టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, కూసింత అదృష్టం కూడా ఉండాలి. బహుశా అది లేకపోవడం వల్లేనేమో హీరోయిన్ మెటీరియల్ అయిన శ్రీసత్యకు మంచి ఆఫర్స్ రావడం లేదు. సినిమా ఆఫర్లు వచ్చినా చివర్లో ఎడిటింగ్‌లో తనను తీసేస్తున్నారు. దీంతో తన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి.
అదృష్టముండాలి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బిగ్‌బాస్ బ్యూటీ మనసు విప్పి మాట్లాడింది. శ్రీసత్య మాట్లాడుతూ.. 'సినిమాల్లో కనిపించాలనేది నా కల. కానీ, నేను చేసిన ప్రయత్నాలేవీ సఫలం కావడం లేదు. డీజే టిల్లు 2 మూవీలో మంచి పాత్రలో నటించాను. అందులో నా సంగీత్ వేడుకలు జరిగే సమయంలో ఓ పాట వస్తుంది. సినిమా రిలీజయ్యాక చూస్తే ఎక్కడా లేను.. కేవలం ఆ సంగీత్ పాటలో ఎక్కడో అర సెకను కనిపించానంతే!
చెత్త కామెంట్స్
నేను సీరియల్స్ చేస్తున్నానని కొందరు సినిమా ఆఫర్లు ఇవ్వలేదు. అందుకని సీరియల్స్ మానేశాను. తెలుగమ్మాయినని కూడా పక్కన పెట్టారు. ఇకపోతే డ్యాన్స్ షోలు చేసినప్పుడు నా గురించి చెత్తగా వాగుతున్నారు. ఎవరితోనైనా కలిసి డ్యాన్స్ చేస్తే చాలు మా మధ్య ఏదో ఉందని, ఏదో జరిగిందని అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారు. దయచేసి పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను కలిపి చూడొద్దు.
లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నా
బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడితే.. వాటిని ప్రమోట్ చేయడం నిజంగానే తప్పు. ఆ విషయం అర్థమైనప్పటి నుంచి వాటిని ప్రమోట్ చేయడం మానేశాను. కానీ అంతకుముందు ప్రమోషన్ చేసినప్పుడు నన్ను నమ్మి మోసపోయినవారికి నా జేబులో నుంచి డబ్బు తీసిచ్చాను. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానని ఆఫర్లు ఇవ్వడం లేదు. అందుకని లిప్ ఫిల్లర్స్ చేయించుకున్నాను. ఇది మూడునాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. తర్వాత పెదాలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తాయి. పెళ్లి గురించి అంటారా.. దాని జోలికి వెళ్లే ఉద్దేశమే లేదు' అని శ్రీసత్య చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment