sri satya
-
బాక్ల్ శారీలో బిగ్ బాస్ శ్రీ సత్య క్యూట్ లుక్స్ (ఫొటోలు)
-
యూరోప్ వీధుల్లో శ్రీసత్య, మోహబూబ్.. అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్!
బిగ్‌బాస్ ఫేం మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య జంటగా ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్‌కి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానే అయ్యి చిత్రీకరించారు. మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్ కి ఆయనతో జతకట్టారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో అందంగా చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ మరియు ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు మరియు క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు.శ్రీ సత్య మాట్లాడుతూ : ఈ సాంగ్ రిలీజ్ కోసం అప్పటినుంచి ఎదురు చూస్తున్నాను. ఈ రోజున మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఫ్రెండ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కచ్చితంగా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది. మెహబూబ్ తో కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ కి నన్ను తీసుకున్నందుకు భార్గవ్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసే పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.మహబూబ్ మాట్లాడుతూ : నాకోసం టైం కేటాయించి అడగగానే వచ్చిన నా ఫ్రెండ్స్ సోహెల్, నోయల్, విక్కీ, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, ప్రియాంక ఇలా విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని ప్రశంసిస్తున్నారు. అడగగానే ఈవెంట్ ని హోస్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన స్రవంతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈవెంట్ ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ఈ స్వామిని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ : నాకు మెహబూబ్, శ్రీ సత్య బిగ్ బాస్ ముందు నుంచే తెలుసు. అదేవిధంగా భార్గవ్ తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఈ సాంగ్ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇప్పటివరకు నేను చూసిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ అన్నిట్లో కల్లా ఇది కచ్చితంగా బెస్ట్ గా నిలబడుతుంది. అద్భుతమైన లొకేషన్స్ లో చాలా బాగా ఈ సాంగ్ ని చిత్రీకరించారు. మహబూబ్ టిక్ టాక్ మొదలుపెట్టి యూట్యూబ్ వరకు ఎన్నో వీడియోస్, సాంగ్స్ కష్టపడి చేసి ఈ స్థాయికి వచ్చాడు. ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ మరియు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను అన్నారు.సోహెల్ మాట్లాడుతూ : మహబూబ్ నా దోస్త్. ఈ సాంగ్ ని చాలా కష్టపడి చేశాడు. శ్రీ సత్య, మెహబూబ్ పెయిర్ చాలా బాగుంది. భార్గవ్ పిచ్చరైజేషన్, డైరెక్షన్, ఎడిటింగ్, విజువల్స్ చాలా బాగున్నాయి. మనీష్ అందించడం మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్ లిరిక్స్ లో మంచి ఫీల్ ఉంది. అందరూ ఈ సాంగ్ ని సపోర్ట్ చేసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.సిరి హనుమంత్ మాట్లాడుతూ : మెహబూబ్ ది ముందు నుంచి కష్టపడే తత్వం. ఖాళీ దొరికితే ఏ వీడియో సాంగ్ చేయాలనే ఆలోచిస్తూ ఉంటాడు. శ్రీ సత్య, మెహబూబ్ కలిసి సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సాంగ్ ని నాకు ముందే చూపించారు మంచి లొకేషన్స్ లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సాంగ్ తో మెహబూబ్, శ్రీ సత్య, భార్గవ్, మనీష్ కి మంచి మంచి పేరు తీసుకురావాలని ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.ప్రియాంక జైన్ మాట్లాడుతూ : సాంగ్ చాలా బాగా ఉంది. ఈ సాంగ్ రిలీజ్ కోసం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నా. ఇవాళ ఈ సాంగ్ ఇంత గ్రాండ్ గా లంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. వాళ్లు ఈ సాంగ్ తీయడానికి ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. ప్రతి ప్రేమ చాలా ఫ్రెష్ గా అందంగా ఉంది. ఈ సాంగ్ ని నేను శివ తో రీ క్రియేట్ చేస్తాను. మహబూబ్, శ్రీ సత్య, భార్గవ్, మనీష్ కి ఈ సాంగ్ మంచి పేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.కిరాక్ సీత మాట్లాడుతూ : నాకు ఈ సాంగ్ ముందే చూపించారు. అప్పుడే నాకు అర్థమైంది సాంగ్ పెద్ద సక్సెస్ అవుతుందని. ఒక సాంగ్ కోసం బయట దేశం వెళ్లారు అంటే వర్క్ పైన వాళ్లకు ఉన్న డెడికేషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కచ్చితంగా ఈ సాంగ్ ని అందరూ సపోర్ట్ చేసి ఏ టీం కి పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. -
మెహబూబ్ దిల్ సే, శ్రీ సత్య నువ్వే కావాలి సాంగ్ లాంచ్ (ఫొటోలు)
-
యష్మి సీక్రెట్ ఖరీదు రూ.3 లక్షలు.. ఆరు దాటిందంటే పెగ్గు..
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.సాయంత్రం ఆరు దాటితే..ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్‌మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్‌లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.అవినాష్ కోసం కోన వెంకట్బిగ్బాస్కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్‌ను హౌస్‌మేట్స్‌కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్‌కు బూస్ట్ ఇచ్చాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అందరు అనుకునే మనిషిని కాదు: బిగ్ బాస్ బ్యూటీ
టాలెంట్ ఉన్నా అవకాశాలు రావాలంటే అదృష్టం కూడా ఉండాలి. బహుశా అది లేకపోవడం వల్లేనేమో హీరోయిన్ గ్లామర్ ఉన్న బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్యకు మంచి ఆఫర్స్ రావడం లేదు. ఒకవేళ చిన్నచిన్న సినిమా ఆఫర్లు వచ్చినా పెద్దగా సక్సెస్ మాత్రం రావడం లేదు. తాజాగా తన లైఫ్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అందరూ అనుకుంటున్నట్లు తాను డబ్బు మనిషిని కాదని అన్నారు. అమ్మ కోసం నెలకు దాదాపు రూ.లక్షకు పైగా ఆస్పత్రికి ఖర్చవుతుందని తాను పడుతున్న బాధలను వివరించారు. శ్రీసత్య మాట్లాడుతూ..'జనాలు అందరూ అనుకుంటారు డబ్బు మనిషి అని. నేను బాధల్లో ఉన్నానంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. తినడానికి కూడా ఫ్రీగా ఫుడ్ ఎవరు ఇవ్వరు. కానీ డబ్బు అందరికీ ఇంపార్టెంటే. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోరంతే. మమ్మీ ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెకు నెలకు రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. కారు కొనడానికి నా వద్ద డబ్బుల్లేవు. 2019లో ఓ చిన్న కారు కొన్నా. అది పాడయిపోవడంతో ఎక్కువ ఖర్చవుతుందని అమ్మేశా. ఇప్పటికీ నా వద్ద కారు లేదు. ఎందుకంటే వచ్చిన డబ్బులన్నీ అమ్మ ఆస్పత్రి ఖర్చులకే సరిపోతాయి' అని వెల్లడించింది. కాగా.. శ్రీసత్య బిగ్‌బాస్ సీజన్-6లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. హౌజ్‌లో తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా బీబీ జోడి డ్యాన్స్ షోతో అలరించింది. -
అవును, ఆఫర్ల కోసం లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నా..: శ్రీసత్య
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, కూసింత అదృష్టం కూడా ఉండాలి. బహుశా అది లేకపోవడం వల్లేనేమో హీరోయిన్ మెటీరియల్ అయిన శ్రీసత్యకు మంచి ఆఫర్స్ రావడం లేదు. సినిమా ఆఫర్లు వచ్చినా చివర్లో ఎడిటింగ్‌లో తనను తీసేస్తున్నారు. దీంతో తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి.అదృష్టముండాలితాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బిగ్‌బాస్ బ్యూటీ మనసు విప్పి మాట్లాడింది. శ్రీసత్య మాట్లాడుతూ.. 'సినిమాల్లో కనిపించాలనేది నా కల. కానీ, నేను చేసిన ప్రయత్నాలేవీ సఫలం కావడం లేదు. డీజే టిల్లు 2 మూవీలో మంచి పాత్రలో నటించాను. అందులో నా సంగీత్ వేడుకలు జరిగే సమయంలో ఓ పాట వస్తుంది. సినిమా రిలీజయ్యాక చూస్తే ఎక్కడా లేను.. కేవలం ఆ సంగీత్ పాటలో ఎక్కడో అర సెకను కనిపించానంతే!చెత్త కామెంట్స్నేను సీరియల్స్ చేస్తున్నానని కొందరు సినిమా ఆఫర్లు ఇవ్వలేదు. అందుకని సీరియల్స్ మానేశాను. తెలుగమ్మాయినని కూడా పక్కన పెట్టారు. ఇకపోతే డ్యాన్స్ షోలు చేసినప్పుడు నా గురించి చెత్తగా వాగుతున్నారు. ఎవరితోనైనా కలిసి డ్యాన్స్ చేస్తే చాలు మా మధ్య ఏదో ఉందని, ఏదో జరిగిందని అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారు. దయచేసి పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను కలిపి చూడొద్దు.లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నాబెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే.. వాటిని ప్రమోట్ చేయడం నిజంగానే తప్పు. ఆ విషయం అర్థమైనప్పటి నుంచి వాటిని ప్రమోట్ చేయడం మానేశాను. కానీ అంతకుముందు ప్రమోషన్ చేసినప్పుడు నన్ను నమ్మి మోసపోయినవారికి నా జేబులో నుంచి డబ్బు తీసిచ్చాను. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానని ఆఫర్లు ఇవ్వడం లేదు. అందుకని లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నాను. ఇది మూడునాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత పెదాలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. పెళ్లి గురించి అంటారా.. దాని జోలికి వెళ్లే ఉద్దేశమే లేదు' అని శ్రీసత్య చెప్పుకొచ్చింది.చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న భారతీయుడు.. -
'బిగ్‌బాస్' బ్యూటీ శ్రీ సత్య బర్త్‌డే.. ఈమె స్మైల్ వేరే లెవల్ (ఫొటోలు)
-
సరికొత్త ది ఎపిక్ న్యూ స్విఫ్ట్ కార్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య (ఫొటోలు)
-
టిల్లు స్క్వేర్: శ్రీసత్యకు అన్యాయం!
తల్లిని మించి దైవమున్నదా...? శ్రీసత్య కూడా ఇదే అనుకుంది. తనను కనిపెంచిన అమ్మ మంచాన పడి ఉంటే తట్టుకోలేకపోయింది. ఎవరినో ప్రేమించి, మోసపోయిన శ్రీసత్య చావు అంచులదాకా వెళ్లి తల్లి కోసం బతికొచ్చింది. అమ్మకు మంచి వైద్యం చేయించాలనుకుంది. అందుకనే సీరియల్స్, షోలు, వెబ్ సిరీస్‌లు.. ఏవి వచ్చినా చేసుకుంటూ పోయింది. అలా బిగ్‌బాస్ అవకాశాన్ని కూడా వాడుకుంది.తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొంది. తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూకు హాజరైన బ్యూటీ.. టిల్లు స్క్వేర్‌లో మంచి పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డతో మంచి సన్నివేశాలున్నాయని, ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నానంది. డైలాగ్స్ చెప్పేటప్పుడు మొదటిరోజు కాస్త టెన్షన్ పడ్డానని, తర్వాత మామూలుగా చెప్పేశానంది. కట్ చేస్తే నాలుగు రోజుల క్రితమే టిల్లు స్క్వేర్ రిలీజైంది.సినిమాలో ఒక పాట మినహా ఎక్కడా శ్రీసత్య కనిపించలేదు. ఆ పాటలో కూడా బ్యాగ్రౌండ్ డ్యాన్సర్లలో ఒకరిగా సెకనుపాటు మెరిసిందంతే! అంటే శ్రీసత్య సీన్లు డిలీట్ చేశారని అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు శ్రీసత్యకు అన్యాయం చేశారని ఫీలవుతున్నారు. సిద్ధు- శ్రీసత్యల సన్నివేశాలు ఉంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు. -
వయ్యారాలు ఒలకబోస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. శ్రీ సత్య గ్లామరస్ (ఫొటోలు)
-
శ్రీసత్యకు ప్రపోజ్ చేసిన మెహబూబ్, చేయి కోసుకుంటానంటూ బ్లాక్మెయిల్!
బిగ్‌బాస్ ఫేం శ్రీసత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ 6 సీజనల్లో హౌజ్‌లో అడుగుపెట్టి తనదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా ప్రసారం అవుతున్న బిబి జోడి డాన్స్‌లో షోలో అలరిస్తోంది. ఇందులో శ్రీసత్య మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సేతో జోడికట్టింది. వీరిద్దరి జోడికి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టేజ్‌పై డాన్స్ చేస్తుండగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందంటూ షో జడ్జస్ కూడా వారి పర్ఫామెన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వాగ్వాదంగా మారిన అనసూయ వాలంటైన్స్ డే పోస్ట్, చెప్పుతో కొడతానంటూ..! ఇదిలా ఉంటే మంగళవారం వాలంటైన్స్ డే సందర్భంగా మెహబూబ్ దిల్ సే శ్రీసత్యకి ఎర్ర గులాబిల బోకెతో ప్రపోజ్ చేసి షాకిచ్చాడు. దీంతో శ్రీసత్య అతడిపై సీరియస్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొరియోగ్రఫర్స్ ప్రియాంక, సంకేత్ల సాయంతో మహబూబ్ దిల్ సే శ్రీసత్యకు తన ప్రేమను వ్యక్తం చేశాడు. శ్రీసత్య దగ్గరికి వెళ్లి మొదట పరోక్షంగా ఓ అమ్మాయిని ప్రమించానని, తను రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనంటూ వాపోయాడు. ఎవరిని అంటూ ఆరా తీయగా.. నిన్నేనని ఆమెను సర్ప్రైజ్ చేశాడు. దీంతో శ్రీసత్య షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ హౌజ్‌లో పెంట అయ్యింది.. ఇప్పుడు కూడా పెంట అయ్యిద్ది? అంటూ మహబూబ్‌పై గట్టిగా అరిచింది. చదవండి: అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి, స్వయంగా వెల్లడించిన స్వీటీ దీనికి అతడు ‘నువ్వు, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయ్. నీలాంటి మంచి అమ్మాయిని వదుకోవాలనుకోవడం ఇష్టం లేదు’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. ఇక శ్రీసత్య తన ప్రపోజల్‌ను ఒప్పుకోకపోవడంతో చేయి కోసుకుంటానంటూ మహబూబ్ బ్లాక్మెయిల్ చేయడంతో.. ‘ఇప్పటికే నేను ఆత్మహత్యయత్నం కూడా చేశా తెలుసా? నా ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత నా లైఫ్‌లో ఎవరికి మరో చాన్స్ ఇవ్వాలనుకోవడం లేదు. నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది’ అంటుంది శ్రీసత్య. అలా కాసేపు ఇద్దరు అర్గ్యూ చేసుకున్న అనంతరం ఇది ప్రాంక్ అంటూ అందరికి షాకిచ్చాడు మహబూబ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. -
Sri Satya Latest Photos: సత్యభామలా పోజు కొడుతున్న శ్రీసత్య (ఫొటోలు)
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ శ్రీ సత్యతో " చిట్ చాట్ "
-
అర్జున్ కల్యాణ్‌కు నేనంటే ప్రేమ.. వీడియో చూసి షాకైన శ్రీసత్య
గ్రాండ్ ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన శ్రీసత్యకు బిగ్‌బాస్ షాకిచ్చాడు. ఫినాలేకు చేరకుండానే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆమెను బయటకు పంపించేశాడు. దీంతో హౌస్‌ను వీడలేక వీడి వచ్చేసింది శ్రీసత్య. తాజాగా ఆమె బిబి కెఫెలో యాంకర్ శివకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముందుగా యాంకర్ శివ మాట్లాడుతూ.. శ్రీహాన్ మారిపోయాడంటున్నావేంటి అని అడిగాడు. అందుకు శ్రీసత్య.. అతడు మారడం తప్పనట్లేదు. కానీ సడన్‌గా ఫ్లిప్ అయ్యాడని చెప్పింది. వెంటనే అందుకున్న శివ.. ఫ్లిప్పింగ్ల కోసం నువ్వు మాట్లాడుతున్నావా? అని సెటైర్ వేశాడు. గెలుపును తీసుకుంటావు, కానీ ఓటమిని తీసుకోలేవని రేవంత్‌ను తప్పుపట్టిన నువ్వు ఓసారి ప్లేటు తీసి విసిరికొట్టావని గుర్తు చేశాడు. దీనికామె నేను ఫుడ్ మీద కోపం చూపించలేదని బదులిచ్చింది. అలాగే ఓసారి శ్రీహాన్, నేను కావాలనే ఇనయను రెచ్చగొట్టామంది. కాకపోతే అది గేమ్‌లో భాగంగానే స్పష్టం చేసింది. శ్రీహాన్, నువ్వు, రేవంత్ కావాలని బ్యాచ్‌గా ఏర్పడినట్లు అనిపించిందన్న శివ.. మీరు కావాలని గొడవలు పెట్టుకుంటారు కదా అని అడిగాడు. ఆ ప్రశ్నతో అవాక్కైన శ్రీసత్య.. ఫ్రెండ్సంటే కొట్టుకుంటారు కదా, అందులో తప్పేముందన్నట్లుగా ఫేస్ పెట్టింది. దీనికి శివ స్పందిస్తూ ఫ్రెండ్స్ తప్పులను వారి వెనకాల వెళ్లి చెప్పడం ఫ్రెండ్షిప్ కానే కాదని కుండ బద్ధలు కొట్టాడు. తర్వాత అర్జున్ కల్యాణ్ గురించి అడగ్గా డీసెంట్ బాయ్ అని చెప్పింది శ్రీసత్య. తనకు తెలిసినంతవరకు అతడికి నేనంటే ఇష్టం, ప్రేమ ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇంతలో శివ ఓ వీడియో చూపించాడు. అందులో అర్జున్.. ఎలాగో నేను శ్రీసత్య వెనకాల తిరుగుతున్నాను. నువ్వు నా వెనక పడితే కంటెంట్‌కు మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయ్యేది కదా అంటూ వాసంతితో మాట్లాడాడు. ఈ వీడియో చూపించిన శివ.. అర్జున్ కల్యాణ్ దృష్టిలో శ్రీసత్య ఒక కంటెంట్ అని చెప్పగా శ్రీసత్యకు నోట మాట రాక షాక్‌లో ఉండిపోయింది. చదవండి: శ్రీసత్య ఎలిమినేట్, క్షమించని వేడుకున్న శ్రీహాన్ శ్రీసత్య పారితోషికం ఎంతో తెలుసా? -
శ్రీసత్య ఎలిమినేట్, క్షమించమని చేతులెత్తి వేడుకున్న శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 104: బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లు గెలవడమే కాకుండా ఏకాభిప్రాయంలోనూ నెగ్గి రోహిత్, శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లడిగే అవకాశాన్ని దక్కించుకున్నారు. నేడు మిగతావారికి కూడా ఛాన్స్ రావాలన్న ఉద్దేశంతో మరిన్ని టాస్కులు పెట్టాడు. అలా వాటిలో శ్రీహాన్, కీర్తి గెలిచి ప్రేక్షకులతో మాట్లాడారు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. 'నాకు ఓటడిగే అర్హత ఉందో, లేదో మీరే నిర్ణయించాలి. దానికంటే ముందు నేను తెలీకుండా చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతున్నా. నా మాటల వల్ల, యాటిట్యూడ్ వల్ల కొందరు బాధపడుతున్నారని తర్వాత తెలిసింది. నాకు తెలియకుండానే వారిని బాధపెట్టానని అర్థమయ్యాక నా తప్పులు సరిదిద్దుకున్నాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు. టికెట్ టు ఫినాలే రేవంత్ వదిలేయడం వల్ల నాకు వచ్చింది అని అందరూ అంటుంటే బాధగా ఉంది. కానీ గేమ్ అంతా మీరు చూశారు. ఊహించని పరిస్థితుల మధ్య బిగ్‌బాస్ షోకు వచ్చాను. ట్రోఫీ గెలవడం నాకు చాలా ముఖ్యం. మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి గెలిపించండి. ఎక్కువ క్షమించేవాళ్లే ఎక్కువ ప్రేమిస్తారు. నేను తప్పు చేసినందుకు క్షమించండి' అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. అలాగే ఇండియన్ ఆర్మీ జవాన్లకు, అన్నం పెట్టే రైతులకు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ సెల్యూట్ చేశాడు. తర్వాత కీర్తి మాట్లాడుతూ.. 'ఇన్నిరోజులు బిగ్‌బాస్ హౌస్‌లో కీర్తిని చూశారు. బయట ఎలా ఉన్నాను? లోపల ఎలా ఉన్నాను? అన్నీ చూశారు. మీ ఇంటి కూతురిలా నాకు సపోర్ట్ చేశారు. మున్ముందు కూడా అలాగే మద్దతిస్తారనుకుంటున్నాను. నా శక్తిని మించి ఆడాను. నేను స్ట్రాంగ్‌గా ఉన్నాను. నాలాంటివాళ్లు కూడా బలంగా ఉండాలనుకుంటున్నాను. ట్రోఫీ గెలిచినా కూడా ఆ డబ్బులు నాకోసం వాడుకోను. నాలాంటి అనాధల కోసం, సామాజిక కార్యక్రమాల కోసం ఆ డబ్బులు వాడతాను. అందరికీ ఓట్లేయండి, కానీ నాక్కొంచెం ఎక్కువ ఓట్లేయండి' అని కోరింది. తర్వాత ఉదయం ఆరుగంటలకే హౌస్‌మేట్స్‌ను నిద్ర లేపిన బిగ్‌బాస్ అర్జంటుగా బ్యాగులు సర్దేసుకోండి, ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు పంపించేస్తానని చెప్పాడు. ఈ మాటతో షాకైన కంటెస్టెంట్లు చేసేదేం లేక బుద్ధిగా తమ బట్టలు సర్దేసుకుని గార్డెన్ ఏరియాలో వచ్చి నిల్చున్నారు. మీ అభిప్రాయంలో ఎవరు వెళ్లిపోతారనుకుంటున్నారో చెప్పమని మెలిక పెట్టాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్.. రోహిత్ పేరు, కీర్తి.. ఆదిరెడ్డి, శ్రీసత్య.. రేవంత్, ఆదిరెడ్డి.. కీర్తి, రోహిత్.. శ్రీహాన్ ఎలిమినేట్ కావచ్చని అభిప్రాయపడ్డారు. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. మెజారిటీ ఇంటిసభ్యులు కీర్తి వెళ్లిపోతుందని నిర్ణయించారు. కానీ ప్రేక్షకుల నిర్ణయం ప్రకారం శ్రీసత్య టాప్ 5కి చేరుకోకుండా ఈ క్షణమే ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టిన శ్రీసత్యకు బాధను లోలోపలే దిగమింగి బయటకు మాత్రం చిరునవ్వుతో నిలబడింది. కానీ రేవంత్ బాధ ఆపుకోలేక ఏడ్చేశాడు. చివరికి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ హౌస్‌కు వీడ్కోలు పలికింది శ్రీసత్య. చదవండి: బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోనున్న నాగ్ రేవంత్ తండ్రి చనిపోయినా బతికే ఉన్నాడని అబద్ధం చెప్పాం -
డబ్బు కోసమే వచ్చానన్న శ్రీసత్య ఎంత సంపాదించిందంటే?
శ్రీసత్యది అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ గ్రాండ్ ఫినాలేకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. ఎన్నో వారాలుగా కొందరు నెటిజన్లు ప్రయత్నించిన ఆపరేషన్ అసత్య అర్ధాంతరంగా ఆగిపోగా బిగ్‌బాస్ ఈసారి దాన్ని భుజాన వేసుకున్నాడేమో అన్నట్లుగా ఆమెను టాప్ 5లో ఉంచకుండా బయటకు పంపించేశాడు. ఫినాలే కోసం ఎలా రెడీ అవ్వాలి? అని ప్లానింగ్‌లో ఉన్న శ్రీసత్యకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి! మొదట్లో బిగ్‌బాస్ షోను పిక్నిక్ స్పాట్‌గా భావించింది శ్రీసత్య. అందరి ఆటను చూడ్డానికే వచ్చాను తప్ప ఆడటానికి కాదన్నట్లుగా ప్రవర్తించింది. ఆమె బిహేవియర్ చూసి హౌస్‌మేట్సే కాదు నాగార్జున సైతం తిట్టిపోశాడు. దీంతో మెల్లిగా తనను తాను మార్చుకుంటూ నెమ్మదిగా రంగంలోకి దిగి దెబ్బలు తగిలినా సరే ఆట వదిలేదే లేదన్నట్లుగా గేమ్ ఆడటం ప్రారంభించింది. అయితే ఇతరుల నామినేషన్స్ చూసి ఎగతాళి చేసినట్లుగా నవ్వడం, వెటకారం, రేవంత్ గురించి వెనకాల మాట్లాడటం ఇలా కొన్ని తప్పుల వల్ల ఆమెపై విపరతీమైన నెగెటివిటీ ఏర్పడింది. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లో అడుగుపెట్టారో అప్పుడు తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. ఇలా తయారయ్యావేంటి? నా కూతురు ఇలా ఉండదు అని తండ్రి ముఖం పట్టుకుని అనేసరికి వెటకారాన్ని తగ్గించేసింది. అనవసరంగా గొడవలు పెట్టుకోవడం మానేసింది. అందరితో బాగుండటానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఎన్నోవారాలుగా ఆపరేషన్ అసత్య అంటూ తనను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఫినాలేలో అడుగుపెట్టానోచ్ అని సంబరపడుతున్న తరుణంలో బిగ్‌బాస్ ఆమెను మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి బయటకు పంపించేయడం దారుణమనే చెప్పాలి. మరి 15 వారాలు హౌస్‌లో ఉన్నందుకు ఆమె ఎంత పారితోషికం అందుకుందని పలువురు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఆమెకు వారానికి లక్ష చొప్పున పారితోషికం ఇచ్చారట. అంటే ఈ లెక్కన ఆమె 15 వారాలకు గానూ రూ.15 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. చదవండి: బిగ్‌బాస్ షోకు నాగార్జున గుడ్‌బై చెప్పనున్నాడా? -
కీర్తి ఎలిమినేట్ అవుతుందన్న హౌస్మేట్స్? జరగబోయేది ఇదే!
ఏ బుధవారమో, గురువారమో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుందనుకుంటే దాన్ని శుక్రవారం దాకా లాక్కొచ్చాడు బిగ్‌బాస్. కానీ ఎలిమినేట్ కానుంది ఎవరో ఆల్రెడీ సోషల్ మీడియాలో లీకైంది. శ్రీసత్య ఈరోజు బిగ్‌బాస్ హౌస్ నుంచి పెట్టాబేడా సర్దుకుని రావడం ఖాయమని తెలిసిపోయింది. కానీ బిగ్‌బాస్ మాత్రం ఎవరు ఎలిమినేట్ అవుతారో గెస్ చేయండని ఇంటిసభ్యులను అడిగాడు. ఇందుకు శ్రీహాన్.. రోహిత్ పేరు చెప్పగా, ఆదిరెడ్డి, శ్రీసత్య.. కీర్తి వెళ్లిపోతుందని, కీర్తి.. ఆదిరెడ్డి ఎలిమినేట్ అవుతాడేమోనని అభిప్రాయపడ్డారు. 'మెజారిటీ ఇంటిసభ్యులందరూ కీర్తిని టాప్ 5కి అనర్హురాలుగా భావించారు. కానీ ప్రేక్షకుల అభిప్రాయంలో ఎలిమినేట్ కానుంది ఎవరంటే...' అన్న సస్పెన్స్‌తో ప్రోమో ముగించాడు బిగ్‌బాస్. ఇక హౌస్‌మేట్స్‌కు ఝలక్ ఇస్తూ కీర్తికి బదులుగా శ్రీసత్యను ఎలిమినేట్ చేయనున్నారు. అప్పుడు కంటెస్టెంట్ల ఎక్స్ప్రెషన్ ఏంటో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూసేయాల్సిందే! చదవండి: నా తప్పులు క్షమించి విన్నర్‌ను చేయండి: శ్రీసత్య ఇనయకు ఇదివరకే పెళ్లయిందా? వైరల్ అవుతున్న ఫోటో -
నా తప్పులు మన్నించి విజేతగా నిలపండి.. ప్రేక్షకులను ఓట్లడిగిన శ్రీసత్య
Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్ అప్పీల్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఛాలెంజ్ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది. మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్. రేవంత్ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్ ఏంటి? నా క్యారెక్టర్ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్ 6 టైటిల్ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్ ముగించాడు. తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్ పాల్గొనగా రేవంత్, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్, కీర్తి, రోహిత్.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతడికి ఈ ఓట్ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్ చేయలేదని రేవంత్ ఒకింత హర్టయ్యాడు. ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్ మీడియాలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్ -
ఎన్నోవారాలుగా అన్యాయం.. చిట్టచివరికి రోహిత్‌కు ఒక్క ఛాన్స్
కంటెస్టెంట్ల ఎమోషన్స్‌తో ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టబోతున్నామని ఫుల్ ఖుషీలో ఉన్నారు టాప్ 6 కంటెస్టెంట్లు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ వారిలో ఒకరిని నేడే హౌస్ నుంచి పంపించేయనున్నారు. మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి కేవలం ఐదుగురిని మాత్రమే ఫినాలేకు పంపించనున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఓట్ అప్పీల్ కోసం హౌస్‌మేట్స్‌కు ఆఖరి పోరాటం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సౌండ్స్ విని వాటిని గుర్తుపట్టి అవేంటో రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, రోహిత్ ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ అప్పీలు కోసం ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్ చేసుకుంటూ వచ్చిన హౌస్మేట్స్ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. దీంతో అతడు.. పదిహేను వారాలుగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కచ్చితంగా టైటిల్ గెలుస్తానని నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ ఇవ్వగా ఇందులో రేవంత్, శ్రీసత్య ముందు స్థానాల్లో నిలిచారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఎన్నుకోమనగా ఆదిరెడ్డి.. రేవంత్‌కు, శ్రీహాన్.. శ్రీసత్యకు ఓటేశారు. మరి మిగతావాళ్లు ఎవరిని సెలక్ట్ చేశారు? ఎవరు ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకున్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి నన్ను ఛీ, తూ అని గెంటేశారు, ఇప్పుడు చెప్తున్నా..: కీర్తి -
పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ చివరి అంకానికి చేరుకుంది. 21 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. కానీ ఫినాలేకు ఐదుగురు మాత్రమే వెళ్తారని ప్రకటించాడు నాగ్. అంటే ఎన్నడూ లేనిది ఈసారి కొత్తగా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టనున్నారు. నిన్నటివరకు వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని అతి తక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని నేడు ఎలిమినేట్ చేస్తారన్నమాట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీసత్యను మిడ్‌వీక్ ఎలిమినేషన్‌తో హౌస్ నుంచి బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది. కానీ హాట్‌స్టార్‌లో ఆమెకు ఓటింగ్ వేసేందుకు ఇంకా ఛాన్స్ ఉన్నట్లు చూపిస్తోంది. బహుశా ఓటింగ్ లిస్ట్ నుంచి ఆమెను తప్పిస్తే ఎలిమినేట్ అయింది ఎవరనేది ముందే తెలిసిపోతుందని బిగ్‌బాస్ తనను ఇంకా ఓటింగ్ లైన్లో ఉంచినట్లు కనిపిస్తోంది. కానీ దీనివల్ల మిగతా ఐదుగురికి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తనను ఓటింగ్ లిస్ట్‌లో ఉంచడం వల్ల శ్రీసత్యకు ఓట్లేసినా అవి బూడిదలో పోసిన పన్నీరు కిందే లెక్క! అదే ఓటింగ్ లైన్ క్లోజ్ చేస్తే ప్రేక్షకులు తనకు కాకుండా మిగతా ఐదుగురిలో వారికి నచ్చినవారికి ఓట్లేసి గెలిపించుకునే ఆస్కారం ఉంది. మరోవైపు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందన్న విషయం టాప్ 6 కంటెస్టెంట్లకు ఇంతవరకు తెలియదు. గ్రాండ్ ఫినాలేకు ఎలా రెడీ అవాలి? సూట్ కేస్ ఆఫర్ చేస్తే ఏం చేయాలి? ఇలా దాని గురించే ఆలోచిస్తూ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. డబ్బుల కోసమే బిగ్‌బాస్‌కు వచ్చానన్న శ్రీసత్య సూట్‌కేస్ ఆఫర్ చేస్తే తీసుకుపోయేందుకు కూడా సిద్ధంగా ఉంది. అలాంటి సమయంలో ఆమెను ఫినాలేకు రెండు రోజుల ముందే బయటకు పంపించేయడం దారుణమనే చెప్పాలి. చదవండి: నన్ను బయటకు గెంటేసినవారికి ఇప్పుడు చెప్తున్నా -
జర్నీని చూసి కళ్లు చెమర్చిన శ్రీసత్య, గెలుపుపై రేవంత్ ధీమా!
Bigg Boss 6 Telugu, Episode 100: బిగ్‌బాస్ సీజన్ 6లో టాప్ 6 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు రెడీ అయ్యాయి. ఈరోజు ఇద్దరు హౌస్మేట్స్ జర్నీలను వారి కళ్లకు కట్టినట్లు చూపించాడు. అంతేకాకుండా ఇప్పటివరకు ఆడిన టాస్కులకు సంబంధించిన వస్తువులను గార్డెన్ ఏరియాలో ఉంచి పెట్టాడు. హౌస్‌లో సంతోషకరమైన, బాధాకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను అక్కడక్కడా అతికించాడు. మొదటగా రేవంత్‌ను గార్డెన్ ఏరియాలోకి రమ్మని పిలుపు వచ్చింది. డోర్ తీసుకుని బయటకు వచ్చిన రేవంత్ ఆ సెట్టింగ్ చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అక్కడున్న బొమ్మను తీసుకుని ఈ షో గెలిచి ఇంటికి వెళ్లాక నా కూతుర్ని ఇలాగే ఎత్తుకుంటానని ఊహల్లో తేలిపోయాడు. ఇంతలో అతడికి భార్య అన్విత నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఎంతమంది ఉన్నా నువ్వు లేవనే బాధ ఉంది. కానీ నువ్వు గెలిచి రావాలని చెప్పడంతో సంతోషపడిపోయాడు రేవంత్. తర్వాత ఎప్పటిలాగే బిగ్‌బాస్ ఉపన్యాం అందుకున్నాడు. 'ఇప్పటివరకు గాత్రానికి సంబంధించిన ఎన్నో పోటీల్లో మీరు గెలిచారు. ఇప్పుడు వ్యక్తిత్వానికి సంబంధించిన పోటీలో కూడా గెలవాలని బిగ్‌బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. మొదటి రోజు నుంచే మీరు చూపించిన దూకుడు ఇతర పోటీసభ్యులకు తమ పోటీ ఎవరనే విషయాన్ని స్పష్టం చేసింది. మీ కోపం బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఓటమిని తీసుకోలేని మనస్తత్వం చుట్టూ ఉన్నవారికి మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశాన్నిచ్చింది. కోపాన్ని ఆయుధంగా కాకుండా ప్యాషన్‌గా మార్చారు. అది మీ నాయకత్వ లక్షణాలను, పట్టుదలను రెట్టింపు చేసింది. మీ ఆకలి.. టాస్కుల్లో ఎంత చూపించారో, హౌస్‌లో కూడా అంతే చూపించారు. దాచుకుని తినడంలో మీలోని చిన్నపిల్లాడి అమాయకత్వాన్ని బిగ్‌బాస్ గమనించాడు. మీ కోపం పరదా వెనకున్న సున్నిత మనసు బిగ్‌బాస్‌కు తెలుసు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. వాటన్నింటినీ దాచుకోకుండా ప్రేక్షకులకు చూపించినతీరు మిమ్మల్ని వారికి ఇంకా దగ్గర చేసింది. జీవితంలో తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని వదులుకుని ఇంటిసభ్యులకు దూరంగా ఉంటూ ఓవైపు కలతగా ఉన్నా, మరోవైపు గెలుపు కోసం ఎక్కడిదాకానైనా వెళ్లాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపింది...' అంటూ అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. అది చూసి ఎమోషనలైన రేవంత్.. బిగ్‌బాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకున్నాడు. తర్వాత శ్రీసత్యకు పిలుపు వచ్చింది. రాగానే అక్కతో ఫోన్ మాట్లాడి కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె గురించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. పరిస్థితులు భుజాలపై బరువును పెంచితే దాన్ని చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలే సత్తువ చూపించడమే మనిషి మొదటి విజయం. ఆ పట్టుదల, మొండితనం రెండూ ఉన్నాయి. కాబట్టే మీరు బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టారు. కష్టం వచ్చినప్పుడు పారిపోవడమో, ఎదుర్కోవడమో రెండే దారులుంటాయి. మీరు ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవడాన్ని ఎంచుకున్నారు. బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చిన మొదట్లో మీలో ఎన్నో అనుమానాలు, భయాలు, ప్రశ్నలు ఎవరికి ఎంత దగ్గరవ్వాలో తెలియని ఒక సంకోచ స్థితి మీ ఆటపై నుంచి దృష్టిని తప్పించినప్పుడు మీ అమ్మ కోసం బిగ్‌బాస్ ఇంట్లోకి మీరు వచ్చిన కారణం, అందుకు మీరు చేరుకోవాల్సిన లక్ష్యం గుర్తొచ్చాయి. ఒంటరితనమే అడ్డుగా మార్చుకున్న మీకు.. మీలో మరో కోణాన్ని తట్టే ఇద్దరు స్నేహితులు దొరికి ఈ ప్రయాణాన్ని సులువు చేశారు. మీ నవ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ నిలిచిపోయేలా మీ బలాన్ని మీకు గుర్తు చేసిన తీరు మిమ్మల్ని ఇంకా దగ్గర చేసింది. సరైన వ్యక్తులు సరైన సమయంలో జీవితంలోకి రావడం ఎంత బలమో డీటాచ్మెంట్ను నమ్మే మీకు కొత్త అనుభవం. మన బలాన్ని మనం నమ్మిన తర్వాతే ప్రపంచం నమ్ముతుంది. అది నమ్మడం మొదలుపెట్టినప్పుడే మీరు కెప్టెన్ అయ్యారు. పద్నాలుగు వారాల ప్రయాణంలో ఒక్కోవారం మీకన్నా బలంగా ఉన్నవారిని దాటుకుంటూ ఆటలో ఆఖరి దశకు చేరుకున్నారు. మీ లక్ష్యం వైపు ఇలాగే ముందుకెళ్లాలని ఆశిస్తూ ఆల్ దె బెస్ట్ చెప్పాడు బిగ్‌బాస్. తర్వాత తన జర్నీ చూసి ఎమోషనలైంది శ్రీసత్య. మిగతా హౌస్మేట్స్ జర్నీ రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. చదవండి: సూర్యతో లవ్‌లో ఉన్నానని చెప్పానా? యాంకర్‌కు ఇచ్చిపడేసిన ఇనయ అమర్తేజుల హల్దీ ఫంక్షన్, ఫోటోలు వైరల్ -
అక్క గొంతు విని శ్రీసత్య, కూతురిని తలుచుకుని రేవంత్ ఎమోషనల్
బిగ్‌బాస్.. నిన్ను నీకే కొత్తగా చూపిస్తుంది. నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీస్తుంది. షో ముగిసేసరికి నీకు నువ్వే కొత్తగా పరిచయమయ్యేలా చేస్తుంది. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్ బిగ్‌బాస్ ద్వారా ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తాడు. ఎవరితోనూ కలవని వాళ్లు కూడా అందరితో కలిసిపోతారు. తమలోని తప్పొప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటారు. బిగ్‌బాస్ ఆరో సీజన్ జర్నీ ముగింపుకు వచ్చింది. ఈ ఆదివారంతో షోకు శుభం కార్డు పడనుంది. దీంతో హౌస్‌లో మిగిలిన ఆరుగురికి వారి జర్నీలు చూపిస్తున్నాడు బిగ్‌బాస్. తమ ప్రయాణాన్ని చూసి హౌస్మేట్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. కప్పు గెలుచుకుని ఇంటికి రా అంటూ అక్క ఫోన్ చేసి కోరడంతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య. భుజాలపై బరువును చిరునవ్వుతో మోస్తూ ముందుకు కదిలి సత్తువ చూపించడమే మొదటి విజయం. మీరు చిరునవ్వుతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తాడు బిగ్‌బాస్. ఆ మాటలతో భావోద్వేగానికి లోనైంది శ్రీసత్య. అటు రేవంత్.. బొమ్మను ఎత్తుకుని గెలిచి ఇంటికెళ్లాక నా కూతురిని ఇలాగే ఎత్తుకుంటానంటూ నమ్మకంతో చెప్తున్నాడు. 'మీ కోపమే బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఈ విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని అందుకు తగ్గుట్గా మారి మీ కోపాన్ని ప్యాషన్‌గా మార్చారు. జీవితంలో అన్ని భావాలను కలిగి ఉన్నవారే నిజమైన విజేతలు. తండ్రయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశం వదిలి బిగ్‌బాస్ గేమ్ కోసం ఎంతదూరమైనా వెళ్లాలని ఆరాటపడ్డారు' అంటూ రేవంత్‌పై పొగడ్తలు కురిపించాడు బిగ్‌బాస్. -
ఇది రేవంత్‌ను చూసి నేర్చుకున్నా: నాగార్జున
సండే ఫండే ప్రోమో వచ్చేసింది. ఈ సారి కూడా కంటెస్టెంట్లతో సరదా గేమ్స్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. వంద రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటున్న ఏడుగురికి ఇంటి గురించి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో హౌస్‌లో ఎన్ని గోల్డెన్ హ్యాండ్స్ ఉన్నాయి? వాష్‌రూమ్ ఏరియాలో ఎన్ని పూలకుండీలు ఉన్నాయి? లాంటి ప్రశ్నలడిగాడు. నాగార్జున ప్రశ్న అడగ్గానే ఎవరు గంట కొడితే వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే రెండు పాయింట్లు జోడిస్తానని, తప్పు సమాధానం చెప్తే రెండు పాయింట్లు మైనస్ చేస్తానన్నాడు. వీఐపీ బాల్కనీకి ఎన్ని మెట్లున్నాయి అని అడగ్గా ఆదిరెడ్డి పది మెట్లు అని చెప్పాడు. నాగార్జున మైనస్ 2 అన్నాడు. అప్పటికే బెల్ కొట్టిన శ్రీసత్య 7 లేదా 8 అని చెప్పింది. 7 మెట్లు సరైన సమాధానమంటూ వెంటనే ఒక పాయింట్ ఇచ్చాడు నాగ్. అదేంటి సర్, ఆమె రెండు ఆప్షన్లు చెప్పింది కదా అని రేవంత్ సందేహం వ్యక్తం చేయగా.. 'నేను సంచాలక్, నా ఇష్టం. అయినా ఇది నేను రేవంత్ దగ్గరే నేర్చుకున్నాను' అని పంచ్ ఇచ్చాడు. చదవండి: లేడీ సింగాన్ని పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా? ఈ వారం ఇనయ ఎలిమినేట్? -
ఏమిటేమిటి? ఇనయ ఎలిమినేట్ అయిందా?
'ఇనయ.. యూ ఆర్ ఎలిమినేటెడ్..' నాగార్జున ఈ మాట అనడాన్ని కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారా? కానీ జరిగేది ఇదేనని తెలుస్తోంది. టాప్ 2లో ఉంటుందనుకున్న ఇనయను అర్ధాంతరంగా ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనక జరిగితే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. బిగ్‌బాస్‌కు వచ్చాక అభిమానులను సంపాదించుకున్నవారిలో ఇనయ ఒకరు. 'మై లైఫ్ మై రూల్స్' అనే ఆమె 'మై గేమ్ మై స్ట్రాటజీస్' అన్నట్లుగా ఆడింది. తన ఆటతీరుకు, ఎవరినైనా ఎదురించే ధైర్యానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. తనలో ఉన్న ఫైర్‌ను అలాగే కంటిన్యూ చేస్తే టాప్ 3లో చోటు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారంతా. అన్నట్లుగానే నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు. ఈ వారం కూడా ఆమె నామినేషన్లోకి వచ్చింది. ఎప్పటిలాగే అనధికారిక పోల్స్‌లో మంచి ఓట్ల శాతంతో రెండు, మూడు స్థానాల్లో తచ్చాడుతోంది. శ్రీసత్య, కీర్తి చివరి ప్లేస్ నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ ఈ ఇద్దరిలో ఒకరిని పంపిచేస్తాడనుకుంటే ఎవరూ ఊహించని కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశాడట. అమ్మాయిల్లో ఫిజికల్ టాస్క్‌లలో తోపు పర్ఫామెన్స్ ఇచ్చిన ఇనయను ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త లీకైంది. రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఇనయను సడన్‌గా ఎలిమినేట్ చేయడమేంటని అప్పుడే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకవేళ బిగ్‌బాస్ కావాలని తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడా? అసలు ఈవారం శ్రీసత్య, కీర్తి, ఇనయలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే! చదవండి: లెక్క తేలింది, విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే? -
లెక్క తేలింది, విన్నర్ గెలుచుకునే ప్రైజ్‌మనీ ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 97: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రైజ్‌మనీ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. గతంలో దాన్ని కత్తిరించుకుంటూ పోయిన బిగ్‌బాస్ ఈ వారం ఆ కోల్పోయిన డబ్బు తిరిగి పొందేందుకు అవకాశాలిస్తూ పోయాడు. నేటితో ఆ ఛాన్స్‌లకు తెరదించాడు. ఫైనల్ ప్రైజ్‌మనీని ప్రకటించాడు. మరి ఆ అమౌంట్ ఎంతో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! రెండు రోజులగా దెయ్యం టాస్కుతో ఇంటిసభ్యులను హడలెత్తిస్తున్నాడు బిగ్‌బాస్. ఈరోజు శ్రీసత్య, కీర్తిలను చీకటి గదిలోకి పంపించాడు. వీళ్లిద్దరూ గడ్డిని చూసి కూడా గజగజ వణికిపోయారు చివరికి బిగ్‌బాస్ చెప్పిన వస్తువులు తీసుకురావడంతో రూ.20 వేలు ఇచ్చాడు. తర్వాత రోహిత్‌ను ఆ తర్వాత హౌస్మేట్స్ అందరినీ చీకటి గదిలో వేశారు. అక్కడ ఇనయ, కీర్తి దెయ్యాల్లా భయపెడుతూ అందరినీ ఓ ఆటాడుకున్నారు. ఈసారి ఇంటిసభ్యులు మరో రూ.13వేలు గెలిచారు. మనీబాల్ టాస్క్‌లో రేవంత్ రూ.500, రోహిత్ రూ.1500 సాధించాడు. అనంతరం ఆరో సీజన్‌లోని ఐకానిక్ సంఘటనలను మరోసారి ప్రదర్శించి ఎంటర్టైన్ చేయాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో ఇనయ- శ్రీహాన్‌ల పిట్ట కథ, హోటల్ టాస్క్‌లో శ్రీసత్య- అర్జున్ ఒప్పందం, అర్జున్-రేవంత్ పప్పు గొడవ, మిషన్ పాజిబుల్ టాస్క్‌లోని ఆదిరెడ్డి సీక్రెట్ టాస్క్(బాత్రూమ్ను అశుభ్రపరిచి గొడవ చేసిన గొడవ), కీర్తి వేలు గాయపడ్డ సంఘటన, కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్ గోనె సంచులను తన్నిన సీన్.. వీటన్నింటినీ మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించారు. అందరూ నటించడం కాదు ఏకంగా జీవించేశారు. వీరి యాక్టింగ్ స్కిల్స్‌తో బిగ్‌బాస్‌ను అలరించి రూ.43,000 గెలుచుకున్నారు. అన్ని ఛాలెంజ్‌లు, టాస్కులు పూర్తైన తర్వాత ఫైనల్‌గా విన్నర్ ప్రైజ్‌మనీ రూ.47,00,000కి చేరింది. ఈ సంతోషంలో రేవంత్ పాట పాడగా కీర్తి, శ్రీసత్య డ్యాన్సులేశారు. చదవండి: ఈ వారం డబుల్ ఎలిమినేషన్? ఫైమాకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన పటాస్ ప్రవీణ్ -
డబుల్ ఎలిమినేషన్? ఆమెను పంపించడం ఖాయమా?
బుల్లితెర హిట్ షో బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ముగింపుకు వచ్చింది. ప్రారంభంలో పస లేని ఈ షో ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారింది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుగా క్లైమాక్స్‌కు వచ్చాక షో వెలుగులు సంతరించుకుంటోంది. మొన్నటికాదా గొడవలు, పగలతో రగిలిపోయిన హౌస్మేట్స్ ఇప్పుడిప్పుడే ఫన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు మిగిలారు. ఇందులో ఒకరిని బయటకు పంపించే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచి నామినేషన్స్ నుంచి తప్పించుకుని మొట్టమొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. రేవంత్ ఎలాగో విన్నర్ మెటీరియల్ కాబట్టి అతడు ఓటింగ్‌లో ఎప్పటిలాగే టాప్‌లో ఉంటూ వస్తున్నాడు. తర్వాతి స్థానాల్లో ఇనయ, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో శ్రీసత్య, కీర్తి తచ్చాడుతున్నారు. నిజానికైతే ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్ కావాల్సిందే! కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత శ్రీసత్యలో చాలా మార్పు వచ్చింది. వెటకారం పూర్తిగా తగ్గించేసింది. గేమ్‌లో తన ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా శ్రీహాన్, రేవంత్‌పైనా అరిచేసింది. వరుస టాస్కులు గెలిచింది. అందరితో కలిసిపోయి గొడవలకు దూరంగా ఉంది. ఫలితంగా ఈ వారం తన గ్రాఫ్ బాగా పెరిగింది. కీర్తి.. తన వేలి నొప్పి కారణంగా పలు టాస్కులు గెలవలేకపోయింది. అలా అని ఆడలేదని కాదు, తనవంతు ప్రయత్నం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్నవారిలో ప్రేక్షకులు శ్రీసత్య, కీర్తిలలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని భావిస్తున్నట్లు అనధికారిక పోల్స్ చెప్తున్నాయి. పైగా ఈ వారం శ్రీసత్య గ్రాఫ్ పెరిగి ఓట్ల శాతం పెరగడంతో కీర్తి వెనకబడినట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన కీర్తి ఎలిమినేట్ కావొచ్చేమో, లేదంటే శ్రీసత్య- కీర్తి ఇద్దరినీ బిగ్‌బాస్ బయటకు పంపించేస్తాడేమో! ఈ సీజన్ సిక్స్ కాబట్టి ఫినాలేకు సిక్స్ మెంబర్స్‌ను పంపించే ప్లాన్స్ ఉంటే మాత్రం వీళ్లిద్దరిలో ఏ ఒక్కరో ఎలిమినేట్ కాక తప్పదు. మరి బిగ్‌బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు? ఎవరు ఫినాలేకు దూరం కానున్నారో చూడాలి! చదవండి: రోడ్డు మీద చెప్పుల్లేకుండా తిరిగా: శ్రీహాన గర్ల్‌ఫ్రెండ్ సిరి ఫైమాకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన ప్రియుడు -
శ్రీసత్యను నమ్మని శ్రీహాన్, ఇనయ పరువు మొత్తం పాయే!
Bigg Boss 6 Telugu, Episode 96: టాస్కుల్లో, నామినేషన్స్‌లో కయ్యానికి కాలు దువ్వే కంటెస్టెంట్లు దెయ్యం పేరెత్తితే చాలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీహాన్ ఎంత ఘోరంగా వణికిపోయారో నిన్ననే చూశాం. నేడు మిగతా ఇంటిసభ్యుల వంతు వచ్చింది. మరి వారు భయపడ్డారా? భయపడినా సరే గెలిచారా? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని శ్రీసత్యకు పిలుపు వచ్చింది. అప్పటిదాకా మిగతావాళ్ల భయాన్ని చూసిన నవ్విన ఆమె తన వంతురాగానే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తలుపు దాటి లోపలకు వెళ్లడానికి తెగ భయపడిపోయింది. కన్ఫెషన్ రూమ్‌లోకి రాకపోతే డబ్బులు కట్ అవుతాయని బిగ్‌బాస్ హెచ్చరించినా ఆమెకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఎంతసేపటికీ అలా డోర్ దగ్గరే తచ్చాడుతూ ఉండటంతో లక్ష రూపాయలు కోల్పోయారని చెప్పాడు బిగ్‌బాస్. అనవసరంగా డబ్బులు పోయాయని తెగ ఫీలైన రేవంత్ శ్రీసత్యపై అరిచాడు. బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బిగ్ బాంబ్ అనే మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో కీర్తి, శ్రీసత్య, రేవంత్ పోటీపడ్డారు. మిగతా హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో ఇనయ గెలుస్తుందని భావించారు, కానీ అక్కడ శ్రీసత్య విజయం సాధించింది. ఇంటిసభ్యుల అంచనా బోల్తా కొట్టడంతో రూ.64,900 గెలుచుకునే ఛాన్స్ కోల్పోయారని ప్రకటించాడు బిగ్‌బాస్. నేను గెలుస్తానని నా ఫ్రెండ్వైన నువ్వెందుకు నమ్మలేదంటూ శ్రీహాన్‌ను నిలదీసింది శ్రీసత్య. మూడు ఛాలెంజ్‌లు నేనే గెలిచినా కూడా నన్ను నమ్మాలనిపించలేదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలాడు శ్రీహాన్. తర్వాత ఇంటిసభ్యులందరికీ మనీ టవర్ ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రూ.41,500 గెలుచుకున్నారు. అనంతరం వెలిగించు - విజయం సాధించు గేమ్‌లో శ్రీహాన్, శ్రీసత్య పోటీపడ్డారు. హౌస్మేట్స్ ఊహించినట్లుగా శ్రీహాన్ గెలవడంతో రూ.1,23,400 కైవసం చేసుకున్నారు. ఇప్పటిదాకా గెలిచిన ఛాలెంజ్‌ల మొత్తాన్ని కలపగా ప్రైజ్‌మనీ రూ.46,00,000కి చేరింది. దీంతో హౌస్మేట్స్ మరీ ముఖ్యంగా రేవంత్ పండగ చేసుకున్నాడు. తర్వాత దెయ్యం టాస్కులో ఎంతో ధైర్యంగా చీకటి గదిలో అడుగు పెట్టిన ఇనయ అరుపులు, కేకలతో కన్ఫెషన్ రూమ్‌ను దద్దరిల్లేలా చేసింది. అంత భయంలోనూ ఎలాగోలా బిగ్‌బాస్ చెప్పిన షూ తీసుకుని బయటకు రావడం విశేషం. ఈ టాస్క్ గెలవడంతో రూ.12,000 లభించాయి. నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్‌లో అడుగుపెట్టిన రేవంత్ భయపడ్డాడో, భయపడ్డట్లు నటించాడో తెలీదు కానీ దెయ్యం గొంతునే ఇమిటేట్ చేసి అవలీలగా సూర్య కప్పు తీసుకుని వచ్చేశాడు. ఈసారి రూ.10,000 లభించాయి. ఇక దెయ్యం టాస్కులో కీర్తి మాత్రమే మిగిలింది. మరి తనకేమైనా మినహాయింపు ఉందా? లేదంటే రేపటి ఎపిసోడ్లో తనకు కూడా టాస్క్‌లో వెల్కమ్ చెప్తారా? చూడాలి! చదవండి: నాన్న చనిపోయాక ఆఫీస్ బాయ్‌గా మారాను: రాజశేఖర్ నా ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కు టికెట్లు కావాలి.. హీరో ఆన్సరేంటో తెలుసా? -
రూ.లక్ష పోగొట్టిన శ్రీసత్యపై రేవంత్ ఫైర్
ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు ఇంటిసభ్యులకు సువర్ణావకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఇప్పటిదాకా టాస్కులతో డబ్బు సంపాదించిన హౌస్‌మేట్స్‌కు ఈసారి దెయ్యం టాస్కు ఇచ్చాడు. ఈ దెబ్బతో హడలిపోయిన ఇంటిసభ్యులు మా వల్ల కాదని బెంబేలెత్తుతున్నారు. అయినప్పటికీ భయంతో వణికిపోతూనే ఆదిరెడ్డి, శ్రీహాన్ చీకటి గదిలోకి వెళ్లి బిగ్‌బాస్ చెప్పిన వస్తువులను వెతికి తీసుకొచ్చారు. ఈసారి శ్రీసత్యను డార్క్ రూమ్‌లోకి వెళ్లమన్నాడు బిగ్‌బాస్. కానీ ఆమె మాత్రం నేనొక్కదాన్ని రాలేనంటూ తలుపు బయటే నిల్చుండిపోయింది. విన్నర్ అయ్యేది తనేనని ఫిక్స్ అయిన రేవంత్.. నీ వల్ల డబ్బులు కట్ అయితే మాత్రం సీరియస్ అవుతానని ముందే వార్నింగ్ ఇచ్చాడు. అయినా చివరికి అతడు అన్నట్లే జరిగింది. ఆమె లోపలకు వెళ్లకపోవడంతో లక్ష రూపాయలు కోల్పోయారని బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో శ్రీసత్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు రేవంత్. తర్వాత బిగ్ బాంబ్ అనే మరో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో శ్రీసత్య, ఇనయ, రేవంత్ పాల్గొన్నారు. మరి వీరిలో ఎవరు గెలిచారు? ఎవ ఓడిపోయారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే! చదవండి: ఇండస్ట్రీలో విషాదం, హాస్యనటుడు కన్నుమూత స్వాతి నా ఆల్‌టైం క్రష్: హరీష్ శంకర్ -
ఇనయకు దెయ్యం పట్టింది! భయంతో వణికిపోయిన ఆదిరెడ్డి, శ్రీహాన్
Bigg Boss 6 Telugu, Episode 94: మొన్నటిదాకా ప్రైజ్‌మనీకి కోతలు పెట్టిన బిగ్‌బాస్ ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు హౌస్‌మేట్స్‌కు వరుస ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. ఆ ఛాలెంజ్‌లలో ఎవరు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో చెప్పాలన్నాడు. అందులో ఎవరు గెలుస్తారో కూడా ముందే ఊహించాలన్నాడు. కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగిస్తానని మెలిక పెట్టాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నేడు రెండో ఛాలెంజ్ ఇవ్వగా ఇందులో రేవంత్, ఇనయ పోటీపడ్డారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది మెజారిటీ ఇంటిసభ్యులు కరెక్ట్‌గా గెస్ చేస్తే రూ.1,10,000 ప్రైజ్‌మనీకి తిరిగి యాడ్ అవుతాయన్నాడు. అందరూ అనుకున్నట్లుగా పిరమిడ్ పడొద్దు అనే ఛాలెంజ్‌లో రేవంత్ విజయం సాధించడంతో రూ.1,10,000 గెలుచుకున్నారని ప్రకటించాడు బిగ్‌బాస్. తర్వాత మూడో ఛాలెంజ్ కోసం ఏకాభిప్రాయంతో రెండు జంటలను ఎంచుకోమన్నాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్- శ్రీసత్య మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో పోటీపడ్డారు. ఇనయ, రేవంత్, రోహిత్.. ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని చెప్పారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రీహాన్- శ్రీసత్య గెలవడంతో వారు లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత రేవంత్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ పాట పాడగా ఆదిరెడ్డి అందుకనుగుణంగా స్టెప్పులేశాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో ఛాలెంజ్ ప్రవేశపెట్టాడు. పవర్ పంచ్ టాస్క్‌లో రేవంత్, ఇనయ పాల్గొనగా అందరూ ఊహించినట్లు రేవంత్ గెలవడంతో ప్రైజ్‌మనీకి మరో రూ.2 లక్షలు జమయ్యాయి. దీంతో మొత్తం ప్రైజ్‌మనీ రూ.41,10,100కి చేరింది. రాత్రి శ్రీసత్య ఓ దెయ్యం కథ చెప్పింది. ఓ ఫంక్షన్లో ఓ అబ్బాయి వింతగా ప్రవర్తించాడని చెప్పింది. అందరూ ఆ అబ్బాయిని కొడుతున్నా అతడికి చలనం లేకుండా అలాగే నడుచుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఇంతలో సడన్‌గా దెయ్యం సౌండ్ వినిపించడంతో శ్రీసత్య పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీహాన్ బెడ్ మీదకు చేరింది. ఇక శ్రీహాన్ అయితే బాత్రూమ్కి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. అది గమనించిన శ్రీసత్య కావాలని దెయ్యంలా నవ్వుతూ అతడిని మరింత భయపెట్టింది. ఇక ఇనయ అయితే ఏకంగా దెయ్యం పట్టినదానిలా ప్రవర్తించి ఆదిరెడ్డిని వణికిపోయేలా చేసింది. దెయ్యం భయంతో అందరూ జడుసుకుంటూ, నవ్వుకుంటూ ఏ అర్ధరాత్రికో పడుకున్నారు. చదవండి: స్టేజీపై భార్యను పరిచయం చేసిన హీరో సత్యదేవ్ నేను టాప్5లో ఉండనని తెలుసు, రేవంత్ ఎలిమినేట్ అవ్వాలి: ఫైమా -
రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్ ఆడిన శ్రీసత్య!
మొన్నటిదాకా ప్రైజ్‌మనీ కట్ చేస్తూ కంటెస్టెంట్ల ఆశల మీద నీళ్లు గుమ్మరించాడు బిగ్‌బాస్. తాజాగా ఆ కోల్పోయిన డబ్బులు తిరిగి సంపాదించుకునేందుకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సమయానుసారం ఛాలెంజ్‌లు విసురుతూ.. అందులో ఎవరు గెలుస్తారో ముందే ఊహించాలని, కరెక్ట్‌గా గెస్ చేస్తేనే డబ్బులు తిరిగి ప్రైజ్‌మనీలో యాడ్ చేస్తానని ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఒక ఛాలెంజ్ ఓడిపోయి, మరో ఛాలెంజ్ గెలిచిన హౌస్మేట్స్ తాజాగా మరో ఛాలెంజ్‌కు సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ఇందులో శ్రీసత్య, రేవంత్ గొడవపడ్డారు. నెక్స్ట్ గేమ్‌కు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వెళ్తారన్నావ్ కదా, ఎందుకు మాట మారుస్తున్నావని నిలదీసింది శ్రీసత్య. మొత్తం అన్ని గేమ్స్ అమ్మాయి- అబ్బాయి కలిసి ఆడతారని నేను చెప్పలేదే అని రేవంత్ అనగా కేవలం మొదటి మూడు రౌండ్స్ మాత్రమేనని కూడా చెప్పలేదు కదా అంది శ్రీసత్య. ప్రతిసారి అబ్బాయిలు మాత్రమే అంటే ఇంకెందుకు గేమ్స్.. మీరే ఆడుకోండి, అమ్మాయిలు ఆడరు అని ఫైర్ అయింది. దీనికి రేవంత్.. నీకు ఆలోచించే శక్తి లేదా? యాటిట్యూడా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపోతే ప్రస్తుతం ప్రైజ్‌మనీ రూ.39,10,000 ఉండగా దీన్ని రూ.లక్ష పెంచుకునేందుకు ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. మనీ ట్రాన్స్ఫర్ గేమ్‌లో కీర్తి- ఆదిరెడ్డి, శ్రీసత్య-శ్రీహాన్ ఆడారు. మొత్తానికి రేవంత్‌ను ఎదిరించి మరీ గేమ్ ఆడింది శ్రీసత్య. మరి ఈ ఆటలో ఏ జంట గెలిచింది? మిగతావాళ్లు ఎవరు గెలుస్తారో కరెక్ట్‌గా గెస్ చేశారా? లేదా? అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఇప్పటికిప్పుడు ఛాన్స్ ఇస్తే రేవంత్‌ను పంపించేస్తా: ఫైమా పైసా వసూల్ కోసం పోటీపడ్డ రేవంత్, ఇనయ -
విర్రవీగుతున్న రేవంత్.. ఓడిపోయినా బిల్డప్ కొడుతున్నాడే!
Bigg Boss 6 Telugu, Episode 89: టికెట్ టు ఫినాలే రేస్‌లో ఏకాభిప్రాయం పేరుతో ఇంటిసభ్యులను ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఛాలెంజ్ ఇచ్చిన ప్రతిసారి ఆ ఛాలెంజ్‌లో ఏ నలుగురు పాల్గొంటారో ఏకాభిప్రాయంతో పేర్లు చెప్పమంటున్నాడు. దీంతో హౌస్మేట్స్ ఇదెక్కడి గొడవరా బాబూ అని తలలు బాదుకుంటున్నారు. ఈరోజు మొదటగా ఇవ్వబోయే ఛాలెంజ్‌లో ఏ నలుగురు పార్టిసిపేట్ చేస్తారో ఏకాభిప్రాయంతో చెప్పమన్నాడు బిగ్‌బాస్. మళ్లీ ఏకాభిప్రాయం ఏంట్రా దేవుడా అనుకున్న హౌస్మేట్స్ చిరాకు ప్రదర్శించారు. ఈ సమయంలో ఆదిరెడ్డి తెలివిగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ ఛాలెంజ్‌లో తను, రేవంత్ పక్కకు తప్పుకునేందుకు రెడీ అన్నాడు. కానీ నెక్స్ట్ ఛాలెంజ్‌లో ఫైమా, శ్రీహాన్ తప్పుకుంటానంటేనే ఈసారికి మేము సైడ్ అవుతామన్నాడు. అతడి నిర్ణయానికి అందరూ అంగీకారం తెలిపారు. దీంతో బిగ్‌బాస్ ఇచ్చిన రోల్ బేబీ రోల్ అనే టాస్క్‌లో రోహిత్, ఫైమా, శ్రీహాన్, కీర్తి పాల్గొన్నారు. సంచాలకులైన ఇనయ, శ్రీసత్య టవర్ పొడవుగా పేర్చిన శ్రీహాన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టవర్ గేమ్‌లో శ్రీహాన్‌కు 4, రోహిత్‌కు 3, ఫైమాకు 2, కీర్తికి 1 పాయింట్స్ లభించాయి. సంచాలకులపై నిర్ణయంపై కీర్తి అసహనం వ్యక్తం చేసింది. ఇష్టమొచ్చినవాళ్లకు ఇచ్చుకోండి అంటూ కోపంతో ఊగిపోతూ ఆవేశంలో తన టవర్‌ను తన్నేసింది. తర్వాత బెడ్రూమ్లోకి వెళ్లి కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు బిగ్‌బాస్ మార్కుల పట్టిక రిలీజ్ చేయగా శ్రీహాన్ 10, ఆది రెడ్డి 9, రేవంత్ 8, ఫైమా 7, రోహిత్ 4, కీర్తి 3 పాయింట్లతో ఉన్నారు. ఈ లెవల్ ముగిసే సమయానికి తక్కువ పాయింట్లు ఉన్న కీర్తిని రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్. తర్వాత టికెట్ టు ఫినాలే రేసులో నెక్స్ట్ లెవల్ ప్రారంభమైంది. ఇప్పుడు ఇచ్చే మొదటి ఛాలెంజ్‌లో ఏ ముగ్గురు పాల్గొంటారో చెప్పాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా అనుకున్న రూల్ ప్రకారం ఈసారి ఫైమా, శ్రీహాన్ గేమ్ నుంచి సైడవగా రేవంత్, ఆది రెడ్డి, రోహిత్ ఆటలో పాల్గొన్నారు. గుడ్డు జాగ్రత్త గేమ్‌లో అద్భుతంగా ఆడిన ఆదిరెడ్డికి 3, రోహిత్‌కు 2, రేవంత్‌కు 1 పాయింట్ వచ్చింది. ఓటమిని జీర్ణించుకోలేని రేవంత్ సంచాలకురాలైన కీర్తి కావాలనే మనసులో ఏదో పెట్టుకుని నన్ను తప్పించాలని చూసిందని ఉడికిపోయాడు. నేనెక్కడ గెలుస్తానోన్న భయంతో, నామీదే ధ్యాస పెట్టిందని, అలా భయపడాలి అంటూ తనకు తానే సెల్ఫ్ డబ్బా వాయించుకున్నాడు. ఓడిన ప్రతిసారి అందుకు ఇతరులే కారణమని నిందించడం అతడికి అలవాటుగా మారింది. ఇక ఇప్పటివరకు ఆడిన గేమ్ ఆధారంగా మార్కుల పట్టికలో ఆదిరెడ్డి(12 పాయింట్లు), శ్రీహాన్(10), రేవంత్(9), ఫైమా(7), రోహిత్(6) వరుస స్థానాల్లో ఉన్నారు. అనంతరం బిగ్‌బాస్.. కంటెస్టెంట్లు ట్రోఫీ గెలవడానికి గల ప్రాముఖ్యతను వివరించమన్నాడు. ► మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి. వాళ్లు మొదటిసారి కోరిన కోరికను నెరవేర్చాలి - శ్రీహాన్ ► నాన్న పేరు నిలబెట్టేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - రోహిత్ ► బిగ్‌బాస్ షోలో మొదటి రోజు నుంచి ప్రతి టాస్కులో ఆడుతూనే ఉన్నాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందరికంటే ఆ ట్రోఫీ నాకే ఎక్కువ ముఖ్యం - రేవంత్ ► నా జీవితంలో ఏదీ అంత ఈజీగా దొరకలేదు, పోరాడి సాధించాను. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిస్తే ఆ కిక్కే వేరు. కప్పు కొట్టాలన్న అమ్మానాన్న కల నెరవేర్చాలని ఉంది - శ్రీసత్య ► నాలాంటి అమ్మాయిలకు నేను ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలి - కీర్తి ► కుటుంబం కోసం, అలాగే అమ్మాయిలకు ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలుచుకోవాలని ఉంది - ఫైమా ► మొదటిసారి ఓ కామన్ మ్యాన్ 13 వారాలు హస్‌లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్‌గా ఆడి ట్రోఫీ గెలిస్తే హ్యాపీ - ఆదిరెడ్డి ► నువ్వు అమ్మాయివి, నువ్వేం చేయలేవు, చదువుకోలేదు అని నన్ను నానామాటలన్నారు. ఏమీ లేకపోయినా ఏదైనా సాధించవచ్చని నిరూపించాలనుకుంటున్నా. అందుకే ఈ ట్రోఫీ గెల్చుకుని చాలామందికి ఆదర్శంగా నిలవాలనుకుంటున్నా. ఈ కప్పు కొట్టి నాన్నకు అంకితమిస్తా - ఇనయ చదవండి: డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాక అదే చేశా, అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్ -
కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, ఫైమా, రోహిత్ తలపడుతున్నారు. వీరికి వరుస ఛాలెంజ్‌లు ఇస్తూ ఒక్కొక్కరిని పోటీ నుంచి తప్పిస్తున్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌కు రోల్ బేబీ రోల్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో దొర్లుకుంటూ వెళ్లి బ్రిక్స్ తెచ్చుకుని వాటిని టవర్లా కట్టాల్సి ఉంటుంది. ఎవరు బాగా ఎత్తయిన టవర్ కడితే వారే గెలిచినట్లు! ఈ టాస్క్‌కు ఇనయ, శ్రీసత్య సంచాలకులుగా వ్యవహరించగా ఫైమా, కీర్తి, శ్రీహాన్, రోహిత్ ఆడారు. శ్రీహాన్ టవర్ ఎత్తుగా ఉందని శ్రీసత్య చెప్పడంతో కీర్తికి చిర్రెత్తిపోయింది. శ్రీహాన్ టవర్‌లో గ్యాప్ కనిపించట్లేదా? అన్ని విషయాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని వాదించింది. నీ టవర్‌లో కూడా గ్యాప్స్ ఉన్నాయని శ్రీసత్య చెప్తుండగా ఆమె మాట వినిపించుకోలేదు కీర్తి. మీకు నచ్చినవారికి ఇచ్చుకోండి అంటూ తన టవర్‌ను ఒక్క తన్నుతో నేలకూల్చింది. ఆమె ప్రవర్తనతో అందరూ షాకయ్యారు. చదవండి: ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రేవంత్, గొప్పోడివయ్యా రోహిత్ సిద్ధూకు హెడ్వెయిట్? డీజే టిల్లు నుంచి అనుపమ అవుట్ -
ఇవే తగ్గించుకుంటే మంచిది.. శ్రీసత్యను హెచ్చరించిన తండ్రి
Bigg Boss Telugu 6, Episode 81: కన్నవాళ్లను చూడగానే అప్పటిదాకా పడ్డ శ్రమనంతా మర్చిపోతున్నారు హౌస్మేట్స్. 12 వారాల తర్వాత వారు ఎదురుపడటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక ఎవరి పేరెంట్స్ వచ్చినా ఆతృతగా దగ్గరికెళ్లి పలకరించి వారితో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ అంతలోనే తన కన్నవాళ్లు గుర్తొచ్చి కన్నీళ్లను తుడుచుకుంటున్న కీర్తిని చూసి జాలిపడని వారే లేరు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ హౌస్‌లో అడుగుపెట్టాయో చూద్దాం.. ఈరోజు మొదటగా ఫైమా తల్లి షాహీదా బిగ్‌బాస్ హౌస్‌లో హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమె చూడగానే ఫైమా ముఖంలో సంతోషం వెల్లివెరిసింది. తల్లిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టేసింది. అందరూ నన్ను ఫైమా వాళ్ల అమ్మ అంటూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని ఎమోషనలైంది ఆమె తల్లి. అంతలోనే వాతావరణాన్ని కూల్ చేసేందుకు రేవంత్‌ను చూస్తే భయమైతుంది అంటూ హౌస్‌మేట్స్‌పై జోకులు పేల్చింది. ఇక ఫైమాను పక్కకు తీసుకెళ్లిన షాహీదా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ వాడొద్దని చెప్పింది. కోపం, వెటకారం తగ్గించుకోమని శ్రీసత్య, ఇనయలతో జాగ్రత్తగా ఉండమని సూచనలు చేసింది. తర్వాత తన కూతురితో పాటు ఇంటి సభ్యులందరితో కలిసి డ్యాన్స్ చేసింది. ఫైమా తన తల్లిని ఎత్తుకుని తిప్పుతుంటే కీర్తికి తన కన్నవాళ్లు గుర్తొచ్చి ఏడ్చేసింది. అందరిముందు తన బాధను బయపెట్టి వారి సంతోషాన్ని చెదరగొట్టడం ఇష్టం లేక బాత్రూమ్లోకి వెళ్లి బోరుమని ఏడ్చింది. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, లూప్ అంటూ ఓ ఆటాడుకున్నాడు. ఇదే ఛాన్స్ అనుకున్న ఇంటిసభ్యులు ఒకరినొకరు ఆటాడుకున్నారు. శ్రీహాన్‌ను ఫ్రీజ్ అన్నప్పుడు ఫైమా, శ్రీసత్య అతడికి ఆడవేషం కట్టి ఆటపట్టించారు. తర్వాత శ్రీసత్య తండ్రి గొంతు విని గార్డెన్ ఏరియాలోకి పరుగెత్తుకొచ్చింది. తండ్రిని, వీల్‌చైర్‌లో ఉన్న తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. పేరెంట్స్ ప్రేమ దక్కినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని సత్యతో చెప్పింది కీర్తి. ఇక సత్య తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ.. 'నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. ఇంత ఎత్తుకు ఎదుగుతావనుకోలేదు. కానీ కోపం, వెటకారం తగ్గించుకోవాలి. మొదటి మూడు వారాలు బాగున్నావు, తర్వాత ఇలా మారిపోయావేంటి? పాత సత్య ఇలా ఉండదు. నువ్వు పిచ్చిపిచ్చి నామినేషన్స్ వేశావు, ఇంట్లో ఎవరైనా సరే బలమైన కారణం లేకుండా సిల్లీ నామినేషన్స్ వేయొద్దు' అని హెచ్చరించాడు. వాళ్లు వెళ్లిపోగానే సత్య తన తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందింది. అమ్మ కాలు వాసింది, ఏదో భయంగా ఉంది. ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం తండ్రి తన కోసం చేసిన వంటకాలను అందరితో కలిసి పంచుకుంది. నెక్స్ట్ రోహిత్ అమ్మ అతడిని వెనక నుంచి వచ్చి కళ్లు మూసి సర్ప్రైజ్ చేసింది. తల్లిని చూడగానే భావోద్వేగానికి లోనైన రోహిత్.. ఆమె పాదాలమీద పడి ఆశీర్వాదం తీసుకుని అమ్మను పట్టుకుని ఏడ్చేశాడు. ఈ సందర్భంగా ఆమె.. నువ్వు ఒకసారి కెప్టెన్ అయి మా కలను నెరవేర్చు అని కోరింది. తర్వాత కొడుకుతో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసింది. ఇక మెరీనా తనకోసం పంపిన ఫొటోఫ్రేమ్ చూసి కంటతడి పెట్టుకున్నాడు రోహిత్. రిలేషన్లో ఉన్నప్పుడు మొట్టమొదట దిగిన సెల్ఫీ ఫొటో అదేనని ఆ ఫొటో తాలూకు జ్ఞాపకాలను పంచుకున్నాడు రోహిత్. రేపటి ఎపిసోడ్లో మిగతా హౌస్మేట్స్ ఫ్యామిలీస్ రానున్నాయి. చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్.. ఇప్పుడు రోజూ ఏడుస్తూనే ఉంది 51 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
Bigg Boss 6: నడవలేని స్థితిలో శ్రీసత్య తల్లి.. వీల్‌చైర్‌పై బిగ్‌బాస్ హౌస్‌లోకి..
బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డి భార్య, కూతురితో పాటు రాజ్ వాళ్ల తల్లి హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. వారి రాకతో ఆదిరెడ్డి, రాజ్‌లలో నూతనోత్తేజం వచ్చింది. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా తమ కుటుంబ సభ్యులు వస్తారని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఫైమా, శ్రీసత్యల పేరెంట్స్ వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా అర్థమవుతుంది. అమ్మను చూసిన ఫైమా ఆనందంతో ఎగిరిగంతేసింది. తల్లిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూర్చొబెట్టుకొని కబుర్లు చెప్పింది. ‘నువ్వు ఇంగ్లీష్ అందరికి నేర్పిస్తున్నావు.. నాకు కూడా నేర్పించవా’ అంటూ కూతురిపై సెటైర్ వేసింది. ‘ఫైమా కాకుండా మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో చెప్పండి అని శ్రీసత్య అడగ్గా.. ‘అందరూ ఇష్టమే’అంటూ తెలివిగా తప్పించుకుంది. రేవంత్‌ని చూస్తూ.. ‘నిన్ను చూస్తే భయమేస్తుంది’ అని అనడంతో అంతా గట్టిగా నవ్వారు. ఇక శ్రీసత్య తన తల్లిని తలుచుకొని బాధపడంది. ‘మా మమ్మీ కూడా నడుస్తూ ఉంటే బాగుండేది’అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అదే సమయంలో గార్డెన్ ఏరియా నుంచి ‘సోనూ’ అని పిలుస్తూ శ్రీసత్య పేరెంట్స్ వచ్చారు. అయితే శ్రీసత్య తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా నడవలేని స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెను వీల్‌చైర్‌లో తీసుకొని వచ్చాడు శ్రీసత్య తండ్రి. ఇక అమ్మానాన్నాలను చూసిన ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఇద్దరిని గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేసింది. తల్లికి అన్నం తిపిపించింది. ఇక రాజ్ గురించి చెబుతూ.. ‘ఫస్ట్ వీక్‌లో నామినేట్ ఏమని చేశాడో తెలుసా డాడీ.. ‘నువ్వు మాట్లాడుతున్నావు కానీ కనెక్షన్ కుదర్టేదు’అన్నాడు అని శ్రీసత్య చెప్పగా..‘నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్ వేస్తున్నావులే’అని డాడీ అనడంతో ఆమె మొహం మార్చుకుంది. రేవంత్ అయితే ఆయనకు షేక్‌హ్యాండ్ ఇస్తూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా శ్రీసత్య, ఫైమా పేరెంట్స్ ఏం ఏం చెప్పారు. వాళ్లు చేసిన సందడి ఏంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
శ్రీసత్య వెన్నుపోటు పొడుస్తోంది.. రేవంత్‌కు హింటిచ్చిన ఆడియన్స్!
Bigg Boss 6 Telugu, Episode 79: రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లు కడుపు మాడ్చుకునే పరిస్థితి వచ్చింది. అతడు రేషన్ మేనేజర్ అవడమేంటో కానీ పాలు, అన్నం.. ఇలా అన్నింటికీ కొలతలు పెడుతూ ఇంటిసభ్యులకు సరిగా తిండి పెట్టడం లేదు. గత వారం కెప్టెన్‌గా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎన్ని కప్పుల బియ్యం వండేదానివని ఫైమాను అడిగాడు ఆదిరెడ్డి. అందుకామె ఐదు కప్పులని చెప్పింది. కానీ రేవంత్ నాలుగు కప్పులు మాత్రమే చాలంటున్నాడు. అరకప్పు బియ్యం ఎక్కువ వేయమని శ్రీహాన్ చెప్పినా వినట్లేదని చికాకు పడ్డాడు ఆది. బియ్యం అయిపోయినప్పుడు అడిగితే ఇస్తున్నారని చెప్పింది ఫైమా. ఇదే విషయంపై రేవంత్‌ను నిలదీసింది. అతడు మాత్రం సరిపోతుందా? సరిపోదా? అనవసరం అని, రేషన్ ఎంతుందో దాన్ని బట్టే వండుతానని వితండవాదం చేశాడు. అలాగైతే ఎవరికీ ఆకలి తీరదన్నాడు శ్రీహాన్. నీ కెప్టెన్సీలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అందరి కడుపు నింపడానికి ఆలోచించట్లేదన్నాడు. మరోపక్క సమయానికి వచ్చి పాలు తాగకపోతే ఆ పూట పాలు మళ్లీ ఇచ్చేదే లేదని రూల్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది ఇనయ. ఇలా ఎప్పటిలాగే రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఫుడ్ గొడవలు జరిగాయి. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు సభ్యుల ఫొటోలను షెడ్డర్లో వేయాల్సి ఉంటుంది. ► రోహిత్.. శ్రీహాన్, ఫైమా ► శ్రీసత్య.. రాజ్, రోహిత్ ► రాజ్.. శ్రీహాన్, శ్రీసత్య ► కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్య ► ఫైమా.. రోహిత్, ఇనయ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► ఇనయ.. ఫైమా, రాజ్ ► ఆదిరెడ్డి.. ఇనయ, శ్రీహాన్ ► రేవంత్.. ఫైమా, ఆది రెడ్డి రాజ్ మూడు వారాలుగా సేవ్ అవుతున్నందున అతడిని నామినేట్ చేస్తున్నానంది శ్రీసత్య. ఇందుకు ఒప్పుకోని బిగ్‌బాస్ సరైన కారణం చెప్పమని గద్దించాడు. దీంతో శ్రీసత్య అతడి గేమ్ కనిపించలేదని జవాబు చెప్పి జారుకుంది. ఇక ఇనయ.. తనను గేమ్‌లో పర్సనల్‌గా అటాక్ చేసి తన గేమ్ కనిపించకుండా చేసిన ఫైమాను నామినేట్ చేస్తున్నాననంది. రాజ్ నామీద పగ పెంచుకుని నన్ను నామినేట్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. వీరిద్దరూ తన ఫ్రెండ్స్ అని, వీళ్లను నామినేట్ చేయాల్సి వచ్చేంత దూరం పెరుగుతుందని ఊహించలేదంటూ ఏడ్చింది. వాళ్లు తనను ఫ్రెండ్ అనుకోలేదంటూ బాధపడింది. ఫైనల్‌గా ఈ వారం శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయ నామినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం కిచెన్‌లో మళ్లీ ఫైట్ జరిగింది. రేవంత్‌ను ఆలూ, ఉల్లిగడ్డ ఇవ్వమని కొందరు అడగ్గా కుదరదని తేల్చి చెప్పేశాడు కెప్టెన్. మీరేమనుకున్నా నేనేం చేయలేనని చేతులెత్తేశాడు. తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టైం వచ్చింది. హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసి కెప్టెన్‌గా గెలిపించినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేయకపోతే సోలో ప్లేయర్, ఫేవరిటిజం అని పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. మీరు ఆడియన్స్ నుంచి సింపతీ కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకటీరెండు రోజుల వరకే సింపతీ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు. కళ్ల ముందే ఫేవరిటిజం కనిపించినప్పుడు కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడరని ఎవరిని నమ్ముతున్నారు? రాజ్.. నాగురించి చెడుగా ఎవరూ మాట్లాడరు. మొదట్లో నా రియల్ ఫ్రెండ్స్ సూర్య, ఫైమా, ఇనయ. కానీ ఇనయ నా వెనక గోతులు తవ్వుతుందేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. స్నేహితుడిగా ఫీలైన రాజ్ అలా అనడంతో ఇనయ ఏడ్చేసింది. సూర్య వెళ్లిపోయాక వాళ్లిద్దరే మాట్లాడకుండా దూరం పెట్టి నన్ను శత్రువులా చూస్తున్నారు అని కంటతడి పెట్టుకుంది. ప్రశ్న: మీరు ఎప్పుడు ఏం చేస్తారనేది తోటి ఇంటిసభ్యులకే అర్థం కావట్లేదు. దీనికి మీ స్పందన ఏంటి? ఇనయ: మై లైఫ్, మై రూల్స్.. నాకు నచ్చినట్లే ఉంటా, అందుకే అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాను. ప్రశ్న: మీ క్లోజ్ ఫ్రెండ్ మీ గురించి బ్యాక్‌స్టాబింగ్, బిచింగ్ చేస్తుంది. మీకు తెలిస్తే ఏం చేస్తారు? శ్రీసత్య: ముందు బాధపడతాను. నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత క్లోజ్ అనుకుంటున్నారనేది ముఖ్యం. బహుశా వాళ్లకు నేనంత క్లోజ్ కాదేమో! నమ్మినవాళ్లు నా వెనకాల మాట్లాడితే నెక్స్ట్ టైం నా దగ్గరకు రానివ్వను. ఇక నాగార్జున చెప్పిన టాస్క్‌ను అమలు చేసే పనిలో పడ్డారు శ్రీసత్య, ఫైమా. అర్ధరాత్రి మేకప్ వేసుకుని రాజ్, శ్రీహాన్‌ను భయపెట్టి మిషన్ కంప్లీట్ చేశారు. చదవండి: మెరీనా పారితోషికం ఎంతో తెలుసా? నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్ -
ఆకలితో మాడుతున్న హౌస్మేట్స్, అయినా కరగని రేవంత్!
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 9 మెంబర్స్ మిగిలారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేలో అడుగుపెడతారు. ఈరోజు మండే కావడంతో నామినేషన్స్ మొదలుకానున్నాయి. అయితే ఇప్పటికీ సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేస్తానంటే కుదరదని తెగేసి చెప్పాడు బిగ్‌బాస్. ఒక్కొక్కరినీ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి నామినేట్ చేయమన్నాడు. ఈ క్రమంలో శ్రీసత్య.. ఆటతీరును పరిగణనలోకి తీసుకోకుండా కేవలం రాజ్ మూడు వారాల నుంచి సేవ్ అవుతున్నాడని నామినేట్ చేసింది. దీంతో బిగ్‌బాస్ తుప్పాస్ రీజన్ కాకుండా ఏదైనా వాలిడ్ పాయింట్ చెప్పమన్నాడు. మరోవైపు రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లకు కడుపు నిండా తిండి దొరక్కుండా పోయింది. ఉన్నదాన్ని పంచి పెట్టకుండా దాచి దెయ్యాలపాలు చేస్తున్నాడు. గతంలోనూ అలాగే చేయగా మరోసారి ఫుడ్ కట్ చేస్తున్నాడు. అంత కొద్దిగా వండితే సరిపోవట్లేదు మహాప్రభో అని మొత్తుకుంటున్నా నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించాడు. వారమంతా సరిగా తినీతినకుండా వారాంతంలో మాత్రం కడుపు నిండా పెడతానంటే కరెక్ట్ కాదు. అందువల్ల కెప్టెన్‌గా నువ్వు గెలుస్తావేమో కానీ అందరి ఆకలి తీరదు అని ముఖం మీదే చెప్పాడు శ్రీహాన్. రేషన్ సేవ్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్ అయ్యాడు. నిజంగానే రేవంత్ ఎంతసేపూ గేమ్ కోణంలో ఆలోచిస్తున్నాడే కానీ మానవత్వంతో ఓ ముద్ద ఎక్కువ పెట్టుంటే హౌస్మేట్స్ అందరితో మంచి కెప్టెన్ అనిపించుకునేవాడు. ఇకపోతే ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: బాటమ్ 5లో ఎవరంటే? మెరీనా ఎలిమినేషన్‌కు కారణాలివే! -
ఆదిరెడ్డి ఇమేజ్ టోటల్ డ్యామేజ్.. గీతూకి పట్టిన గతి రాకుండా చూస్కో!
Bigg Boss 6 Telugu, Episode 77: ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఎదుటివాళ్ల కంటే మనకే ఎక్కువ నష్టం అన్న విషయాన్ని పసిగట్టలేకపోతున్నాడు ఆదిరెడ్డి. ఇప్పటికే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చేజేతులా గేమ్‌ను నాశనం చేసుకుని గీతూ బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఆది. దీంతో నాగార్జున అతడికి చీవాట్లు పెట్టి తప్పులను సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చాడు. మరి ఇంకా ఎవరెవరికి ఎలాంటి క్లాస్‌లు పీకాడు? ఎవరి బండారాలు బయటపెట్టాడు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! కెప్టెన్సీ అంటే అధికారం కాదని, బాధ్యత అని రేవంత్‌కు గుర్తు చేశాడు నాగార్జున. ఏదైనా పని చెప్పేటప్పుడు మాట్లాడే తీరు చూసుకోమని విసుక్కున్నాడు. శక్తి ఆటలో ప్రదర్శించమని, మాటలో కాదు అని చురకలంటించాడు అనంతరం ఆదిరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకాడు. ఓ కథ చెప్పి మరీ అతడిని దోషిగా నిలబెట్టాడు. నోటికొచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావని గడ్డి పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్, అది దక్కించుకుంటే ఓట్లు పడవు అని ఆడకుండా మూలన కూర్చున్నావు. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో డిసైడ్ చేయడానికి నువ్వేమైనా తోపా? తురుమా? అని తిట్టిపోశాడు. నువ్వు కామన్ మ్యాన్‌గా ఆడటానికి వచ్చావు, కేవలం మాట్లాడటానికి కాదు, గేమ్‌లో ఉన్న వాళ్లను ఇన్ఫ్లూయెన్స్ చేసి నీ అభిప్రాయాలను వారితో చెప్పిస్తున్నావు. గేమ్ విషయంలో ఎక్కువ ఆలోచించి లూప్‌లు వెతికితే నీకూ గీతూ పరిస్థితే వస్తుంది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాక కెప్టెన్సీ కంటెండర్ గేమ్‌లో నువ్వు రూపాయి పెట్టి కూడా ముందుకు వెళ్లొచ్చు, కానీ లక్ష రూపాయలు రాశావు. ఇమ్యూనిటీ కోసమే కదా.. అని లాజిక్ అడిగాడు. ఇదే ప్రశ్న రాజ్ అడిగితే ఏదేదో చెప్పి అతడి నోరు మూయించాడు ఆది. ఇప్పుడు నాగ్ కూడా అదే అడిగేసరికి అడ్డంగా దొరికిపోయాడు. ఇకపోతే శ్రీహాన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు శ్రీసత్యకు వంట రాదంటే వదిలేసి కీర్తిని మాత్రం వంట రాదంటే నేర్చుకుని చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని ఓ ఆడియన్ అడగ్గా.. తనకసలు గుర్తే లేదని జవాబిచ్చాడు. దీంతో నాగ్.. గుర్తు లేకపోతే నేను గుర్తు చేస్తానన్నట్లుగా ఓ వీడియో వదిలాడు. అందులో శ్రీసత్య నాకు రాదు, చేయను అని స్పష్టంగా చెప్పింది. అయినా ఆమెను వదిలేసి, కీర్తిని మాత్రం వంట నేర్చుకుని చేయమన్నాడు. అంత అడ్డంగా దొరికినప్పటికీ సరిగా వినపడలేదంటూ మళ్లీ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. అలాగే కుక్కలు మొరిగితే దేవలోకానికి ఏమీ కాదని కీర్తి చెప్పిన సామెతను సామెతలాగే చూడాలే తప్ప దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేయనవసరం లేదని శ్రీహాన్, శ్రీసత్యలకు మొట్టికాయలు వేశాడు. ఇక ప్రతివారం నామినేషన్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేసేది శ్రీసత్య. పక్కనోళ్లు నామినేట్ చేసుకుంటుంటే మరీ ముఖ్యంగా ఇనయను నామినేట్ చేసేటప్పుడు తెగ నవ్వుతుంటుంది. సరిగ్గా ఇదే పాయింట్ లేవనెత్తాడు నాగ్. నామినేషన్స్‌లో నీకు నవ్వెందుకు వస్తుందని అడిగాడు. లోపల ఉన్న అహంకారం, వెటకారం వల్లే ఆ నవ్వు వస్తుందని ఆమె పరువు తీశాడు. అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో మీమ్స్ గేమ్ జరిగింది. అందులో భాగంగా అక్కడున్న మీమ్ కార్డులు ఎవరికి సూటవుతాయో వారికి ఇవ్వాలన్నాడు నాగ్. రేవంత్‌ను ఇవే తగ్గించుకుంటే మంచిది అన్నాడు ఆది. శ్రీసత్యకు ఓరి.. దీని వేషాలూ అన్న మీమ్ ఇచ్చాడు శ్రీహాన్. రాజ్.. ఓన్లీ వన్స్ ఫసక్ అనేలా మాట్లాడుతున్నాడంది ఫైమా. ఫైమాకు అట్లుంటది మనతోని ట్యాగ్ ఇచ్చాడు రాజ్. శ్రీహాన్‌కు సరె సర్లే, చాలా చూశాం ట్యాగ్ ఇచ్చింది కీర్తి. వీడెవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు.. చైల్డ్ ఆర్టిస్టా? అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది ఇనయ. మస్తు షేడ్స్ ఉన్నాయ్రా నీలో, ఆట్.. కమల్ హాసన్ అన్న మీమ్ శ్రీహాన్‌కే సూటవుతుందన్నాడు రోహిత్. చాలా ఉన్నాయ్ దాచాం.. లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయ్ అన్న మీమ్‌ను శ్రీహాన్‌కు ఇచ్చింది శ్రీసత్య. ఇదేందయ్యా ఇది, నేనేడా చూడలా.. అన్న మీమ్ రోహిత్కిచ్చింది మెరీనా. ఆదిరెడ్డి పని అయిపాయే అన్నాడు రేవంత్. నిజంగానే ఈరోజు ఎపిసోడ్లో ఆదిరెడ్డి పని అయిపోయింది. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే? పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా.. -
Bigg Boss 6: కర్మ ఫలితం.. రేవంత్, శ్రీహాన్‌లకు బుద్దిచెప్పిన హౌస్మేట్స్
Bigg Boss 6 Telugu, Episode 76 Highlights : ఎవిక్షన్ ఫ్రీ పాస్‌లో భాగంగా కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ గేమ్‌లో చివరగా ఫైమా, రేవంత్, శ్రీహాన్‌లు మిగిలారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు వాళ్లకి నచ్చిన వాళ్లకి సపోర్ట్ చేసి మిగిలిన కంటెస్టెంట్లకు బస్తాను తగిలించాల్సి ఉంటుంది. కెప్టెన్సీ టాస్కులో రేవంత్, శ్రీహాన్‌లు కలిసి గేమ్ ఆడి ఎలా అయితే హోస్మేట్స్ని తప్పించారో, అందుకు బదులుగా సత్య తప్పా మిగితా కంటెస్టెంట్లు అంతా వీరిద్దరికి బాగానే బుద్ది చెప్పారు. బజ్ మోగిన ప్రతిసారి రేవంత్, శ్రీహాన్‌లకు బస్తాలు పెంచుకుంటూ పోయారు. పాపం శ్రీసత్య మాత్రం తన ఫ్రెండ్స్‌ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది కానీ హౌస్మేట్స్ అంతా ఒకటైపోవడంతో ఆమె ఆటలు సాగలేదు. ఇక బస్తాల బరువులు మోయలేక చివరికి ఆ బ్యాగ్‌ను శ్రీహాన్ కింద పెట్టేశాడు. ఇక అప్పుడు వెంటనే సత్య వెళ్లి శ్రీహాన్‌ను ఆమె ఒళ్లో పడుకోబెట్టి మరీ అతన్ని ఓదార్చింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఒకప్పుడు అర్జున్ టచ్ చేస్తేనే చిరాకు అన్న సత్య ఇప్పుడు శ్రీహాన్‌తో చాలా క్లోజ్ అయ్యిందని, అవసరం లేకపోయినా అతడిని టచ్ చేస్తుందంటూ ట్రోల్స్ రాయుళ్లు రెచ్చిపోయారు. ఇదిలా ఉండగా రేవంత్ ఈ టాస్కులో గెలవడానికి చాలానే కష్టపడినా హౌస్మేట్స్ అందరి సపోర్ట్ ఫైమాకే ఉండటంతో అతని కష్టం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. చివరికి ఫైమాకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కడంతో ఆమె తెగ సంతోషపడింది. -
ఆడియన్స్ ప్రశ్నలతో బయటపడ్డ శ్రీహాన్, శ్రీసత్య నిజస్వరూపం!
Bigg Boss 6 Telugu, Episode 75: సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ వారం వెళ్లిపోయేది తనే అని ఫిక్సయిన మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. నవంబర్ 29న వెడ్డింగ్ యానివర్సరీ ఉందని, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్ చేసుకోవాలనుందని చెప్పింది. హౌస్ లోపల అయినా బయట అయినా ఇద్దరం కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకు నువ్వే ఏదో ఒకటి చేయాలంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంటే ఉంచితే ఇద్దరినీ హౌస్‌లో ఉంచమని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరినీ పంపించేయమని చెప్పకనే చెప్పింది. బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్ చురకలేశాడు. అనంతరం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్.. ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలకుడిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్లే అనిపించింది. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటని సెటైర్లు వేసింది. మొదటి రౌండ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్లో ఎవరూ అవుట్ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలన్నాడు బిగ్‌బాస్. ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్ అయ్యాడు. ఇక రేవంత్, ఫైమా గేమ్ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అని రేవంత్ ఫైమాను ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆదిరెడ్డి అందుకుంటూ బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని కౌంటరిచ్చాడు. దీనికి కిమ్మనుకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్. మూడో రౌండ్లో ఇనయ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్ కాలేకపోయానని వెక్కివెక్కి ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్.. శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌గా అవతరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అవడంతో రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అనంతరం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్. మొదటి ప్రశ్న: నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్ శ్రీసత్యకు ఎందుకు చెప్పలేదు? శ్రీహాన్: వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఆమెను కిచెన్ టీమ్‌లో వేశా. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కిచెన్‌లో పని చేయడం చూశాను. శ్రీసత్య వంట చేయను అన్న మాట నాకు వినిపించలేదు. అయినా తను కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది అని చెప్పాడు. నిజానికి శ్రీసత్య వంట రాదు, చేయను అన్నా కూడా శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో కీర్తి ముఖం మతాబులా వెలిగిపోయింది. రెండో ప్రశ్న: ఫైమా మీరు మొదట్లో చూడటానికి ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థపరురాలిగా కనిపిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అసలు రూపం ఏది? ఫైమా: ఆటలో గెలవాలన్న కసి ఎక్కువైంది. దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్టైన్ పక్కన పెట్టేశాను. మూడో ప్రశ్న: ఒక రివ్యూయర్ అయి ఉండి మీకు గేమ్ బాగా తెలుసని మీరే అంటుంటారు. కానీ మీ నామినేషన్స్ అందరికన్నా సిల్లీగా, సేఫ్‌గా ఉంటాయి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని నామినేట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోండి.. ఆదిరెడ్డి: స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను బయటకు పంపించాలన్న ఆలోచన నాకు లేదు. వారితో గేమ్ ఆడి గెలవాలనుకుంటాను. నా కళ్ల ముందు జరిగే సంఘటనలను బట్టే నామినేషన్స్ చేశాను, తప్ప సిల్లీ రీజన్స్ ఇవ్వలేదు. మీకలా అనిపిస్తే నేనేం చేయలేను. మరీ ముఖ్యంగా నన్ను రివ్యూయర్‌గా కాకుండా కంటెస్టెంట్‌గా చూడండి. ప్రశ్న: ఇనయ తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నారు. కానీ మీరు రేవంత్‌ను మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్ను యూజ్ చేసుకున్నారు. తన గేమ్ కూడా మీరే ఆడి తనని నామినేట్ చేశారు. మీరు చెప్పే విషయాలు మీరసలు పాటిస్తారా? శ్రీసత్య: తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తాను. రేప్పొద్దున శ్రీహాన్ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తా. ఇనయను రెచ్చగొట్టడానికే ఆమె వెన్నుపోటు పొడిచిందన్నాను. ఫ్రెండ్షిప్, గేమ్ ఒకటి కాదు. రేపు పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేస్తాను. అర్జున్ను నేను యూజ్ చేసుకోలేదు. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తాను. చదవండి: ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా -
మూడు రోజులు ఫ్యామిలీ అంతా తిండి లేక పస్తులున్నాం: శ్రీసత్య
బిగ్‌బాస్ సీజన్ 6ను రసవత్తరంగా మార్చడంలో కంటెస్టెంట్లు సఫలం కాలేదని వారి మీద కక్ష గట్టినట్టున్నాడు బిగ్‌బాస్. విన్నర్ క్వాలిటీస్ ఏ ఒక్కరికీ సరిగా లేవనుకున్నాడో, లేదా వారికి రూ.50 లక్షలు అనవసరం అనుకున్నాడో ఏమో కానీ ప్రైజ్‌మనీలో నుంచి కోత పెట్టడం మొదలు పెట్టాడు. సండే రోజు నాగార్జున విజేత రూ.50 లక్షలు గెలుచుకుంటాడని ప్రకటించాడు. అంతలోనే అనేక ట్విస్టుల మధ్య ఈ ప్రైజ్‌మనీ రూ. 44,00,300కు పడిపోయింది. ఈ ఊచకోత ఇంకా జరిగేట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఇంటిసభ్యులకు డబ్బెందుకు అవసరం? వారు డబ్బు వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? వారికి ప్రైజ్‌మనీ ఎందుకు అవసరం? అనేది చెప్పాలన్నాడు. మొదటగా ఫైమా మాట్లాడుతూ.. 'మా అమ్మకు మేము నలుగురం ఆడపిల్లలం.. చిన్నప్పటినుంచి చాలా కష్టాలు పడ్డాం. రోజూ పొలం పనికి వెళ్లి ఆ డబ్బుతో నిత్యావసరాలు తెచ్చుకునేవాళ్లం. ఊర్లో ఎన్నో కిరాయి ఇళ్లు తిరిగాం, ఎన్నో అవమానాలు పడ్డాం. ఒకసారైతే మాకంటే వేరేవాళ్ల అద్దె ఎక్కువ ఇస్తామన్నారని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నారు. కానీ ఎంత తిరిగినా ఉండటానికి ఇల్లు దొరకలేదు. మా అమ్మకు మంచి ఇల్లు కట్టివ్వాలన్నదే నా కోరిక' అని చెప్పింది. ఆదిరెడ్డి వంతు రాగా.. 'మా నాన్న సరిగా పనిచేయకపోవడం వల్ల అమ్మ ఎన్నో కష్టాలు పడింది. ఆమె తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నెత్తిన గడ్డిమోపు వేసుకుని పని చేసేది. నాకిప్పుడు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. కానీ మా ఆవిడకు ఇల్లంటే ఇష్టం. బిగ్‌బాస్ ప్రైజ్‌మనీతో సొంతిల్లు కొనాలన్నదే నా డ్రీమ్' అన్నాడు. శ్రీసత్య మాట్లాడుతూ.. 'అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏ లోటూ తెలియకుండా పెంచారు. కష్టమనేదే లేకుండా చూసుకున్నారు. కానీ ఒకానొక సమయంలో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ మొదలయ్యాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి మా కుటుంబమంతా మూడు రోజులు తిండి లేక పస్తులున్నాం. డబ్బు లేకపోతే మన ముఖం కూడా ఎవరూ చూడరు. అమ్మకు వైద్యం చేయించేందుకు ఇల్లు కూడా అమ్మేశాం. నేను సంపాదించేదంతా అమ్మ వైద్యానికే అవుతుంది. బిగ్‌బాస్ విన్నింగ్ ప్రైజ్‌మనీతో మా అమ్మ కోలుకునేలా మంచి వైద్యం చేయించడంతో పాటు సొంతిల్లు కొనాలనుంది' అని చెప్పుకొచ్చింది. కీర్తి మాట్లాడుతూ.. నాకు సొంతంగా ఏదీ కొనాలని లేదు. కానీ నాలాంటి అనాధల కోసం ఒక ఆశ్రమం పెట్టాలని ఉందని చెప్పింది. చదవండి: ప్రైజ్‌మనీకి గురి పెట్టిన బిగ్‌బాస్ -
భలే ట్విస్ట్.. ప్రైజ్‌మనీ కట్ చేసేందుకు పూనుకున్న బిగ్‌బాస్!
బిగ్‌బాస్ షో మొదలై పదివారాలు పూర్తయినా నామినేషన్స్ మాత్రం ఇంకా చప్పగానే సాగుతున్నాయి. నిన్నటి నామినేషన్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే నామినేషన్స్ నుంచి కాపాడుకునేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒక చెక్ ఇచ్చి దాని మీద యునిక్‌గా అనిపించే అమౌంట్ రాయమన్నాడు. ఏ సభ్యులైతే చెక్‌పై ఎక్కువ మనీ రాస్తారో వారు నామినేషన్ నుంచి సేవ్ అవుతారని చెప్పాడు. అయితే ఈ మొత్తం బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో నుంచి తగ్గిస్తామని ట్విస్ట్ ఇచ్చాడు. చెక్‌పై ఎంత రాస్తున్నామన్నది ఎవరితో చర్చించడానికి వీల్లేదని బిగ్‌బాస్ మరీమరీ చెప్పాడు. ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో శ్రీసత్య ఈ పోటీలో అనర్హురాలిగా నిలిచింది. ఇక సేవ్ అవడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు రాస్తే మాత్రం వారికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదన్నాడు ఆదిరెడ్డి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎవరెంత అమౌంట్ రాశారంటే... ► ఆదిరెడ్డి - లక్ష రూపాయలు ► శ్రీహాన్ - లక్ష రూపాయలు ► రోహిత్ - రూ. 2.51,001 ► రాజ్ - రూ.4,99,700 ► మెరీనా - రూ.4,99,998 ► ఇనయ - రూ.4,99,998 ► కీర్తి - రూ. 4,99,999 ► రేవంత్ - రూ.4,99,999 ► సత్య - రూ.4,99,999 లక్షలు రాశారు. అదేంటో గానీ అత్యధిక నంబర్ రాసినవారు కాకుండా రాజ్‌ను సేవ్ చేశాడట బిగ్‌బాస్. అంతేకాదు, ప్రైజ్ మనీలో నుంచి రూ. 5 లక్షలు కట్ అయ్యాయట. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా? మరి అదెలా జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! చదవండి: చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్ -
చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్!
Bigg Boss 6 Telugu, Episode 72: బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 10 కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మీదట గేమ్ మరింత రంజుగా మారనుంది. అసలైన నామినేషన్స్ హీట్ ఇప్పుడు మొదలు కానుంది అనుకుంటే అంతా తలకిందులైంది. ఈరోజు నామినేషన్స్ అసలు నామినేషన్స్లానే లేవు. ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా నువ్వు నాకు వేశావు, నేను నీకు వేస్తున్నా అన్నట్లుగా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఇది చదివేయండి.. నాకు బాగా క్లోజ్ అయినవారందరూ వెళ్లిపోతున్నారు. గీతూ, బాలాదిత్య ఇద్దరూ వెళ్లిపోయారు, అంటే నేను కూడా వెళ్లిపోతానని హింటిస్తున్నావా బిగ్‌బాస్? అని తనలో తనే మదనపడ్డాడు ఆది రెడ్డి. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఉండి వ్యర్థం అనుకున్న ఇద్దరు ఇంటిసభ్యులపై చెత్త బుట్ట గుమ్మరించాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా ఫైమా.. బూతు మాట్లాడావంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రోజులు గడిచేకొద్దీ నీ కసి కోపంగా మారుతోంది. గేమ్‌ను పర్సనల్‌గా తీసుకుని కావాలని ఫిజికల్ అవుతున్నావంటూ ఇనయపై చెత్త గుమ్మరించింది. ► ఆదిరెడ్డి.. శ్రీహాన్, రోహిత్ ► ఇనయ.. ఆదిరెడ్డి, రాజ్ ► శ్రీహాన్.. రోహిత్, కీర్తి ► మెరీనా.. రేవంత్, ఇనయ ► రాజ్.. మెరీనా, ఇనయ ► శ్రీసత్య.. ఇనయ, కీర్తి ► రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డి ► కీర్తి.. శ్రీసత్య, మెరీనా ► రేవంత్.. రోహిత్, మెరీనాలను నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్‌లో కీర్తి- శ్రీసత్యల మధ్య ఇగో ఫైట్ నడిచింది. గేమ్ ఓడిపోయిన కోపంలో బూతులు మాట్లాడాడన్న కారణంతోనే రోహిత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అటు ఇనయది కూడా అదే పరిస్థితి. ఆవేశంలో నోటి నుంచి బూతులు వచ్చేస్తున్నాయి, కాస్త చూసుకోమని హెచ్చరించారు ఇంటిసభ్యులు. అంతకు మించి పెద్దగా వాదనలేమీ జరగలేదు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్ ఫైమా మినహా ఇనయ, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, రాజ్‌లు నామినేషన్లో ఉన్నారు. కాకపోతే ఓటింగ్ లైన్లు రేపు రాత్రి ఓపెన్ కానున్నాయి. అంటే నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ సువర్ణావకాశం ఇవ్వనున్నాడు బిగ్‌బాస్. మరి ఈ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి! చదవండి: బాలాదిత్య, వాసంతిల పారితోషికం ఎంతో తెలుసా? సినిమాలకు బ్రేక్, హీరో షాకింగ్ నిర్ణయం -
ప్రతిసారి నేనే బాధితుడిగా మారాల్సి వస్తోంది: రేవంత్
నామినేషన్స్ వచ్చాయంటే చాలు ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్లుగా ప్రవర్తిస్తారు హౌస్మేట్స్. ఎక్కడెక్కడినుంచో ఏవేవో కారణాలు వెతికి పట్టుకుని మరీ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో మాటల యుద్ధాలు కూడా జరుగుతాయి. కానీ నామినేషన్ ప్రక్రియ ముగియగానే అందరూ తిరిగి మామూలవడమే ఒక మ్యాజిక్‌గా అనిపిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా నామినేషన్స్‌కు సంబంధించి మరో ప్రోమో రిలీజైంది. ఇందులో రాజ్.. వాసంతి నా గురించి మాట్లాడుతుంటే మధ్యలోకి వస్తున్నావు, నీకెందుకు? అని ఇనయను నిలదీశాడు. దీనికామె.. తనకేదనిపిస్తే అది చెప్పేస్తానంది. అంటే నువ్వు ఏం సోది చెప్పినా మేమందరం కూర్చుని వినాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంలో బూతు మాటలు అనేస్తున్నావని ఇనయను నామినేట్ చేసింది శ్రీసత్య. ఎవరి వల్ల కెప్టెన్సీ గేమ్ ఓడిపోయాడో ఆ ఇద్దరినే(రేవంత్, ఆది రెడ్డిని) నామినేట్ చేశాడు రోహిత్. సంచాలక్‌గా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నావంటూ రేవంత్‌ను నామినేట్ చేసింది మెరీనా. ఇక రేవంత్ వంతు రాగా.. ఈ హౌస్‌లో ప్రతి చిన్న పాయింట్ పట్టుకుని నామినేట్ చేస్తున్నారు. అలా చిన్నపాటి విషయాలకు కూడా నామినేట్ చేసిన సందర్భాల్లో 70% నేనే బాధితుడిని అవుతున్నా అని చెప్పుకొచ్చాడు. చదవండి: అందంలో బుట్టబొమ్మ ఆటలో ఉత్త బొమ్మ.. పరువు తీసిన యాంకర్ -
చివరి నిమిషంలో ట్విస్ట్! బాలాదిత్యతో పాటు వాసంతి అవుట్!
Bigg Boss Telugu 6, Episode 70: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో వరుసగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గీతూ ఎలిమినేషన్ మరవకముందే బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడు. దీంతో షాక్‌లోకి వెళ్లిపోయాడు ఆది. తాను స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు అవుట్ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు. మరి వెళ్లేముందు బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు ఎలాంటి సూచనలిచ్చాడో చూద్దాం.. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌ను ప్రస్తావించిన నాగార్జున.. ఆ టాస్క్‌లో రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడని చెప్పాడు. అటు ఇనయ కోపంలో ఏది పడితే అది అనేస్తుందని సీరియస్ అయ్యాడు. నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, అది తప్పని హెచ్చరించడంతో ఆమె సారీ చెప్పింది. అనంతరం హౌస్‌మేట్స్‌తో డాక్టర్- పేషెంట్ గేమ్ ఆడించాడు నాగ్. కొన్ని జబ్బుల పేర్లున్న కార్డులు పంపించి అది ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలన్నాడు నాగ్. అంతేకాకుండా ఆ జబ్బుకు తగ్గట్లు మందు ఇవ్వాలన్నాడు. ముందుగా శ్రీసత్య.. రేవంత్‌కు మొండితనం ఎక్కువని చెప్పి నిమ్మరసం తాగించింది. ఇనయ.. వాసంతికి ఇమ్మెచ్యురిటీ ఎక్కువని, మనిషి ఎదిగినా తన బ్రెయిన్ ఎదగలేదంటూ ఉసిరి రసం ట్రీట్మెంట్ ఇచ్చింది. రాజ్.. ఇనయ వితండవాదం చేస్తుందని కాకరకాయ రసం తాగించాడు. ఫైమా.. ఇనయకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువంటూ ఆమెకు నిమ్మరసం అందించింది. నమ్మకద్రోహం చేసిందంటూ వాసంతితో ఉసిరి రసం తాగించింది మెరీనా. ఇనయ ఇగోతో గేమ్ ఆడుతుందన్నాడు ఆదిరెడ్డి. శ్రీసత్యకు కక్కుర్తి ఎక్కువన్నాడు రేవంత్. ఇనయకు తలపొగరు ఎక్కువని చెప్పాడు రోహిత్. శ్రీసత్యకు ఇగో ఎక్కువంది కీర్తి. ఫైమాకు స్వార్థమెక్కువని బాలాదిత్య, రేవంత్‌కు స్వార్థమెక్కువని శ్రీహాన్ అభిప్రాయపడ్డారు. శ్రీసత్య మానిప్యులేటర్ అని వాసంతి అనగా అది నేనూ ఒప్పుకుంటానన్నాడు నాగ్. అనంతరం బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో అందరూ షాకయ్యారు. స్టేజీపైకి వచ్చిన బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు విలువైన సూచనలు చేశాడు. ఆదిరెడ్డిని గట్టిగా అరవకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడమన్నాడు. స్ట్రాటజీలు ఫెయిరా? అన్ఫెయిరా? కాస్త చూసుకొని ఆడమని ఫైమాకు సలహా ఇచ్చాడు. రాజ్.. ఏదైనా క్లారిటీగా చెప్పాలన్నాడు. రోహిత్‌ను టెంపర్ లూజవ్వద్దని సూచించాడు. మెరీనా ఇండిపెండెంట్‌గా ఆడాలన్నాడు. గీతూ తర్వాత ఎక్కువ కనెక్ట్ అయింది సత్యకే అంటూ కోపంలో మాటలు వదిలేయొద్దని కోరాడు. శ్రీహాన్ తెలివైనవాడని, కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమన్నాడు. రేవంత్ రౌద్రంగా కనిపించే పసిపిల్లాడని చెప్పాడు. అగ్రెషన్ ఒక్కటి తగ్గించుకోవాలని సూచించాడు. ఇనయకు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది, కానీ చెప్పే విధానం సరిగా లేదంటూ దాన్ని సరిచేసుకోమన్నాడు. కీర్తిని ఎక్కువ ఆలోచించొద్దన్నాడు. వాసంతిని ఓటమి నుంచి మోటివేట్ అయి గేమ్ ఆడాలని పేర్కొన్నాడు. ఇక హౌస్‌లో ఏ నెగెటివిటీ మూటగట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో మంచివాడన్న బిరుదుతోనే బయటకు వచ్చేశాడు బాలాదిత్య. రేపటి ఎపిసోడ్లో మెరీనాకు బదులుగా వాసంతి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఓడిపోతే బూతులు మాట్లాడతావా: ఇనయపై నాగ్ ఫైర్ టాప్ 5లో శ్రీహాన్ డౌటే, ఇనయ లేకపోతే బిగ్‌బాసే లేదు: గీతూ -
జైల్లో ఇనయ, వదిలేస్తే టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారే!
Bigg Boss 6 Telugu, Episode 69: గీతూ వెళ్లిపోయాక ఆదిరెడ్డి మరీ విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కోసారి అతడి మాటలు, ఆట చూస్తుంటే గీతూ పూనినట్లే అనిపిస్తోంది. ఇనయ మీద నోరేసుకుని పడిపోయి అనవసరంగా ఆమెకు హైప్ ఇస్తున్నాడు ఆది. హౌస్‌లో అందరూ ఇనయ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నా బయట తనకది పాజిటివ్ అవుతుండటం గమనార్హం. నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి.. కెప్టెన్సీ టాస్క్‌లో ఆదిరెడ్డి, ఫైమా కలిసి ఆడారని ఇనయ ఆరోపించింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆది.. 'అసలు నీకు బ్రెయిన్ ఉందా? నేను ఫైమాతో ప్లాన్ చేశానని తేలితే బిగ్‌బాస్ వదిలి వెళ్లిపోతా' అని సవాలు విసిరాడు. అటు ఫైమా కూడా.. నువ్వు ఎంత ఒర్రినా ఎక్కువ రోజులుండవులే అని శివాలెత్తింది. సంచాలక్ కన్ఫ్యూజన్కు శ్రీసత్యకు చిర్రెత్తిపోయింది. కళ్ల ముందు తనను లాగుతున్నా ఏమీ అనకుండా నిల్చుండిపోయాడని రేవంత్‌పై అసహనం వ్యక్తం చేసింది. చివరగా ఈ పోటీలో ఫైమా గెలిచి కొత్త కెప్టెన్‌గా అవతరించింది. గెలవగానే ఫైమా ఇనయను పట్టుకుని ఏడ్చేసింది. ఇది చూసి షాకైన హౌస్మేట్స్ ఇప్పుడే గొడవ పెట్టుకున్నారు, అప్పుడే కలిసిపోయారా? అని ఆశ్చర్యపోయారు. రాత్రి రేవంత్, రాజ్ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో శ్రీహాన్‌ను మధ్యలోకి లాగుతూ.. నేను గెలిస్తే రావు, కానీ సత్య గెలిస్తే దుప్పటి పట్టుకుని మరీ తన దగ్గరకు వెళ్లిపోతావు అని కామెంట్ చేశాడు. ఇది శ్రీహాన్ సరదాగా తీసుకోలేకపోయాడు. కామెడీగా అయినా సరే, ఏది పడితే అది అనేయకు అని హెచ్చరించాడు. అలా నోటికొచ్చింది మాట్లాడితే నీకు, ఇనయకు తేడా ఏంటని ప్రశ్నించాడు. దీనికి రేవంత్.. తానసలు ఆ మాటే అనలేదని బుకాయించాడు. అనంతరం బిగ్‌బాస్ ఈవారం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమన్నాడు. ముందుగా ఫైమా.. వాసంతికి; ఇనయ, కీర్తి.. రోహిత్‌కు; వాసంతి, మెరీనా.. కీర్తికి; రాజ్.. శ్రీసత్యకు స్టాంప్ వేశారు. సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయ్యావంటూ రేవంత్‌కు స్టాంప్ వేశాడు బాలాదిత్య. సంచాలక్‌గా నువ్వు గేమ్ మధ్యలో రూల్స్ మార్చావు, ముందు వారాల్లో కంటే ఇప్పుడు నీలో చాలా మార్పు కనిపించింది. ఈ వారం నీలో ఏదీ నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ వేసింది శ్రీసత్య. అటు ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్.. ఇనయకు స్టాంపేశారు. తర్వాత రేవంత్ వంతు రాగా.. అరవడం గురించి మీరు నాతో పోల్చుకున్నారు. అది నచ్చలేదు. రాత్రి నీ గురించి మాట్లాడుకున్నాం అన్నావు, అది నీ భ్రమ అంటూ తిరిగి శ్రీసత్యకు స్టాంప్ గుద్దాడు. ఎక్కువగా ఇనయకు ఓట్లు పడటంతో ఆమెను వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపిక చేసి జైలుకు పంపించారు. అయితే హౌస్మేట్స్ ఆమెతో ఎంత గొడవపడితే బయట ఆమెకు అంత మద్దతు పెరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆమెను ఏకంగా జైలుకే పంపించి ఇనయకు మరింత హైపిచ్చారు. చూస్తుంటే అందరూ కలిసి ఇనయకు టైటిల్ కట్టబెట్టేలా ఉన్నారు. చదవండి: బిగ్‌బాస్, నాగార్జున నేనే తోపు అన్నట్లు పొగిడారు: గీతూ డ్రైవర్‌కు రూ.15 లక్షల సాయం చేసిన బన్నీ, ఎందుకో తెలుసా? -
శ్రీసత్యకు ఇచ్చిపడేసిన రేవంత్, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీ దాదాపు ముగిసినట్లే! లైవ్ టెలికాస్ట్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించింది. ఇక మిగిలిందల్లా వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోవడమే! ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో వరస్ట్ ఇంటిసభ్యులను ఎంచుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతోందని ఇనయకు స్టాంప్ గుద్దాడు ఆదిరెడ్డి. రోహిత్ కూడా ఇనయను చెత్త కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు. ముందు వారాలతో పోలిస్తే ఈవారం నీలో మార్పు కనిపించిందని, అది నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ గుద్దింది శ్రీసత్య. ఏం మార్పు, ఏమైనా లావయ్యానా? అని రేవంత్ సెటైర్ వేయగా ఈ వెటకారమే నచ్చలేదంది శ్రీసత్య. తర్వాత రేవంత్ వంతు రాగా.. ఎవరెంత అరుస్తారో అందరికీ తెలుసు, మీరు నాతో పోల్చుకోవడం నాకు నచ్చలేదు అంటూ శ్రీసత్యకు స్టాంప్ వేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. కెప్టెన్సీ టాస్క్‌లో అంత అన్యాయం చేసిన రేవంత్‌ను వదిలేసి రోహిత్.. ఇనయకు ఓటేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ సగం తెలివితేటల వల్లే కెప్టెన్సీ పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అలాగే రేవంత్.. ఇన్నాళ్లకు సత్య నిజస్వరూపం తెలుసుకున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అతడి ఫ్యాన్స్. మరి ఎవరు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకెళ్లారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: చెత్త సంచాలక్, రోహిత్‌కు అన్యాయం -
రేవంత్‌కు శ్రీహాన్ వెన్నుపోటు? ఇప్పటికైనా తెలుసుకుంటాడా?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ఆట అంటే ప్రాణం పెట్టి ఆడేవాళ్లలో సింగర్ రేవంత్ ముందువరుసలో ఉంటాడు. తనమన బేధాలు పక్కనపెట్టి గెలుపే తన లక్ష్యంగా పోరాడుతుంటాడు. ఒకరికి నేను ఎదురెళ్లినా వారికే రిస్కు, ఒకరు నాకెదురొచ్చినా వాళ్లకే రిస్కు అన్న రేంజ్లో గేమ్ ఆడతాడు. ఈ క్రమంలో తనకు తెలియకుండానే కొన్నిసార్లు అవతలి హౌస్‌మేట్స్‌ను నెట్టేసి, కొట్టేసినంత పని చేశాడు. దీంతో నాగార్జున గేమ్ ఆడాలి కానీ అంత ఫిజికల్ అవకూడదని హెచ్చరిస్తూనే రేవంత్‌కు ఎల్లో కార్డ్ ఇచ్చాడు. ఇంకోసారి ఫిజికల్ అయితే నేరుగా బయటకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ దెబ్బతో రేవంత్ ఓ మెట్టు తగ్గక తప్పలేదు. కానీ దీన్నే తమ అస్త్రంగా మలుచుకున్నారు మిగతా హౌస్మేట్స్. స్నేక్ అండ్ లాడర్ టాస్క్‌లో పాము టీమ్ సభ్యులు అతడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలనుకున్నారు. అతడు చేయి పట్టుకున్నా, లాగినా, వదిలించుకున్నా, ఆఖరికి కన్నెత్తి చూసినా సరే ఫిజికల్ అవుతున్నావు అని పదే పదే అరవడంతో రేవంత్ సైడ్ అయిపోయాడు. నేనేం చేయకపోయినా ఫిజికల్ అవుతున్నానని నిందలు వేస్తున్నారని అప్సెట్ అయ్యాడు. చివరికి గేమ్ అయిపోయాక టాస్క్‌లో కావాలని రెచ్చగొట్టామని వారు క్లారిటీ ఇవ్వడంతో అతడు మరింత బాధపడ్డాడు. ఇప్పటికే ఎల్లో కార్డ్ వచ్చిన బాధలో ఉంటే నా వీక్నెస్తో ఆడుకున్నారని తనలో తనే మధనపడ్డాడు. దీనికి తోడు శ్రీహాన్ చేసిన పనికి కూడా అతడు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. గతవారం గీతూ పనిష్మెంట్ సరిగా చేయకపోవడంతో ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న శ్రీహాన్‌కు నాగార్జున ఓ పనిష్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే కదా! ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ చేయలేవని స్పష్టం చేశాడు నాగ్. అయితే స్నేక్ అండ్ లాడర్ గేమ్‌లో పాము టీమ్ విజయం సాధించింది. ఇందులో శ్రీహాన్ కూడా ఉన్నాడు. అతడు కెప్టెన్సీ కంటెండర్ కాలేనందున అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోమన్నాడు. దీనికతడు గేమ్‌లో ఎంతో కష్టపడ్డ రేవంత్‌ను పక్కనపెట్టి ప్రస్తుతం ఇంట్లో కెప్టెన్‌గా ఉన్న శ్రీసత్యను ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో రేవంత్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని సరిచేసుకుని తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు రేవంత్. అందుకోసం బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి గేమ్‌లో ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. అతడికి ఛాన్స్ ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు శ్రీహాన్ తన పేరు ఎందుకు చెప్పలేదన్న ప్రశ్న ఎదురవుతోంది. శ్రీసత్య ఈవారమే కెప్టెన్ అయినందున తనకు ముందు వారాల్లో ఛాన్స్ ఇవ్వాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పక్కనే ఉంటూ బెస్ట్ ఫ్రెండ్‌కే వెన్నుపోటు పొడిచాడని రేవంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అతడు తన స్నేహితులెవరో తెలుసుకుంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. హౌస్మేట్స్ అంతా టార్గెట్ చేయడం ఒక ఎత్తయితే క్లోజ్ ఫ్రెండ్ తనను లెక్క చేయకపోవడం మరో ఎత్తు అని, అందుకే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడని భావిస్తున్నారు. అటు శ్రీహాన్ ఫ్యాన్స్ మాత్రం.. ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఒకేసారి న్యాయం చేయలేడు కదా, ఎవరికో ఒకరికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం అయితే ఇచ్చాడు కదా, అది సరిపోదా? అని వెనకేసుకొస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్‌కు రాకుండా ఉండాల్సింది: ఏడ్చిన రేవంత్ కంట్రోల్ తప్పిన రోహిత్, బ్యాగును తన్నుతూ ఫైర్ -
బిగ్‌బాస్‌కు రాకుండా ఉండాల్సింది: ఏడ్చిన రేవంత్
Bigg Boss Telugu 6, Episode 67: బిగ్‌బాస్ షో మొదలై పది వారాలు కావస్తోంది. ఇప్పటివరకు కెప్టెన్ కాలేని వాళ్లు చాలామందే ఉన్నారు. అందులో ఒకరు ఈవారం కెప్టెన్‌గా అవతరించారు. మరి ఆ కొత్త కెప్టెన్ ఎవరు? ఈ రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో తెలియాలంటే నేటి బిగ్‌బాస్ హైలైట్స్ చదివేయాల్సిందే! నిన్నటి గేమ్‌లో అవుట్ అయిన సత్య, ఇనయ, వాసంతి, రోహిత్ తిరిగి రేస్‌లోకి వచ్చేందుకు మంచి ఆఫరిచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా వీళ్లు ప్రత్యర్థుల మీద స్టిక్కర్స్ అతికించాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో సత్య, రోహిత్ విజయం సాధించి తిరిగి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో పాల్గొన్నారు. ఆటలో ఓడిపోయినందుకు ఫ్రస్టేట్ అయిన ఇనయ ఏదో బూతు మాట్లాడేసి తర్వాత అనుకోకుండా అన్నానని సారీ చెప్పింది. కెప్టెన్సీ కంటెండర్లు అవడానికి బిగ్‌బాస్ చివరగా నాగమణి అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిచ్చెన టీమ్(బాలాదిత్య, రాజ్, రేవంత్, సత్య, మెరీనా,) మణులను కాపాడుకోవాల్సి ఉండగా మిగతా టీమ్ వాటిని దక్కించుకోవాల్సి ఉంటుంది. నిచ్చెన టీమ్ దగ్గరున్న మణులను పాము టీమ్ సభ్యులు తీసుకునేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. అందులో భాగంగా మొట్టమొదటగా రేవంత్‌ను కావాలని రెచ్చగొడితే అతడు ఆటాడకుండా పక్కకు తప్పుకుంటారని ప్లాన్ వేశారు. గేమ్ మొదలు కాగానే అదే ప్లాన్‌ను అమల్లో పెట్టారు. రేవంత్ జస్ట్ తోసేసినా సరే ఫిజికల్ అవుతున్నాడంటూ కావాలని రెచ్చగొట్టారు. వారి మాటలకు ఆవేశంతో ఊగిపోయిన రేవంత్ ఫిజికల్ అయితే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఆదిరెడ్డి, ఫైమా అయితే రేవంత్‌కు మరింత కోపం తెప్పించేందుకు ప్రయత్నించారు. అవతలి టీమ్‌లోని శ్రీహాన్ , ఆది రెడ్డి అయితే బాలాదిత్య, రేవంత్‌ల కాళ్లు పట్టుకుని ఈడ్చుకు లాగారు. ఆట ముగిసేసరికి సంచాలకులుగా వ్యవహరించిన వాసంతి, ఇనయ పాము టీమ్ గెలిచినట్లు తెలిపారు. దీంతో ఆ టీమ్‌లోని ఫైమా, ఆదిరెడ్డి రోహిత్, కీర్తి కెప్టెన్సీ కోసం పోటీపడారు. నాగ్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా శ్రీహాన్ పోటీపడే అర్హత కోల్పోయాడు. అతడి స్థానంలో వేరొకరిని ఎంపిక చేసుకోవచ్చని బిగ్‌బాస్ తెలపడంతో శ్రీహాన్.. తన స్థానంలో శ్రీసత్య పోటీపడుతుందని తెలిపాడు. బంగారు మణి నిచ్చెన టీమ్‌లోని మెరీనా దగ్గర ఉండటంతో ఆమె సైతం కెప్టెన్సీ బరిలో నిలిచింది. ఇక ఈ గేమ్‌లో ఫైమా కొత్త కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అందరూ తన వీక్నెస్ మీద కొట్టడాన్ని తట్టుకోలేకపోయాడు రేవంత్. 'టాస్క్ సమయంలో నేను కోప్పడుతున్నానని కావాలని లేనిపోనివి చెప్పి నా కాళ్లూచేతులు కట్టేశారు. ఇంకోసారి ఫిజికల్‌గా ఆడితే ఎల్లో కార్డ్ ఇస్తానన్నారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఈ బిగ్‌బాస్ హౌస్‌కి రాకుండా ఉండాల్సింది' అంటూ ఎమోషనలయ్యాడు రేవంత్. చదవండి: బిగ్‌బాస్: గీతూ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? ఫిజికల్ అన్నారంటే తోలు తీస్తా: రేవంత్ వార్నింగ్ -
ఇనయపై రేవంత్ దాడి, ఈ వీడియో సాక్ష్యం!
Bigg Boss Telugu 6, Episode 62: నేను వెధవను, వెధవన్నర వెధవను, దొంగను, నన్ను నమ్మొద్దు అని అందరి ముందే అరిచి మరీ చెప్పింది గీతూ. ఆటలో తనమన బేధాలు లేవని కుండ బద్ధలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కానీ ఆదిరెడ్డి వినిపించుకోలేదు. గీతక్క గీతక్క అంటూ నెత్తినెక్కించుకున్నాడు. చివరికి అతడికి వెన్నుపోటు పొడిచి గుణపాఠం నేర్పింది. ఇంతకీ మిషన్ పాజిబుల్ గేమ్‌లో ఏం జరిగింది. గీతూ వల్ల ఆది గేమ్ ఏమైంది? అన్నది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! రాత్రిపూట టీషర్ట్లు కొట్టేయకూడదు అని రెండు టీముల లీడర్లైన ఆది, గీతూ ఒప్పందం చేసుకున్నారు. కానీ గీతూ మాత్రం అప్పటికే దొంగతనం ప్లాన్ వేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. గీతూ గేమ్‌లో లేదు, అయినా సరే ఆది రెడ్డి టీషర్ట్ లేపేసింది. తెల్లారాక నిజం తెలుసుకున్న ఆది.. నాతో పర్సనల్‌గా ఆడావు అంటూ గీతూమీద నిప్పులు చెరిగాడు. అటు గీతూ మాత్రం.. బుద్ధి బలం వాడామంటూ అదేపనిగా డప్పు కొట్టుకుంది. నీ మంచితనమే వీక్నెస్, దానిమీదే కొట్టానంది. మరోపక్క గేమ్‌లో హౌస్మేట్స్ నిజంగానే కొట్టుకున్నారు. ఇనయ అవతలివాళ్లను కాళ్లతో విదిలించునేందుకు ప్రయత్నించగా రేవంత్ ఆమెను అవతల పడేశాడు. ఇంటెన్షల్‌గా కొడుతున్నారని ఇనయ అరిచి గోల చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అనంతరం బిగ్‌బాస్.. చనిపోయిన సభ్యులు భౌతికంగా పాల్గొనలేరని గీతూకు చెంపపెట్టు సమాధానం ఇచ్చాడు. చనిపోయిన గీతూ.. ఆదిరెడ్డి టీషర్ట్ తీసింది కాబట్టి అతడు చనిపోలేదన్నాడు. కానీ మైక్ విసిరేసిన కారణంగా ఆదిరెడ్డిని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తొలగించి షాకిచ్చాడు. తర్వాత మిషన్ పాజిబుల్ టాస్క్ పూర్తైనట్లు ప్రకటించాడు. తన వల్ల గేమ్‌లో అవుట్ అయినందుకు ఆదికి అదే పనిగా సారీ చెప్పింది గీతూ. అయినా క్షమించడానికి మనసొప్పని ఆది.. త్వరలో నిన్ను ఏడిపిస్తా, అదే నేను కొట్టబోయే దెబ్బ అని ప్రతీకార శంఖం పూరించాడు. మరోవైపు ఇనయ.. ఇంట్లో అందరికీ శత్రువునైపోయా, ఎమోషనల్‌గా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అంటూ తనలో తనే బాధపడింది. అటు గీతూ కూడా మనసంతా బాధగా ఉందని కంటతడి పెట్టుకుంది. బయట నాకు ఎన్నో వెన్నుపోట్లు, ఇక్కడ ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నారు. వారి ప్రేమ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదిరెడ్డి నమ్మకం మీద కొట్టాను, అతడిని క్షమించమని అడుగుతాను అంటూ పడుకున్న వ్యక్తిని లేపి మరీ సారీ చెప్పింది గీతూ. మిషన్ పాజిబుల్ టాస్క్ డ్రా అవడంతో రెండు టీమ్ లీడర్లు కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెస్టెంట్ల పేర్లు చెప్పమన్నారు. దీంతో రెండు టీమ్స్.. అందరు అమ్మాయిల పేర్లు చెప్పారు. అలా బెలూన్ కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య, ఇనయ, మెరీనా, ఫైమా, వాసంతి, గీతూ పోటీపడ్డారు. ఫైనల్‌గా శ్రీసత్య గెలిచి కెప్టెన్ అయింది. దీంతో ఆమె సంతోషంలో మునిగి తేలగా మిగతావారు మాత్రం కెప్టెన్సీ చేజారిపోయిందని బాధపడ్డారు. అయితే ఇనయ, రేవంత్ ఫైట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇనయ(#Inaya) హ్యాష్‌ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. Does this not warrant RED CARD to a RED CHIP fellow ఛీVanth? 🤔#BiggBossTelugu6pic.twitter.com/osMqfhiBf5 — Naresh Reddy (@BBNTANALYST) November 4, 2022 Ma #Revanth annaw chala maaradu Yes, isari ammailaki bayapaddadu last ki🤣🤣🤣 Kani unmadhi lage behave chestunnadu inka #Inaya #Vasanthi #Marina#BiggBoss6Telugu #BiggBoss #BiggBossTelugu pic.twitter.com/XiRFlfprJH — Power Ranger 💙 (@BluePoweRangerr) November 4, 2022 చదవండి: నీ భార్యతో రొమాన్సా? పిచ్చిపిచ్చిగా ఉందా?: బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటినిండి గాయాల మచ్చలు, కాళ్లలో ఐరన్ రాడ్లు, ఆమె ఓ ఫైటర్ -
గీతూ చేసిన పనికి ఆదిరెడ్డిని శిక్షించిన బిగ్‌బాస్!
ఆకు వచ్చి ముళ్లు మీద పడ్డా, ముళ్లొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే.. ఈ సామెత ప్రస్తుతం ఆదిరెడ్డికి బాగా సెట్టయింది. గీతక్క గీతక్క అంటూ ఆమెను నమ్మినందుకు గేమ్‌లో వెన్నుపోటు పొడిచింది. ఆల్రెడీ తను అవుట్ అయినా సరే గేమ్ ఆడి ఆదికి కోపం తెప్పించి అతడు కూడా గేమ్‌లో లేకుండా చేసింది. ఆదిరెడ్డి ఆవేశంలో మైక్ విసిరేసినందుకు వారం అతడిని కెప్టెన్సీ టాస్క్‌కు అనర్హుడిగా ప్రకటించాడు బిగ్‌బాస్. చేసిందంతా చేశాక కాళ్లబేరానికి వచ్చింది గీతూ. ఆది దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నువ్వు చెప్పిన రూల్ నువ్వే ఫాలో కాలేదు, నీ వల్ల నేను చచ్చిపోయాను అని బాధపడ్డాడు ఆది. అనంతరం మెరీనా, వాసంతి, ఫైమా, గీతూ, సత్య, ఇనయ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. బెలూన్లు కాపాడుకునే టాస్క్‌లో శ్రీసత్య గెలిచి కెప్టెన్‌గా అవతరించింది. చదవండి: గీతక్కా, నీకు కన్నీళ్లు తెప్పిస్తా, చూడు..: ఉడాల్ మామ వార్నింగ్ ఆ హీరోతో ఒక్క సినిమా కూడా చేయని టబు -
అంత ప్రేముంటే వెళ్లి సూర్య ఇంట్లో కూర్చోమను: శ్రీసత్య
ఎదుటివాళ్ల బలహీనత మీద కొట్టడమే గేమ్.. ఇప్పుడిదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. మిషన్ పాజిబుల్ గేమ్‌లో శారీరక బలంతో పాటు బుద్ధి బలం కూడా వాడమన్నాడు బిగ్‌బాస్. ఇంకేముంది రెడ్ టీమ్ రెండో పాయింట్ మాత్రమే పట్టుకుని వేలాడింది. ఇప్పటికే ఒకటీరెండుసార్లు సిగరెట్ల విషయంలో బాలాదిత్యను టార్చర్ పెట్టిన గీతూ మరోసారి ఈ గేమ్‌లో అతడిని చెడుగుడు ఆడుకుంది. అటు శ్రీహాన్, శ్రీసత్య.. ఇనయను రెచ్చగొడుతూ ఆమెను వెక్కిరిస్తూ మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. ఓటమిని సహించలేని రేవంత్ ఎదుటివాళ్లను చులకన చేసి మాట్లాడుతూ తన నోటిదురుసు ప్రదర్శించాడు. ఇక తమ మీద నిందలు వేసిన ఇనయను ఎమోషనల్‌గా హింసించింది శ్రీసత్య. ప్లేటు మీద సూర్య పేరును చెరిపేసింది. సూర్య ప్లేటు ఎవరైనా చూశారా? అని ఇనయ అడగ్గా.. నువ్వు వాడుతున్నావనే ఆ పేరు చెరిపేశారు అని బాలాదిత్య ఉన్నమాట చెప్పాడు. దీంతో హర్టయిన ఇనయ తినాలని లేదు అంటూ ఓ మూలన ఏడ్చుకుంటూ కూర్చుంది. మెరీనా, కీర్తి ఆమెకు సూర్య పేరు చెప్పి తినిపించారు. అయితే శ్రీసత్య మాత్రం.. అంత ప్రేముంటే మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యి సూర్య వాళ్ల ఇంట్లో కూర్చోమను అని చిరాకుపడింది. ఇకపోతే బ్లూ టీమ్ తమ సీక్రెట్ టాస్క్‌ను విజయవంతం చేసే పనిలో పడింది. చదవండి: బాలాదిత్య చేతులెత్తి మొక్కినా కనికరించని గీతూ కాంతార మూవీ ఫస్ట్ హీరో నేను కాదు: రిషబ్ శెట్టి -
గీతూ చెత్త సంచాలక్, బాలాదిత్య చేతులెత్తి మొక్కినా..
Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్ అంటే మైండ్ గేమ్ అని కొందరు, కాదు ఫిజికల్ గేమ్ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్మేట్స్. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మైండ్ గేమ్, మైండ్ గేమ్ వచ్చినప్పుడు ఫిజికల్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్ స్పిరిట్ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాట్ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్ టీమ్ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్, శ్రీహాన్, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు. గేమ్ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్ అని చెప్పింది. గేమ్ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్ చేసింది వాసంతి. శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు. తర్వాత శ్రీహాన్.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య. ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్.. వీక్నెస్తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్ పాయింట్ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్ ఇచ్చేసింది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్ వేసుకునే గేమ్ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది. మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికి సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్ మిషన్ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్ -
తల్లి కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య
బిగ్‌బాస్ హౌస్‌లో మొదట గేమే ఆడలేదు శ్రీసత్య. తిండి మీద పెట్టిన దృష్టి ఆట మీద పెట్టు అని నాగార్జున హెచ్చరించడంతో గేమ్ మీద ఫోకస్ చేసింది. తన వంతు ఎఫర్ట్స్ పెడుతూ బాగా ఆడుతోంది. తాజాగా శ్రీసత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తన కూతురు, ఫ్యామిలీ గురించి పలు విషయాలను పంచుకున్నారు. 'నా కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నప్పుడు నా భార్య పక్షవాతం బారిన పడింది. ఇప్పటికి మూడున్నరేళ్లు అవుతోంది. ప్రపంచంలో ఏ కూతురూ తన తల్లికి ఖర్చు పెట్టనంతగా శ్రీసత్య తన అమ్మ కోసం ఖర్చు పెడుతోంది. ఇప్పటిదాకా రూ.75 లక్షలు ఖర్చు పెట్టింది. కేవలం ఒక్క నెలకే నా భార్యకు రెండు లక్షలదాకా ఖర్చవుతుంది. అవన్నీ ఇప్పుడు నా కూతురే పెట్టుకుంటోంది. అందుకే డబ్బుల కోసమే బిగ్‌బాస్‌కు వచ్చానని మొదట్లో ధైర్యంగా చెప్పింది. అసలైతే నేను బిగ్‌బాస్ వద్దన్నాను. కానీ కేరళలో వైద్యం కోసం రూ.6 లక్షలు అడిగారు. అంత డబ్బు ఒకేసారి రావాలంటే బిగ్‌బాస్‌కు వెళ్లాల్సిందేనంది. శ్రీసత్య ఎంగేజ్మెంట్ అయ్యాక అబ్బాయి మంచివాడు కాదని తెలిసింది. పెళ్లి క్యాన్సిల్ కావడంతో సత్య ఆత్మహత్యకు యత్నించింది. చేతి మణికట్టు కోసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. కళ్ల ముందే కూతురు వేలాడటం చూసి నా భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే ఆమెను కాపాడింది కానీ రెండుమూడురోజులకే గుండెపోటు వచ్చింది. అప్పుడు కోవిడ్ టైమ్.. ఎవరూ ఆస్పత్రిలో చేర్పించుకోలేదు. ఒకవేళ జాయిన్ చేసుకునుంటే పాతికవేలతో అయిపోయేది. తర్వాతి రోజు పొద్దున తీసుకెళ్తే మెదడులో నరాలు పగిలిపోయాయి అంటూ ఆపరేషన్‌కు 40 లక్షలు అడిగారు. ఆపరేషన్ తర్వాత తనకు పక్షవాతం వచ్చింది. రెండున్నర సంవత్సరాల తర్వాత ఆమె నోటి నుంచి సత్య అన్న పిలుపు వచ్చింది. అప్పటినుంచే అన్నీ గుర్తుకురావడం ప్రారంభమైంది' అని చెప్పుకొచ్చాడు శ్రీసత్య తండ్రి శ్రీనివాస ప్రసాద్. శ్రీసత్య- అర్జున్ కల్యాణ్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ వారిది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని స్పష్టం చేశాడు. కొన్ని ఛానెళ్లు వారి ఫ్రెండ్షిప్ను వక్రీకరించి మాట్లాడారని, అది చూసి తన భార్య ఏడ్చిందని చెప్పాడు. సత్య లైఫ్ గురించి పిచ్చిపిచ్చిగా రాస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ల మీద కేసు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. శ్రీసత్య వ్యక్తిగత విషయాల గురించి ఏది పడితే అది రాస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. చదవండి: -
ఎంగేజ్మెంట్ రోజు స్టేజీపై తిట్టాడు: శ్రీసత్య బ్రేకప్ కహానీ
Bigg Boss Telugu 6, Episode 51: ఈ వారం సర్ప్రైజింగ్ నామినేషన్స్ జరిగాయి. ఓ జంట వాళ్లలో వాళ్లే పోట్లాడుకోగా, గొడవలకు చెక్ పెట్టి కలిసిపోయారనుకున్నవాళ్లు మళ్లీ నామినేట్ చేసుకున్నారు. మరి ఆ విశేషాలేంటో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! శ్రీసత్య నా మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి శ్రీహాన్‌తో మనసు విప్పి మాట్లాడింది. 'నా లైఫ్‌లో ఫస్ట్ ఫంక్షన్ ఎంగేజ్మెంట్. ఎంత ఇష్టంతో చేసుకున్నానో! అప్పటిదాకా అతడి గురించి ఎవరేం చెప్పినా శత్రువులా చూసేదాన్ని. రిలేషన్లోకి వెళ్లాక అమ్మాయిగా మారిపోయాను. పక్కవాళ్ల ఇష్టమే నా ఇష్టంగా మారిపోయింది. కానీ అతడు నిశ్చితార్థం రోజు స్టేజీమీదే తిట్టాడు. ఒక నెల రోజుల తర్వాత కొందరు అమ్మాయిలు అతడి స్క్రీన్షాట్లు చూపించారు. ఆ తర్వాత చాలా జరిగాయి. మా అమ్మ ఆస్పత్రిపాలవడంతో మళ్లీ పాత సత్య తిరిగి వచ్చింది' అని తన పాత జ్ఞాపకాలను పంచుకుంది. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరి ఫొటోలను మంటల్లో వేయాలన్నాడు బిగ్‌బాస్. ► శ్రీసత్య.. సూర్య, మెరీనా ► ఆదిరెడ్డి.. ఇనయ, మెరీనా ► గీతూ.. ఇనయ, మెరీనా ► బాలాదిత్య.. శ్రీసత్య, గీతూ ► కీర్తి.. రేవంత్, శ్రీసత్య ► సూర్య.. ఇనయ, శ్రీసత్య ► రోహిత్.. గీతూ, శ్రీసత్య ► ఇనయ.. శ్రీహాన్, సూర్య ► ఫైమా.. శ్రీసత్య, మెరీనా ► రాజ్.. ఇనయ, రేవంత్ ► మెరీనా.. ఫైమా, రాజ్ ► రేవంత్.. కీర్తి, గీతూ ► వాసంతి.. ఆదిరెడ్డి, సూర్య ► శ్రీహాన్.. మెరీనా, బాలాదిత్యను నామినేట్ చేశాడు. రేవంత్‌ను అన్న అన్నందుకు నాకు నేను థూ అనుకుంటానంది కీర్తి. అలాగైతే నేను థూథూ అనుకోవాలని కౌంటరిచ్చాడు రేవంత్. ఇక రేవంత్ చాలాసార్లు దొంగతనం చేసి తిన్నాడని ఆరోపించింది గీతూ. నువ్వే దొంగవి, పెద్ద గొప్ప అని ఫీలైపోకు, నువ్వు నాకు నథింగ్ అంటూ మండిపడ్డాడు రేవంత్. ఇక ఇనయ.. సూర్యకు,శ్రీహాన్‌కు చెక్ పెట్టేసింది. నీకూ, నాకు మధ్య ఏదేదో ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ మన మధ్య స్నేహం మాత్రమే ఉంది. నాగ్ సర్ నీకు బుజ్జమ్మ ఉందని పదే పదే చెప్తూ ఉన్నప్పుడు మనం క్లోజ్‌గా ఉండటం కరెక్ట్ కాదు. మన స్నేహం వేరేలా బయటకు వెళ్తున్నప్పుడు నేను నీతో ఉండటం తప్పనిపించింది అని చెప్పుకొచ్చింది ఇనయ. దీనికి సూర్య స్పందిస్తూ... బుజ్జమ్మది, నాది స్నేహం కంటే ఎక్కువ. మనది స్నేహమని నువ్వే అంటున్నావు. అలాంటప్పుడు అందరూ ఏదో అంటున్నారని మన ఫ్రెండ్షిప్ను కట్ చేస్తానంటున్నావా? అని అడిగాడు సూర్య. దానికి ఇనయ అవునని తలూపుతూ ఇప్పటినుంచి కేవలం హౌస్మేట్గానే చూస్తానని తేల్చేసింది. అటు శ్రీహాన్‌ను నామినేట్ చేస్తూ అందరూ మన గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, అది నాకు నచ్చట్లేదని చెప్పింది. ఫైనల్‌గా ఈ వారం రోహిత్, వాసంతి, మెరీనా, శ్రీసత్య, ఇనయ, గీతూ, రేవంత్, ఆదిరెడ్డి, సూర్య, బాలాదిత్య, కీర్తి, రాజ్, ఫైమా, శ్రీహాన్ నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: బాత్రూమ్స్ క్లీన్ చేసినందుకు బాగా డబ్బులిచ్చేవారు: నటుడు నా ముందు నువ్వు నథింగ్: రేవంత్ -
నేను బిగ్‌బాస్‌కు రావడానికి ప్రధాన కారణం శ్రీసత్య: అర్జున్
Bigg Boss 6 Telugu, Epsiode 50: బిగ్‌బాస్ షోలో ఒకరోజు ముందుగానే దీపావళి వేడుకలు జరిగాయి. హీరోయిన్ల డ్యాన్సులు, శ్రీరామచంద్ర పాటలు, హైపర్ ఆది పంచులు.. సెలబ్రిటీ గెస్టులు అంజలి, కార్తీల రాకతో నేటి ఎపిసోడ్ సందడిగా మారింది. మరి ఆ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎలిమినేషన్ గురించి పూర్తిగా తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! తర్వాత కంటెస్టెంట్లను ఏడు జంటలుగా విడగొట్టాడు నాగ్. ఫైమా-రేవంత్, ఇనయ- శ్రీహాన్, శ్రీసత్య- సూర్య, మెరీనా- రోహిత్, కీర్తి-రాజ్, వాసంతి- అర్జున్, గీతూ-ఆదిరెడ్డిలు జోడీగా ఆటలాడారు. ఈ తరుణంలో ఓటీటీ సిరీస్ ఝాన్సీ ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి బిగ్‌బాస్ షోకి వచ్చి సందడి చేసింది. ఆమెను చూడగానే రేవంత్ అంజలి పాట పాడి హీరోయిన్ను ఫిదా చేశాడు. ఆమె సమక్షంలో జంటలతో డ్యాన్స్ చేయించాడు నాగ్. అది కూడా ఇచ్చిన వస్తువును ఎక్కువగా వాడుతూ స్టెప్పులేయాలన్నాడు. ఇందులో తక్కువ మార్కులు పడ్డ ఇనయ- శ్రీహాన్ గేమ్ నుంచి ఔట్ అయ్యారు. రెండో లెవల్లో అమ్మాయిలు తమ జోడీ అయిన అబ్బాయిలను లేడీస్‌గా మార్చేశారు. మీసం, గడ్డాలతో చీర కట్టులో కనిపించిన మేల్ కంటెస్టెంట్లను చూసి తట్టుకోలేకపోయాడు నాగ్. అయినా సరే తప్పక వారితో క్యాట్‌వాక్ చేయించాడు. ఈ రౌండ్లో వాసంతి- అర్జున్ కల్యాణ్‌కు ఎక్కువ మార్కులు పడ్డాయి. తర్వాత కీర్తి, శ్రీసత్య సేఫ్ అయినట్లు ప్రకటించాడు. అనంతరం సైంటిస్ట్‌ను పిలుస్తున్నానంటూ హైపర్ ఆదిని స్టేజీ మీదకు ఆహ్వానించాడు నాగ్. వచ్చీ రావడంతోనే కంటెస్టెంట్ల మీద పంచుల వర్షం కురిపించాడు. ముందుగా గీతూ గురించి మాట్లాడుతూ.. అవతలి వాళ్ల మీద కాలూపడమే కాదు తల కూడా ఊపాలి(వాళ్లు చెప్పేది వినాలి) అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అలా ఒక్కొక్కరి గురించి సవివరంగా చెప్తూనే సెటైర్లు వేశాడు. ఫైనల్‌గా.. ఈ సీజన్లో కంటెస్టెంట్లు టాస్కులు ఎలా ఆడదామనేదానికంటే కూడా ఎప్పుడెప్పుడు అయిపోతాయా? అని ఎదురు చూస్తున్నారని, నామినేషన్స్ సిల్లీగా ఉంటున్నాయని వారి పరువు తీశాడు ఆది. అందరి బండారాలు బయటపెట్టిన తర్వాత బిగ్‌బాస్ షో నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. హీరోయిన్ అవికాగోర్ స్టెప్పులేయడం ముగియగానే సర్దార్ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. హీరో కార్తీ, దర్శకుడు మిత్రన్, హీరోయిన్ రజీషా స్టేజీపై సందడి చేశారు. సర్దార్ మూవీ చూశాక చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగేందుకు భయపడుతున్నారన్నాడు. ఈ సందర్భంగా నాగ్.. ఇక నుంచి నేను కూడా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగను అని శపథం చేశాడు. తర్వాత కార్తీ.. ప్రేమ లేదని, ప్రేమించరాదని అని తెలుగులో అద్భుతంగా పాడాడు. హౌస్మేట్స్ కోసం స్వీట్లు కూడా తీసుకొచ్చానని చెప్పాడు. రోహిత్, బాలాదిత్యను సేఫ్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. మూడో లెవల్‌కు వచ్చేసరికి మూడు జంటలే మిగిలాయి. కళ్లకు గంతలు కట్టుకుని తమ జోడీకి స్వీట్లు తినిపించాలనే టాస్కులో మెరీనా- రోహిత్, ఫైమా- రేవంత్, శ్రీసత్య- సూర్య పాల్గొన్నారు. సత్య ఎక్కువ స్వీట్లు తినడంతో ఆమె జంట విజయం సాధించగా వారికి దీపావళి కానుక అందింది. చివరగా వాసంతి, అర్జున్ నామినేషన్లో ఉండగా వీరిలో అర్జున్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు నాగ్. దీంతో ఒక్కసారిగా సత్య, శ్రీహాన్, రేవంత్ షాక్‌లోకి వెళ్లిపోయారు. రేవంత్, సత్య కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశారు. సత్య ఏడవటం చూసి తట్టుకోలేకపోయిన అర్జున్ తనూ కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం అర్జున్‌తో ఐదు ఆటంబాంబులు, ఐదు తుస్సుబాంబులు ఎవరో చెప్పమని గేమ్ ఆడించాడు నాగ్. శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతూ, ఫైమా ఆటంబాంబులు అన్నాడు. కాకపోతే రేవంత్.. ఆటంబాంబు కంటే ఎక్కువ పేలుతున్నాడు, ఫిజికల్ అవ్వకు, ఏది పడితే అది మాట్లాడి గేమ్ పాడు చేసుకోకు అని అతడికి సలహా ఇచ్చాడు. రోహిత్, మెరీనా, కీర్తి, ఇనయ, బాలాదిత్య తుస్సుబాంబులు అని చెప్పాడు. చివరగా అర్జున్ తాను బిగ్‌బాస్‌లోకి రావడానికి ప్రధాన కారణం సత్య అన్న విషయాన్ని బయటపెట్టాడు అర్జున్. శ్రీసత్యను ఒక సినిమాకు రిఫర్ చేస్తే ఆమె డేట్స్ ఇవ్వలేనని చెప్పింది. ఎందుకని అడిగితే బిగ్‌బాస్‌కు వెళ్తున్నానంది. వెంటనే నేను బిగ్‌బాస్‌కు అప్లై చేశాను, వచ్చింది. ఆఫర్ రాగానే ఇంట్లోవాళ్లకు చెప్పకుండా మొదట సత్యకే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పుకొచ్చాడు అర్జున్. ఈ విషయం ఇప్పటిదాకా తనకూ తెలియదంది శ్రీసత్య. చదవండి: కొత్త కారు కొన్న హిమజ, వీడియో చూశారా? ఉదయ్‌కిరణ్‌తో ఐదు సినిమాలు చేసేదాన్ని, కానీ అంతలోనే -
బిగ్‌బాస్ బ్యూటీ శ్రీసత్య గురించి ఈ విషయాలు తెలుసా?
తెలుగు బిగ్‌బాస్ 6 సీజన్ కంటెస్టెంట్ శ్రీసత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పూర్తి పేరు మంగళంపల్లి శ్రీసత్య.‘తొందరపడకు సుందర వదన’ వెబ్ సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. శ్రీసత్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు.. ►ఇన్‌స్టాగ్రామ్‌లో తనను అనుసరించే అభిమానులు దాదాపు 6 లక్షలమంది. ఆత్మాభిమానం.. ముక్కుసూటితనంతో కలసిన మొండితనం ఆమె ఐడెంటిటీ! ►విజయవాడలో పుట్టి పెరిగింది. సిద్ధార్థ కాలేజ్ నుంచి బీబీఎమ్ పూర్తి చేశాక మిస్ విజయవాడ అందాల పోటీలో పాల్గొని గెలుపు కిరీటం అందుకుంది. 2016లో మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీకి ఎంపికై అందులో మిస్ ఫొటోజెనిక్‌గా గుర్తింపు పొందింది. మోడల్‌గా, నటిగా తన కెరీర్ దిద్దుకోవాలనుకుని హైదరాబాద్‌కి చేరింది. ►స్కూల్లో చదువుకునే సమయంలో సరదాగా ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న దగ్గర నుంచి ఆమెలో మోడలింగ్‌పై ఆసక్తి మొదలైంది. అలా చిన్నతనంలో కన్న కల నెరవేరి వివిధ ►ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేసింది. జాయ్ అలూకాస్, కృష్ణా జ్యూయెలర్స్కి మోడల్‌గా ఫొటో షూట్లు చేసింది. ►2018లో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌తో టీవీ రంగంలోకి అడుగుపెట్టింది, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘త్రినయని’ వంటి సీరియల్స్‌లో నటించింది. ‘లవ్ స్కెచ్’, ‘తరుణం’ వంటి లఘు చిత్రాలతో పాటు ‘అంతా భ్రాంతియేనా’, ‘తొందరపడకు సుందర వదనా’ వంటి వెబ్ సీరీస్‌తో శ్రీసత్యకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ►స్మాల్ అండ్ వెబ్ స్క్రీన్స్ మీది శ్రీసత్య నటన ఆమెకు సినిమా చాన్స్లనూ తెచ్చిపెట్టింది. రామ్ పోతినేని సరసన ‘నేను శైలజ’లో నటించింది. ‘గోదారి నవ్వింది’ సినిమాలోనూ ముఖ్య భూమిక పోషించింది. ►ఖాళీ సమయాల్లో ప్రయాణాలు చేయడం, సాహస క్రీడలు, బైక్ రైడింగ్ ఆమెకు చాలా ఇష్టం. ►నటి అవ్వాలనే తన నిర్ణయానికి తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదట. కాని తర్వాత తల్లిదండ్రులు ఆమె నిర్ణయాన్ని స్వాగతించి మద్దతుగా నిలిచారు. ‘సినిమా ప్రపంచంలో ఎదురయ్యే కష్ట నష్టాలు మాకు తెలుసు అందుకే షూటింగ్ సమయంలో మేం దగ్గరగానే ఉంటాం’ అంటారు ఆమె పేరెం -
బిగ్‌బాస్ విన్నర్ ఎవరో హింట్! అందరికంటే వరస్ట్ ఆమేనట!
Bigg Boss 6 Telugu, Episode 49: బిగ్‌బాస్ టైటిల్ ఎవరు గెలిచే ఆస్కారం ఉందన్న ప్రశ్నకు ఈరోజు ఎపిసోడ్ కొంచెం క్లూ ఇచ్చినట్లైంది. ఇంట్లో ఉండేందుకు ఎవరికి ఎక్కువ అర్హత ఉంది? ఎవరు అసలు ఉండాల్సిన అవసరమే లేదు? చెప్పాలని గేమ్ ఆడించాడు నాగ్. ఈ క్రమంలో ఊహించని పేర్లు డిజర్వ్ కేటగిరీలోకి రావడం విశేషం. మరి ఎవరు ఏ జాబితాలో ఉన్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే పప్పు గొడవను ప్రస్తావించాడు. అంటే ఈరోజు రేవంత్‌కు గట్టిగానే వాయింపులు ఉంటాయని హింటిచ్చేశాడు. పప్పు విషయంలో తప్పెవరిది? అని శ్రీసత్యను అడిగాడు నాగ్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్లు ఏమనుకున్నా ఓకే, కానీ గేమ్‌లో ఉన్నప్పుడు అతడిని నువ్వు ఉండ్రా పప్పు అని చిన్నచూపు చూడటం తప్పు. అందరిముందు అలా అనేసరికి అర్జున్ నువ్వేం మాట్లాడవా? అని అడిగానంది. మరి సత్య స్టాండ్ తీసుకునేదాకా నువ్వెందుకు గొడవపడలేదని అర్జున్ను నిలదీశాడు నాగ్. దానికతడు అది సరైన సమయం కాదేమోనని మొదట గొడవకు దిగలేదన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. అలా అందరి ముందు అనడం తప్పు, కానీ చనువుతోనే ఆ మాట అన్నానని రేవంత్ తన మాటకు అర్థవివరణ ఇచ్చాడు. దీంతో నాగ్.. పప్పు, పకోడి, దొబ్బేయ్.. ఇలా ఏది పడితే అది అనకూడదు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఫలితంగా అతడు అర్జున్‌కు సారీ చెప్పాడు. కానీ తన మనసులో ఉన్న బాధను కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు. ఇక నాగ్.. ఈ హౌస్‌లో ఉండేందుకు అర్హులెవరు? అనర్హులెవరు? అనేది కంటెస్టెంట్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా కన్ఫెషన్ రూమ్‌లోకి వచ్చిన శ్రీహాన్.. గీతూ అర్హురాలు, రోహిత్ అనర్హుడు అని చెప్పాడు. ► మెరీనా, వాసంతి.. సూర్య డిజర్వ్, రాజ్ అన్‌డిజర్వ్ అని పేర్కొన్నారు. ►గీతూ.. శ్రీహాన్ డిజర్వ్, మెరీనా అన్‌డిజర్వ్ అని చెప్పింది. ►రేవంత్, శ్రీసత్య, అర్జున్, ఇనయ, బాలాదిత్య.. శ్రీహాన్ డిజర్వ్, మెరీనా అన్‌డిజర్వ్ అని చెప్పేశారు. ►ఫైమా.. రేవంత్ డిజర్వ్డ్, మెరీనా అన్డిజర్వ్డ్ అని అభిప్రాయపడ్డారు. ►రోహిత్.. బాలాదిత్య డిజర్వ్, అర్జున్ అన్‌డిజర్వ్ అని చెప్పాడు. ►రాజ్.. శ్రీహాన్ డిజర్వ్, రేవంత్ అన్‌డిజర్వ్ అని తెలిపాడు. ►సూర్య.. గీతూ డిజర్వ్, వాసంతి అన్‌డిజర్వ్ అని పేర్కొన్నాడు. ►కీర్తి.. రేవంత్ డిజర్వ్, వాసంతి అన్‌డిజర్వ్ కంటెస్టెంట్‌గా పేర్కొంది. ►ఆదిరెడ్డి.. శ్రీహాన్ డిజర్వ్, అర్జున్ అన్‌డిజర్వ్ అని పేర్కొన్నాడు. ఫైనల్‌గా ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్, వాసంతి, అర్జున్, మెరీనా అనర్హులుగా, సూర్య, శ్రీహాన్, గీతూ, రేవంత్ అర్హులుగా నిలిచారు. ఏ జాబితాలోనూ పేర్లులేని వారంతా తటస్థులని పేర్కొన్నాడు నాగ్. మొత్తానికి అర్హులలో ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని హౌస్మేట్స్ అభిప్రాయపడుతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత శ్రీసత్య గేమ్ గురించి మాట్లాడాడు హోస్ట్. టీమ్ లీడర్‌గా శ్రీసత్య ఫెయిర్గేమ్ ఆడాలని సూక్తులు చెప్పింది, మరి తను పాటించిందా? అని ప్రశ్నించాడు. మళ్లీ తనే అందుకుంటూ.. చీటీల్లో ఎవరి పేరు వస్తే వారు నామినేట్ అన్నారు. అందులో శ్రీసత్య పేరొచ్చింది. తెల్లారేసరికి ఆమె చీటీలు వద్దు, ఓటింగ్ అనేసింది. అంటే ఆమె అందరినీ మానిప్యులేట్ చేసి ఓటింగ్ వేయడం అవసరమా? అని అడిగాడు. దానికామె చీటీలాట ఆడి తిట్టించుకోవడం ఎందుకని ఓటింగ్‌కు వెళ్లామని కవర్ చేసింది. ముందు చీటీలు అని చెప్పి తర్వాత ఓటింగ్‌కు వెళ్లడం కరెక్టా? కాదా? అని ఆమె టీమ్‌నే అడగ్గా గీతూ మాత్రమే అందులో తప్పేముంది? కరెక్టేనంటూ సత్యకు సపోర్ట్ చేసింది. మిగతావారు మాత్రం మౌనంగా ఉండిపోయారు. దీంతో నాగ్.. నీ టీమ్‌ను నువ్వు మానిప్యులేట్ చేశావన్నాడు. రూ.5 లక్షలు గెలుచుకునే అవకాశం బిగ్‌బాస్ 6 స్టైలిస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలిచినవారికి రూ.5 లక్షలు లభిస్తాయని లెన్స్‌కార్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీకు ఇష్టమైన లెన్స్‌కార్ట్ స్టైలిష్ హౌస్‌మేట్‌కు ప్రతివారం ఓటు వేసి టైటిల్ గెలిచేలా చేయాలి. ఎక్కువసార్లు విన్ అయిన కంటెస్టెంట్ రూ.5 లక్షలు గెలుస్తారు. ప్రేక్షకులు లెన్స్‌కార్ట్ యాప్ లేదా వెబ్సైట్లో వారికి ఓటేయాల్సి ఉంటుంది. చదవండి: తమ్మీ.. నీకు అడుక్కు తిందామన్నా దొరకదు కన్ఫ్యూజన్ మాస్టర్ ఎలిమినేటెడ్! -
రేవంత్‌కు క్లాస్ పీకిన నాగ్, అడ్డంగా దొరికేసిన శ్రీసత్య!
హౌస్‌లో ఉండేందుకు ఎవరు అనర్హులు? అని బిగ్‌బాస్ నిన్ననే ఇంటిసభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాడు. ఎక్కువమంది వాసంతి అనర్హురాలు అని చెప్పడంతో ఆమెను జైల్లో కూడా వేశారు. ఇందుకు వాసంతి బాధపడటం పక్కనపెట్టి అదేదో గొప్పగా ఫీలైంది. నేను బాగా ఆడాను కాబట్టే జైలుకు వెళ్లానని నాగార్జునతో చెప్పుకొచ్చింది. ఆమె సమాధానం విని అవాక్కైన నాగ్ జైలుకు వెళ్తే అర్హురాలివని ఫీలవుతున్నావా? అని అడిగాడు. దీనికామె ఏం సమాధానం చెప్పాలో తెలీక బిక్కముఖం వేసుకుంది. ఇక నాగ్.. ఇంట్లో ఉండేందుకు ఎవరు డిజర్వ్ అనుకుంటున్నారో చెప్పమని ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అడిగాడు. అనూహ్యంగా చాలామంది శ్రీహాన్ అర్హుడని తేల్చేశారు. మెరీనా పెద్దగా ఆడట్లేదు కాబట్టి ఆమె అనర్హురాలని పేర్కొన్నారు. గేమ్‌లో రేవంత్.. అర్జున్ను పప్పు అనడాన్ని ప్రస్తావించాడు నాగ్. రేవంత్ మాట్లాడిన ప్రతిసారి పప్పు నువ్వు ఆగు అంటూ అవహేళన చేశాడు. పప్పు విషయంలో తప్పెవరిది అని శ్రీసత్యను అడిగాడు. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏం అనుకున్నా ఓకే కానీ గేమ్‌లో అందరిముందు నువ్వుండ్రా పప్పు అనడం తప్పనిపించింది అని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై నాగ్ రేవంత్‌కు గట్టిగానే కోటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఎవరు నామినేట్ అవుదామనేది చిట్టీలు వేసి డిసైడ్ అవుదామన్న శ్రీసత్య, తన పేరు చీటీలో వచ్చేసరికి ఓటింగ్ పెట్టుకుందామంది. అలా శ్రీసత్య సేఫ్ అయి ఓటింగ్ వల్ల వాసంతి నామినేట్ అయింది. ఈ విషయంలో శ్రీసత్య మైండ్‌గేమ్‌ను బయటపెట్టాడు నాగ్. చదవండి: జపాన్ వీధుల్లో రామ్‌చరణ్, తారక్ సందడి ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్లో అఖండ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు -
మాటమార్చిన శ్రీసత్య, టార్గెట్ వాసంతి!
Bigg Boss Telugu 6, Episode 48: బిగ్‌బాస్ హౌస్‌లో బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఈరోజు కూడా కొనసాగింది. ఫైనల్‌గా ఈ గేమ్‌లో శ్రీసత్య(బ్లూ) టీమ్‌పై ఇనయ(రెడ్) టీమ్ పైచేయి సాధించింది. తర్వాత బిగ్‌బాస్ బ్లూ టీమ్ వదిలేసిన గ్లవ్స్ పంపించాడు. ఆ గ్లవ్స్ సాయంతో గెలిచిన టీమ్‌లో నుంచి ఒకరితో స్వాప్ చేసుకునే ఛాన్స్ ఉందన్నాడు. భలే ఛాన్స్ దొరికిందనుకున్న శ్రీసత్య వెంటనే స్వాప్ చేసుకోవచ్చా అని అడిగింది. అయితే టాస్క్‌లో ఆ గ్లవ్స్‌ను లెక్కించకుండా వదిలేసినందున బ్లూ టీమ్ ఆ ఆఫర్ కోల్పోయిందని చెప్పాడు. దీంతో ముఖం వేలాడేసుకుని ఆ గ్లవ్స్‌ను లోపల పెట్టేసింది శ్రీసత్య. ఇక ఓడిన టీమ్‌లో నుంచి ఒకరు నామినేట్ అవ్వాలని బిగ్‌బాస్ ముందే చెప్పాడు. ఈ క్రమంలో రాత్రిపూట బ్లూ టీమ్ మీటింగ్ పెట్టింది. టాస్కులో టీమ్ సభ్యులమందరం వంద శాతం ఇచ్చాం కాబట్టి చీటీలు వేసుకుందామంది శ్రీసత్య. చీటీలో ఎవరు పేరు వస్తే వారు నామినేషన్లోకి వెళ్లాలంది. ఆ చీటీలో తన పేరే రావడంతో నామినేషన్‌కు సై అంది శ్రీసత్య. కానీ తెల్లారేసరికి మళ్లీ మాట మార్చింది. అందరం చర్చించుకుని ఎక్కువ ఓట్లు వచ్చినవారిని నామినేషన్లోకి పంపిద్దామంది. ఈ క్రమంలో శ్రీసత్య.. అర్జున్ ఒకరి పేర్లు మరొకరు చెప్పుకున్నారు. కానీ శ్రీసత్య నొచ్చుకోవడంతో అర్జున్.. తన ఓటు వెనక్కు తీసుకుని దాన్ని మెరీనాకు వేశాడు. మెరీనా, వాసంతి.. గీతూకు ఓటేశారు. రాజ్.. వాసంతి పేరెత్తడంతో ఆమె శివాలెత్తింది. ఎంత ఆడినా కూడా ఆడలేదని నామినేట్ చేస్తే ఎంత బాధేస్తుందని కంటతడి పెట్టుకుంది. మెజారిటీ టీమ్ మేట్స్ వాసంతినే టార్గెట్ చేయడంతో ఆమె నెక్స్ట్ వీక్ నేరుగా నామినేట్ అయింది. అనంతరం సరిగా ఆడనివారికి డిజాస్టర్ బ్యాచ్‌లు పెట్టమని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదటగా అర్జున్ మాట్లాడుతూ.. గేమ్‌లో లైన్ క్రాస్ చేసి తిట్టావంటూ రేవంత్‌కు డిజాస్టర్ బ్యాచ్ తగిలించాడు. వాసంతి.. నాకంటే తక్కువ గేమ్ ఆడావంటూ గీతూకు బ్యాడ్జ్ పెట్టింది. బిగ్‌బాస్ రూల్స్ పాటించట్లేదంటూ రేవంత్‌కు బ్యాడ్జ్ పెట్టింది శ్రీసత్య. రేవంత్‌ను కావాలని కొట్టడం తప్పని వాసంతి డిజాస్టర్ అన్నాడు సూర్య. మెరీనా.. గీతూను, గీతూ, రేవంత్, ఆదిరెడ్డి.. వాసంతిని, రాజ్, శ్రీహాన్, ఫైమా.. మెరీనాను, ఇనయ.. సూర్యను డిజాస్టర్‌గా పేర్కొన్నారు. మెజారిటీ ఇంటిసభ్యులు వాసంతిని డిజాస్టర్‌గా ఎన్నుకోవడంతో బిగ్‌బాస్ ఆమెను జైలుకు పంపించాడు. గీతూ అందరినీ మానిప్యులేట్ చేసి తనను నామినేషన్లోకి పంపిందని అభిప్రాయపడింది వాసంతి. తర్వాత జరిగిన నెయిల్ పాలిష్ ఛాలెంజ్‌లో సూర్య, వసంతి జంట గెలుపొందింది. చదవండి: ప్రిన్స్ రివ్యూ, జాతిరత్నాలు డైరెక్టర్ నవ్వించాడా? కార్తికేయ 2తో డైరెక్టర్ సాహసం చేశాడు: పరుచూరి -
కష్టానికి దక్కని ప్రతిఫలం.. బలి పశువుగా మారిన వాసంతి!
హౌస్‌మేట్స్‌కు ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నాడు బిగ్‌బాస్. మొదట ఫుడ్ కట్ చేసి ముప్పు తిప్పలు పెట్టిన బిగ్‌బాస్ ఫుడ్ కోసం, ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం పోటీపడాలని చెప్పాడు. వారి శక్తి సామర్థ్యాలను పరీక్షించేందుకు రకరకాల టాస్కులు పెట్టాడు. అయితే ఇంట్లో ఉండేందుకు అవసరమైన అర్హత కోసం పోటీపడే క్రమంలో ఇంటిసభ్యులు బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఆడారు. ఇందులో ఇనయ టీమ్ గెలవగా శ్రీసత్య టీమ్ ఓడినట్లు తెలుస్తోంది. దీంతో ఓడిన టీమ్‌లో నుంచి ఒకరిని తర్వాతి వారానికి నేరుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో శ్రీసత్య, అర్జున్ ఒకరి పేర్లను మరొకరు సూచించారు. మెరీనా, వాసంతి.. గీతూను సూచించారు. రాజ్.. వాసంతి పేరును ఎత్తడంతో ఆమె ఒంటికాలిపై లేచింది. 'ఎంటర్టైన్మెంట్ టాస్క్ తర్వాత ఎన్ని ఆటలు ఆడలేదు, అయినా సరే తీసుకొచ్చి లీస్ట్‌లో నిలబడితే ఎంత బాధుంటుంది' అని ఏడ్చేసింది. ఫైనల్‌గా వాసంతిని నామినేషన్లోకి పంపించారు. చదవండి: ఆదిరెడ్డిన కొట్టేసిన వాసంతి, అనుకోకుండా అంటూ కవరింగ్ -
రేవంత్‌ను నామినేట్ చేసినా వేస్ట్, టాప్ 5, ఫిక్స్: శ్రీసత్య
Bigg Boss 6 Telugu, Episode 47 Highlights: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రస్తుతం ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. బిగ్‌బాస్ వార్నింగ్‌లు, టాస్కులతో ఎపిసోడ్స్‌లో కొంత ఫ్రెష్‌నెస్ కనిపిస్తోంది. కడుపు మాడితే ఎలా ఉంటుందో చూపించిన బిగ్‌బాస్ ఇప్పుడు హౌస్‌లో ఉండటానికి హౌస్మేట్స్ తమకు అర్హత ఉందని నిరూపించుకోవాలంటూ టాస్క్ ఇచ్చాడు. మరోవైపు శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. మరి ఆ విశేషాలేంటో నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో వివరంగా చదివేద్దాం.. ప్రతిరోజు ఏదైనా హుషారెత్తించే పాటతో నిద్రలేపే బిగ్‌బాస్ ఈరోజు మాత్రం కుక్క అరుపులు ప్లే చేసి కంటెస్టెంట్లు ఉలిక్కిపడేలా చేశాడు. కాసేపటికే హౌస్మేట్స్ ఆకలి అంటూ అలమటిస్తుండటంతో తిరిగి ఫుడ్ పంపించాడు బిగ్‌బాస్. కానీ దీనికంటే ముందుగా హౌస్మేట్స్ ఇకమీదట 100 శాతం ఎఫర్ట్స్ పెడతామని ప్రతిజ్ఞ చేశారు. మెరీనా అయితే టాస్క్ ఉన్నా లేకపోయినా ఈరోజు నుంచి కచ్చితంగా కంటెంట్ ఇస్తానని శపథం చేసింది. మౌనవ్రతం వీడిన బిగ్‌బాస్.. ఇంట్లో ఉండే అర్హత కోసం పోటీపడాలని సూచించాడు. పిట్ట గోలకు ఫుల్స్టాప్ చెప్పి ఇనయ, శ్రీహాన్ కలిసిపోవడంతో వారిని మిగతా హౌస్మేట్స ఆటపట్టించారు. మమ్మల్నందరినీ వదిలేసి కేవలం ఇనయకు మాత్రమే బాగున్నావని ఎలా కాంప్లిమెంట్ ఇస్తావ్ అంటూ శ్రీహాన్ మీద మూకుమ్మడిగా దాడి చేసింది హౌస్‌లోని మహిళా లోకం. దీంతో ఇలా బుక్కైపోయానేంట్రా బాబూ అని తల గోక్కున్నాడతడు. తర్వాత శ్రీహాన్ బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. అందులో భాగంగా ఇనయ దగ్గరుండి కేక్ మీద చోటు అని రాయించి హార్ట్ సింబల్ వేయించింది. బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేసి మొదట ఇనయకు తినిపించాడు. వీరి సడన్ ఫ్రెండ్షిప్ చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం బిగ్‌బాస్ బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో నిన్నటి టీమ్సే కొనసాగుతాయన్నాడు. రేవంత్, ఫైమా, బాలాదిత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, కీర్తి రెడ్ టీమ్ కాగా ఇనయ ఆ టీమ్ లీడర్‌గా వ్యవహరించింది. మిగిలినవారంతా బ్లూ టీమ్ కాగా దానికి శ్రీసత్య లీడర్‌గా కొనసాగింది. ఈ గేమ్‌లో శ్రీహాన్.. శ్రీసత్య చేతిలో నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో ఆమె కింద పడింది. ఇక రేవంత్ ఏం చేసినా శ్రీసత్య పాయింట్ అవుట్ చేస్తూ రెచ్చగొట్టడంతో అతడు సహనం కోల్పోయి ఫైర్ అయ్యాడు. అలా వీరిద్దరూ టాస్క్‌లో ఒకరినొకరు విమర్శించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న అర్జున్.. నిన్ను వెక్కిరించినందుకు అతడిని నామినేట్ చేయ్ అని శ్రీసత్యకు సలహా ఇచ్చాడు. అయితే శ్రీసత్య మాత్రం.. అతడిని నామినేట్ చేసినా బయటకు వెళ్లడు, టాప్ 5 కంటెస్టెంట్, ఫిక్స్ అయిపోవాల్సిందే అని అని చెప్పింది. ఈ గేమ్ రెండో లెవల్లో కంటెస్టెంట్లు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కాళ్లు అడ్డం పెట్టాడని అర్జున్ను రేవంత్, నెట్టేశాడని ఆదిరెడ్డిని వాసంతి కొట్టారు. హింస ఉండకూడదు అని సత్య నెత్తీనోరు మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు. చదవండి: దమ్ముంటే అడ్డుకో, ఎత్తిపడేసిన శ్రీహాన్ -
Bigg Boss 6: ‘అరేయ్ పప్పు’.. ఈ ఒక్కమాటే టాస్క్‌ని రద్దు చేసిందా?
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ రద్దయింది. బిగ్‌బాస్ ఇచ్చిన ‘సెలెబ్రెటీ గేమింగ్ లీగ్’ టాస్క్‌ని కంటెస్టెంట్స్ సరిగా ఆడలేదు. దీంతో బిగ్‌బాస్ అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలాంటి చెత్త ఆటను చూడలేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. అంతేకాదు.. ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించడంలేదంటూ.. టాస్క్‌నే నిలివివేశాడు. హౌస్‌లో ఈ వారం కెప్టెన్ ఉండబోడని స్పష్టం చేశాయి. (చదవండి: కంటెస్టెంట్స్‌పై బిగ్‌బాస్ ఫైర్.. కెప్టెన్సీ టాస్క్ నిలిపివేత) అయితే ఈ టాస్క్ రద్దుకు శ్రీసత్య కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. అర్జున్‌ని రెచ్చగొట్టిమరి రేవంత్‌తో గొడవకు దిపింది. దీంతో వారు పాత్రల్లోని బయటకు వచ్చి గొడవపడ్డారు. అసలు విషయం ఏంటంటే.. రెండు టీమ్‌లుగా విడిపోయిన కంటెస్టెంట్స్‌కి ‘వాల్‌పోస్టర్’అనే చాలెంజ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఇరు టీమ్ సభ్యులు.. వాల్‌పోస్టర్లను అతికించడం ప్రారంభించారు. మధ్యలో అర్జున్ ఏదో అంటుంటే.. ‘అరేయ్ పప్పు’అని రేవంత్ అంటాడు. ఆ విషయాన్ని అర్జున్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీసత్య మాత్రం ‘నిన్ను ఏమైనా అంటే రియాక్ట్ అవ్వవా, మనిషివి కావా’అంటూ కసురుకుంది. దాంతో అర్జున్ రేవంత్ తో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు పాత్రల్లోంచి బయటకు వచ్చి మరి తిట్టుకుంటారు. ఈ గొడవ తర్వాత ఇంటి సభ్యులెవరు తమ తమ పాత్రల్లో ఉన్నట్లు కనిపించదు. అసలే ఎంటర్టైన్మెంట్ లేదు.. పోనీ గేమ్ అయినా సరిగా ఆడుతున్నారా అంటే అదీ లేదు. అందుకే బిగ్‌బాస్ రంగంలోకి దిగి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి కంటెస్టెంట్స్‌ని ఏ సీజన్లో చూడలేదని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ ఆదేశాలను, ఇంటి నియమాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇష్టం లేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవచ్చుని గేట్లు ఎత్తేశాడు. దీంతో ఇంటి సభ్యులు దిగొచ్చి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ బిగ్‌బాస్ కరగలేదు. ఈ వారం టాస్కే లేదని చెప్పేశాడు. మరి ఇప్పుడు హౌజ్‌మేట్స్ ఏం చేస్తారో? గేమ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. -
ఎమోషన్స్‌తో బిగ్‌బాస్ గేమ్.. ఏడ్చేసిన ఇనయ!
బిగ్‌బాస్ షోలో ఈ వారం కంటెస్టెంట్లకు పండగే పండగ. వారి కోసం ఎన్నో సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. వారు కోరుకున్నట్లుగా వీడియో కాల్, ఆడియో కాల్, ఫుడ్.. ఇలా కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ వారిని సంతోషపరుస్తున్నాడు. అయితే వాటిని ఎంచుకునే క్రమంలో కొన్నింటిని త్యాగం కూడా చేయమంటున్నాడు. మరి బిగ్‌బాస్ ఏది చేసినా ఊరికే చేయడు కదా! ఇప్పటికే శ్రీహాన్ ఇంటి ఫుడ్ తినగా సుదీప తన భర్తతో ఆడియో కాల్ మాట్లాడింది. ఆదిరెడ్డి అయితే ఏకంగా భార్యాబిడ్డలతో వీడియో కాల్ మాట్లాడాడు. ఈరోజు మరికొందరికి అలాంటి అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మరో ప్రోమో రిలీజైంది. అందులో భాగంగా బ్యాటరీ రీచార్జ్ కావాలంటే ఫైమా సినిమా కథను ఇంగ్లీష్‌లో వివరించాల్సి ఉంటుందన్నాడు. ఫైమా చెప్పినట్లు చేయడంతో బ్యాటరీ రీచార్జ్ అయింది. ఇక బాలాదిత్య తన కూతురితో మాట్లాడగా ఇనయకు తల్లిదండ్రుల ఫొటో అందడంతో ఆమె ఆనందం పట్టలేక ఏడ్చేసింది. అలాగే శ్రీసత్య తన పేరెంట్స్‌తో వీడియో కాల్ మాట్లాడింది. ఈ వరుస సర్ప్రైజ్లతో బిగ్‌బాస్ హౌస్ ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది. చదవండి: దివ్య భర్తపై ముద్దుల వర్షం.. నటి అన్షిత ఆడియో కాల్ లీక్ బాలాదిత్య ఆ పని చేయాల్సిందే లేదంటే అందరూ పస్తులుండాల్సిందే -
ఇనయకు తెలిస్తే శ్రీసత్యను చెప్పుతో కొట్టడం ఖాయం.. కీర్తి
Bigg Boss Telugu 6, Episode 38: బిగ్‌బాస్ షో ఆరో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేశాడు. ఆడియో కాల్, వీడియో కాల్, ఇంటి నుంచి ఫుడ్ అంటూ వారిని సర్ప్రైజ్ చేశాడు. అయితే ఇక్కడే ఏదో మెలిక కూడా పెట్టాడు. మరి ఆ సర్ప్రైజ్లు ఎవరెవరికి దక్కాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నామినేషన్స్ ముగిసినా దాన్నుంచి బయటపడలేకపోయింది కీర్తి. 'ఇనయను నీ ఎంకమ్మ అనడం పెద్ద బూతు అని శ్రీసత్య అందరి ముందు నొక్కి చెప్పింది. కానీ అదే శ్రీసత్య ఇనయను ఘోరమైన బూతులు అంది. అదేంటో చెప్తే ఇనయ ఆమెను చెప్పు తీసుకుని కొట్టడం ఖాయం. ఆమె ఏమందో చెప్తే హౌస్ అల్లకల్లోలం అయిపోతుంది' అని ఫైమాతో చెప్పుకొచ్చింది కీర్తి. మరుసటి రోజు బిగ్‌బాస్ ఇంటిసభ్యులకు బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా గార్డెన్ ఏరియాలో 100% చార్జ్ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ వారం హౌస్మేట్స్ కోసం బిగ్‌బాస్ కొన్ని సర్ప్రైజ్లను ప్లాన్ చేశాడు. అయితే ఇంటిసభ్యులు ఎంచుకునే ప్రతి సర్ప్రైజ్కు బదులుగా బ్యాటరీలోని కొంత చార్జ్ తగ్గిపోతుంది. అంతేకాక ఇంటి నియమాలను ఉల్లంఘిస్తే కూడా చార్జ్ తగ్గిపోతుందని చెప్పాడు బిగ్‌బాస్. ముందుగా శ్రీహాన్‌ను పిలిచి నాన్నతో వీడియో కాల్ మాట్లాడటానికి 58%, సిరితో ఆడియో కాల్‌కు 30%, ఇంటి నుంచి మటన్ బిర్యానీ కావాలంటే 15% బ్యాటరీ ఉపయోగించాలని బిగ్‌బాస్ తెలిపాడు. మొదట ఇవేవీ తనకు వద్దనుకున్నాడు, కానీ బిగ్‌బాస్ ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిందేనని హెచ్చరించడంతో మటన్ బిర్యానీ కావాలని చెప్పాడు. తర్వాత సుదీపను పిలిచి నీ భర్తతో మాట్లాడతావా? టీషర్ట్ కావాలా? మీ అమ్మ చేసిన చికెన్ కర్రీ కావాలా? అని అడిగాడు. అందుకామె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉన్నదాంట్లో తక్కువ బ్యాటరీ ఉన్న ఆడియో కాల్(30%)ను ఎంచుకుంది. దీంతో ఆమె తన భర్త రంగనాథ్‌తో తనివితీరా మాట్లాడింది. అటు శ్రీహాన్ తన మటన్ బిర్యానీని గీతూతో షేర్ చేసుకున్నాడు. రేవంత్ పడుకోవడంతో 5% , గీతూ సరిగా మైక్ ధరించకపోవడంతో మరో 5% తగ్గిపోయింది. తర్వాత ఆదిరెడ్డి అందరి గురించి ఆలోచించను, ఇప్పుడు తనకు ఫ్యామిలీనే ముఖ్యం అనుకున్నాడు. ఎక్కువ బ్యాటరీ కట్ అయ్యే ఫ్యామిలీతో వీడియో కాల్(40%)ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. దీంతో అతడు తన భార్యాకూతురితో వీడియో కాల్ మాట్లాడగా... ఈ సంతోషంతో ఆదిరెడ్డికి రాత్రి నిద్ర కూడా పట్టినట్లు లేదు. చదవండి: వాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకుంటున్నారో తెలీట్లేదు స్టేజ్‌పై ఏడ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ -
బిగ్‌బాస్ వార్నింగ్.. ఏడ్చేసిన శ్రీహాన్, శ్రీసత్య
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ వరుసగా ఆరో వారంలోకి అడుగు పెట్టింది. ఈపాటికే నామినేషన్స్ అయిపోగా ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ నడుస్తోంది. ఈ మేరకు హౌస్‌మేట్స్‌కు రీచార్జ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మనసుకు ఎంతో దగ్గరైన వాళ్లకు ఇన్నిరోజులు దూరంగా ఉండటం సులభమైన విషయం కాదు. అందుకే, ఈవారం ఇంటిసభ్యులందరికీ వారి బ్యాటరీలను రీచార్జ్ చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో ఈ ఆటలో ముందుకు కొనసాగే అవకాశాన్ని కల్పిస్తూ 'బ్యాటరీ రీచార్జ్' అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అందులో భాగంగా శ్రీహాన్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. నచ్చిన వ్యక్తుల నుంచి వీడియో కాల్, ఆడియో మెసేజ్ లేదంటే ఫుడ్.. వీటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకోమన్నాడు. కానీ శ్రీహాన్ తనకు ఏదీ వద్దని చెప్పగా మూడింటిలో ఒకటి ఎంచుకోకపోతే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని, వాటిని ఇంటిసభ్యులందరూ ఎదుర్కోక తప్పదని హెచ్చరించాడు. దీంతో అతడు ఆ మూడింట్లో ఒకటి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీహాన్ కంటతడి పెట్టుకోగా అటు శ్రీసత్య కూడా ఈరోజు మా అమ్మకు నిద్ర పట్టదంటూ ఏడ్చేసింది. మరి వీరి బాధకు కారణమేంటి? అసలు ఈ బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ఎలా జరిగింది? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: తుప్పాస్ రీజన్స్ అంటూ రాజ్‌పై గీతూ ప్రతీకారం.. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు.. -
బిగ్‌బాస్‌కు చంటి గుడ్‌బై! ఫ్లాప్ కంటెస్టెంట్లు వీళ్లే..
Bigg Boss Telugu 6, Episode 35: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మరొకరిని ఎలిమినేట్ చేసే సమయం ఆసన్నమైంది. అయితే ఆ ఒక్కరిని పంపించేముందు కింగ్ నాగార్జున హౌస్‌మేట్స్‌తో ఫన్ టాస్కులు ఆడిస్తాడన్న విషయం తెలిసిందే కదా! కాకపోతే ఈరోజు హిట్, ఫ్లాప్ అనే టాస్క్ ఆడించాడు నాగ్. మరి అది ఎలా సాగింది? ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్ అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నాగార్జున వచ్చీరాగానే రేవంత్ కెప్టెన్సీలోని కొన్ని పొరపాట్లను సరిదిద్దాడు. అనంతరం హౌస్‌మేట్స్‌తో హిట్, ఫ్లాప్ గేమ్ ఆడించాడు. అందులో భాగంగా నాగ్ ఇద్దరిద్దరినీ పిలిచి బోనులో నిలబెడతాడు. వారిద్దరూ తాము ఎందుకు హిట్ అనేది చెప్పాలి. అయితే హౌస్మేట్స్ అంతిమంగా ఆ ఇద్దరిలో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్ అనేది నిర్ణయిస్తారు. ముందుగా నాగ్.. ఇనయ, సూర్యలను పిలిచాడు. సూర్యతో కలిపి పిలవడంతో ఇనయ తెగ మెలికలు తిరిగింది. బోనులోకి రాగానే సూర్య మాట్లాడుతూ.. ఇనయ వాంటెడ్‌గా కెమెరాల ముందు కంటెంట్ ఇస్తుంది. కాబట్టి తను ఫ్లాప్ అన్నాడు సూర్య. ఇంటిసభ్యులందరు కూడా అతడితో ఏకీభవిస్తూ సూర్యను హిట్, ఇనయను ఫ్లాప్‌గా తేల్చారు. తర్వాత ఆదిరెడ్డి, గీతూ బోనులో నిల్చున్నారు. గీతూ మాట్లాడుతూ.. అన్ని విషయాల్లో ఇద్దరం సేమ్, కానీ నా గేమ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కాబట్టి నేను హిట్ అని చెప్పింది గీతూ. కానీ ఇంటిసభ్యులందరు మాత్రం ఆదిరెడ్డిని హిట్ అన్నారు.అనంతరం సుదీప, చంటి బోనులోకి వచ్చారు. సుదీప మాట్లాడుతూ.. అందర్నీ కలుపుకుపోతున్న తాను హిట్, ఎవ్వర్నీ కలుపుకోలేకపోతున్న చంటి ఫ్లాప్ అని చెప్పింది. చంటి కూడా తాను ఫ్లాప్ అని ఒప్పేసుకున్నాడు. దీంతో ఇంటిసభ్యులు కూడా సుదీపకే మద్దతిస్తూ ఆమెకు హిట్ ఇచ్చారు. కెప్టెన్ రేవంత్‌ను హౌస్మేట్స్ హిట్‌గా నిర్ధారించారు. వాసంతి, అర్జున్‌లు బోనులో నిలబడగా వాసంతి హిట్ అని హౌస్మేట్స్ నిర్ధారించారు. తర్వాత ఆదిరెడ్డి, ఫైమా, బాలాదిత్య వరుసగా సేవ్ అయ్యారు. ఇక శ్రీసత్య- శ్రీహాన్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో క్లిప్ చూపించగా అందులో అర్జున్ ముఖం వేలాడేసుకోవడం చూసి హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు.ఫైనల్ హిట్ - ఫ్లాప్ గేమ్‌లో బాలాదిత్య, మెరీనా, కీర్తి, శ్రీహాన్‌లు హిట్ కంటెస్టెంట్లుగా, ఇనయ, ఫైమా, గీతూ, రోహిత్, చంటి, సత్య, అర్జున్, రాజ్ ఫ్లాప్ కంటెస్టెంట్లుగా తేలారు. ఫ్లాప్ లిస్టులో ఉన్నవారు గన్నీ బ్యాగులు వేసుకోవాలని నాగార్జున శిక్ష విధించాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం చలాకీ చంటి ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: థియేటర్లో టపాసులు కాల్చిన సల్లూభాయ్ ఫ్యాన్స్, వీడియో ఇదిగో పస్తులుంటున్న ఆ కంటెస్టెంట్ అవుట్! -
Bigg Boss 6: సత్యతో శ్రీహాన్ రొమాంటిక్ డ్యాన్స్... ఫీలైన అర్జున్
బిగ్‌బాస్‌లో నామినేషన్స్ హీట్‌ను కూల్ చేసేందుకు ఎంటర్టైన్మెంట్ను ఓ రేంజ్లో ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా హౌస్మేట్స్ తమ టాలెంట్‌తో బిగ్‌బాస్‌ను మెప్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదటగా సూర్య మిమిక్రీ చేసి అదరగొట్టాడు. ఒక ఆ తర్వాత సత్య, శ్రీహాన్‌లు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. ఇద్దరూ డ్యూయెట్ చేస్తుంటే అర్జున్ ముఖం మాత్రం మాడిపోయింది. వాళ్లను చూసి బాగానే హర్ట్ అయినట్లున్నాడు. అసలే నామినేషన్స్‌లో సత్యతో వాదించడం రాక సెల్ఫ్ నామినేట్ అయిన అర్జున్ ఈరోజు ఎపిసోడ్లో అయినా కాసింత ఎంటర్టైన్మెంట్ చేసి మెప్పిస్తాడేమో చూడాలి. ఇక గీతూకు బిగ్‌బాస్ చికెన్ తినే అవకాశం ఇచ్చాడు. ఇందుకు బదులుగా ఆమె హౌస్‌లో మాంచి గాసిప్ చెప్పాల్సి ఉంటుంది. అయితే మొదటి రెండుసార్లు గాసిప్ చెప్పడంలో గీతూ ఫెయిల్ కావడంతో చికెన్ వాసన చూసే అవకాశం మాత్రమే ఇస్తున్నట్లు ప్రోమోలో కనిపిస్తుంది. మరి బిగ్‌బాస్ బర్త్‌డే సందర్భంగా ఎవరెవరు ఎలా ఎంటర్టైన్ చేయనున్నారో చూడాల్సి ఉంది. -
Bigg Boss 6: ఈసారి కాస్త డిఫరెంట్‌గా.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే
ఈవారం నామినేషన్స్ ప్రక్రియలో రోహిత్ అండ్ మెరీనాలకు షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో పోలిస్తే ఈసారి నామినేషన్స్ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగింది. వారిలోనే ఎవరో ఒకరు నామినేట్ అయి, మరొకరు సేవ్ అవ్వాల్సిందిగా ఆదేశించాడు. మరి ఈవారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారన్నది బిగ్‌బాస్-6 30వ ఎపిసోడ్ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ సీజన్-6లో ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఈసారి డిఫరెంట్‌గా సాగింది. ఇప్పటిదాకా జంటగా ఆడిన రోహిత్ అండ్ మెరీనాలను ఎవరి ఆట వాళ్లు ఆడాలంటూ బిగ్‌బాస్ ఆదేశించారు. ఇక ఈసారి ఇద్దరు క్లోజ్‌ఫ్రెండ్స్ మధ్య నామినేషన్స్ చిచ్చు రగిల్చాడు బిగ్‌బాస్. దీంతో ఎవరు అర్హులో చర్చించుకొని, ఒకరిని నామినేట్ చేయాలని చెప్పారు. ఇక ఈ నామినేషన్స్ మొదటగా మెరీనా అండ్ రోహిత్‌లతో ప్రారంభమైంది. ఇక రోహిత్ కోసం మెరీనా త్యాగం చేసింది. దీంతో ఆమె నామినేషన్స్‌లోకి వచ్చేసింది. ఇనయా, శ్రీహాన్‌లను తర్వాత జంటగా పిలిచారు. అయితే ఆమెతో నేను రాను బిగ్‌బాస్ అంటూ శ్రీహాన్ సెటైర్లు వేశాడు. తర్వాత రేసు నుంచి తప్పుకోవడానికి కూడా శ్రీహాన్ నిరాకరించాడు. నీకు కెప్టెన్ అయ్యే అర్హత లేదంటూ మాట్లాడగా.. నీకంటే నేను చాలా బెటర్, టైటిల్ కప్పు కొట్టే వెళ్తానంటూ ఇనయా శపథం చేసింది. ఇంక శ్రీహాన్‌ను అడగడం వేస్ట్ అనుకుందేమో కానీ నామినేషన్స్‌లో తనే ఉంటానంటూ డిసైడ్ అయ్యింది. ఇక అర్జున్- సత్యలలో సత్య తన వాయిస్‌ను స్ట్రాంగ్‌గా వినిపించేసరికి అర్జున్ ఏం చేయలేక నామినేషన్స్‌లో ఉన్నాడు. రేవంత్, ఆదిరెడ్డిలలో ఈవారం రేవంత్ సేవ్ కాగా, ఆదిరెడ్డి నామినేషన్స్‌లోకి వచ్చాడు. ఫైమా, సూర్యలలో ఈవారం సూర్య సేవ్ అయ్యాడు. మొత్తంగా ఈవారం ఇనయా, చంటి, అర్జున్, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా,బాలాదిత్య, వసంతిలు నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. -
Bigg Boss 6: అర్జున్‌కు షాకిచ్చిన సత్య.. రోహిత్ కోసం మెరీనా త్యాగం
బిగ్‌బాస్ సీజన్-6 ఇప్పుడు ఐదోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం నామినేషన్స్‌లో బిగ్‌బాస్ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యే భలే ఫిట్టింగు పెట్టాడు. ఇద్దరి చేతులకి సంకెళ్లు వేసి ఇద్దరిలో ఎవరు నామినేట్ కావాలో వాళ్లనే డిసైడ్ చేసుకోమని చెప్పడంతో అప్పటిదాకా ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్ల మధ్య కూడా వైరం మొదలైంది. ఇక ఈ నామినేషన్స్‌లో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ కూడా పెట్టాడు. జంటగా హౌస్‌లోకి వచ్చిన మెరీనా అండ్ రోహిత్‌లకు షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ ఈసారి నుంచి ఎవరి ఆట వాళ్లు ఆడాలని పేర్కొన్నాడు. దీంతో మెరీనా రోహిత్ కోసం నామినేషన్‌ను త్యాగం చేసింది. నేను వెళ్లిపోయినా సరే, నువ్వు ఉండాలి అంటూ భర్తకు సపోర్ట్ చేసింది. ఇక సుదీప, వాసంతిలలో ఈవారం సుదీప్ సేవ్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు సత్య కోసం అర్జున్ నామినేట్ అయినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది. లాస్ట్ వీక్ నీకు హెల్ప్ చేశాను.. నువ్వు నామినేషన్స్‌లో ఉన్నా సేవ్ అవుతావ్ అని అర్జున్ బ్రతిమిలాడినా సత్య మాత్రం అందుకు ససేమీరా అనేసింది. నామీద పెట్టుకున్న నమ్మకం ఏదో నీమీద పెట్టుకో అంటూ సైలెంట్‌గానే షాకిచ్చింది. ఇక శ్రీహాన్, ఇనయాల మధ్య మళ్లీ నామినేషన్స్ చిచ్చు రేపగా, రేసు నుంచి తప్పుకోవడానికి శ్రీహాన్ నిరాకరించాడు. దీంతో సరే నేనే నామినేషన్స్‌లో ఉంటా. టైటిల్ కప్పు కొట్టే వెళ్తానంటూ ఇనయా శపథం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
Bigg Boss 6: శ్రీసత్య కాళ్లు పట్టిన అర్జున్..రెండోసారి జైలుకు..
ఇప్పటి వరకూ బిగ్ బాస్ హౌస్‌లో ముగ్గురు కెప్టెన్లు అయ్యారు. తొలివారం బాలాదిత్య, రెండోవారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డిలు కెప్టెన్ అయ్యారు. ఇక నాలుగోవారం కెప్టెన్సీ రేస్‌లో కీర్తి, బిగ్‌బాస్ ఇంట్లో ఎట్టకేలకు ఓ మహిళా కెప్టెన్ అయ్యారు. గత మూడువారాల్లో మొదట బాలాదిత్య, రెండోవారం రాజ్, మూడో వారం ఆదిరెడ్డి కెప్టెన్ అయ్యారు. దీంతో నాలుగో వారంలో అయినా మహిళా కెప్టెన్ కావాలని హౌస్‌లోని లేడీస్ పట్టుపట్టారు. అనుకున్నట్లే కెప్టెన్సీ రేసులో చివరకు కీర్తి, సుదీప, శ్రీసత్యలు మిగిలారు. ఈ ముగ్గురికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో గెలిచి కీర్తి కెప్టెన్ సింహాసనంపై కూర్చుంది. ఇక టాస్క్‌లో అలిసిపోయి పక్కనే కూర్చున్న శ్రీసత్యకు కాళ్లు నొక్కుతూ ఓదార్చాడు అర్జున్. కెప్టెన్ టాస్క్ పూర్తయిన వెంటనే వరస్ట్ ఫెర్ఫార్మర్ని ఎంచుకోవాలని సూచించాడు బిగ్‌బాస్. ఈ వారంలో చెత్త ఆటగాడు ఎవరు అని భావిస్తున్నారు వారి పేరు కాగితంపై రాసి గార్డెన్ ఏరియాలో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లో వేయాలని చెప్పాడు. ఎక్కువ మంది అర్జున్ పేరు రాస్తూ..అతను హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్‌ని సరిగా ఆడలేదని, తన కోసం కాకుండా సత్య కోసం అతను ఆట ఆడుతున్నారని చెప్పారు. ఇంటి సభ్యుల్లో ఏడుగురు అర్జున్‌కి ఓట్లు వేయడంతో అతడినే ఈ వారం వరస్ట్ ఫెర్ఫార్మర్‌గా ప్రకటిస్తూ జైలుకు పంపాడు బిగ్‌బాస్. తనకు సపోర్ట్ చేయడం వల్లే అర్జున్ జైలు పాలు అయ్యాడని శ్రీసత్య వాపోయింది. అంతేకాదు జైల్లో ఉన్న అర్జున్ దగ్గరకు వెళ్లి..‘అసలు నువ్వు బిగ్‌బాస్‌లోకి ఎందుకు వచ్చావ్ అర్జున్? నా కోసం వచ్చావా? టైటిల్ గెలవడానికి వచ్చావా? అని అడిగితే..అర్జున్ చిన్నగా నవ్వాడు. దీంతో పక్కనే ఉన్న సుదీప మౌనం అర్థాంగికారం అనడంతో.. శ్రీసత్య మరోసారి ‘చెప్పు అర్జున్ ఎవరి కోసం వచ్చావ్?’ అని గట్టిగా అడిగింది. అప్పుడు మనోడు ‘నాకోసమే వచ్చాను’అని మెల్లిగా చెప్పాడు. ఆ తర్వాత జైలులో ఉన్న కెమెరా వైపు చూస్తూ..‘నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి. నా ఆట ఏంటో చూపిస్తా. ఇన్ని రోజులు జెన్యూన్‌గా ఆడాను. అమ్మాయిలను జైలుకు వెళ్లడం ఎందుకని లాస్ట్ వీక్ నేనే జైలుకు వెళ్లాను. కానీ వాళ్లే ఇప్పుడు నన్ను మళ్లీ జైలుకు పంపారు. ఈ ఒక్కవారం సేవ్ చేయండి.. వందశాతం ఆట ఆడుతాను. ప్లీజ్ సేవ్ మీ’అని ఆడియన్స్‌కి విజ్ఞప్తి చేశాడు. -
Bigg Boss 6: అర్జున్‌కి శ్రీసత్య గోరు ముద్దలు.. చంటికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ఇదే
బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తికాగానే కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక ప్రక్రియను మొదలు పెడతాడు బిగ్‌బాస్. దీని కోసం హౌస్‌మేట్స్‌కు రకరకాల టాస్కులు ఇస్తాడు. ఈ వారం కంటెస్టెంట్స్‌కి హోటల్ టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్ ఎంటంటే.. బిగ్‌బాస్ ఇంటి సభ్యులను రెండు భాగాలుగా విభజించారు. వారిలో కొందరు బిగ్‌బాస్ హోటల్లో పని చేయాలి. మరికొందరు గ్లామ్ ప్యారడైజ్ హోటల్ని రన్ చేయాలి. బీబీ హోటల్ స్టాఫ్‌గా సుదీప, బాలాదిత్య, మెరీనా, గీతు, రేవంత్, చంటి ఉంటే.. గ్లామ్ ప్యారడైజ్ హోటల్ స్టాఫ్ గా వాసంతి, ఫైమా, కీర్తి, శ్రీసత్య , ఆరోహి ఉన్నారు. ఇక గెస్టులుగా శ్రీహాన్, ఇనయా, ఆదిరెడ్డి, రాజ్ ,అర్జున్ లను నియమించాడు. బిబీ హోటలకు మేనేజర్ సుదీప అయితే గ్లామ్ ప్యారడైజ్‌కు ఫైమా మేనేజర్. ఇక రిచ్ గాళ్ ఇనయా, గతం మర్చిపోయి ప్రతిసారీ కొత్తగా ప్రవర్తించే వ్యక్తిగా సూర్య, తమ ఫ్రెండ్ పెళ్లికి లొకేషన్ ఫిక్స్ చేయడానికి వచ్చిన వ్యక్తులుగా రాజ్, అర్జున్, ఒకే ఒక్క హిట్టు సినిమా చేసి సూపర్ స్టార్లా ఫీలైపోయే హీరోగా శ్రీహాన్ ఉన్నారు. వీరి నుంచి రెండు హోటళ్ల సభ్యులు ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి. ఆట ముగిసే సమయానికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే.. ఆ హోటల్ వాళ్లు గెలిచి కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. అయితే ఈ గేమ్‌లో చిన్న ట్విస్ట్ పెట్టాడు బిగ్‌బాస్. బీబీ హౌటల్లో ఉన్న చంటికీ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే..బీబీ హోటల్‌కి వచ్చే అతిథులను ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి పారిపోయేలా చేసి, వారందరిని గ్లామ్ ప్యారడైజ్‌కు తరలించారు. వీలైనంత ఎక్కువమందిని గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌కి తరలించాలి, వారు విజయం సాధించేలా చేస్తే.. చంటి నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అవుతాడు. అయితే ఈ టాస్క్ అంత రసవత్తరంగా సాగలేదు. ప్రతి సీజన్లో ఇచ్చిన టాస్కే.. మళ్లీ ఇవ్వడంతో ఎంటర్టైన్మెంట్ మిస్సయింది. అంతేకాదు కంటెస్టెంట్స్ కూడా తమకు ఇచ్చిన పాత్రల పరిధి దాటి ప్రవర్తించారు. హోటల్ మేనేజర్‌గా ఉండాల్సిన ఫైమా.. హౌస్ కీపింగ్ మెంబర్లా ప్రవర్తించింది. ఇక శ్రీసత్య మాత్రం తెలివిగా అర్జున్ వీక్నెస్తో ఆడుకుంటుంది. అర్జున్ కూడా దొరికిందే చాన్స్ అని..ఆమెతో అన్ని పనులు చేయించుకుంటున్నాడు.డబ్బులిచ్చి భుజమ్మీద చేయి వేసి ఫొటో తీయించుకోవడం, అన్నం తినిపించడం లాంటి పనులను శ్రీసత్యతో చేయించుకుంటూ అర్జున్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు . ఇక సూర్యకి మసాజ్ చేయమని చెప్పడంతో ఆరోహి సిగ్గులు ఒలకబోస్తూనే బాడీ మసాజ్ చేసింది. మొత్తానికి మంగళవారం ఎపిసోడ్ అయితే అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ రోజు ఏదో గొడపడినట్లు ప్రోమోలో చూపించారు. కనీసం ఆ గొడవతోనైనా బిగ్‌బాస్‌కి హైప్ వస్తుందో చూడాలి. -
ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే!
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి శ్రీ సత్య గురించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీజన్లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన ఆమె తనదైన తీరుతో రాణిస్తోంది. టాస్క్‌లో చురుగ్గా ఉండకపోయిన.. ముక్కుసూటి తనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే హౌజ్‌లో అందరితో కలవకపోవడం, తనకంటూ ఓ పరిధిని పెట్టుకున్న శ్రీసత్య దీని వెనక ఉన్న అసలు కారణమేంటో ఇటీవల సిసింద్రీ టాస్క్‌లో బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా వ్యవహరించడానికి కారణం తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలని చెప్పింది. చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి తనకు బ్రేకప్ స్టోరీ ఉందని, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. దీంతో తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ షాకింగ్ విషయం చెప్పింది. ఈ ఘటనతో మనోవేదనకు గురైన వాళ్ల అమ్మ ప్రస్తుతం ఆస్వస్థతకు గురైందని, తను ఇప్పుడు లేవలేని స్థితిలో ఉందటూ కన్నీరు పెట్టుకుంది. ఇదిలా ఉంటే శ్రీసత్య తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని అంటున్నాడు ఆమె మాజీ ప్రియుడు పవన్ రెడ్డి. శ్రీసత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో నిశ్చితార్థం, పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్ రెడ్డి తన స్నేహితులతో చెప్పుకుని మండిపడ్డాడని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. చదవండి: సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని వచ్చా: ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ హీరోయిన్ అయితే బిగ్‌బాస్ వంటి పెద్ద షోలో శ్రీసత్య తనని బ్యాడ్ ప్రోజెక్ట్ చేయడం పవన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్ హౌజ్ అడుగుపెట్టడానికి ముందు ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన శ్రీసత్య బ్రేకప్‌పై స్పందించింది. టీనేజ్‌లో ఉన్నపుడు పవన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించానని, అయితే ఆ రిలేషన్ ఇప్పుడు బ్రేక్ అయ్యిందని తెలిపింది. ‘ప్రేమించిన వ్యక్తితోనే నిశ్చితార్థం జరిగింది. అయితే మొదటి నుంచే మా కుటుంబాలకు పెళ్లి ఇష్టం లేదు. మా ప్రేమను వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. అందుకే మా నిశ్చితార్థం రద్దయింది’ అని ఆమె పేర్కొంది. -
వీకెండ్ ట్విస్ట్: ఆ 9మంది హౌజ్‌మేట్స్‌పై నాగ్ ఫైర్, బయటకు వెళ్లిపొమ్మంటూ..
బిగ్‌బాస్ ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసే ఘట్టం వీకెండ్ ఎపిసోడ్. తొలివారం వీకెండ్లో ఎపిసోడ్లో హౌజ్‌మేట్స్‌తో సరదసరదాగా ఆటలు ఆడించిన నాగ్ ఈ వీకెండ్లో మాత్రం కంటెస్టెంట్స్‌పై గుర్రుమన్నాడు. కుండలు బద్దతు కొడుతూ కంటెస్టెంట్స్‌కి చీవాట్లు పెట్టాడు. అంతేకాదు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ ఆఖరిలో ట్విస్ట్ ఇచ్చాడు. బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, మరినా-రోహిత్, అభినయ, కీర్తి, శ్రీహాన్ ఈ తొమ్మిది మంది పేర్లపై కుండలు పెట్టి వాటిని పేరు పేరునా పగలగొడుతూ కంటెస్టెంట్స్‌పై చిర్రుబుర్రమన్నాడు. అంతేకాదు చివరిలో వారందరి లగేజ్ బ్యాగ్‌లను స్టేజ్‌పై పెట్టించాడు. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. అయితే ఇందులో నామినేషన్లో ఉన్నది ముగ్గురు మాత్రమే. ఇక వీరందరిని ఉద్దేశిస్తూ.. మీరంతా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఆడటానికి రాలేదని, చిల్ అవ్వడానికి వచ్చారంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత షానీ కుండ పగలగొట్టి.. తింటానికే, పంటానికే ఈషోకు వచ్చాననని నువ్వు అనుకుంటే వెంటనే బ్యాగ్ సర్దుకుని బయటకు వెళ్లిపోవచ్చంటూ షాకిచ్చాడు. ఇక బాలాదిత్య ఉద్దేశిస్తూ.. నువ్వు ఆడకపోవవడమే కాదు ఇతరుల ఆటను కూడా చెడగొడుతున్నావంటూ ఫైర్ అయ్యాడు నాగ్. దీనికి ఈ మాజీ కెప్టెన్ స్పందిస్తూ.. ‘నేను తప్పు చేశాను.. బుర్రతో ఆలోచించలేదు. మనసుతో ఆలోచించాను’ అన్నాడు. దానికి నాగ్ ‘మనసూ బుర్రా కాదు బిగ్ బాస్ హౌస్‌మేట్‌గా ఆలోచించు’ అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్ ఇక మెరీనా - రోహిత్‌ను ఉద్దేశించి ‘మీరు ఇద్దరూ ఈ ఇంట్లోకి పవర్ ఆఫ్ టూ(power Of Two) కింద వచ్చారు. కానీ ఆటలో మాత్రం మైనస్‌లో ఉన్నారు’ అంటూ ఫైర్ అయ్యాడు. అనంతరం శ్రీసత్యను ‘నీ బొమ్మ పోయినప్పుడు నువ్వు ఫీలయ్యావా? అదే నీ ప్లేటు లాగేసుకుని ఉంటే కచ్చితంగా ఫీలయ్యేదానివి’ అంటూ ఆమెకు చురక అట్టించాడు. ఇక అభినయ మాట్లాడుతూ.. తాను జీరో పర్సెంట్ మాత్రమే ఆడానంటే ఒప్పుకోనంటూ నాగ్‌తో వాదించడంతో.. మరి 10 శాతం ఆడావా? అని బదులిచ్చాడు నాగార్జున. ఆ తర్వాత సుదీప ఖచ్చితంగా తానేంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పడంతో నువ్వు ఈ హౌజ్‌లో ఉంటే.. అంటూ వ్యాఖ్యానించాడు. చూస్తుంటే ఈ వారంలో నామినేషన్లో ఉన్నవారు కాకుండా హౌజ్‌లో పర్ఫామెన్స్ ఇవ్వని వారిని బిగ్‌బాస్ బయటకు పంపించేలా కనిపిస్తున్నాడంటూ ప్రోమోపై నెటిజన్లు కామెంట్స చేస్తున్నారు. -
బిగ్‌బాస్ రెండోవారం ఇంటి కెప్టెన్ అతడే.. కొట్టేసుకుందాం అన్న గీతూ
బిగ్‌బాస్ సీజన్-6లో రెండోవారం ఇంటి కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది. ఇక మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు, కృతిశెట్టిలు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి హౌస్‌మేట్స్‌తో సరదాగా ముచ్చటించి వారికి టాస్కులు ఇచ్చారు. ఇందులో ఎవరు విజేతగా నిలిచారన్నది బిగ్‌బాస్-6 పదమూడో ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేద్దాం. బిగ్‌బాస్ రెండోవారం కెప్టెన్సీ టాస్కులో ఎలాంటి సస్పెన్స్ లేకుండా రాజ్ కెప్టెన్‌గా నిలిచాడు. ఈవారం ఎలిమినేషన్లో ఉండటం రాజ్‌కు కలిసొచ్చింది. దీంతో ఈ కెప్టెన్సీ టాస్క్ అతనికి ఏమైనా హెల్ప్ అవుతుందని భావించిన ఇంటిసభ్యులు అతనికే ఏకాభిప్రాయంతో ఓట్లేశారు. అయితే ఇంత కష్టపడినా తనకు ఒక్కరు కూడా ఓటు వేయలేదంటూ ఇనయా తెగ ఫీల్ అయిపోయింది. చివరికి అత్యదిక ఓట్లతో రాజ్ కెప్టెన్సీ కుర్చీపై కూర్చొని ఇంటి సభ్యల కోసం ఏదైనా పనిష్మెంట్ వస్తే అది తానే తీసుకుంటానంటూ వాగ్ధానం చేస్తాడు. ఇక ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ప్రమోషన్స్ కోసం సుధీర్‌బాబు, కృతిశెట్టి హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులతో సరదాగా ముచ్చటించారు. పాపులర్ డైలాగులను తమ స్టైల్లో చెప్పాలంటూ టాస్కులు ఆడించారు. ఇందులో రేవంత్ మొదటగా పోకిరి సినిమాలోని ‘ఎవడు కొడ్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు’ అనే డైలాగ్ చెప్పాడు. ఆ తర్వాత గీతూ వచ్చి తమిళ్ ఏంటి? తెలుగేంటి? డార్లింగ్.. గొడవైంది, కొట్టేసుకుందాం రా అంటూ తన స్టైల్లో చెప్పి సూపర్ అనిపించింది. అంతేకాకుండా ఇదే డైలాగ్‌ను చిన్నపిల్లల వాయిస్‌లో చెప్పి ఆశ్చరానికి గురిచేసింది. ఇక ఈ టాస్కులో సత్య, రాజ్, శ్రీహాన్‌లు చేసిన ఓ స్కిట్ ఆకట్టుకుంది. ఇక చివర్లో సత్యను బెస్ట్ యాక్ట్రెస్‌గా, శ్రీహాన్‌కు బెస్ట్ యాక్టర్‌గా ప్రకటించి అవార్డులు ఇచ్చారు. -
బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ నటి శ్రీసత్య (ఫొటోలు)
-
మెడిసిన్ సీట్ వదిలేసి మోడలింగ్‌లోకి వచ్చా: శ్రీసత్య
Sri Satya In Bigg Boss 6 Telugu: నటి శ్రీసత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. 2015లో మిస్ విజయవాడ టైటిల్ గెలిచింది. చిన్నప్పటి నుంచ నటనపై ఉన్న ఇష్టంతో నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌కి గర్ల్‌ఫ్రెండ్‌గా చిన్నపాత్రలో అలరించింది. ఆ తర్వాత వెండితెర కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ముద్దమందారం ,త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ బిగ్‌బాస్ సీజన్-6లో ఏ విధంగా మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.