తెలుగు బిగ్‌బాస్ 6 సీజన్ కంటెస్టెంట్ శ్రీసత్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పూర్తి పేరు మంగళంపల్లి శ్రీసత్య.‘తొందరపడకు సుందర వదన’ వెబ్ సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన నటి. శ్రీసత్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు..
►ఇన్‌స్టాగ్రామ్‌లో తనను అనుసరించే అభిమానులు దాదాపు 6 లక్షలమంది. ఆత్మాభిమానం.. ముక్కుసూటితనంతో కలసిన మొండితనం ఆమె ఐడెంటిటీ!
►విజయవాడలో పుట్టి పెరిగింది. సిద్ధార్థ కాలేజ్ నుంచి బీబీఎమ్ పూర్తి చేశాక మిస్ విజయవాడ అందాల పోటీలో పాల్గొని గెలుపు కిరీటం అందుకుంది. 2016లో మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీకి ఎంపికై అందులో మిస్ ఫొటోజెనిక్‌గా గుర్తింపు పొందింది. మోడల్‌గా, నటిగా తన కెరీర్ దిద్దుకోవాలనుకుని హైదరాబాద్‌కి చేరింది.
►స్కూల్లో చదువుకునే సమయంలో సరదాగా ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న దగ్గర నుంచి ఆమెలో మోడలింగ్‌పై ఆసక్తి మొదలైంది. అలా చిన్నతనంలో కన్న కల నెరవేరి వివిధ ►ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేసింది. జాయ్ అలూకాస్, కృష్ణా జ్యూయెలర్స్‌కి మోడల్‌గా ఫొటో షూట్‌లు చేసింది.
►2018లో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌తో టీవీ రంగంలోకి అడుగుపెట్టింది, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘త్రినయని’ వంటి సీరియల్స్‌లో నటించింది. ‘లవ్ స్కెచ్’, ‘తరుణం’ వంటి లఘు చిత్రాలతో పాటు ‘అంతా భ్రాంతియేనా’, ‘తొందరపడకు సుందర వదనా’ వంటి వెబ్ సీరీస్‌తో శ్రీసత్యకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. కొన్ని రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.
►స్మాల్ అండ్ వెబ్ స్క్రీన్స్ మీది శ్రీసత్య నటన ఆమెకు సినిమా చాన్స్‌లనూ తెచ్చిపెట్టింది. రామ్ పోతినేని సరసన ‘నేను శైలజ’లో నటించింది. ‘గోదారి నవ్వింది’ సినిమాలోనూ ముఖ్య భూమిక పోషించింది.
►ఖాళీ సమయాల్లో ప్రయాణాలు చేయడం, సాహస క్రీడలు, బైక్ రైడింగ్ ఆమెకు చాలా ఇష్టం.
►నటి అవ్వాలనే తన నిర్ణయానికి తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదట. కాని తర్వాత తల్లిదండ్రులు ఆమె నిర్ణయాన్ని స్వాగతించి మద్దతుగా నిలిచారు. ‘సినిమా ప్రపంచంలో ఎదురయ్యే కష్ట నష్టాలు మాకు తెలుసు అందుకే షూటింగ్ సమయంలో మేం దగ్గరగానే ఉంటాం’ అంటారు ఆమె పేరెం
Comments
Please login to add a commentAdd a comment