Bigg Boss 6 Telugu: Inaya Sultana Or Arohi Rao Who Will Eliminate In First Week - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌-6లో ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా?

Published Sat, Sep 10 2022 1:40 PM | Last Updated on Sat, Sep 10 2022 3:18 PM

Bigg Boss 6 Telugu: Inaya Sultana Or Arohi Rao Who Will Eliminate - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 రోజురోజుకి రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్‌ కంటే ఈసారి నామినేష్స్‌ ప్రక్రియలో కాస్తంతా మార్పులు చేశారు బిగ్‌బాస్‌ టీం. ఇక ఈ సీజన్‌లో ఫస్ట్‌ ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరన్నదానిపై నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈసారి నామినేషన్స్‌లో రేవంత్‌,ఫైమా, చంటి, శ్రీసత్య, ఆరోహి, ఇనయా సుల్తానా, అభినయలు ఉండగా వీరిలో హౌస్‌ నుంచి బయటకు వెళ్లేది ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

అయితే సోషల్‌ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం అందరి కంటే అత్యధికంగా సింగర్‌ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తుంది. హౌస్‌మేట్స్‌ టార్గెట్‌ చేసినట్లు బయట ప్రొజెక్ట్‌ అవడంతో రేవంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయని టాక్‌. ఇక రేవంత్‌ తర్వాత ఫైమా,శ్రీసత్య, చంటిలకు ఎక్కువ ఓట్స్‌ వచ్చినట్లు సమాచారం. ఇక డేంజర్‌ జోన్‌లో అభినయ, ఇనయా సుల్తానా, ఆరోహి రావ్‌లు ఉన్నారు.

వీరిలో అభినయతో పోలిస్తే ఇనయా, ఆరోహి రావ్‌లకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈవారం బిగ్‌బాస్‌ నుంచి ఇనయా, ఆరోహి రావ్‌లలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈవారం ఆరోహి హౌస్‌కి గుడ్‌బై చెప్పనుందని  లీకువీరులు ఇప్పటికే లీక్‌ చేశారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

చదవండి: బిగ్‌బాస్‌-6 మొదటి కెప్టెన్‌గా మిస్టర్‌ కూల్‌.. జైలుకు వెళ్లిన గీతూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement