Bigg Boss 6 Telugu Today Latest Promo: Second Week Nominations Promo Out - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఏం ఇరగదీశారు? ఆరోహిపై ఆదిరెడ్డి కౌంటర్‌ ఎటాక్‌.. ప్రోమో అదిరిందిగా

Published Mon, Sep 12 2022 3:42 PM | Last Updated on Mon, Sep 12 2022 4:54 PM

Bigg Boss 6 Telugu: Second Week Nominations Promo Out - Sakshi

బిగ్‌బాస్‌-6 ఎంటర్‌‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్ అని ఏ ముహూర్తాన నాగార్జున అన్నాడో కానీ హౌస్‌లో ఎంటర్‌‌టైన్‌మెంట్ మామూలుగా లేదు. ఈ సీజన్‌ ప్రారంభమైన మొదటి రోజు నుంచే అలకలు, గొడవలతో ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందుతుంది. గత సీజన్‌లతో పోలిస్తే నామినేషన్‌ ప్రక్రియలో మార్పులు చేసిన బిగ్‌బాస్‌ ఈసారి ఇంటిసభ్యులకు నామినేట్‌ చేయడానకి ఒక ఓటు మాత్రమే లభిస్తుందని ఆదేశించాడు. దీంతో అసలు రచ్చ మొదలైంది.

హౌస్‌లో అందరితో ‍ర్యాపో ఉంది కానీ మీతో లేదు అంటూ ఆరోహి ఆదిరెడ్డిని నామినేట్‌ చేసింది. దీనికి కౌంటర్‌గా ఇంట్లో గేమ్‌ ఆడనివాళ్లు వెళ్లిపోవాలా లేక నీతో ర్యాపో లేదని వెళ్లిపోవాలా అని ఎదురు ప్రశ్న విసిరాడు. ఆట విషయంలో కూడా మీకంటే బెటర్‌గానే ఆడుతున్నానంటూ ఆదిరెడ్డి పేర్కొనగా ఆరోహి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి  ఏం ఇరగదేశారని అంత ఆశ్చర్యపోతున్నారు అంటూ ఆదిరెడ్డి గట్టిగా బదులిచ్చాడు.

ఇక బిగ్‌బాస్‌ డిసీషన్‌నే నామినేట్‌ చేస్తున్నా అంటూ మెరీనా అండ్‌ రోహిత్‌లను కూడా నామినేట్‌ చేశాడు. మరోవైపు రేవంత్‌-కీర్తి భట్‌ల మధ్య కూడా వాగ్వాదం నడిచింది. ఇక సోషల్‌ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం..రేవంత్‌, శ్రీ సత్య, షానీ, ఫైమా, మెరీనా అండ్‌ రోహిత్‌, ఆదిరెడ్డి, గీతూ, అభినయలు నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement