
Bigg Boss 6 Telugu, Episode 76 Highlights : ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ గేమ్‌లో చివరగా ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు మిగిలారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకి నచ్చిన వాళ్లకి సపోర్ట్ చేసి మిగిలిన కంటెస్టెంట్లకు బస్తాను తగిలించాల్సి ఉంటుంది. కెప్టెన్సీ టాస్కులో రేవంత్, శ్రీహాన్‌లు కలిసి గేమ్ ఆడి ఎలా అయితే హోస్‌మేట్స్‌ని తప్పించారో, అందుకు బదులుగా సత్య తప్పా మిగితా కంటెస్టెంట్లు అంతా వీరిద్దరికి బాగానే బుద్ది చెప్పారు.
బజ్ మోగిన ప్రతిసారి రేవంత్, శ్రీహాన్‌లకు బస్తాలు పెంచుకుంటూ పోయారు. పాపం శ్రీసత్య మాత్రం తన ఫ్రెండ్స్‌ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది కానీ హౌస్‌మేట్స్ అంతా ఒకటైపోవడంతో ఆమె ఆటలు సాగలేదు. ఇక బస్తాల బరువులు మోయలేక చివరికి ఆ బ్యాగ్‌ను శ్రీహాన్ కింద పెట్టేశాడు. ఇక అప్పుడు వెంటనే సత్య వెళ్లి శ్రీహాన్‌ను ఆమె ఒళ్లో పడుకోబెట్టి మరీ అతన్ని ఓదార్చింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
ఒకప్పుడు అర్జున్ టచ్ చేస్తేనే చిరాకు అన్న సత్య ఇప్పుడు శ్రీహాన్‌తో చాలా క్లోజ్ అయ్యిందని, అవసరం లేకపోయినా అతడిని టచ్ చేస్తుందంటూ ట్రోల్స్ రాయుళ్లు రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా రేవంత్ ఈ టాస్కులో గెలవడానికి చాలానే కష్టపడినా హౌస్‌మేట్స్ అందరి సపోర్ట్ ఫైమాకే ఉండటంతో అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చివరికి ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఆమె తెగ సంతోషపడింది.
Comments
Please login to add a commentAdd a comment